Vikas Raj
-
మరికొన్ని గంటలే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని లోక్‌సభ సీట్లు సాధిస్తుందన్న ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది. మంగళవారం ఉదయమే ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు. గత నెల 13న రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన విషయంతెలిసిందే. కంటోన్మెంట్ సీటు ఓట్లను సైతం మంగళవారం లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. మొత్తంగా 525 మంది అభ్యర్థులు పోటీపడగా.. 2,18,14,025 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 65.67శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కింపు.. లోక్‌సభ ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో.. మొత్తం 139 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో 120 హాళ్లలో ఈవీఎం ఓట్లు, 19 హాళ్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఒక కౌంటింగ్ హాల్ ఉంటుంది. ఒక్కో హాల్లో 24 టేబుల్స్ ఉంటాయి. మహేశ్వరం స్థానం పరిధిలో 28 టేబుల్స్ ఏర్పాటు చేయాల్సి రావడంతో రెండు హాళ్లలో ఓట్లను లెక్కించనున్నారు.దీంతో ఈవీఎం ఓట్ల కౌంటింగ్ హాళ్ల సంఖ్య 120కి పెరిగింది. మొత్తం 10వేల మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొననున్నారు. చొప్పదండి, యాకూత్‌పుర, దేవరకొండ అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన లోక్‌సభ ఓట్లను అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కించనున్నారు. ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన ఓట్లను అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కిస్తారు. చాలా స్థానాల పరిధిలో 18 నుంచి 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. రౌండ్ల వారీగా ఫలితాల ప్రకటన.. ఒక్కో టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, ఒక ఏఆర్ఓ, ఇద్దరు సహాయకులు, అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపును మైక్రో అబ్జర్వర్ పర్యవేక్షిస్తారు. ఏకకాలంలో అన్ని టేబుళ్లలో నిర్వహించే లెక్కింపును ఒక రౌండ్‌గా పరిగణిస్తారు. అలా రౌండ్ల వారీగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి రౌండ్ వివరాలను కేంద్రం నుంచి వచి్చన పరిశీలకుడి పరిశీలనకు పంపిస్తారు. పరిశీలకుల ఆమోదం తర్వాత తదుపరి రౌండ్ లెక్కింపును ప్రారంభిస్తారు. అదే సమయంలో ఒక్కో రౌండ్ లెక్కింపు పూర్తయిన కొద్దీ.. స్థానిక ఆర్వో/ఏఆర్వో మీడియా రూమ్ వద్దకు వచ్చి ఫలితాలను ప్రకటిస్తారు.రౌండ్ల వారీగా ఫలితాలపై ఫారం–17సీ మీద కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ప్రతి శాసనసభ స్థానం పరిధిలో ర్యాండమ్‌గా ఐదు పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి.. ఈవీఎంలలోని ఓట్లను, వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చి చూస్తారు. ఎన్నికల ఫలితాలను ప్రదర్శించడానికి 78 ప్రాంతాల్లో స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎన్నికల సంఘం అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే రానిస్తారు.నేడు మద్యం షాపులు బంద్‌లోక్‌సభ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం రోజున తెలంగాణలో మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఇక ఫలితాలు వచి్చన తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు ముందుగా అనుమతిస్తే ర్యాలీలు చేసుకోవచ్చు.ఉదయం 10.30 కల్లా ఆధిక్యతపై స్పష్టత!మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. 2.18లక్షల పోస్టల్ బ్యాలెట్లు పోలైన నేపథ్యంలో లెక్కింపునకు ఎక్కువే సమయం పట్టే అవకాశం ఉంది. ఇక 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉదయం 10.30 గంటల కల్లా చాలా లోక్‌సభ స్థానాల్లో ఎవరు ఆధిక్యతలో ఉన్నారనేది తేలే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12.30 గంటలకల్లా విజయావకాశాలపై స్పష్టత వచ్చే చాన్స్ ఉంది. పోటీ ఎక్కువగా ఉన్న స్థానాల్లో మాత్రం ఆద్యంతం ఉత్కంఠగా కౌంటింగ్ కొనసాగనుంది. కౌంటింగ్, ఫలితాల సరళిని https://results.eci.gov.in ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. -
ఎల్లుండే ‘లోక్‌సభ’ కౌంటింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 10వేల మంది సిబ్బందిని ఎంపిక చేసినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. 4న జరిగే లోక్‌సభ ఓట్ల లెక్కింపుతోపాటు 2న జరిగే ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు, 5న జరిగే ఉమ్మడి నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్ల ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో 120 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వికాస్‌రాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 10 వేల మంది సిబ్బందిని ఎంపిక చేశామని.. ఇందులో 50 శాతం సిబ్బంది రిజర్వ్‌లో ఉంటారని చెప్పారు. ర్యాండమైజేషన్ పద్దతిలో సిబ్బందిని ఎంపిక చేసి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు వివరించారు. మూడంచెల భద్రత మధ్య ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి ఒక కౌంటింగ్ కేంద్రం ఉంటుందని.. ఒక కేంద్రంలో 24 టేబుల్స్ ఉంటాయని వికాస్‌రాజ్ తెలిపారు. అయితే మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో 28 టేబుల్స్ అవసరమవడంతో.. రెండు హాల్స్ ఏర్పాటు చేశామని వివరించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని.. గుర్తింపు కార్డు ఉంటేనే కేంద్రం లోపలికి అనుమతిస్తామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్లు, కెమెరాలు సహా ఎలాంటి ఎల్రక్టానిక్ పరికరాలను అనుమతించబోమన్నారు. ఇప్పటివరకు 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని.. ఇంకా ఈటీపీబీఎస్ (ఎ ల్రక్టానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం)లు వస్తున్నాయని, కౌంటింగ్ రోజు ఉదయం 8 గంటలలోపు వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఈ లెక్కన పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యపై కౌంటింగ్ రోజే స్పష్టత వస్తుందన్నారు. చొప్పదండి, దేవరకొండ, యాకుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధికి సంబంధించి ఓట్ల లెక్కింపునకు 24 రౌండ్లు పడుతుందని.. ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట సెగ్మెంట్లకు సంబంధించి 13 రౌండ్లలోనే పూర్తవుతుందని వివరించారు. సీఈసీ ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ర్యాండమ్‌గా ఐదు పోలింగ్ కేంద్రాల్లోని వీవీ ప్యాట్ రసీదులను లెక్కిస్తామని తెలిపారు. 2,414 మంది సూక్ష్మ పరిశీలకులులోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం 2,414 మంది సూక్ష్మ పరిశీలకులను (మైక్రో అబ్జర్వర్లను) నియమించినట్టు వికాస్‌రాజ్ తెలిపారు. ఒక్కో టేబుల్‌కు ఒక అబ్జర్వర్ ఉంటారని చెప్పారు. లెక్కింపు కోసం ఒక టేబుల్‌కు ఒక ఏఆర్ఓ, ఇద్దరు సహాయకులు ఉంటారన్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి ముందుగానే సమాచారం ఇవ్వా ల్సి ఉంటుందని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు బారికేడ్లు, పటిష్ట భద్రత మధ్య తరలిస్తామని.. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందని వివరించారు. కౌంటింగ్ రోజు మద్యం దుకాణాలను మూసివేస్తామన్నారు. ఆ రోజున ర్యాలీలకు అనుమతి ఉండదని తెలిపారు. ఒకవేళ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు అనుమతిస్తే ర్యాలీలు చేసుకోవచ్చన్నారు. ఎప్పటికప్పుడు పరిశీలకుల అను మతి తర్వాత ఫలితాలు వెల్లడిస్తారని.. కౌంటింగ్ హాల్లో, మీడియా సెంటర్ వద్ద ప్రకటిస్తామని, వెబ్సైట్లోనూ అప్లోడ్ చేస్తా మని తెలిపారు. ఆదివారం జరిగే ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అక్కడి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరుగుతుందని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ దుప్పలపల్లిలోని తెలంగాణ వేర్‌హౌజ్ కార్పొరేషన్ గోదాం ఆవరణలో జరుగుతుందని వికాస్‌రాజ్ వెల్లడించారు. -
కౌంటింగ్ రోజున మద్యం షాపులు బంద్: సీఈవో వికాస్‌రాజ్
సాక్షి, హైదరాబాద్: కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంటుందని.. ఈసీ రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు.కౌంటింగ్ రోజున మద్యం షాపులు బంద్ అవుతాయన్నారు. తెలంగాణలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఈవో తెలిపారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని సీఈవో వెల్లడించారు.34 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుందని.. 120 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 19 కౌంటింగ్ హాల్స్ సిద్ధం చేశామన్నారు. 12 కేంద్ర బలగాలతో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని సీఈవో పేర్కొన్నారు. -
తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది -వికాస్ రాజ్
-
TS: 64.93% పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన లోక్‌సభ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)లో నిక్షిప్తమైంది. రాత్రి 12 గంటల వరకు వేసిన అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 64.93 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. ఉదయం నుంచే వడివడిగా..: రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. 13 మావోయిస్టు ప్రభావిత అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా అన్నిచోట్లా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. గడువు ముగిసే సమయానికల్లా పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. దీనితో సాయంత్రం 7 గంటల తర్వాత కూడా సుమారు 1,400 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగిందని సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. సాయంత్రం ఏడు గంటల తర్వాత ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, శాంతిభద్రతలకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తలేదని వికాస్‌రాజ్ వివరించారు. 115 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో సమస్యలు వస్తే.. వాటిని మార్చామని తెలిపారు. కచ్చితమైన పోలింగ్ శాతంపై మంగళవారం స్పష్టత వస్తుందన్నారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడలేదన్నారు. వాతావరణం సహకరించడంతో.. రాష్ట్రంలో రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వానలతో వాతావరణం చల్లబడింది. దీనితో రోజంతా పోలింగ్ కొనసాగింది. ఉదయమే వడివడిగా ప్రారంభమై రోజంతా స్థిరంగా కొనసాగింది. ఉదయం 9 గంటల కల్లా 9.4 శాతం, 11 గంటలకు 24.31 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 40.38 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 52.34 శాతం, సాయంత్రం 5 గంటలకల్లా 61.16 శాతానికి, రాత్రి 12 గంటలకల్లా 64.93 శాతానికి పోలింగ్ పెరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 62.69 శాతం పోలింగ్ నమోదైంది, నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 71.97 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి గత లోక్‌సభ ఎన్నికలన్నా ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. వందల కొద్దీ ఫిర్యాదులు పోలింగ్ రోజైన సోమవారం నేషనల్ గ్రీవెన్స్ పోర్టల్‌కు 415, టోల్ ఫ్రీ నంబర్‌కు 21, సీ–విజిల్ యాప్ ద్వారా 225 ఫిర్యాదులు వచ్చాయని.. వాటిపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నామని సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. పోలింగ్ రోజు జరిగిన వేర్వేరు ఘటనలకు సంబంధించి 38 కేసులు నమోదు చేశామన్నారు. ఇంకా కొన్ని ఫిర్యాదులపై పరిశీలన జరుగుతోందని, కేసుల సంఖ్య పెరగవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్ల గుర్తింపును తనిఖీ చేసే అధికారం అభ్యర్థులకు ఉండదని.. ఈ క్రమంలో హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్ల గుర్తింపును తనిఖీ చేసిన ఓ అభ్యర్థి (బీజేపీ అభ్యర్థి మాధవీలత)పై కేసు నమోదు చేశామని చెప్పారు. జహీరాబాద్, నిజామాబాద్‌లలో జరిగిన ఘటనపై సైతం కేసులు పెట్టామన్నారు. ఎన్నికలకు సంబంధించి మార్చి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.330 కోట్ల నగదు, ఇతర వస్తువులను స్వా«దీనం చేసుకున్నామని వెల్లడించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర సాయుధ బలగాలతో తొలి అంచె, రాష్ట్ర సాయుధ పోలీసు బలగాలతో రెండో అంచె, స్థానిక పోలీసులతో మూడో అంచె బందోబస్తు నిర్వహిస్తారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పరిస్థితిని సీసీ కెమెరాల ద్వారా నిరంతరం ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులను స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కాపలాగా పెట్టాలనుకుంటే.. వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ముగిసిన తర్వాత 45 రోజుల వరకు ఈ భద్రతా ఏర్పాట్లు కొనసాగుతాయి. ఎన్నికల ఫలితాల తర్వాత వాటిని సవాల్ చేస్తూ 45రోజుల్లోగా కోర్టులో ఎలక్షన్ పిటిషన్లు వేయడానికి అవకాశం ఉండటమే దీనికి కారణం. మళ్లీ బద్ధకించిన హైదరాబాదీలు! ఓటేసేందుకు హైదరాబాద్–సికింద్రాబాద్ జంటనగరాల ప్రజలు మళ్లీ బద్ధకించారు. రాత్రి 12 గంటలకు ప్రకటించిన పోలింగ్ శాతం అంచనాల మేరకు.. రాష్ట్రంలోనే అత్యల్పంగా హైదరాబాద్ స్థానం పరిధిలో 46.08 శాతం పోలింగ్ నమోదైంది. తర్వాత సికింద్రాబాద్ పరిధిలో 48.11 శాతం, మల్కాజ్గిరి పరిధిలో 50.12 శాతం, చేవెళ్ల పరిధిలో 55.45 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. అత్యధికంగా భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలో 76.47 శాతం, జహీరాబాద్ పరిధిలో 74.54 శాతం పోలింగ్ నమోదయ్యాయి. అయితే హైదరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారని.. దీనికితోడు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం పెంచడంతో.. ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని సీఈవో వికాస్‌రాజ్ పేర్కొన్నారు. నేడు ‘పరిశీలకుల’ఆధ్వర్యంలో ఈవీఎంల తనిఖీలు పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రిసైడింగ్ అధికారులు ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని సంబంధిత రిసెప్షన్ కేంద్రంలో అందజేస్తారు. అక్కడ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రికి ప్రాథమిక పరిశీలన నిర్వహిస్తారు. ఫారం–17సీ, ఈవీఎం, వీవీ ప్యాట్స్‌ను పరిశీలించి చూస్తారు. మొత్తం ఓట్లు, పోలైన ఓట్లను సరిచూసుకుంటారు. అన్నీ సవ్యంగా ఉన్నట్టు నిర్ధారించుకున్న తర్వాత ఎన్నికల పరిశీలకుడు ఈ అంశాలను ధ్రువీకరిస్తూ సంతకం చేస్తారు. తర్వాత ప్రిసైడింగ్ అధికారులను పంపించివేస్తారు. ఈవీఎంలను సంబంధిత నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తారు. కొన్నిచోట్లలోని రిసెప్షన్ కేంద్రాల్లోనే స్ట్రాంగ్ రూమ్‌లు ఉండగా.. మరికొన్ని చోట్ల వేరే ప్రాంతాల్లో ఉన్నాయి. అలా ఉన్న చోట కేంద్ర బలగాల భద్రత నడుమ జీపీఎస్ సదుపాయమున్న వాహనాల్లో ఈవీఎంలను తరలించి భద్రపరుస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే పోలింగ్ బృందాలు.. రిసెప్షన్ సెంటర్‌కు వచ్చి, అప్పగింత ప్రక్రియ పూర్తి చేసే సరికి.. మంగళవారం తెల్లవారుజాము 5 గంటల వరకు పట్టే అవకాశం ఉందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. తర్వాత మంగళవారం ఉదయం 11 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సాధారణ పరిశీలకులు ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రి, ప్రిసైడింగ్ అధికారుల నుంచి వచ్చిన రిపోర్టులు, డైరీలను తనిఖీ చేసి అంతా సవ్యంగా ఉన్నట్టు నిర్ధారిస్తారని వివరించారు. ఏదైనా ప్రాంతంలో రిపోలింగ్ అవసరం ఉంటే.. అప్పుడే నిర్ణయం తీసుకుంటారని, ఇప్పటివరకు అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదని వెల్లడించారు. -
