Munugodu constituency
-
నేడు మునుగోడుకు కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నల్లగొండ జిల్లా మునుగోడులో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమీపంలోని 10 ఎకరాల వ్యవసాయ భూమిలో ప్రజా ఆశీర్వాద సభ పేరుతో బహిరంగ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల తరువాత సభ ప్రారంభం కానుంది. సభకు నియోజకవర్గంలోని 176 గ్రామాల్లో ఒక్కో గ్రామం నుంచి 500 మందిని తరలించేలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాహనాలను సిద్ధం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా 2022 అక్టోబర్ 30న చండూరు మండలం బంగారిగడ్డలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా మునుగోడును కడుపులో పెట్టి చూసుకుంటానని ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని, డిమాండ్లను నెరవేర్చుతానని హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. ఇచ్చిన హామీల్లో రోడ్లు, చండూరు రెవెన్యూ డివిజన్, 100 పడకల ఆసుపత్రి వంటి డిమాండ్లు నెరవేరాయి. చౌటుప్పల్ ఆసుపత్రి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లోన్లూ దాదాపు రూ.500 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. అయితే కృష్ణా జలాల విషయంలో న్యాయ వివాదాల కారణంగా సాగునీటి సమస్య అలాగే ఉంది. రిజర్వాయర్ల పనులు పెండింగ్‌లో పడ్డాయి. ఈ నేపథ్యంలో మునుగోడు నుంచి మళ్లీ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పోటీ చేయనున్నారు. మునుగోడులో 30 పడకల ఆసుపత్రి, ఇంటర్, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. దీంతో గురువారం నాటి సభలో సీఎం కేసీఆర్ ఏం హామీలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. -
లెఫ్ట్‌తో పొత్తు ఇంకా ఖరారు కాలేదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు వామపక్షాలకు మధ్య ఎన్నికల పొత్తు కుదిరిందన్న వార్తల్లో వాస్తవం లేదని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సీపీఐ, సీపీఎం పార్టీలకు చెరో రెండు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు సోమవారం విస్తృత ప్రచారం జరిగింది. ఢిల్లీ స్థాయిలో ఈ పొత్తు కుదిరిందని, సీపీఎంకు మిర్యాలగూడ, భద్రాచలం, సీపీఐకి మునుగోడు, కొత్తగూడెం నియోజకవర్గాలను కేటాయించారని ప్రచారం జరిగింది. అయితే ఈ అంశాన్ని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క సున్నితంగా తోసిపుచ్చారు. వామపక్షాలతో పొత్తు చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, వామపక్షాలకు నాలుగు స్థానాలు కేటాయించినట్లు జరిగిన ప్రచారం కేవలం ఊహాగానమేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం త్వర లోనే అధికారికంగా ప్రకటిస్తుందని, అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలపై పార్టీ శ్రేణులు ఆందోళనకు గురికావద్దని సోమవారం ఆయన వెల్లడించారు. కాగా, వామపక్షాలు అడుగుతున్న నియోజకవర్గా లకు సంబంధించిన సమాచారాన్ని టీపీ సీసీ, అధిష్టానికి పంపించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈనెల ఒకటో తేదీన సమావేశమై ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లడానికి కార్యాచరణ సిద్ధం చేస్తా మని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పినా.. అలాంటి సమావేశం ఏదీ జరగకపోగా, చెరో రెండు స్థానాలు ఖరారైనా ఏయే నియోజకవర్గాలన్న అంశంపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నట్లు కామ్రేడ్లు చెబుతున్నారు. అప్పుడు బీఆర్ఎస్తో ఇప్పుడు కాంగ్రెస్‌తో.. ‘ఇండియా’కూటమిలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు కీలకంగా ఉన్నాయి. తెలంగాణలోనూ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కమ్యూనిస్టులు ముందుకు సాగుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బీజేపీకి బ్రేక్ వేసేందుకు ఆనాటి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో వామపక్షాలు చేతులు కలిపాయి. ఆ ఎన్నికలో బీజేపీ గెలవకుండా అడ్డుకోవడంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్తో కలసి సాగాలని లెఫ్ట్ పార్టిలు భావించాయి. కానీ వివిధ రాజకీయ కారణాలతో అది సాధ్యం కాలేదు. దీంతో రాష్ట్రంలో బీజేపీని, బీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్‌తో కలవాలని కమ్యూనిస్టులు నిర్ణయించుకున్నారు. ఈ మూడు పార్టీలు కలిస్తే పలు నియోజకవర్గాల్లో కమ్యూనిస్టుల ఓట్లు కాంగ్రెస్‌కు కలసి వస్తాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గతంలోనే జాతీయ నేతల భేటీ.. తెలంగాణలో పొత్తుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలు గతంలోనే భేటీ అయినట్లు తెలంగాణ లెఫ్ట్ నేతలు వెల్లడించారు. మూడు జాతీయ పార్టిల అధినేతలు తెలంగాణలో పొత్తుకు పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపారని చెపుతున్నారు. పొత్తుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా పార్టిల రాష్ట్ర నేతలకు అగ్ర నాయకత్వాలు సూచించాయని సమాచారం. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలసి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, కమ్యూనిస్టులు కోరుతున్న స్థానాల్లోని కాంగ్రెస్ ఆశావహుల నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందోనన్న ఆందోళన హస్తం నేతల్లో నెలకొని ఉంది. -
