
సాక్షి, నల్గొండ: కాంగ్రెస్ కార్యకర్తలను కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బెదిరించడంపై మనుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్‌రెడ్డి సహనాన్ని కోల్పోయి మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజగోపాల్ రెడ్డి తన పద్ధతిని మార్చుకోవాలని, లేకుంటే తీవ్ర ఇబ్బందులు పడకతప్పదని హెచ్చరించారు.
మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థి కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డా అని ప్రజలు అయోమయానికి గురవుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని విమర్షిస్తున్న వారికి ఆయన పేరు ఉచ్చరించే అర్హత లేదని మండిపడ్డారు. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. తాను స్వలాభం కోసం అమ్ముడుపోయే వ్యక్తి కాదని, ప్రజలను ప్రలోభాలకు గురిచేయకుండా ఎన్నికలకు పోదామని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వద్ద ప్రమాణం చేద్దామా అని టీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ విసిరారు.
చదవండి: Telangana: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారు
Comments
Please login to add a commentAdd a comment