తెలంగాణలో పోలింగ్ శాతం పెరిగింది: సీఈవో వికాస్‌రాజ్
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్‌పై మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం బాగానే ఉందని తెలిపారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 50 దాటింది. ఇక హైదరాబాద్‌లో మాత్రం ఎప్పటిలానే ఈసారి కూడా తక్కువగానే 20 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుగుతుందని వికాస్ రాజ్ వెల్లడించారు.ఇక రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకే తెలంగాణలో 40 శాతానికి పైగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. దీంతో 2019తో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. -
ఇక మాటల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. శనివారం సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడింది. గత నెల రోజులుగా హోరెత్తిన లౌడ్ స్పీకర్లు, మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఈ నెల 13న సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. శనివారం సాయంత్రం నుంచి సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు. రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని, ఎక్కడా నలుగురుకి మించి గూమికూడి ఉండరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులు తక్షణమే వెళ్లిపోవాలని ఆదేశించారు.బల్క్ ఎస్ఎంఎస్లపై నిషేధంబల్క్ ఎస్ఎంఎస్లతో పాటు టీవీ చానళ్లు, రేడియో, ఇతర మాధ్యమాల ద్వారా ఎన్నికల ప్రచార కార్యక్రమాల ప్రసారంపై నిషేధం అమల్లోకి వచ్చిందని వికాస్‌రాజ్ తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జూన్ 1 సాయంత్రం వరకు వెల్లడించరాదన్నారు. శనివారం ఆయన బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లను వెల్లడించారు. సోమవారం జరగాల్సిన పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశామన్నారు.ఎక్కడికక్కడ గట్టి నిఘాపోలింగ్కి ముందురోజు ఆదివారం రాత్రి వేళల్లో ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీని అడ్డుకోవడం తమకు కీలకమని, ఇందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు వికాస్‌రాజ్ తెలిపారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచామని, అన్ని ట్రాన్స్పోర్ట్, కమర్షియల్ వాహనాలను తనిఖీ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.320 కోట్లు విలువైన నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సీ–విజిల్ యాప్, ఎన్జీఎస్పీ పోర్టల్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి 100 నిమిషాల్లోగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన విషయంలో మొత్తం 8600 కేసులు నమోదు చేయగా, అందులో 293 కేసులు నగదుకి సంబంధించినవి, 449 కేసులు ఐపీసీ, 7800 కేసులు మద్యానికి సంబంధించినవి అని వివరించారు. పోస్టర్ బ్యాలెట్లో అభ్యర్థిని చూడాలి..ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం మినహా మిగిలిన 16 లోక్‌సభ స్థానాల పరిధిలో రెండు, లేదా మూడు బ్యాలెట్ యూనిట్లతో ఎన్నికలు జరుగుతాయని, ఓటర్లు గందరగోళానికి గురికావద్దని, పోలింగ్ కేంద్రం బయట ప్రదర్శనకు ఉంచిన పోస్టర్ బ్యాలెట్లో తాము ఓటేయాల్సిన అభ్యర్థిని ముందే గుర్తించాలని వికాస్‌రాజ్ సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో 1.88లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారని, వీరిలో 20,163 మంది ఇంటి వద్ద నుంచే ఓటేశారన్నారు. రాష్ట్రంలో తక్కువ పోలింగ్ జరిగే 5వేల పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అక్కడి ప్రజలు ఓటేసేలా చైతన్యపరిచేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 35,809 పోలింగ్ కేంద్రాలుండగా, అందులో 9900 సమస్యాత్మకమైనవి అని, అక్కడ కేంద్ర బలగాలు, సూక్ష్మ పరిశీలకులు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేశామని చెప్పారు.సోమవారం ఉదయం 5.30 కి మాక్పోల్సోమవారం ఉదయం 5.30 గంటలకు పోలింగ్ కేంద్రంలో మాక్‌పోల్ నిర్వహిస్తారని, అభ్యర్థుల ఏజెంట్లు అందరూ అందుబాటులో ఉండాలని వికాస్‌రాజ్ సూచించారు. మాక్‌పోల్/పోలింగ్ నిర్వహించేటప్పుడు ఈవీఎంలు పనిచేయకపోతే సెక్టోరల్ అధికారులు వచ్చి మారుస్తారని చెప్పారు. ప్రతి అసెంబ్లీ స్థానం పరిధిలో ఇద్దరు, ముగ్గురు ఈసీఐఎల్ ఇంజనీర్లు అందుబాటులో ఉంటారన్నారు. ఈవీఎంలను తరలించే వాహనాలకు పోలీసుల భద్రతతో పాటు వాటి కదలికలను జీపీఎస్ ద్వారా జిల్లా కలెక్టర్లు నిరంతరం సమీక్షిస్తారన్నారు.కచ్చితమైన పోలింగ్ శాతం తెలిసేది మరుసటి రోజే..పోలింగ్ ప్రారంభమైన తర్వాత ప్రతి రెండు గంటలకు ఒకసారి అంచనా పోలింగ్ శాతాన్ని అందిస్తామని వికాస్‌రాజ్ తెలిపారు. పోలింగ్ ముగిసాక సాయంత్రం 6 గంటలకు మొత్తం పోలింగ్ శాతంపై తొలి అంచనాను, రాత్రి అయ్యాక సవరించిన అంచనాలను ప్రకటిస్తామన్నారు. మరుసటి రోజు కచ్చితమైన పోలింగ్ శాతం వెల్లడిస్తామన్నారు.విద్వేష ప్రసంగాలపై దాటవేత ధోరణి..ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీతో సహా ఇతర బీజేపీ నేతలు విద్వేష ప్రసంగాలు చేశారని, ప్రచారంలో చిన్నపిల్లలను వాడుకున్నారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదులపై చర్యలెందుకు తీసుకోవడం లేదని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు వికాస్‌రాజ్ సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. ప్రత్యేకంగా ఒక్కో ఫిర్యాదు విషయంలో తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారం తన వద్ద ఇప్పుడు లేదన్నారు. రాజకీయ పార్టీల నుంచి మొత్తం 92 ఫిర్యాలొచ్చాయని, ఇద్దరు వ్యక్తులపై ఈసీ ఇప్పటికే చర్యలు తీసుకుందని వెల్లడించారు. ఫిర్యాదుల విషయంలో రాజకీయ పార్టీలకు నోటిసులు జారీ చేశామని, వివరణ కోసం వారు మరికొంత సమయం కోరినట్టు తెలిపారు.లోక్‌సభ ఎన్నికల్లో వాడనున్న ఈవీఎంలు బ్యాలెట్ యూనిట్లు – 84,577+ 20వేలు రిజర్వ్కంట్రోల్ యూనిట్లు – 35,809+ 10వేల రిజర్వ్వీవీప్యాట్స్ – 35,809 + 15వేలు రిజర్వ్పోలీసుల బందోబస్తుకేంద్ర బలగాలు –160 కంపెనీలుపొరుగు రాష్ట్రాల నుంచి హోంగార్డులు, ఇతర బలగాలు– 20వేల మందిరాష్ట్ర పోలీసులు 60వేల మందిఇతర రాష్ట్ర యూనిఫార్మ్ సర్వీసుల సిబ్బంది– 12 వేల మంది -
సోమవారం సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు: టీఎస్ సీఈవో
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ రోజు (మే13)న అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలుంటాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ హెచ్చరించారు. జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉందని తెలిపారు.బందోబస్తు కోసం కేంద్ర బలగాలతో పాటు, 60 వేల మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉంటారని వికాస్‌రాజ్ వెల్లడించారు. తనిఖీల్లో ఇప్పటివరకు రూ.320 కోట్ల విలువైన సొత్తు సీజ్ చేశామని, తనిఖీలకు సంబంధించి 8 వేలకు పైగా కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.88 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారన్న సీఈవో వికాస్‌రాజ్.. పోలింగ్ సమయం దగ్గర పడటంతో నిఘా మరింత పెంచామని తెలిపారు. -
11న సాయంత్రం 5 నుంచి మద్యం బంద్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 13న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్‌కు 48 గంటల ముందు.. అంటే ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటల వరకు పొడిగించిన నేపథ్యంలో ఆ మేరకు మద్యం అమ్మకాలపై నిషేధాన్ని సైతం పొడిగించాలని అబ్కారీ శాఖను ఆదేశించారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో.. ఆ రోజు సైతం మద్యం అమ్మకాలపై నిషేధం అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు డ్రైడే అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
కోడ్ ఉల్లంఘిస్తే చర్యలే
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకుంటోందని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఇప్పటికే పలువురు నేతలపై నిషేధాన్ని విధించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ చెప్పారు. రాష్ట్రంలో సైతం కోడ్ ఉల్లంఘనకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ పట్ల అన్ని పార్టీలకు అవగాహన కల్పించామని, ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఈసీ జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చే గడువు గురువారంతో ముగిసిందని, ఆయన మరో వారంపాటు గడువు పొడిగించాలని కోరారన్నారు. కేసీఆర్ విజ్ఞప్తిని ఈసీకి పంపించామని చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఊరేగింపులో ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్, ఆ పార్టీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత చేసిన విద్వేషకర ప్రసంగాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. కోడ్ ఉల్లంఘనకి సంబంధించి ఇప్పటి వరకు వివిధ పార్టీల నుంచి 28 ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటివరకు 4099 ఎఫ్ఐఆర్లను నమోదు చేశామన్నారు. ఓ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడానికి అనుమతించే విషయమై చట్టాలను పరిశీలించాల్సిన అవసరముందని తెలిపారు. సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే. ఆన్లైన్లో నామినేషన్ వేయొచ్చు ఆన్లైన్లో సైతం నామినేషన్ దాఖలు చేయొ చ్చని, అయితే ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటల్లోపు అభ్యర్థులు సంతకం చేసిన నామినేషన్ పత్రాల ప్రింట్ కాపీని సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని వికాస్‌రాజ్ తెలిపారు. నామినేషన్ ఫారంతోపాటు అఫిడవిట్‌లోని అన్ని ఖా ళీలను పూరించాలని, తమకు వర్తించని విష యాలను సైతం ‘నాట్ అప్లికేబుల్’అని రా యాల్సి ఉంటుందన్నారు. ఒక్క ఖాళీ పూరించకపోయినా పరిశీలనలో నామినేషన్లు తిరస్కరిస్తారని చెప్పారు. ఎన్నికల ఖర్చుల కోసం అభ్యర్థులు కొత్త బ్యాంక్ ఖాతాను తెరవాల్సి ఉంటుందని, రాష్ట్రంలోని ఏ బ్యాంక్ నుంచైనా ఖాతా తెరవచ్చన్నారు. తొలి రోజు రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో మొత్తం 42 మంది అభ్యర్థులు మొత్తం 48 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారని వికాస్‌రాజ్ వెల్లడించారు. 23లోగా పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకోవాలి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం వికలాంగు లు, 85 ఏళ్లుపైబడిన వయోజనులు, అత్యవసర సేవల ఉద్యోగులు/జర్నలిస్టులు ఈ నెల 23లోగా ఫారం–12డీ దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని సీఈఓ వికాస్‌రాజ్ సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిలో ఇంకా 40వేల మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని, తక్షణమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 3 నుంచి 6 వరకు తొలి విడత పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 26 నుంచి ఓటర్లకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ చేస్తామన్నారు. పాత ఓటరు గుర్తింపుకార్డులు కలిగిన 46 లక్షల మంది ఓటర్లకు వారి కొత్త ఓటరు గుర్తింపుకార్డు నంబర్లను తెలియజేస్తూ లేఖలు పంపినట్టు తెలిపారు. పాత నంబర్లతో ఓటు ఉండదని, కొత్త నెంబర్లతోనే ఉంటుందన్నారు. మహిళా ఓటర్లే అధికం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,31,48,527కి చేరిందని వికాస్‌రాజ్ తెలిపారు. 1000 మంది పురుషులకు రాష్ట్రంలో 1010 మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు మొత్తం 1,00,178 దరఖాస్తులొచ్చాయని, వీటిని ఈనెల 25లోగా పరిష్కరిస్తామని చెప్పారు. 2022–24 మధ్యకాలంలో రాష్ట్రంలో 60.6 లక్షల కొత్త ఓటర్ల నమోదు, 32.84 లక్షల ఓటర్ల తొలగింపు, 30.68 లక్షల ఓటర్ల వివరాల సవరణ జరిగిందన్నారు. -