మునుగోడు ఉపఎన్నిక కోసం 298 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు
-
ఆ తర్వాత మునుగోడులో స్థానికేతరులు ఉంటే కఠిన చర్యలు: ఈసీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటల వరకేనని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. ఆరు గంటల తర్వాత స్థానికేతరులు ఎవరూ నియోజకవర్గంలో ఉండకూదని ఆదేశించారు. నవంబర్ 3న ఉప ఎన్నిక ఓటింగ్ నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించారు సీఈఓ. నాన్ లోకల్ వాళ్ళు మునుగోడులో ఎవరు ఉన్నా చట్ట పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మునుగోడులో అణువణువు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని గుర్తు చేశారు. ‘మంగళవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించాము. ఎవరైనా ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్‌కు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. రేపు సాయంత్రం 6గంటల వరకు మునుగోడులో ప్రచారం ముగుస్తుంది. ఓటర్లకు ఇప్పటికే కొత్త డిజైన్‌తో కూడిన ఓటర్ ఐడి ఇచ్చాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశాము. ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ఇప్పటి వరకు 111 బెల్ట్ షాపులను సీజ్ చేశాము. 185 కేసులు నమోదు కాగా.. 6.80కోట్ల నగదు 4500లీటర్ల లిక్కర్ పట్టుకున్నాము. కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి వివరణ కాసేపటి క్రితమే అందింది. దీనిపై ఈసీకి నివేదిక పంపాము. రిటర్నింగ్ అధికారిపై సీఈఓ కార్యాలయం నుండి ఎలాంటి ఒత్తిడి లేదు. ’ అని వెల్లడించారు సీఈఓ వికాస్ రాజ్. మునుగోడు ఉప ఎన్నికల ఓటింగ్ కీలక అంశాలు ► నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► నవంబర్ 3న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ► 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ► 3366 పోలింగ్ సిబ్బందిని, 15 బలగాల సిబ్బంది మునుగోడులో మోహరిస్తున్నారు. ► ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ► 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ► వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: దేవుడే పంపాడేమో! మంటల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన వ్యక్తి -
‘హుజురాబాద్, దుబ్బాక మాదిరిగా మునుగోడులోనూ డ్రామాలు షురూ’
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఈ రోజు నుంచి డ్రామాలు మొదలయ్యాయని బీజేపీపై విమర్శలు గుప్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాజగోపాల్ రెడ్డికి జ్వరం అని వార్తల్లో చూశానని, హుజురాబాద్, దుబ్బాకలో అభ్యర్థులకు జరిగినట్లే ఇక్కడా జరుగుతోందని ఎద్దేవా చేశారు. తాము ముందు నుంచే ఇలా జరుగుతుందని ఊహించామని, మునుగోడు ప్రజలు దీనిని గమనించాలని సూచించారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి తలసాని. ‘మునుగోడులో జరుగుతున్న ఎన్నికల్లో ఇవాళ్టి నుంచి డ్రామాలు స్టార్ట్ అయ్యాయి. రాజగోపాల్ రెడ్డికి జ్వరం అని వార్తల్లో చూశాను. హుజురాబాద్, దుబ్బాక లో అభ్యర్థులకు జరిగినట్టే జరుగుతుంది. ఇవాళ జ్వరం వచ్చింది, రేపు గుండె నొప్పి రావొచ్చు. ఇలాగే కుటుంబం రోడ్డు మీదికి వచ్చి నిరసనలు చేసి సింపతి క్రెయేట్ చేసే ఏడుపులు మొదలవుతాయి. మేము ముందు నుంచి ఇదే చూస్తున్నాం. మేము ఊహించిందే జరిగింది. మునుగోడు ప్రజలు గమనించాలి. మునుగోడు అభివృద్ధి ఏ మేరకు చేసామో గమనించండి. మనకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఈ డ్రామాలను మునుగోడు ప్రజలు నమ్మకండి. జ్వరం ఒక్కటే కాదు, రేపు తన పైన దాడి చేయించుకొని చేతులు కాళ్ళు విరగొట్టుకుంటాడు. మేము స్పష్టమైన మెజారిటీతో గెలుస్తున్నాం’ అని తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇదీ చదవండి: Munugode Bypoll 2022: ఎల్బీ నగర్లో ఏం జరుగుతోంది?.. మునుగోడు ఎన్నికకు సంబంధమేంటీ? -
మునుగోడులో పోస్టర్ వార్
