సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల‍్లో ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటల వరకేనని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. ఆరు గంటల తర్వాత స్థానికేతరులు ఎవరూ నియోజకవర్గంలో ఉండకూదని ఆదేశించారు. నవంబర్ 3న ఉప ఎన్నిక ఓటింగ్ నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించారు సీఈఓ. నాన్ లోకల్ వాళ్ళు మునుగోడులో ఎవరు ఉన్నా చట్ట పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మునుగోడులో అణువణువు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని గుర్తు చేశారు.
‘మంగళవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించాము. ఎవరైనా ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్‌కు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. రేపు సాయంత్రం 6గంటల వరకు మునుగోడులో ప్రచారం ముగుస్తుంది. ఓటర్లకు ఇప్పటికే కొత్త డిజైన్‌తో కూడిన ఓటర్ ఐడి ఇచ్చాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశాము. ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ఇప్పటి వరకు 111 బెల్ట్ షాపులను సీజ్ చేశాము. 185 కేసులు నమోదు కాగా.. 6.80కోట్ల నగదు 4500లీటర్ల లిక్కర్ పట్టుకున్నాము. కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి వివరణ కాసేపటి క్రితమే అందింది. దీనిపై ఈసీకి నివేదిక పంపాము. రిటర్నింగ్ అధికారిపై సీఈఓ కార్యాలయం నుండి ఎలాంటి ఒత్తిడి లేదు. ’ అని వెల్లడించారు సీఈఓ వికాస్ రాజ్.
మునుగోడు ఉప ఎన్నికల ఓటింగ్ కీలక అంశాలు
► నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
► నవంబర్ 3న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది.
► అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.
► 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది.
► 3366 పోలింగ్ సిబ్బందిని, 15 బలగాల సిబ్బంది మునుగోడులో మోహరిస్తున్నారు.
► ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి.
► 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నారు.
► వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: దేవుడే పంపాడేమో! మంటల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన వ్యక్తి
Comments
Please login to add a commentAdd a comment