సెలవుల్లోనే రోడ్‌షోలు: సీఈఓ వికాస్‌రాజ్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టే రోడ్‌షోలకు సెలవు రోజుల్లో, ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండే వేళల్లో నిర్వహించేందుకు మాత్రమే అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. ఇతర సమయాల్లో రోడ్‌షోలపై నిషేధం లేకున్నా, ప్రజలకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో అనుమతి ఇవ్వబోమన్నారు. ఆస్పత్రులు, ట్రామాకేర్ సెంటర్లు, బ్లడ్‌బ్యాంకులున్న ప్రాంతాల్లో కూడా రోడ్‌షోలు చేపట్టవద్దని స్పష్టం చేశారు. సోమవారం తన కార్యాలయంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను వికాస్‌రాజ్ మీడియాకు వివరించారు. రెండున్నరేళ్లలో 30 లక్షల ఓట్లు తొలగింపు గత డిసెంబర్లో రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలు ముగిశాక రాష్ట్రంలో 12 లక్షల కొత్త ఓటర్లు నమోదవగా.. 8,58,491 ఓటర్లను తొలగించినట్టు వికాస్‌రాజ్ తెలిపారు. గత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో 30లక్షల ఓట్లను తొలగించామన్నారు. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో బోగస్ ఓట్లున్నట్టు వచ్చిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారి విచారణ నిర్వహించారని, నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. బోగస్ ఓట్ల తొలగింపు నిరంతర ప్రక్రియగా జరుగుతోందన్నారు. ఏప్రిల్ 15లోగా దరఖాస్తు చేసుకోవచ్చు కొత్త ఓటరుగా నమోదు కోసం ఏప్రిల్ 15లోగా ఫారం–6 దరఖాస్తు చేసుకున్న వారందరికీ లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసే సదుపాయం కల్పిస్తామని వికాస్‌రాజ్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిశాకే ఓటర్ల చిరునామా మార్పు(ఫారం–8), తప్పుల దిద్దుబాటు(ఫారం–7) దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ఈసారి 85 ఏళ్లు పైబడిన ఓటర్లకు ఇంటి నుంచి ఓటేసే సదుపాయం కల్పిస్తామన్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండే నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, టెంట్లు, కుర్చీలు వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. లెక్కలు చూపకుంటే స్వాధీనం.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సరైన లెక్కలు లేకుండా రూ.50వేలకు మించిన నగదు తీసుకెళ్లరాదని వికాస్‌రాజ్ సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిననాటి నుంచి ఇప్పటివరకు రూ.243 కోట్లు విలువైన నగదు/సరుకులను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయన్నారు. మార్చి 1 నుంచి ఆదివారం వరకు రూ.21.63 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇటీవల నామినేటెడ్ పదవుల్లో నియామకమైన చైర్పర్సన్లు పదవీ బాధ్యతలు స్వీకరించవచ్చా? అనే అంశంపై నిబంధనలను పరిశీలించాక తెలియజేస్తామన్నారు. ఈ–పేపర్లకు ఇచ్చే ప్రకటనలకు సైతం అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సర్టిఫికేషన్ పొందాలని సూచించారు. ఈ సందర్భంగా పలు గణాంకాలను విడుదల చేశారు. -
రద్దీ ప్రాంతాల్లో రోడ్ షోలకు అనుమతి లేదు: CEO వికాస్ రాజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. వచ్చే ఎన్నికల కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. లోక్‌సభ ఎన్నికలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నిక నేపథ్యంలో సీఈఓ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కోసం లక్షా 80 వేల సిబ్బంది అవసరమని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 90 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయినట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 8,58,491 ఓట్లు తొలగించామని అన్నారు. పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారన్నారు. ke\\రాష్ట్రంలో 3 కోట్ల 30 లక్షల ఓటర్లు ఉంటే.. 8 లక్షల కొత్త యువ ఓటర్లు ఉన్నారు. ఈ సారి 85 ఏళ్ల పైబడిన వాళ్లకు హోం ఓటింగ్ అవకాశం ఉంటుంది. నామినేషన్ ఉపసంహరణ తరువాత రోజు నుంచి హోం ఓటింగ్ ప్రారంభం అవుతుంది. పోస్టల్ ఓటింగ్ కొత్త సాప్ట్ వేర్ ద్వారా ఈసారి నిర్వహిస్తున్నాం. ఎన్నికల అధికారులకు, సిబ్బందికి ట్రైనింగ్ ప్రాసెస్ పూర్తి అయింది. EVM లు సిద్ధంగా ఉన్నాయి. రిజర్వ్ కూడా ఉంచాం. 24 గంటలు పనిచేసేలా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశాం. 50వేల కంటే ఎక్కువ నగదు ఉంటే పేపర్స్ ఉండాలి లేదంటే సీజ్ చేస్తారు. ఫిర్యాదులు c - విజిల్ app లేదా 1950కి ఫిర్యాదు చేయొచ్చు. రాజకీయ పార్టీలు ర్యాలీలు, సభలకు అనుమతి సువిదా యాప్ ద్వారా తీసుకోవాలి. 7 లక్షల ఓటర్ కరెక్షన్స్ ఎమ్మెల్యే ఎన్నికల తరువాత చేశాంము. చిన్న పార్లమెంట్ మహబూబాబాద్ కాగా అతిపెద్ద ఎంపి సెగ్మెంట్ మల్కాజిగిరి. రోడ్ షో లు సెలవు రోజుల్లోనే.. రద్దీ ఉన్న ప్రాంతాల్లో రోడ్ షో లకు అనుమతి లేదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వాడటానికి లేదు. ఎన్నికల ప్రచారంలో చిన్న పిల్లలను, స్కూల్ డ్రెస్‌లకు అనుమతి లేదు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రాసెస్ జరుగుతోంది...షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్ జరుగుతుంది. -
లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నాం: వికాస్‌రాజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు సీఈఓ వికాస్‌రాజ్. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఫైనల్ లిస్ట్ ప్రకటించనున్నట్టు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అని కామెంట్స్ చేశారు. కాగా, ఈరోజు హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఈవో వికాస్‌రాజ్, రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారధి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నాం. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తాం. జనరల్ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిపాం. మొదటిసారి హోం ఓటింగ్ విజయవంతంగా నిర్వహించాం. ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత. తొమ్మిది లక్షల ఓటర్స్‌ను కొత్తగా నమోదు చేసినట్టు తెలిపారు. -
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాజ్ భవన్ కు వికాస్ రాజ్
-
నిధులు మళ్లిస్తున్నారు.. భూములు మార్చుకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు కింద పంపిణీ చేయాల్సిన నిధులను తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు మళ్లిస్తున్నారని, హైదరాబాద్ శివారు జిల్లాల్లోని వేలాది ఎకరాల అసైన్డ్ భూముల రికార్డులను మారుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అధికార దుర్వినియోగాన్ని కట్టడి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జి.నిరంజన్, అంజన్‌కుమార్ యాదవ్, మహేశ్‌కుమార్‌గౌడ్, హర్కర వేణుగోపాల్, రోహిణ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్ తదితరులు శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు రైతుబంధు నిధుల పంపిణీ ఆగిపోయిందని, ఈ నేపథ్యంలో ఆ పథకం కింద ఇవ్వాల్సిన రూ.6 వేల కోట్లను తమకు ఇష్టమైన కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకుని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ వినతిపత్రంలో తెలిపారు. అదేవిధంగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని వేలాది ఎకరాల అసైన్డ్ భూముల హక్కు రికార్డులను ధరణి పోర్టల్ ద్వారా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల బినామీల పేరిట మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయాల్లో సరైన పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తగిన ఆదేశాలు జారీ చేయాలని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా కట్టడి చేయాలని ఆ వినతిపత్రంలో కోరారు. నాలుగు అంశాలపై వినతిపత్రం ఇచ్చాం: ఉత్తమ్ సీఈవో వికాస్‌రాజ్‌ను కలసిన అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతుబంధు నిధుల మళ్లింపు, అసైన్డ్ భూముల రికార్డుల మార్పిడికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందు అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చూడాలని సీఈఓకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. అలాగే తమ పార్టీ నుంచి గెలిచే వారి ఎలక్షన్ సర్టిఫికెట్లను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కోరామని తెలిపారు. పాతబస్తీలో రిగ్గింగ్ జరిగిందని, దీనికి సంబంధించి సీసీటీవీ రికార్డులున్నాయని, ఈ రికార్డుల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామని వెల్లడించా రు. ఈనెల 4వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించాలన్న కేసీఆర్ నిర్ణయంపై స్పందిస్తూ, కేబినెట్ ఎందుకు పెడుతున్నారో తమకు తెలియదని, రాజీనామాను ఇచ్చేందుకు ఈ సమావేశం నిర్వహించి ఉండవచ్చని, విషయం తెలియకుండా మాట్లాడలేమని ఉత్తమ్ చెప్పారు. -
బీఆర్ఎస్పై విజిలెన్స్ నిఘా? ఈసీకి ఫిర్యాదు
-
రిగ్గింగ్ ఆరోపణలు అవాస్తవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభకు గురువారం జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరగడంతోనే సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ శాతం భారీగా పెరిగిందన్న ఆరోపణలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తోసిపుచ్చారు. రాష్ట్రంలో దాదాపు అన్ని పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 9.30 గంటల వరకు ఓటింగ్ కొనసాగడంతోనే పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. శుక్రవారం వికాస్‌రాజ్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 13 వామపక్ష తీవ్రవాద ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా చోట్ల సాయంత్రం 5 గంటలకే పోలింగ్ సమయం ముగిసినా.. అప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్యూలైన్లలో నిలబడిన వారందరికీ నిబంధనల ప్రకారం ఓటేసే అవకా శం కల్పించామని వికాస్‌రాజ్ వివరించారు. అందువల్ల ఆయాచోట్ల రాత్రి 9.30 గంటల వరకు పోలింగ్ జరిగిందని, అధికారులు ఈవీఎంలు, ఇత ర సామగ్రిని సర్దుకుని రిసెప్షన్ కేంద్రాలకు చేరు కునే సరికి మరింత ఆలస్యమైందని చెప్పారు. రిసె ప్షన్ కేంద్రాల్లో ఈవీఎంలకు ప్రాథమిక తనిఖీలు నిర్వహించి, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపర్చినట్టు వెల్లడించారు. ప్రాథమిక స్రూ్కటినీ తర్వాతే 70.6 శాతం పోలింగ్ జరిగినట్టు ప్రాథమి కంగా అంచనాకు వచ్చామని తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు కూర్చుని అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో తుది స్రూ్కటినీ నిర్వహిస్తున్నారని వివరించారు. చాంద్రాయణగుట్ట సహా ఇతర స్థానాల్లో రిగ్గింగ్ జరిగినట్టు వచ్చిన ఫిర్యా దుల మేరకు సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలిపారు. స్క్రూటి నీ ముగిశాకే కచ్చితమైన పోలింగ్ శాతంతోపాటు రిగ్గింగ్ ఆరోపణల్లో నిజానిజాల పై స్పష్టత వస్తుందని.. ఆయా అంశాల ఆధారంగా తుది నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. ప్రశాంతంగా పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని వికాస్‌రాజ్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలన్నీ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు చేరుకున్నట్టుగా ధ్రువీకరించుకున్నామ ని వివరించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 40 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని చెప్పారు.158పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఆయాచోట్ల కొత్త ఈవీఎంలను పెట్టి పోలింగ్ నిర్వహించామని.. దీనివల్ల కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 45 నిమిషాల వరకు ఆలస్యమైందని అదనపు సీఈఓ లోకేశ్‌కుమార్ వివరించారు. నాగార్జున సాగర్ అంశానికి ఎన్నికలతో సంబంధం లేదు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి సగభాగాన్ని ఏపీ ప్రభుత్వం స్వా«దీనం చేసుకున్న ఘటనకు రాష్ట్ర శాసనసభ ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. డీప్ ఫేక్, ఇతర తప్పుడు ప్రచారాల ఆరోపణలపై సోషల్ మీడియాలోని 120 లింక్‌లను తొలగించామన్నారు. ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడంపై విశ్లేషణ జరుపుతామన్నారు. డబ్బులు పంచుతూ కొందరు అభ్యర్థులు, వారి బంధువులు పట్టుబడిన ఘటనలపై స్పందిస్తూ.. రాష్ట్ర మంత్రులపై కేసులు నమోదయ్యాయని, రికార్డు స్థాయిలో 13వేలకుపైగా కేసులు పెట్టామని వికాస్‌రాజ్ వివరించారు. భారీగా పెరిగిన పోస్టల్ బ్యాలెట్లు ఈసారి పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్ గణనీయంగా పెరిగిందని వికాస్‌రాజ్ తెలిపారు. 16,005 మంది 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు, 9,459 మంది దివ్యాంగ ఓటర్లు, 1.80 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకున్నారని వివరించారు. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 33 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, కేంద్ర బలగాలు, రాష్ట్ర సాయుధ రిజర్వ్డ్ బలగాలు, రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. 500కుపైగా పోలింగ్ కేంద్రాలున్న 6 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 14+14 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామని.. మిగతా స్థానాల ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్స్ ఉంటాయని తెలిపారు. ప్రతి టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారని చెప్పారు. 119 స్థానాలకు సంబంధించి 1,766 కౌంటింగ్ టేబుల్స్ ఉంటాయని.. వీటిలో ఆర్వో, పోస్టల్ బ్యాలెట్ల కోసం 131 టేబుల్స్ ఉంటాయని వివరించారు. ఉదయం 10.30 కల్లా లీడ్‌పై స్పష్టత కౌంటింగ్‌లో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి తర్వాత ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారని వికాస్‌రాజ్ తెలిపారు. ఒకవేళ పోస్టల్ ఓట్ల లెక్కింపునకు అధిక సమయం పడితే.. సమాంతరంగా ఈవీఎం ఓట్ల లెక్కింపూ మొదలవుతుందన్నారు. ఉదయం 10.30 గంటలకల్లా కౌంటింగ్‌లో ముందంజలో ఉన్న అభ్యర్థుల విషయంలో స్పష్టత వస్తుందని వికాస్‌రాజ్ అంచనా వేశారు. కొన్ని స్థానాల్లో అధిక పోలింగ్ జరగడం, చాలాచోట్లలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఓట్ల లెక్కింపునకు కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 'పోలింగ్ 70.66 శాతం'!