చౌటుప్పల్ మండలంలో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటుకు 2016లోనే హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదంటూ.. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫ్లెక్సీ పెట్టి, దాని ముందు సమాధిలా ఏర్పాటు చేశారు. అంతకుముందు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రూ.18 వేల కోట్లకు అమ్ముడు పోయారంటూ పోస్టర్లు వేశారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు, బ్యానర్ల వార్ ఉధృతమైంది. మొన్నటివరకు ప్రజా సమస్యలను పరిష్కరించాలని, రోడ్డు వేస్తేనే మా ఊళ్లో ఓట్లు అడగాలని గ్రామాల్లో ప్రజలు ఫ్లెక్సీలు పెట్టారు. ఇప్పుడు రాజకీయ పార్టీల కార్యకర్తలు, నేతలు పరస్పర విమర్శలు, ఆరోపణలతో పోస్టర్లు వేసుకుంటున్నారు. మొన్నటివరకు బీజేపీ నేతలు, ఆ పార్టీ అభ్యర్థిని ఉద్దేశిస్తూ పోస్టర్లు వెలియగా.. తాజాగా టీఆర్ఎస్ నేతలను ఉద్దేశిస్తూ పోస్టర్లు పడ్డాయి. ఆగస్టు నుంచే పోస్టర్ల గోల షురూ.. మునుగోడు నియోజకవర్గంలో ఆగస్టు నెల నుంచే పోస్టర్ల గోల మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే కొన్ని గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని బ్యానర్లు పెట్టగా.. మరికొన్ని గ్రామాల్లో మాకు డబ్బులు వద్దు రోడ్డే కావాలి అంటూ ఫ్లెక్సీలు కట్టారు. మరోచోట రోడ్డు వేస్తేనే మా గ్రామంలోకి రావాలంటూ ఊరి బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తర్వాత రాజగోపాల్‌రెడ్డిని విమర్శిస్తూ పోస్టర్లు వెలిశాయి. ‘మునుగోడు ప్రజలారా మేం మోసపోయాం.. మీరూ మోసపోకండి.. ఇట్లు దుబ్బాక, హుజూరాబాద్ ప్రజలు’అంటూ సెప్టెంబర్ 15న పోస్టర్లు కనిపించాయి. తర్వాత ‘రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు పే’అంటూ రాజగోపాల్‌రెడ్డిపై పోస్టర్లు వేశారు. ఆ తర్వాత ఫ్లెక్సీలు, బొమ్మలతో సమాధులు, కాష్టాల వంటివీ జరిగాయి. తాజాగా శనివారం నాంపల్లి మండల కేంద్రం శివారులో కల్వకుంట్ల కుటుంబం పేరుతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత బొమ్మలతో ఫ్లెక్సీ పెట్టి.. కాష్టాన్ని పేర్చి తగలబెట్టారు. ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇది.. మద్యం మత్తులో రెచ్చిపోయిన మునుగోడు యూత్.. వీడియో వైరల్ -
మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ విస్తృత ప్రచారం
-
బీజేపీ వాగ్దానం అంటేనే జుమ్లా మాటలు: మంత్రి హరీష్
సాక్షి, హైదరాబాద్: ‘ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో ఇస్తున్న పెన్షన్ రూ.750. బీజేపీ పాలిత కర్ణాటకలో రూ.650, మహారాష్ట్రలో రూ.1,000 ఇస్తున్నారు. ఇదే బీజేపీ నాయకులు మునుగోడులో గెలిస్తే రూ.3 వేల పెన్షన్ ఇస్తామని జుమ్లా హామీలు ఇస్తున్నారు. ఇంతకంటే మోసం, దగా మరొకటి ఉంటుందా..?’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పినప్పటి నుంచి ఇప్పటివరకు బీజేపీ వన్నీ జుమ్లా మాటలేనని ధ్వజమెత్తారు. ఆదివారం తెలంగాణ భవన్లో పార్టీ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జీవన్‌రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వండి దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో రూ.3 వేల పింఛన్ ఇస్తామన్నారని, అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండికి బండి, గుండుకు గుండు అని ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని హరీశ్‌రావు నిలదీశారు. (ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల ఎన్నికల్లో బీజేపీ నేతలు ఇచ్చిన హామీలు, తర్వాత వాటిని ఉల్లంఘిస్తూ చెప్పిన మాటల వీడియోలను ప్రదర్శించారు) చిత్తశుద్ధి ఉంటే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ.3 వేల పెన్షన్లు ఇవ్వాలని సూచించారు. దేశవ్యాప్తంగా రూ.3 వేలు పెన్షన్ ఇస్తామని ప్రధాని మోదీతో అధికారికంగా చెప్పించాలన్నారు. లేని పక్షంలో జుమ్లా హామీలు ఇచ్చినందుకు బహిరంగంగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకిచ్చిన హామీలు ఏడాదైనా నెరవేర్చలేదు నల్లచట్టాలు తెచ్చి 750 మంది రైతులను పొట్టనపెట్టుకన్న మోదీ.. చివరికి రైతులకు క్షమాపణలు చెప్పి, ఏడాదైనా వారికిచ్చిన హామీలను నెరవేర్చలేదని మంత్రి విమర్శించారు. తెలంగాణ ఏర్పాటునే తప్పుపట్టిన మోదీ ఇప్పటికీ తన ధోరణి మార్చుకోలేదన్నారు. కృష్ణా నీటి వాటా తేల్చకపోవడం వంటి ఎన్నో అంశాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీకి మునుగోడులో ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఆత్మగౌరవం కోసం రాజీనామా చేయలేదని, ఆస్తులు పెంచుకోవడానికి చేశారని చెప్పారు. రూ. 2,016 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రూ.200గా ఉన్న పెన్షన్‌ను తెలంగాణ రాష్ట్రంలో రూ.1,000కి పెంచామని, 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రస్తుతం రూ.2,016 ఇస్తున్నట్లు హరీశ్ తెలిపారు. డయాలసిస్ రోగులకు, బీడీ, గీత, నేత కార్మికులకు పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దేశంలో దివ్యాంగులకు రూ. 3,016 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణాయే అని పేర్కొన్నారు. ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం మిషన్ భగీరథ పథకం ద్వారా సీఎం కేసీఆర్ మునుగోడుతో పాటు ఉమ్మడి నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని మంత్రి చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పిందని, అయితే కేంద్రం ఇప్పటివరకు 24 పైసలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. మునుగోడు ప్రజలపై సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రేమ మోదీకి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. 10 రెట్లు అధికంగా ధాన్యం దిగుబడి యాదాద్రిలో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారని, నల్లగొండ జిల్లా రైతాంగానికి సాగునీరు పారించి, గతంలో కన్నా 10 రెట్ల అధిక ధాన్యం దిగుబడికి సీఎం కారణమయ్యారని హరీశ్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల భూమికి భారమయ్యేలా పంటలు పండుతున్నాయని గుర్తు చేశారు. ఎస్సారెస్పీ నుంచి తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట జిల్లాల చిట్టచివరి భూముల వరకు సాగునీళ్లు ఇస్తున్నామని చెప్పారు. ఇదీ చదవండి: మును'గోడదూకుడు'.. కొద్దిరోజుల్లోనే మూడు పార్టీలు మారి... -
బోగస్ ఓటర్లను చేర్చేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం: తరుణ్ చుగ్
న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో అధికార, విపక్ష పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలో కొత్తగా నమోదైన ఓట్లపై అనుమానాలు వ్యక్తం చేసింది బీజేపీ. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా.. ఇప్పుడు కొత్త ఓట్లను పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్. కొత్తగా చేరిన ఓటర్లను పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్పారు. ‘మునుగోడులో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. కొత్తగా చేరిన ఓటర్లను పరిశీలించాలని ఈసీని కోరాం. స్వల్ప వ్యవధిలో 25వేల కొత్త ఓట్లు ఎలా వచ్చాయి? బోగస్ ఓటర్లను చేర్పించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.’ అని ప్రభుత్వం, టీఆర్ఎస్పై ఆరోపణలు గుప్పించారు తరుణ్ చుగ్. ఇదీ చదవండి: రెండు నెలల్లో ఇన్ని దరఖాస్తులా? మునుగోడు ఓటర్ల జాబితాను సమర్పించాలని ఈసీకి హైకోర్టు ఆదేశం -
మునుగోడు లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం
-
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఈసీకి పిర్యాదు
-
కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాడు : మంత్రి జగదీష్ రెడ్డి
-
మునుగోడులో బీజేపీ విజయం ఖాయం : బండి సంజయ్
-
పొలిటికల్ కారిడార్ : ఉపఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ ప్లాన్
-
మునుగోడు వార్...
-
పల్లెల్లో భేటీలతో ఏకతాటిపైకి.. ‘మునుగోడు’పై ప్రత్యేక వ్యూహం!
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. గ్రామాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలా లను అంచనా వేస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితు ల్లోనూ విజయం సాధించేలా ఒక వైపు పార్టీ యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపేందుకు కసరత్తు చేస్తూనే, మరోవైపు ఇతర పార్టీల నుంచి చేరికలను ముమ్మరం చేసింది. ఇప్పటికే నియోజకవర్గంలోని మండలాల వారీగా ఇన్చార్జీలను నియమించిన అధికార పార్టీ, త్వరలో రెండు గ్రామాలకు ఒకరు చొప్పున ముఖ్య నేతలకు బాధ్యతలు అప్ప గించనుంది. ఉప ఎన్నిక షెడ్యూలు వెలువ డిన తర్వాత చండూరు కేంద్రంగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. రాజగోపాల్ రాజీనామా వార్తలతోనే అప్రమత్తం వాస్తవానికి మునుగోడు అసెంబ్లీ స్థానానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తా రనే సంకేతాలు వెలువడిన సమయంలోనే అధికార పార్టీ అప్రమత్తమై చేరికలపై దృష్టి పెట్టింది. రాజ్‌గోపాల్ రాజీనామా మొదలు కుని ఇప్పటివరకు, కాంగ్రెస్ సహా వివిధ పా ర్టీల నుంచి 30మందికి పైగా ఎంపీటీసీ స భ్యులు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు టీఆర్ ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థిగా స్రవంతి పేరు ఖరారు కావడంతో ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు పార్టీలో చేరే అవకా శముందని టీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. ఇప్పటికే