గడప దాటని సిటీ చెంతనే పోలింగ్ కేంద్రం.. అయినా సిటీ ఓటరు గడప దాటలేదు. సెలవును సరదాగా గడిపేశారు. ఓటేసేందుకు కదల్లేదు. క్రితంసారితో పోలిస్తే 5% పోలింగ్ తగ్గింది. పట్నమిలా..హైదరాబాద్ భరత్‌నగర్‌లోని పోలింగ్ కేంద్రం 16 కి.మీ. నడిచొచ్చి.. ఓటేసి వీరంతా ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల పంచాయతీ పరిధిలోని పెనుగోలు ఆదివాసీలు. మూడు గుట్టలు ఎక్కి దిగి, మధ్యలో మూడు వాగులు దాటి 16 కిలోమీటర్లు నడిచి వచ్చి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ గోడు పట్టించుకోవడం లేదని వారు గోడు వెళ్లబోసుకున్నారు. ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలనుకున్నా.. రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకోవాలనే ఇంతదూరం నడిచి వచ్చామని చెప్పారు. – వాజేడు పల్లె ఇలా.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం) నిక్షిప్తమైంది. గురువారం రాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 70.66 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేసింది. కచ్చితమైన గణాంకాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ శుక్రవారం ప్రకటిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. రాష్ట్ర శాసనసభకు 2014లో జరిగిన ఎన్నికల్లో 69.5 శాతం, 2018 ఎన్నికల్లో 73.2 శాతం పోలింగ్ నమోదైంది. తాజా పోలింగ్‌లో కడపటి వార్తలు అందేసరికి 70.66 శాతంగా నమోదైంది. ఇది మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 3న (ఆదివారం) ఓట్ల లెక్కింపు నిర్వహించి, ఫలితాలను ప్రకటించనున్నారు. అత్యధికంగా జనగామలో.. గురువారం సాయంత్రానికల్లా అత్యధికంగా.. మునుగోడు 91.51, ఆలేరు 90.16, భువనగిరి 89.9 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా యాకూత్‌పురలో 39.69 శాతం, మలక్‌పేట 41, నాంపల్లిలో 42.76, చార్మినార్‌లో 43.26 శాతం పోలింగ్ నమోదైంది. ► జిల్లాల వారీగా పోలింగ్ శాతాలను పరిశీలిస్తే.. అత్యధికంగా యాదాద్రి భువనగిరిలో 90.03 శాతం, మెదక్‌లో 86.69శాతం జనగామలో 85.74, నల్లగొండలో 85.49శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.65 శాతం, రంగారెడ్డిలో 59.94 శాతమే ఓట్లు వేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గిపోయినట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ►మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 13 వామ పక్ష తీవ్రవాద ప్రభావిత స్థానాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా 106 చోట్ల సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్ ముగిసే సమ యానికల్లా.. పోలింగ్ కేంద్రాలకు చేరుకుని, క్యూలైన్లలో ఉన్న ఓటర్లందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. కొన్నిచోట్ల ఇలా రాత్రి వరకు పో లింగ్ సాగింది. ఈ క్రమంలోనే పోలింగ్ శాతాలపై శుక్రవారం ఉదయమే స్పష్ట త వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. పలుచోట్ల ఆలస్యంగా.. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలుకావాలి. అ యితే పలుచోట్ల ఈవీఎంలు, ఓటర్ వెరిఫయబుల్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్) యంత్రాలు మొరాయించడంతో గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని పోలింగ్ కేందాల్లో ఈవీఎంలు మొరాయించాయి? ఎన్నింటిని రిప్లేస్ చేశారన్న అంశంపై సీఈఓ కార్యాలయం ప్రకటన జారీ చేయలేదు. ఉదయమే బారులు తీరిన ఓటర్లు రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీనితో వడివడిగా ఓటింగ్ సాగింది. మధ్యాహ్నం కొంత మందగించినా తర్వాత పుంజుకుంది. ఉదయం 9 గంటల వరకు 7.78 శాతం, 11 గంటల వరకు 20.64 శాతం, మధ్యాహ్నం 3 గంటల సమయానికి 51.89 శాతం, సాయంత్రం 5 గంటలకు 64.42 శాతం పోలింగ్ నమోదైంది. కడపటి వార్తలు అందేసరికి 70.66 శాతంగా నమోదైంది. రాత్రి వరకు పలుచోట్ల ఓటింగ్ కొనసాగిన నేపథ్యంలో ఆ లెక్క లన్నీ క్రోడీకరించాల్సి ఉంది. దీనితో ఓటింగ్ శాతం పెరగనుందని ఎన్నికల సంఘం అంచనా వేసింది. తగ్గిన ఓట్ల గల్లంతు ఫిర్యాదులు గత శాసనసభ ఎన్నికల సందర్భంగా భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతైనట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా హైదరాబాద్ జంట నగరాల్లో లక్షల ఓట్లు తొలగించినట్టు విమర్శలు వచ్చాయి. అయితే ఈసారి ఎన్నికల్లో ఓట్ల గల్లంతుపై ఫిర్యాదులు నామమాత్రంగానే వచ్చాయి. వివరాలు వెల్లడించని ఎన్నికల ప్రధానాధికారి శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధిగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) విలేకరుల సమావేశం నిర్వహించి.. వివరాలను వెల్లడించడం ఆనవాయితీ. అంతేకాదు.. పోలింగ్ కొనసాగుతున్న సమయంలోనూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేవారు. అయితే సీఈఓ వికాస్‌రాజ్ గురువారం శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిశాక ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు సీఈఓ కార్యాలయం ప్రజాసంబంధాల విభాగం అధికారులను సంప్రదించారు. పోలింగ్ తీరుపై విలేకరుల సమావేశం నిర్వహించాలని కోరారు. కానీ సీఈఓ వికాస్‌రాజ్ అంగీకరించలేదని అధికారులు బదులిచ్చారు. కేవలం పోలింగ్ శాతంపై ప్రాథమిక అంచనాలు మినహా ఎలాంటి ఎలాంటి సమాచారాన్ని సీఈఓ కార్యాలయం వెల్లడించలేదు. ఈవీఎంల తరలింపుపై ఉద్రిక్తత సూర్యాపేట జిల్లా నాగారం మండలం పేరబోయినగూడెంలో అధికారులు ఎస్కార్ట్ లేకుండా ఈవీఎంలను తరలిస్తున్నారని, ఈవీఎంలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో గ్రామస్తులు వెనక్కి తగ్గారు. అయితే ఖాళీ ఈవీఎంలను కారులో తరలిస్తున్న సెక్టోరియల్ అధికారిని అడ్డుకుని అద్దాలను ధ్వంసం చేశారు. ఇంటింటికీ ఓటింగ్‌కు భారీ స్పందన: సీఈసీ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 80ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు కలిపి 25,400 మంది తొలిసారిగా ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలిసారి కల్పించిన ఈ అవకాశాన్ని ఓటర్లు సది్వనియోగం చేసుకున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. బందోబస్తుతో ప్రశాంతం రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, అనుక్షణం పర్యవేక్షించడంతో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాల్లో పలుచోట్ల చెదురుమదురు ఘటనలు జరిగి, ఉద్రిక్తత నెలకొన్నా అక్కడి పోలీసు సిబ్బంది వేగంగా స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు. రాష్ట్ర పోలీస్‌శాఖ నుంచి 45వేల మంది పోలీసు సిబ్బంది, 375 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, కర్నాటక, ఏపీ, మహారాష్ట్రల నుంచి 23,500 మంది హోంగార్డులు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో.. ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. కూంబింగ్, ఏరియా డామినేషన్ సెర్చ్ చేపట్టారు. ఓటెత్తని హైదరాబాద్! సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లా పరిధిలో రాష్ట్రంలోనే తక్కువగా పో లింగ్ నమోదైంది. అధికారులు ఎంతగా అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా.. ఎప్పటిలాగే హైదరాబాద్ జనం ఓటు వేసేందుకు తరలివెళ్లలేదు. పోలింగ్ కేంద్రాల్లో ఎంత క్యూ ఉందో, ఎంత సమయంలో ఓటేయవచ్చో ఆన్లైన్లో ముందే తెలుసుకునే సదుపాయం కల్పించినా ఫలితం రాలేదు. చాలా వరకు సెలవురోజుగానే భావించి విశ్రాంతి తీసుకునేందుకు, వినోద కార్యక్రమాల్లో మునిగిపోయి ఉండటమే దీనికి కారణమని అధికారవర్గాలు చెప్తున్నాయి. అంతేగాకుండా ఒకటి కంటే ఎక్కువచోట్లా ఓట్లున్నవారూ ఇక్కడ గణనీయంగా ఉండటం, వారంతా స్వస్థలాలకు తరలడం కూడా పోలింగ్ తగ్గడానికి మరో కారణమని పేర్కొంటున్నాయి. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించిన సమాచారం మేరకు.. జిల్లాలో కడపటి వార్తలు అందేసరికి 46.65 శాతమే పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల (50.51 శాతం)తో పోలిస్తే ఐదు శాతం తగ్గడం గమనార్హం. జిల్లాల్లో ఓటింగ్ తీరు ఇదీ.. ఉమ్మడి ఆదిలాబాద్.. గిరిజన ప్రాంతాల్లో ధాటిగా ఓటింగ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మారుమూల, గిరిజన ప్రాంతాల్లో అధికంగా పోలింగ్ నమోదైంది. ఆసిఫాబాద్, సిర్పూర్, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి తదితర స్థానాల్లో పలుచోట్ల రాత్రిదాకా ఓటింగ్ జరిగింది. కాగజ్‌నగర్ పట్టణంలోని 90వ పోలింగ్ కేంద్రం వద్ద బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, సిర్పూర్ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీఎస్పీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వారిని అదుపు చేసే క్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌రావు, ఎస్సై గంగన్న, కానిస్టేబుల్ రత్నాకర్, మరికొందరికి గాయాలయ్యాయి. ఇక్కడ రీపోలింగ్ నిర్వహించాలని ప్రవీణ్‌కుమార్ రిటరి్నంగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా వరిపేట, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం కొత్తపల్లిలలో ప్రజలు తమ సమస్యలు తీర్చలేదంటూ నిరసన వ్యక్తం చేయగా.. అధికారులు నచ్చజెప్పడంతో ఓటేశారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్ గ్రామస్తులు.. తమ ఊరిగి రోడ్డు, మంచినీటి సౌకర్యం కల్పించాలంటూ ఓటు వేయలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో నిలబడి ఇద్దరు మృతి చెందారు. ఉమ్మడి ఖమ్మం.. గ్రామాల్లో పోలింగ్ బహిష్కరణ ఖమ్మం ఉమ్మడి నియోజకవర్గాల్లో పలుచోట్ల రాత్రి 8వరకు కూడా పోలింగ్ జరిగింది. కొత్తగూడెం రూరల్, ఏన్కూరు, సత్తుపల్లి మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదంటూ పోలింగ్‌ను బహిష్కరించారు. అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి సర్దిచెప్పడంతో మధ్యాహ్నం ఓట్లు వేశారు. కూసుమంచి, ఎర్రుపాలెం, తల్లాడ, బోనకల్, కొనిజర్ల, తిరుమలాయపాలెం, అశ్వారావుపేట, మణుగూరు, పినపాక మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఖమ్మం రూ రల్ మండలంలోని గోళ్లపాడులో ఏనుగు సీతారాంరెడ్డి(75) ఓటు వేసి పోలింగ్ బూత్ నుంచి బయటికి వస్తూ కుప్పకూలి కన్నుమూశాడు. ఉమ్మడి రంగారెడ్డి.. బాగా తగ్గిన పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గత ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్‌శాతం తగ్గింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఖానాపూర్‌లో, రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండలో, మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లిలో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి నల్లగొండ.. పలుచోట్ల లాఠీచార్జి నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల లాఠీచార్జిలు, చెదురుమదురు ఘటనలు జరిగాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఆలేరు మండలం కొలనుపాకలో టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్‌రెడ్డి గులాబీ కండువాతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పారు. ఈసమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు రాళ్లు రువ్వడంతో మహేందర్‌రెడ్డి కారు అద్దాలు పగిలాయి. పోలీసులు లాఠీచార్జి చేసి అందరినీ చెదరగొట్టారు. హుజూర్నగర్లోనూ గులాబీ కండువా వేసుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న ఎమ్మెల్యే సైదిరెడ్డిని పోలీసులు ఆపడంతో వాగ్వాదం జరిగింది. నారాయణపురం మండల కేంద్రంలో ఇద్దరు వ్యక్తులు టెండర్ ఓట్లు వేశారు. ఉమ్మడి కరీంనగర్.. డబ్బుల కోసం నిరసనలతో.. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో పెద్దగా అవాంఛనీయ ఘటన లు జరగలేదు. కరీంనగర్ జిల్లాలో రేకుర్తిలో కాంగ్రెస్ ఎన్నికల ఏజెంట్ వాహనాన్ని బీఆర్ఎస్ నాయకులు అడ్డగించారని పోలీసులకు ఫిర్యా దు అందింది. మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ గులాబీ చొక్కా ధరించి పోలింగ్ కేంద్రాలకు వచ్చారంటూ మొగిలిపాలెం, గన్నేరువరం గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం చెప్పడంతో వాగ్వాదం జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండ లం గంగారంలో అధికార పార్టీ అభ్యర్థి పంచిన డబ్బులు తమకు అందలేదంటూ కొందరు ఓటర్లు రోడ్డుపై బైఠాయించారు. రాజన్న సిరిసి ల్ల జిల్లా లింగంపేటలో తమకు డబ్బులు ఇవ్వలేదంటూ బీజేపీ నాయకుడి ఇంటి వద్ద మహిళా గ్రూపు సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్.. ప్రశాంతంగా పోలింగ్.. పాలమూరు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో రాత్రి 9 గంటల వరకు పోలింగ్ జరిగింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం వంకేశ్వరంలో డబ్బులు పంచుతున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య, మరికొన్నిచోట్ల బీఆర్ఎస్–బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వర్కూర్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య గొడవ చోటు చేసుకుంది. ఉమ్మడి నిజామాబాద్.. మందకొడిగా మొదలై.. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పోలింగ్ మందకొడిగా ప్రారంభమై మధ్యాహ్నానికి పుంజుకుంది. పలుచోట్ల రాత్రిదాకా ఓటర్లు క్యూలలో ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని పలుచోట్ల గుమిగూడిన పార్టీల కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. పలువురికి గాయాలయ్యాయి. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిని నాన్‌లోకల్ అంటూ బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఉమ్మడి వరంగల్.. బీఆర్ఎస్–కాంగ్రెస్ జగడం వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం, మరికొన్ని చోట్ల తమ గ్రామాలను అభివృద్ధి చేయలేదంటూ జనం రాకపోవడంతో ఓటింగ్ జరగలేదు. దంతాలపల్లి బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. మంగపేటలో బీఆర్ఎస్ నేత మాజీ జెడ్పీటీసీ వైకుంఠం ఓట్లకు డబ్బులిస్తానని మోసం చేశారంటూ పలువురు ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. జనగామ నియోజకవర్గ కేంద్రంలోని ఓ పోలింగ్ స్టేషన్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సతీమణి నీలిమ, కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి, కోడలు దివ్యల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలు గొడవకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. జనగామ మండలం శామీర్‌పేట పోలింగ్ కేంద్రంలో ఎదురుపడిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పరుష పదజాలంతో దూషించుకున్నారు. ఇక్కడా బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పరస్పర దాడులకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఉమ్మడి మెదక్.. స్వల్ప ఘర్షణల మధ్య.. మెదక్ ఉమ్మడి జిల్లాలో పోలింగ్ సందర్భంగా పలుచోట్ల స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాటలు జరగడంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. మునిపల్లి మండలం పెద్దగోకులారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య, సదాశివపేట ఎంపీడీఓ కార్యాలయం వద్ద, పటాన్చెరులో మూడుచోట్ల బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఎన్నికల విధుల్లో గుండెపోటుతో ఉద్యోగి మృతి పటాన్‌చెరుటౌన్/కైలాస్‌నగర్: ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన ఈ సంఘటనపై ఎస్ఐ సురేందర్ రెడ్డి కథనం ప్రకారం.. కొండాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన నీరడి సుధాకర్ (43) కొండాపూర్‌లో వెటర్నరీ విభాగంలో సహాయకునిగా పని చే స్తున్నారు. బుధవారం పటాన్చెరు మండలం ఇస్నా పూర్ గ్రామం (248) పోలింగ్ బూత్‌లో ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చారు. ఈ క్రమంలో అర్ధరాత్రి గుండెపోటు రావడంతో సీపీఆర్ చేసి ప టాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే చెందినట్లు వెల్లడించారు. ఓటు వేయడానికి వచ్చి మృతి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ కాలనీకి చెందిన చంద్రగిరి రాజన్న (65) ఓటు వేసేందుకు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. క్యూలో నిల్చున్న సమయంలో కళ్లు తిరిగి కింద పడ్డాడు. వెంటనే స్థానికులు హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. -
ప్రస్తుతానికి ఓటర్ల నుంచి మంచి స్పందన ఉంది: CEO
-
హైదరాబాద్‌లో మందకొడిగా పోలింగ్.. సీఈవో వికాస్‌రాజ్ ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల స్పల్ప ఘటనలు మినహా తెలంగాణ వ్యాప్యంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సాధారణ ప్రజలతోపాటు రాజకీయ నాయకులు, సినీతారలు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివస్తున్నారు. ఓటేసేందుకు ఉదయం నుంచే ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు ఇక గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రాష్ట్రవ్యాప్తంగా 36.68 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.80 శాతం నమోదు అయ్యింది. మహబూబ్‌నగర్‌లో 45 శాతం, కరీంనగర్ 40.73, ఆదిలాబాద్ 41.88, గద్వాల్ 49.29, ఖమ్మం 42 శాతం, మంచిర్యాల 42.74 శాతం, మహబూబాబాద్ 48 శాతం, కామారెడ్డి 41 శాతం పోలింగ్ నమోదైంది. ఇక హైదరాబాద్‌లో అత్యల్పంగా కేవలం 20.79 శాతం పోలింగ్ నమోదవడం ఓటింగ్‌పై నగర ఓటర్ నిరాసక్తతను వెల్లడిస్తోంది. ఓటింగ్‌పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో)వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తిన కొన్ని చోట్ల ఈవీఎంలు మార్చినట్లు చెప్పారు. అర్బన్ ఏరియాల్లో పోలింగ్ నెమ్మదిగా కొనసాగుతోందని తెలిపారు. నగర ఓటరు ఇండ్లను వీడి పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని సూచించారు. మధ్యాహ్నం నుంచి వేగం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కొన్నిచోట్ల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు వచ్చాయని వాటిపై విచారణ చేపట్టి కేసులు నమోదు చేస్తామన్నారు. చదవండి: తెలంగాణ ఎన్నికల పోలింగ్.. లైవ్ అప్డేట్స్ -
రేవంత్ రెడ్డి సోదరుడి మీద కంప్లైంట్ రిసీవ్
-
కుటుంబ సమేతంగా వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్న సీఈవో వికాస్ రాజ్
-
ఆ వాహనాలకు GPSలు
-
నేడూ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ విధుల్లో నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి తమ ఓటు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని సంప్రదిస్తే, వారికి మంగళవారం కూడా అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ జిల్లాల ఎన్నికల అధికారులైన కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించలేదని పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సదరు ఉద్యోగి పేరుతో ఇంతకుముందు పోస్టల్ బ్యాలెట్ జారీ కాలేదని ధ్రువీకరించుకున్న తర్వాత వారికి పోస్టల్ బ్యాలెట్ అందజేసి, ఓట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటేసేందుకు అనుమతించాలని సీఈఓ తెలిపారు. ఒకవేళ ఉద్యోగి పేరుతో అప్పటికే పోస్టల్ బ్యాలెట్ జారీ అయితే మళ్లీ కొత్త పోస్టల్ బ్యాలెట్ జారీ చేయరాదని స్పష్టం చేశారు. గతంలో జారీ చేసిన పోస్టల్ బ్యాలెట్ ఏ జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారికి చేరిందో తెలియజేయాలని సూచించారు. ఉద్యోగిని ఎన్నికల విధుల కోసం అదే జిల్లాకు కేటాయించినా, ఇతర జిల్లాకు కేటాయించినా ఈ నిబంధనలను పాటించాలని తెలిపారు. ఉద్యోగులు పోస్టల్ ఓటు వేసేందుకు డ్యూటీ ఆర్డర్ కాపీతో తమ ఓటు ఉన్న నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిని కలవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ విషయమై ఉద్యోగ సంఘాలు పలుమార్లు సీఈఓకు విన్నవించాయి. బండి సంజయ్ కూడా ఈసీకి లేఖ రాశారు. -
తెలంగాణ ఎన్నికలు.. సీఈవో వికాస్‌రాజ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సీఈఓ వికాస్‌రాజ్ కీలక కామెంట్స్ చేశారు. బ్యాలెట్ ఓట్ల వివరాలను కూడా ఆయన వెల్లడించారు. ఈసారి బ్యాలెట్ ఓట్లు భారీగా పెరిగినట్టు తెలిపారు వికాస్ రాజ్. కాగా, రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై ఆదివారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో మాట్లాడుతూ.. శనివారం నాటికి 1,24,239 మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. గత శాసనసభ ఎన్నికల్లో మొత్తంగా 1,00,135 పోస్టల్ బ్యాలెట్లే నమోదుకాగా.. ఈసారి భారీగా పెరుగుతున్నాయి. ∙కొత్త ఓటర్ల కోసం ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ పూర్తయింది. ఈ ఏడాది 54.39 లక్షల కార్డులను ముద్రించారు. ఇంకా 3 లక్షల కార్డులను బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓ) ద్వారా పంపిణీ చేయాల్సి ఉంది. ∙ 119 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. అందులో 2,068 మంది పురుషులు, 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. ∙మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 31 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నాలుగు చొప్పున కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ∙ఎన్నికల్లో 1.85 లక్షల మంది పోలింగ్ సిబ్బంది, 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. బీఎల్ఓలను కలుపుకొంటే మొత్తం 2.5లక్షల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల బందోబస్తు కోసం 45వేల మంది రాష్ట్ర పోలీసులు, 3 వేల మంది అటవీ, ఎక్సైజ్‌శాఖ సిబ్బందితోపాటు 50 కంపెనీల టీఎస్ఎస్పీ, 375 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించనున్నారు. ∙కర్ణాటక, ఏపీ, మహారాష్ట్రల నుంచి 5 వేల మంది చొప్పున, మధ్యప్రదేశ్, తమిళనాడుల నుంచి 2 వేల చొప్పున, ఛత్తీస్‌గఢ్ నుంచి 2,500 మంది కలిపి.. మొత్తంగా 23,500 మంది హోంగార్డులు రాష్ట్ర ఎన్నికల బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. -
డీఏపై నిర్ణయం రాలేదు!
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు, రుణ మాఫీ పథకాలకు నిధుల విడుదల, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) మంజూరుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయంవెలువడాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ చెప్పారు. తమను ఈసీ కోరిన వివరణలను పంపించామని తెలిపారు. గురువారం బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటరు గుర్తింపు కార్డులు, స్లిప్పుల పంపిణీ ‘ఈ ఏడాది 51 లక్షల ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించామని, పోస్టు ద్వారా వీటి పంపిణీ చివరి దశకు చేరుకుంది. గురువారం నాటికి 86 శాతం అనగా 2.81 కోట్ల ఓటర్లకు ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పులను పంపిణీ చేశాం. శనివారంలోగా మిగిలిన స్లిప్పుల పంపిణీ పూర్తి చేస్తాం. ఓటర్లకు అవగాహన కోసం ఓటర్ గైడ్ బుక్, సీ–విజిల్‌పై కరత్రాలను సైతం పంపిణీ చేశాం. 4,70,287 పోస్టల్ బ్యాలెట్ పత్రాలు, 8,84,584 ఈవీఎం బ్యాలెట్ పత్రాలను ముద్రించాం. టెండర్ ఓట్లు, చాలెంజ్ ఓట్లను సేకరించడం కోసం అధిక సంఖ్యలో ఈవీఎం బ్యాలెట్ పత్రాలు ముద్రించాం. ఇప్పటివరకు 32,730 మంది ఎన్నికల సిబ్బంది, 253 మంది అత్యవసర సేవల ఓటర్లు ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటేశారు. బుధవారం నాటికి 9,386 మంది వయోజన ఓటర్లు, 522 మంది దివ్యాంగులు ఇంటి నుంచే ఓటేశారు. 9,813 మంది సర్వీసు ఓటర్లు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్‌ను డౌన్లోడ్ చేసుకోగా, గురువారం నాటికి 275 మంది ఓటేసి వాటిని తిరిగి పంపించేందుకు తపాలా శాఖలో బుకింగ్ చేశారు..’అని సీఈఓ వెల్లడించారు. గడువులోగా ఫామ్ 12డీ సమర్పించినా తమకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించలేదని పలువురు జర్నలిస్టులు చెప్పగా..పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి రౌండ్‌కు పరిశీలకుడి నిర్ధారణ ‘ఈసారి ప్రతి శాసనసభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పరిశీలకుడి సమక్షంలో జరగనుంది. ప్రతి రౌండ్ లెక్కింపును పశీలకుడు నిర్ధారించిన తర్వాతే తదుపరి రౌండ్‌కి వెళ్తారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో 14+1 టేబుళ్లను ఏర్పాటు చేసి ఓట్లను లెక్కిస్తారు. 500కి మించి పోలింగ్ కేంద్రాలున్న 6 కేంద్రాల్లో మాత్రం టేబుళ్ల సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా, 29న పోలింగ్ సిబ్బంది డిస్త్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈవీఎంలను తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళతారు. జీపీఎస్ ద్వారా వాహనాల ట్రాకింగ్ రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో 299 అనుబంధ పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో మొత్తం 59,779 బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నాం. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉన్న ఓ పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా నాలుగు బ్యాలెట్ యూనిట్లను వాడుతుండగా, మరికొన్ని చోట్ల రెండు, మూడు బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నాం. ఈవీఎంలను తరలించే వాహనాలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తాం..’అని సీఈఓ వివరించారు. ఆ నగదు ఎవరిదో దర్యాప్తులో తేలుతుంది ‘హైదరాబాద్‌లో రూ.కోట్లలో పట్టుబడిన నగదు ఏ పార్టీకి చెందిందో అన్న అంశం పోలీసుల దర్యాప్తులో తేలుతుంది. ఇప్పటివరకు రూ.669 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను జప్తు చేయగా, ఇందుకు సంబంధించి 10,106 ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి మరో 777 కేసులు పెట్టాం. పెద్ద ఎత్తున ఎన్నికల ప్రలోభాలను పట్టుకున్నాం. వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి ఏ రాజకీయ పార్టీ, అభ్యర్థి ముందుకు రావడం లేదు..’అని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటేయాలి ‘అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటేసేందుకు రావాలి. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, నిర్భయంగా, నైతికంగా, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. 40 వేల మంది రాష్ట్ర పోలీసు బలగాలు, 25 వేల మంది పొరుగు రాష్ట్రాల పోలీసు బలగాలు, 375 కంపెనీల కేంద్ర బలగాలను మోహరిస్తున్నాం. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తాం..’అని సీఈఓ తెలిపారు. అదనపు సీఈఓ లోకేశ్‌కుమార్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్, డిప్యూటీ సీఈఓ సత్యవాణి పాల్గొన్నారు. -
ఓటర్ల స్లిప్పుల పంపిణీ వేగంగా జరుగుతోంది: వికాస్ రాజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్‌కు చకచకా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ మొదలైంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలకు సిద్దమవుతున్నామన్నారు. తాజాగా వికాస్‌రాజ్ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో పోలింగ్ కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి ఫస్ట్ టైం హోం ఓటింగ్ నిర్వహిస్తున్నాం. మొత్తం 3 కోట్ల 26లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 9 లక్షలకు పైగా యంగ్ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లు 4లక్షలు, ఈవీఎం బ్యాలెట్లు 8 లక్షల 84వేలు ప్రింట్ అయ్యాయి. ఎపిక్ కార్డులు 51 లక్షలు ప్రింట్ అయ్యి దాదాపు పంపిణీ అయ్యింది. ముగ్గురు స్పెషల్ అబ్జర్వర్లు స్టేట్‌కు వచ్చారు. ప్రతీ కౌంటింగ్ సెంటర్‌కు ఒక అబ్జర్వర్ ఉంటారు. మూడు కేటగిరీల్లో హోం ఓటింగ్ జరుగుతోంది. 9300 మంది 80ఏళ్లు పైబడిన వాళ్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2కోట్ల 81లక్షల ఓటర్ స్లిప్‌ల పంపిణీ పూర్తి అయ్యింది. ఎల్లుండి వరకు ఓటర్ స్లిప్ పంపిణీ పూర్తి అవుతుంది. తెలంగాణలో మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 59వేల బ్యాలెట్ యూనిట్లు వాడుతున్నాం. రేపటి వరకు కమీషనింగ్ పూర్తి అవుతుంది. సీ విజిల్ యాప్ ద్వారా 6,600 ఫిర్యాదులు అందాయి. ఫ్లయింగ్ స్వ్కాడ్ వెహికిల్‌కు జీపీఎస్ ఉంటుంది. ప్రతీ సెగ్మెంట్‌కు మూడు ఎస్ఎస్టీ, ఫ్లయింగ్ స్వ్కాడ్స్ ఏర్పాటుచేశాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. తెలంగాణలో ఎన్నికల కోసం 377 కంపెనీల కేంద్ర బలగాలు పనిచేస్తున్నాయి. అర్బన్ ఏరియాల్లో ఓటింగ్ శాతం గతంలో తక్కువగా ఉంది. 3లక్షల మంది పోలింగ్ ప్రిపరేషన్లో పాల్గొంటున్నారు. డీఏ గురించి ప్రఫోజల్స్ వచ్చాయి. నిర్ణయం ECI ఇంకా తీసుకోలేదు. 64వేలు స్టేట్ పోలీసులు, 375కేంద్ర కంపెనీల నుంచి బలగాలు ఎన్నికల కోసం ఉన్నాయి. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ సమస్య లేదు. 114 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి’ అని తెలిపారు. -
416 ప్రకటనల్లో 15 మాత్రమే నిలిపివేశాం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రచారం కోసం సమర్పించిన ప్రకటనల్లో మూడు ప్రధాన పార్టీలకు సంబంధించి 15 ప్రకటనలు మాత్రమే నిలిపివేస్తూ ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. ప్రచార ప్రకటనల నిలిపివేతపై వస్తున్న వార్తలపై స్పందించిన సీఈవో మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఎన్నికల సంఘం నియమించిన ప్రకటనల పరిశీలన, అనుమతి కమిటీ మొత్తం 416 ప్రకటనలకు అనుమతినిచ్చిందని తెలిపారు. అనుమతించిన వాటిలో కొన్నింటి రూపురేఖలు మార్చడం, వక్రీకరించి తప్పుగా అన్వయించడం వంటివి జరిగినట్లు పేర్కొన్నారు. అనుమతి నిబంధనలను ఉల్లంఘించి వాటిని ప్రసారం చేయడం అంటే ఆ స్ఫూర్తిని దెబ్బతీయడమేనని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రకటన తర్వాత అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఆయా రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకోవడానికి రాష్ట్ర స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి మంజూరు చేస్తుందని, వాటిని యథాతథంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే రాజకీయ పార్టీలు ముందుగా తగిన అనుమతి పొందని ప్రకటనలను యూట్యూబ్‌తో పాటు ఇతర వేదికలలో కూడా ప్రచారం చేస్తున్నట్లు ఎన్నికల సంఘం దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిపై ఎన్నికల సంఘం ఈనెల 8, 9, 10 తేదీల్లో వివిధ రాజకీయ పార్టీలతో మూడు సమావేశాలు నిర్వహించిందని, ఈ సమావేశాల్లో ప్రచార, ప్రచార అనుమతి (ధ్రువీకరణ/ సర్టిఫికేషన్) పొందడానికి మార్గదర్శకాలను క్షుణ్ణంగా వివరించామన్నారు. అదే విధంగా అనుమతుల్లేని ప్రకటనల ద్వారా తలెత్తే సమస్యలను కూడా తెలిపామన్నారు. ఎన్నికల సంఘం సూచనలను, మార్గదర్శకాలను అనుసరిస్తామని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల సంఘం అనుమతి పొందాల్సిందే రాజకీయ పార్టీలు విడుదల చేసే ప్రకటనలను ప్రసారం చేయడానికి ముందు ధ్రువీకరణ పొందిన ప్రకటనలేనా కాదా అనేది మీడియా సరిచూసుకోవాలని కోరింది. ఎన్నికల నియమావళి ప్రకారం అనుమతి పొందని అంశాల ప్రసారాలను నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని వికాస్‌రాజ్ తెలిపారు. రాజకీయ పార్టీలు విడుదల చేసే ప్రకటనలకు అనుమతి ధ్రువీకరణ ఇవ్వడం అనేది నిరంతర ప్రక్రియని వివరించారు. ఏ రాజకీయ పార్టీ అయినా, అభ్యర్థి అయినా రాష్ట్ర, జిల్లా స్థాయిలో అనుమతి ధ్రువీకరణ కోసం మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీకి ప్రకటనలను పంపుకోవచ్చునని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఉపసంహరించిన ప్రకటనలు ఇలా.... బీజేపీ డబుల్ బెడ్రూం, దొంగ చేతికి తాళం, రైతు, నేతి బీరకాయ, పేనుకు పెత్తనం బీఆర్ఎస్ దేఖ్ లేంగే (తెలుగు పాట), మొదటి ఓటు ఎవరికి (వీడియో ప్రకటన), రైతుల అండదండ– కేసీఆర్ (వీడియో ప్రకటన), కల్యాణలక్ష్మి కాంగ్రెస్ కారు (30 సెకన్లు), జాబ్ (15 సెకన్లు), రైతు (40 సెకన్లు), రైతు (30 సెకన్లు), రైతు (15 సెకన్లు), రైతు (15 సెకన్లు) -
తప్పులుంటే చెప్పండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల అఫిడవిట్లలో తప్పులుంటే అభ్యర్థులకు తెలియజేసి సరిదిద్దేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్‌కు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై సీఈఓ వికాస్‌రాజ్ బుధవారం తన కార్యాలయంలో గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలతో సమావేశమై చర్చించారు. సమావేశం అనంతరం ఆయా పార్టీల ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. 43లక్షల మంది ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేశామని, మరో 7లక్షల కార్డుల పంపిణీ చేయాల్సి ఉందని సీఈఓ తెలిపినట్టు వెల్లడించారు. అనుబంధ ఓటర్ల జాబితాను ఈ నెల 10న ప్రకటిస్తామని సీఈఓ తెలిపారన్నారు. ఆ అధికారులను తప్పించాలి: కాంగ్రెస్ నాగర్‌కర్నూల్‌జిల్లా పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ నేతలపై కేసులు పెడుతున్నారని, అక్కడి డీఎస్పీ, ఇతర పోలీసు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఫిర్యాదు చేసినట్టు టీపీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్, మల్లు రవి తెలిపారు. హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి నామినేషన్ పత్రాలను నింపడంలో అభ్యర్థులకు సహకరించాలని కోరామన్నారు. సీఈఓ కార్యాలయం నుంచి ఉన్నత స్థాయి అధికారులు ఫోన్ చేసినా క్షేత్ర స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నికల పరిశీలకుల వివరాలను సీఈఓ కార్యాలయ వెబ్సైట్లో పొందుపర్చాలని సూచించారు. రేవంత్‌పై చర్యలు తీసుకోవాలి: బీఆర్ఎస్ అభ్యర్థుల బీ–ఫారాలను చాలా యాంత్రికంగా తిరస్కరిస్తున్నారని బీఆర్ఎస్ లీగల్ సెల్ నేత సోమా భారత్ తెలిపారు. చిన్న చిన్న పొరపాట్లు జరిగినా ఎన్నికల సంఘం సరిగ్గా పనిచేయడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోందని తప్పుబట్టారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మహిళల ముందే బూతులు మాట్లాడారని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామన్నారు. రేవంత్‌కి భాష తెలియకపోతే తన భార్య, పిల్లల వద్ద నేర్చుకోవాలన్నారు. చర్యలు తీసుకోకపోతే ఎన్నికలు ఆపండి: బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని, వాళ్లపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ లీగల్‌సెల్ నేత ఆంథోని రెడ్డి అన్నారు. చర్యలు తీసుకోకుంటే ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిసి ఎన్నికలను నిలుపుదల చేయాలని కోరుతామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి, కేటీఆర్‌లు అభ్యంతరకర భాషలో మాట్లాడకుండా నియంత్రించాలని కోరామన్నారు. పరిశీలనకు నలుగురికి అనుమతి నామినేషన్ల పరిశీలనలో ఒక్కో అభ్యర్థి తరఫున నలుగురు వ్యక్తులను మాత్రమే అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. ఎన్నికల ఏజెంట్, ప్రపోజర్, మరో వ్యక్తితో కలసి పరిశీలన ప్రక్రియలో పాల్గొనేందుకు గాను అభ్యర్థి ముందుగా రాతపూర్వకంగా ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఏర్పాట్లపై బుధవారం ఆయన తన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై అవగాహన కల్పించారు. నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించిన దరఖాస్తులను అభ్యర్థులు స్వయంగా గాని, తనను ప్రతిపాదించిన వ్యక్తి/ఎన్నికల ఏజెంట్ ద్వారా రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థి స్వయంగా రాని పక్షంలో, తనను ప్రతిపాదించిన వ్యక్తి/ ఎన్నికల ఏజెంట్‌కి అధికారం ఇస్తున్నట్టు రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి 9 రోజుల్లోగా 40 మందికి మించకుండా స్టార్ క్యాంపైనర్ల జాబితాను రాజకీయ పార్టీలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రచార అనుమతుల కోసం సువిధ పోర్టల్‌ను వినియోగించాలన్నారు. సగానికి పైగా ఫిర్యాదులు వాస్తవమే: ఈ నెల 10 నుంచి బీఎల్ఓల ద్వారా ఓటరుఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ ప్రారంభిస్తామని వికాస్ రాజ్ తెలిపారు. కోడ్ ఉల్లంఘనలపై సీ–విజిల్ యాప్ ద్వారా 3205 ఫిర్యాదులు అందగా, 1961 ఫిర్యాదులు వాస్తవమేనని తేలిందన్నారు. -
ప్రగతి భవన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్ సీఎం అధికారిక భవనం. అయినప్పటికీ.. అందులో బీఆర్ఎస్ తన కార్యక్రమాలు నిర్వహిస్తుస్తోంది అని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యల్లో భాగంగా అధికారులు గురువారం సుదీర్ఘంగా చర్చించారు. గురువారం సాయంత్రం సీఈవో వికాస్ రాజ్‌తో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ భేటీ అయ్యారు. ఈ ఫిర్యాదులో ఎవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై చర్చలు జరిపారు. చివరకు.. ప్రగతి భవన్ నిర్వహణ అధికారులు నోటీసులు పంపారు. క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి -
రాజకీయ పార్టీలతో సీఈఓ వికాస్ రాజ్ సమావేశం
-
కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ నుంచి డబ్బు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఓటర్లకు ఎరవేసేం దుకు కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి భారీగా డబ్బులను తరలిస్తున్నారని, ఆయా రాష్ట్రాల సరిహ ద్దుల వెంట పటిష్ట నిఘా ఉంచి కట్టడి చేయాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమభరత్ కుమార్ ఎన్నికల అధికారులను కోరారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్ రాజ్ మంగళ వారం తన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతి నిధులతో సమావేశమై వారి అభి ప్రాయాలు, సూచ నలను సేకరించారు. అనంతరం ఆయా పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. సోమ భరత్ మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలతో కొందరు చెలరేగి పోతున్నారని, అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాలెట్‌పై రాజకీయ పార్టీల గుర్తులను వృద్ధులు సులువుగా గుర్తు పట్టేలా చర్యలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రాల్లో సరైన వెలుతురు సదుపాయం కల్పించాలన్నారు. ప్రగతిభవన్‌లో బీ–ఫారాల పంపిణీపై విచారణకు ఆదేశం.. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బీ–ఫార్మ్‌లు పంపిణీ చేయడాన్ని ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పరిగణించి చర్యలు తీసుకోవాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్య క్షులు జి.నిరంజన్ ఫిర్యాదు చేశారు. ప్రగతిభవన్ పబ్లిక్ ప్రాపర్టీ అని, అక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు తావు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుతో కేంద్ర ఎన్నికల సంఘం విచా రణకు ఆదేశించిందన్నారు. అక్టోబర్ 4న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాకు తోడుగా త్వరలో అనుబంధ ఓటర్ల జాబితాను సైతం ప్రచురిస్తామని సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారన్నారు. ఓటర్లుగా దర ఖాస్తు చేసుకోవడానికి ఇప్పటికీ అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఎన్ని కల నిబంధనలపై సరైన అవగాహన లేదన్నారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమ తుల జారీపై స్వయంగా ఎన్నికల సంఘమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాంపల్లి నియోజక వర్గంలో బోగస్ ఓట్లను తొలగించాలని కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ కోరారు. సజావుగా ఎన్నికలు జరిపేందుకు నియోజకవర్గంలో కేంద్ర బలగాలను దింపాలని సూచించారు. ఆ అధికారులను బదిలీ చేయాలి.. బీజేపీ బీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికా రులను బదిలీ చేయాలని బీజేపీ నేత అంథోని రెడ్డి కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికల పరిశీలకు లను, కేంద్ర బలగాలను దించాలని సూచించారు. మునుగోడులో జప్తు చేసిన డబ్బు ఏమైంది? ఇటీవల ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నరసింహా రావు కోరారు. మునుగోడు ఉప ఎన్నికల్లో జప్తు చేసిన డబ్బులను ఏం చేశారని ప్రశ్నించారు. పోలింగ్‌కు 5 రోజుల ముందు ఓట ర్లందరికీ స్లిప్పులు జారీ చేయాలని సూచించారు. బోగస్ ఓట్లను తొలగించాలని, అక్రమ డబ్బు తరలింపును కట్టడి చేయాలని టీడీపీ నేత సతీష్ సూచించారు. ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రంలో మద్యం విక్రయా లను నిషేధించాలని, ఓటును ఆధార్‌కార్డుతో అనుసంధానం చేయాలని ఆప్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్‌తో ఎన్నికలు జరపాలని ప్రజాశాంతి పార్టీ కోరింది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు అధికారులపై సీఈఓకి ఫిర్యాదు చేసినట్టు బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దయానంద్ రావు తెలిపారు. అలాగే పాతబస్తీలో బోగస్ ఓట్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కోరామన్నారు. -
Telangana: రాష్ట్ర ఓటర్లు 3,17,17,389