రంగంలో మండల ఇన్చార్జీలు ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి ఇద్దరేసి చొప్పున ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు ఇన్‌చార్జీలుగా బాధ్య తలు అప్పగించారు. ఎమ్మెల్సీ, ఉమ్మడి నల్ల గొండ జిల్లా టీఆర్ఎస్ ఇన్చార్జి తక్కళ్లపల్లి రవీందర్రావు పార్టీ యంత్రాంగాన్ని సమ న్వయం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తు న్నారు. ఇన్చార్జీలు గ్రామాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల బలాబలాలు, సామాజికవర్గాల వారీ గా ఓటర్ల వివరాలు, గ్రామ రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తులు తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తున్నారు. క్షేత్ర స్థాయి నుంచి అందుతున్న నివేదికల ఆధారంగా పార్టీ నేతల నడుమ విభేదాలు సరిదిద్దడం, ఇతర పార్టీల నుంచి చేరికలకు ప్రయత్నించడం వంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. త్వరలో 90 యూనిట్లు.. ముఖ్య నేతలందరికీ బాధ్యతలు తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలు ముగిసిన తర్వాత మునుగోడును 90 యూని ట్లుగా విభజించి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కీలక నేతలను ఇన్‌చార్జీలుగా రంగంలోకి దించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్ప టికే ఏ యూనిట్‌కు ఎవరు ఇన్చార్జిగా వ్యవ హరిస్తారో పేర్కొంటూ జాబితాను రూపొందించారు. 70 మంది ఎమ్మెల్యేలు, మరో 20 మంది ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు యూనిట్ ఇన్‌చార్జీలుగా వ్యవహ రిస్తారు. ఇలావుండగా గత నెల 20న మును గోడు నియోజకవర్గ కేంద్రంలో కేసీఆర్ బహి రంగ సభ నిర్వహించిన టీఆర్ఎస్.. ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడిన తర్వాత చండూ రులో సభ నిర్వహించాలని నిర్ణయించింది. అభ్యర్థిగా కూసుకుంట్ల ఖాయం? బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు కాగా, టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని పలువురు నేతలు వ్యతిరేకిస్తుండటంతో.. అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించడంలో ఆలస్యం జరుగుతోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వంటి నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయగా, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో పాటు స్థానికంగా మరికొందరు నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే కూసుకుంట్ల అభ్యర్థిత్వం ఖాయమైనట్టేనని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదీ చదవండి: ‘గులాబీ’ బాస్‌కు తలనొప్పిగా మారిన ‘డాక్టర్’! -
అటు బుజ్జగింపులు.. ఇటు బాధ్యతలు!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్.. అదే దూకుడుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో.. టికెట్ ఆశించిన ముగ్గురు నాయకులను బుజ్జగించే పనిలో పడింది. వారికి ప్రచార బాధ్యతలనూ అప్పగించింది. మునుగోడు టికెట్ ఆశించిన చల్లమల్ల కృష్ణారెడ్డి, స్రవంతిలతో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి శనివారం తన నివాసంలో భేటీ అయి చర్చించారు. మరో ఇద్దరు నేతలు పల్లె రవికుమార్, పున్నా కైలాశ్ నేతలతో ఫోన్లో మాట్లాడారు. పార్టీ అభ్యర్థి స్రవంతి గెలుపు కోసం అంతా పనిచేయాలని.. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఇస్తామని బుజ్జగించారు. రేవంత్ విజ్ఞప్తి పట్ల ముగ్గురు నేతలు సానుకూలంగా స్పందించారని, స్రవంతి అభ్యర్థిత్వానికి మద్దతిస్తూ, కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. గాంధీ భవన్‌లోనూ కీలక భేటీ శుక్రవారం స్రవంతి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ.. శనివారం సాయంత్రం గాంధీభవన్‌లో కీలక భేటీ నిర్వహించింది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పాటు ముఖ్య నేతలు బోసురాజు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, చెరుకు సుధాకర్, అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, మహేశ్‌కుమార్‌గౌడ్, దామోదర రాజనర్సింహ, సంపత్ కుమార్, బలరాం నాయక్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ఎన్నిక ప్రచార కార్యాచరణపై చర్చించిన టీపీసీసీ నేతలు.. మండలాల వారీగా ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఇప్పటికే మండలానికి ఇద్దరు రాష్ట్ర నేతలను ఇన్చార్జులుగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. మండలానికో ముఖ్య ఇన్చార్జిని నియమించింది. ఇప్పటికే ఉన్న నేతలు వీరికి సహాయకులుగా ఉంటారని పేర్కొంది. ఈ ఇన్చార్జుల జాబితాలో రేవంత్‌తోపాటు ఉత్తమ్, భట్టి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, వి.హనుమంతరావు, దామోదర రాజనర్సింహ, షబ్బీర్‌అలీ ఉన్నారు. ఇక నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ప్రచార బాధ్యతలను టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులకు అప్పగించారు. నియోజకవర్గంలోని 300 పోలింగ్ బూత్‌లకు గాను 150 మందిని (ప్రతి రెండు బూత్‌లకు ఒకరిని), ప్రతి పది బూత్‌లకు ఒకరిని ఇన్చార్జులుగా నియమించాలని నిర్ణయించారు. ఈ నెల 18 నుంచి పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాలని.. మునుగోడులో క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చారు. ఇదీ చదవండి: అచేతనావస్థలో ఆ రెండు పార్టీలు -