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్ల జాబితా సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,17,17,389 కాగా, ఇందులో 1,58,71,493మంది పురుషులు, 1,58,43,339మంది మహిళలు, 2557 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ చేపట్టారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలతుదిఓటర్ల జాబితాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానఅధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ బుధవారం ప్రకటించారు. 2023 జనవరితో పోల్చితే తుది ఓటర్ల జాబితాలో మొత్తం 5.8 శాతం ఓటర్లు పెరిగారు. రాష్ట్రంలో 15,338 మంది సర్వీసు ఓటర్లు, 2780 మంది ప్రవాస ఓటర్లున్నారు. 18–19 ఏళ్ల వయసు గల 5,32,990 మంది యువఓటర్లు కొత్తగా నమోదు చేసుకున్నారు. దీంతో 18–19 ఏళ్ల వయస్సు గల ఓటర్ల సంఖ్య 8,11,640కి చేరింది. దీంతో జాబితాలో యువ ఓటర్ల శాతం 2.56 శాతానికి పెరిగింది. కొత్త ఓటర్లు 17,01,087 మంది ఓటర్ల జాబితా రెండో సవరణలో చివరి గడువు సెప్టెంబర్ 19 నాటికి 57,617 దరఖాస్తులను పరిష్కరించామని, త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో అర్హులైన వారికి ఓటుహక్కు కల్పించామని సీఈఓ వికాస్‌రాజ్ ప్రకటించారు. కొత్తగా 17,01,087 మంది ఓటర్లు జాబితాలో చోటు పొందగా, 6,10,694 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. 5,80,208 మంది ఓటర్లు పేరు, ఇతర వివరాలు సరిదిద్దుకోవడం లేదా కొత్త చిరునామాకు ఓటు బదిలీ చేసుకున్నారు. స్త్రీ, పురుష ఓటర్ల మధ్య లింగ నిష్పత్తి 992 నుంచి 998కి మెరుగు పడిందని సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. 18–19 ఏళ్ల వయసు గల ఓటర్ల మధ్య లింగ నిష్పత్తి 707 నుంచి 743కి మెరుగైందన్నారు. 80 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 43,943కి, దివ్యాంగ ఓటర్ల సంఖ్య 5,06,493కి, థర్డ్‌జెండర్ ఓటర్ల సంఖ్య 2557కి పెరిగిందన్నారు. ఓటర్ల నమోదుకుఇంకా అవకాశం కొత్త ఓటర్ల నమోదు నిరంతరంగా కొనసాగుతుందని, 2023 అక్టోబర్ 1తో 18 ఏళ్లు నిండిన వారు, గతంలో దరఖాస్తు చేసుకోనివారు దరఖాస్తు చేసుకోవచ్చని సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. నామినేషన్ల దాఖలుకు 10 రోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకుంటే, అర్హులకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పిస్తామన్నారు. https://voters.eci.gov.in/ వెబ్సైట్/ఓటర్ హెల్ప్‌లైన్ యాప్/బీఎల్ఓ ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని, తమ పోలింగ్‌స్టేషన్, పేరు, ఇతర వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఓటర్ల జాబితాలో పొరపాట్లు ఉంటే ఫారం–8 దరఖాస్తు ఆన్లైన్/ యాప్/బీఎల్ఓ ద్వారా సమర్పించాలని సూచించారు. ఏమైనా ఫిర్యాదులుంటే ఓటరు హెల్ప్‌లైన్ నంబర్ 1950కి సంప్రదించాలన్నారు. 4లక్షల ఓటర్ల చిరునామాలు మార్పు ఒకే ఇంట్లో 6 కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే స్వయంగా ఇళ్లకు వెళ్లి ఓటర్లను ధ్రువీకరించే కసరత్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా 4,15,824 మంది ఓటర్ల చిరునామాలు సవరించారు. 3,94,968 మంది ఓటర్లను ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో కేంద్రానికి, 64,661 మంది ఓటర్లను ఒక అసెంబ్లీ స్థానం నుంచి మరో స్థానానికి బదిలీ చేశారు. ఈఆర్వో నెట్ ద్వారా 73,364 మంది ఓటర్ల చిరునామాలు, ఇళ్ల నంబర్లు సవరించారు. 4605 బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో 757 బృందాలు తనిఖీ చేసి కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణకు 50,907 దరఖాస్తులు స్వీకరించి వారికి ఓటుహక్కు కల్పించాయి. రెండేళ్లలో 22 లక్షల ఓటర్ల తొలగింపు ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా గత రెండేళ్లలో 22,02,168 మంది చనిపోయిన, డూప్లికేట్, వలస పోయిన ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఇందులో 4,89,574 మంది ఓటర్లు జీహె< చ్ఎంసీ పరిధిలోని వారే. ఈ ఏడాది 2,47,756 మంది చనిపోయిన ఓటర్లను తొలగించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనకు తీవ్రంగా శ్రమించామని, 14,24,694 ఓటర్ల వివరాలను సవరించామని సీఈఓ తెలిపారు. అప్పుడు ఓటర్లు ఇలా... గత ఆగస్టు 21న ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 1,53,73,066 మంది పురుషులు, 1,52,51,797 మంది మహిళలు, 2,133 మంది థర్డ్ జెండర్లు మొత్తం కలిపి రాష్ట్రవ్యాప్తంగా 3,06,42,333 ఓటర్లు ఉన్నారు. మరో 2,742 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 15,337 మంది సర్వీసు ఓటర్లు ముసాయిదాలో ఉన్నారు. 18–19 వయస్సు కలిగిన యువ ఓటర్ల సంఖ్య 4,76,597. ఓటర్ల జాబితా తొలి ప్రత్యేక సవరణ కార్యక్రమం 2023లో భాగంగా గత జనవరి 5న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో మొత్తం 2,99,77,659 మంది ఓటర్లు ఉండగా, రెండో సవరణ నాటికి 3,17,32,727 మందికి పెరిగారు. -
Telangana: ఎన్నికలకు సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర శాసన సభ ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నామని, ఇందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. గత మే 23 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యే క సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించామని, మరో వారంలో తుది జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈవీఎంలన్నింటికీ ప్రాథమిక స్థాయి తనిఖీలతోపాటు అన్ని జిల్లాల్లో ఎన్నికల శిక్షణ కార్యక్రమాలను సైతం పూర్తి చేశామన్నారు. శాసనసభ ఎన్నికల కవరేజీ కోసం బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన వెంటనే రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరించి పరిశీలిస్తారని, బ్యాలెట్ పత్రాల ముద్రణ తర్వాత ఈవీఎంలకు ద్వితీయస్థాయి తనిఖీల(ఎస్ఎల్ఎఫ్)ను నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్ నిర్వహిస్తారన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెల తొలి వారంలో వచ్చే అవకాశం ఉందా? అని విలేకరులు ప్రశ్నించగా, షెడ్యూల్‌ను ఈసీ ప్రకటిస్తుందని బదులిచ్చారు. జిల్లాల్లో చురుగ్గా ఏర్పాట్లు అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన తర్వాత జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటుందని వికాస్‌రాజ్ చెప్పారు. ఈవీఎంల పంపిణీ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులను గుర్తించి శిక్షణ ఇస్తామని తెలిపారు. నిబంధనల మేరకు ర్యాంపులు, విద్యుదీకరణ, టాయిలెట్లు వంటి కనీస సదుపాయాలు ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఉన్నాయా? లేవా? అని పరిశీలించామని, సదుపాయాలను కల్పించే ప్రక్రియ చివరి దశకు చేరుకుందన్నారు. కేంద్ర బలగాలకు వసతి, రవాణా సదుపాయాలు కల్పించడంతోపాటు ఎంత మందిని సమస్యాత్మక ప్రాంతాల్లో నియమించాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 6.99 లక్షల మంది యువ ఓటర్లు గత జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 15 లక్షల మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరారని, వీరిలో 6.99 లక్షల మంది 18–19 ఏళ్ల యువ ఓటర్లు ఉన్నారని వికాస్‌రాజ్ తెలిపారు. లక్ష మంది దివ్యాంగ ఓటర్లను గుర్తించామన్నారు. 80 ఏళ్లుపైబడిన, దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుంచే బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వచ్చే నెల 3 నుంచి 5 వరకు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్ కమిషన్ పర్యటించనుందని ఆయన తెలిపారు. కమిషన్ రాజకీయ పార్టీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీఎస్, డీజీపీ, 20కి పైగా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తుందని వివరించారు. దర్యాప్తు సంస్థల నుంచి ఇప్పటికే నివేదికలు తమకు అందుతున్నాయన్నారు. ఓటరు నమోదు కోసం.. ఓటర్ల జాబితాతో సహా ఇతర అంశాలపై తమకు చాలా ఫిర్యాదులు అందాయని, ప్రతి ఫిర్యాదుపై సమగ్రంగా విచారణ జరిపి ఫిర్యాదుదారులకు సైతం నివేదిక ప్రతిని అందజేస్తున్నామని వికాస్‌రాజ్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 700 బృందాలు నాలుగు వేలకు పైగా ఇళ్లను సందర్శించి చిరునామా మారిన ఓటర్ల తొలగింపును చేపట్టారని తెలిపారు. నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు సీఈఓలు సర్ఫరాజ్ అహ్మద్, లోకేష్‌కుమార్, సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, జాయింట్ సీఈఓ సత్యవాణి పాల్గొన్నారు. -
తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఈసీ సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఈసీ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల మంది ఓటర్లుగా చేరారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 3.38 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించామని వెల్లడించారు. వచ్చే నెల 3,4,5 తేదీల్లో తెలంగాణలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తుందని తెలిపారు. ఈ పర్యటనలో దాదాపు 20 ఏజెన్సీలతో సమావేశాలు ఉంటాయని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. తుది ఓటర్ల జాబితా తర్వాత జిల్లాల్లో సిబ్బందికి శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఈవీఎంల చెకింగ్ జరుగుతోందని తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. అధికారిక పార్టీ పూర్తి అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. కాంగ్రెస్, బీజేపీ కూడా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తున్నాయి. ఇదీ చదవండి: మీడియా కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్ నేతల రచ్చ -
ఓటర్ల నమోదుకు కొత్త వెబ్సైట్
సాక్షి, హైదరాబాద్: కొత్త ఓటర్ల నమోదు, వివరాల మార్పు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం వినియోగిస్తున్న నేషనల్ ఓటర్ పోర్టల్ సర్వీస్(ఎన్వీపీఎస్) వెబ్‌సైట్‌కి బదులు ‘ఓటర్స్’పేరుతో కొత్త వెబ్సైట్ ( https:// www.voters.eci.gov.in )ను అందుబాటులోకి తెచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, జాబితా నుంచి పేరు తొలగింపు, చిరునామా మార్పు వంటి అవసరాలకు 6, 6ఏ, 7, 8 వంటి ఫారాలను వినియోగిస్తూ ఇకపై కొత్త వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, పాత వెబ్సైట్ ఇక పనిచేయదని సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత విశిష్ట రిఫరెన్స్ నంబర్‌ను ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా దరఖాస్తుదారులకు పంపిస్తామన్నారు. ఈ నంబర్ ద్వారా దరఖాస్తు స్థితిగతులను తెలుసుకోవచ్చు అన్నారు. కొత్త పోర్టల్ ద్వారా ఓటర్ల జాబితాను పరిశీలించవచ్చని, ఓటరుగుర్తింపు కార్డుకోసం, ఓటరు కార్డులో మార్పులకోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఓటరు ఏ పోలింగ్ బూత్, శాసనసభ, పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాడు అన్న వివరాలు సైతం తెలుసుకోవచ్చు అని వెల్లడించారు. పోలింగ్ బూత్ స్థాయి అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో)ల వివరాలను సైతం తెలుసుకోవచ్చని తెలిపారు. -
TS: రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 2,99,74,919
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాధారణ ఓటర్లు 2,99,74,919 మంది ఉన్నారు. కొత్తగా ఓటర్ల జాబితాలో చోటు పొందిన యువ ఓటర్లు 2,78,650 మంది ఉండటం విశేషం. వార్షిక ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం(ఎస్ఎస్ఆర్)–2023లో భాగంగా ఈ మేరకు తుది ఓటర్ల జాబితాను గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు. సాధారణ ఓటర్లకు ఎన్ఆర్ఐ ఓటర్లు 2,740 మంది, సర్వీసు ఓటర్లు (కేంద్ర సాయుధ బలగాలు) 15,282 మంది కలిపితే మొత్తం ఓటర్ల సంఖ్య 2,99,92,941కు చేరనుంది. రాష్ట్రంలో ఈ ఏడాది జరగాల్సిన శాసనసభ ఎన్నికలను ఈ జాబితాతోనే నిర్వహించనున్నారు. ఓటర్ల నమోదు నిరంతర కార్యక్రమం కావడంతో ఎన్నికల ప్రకటన నాటికి జాబితాలో స్థానం పొందే కొత్త ఓటర్లకు సైతం ఓటు హక్కును కల్పించనున్నారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ సాయంతో... వార్షిక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం–2022లో భాగంగా గతేడాది జనవరిలో ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,03,56,894 మంది ఓటర్లు ఉండగా, తాజాగా ప్రకటించిన 2023 వార్షిక ఓటర్ల జాబితాలో ఓటర్ల సంఖ్య 2,99,74,919కి తగ్గింది. గతేడాది తుది ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత నిరంతర నవీకరణ చేపట్టారు. ఒకే తరహా ఫొటోలు కలిగిన ఓటర్లను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో గుర్తించి తొలగించారు. మొత్తం 11,36,873 ఓటర్లను తొలగించగా, కొత్తగా 3,45,648 ఓటర్లను చేర్చారు. దీంతో ఓటర్ల జాబితా సవరణ 2023లో భాగంగా గత నవంబర్ 9న ప్రకటించిన ముసాయిదా జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,95,65,669కు తగ్గింది. ఆ తర్వాత కొత్తగా 6,84,408 మందికి చోటు కల్పించగా, 2,72,418 మంది ఓటర్లను తొలగించారు. దీంతో తాజాగా ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో సాధారణ ఓటర్ల సంఖ్య 2,99,74,919కి తగ్గింది. నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో... మారుమూల గిరిజన ప్రాంతంలో ఓటర్ల నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ఈ ఏడాది 2,800 మంది గిరిజనులు తొలిసారిగా ఓటు హక్కును పొందారు. 361 గిరిజన ఆవాస ప్రాంతాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహించి కొలామ్స్, తోటి, చెంచులు, కండారెడ్డి తెగల గిరిజనులకు ఓటు హక్కు కల్పించారు. సదరం డేటాబేస్, ఆసరా పెన్షన్ల సమాచారాన్ని వికలాంగ ఓటర్ల నమోదుకు వినియోగించారు. ముందస్తుగా ఓటర్ల నమోదులో భాగంగా 17 ఏళ్లు నిండిన 20,246 మంది యువతీయువకుల నుంచి సైతం దరఖాస్తులు స్వీకరించారు. వీరికి 18 ఏళ్లు నిండిన తర్వాత ఓటర్ల జాబితాలో చేర్చనున్నారు. ఇంకా నమోదు చేసుకోవచ్చు: సీఈఓ వికాస్ రాజ్ ఓటర్ల నమోదు నిరంతర కార్యక్రమమని, తుది జాబితాలో చోటుపొందని వారు మళ్లీ దరఖాస్తు చే సుకోవచ్చు. ఎన్వీఎస్పీ వెబ్‌పోర్టల్, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ లేదా తమ దరఖాస్తును స్థానిక బీఎల్ఓకు అందజేస్తే అర్హులకు ఓటు హక్కు కల్పిస్తాం. -