మునుగోడు ఉప ఎన్నిక జనవరిలో అయితే బెటర్!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ఇప్పటికిప్పుడు కాకుండా జనవరిలో జరిగితే పార్టీకి మరింత ప్రయోజనమని బీజేపీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ముఖ్య నేతలు ఈ అభిప్రాయంతో ఉన్నట్టు పార్టీవర్గాల సమాచారం. హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు ముగిసిన తర్వాత మునుగోడు ఉప ఎన్నిక నిర్వహిస్తే ఫలితం ఉంటుందని, అక్కడి గెలుపు ఇక్కడ విజయావకాశాలను మెరుగుపరుస్తుందని వీరు భావిస్తున్నట్లు పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. అదే సమయంలో జాతీయ నాయకత్వంలోని కొందరు నేతలు ఈ ఎన్నిక ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తేనే మంచిదనే ఆలోచనతో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, పార్టీపరంగా చక్కదిద్దాల్సిన అంశాలు, ఈ ఎన్నిక ఆలస్యంగా జరగడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి అధినాయకత్వానికి తెలియజేస్తే మంచిదనే ఆలోచనలో రాష్ట్ర నేతలు ఉన్నారు. ఉప ఎన్నిక నిర్వహణకు వచ్చే ఫిబ్రవరి వరకు సమయముండటాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరాలని భావిస్తున్నారు. పరిస్థితులన్నీ చక్కదిద్దుకునేలా.. మునుగోడు ఉప ఎన్నిక పురస్కరించుకుని పార్టీపరంగా బీజేపీకున్న సమన్వయ లోపాలు, లోటుపాట్లు, ఇతర సమస్యలను అధిగమించేందుకు ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అవసరమైన కార్యాచరణను వెంటనే చేపట్టాలనే ఆలోచనతో ఉన్నారు. అదే సమయంలో పార్టీకి అనుకూల వాతావరణం తీసుకొచ్చేందుకు, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి వివిధ వర్గాల మద్దతు కూడగట్టి కచ్చితంగా గెలిచేలా చేసేందుకు కూడా మరికొంత సమయం అవసరమని అంచనా వేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా మారనున్న ఈ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు అత్యంత ఆవశ్యకం కావడంతో అన్ని విధాలుగా సిద్ధమైన తర్వాతే ఎన్నిక జరిగితే బావుంటుందనేది నేతల ఆలోచనగా ఉంది. ఇదీ చదవండి: కేడర్‌ను కదిలించేలా ‘భారత్ జోడో యాత్ర’.. టీపీసీసీ ముమ్మర కసరత్తు -
కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న పాల్వాయి స్రవంతి ఆడియో
సాక్షి, నల్గొండ/హైదరాబాద్: మునుగోడు కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్ మొదలైంది. రేవంత్‌రెడ్డి వైఖరిపై సీనియర్ నేతలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. బుధవారం.. ఏఐసీసీ సెక్రటరీ బోస్‌రాజు ఆధ్వర్యంలో మనుగోడు అభ్యర్థి ఎంపికపై గాంధీ భవన్లో సమావేశం జరగనుంది. సమావేశానికి ముందే సీనియర్ నేత పాల్వాయి స్రవంతి కార్యకర్తలతో మాట్లాడిన ఆడియో లీక్ గాంధీభవన్‌లో చర్చాంశనీయంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఈ ఆడియో కలకలం రేపుతోంది. చదవండి: మునుగోడులో టీఆర్ఎస్ దిద్దుబాటు చల్లమల్ల కృష్ణారెడ్డికి టికెట్ ప్రతిపాదనను పాల్వాయి స్రవంతి వ్యతిరేకిస్తున్నారు. ‘‘చండూరు సభ నా వల్లే సక్సెస్ అయ్యింది. కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే హుజురాబాద్ సీన్ రిపీట్ ఖాయం. ముక్కు, మొహం తెలియని కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే ఊరుకోను’’ అని స్రవంతి తేల్చి చెప్పారు. రేవంత్ పరువు నిలబెట్టుకోవాలంటే గెలిచేవారికే టికెట్ ఇవ్వాలంటూ స్రవంతి ఆడియో వైరల్‌గా మారింది. -
రాజాగోపాల్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఘటనలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బుధవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, కార్యకర్తల అరెస్ట్‌ను ఖండించారు. అరెస్ట్ చేసిన రాజగోపాల్‌రెడ్డి, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రొటోకాల్ పాటించకుండ అవమానిస్తున్నారు అని అసహనం వ్యక్తం చేశారు. హిట్లర్ కంటే దారుణంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండి పడ్డారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ‘దళిత బంధు’ పథకాన్ని మునుగోడు నియోజకవర్గ దళితులకు కూడా వర్తింపచేయాలని కోరుతూ.. రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి బుధవారం మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్ట్
సాక్షి, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేసీఆర్ ప్రకటించిన ‘దళిత బంధు’ పథకాన్ని మునుగోడు నియోజకవర్గ దళితులకు కూడా వర్తింప చేయాలని కోరుతూ.. రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి బుధవారం మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యలపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల అరెస్ట్‌ను ఖండించారు. అధికారం అడ్డుపెట్టుకుని అక్రమ నిర్బంధాలు సరికాదని సూచించారు. దళిత బంధు పథకాన్ని తెలంగాణ మొత్తం అమలు చేయాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి ప్రసంగం అడ్డుకుని రభస చేశారని ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మార్వో గిరిధర్ ఫిర్యాదుతో రాజగోపాల్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
ఆదరిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా: డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి
సాక్షి, సంస్థాన్ నారాయణపురం (మునుగోడు) : మునుగోడు నియోజకవర్గం రాష్ట్ర రాజధానికి దగ్గరలో ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ పనిచేసిన కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహించారు. ఎంత సేపటికీ తమ స్వలాభం చూసుకున్నారు.. కానీ ప్రజల కష్టాలనుు పట్టించుకోలేదు. ప్రజలు తమ సమస్యలు పరిష్కరించే బీజేపీని కోరుకుంటున్నారు. నిత్యం గ్రామాల్లో తిరిగే నాకు సమస్యలు తెలుసు. ఎ గ్రామాల్లో ఏ సమస్య ఎప్పటి నుంచో ఉందో నాకు తెలుసు. ఎన్నో ఏళ్లుగా నియోజకవర్గంను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్‌ను ఇప్పటికీ పరిష్కరించలేదు. నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులకు కల్పించి మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఎంటో చేసి చూపిస్తా అంటున్నారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి . సాక్షి : మీ విజయానికి కలిసోచ్చేఅంశాలు ఎమిటీ.? గంగిడి మనోహర్‌రెడి : నియోజవర్గంలోని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడిని. ప్రతి రోజు తండాలు, గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలు తెలుకుంటా. ఆపద, సాపద వచ్చిన అందుబాటులో ఉంటూ ఆదుకొంటున్నా. పార్టీలకు అతీతంగా, వివాదరహితుడుగా మంచి పేరు ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ పథకాలతో సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన ఏమి చెయ్యని అసమర్థడు, టీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యేగా పనిచేసే సమయంలో అనేక అవనీతి ఆరోపణలు ఉన్నాయి. వీరు చెప్పకోవాడనికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలే దు. నా విజయానికి అన్ని అంశాలు కలిసివచ్చేవే. సాక్షి : నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు గుర్తించారు.? నియోజకవర్గంలో అనేక సమస్యలు రాజ్యామేలుతున్నాయి. ఇక్కడి ప్రజల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడానికి ఎలాంటి చర్యలు లేవు. ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. శ్వాశత పరిష్కారానికి సాగు, తాగు జలాలు సదుపాయాలు కల్పించాడానికి వేగవంత చేస్తాం. నాణ్య మైన విద్యా అందడం లే దు. వైద్య సౌకర్యాలు లేవు. గ్రామాల్లో మౌలిక వసతులు లేవు. నక్కల గండి ప్రాజెక్టు ముందుకు వెళ్లడం లేదు. ఇక్కడి ప్రజలు ఉద్యోగాలు, ఉపాధి లేక వలసపోతున్నారు. స్థానికుల పరిశ్రమలో ఉద్యోగాలు లభించడం లేదు. గట్టుప్పుల్ మండలం ఇస్తామని ఇవ్వలేదు.ఇలా ఎన్నో సమస్యలు నియోజకవర్గంలో తిష్ట వేశాయి. సాక్షి: విజయం సాధిస్తే ఏం చేస్తారు..? మనోహర్‌రెడ్డి : మనుగోడు నియోజకవర్గంలో ఇప్పటికి చూడని అభివృద్ధి అంటే ఎమిటో చేసి చూపిస్తాను. నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి మంచి మేనిఫెస్టో తయారు చేశా. అది అమలు చేస్తాను. నక్కలగండి ప్రాజెక్టును పూర్తి చేసి నియెజకవర్గంలో సాగు, తాగు జలాలు అందించి సస్యశ్యామలం చేస్తా. చౌటుప్పల్‌లో ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తా, నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తా. బస్ డిపోను ఏర్పాటు చేస్తా. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధివకాశాలను కల్పిస్తా. ప్రజల్లో జీవన ప్రమాణాలు పెంచే విధంగా చర్యలు చేపడుతా. డీగ్రి, జూని యర్ కళాశాలను ఏర్పాటు చేస్తాను. నాణ్యమైన విద్యను అందించాడానికి కృషి చేస్తా. గట్టుప్పుల్ మండలంగా ఏర్పాటు చేస్తాం. మైసమ్మ కత్వాను ఏర్పాటు చేసి చెరువులను నింపుతాము. రైతుల ప్రయోజనం కోసం కృషిచేస్తాను. అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాను. సాక్షి : ప్రజలకు మీరు ఇచ్చే సందేశం..? మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే బీజేపీని గెలిపించాలి. కాంగ్రెస్, టీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈ దుస్థితికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి, మంత్రులుగా, ఎంపీగా ఉన్నారు కాని అభివృద్ధి చేయడనికి వీరి నిర్లక్ష్యం కారణం. సభల్లో ప్రాతినిథ్యం ఉన్న ఇరు పార్టీలు ఎన్నడూ మునుగోడు సమస్యలపై ప్రశ్నంచలేదు. నిమోజకవర్గం సమస్యల ను తెలిసిన నాయకుని, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నన్ను గెలింపించమని కోరుతున్నా. -
స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తా
సాక్షి,మునుగోడు : త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలువనున్నట్లు టీఆర్ఎస్ బహిష్కృత నేత వేనేపల్లి వెంకటేశ్వర్ రావు అన్నారు. సోమవారం మునుగోడులో మునుగోడు, నారాయణపురం మండలాల టీఆర్ఎస్ పార్టీ అసమ్మతి నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం చౌటుప్పల్, నాంపల్లి మండలాల కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తే ప్రతి ఒక్కరు ఎన్నికల బరిలో నిలవాలని కోరుతున్నారన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై వ్యతిరేకత కలిసి వస్తుందని, ఆయనకు ఓట్లు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. అదేవిధంగా మహాకూటమి అభ్యర్థి నేటికీ తేలకపోవడంతో కాస్త శ్రమించి ప్రజల్లోకి వెళ్లి తాను చేయబోయే అభివృద్ధి వివరించి గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. అందరి కోరిక మేరకు ఈ నెల 14 న నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తన గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మాజీ ఎమ్మెల్యే కొందరిపై చేస్తున్న కక్షపూరిత చర్యలను అడ్డుకునేందుకే తాను బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్‌లు వీరమళ్ల నర్సింహగౌడ్, పందుల నర్సింహ, ముప్ప రవీందర్‌రెడ్డి, జీడిమెట్ల యశోధ, భిక్షం, ఎంపీటీసీ జీడిమడ్ల నర్సమ్మ, యాదయ్య, ఎండీ పాష, కొత్త శంకర్, చలిచీమల యాదగిరి, సైదులు, నాగేందర్, యాదయ్య, వీరేశం, తీగల యాదయ్య, పందుల వెంకటేశ్వర్లు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఓటమి భయంతోనే ఆరోపణలు
సాక్షి,మునుగోడు : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలో నిలిస్తే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతాడనే భయంతో రాజగోపాల్‌రెడ్డిపై అనేక ఆరోపణలు చేస్తున్నారని యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మేకల ప్రమోద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని చీకటిమామిడి గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడుతూ గత మంగళవారం చండూరులో నిర్వహించిన సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి కొన్ని పార్టీల నాయకులు తమ స్వార్థం కోసం యువతను వాడుకొని మద్యానికి బానిసలు చేస్తున్నారని, వారిని కాపాడుకునే బాధ్యత తనపై ఉందన్నారు తప్పా, యువత తాగుబోతులని ఎక్కడా అనలేదన్నారు. కావాలనే టీఆర్ఎస్ నాయకులు అతనిపై బురద చల్లేందుకు తాగుబోతులని అన్నాడని ఆరోపించారు. ఎవ్వరూ ఎన్ని కుట్రలు పన్నినా రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నుంచి బరిలో నిలచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని చిత్తుగా ఓడించడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి జీడిమెట్ల బాబు, గ్రామశాఖ అధ్యక్షుడు పగిళ్ల నగేష్, ఉపాధ్యక్షుడు తాటికొండ లింగస్వామి, కార్యదర్శి పాలకూరి వెంకటేష్, తాటికొండ నర్సింహ, మారగోని శ్రీనివాస్, పల్లె సైదులు, అనంత సురేష్, సాయి, కాటేష్, మునుకుంట్ల సాయి, చెన్నగోని సైదులు తదితరులు పాల్గొన్నారు. -
అధిష్టానం ఆదేశిస్తే మునుగోడు నుంచి పోటీ..
యాదాద్రి భువనగిరి : అధిష్టానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నుంచి పోటీచేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ..నయీమ్ ఎన్కౌంటర్ జరిగి రెండేళ్లు అవుతున్నా ...అతని వల్ల లబ్ధిపొందిన వారిని అరెస్ట్ చేయలేదని విమర్శించారు. 24 గంటల కరెంటు వల్ల భూస్వాములకే లాభమన్నారు. మునుగొడు, భువనగిరి నియోజకవర్గాలలో పీసీసీ పెట్టిన ఇంచార్జిలను తాము గుర్తించటం లేదని అన్నారు. పార్టీ హైకమాండ్... పీసీసీ బాధ్యతలను కోమటిరెడ్డి సోదరులకు అప్పగిస్తే తెలంగాణలో పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు వస్తామని తెలిపారు.