ఓటరు జాబితా సవరణకు 8.67 లక్షల దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఓటరు జాబితా సవరణ కోసం 8.67 లక్షల దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) వికాస్‌రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 8వ తేదీతో గడువు ముగిసిందని, ఆ తర్వా త వచ్చిన దరఖాస్తులను తుదిజాబితా ప్రచురించిన తర్వాత పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అర్హులైన యువత ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకునేవిధంగా పకడ్బందీగా చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలోని 1,700 కళాశాలల్లో ఉన్న 18–19 ఏళ్ల వయసువారిని లక్ష్యంగా చేసుకుని ఎలక్షన్ లిటరసీ క్లబ్(ఈఎల్‌సీ)లను ఏర్పాటు చేశామని, క్యాంపస్ అంబాసిడర్లను నియమించడంతోపా టు విద్యార్థులందరికీ ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపామని తెలిపారు. గిరిజనుల కోసం ప్రత్యేక క్యాంపెయిన్ చేపట్టామని, రాష్ట్రంలోని 361 గిరిజన ఆవాసాల్లో గల కొ లం, తోటి, చెంచు, కొండరెడ్డి తెగలకు చెందిన 2,500 మంది నుంచి దరఖాస్తులను స్వీకరించామని పేర్కొన్నారు. విక లాంగ ఓటర్ల కోసం పింఛన్ డేటాతోపాటు సదరం వివరాలు తీసుకున్నామని తెలిపారు. పట్టణప్రాంతాల్లో ఓటరు నమోదు కోసం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఆస్తిపన్ను చెల్లిస్తున్నవారి కి ఎస్ఎంఎస్లు పంపించామని, వీధి నాటకాల ద్వారా అ వగాహన కల్పించేందుకు ప్రయత్నించామని, పట్టణ ప్రాంతాల్లో ఉండే పారిశుధ్య వాహనాల ద్వారా ఆడియో సందేశాలు పంపామని తెలిపారు. ఈ నెల 8లోపు వచ్చిన దర ఖాస్తులను 26 వ తేదీలోపు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. జనవరి 5న తుది ఓటరుజాబితా అక్టోబర్ 1 వ తేదీ తర్వాత 8.67 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 5.66 లక్షల ఫాం–6, 1.83 లక్షల ఫాం–7, 1.17 లక్షల ఫాం–8 దరఖాస్తులున్నాయని వికాస్‌రాజ్ తెలిపారు. ఆన్‌లైన్‌తోపాటు కొన్ని దరఖాస్తులను నేరుగా బీఎల్వోలు, ఏఈఆర్వోలు, ఈఆర్వోలకు ఇచ్చారని, వాటిని డిజిటలైజ్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. అక్టోబర్–1 నుంచి నవంబర్–9 వరకు వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించి వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు. కాగా, మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో వచ్చిన ఓటరు నమోదు, అభ్యంతరాలను డిసెంబర్ 30లోపు పరిశీలించి పరిష్కరిస్తామని వికాస్‌రాజ్ వెల్లడించారు. -
11,36,873 మంది తొలగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 11,36,873 మంది ఓటర్లను తొలగించారు. కొత్తగా మరో 3,45,648 మందికి ఓటర్ల జాబితాలో చోటు కల్పించారు. ఈ ఏడాది జనవరి 5న ప్రక టించిన ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,03,56,894 మంది సాధారణ ఓటర్లుండగా.. తాజా తొలగింపులు, చేరికల అనంతరం మొత్తం ఓటర్ల సంఖ్య 2,95,62,932కి తగ్గింది. వార్షిక ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2023లో భాగంగా ఈ మేరకు ముసాయిదా ఓటర్ల జాబితా వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ గురువారం విడుదల చేశారు. డిసెంబర్ 8వరకు ఓటర్ల నమోదుకు అవకాశం ముసాయిదా జాబితాలో 1,48,58,887 మంది పురుషులు, 1,47,02,391 మంది మహిళలు, 1,654 మంది ట్రాన్స్‌జెండర్లున్నారు. 2,737 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 15,067 మంది సర్వీసు ఓటర్లు కలిపితే మొత్తం ఓటర్ల సంఖ్య 2,95,80,736కు చేరింది. 18–19 ఏళ్ల వయస్సు కలిగిన యువ ఓటర్లు 83,207 మంది ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 8 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 5న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. -
డిసెంబర్ 30న ఎమ్మెల్సీ తుది ఓటర్ల జాబితా
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్– రంగారెడ్డి–హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల నమోదుకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 7 తర్వాత కూడా కొనసాగుతుందని సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 7తో దరఖాస్తుల స్వీకరణ ముగియగా, నవంబర్ 23న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉంది. ఆ తర్వాత నవంబర్ 23 నుంచి డిసెంబర్ 9 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులను స్వీకరించాలి. అయితే, ఈ నెల 7 నుంచి 23 మధ్య వ్యవధిలో సైతం కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించి డిసెంబర్ 30న ప్రకటించనున్న తుది ఓటర్ల జాబితాలో స్థానం కల్పిస్తామని వికాస్‌రాజ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. -
నిబంధనల ప్రకారమే మునుగోడు ఉపఎన్నిక
సాక్షి, హైదరాబాద్: దేశం దృష్టిని ఆకర్షించిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ ప్రకటించారు. నిబంధనల ప్రకారమే ఎన్నిక నిర్వహించామని స్పష్టం చేశారు. ఉప ఎన్నిక ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ రిటర్నింగ్ అధికారి సస్పెండ్ కావడం దేశ చరిత్రలో తొలిసారిగా మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా జరిగిందన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. వ్యక్తిగత స్థాయిలో కొందరు పొరపాట్లు చేసి దాని పర్యవసాలను అనుభవిస్తారన్నారు. 8న మునుగోడు ఉప ఎన్నిక కోడ్ ముగుస్తుందన్నారు. బీజేపీ ఆరోపణలు.. సీఈఓ వివరణ.. ఉప ఎన్నిక ఓట్లను 15 రౌండ్లలో లెక్కించగా, రౌండ్లవారీగా ఫలితాల ప్రకటనను కావాలనే జాప్యం చేస్తున్నారని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ విషయమై సీఈఓ వికాస్‌రాజ్‌కు ఫోన్ చేసి రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో ఆలస్యంపై ప్రశ్నించారు. దీనిపై సీఈఓ వికాస్‌రాజ్ స్పందించారు. అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేయడం వల్లే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు అధిక సమయం పట్టిందన్నారు. ఒక్కో రౌండ్లో ఓట్లను లెక్కించిన తర్వాత వాటిని చెక్చేయాల్సి ఉంటుందని, అభ్యర్థుల ఏజెంట్ల నుంచి అంగీకారం తర్వాత కౌంటింగ్ అబ్జర్వర్ నుంచి ఆమోదంతో రిటర్నింగ్ అధికారి ఫలితాలను ప్రకటిస్తారని తెలిపారు. చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
కౌంటింగ్ లో ఎలాంటి అవకతవకలు లేవు : ఈసీ
-
Munugode Results: అందుకే ఫలితాలు ఆలస్యమవుతున్నాయి: వికాస్‌రాజ్
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ఆలస్యంపై సీఈఓ వికాస్‌రాజ్ స్పందించారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందునే కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతున్నట్లు చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. 'ప్రతి టేబుల్ దగ్గర అభ్యర్థుల ఏజెంట్లు ఉన్నారు. ఆర్వో సంతకం చేసిన తర్వాతే ఫలితాలను విడుదల చేస్తున్నాం. అయితే మిగత రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువమంది పోటీలో ఉండటంతోనే ఫలితాలు ఆలస్యమవుతున్నాయి. అందుకే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అప్డేట్ చేయడానికి ఆలస్యమవుతోందని' సీఈఓ వికాస్‌రాజ్ చెప్పారు. ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు ఐదురౌండ్ల కౌంటింగ్ ముగిసింది. దాదాపు 75వేల ఓట్లు లెక్కింపు పూర్తి కాగా, ఇంకా లక్షన్నర ఓట్లు లెక్కించాల్సి ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 5 రౌండ్లు ముగిసే సమయానికి 1430 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చదవండి: (Munugode Round Wise Results Live: మునుగోడు ఉపఎన్నిక రౌండ్ల వారీగా ఫలితాలు) -
మునుగోడు పోలింగ్ ప్రశాంతం.. ఎక్కడా రీపోలింగ్ జరపాల్సిన పరిస్థితి రాలేదు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధి కారి (సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థి తులు ఉత్పన్నం కాలేదన్నారు. గురువారం సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు ఈవీఎంలు మొరాయించడంతో వాటి స్థానంలో వేరే ఈవీఎంలను వినియోగించామని, మూడు వీవీ ప్యాట్లు పనిచేయకపోవ డంతో మార్చామని తెలిపారు. మార్చిన ఈవీఎంలలోని ఓట్లను సైతం లెక్కిస్తామని చెప్పారు. సూక్ష్మ పరిశీలకుల సమక్షంలో కౌంటింగ్ 6న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారని సీఈఓ తెలిపారు. నల్లగొండ పట్టణంలోని గిడ్డంగుల సంస్థకు చెందిన గోదాములో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను సిబ్బంది గురువారం రాత్రిలోగా అక్కడికి చేర్చాల్సి ఉంటుందని చెప్పారు. ఓట్ల లెక్కింపు కోసం సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, సూక్ష్మ పరిశీలకుల సమక్షంలో ఈ ప్రక్రియ జరగనుందన్నారు. రూ.8.27 కోట్ల నగదు స్వాధీనం.. ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు రూ.8.27 కోట్ల నగదు, చీరలు, ఇతర సామాగ్రితో పాటు 3.49 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఎక్సైజ్ శాఖ 599 దాడులు జరిపిందని, మొత్తం 6,100 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇప్పటివరకు 191 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. నియోజకవర్గంలో బయటి వ్యక్తులు డబ్బులు పంపిణీ చేస్తున్నారని బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు 98 ఫిర్యాదులు వచ్చాయని, వారిలో 70 మందిని గుర్తించి బయటికి పంపించినట్టు తెలిపారు. బయటి వ్యక్తులను పట్టుకునేందుకు విస్తృత తనిఖీలు నిర్వహించామని చెప్పారు. -
రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి : ఎన్నికల అధికారి వికాస్ రాజ్
-
మునుగోడు ఉప ఎన్నికపై 500 ఫిర్యాదులు: సీఈవో వికాస్ రాజ్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ రేపు(గురువారం) ఉదయం జరగనుంది. ఈ క్రమంలో.. ఏర్పాట్ల పర్యవేక్షణపై సాక్షి టీవీతో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈవో వికాస్ రాజ్ సాక్షికి వెల్లడించారు. ‘‘వెబ్ క్యాస్టింగ్ ద్వారా 298 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ పరిశీలిస్తాం. పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చే ఓటర్లకు చేతిపై ఎలాంటి పార్టీల గుర్తులు ఉండరాదు. పోలింగ్ కేంద్రాల్లో గుర్తులు ప్రదర్శించరాదు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి.. దాదాపుగా ఐదు వందల వరకు ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి కేసులు నమోదు చేయించాం. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలను తిరిగి రిసెప్షన్ లో ఇచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి. ఈవీఎంలను వదిలి వెళ్లవద్దు. స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలను భద్రపరించేందుకు ఏర్పాట్లు చేశాం. కౌంటింగ్ ప్రక్రియలో వెయ్యి మందికి పైగా ఏజెంట్లు ఉండే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రంలోకి కూడా అనుమతి ఉన్నవారినే పంపిస్తాం అని సీఈవో వికాజ్‌రాజ్ సాక్షితో అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక- కీలక పాయింట్లు.. ► మునుగోడు నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► నవంబర్ 3న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. ఐదు వేల మంది పోలీస్ సిబ్బందిని మోహరిస్తారు. ► 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ► పోలింగ్ నిర్వాహణ కోసం 1,192 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ► ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ► 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ► వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. -
సోషల్‌మీడియాలోనూ ప్రచారం బంద్.. బల్క్ మెసేజ్‌లు పంపడం కూడా..
నల్లగొండ, చండూరు: ఈ నెల 3న నిర్వహించే మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. చండూరులోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించాక.. చండూరు, కోటయ్యగూడెం పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అనంతరం నల్లగొండలోని ఆర్జాలబావి గోదాముల్లో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఆయా చోట్ల ఆయన మాట్లాడుతూ సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిందని.. õసోషల్ మీడియా ప్లాట్ ఫారాల్లో ప్రచారం చేయొద్దని, సైలెంట్ పీరియడ్ ప్రారంభమైన తర్వాత బల్క్ షార్ట్ మెసేజ్ సర్వీస్ ఫోన్ ద్వారా ఆటోమేటెడ్ క్యాంపెయిన్ చేయడం కూడా నిషేధించబడిందని ఆయన చెప్పారు. మోడల్ కోడ్‌ను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నియోజకవర్గంలో బయటి వ్యక్తుల కదలికలను అరికట్టేందుకు 45 పోలీసు బృందాలు, 37 రెవెన్యూ బృందాలను నియమించామని తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారితో సమీక్ష సమావేశం నిర్వహించి పంపిణీ కేంద్రం, పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు, పోలీసు బందోబస్తును పరిశీలించి, ఉప ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. -
మునుగోడులో గడువు దాటాక స్థానికేతరులు ఉండొద్దు: సీఈఓ వికాస్‌రాజ్
సాక్షి, హైదరాబాద్/ నల్లగొండ: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం6 గంటలతో ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. ఆ తర్వాత ప్రచారం నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రచార గడువు ముగిసిన తర్వాత నియోజకవర్గం పరిధిలో స్థానికేతరులెవరూ ఉండరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన స్థానికేతరులు సాయంత్రం 6 గంటల లోగా వెళ్లిపోవాలని, లేకుంటే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో స్థానికేతరులను గుర్తించడానికి లాడ్జీలు, హోటళ్లు, కళ్యాణ మండపాలు వంటి ప్రాంతాల్లో పోలీసులతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఏర్పాట్లను సోమవారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 105 సమస్యాత్మక కేంద్రాలు నవంబర్ 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుందని, మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని సీఈఓ తెలిపారు. అందులో 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయని చెప్పారు. 2,41,795 మంది సాధారణ ఓటర్లతో పాటు 10 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 50 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని వివరించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పోలింగ్ రోజున 15 కేంద్ర బలగాలతో పాటు 3,366 మంది రాష్ట్ర పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గం సరిహద్దుల్లో 100 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పకడ్బందీగా నిఘా పెట్టామన్నారు. ఇప్పటివరకు రూ.6.8 కోట్ల నగదు, 4,560 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 111 బెల్ట్ షాపులను మూసివేయించామని చెప్పారు. విధుల్లో 1,492 మంది సిబ్బంది మొదట మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత 7 గంటలకు పోలింగ్ ప్రారంభించనున్నారు. మొత్తం ఉప ఎన్నికకు సంబంధించి 1,492 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. అదనంగా మరో 300 మంది అందుబాటులో ఉంటారు. దివ్యాంగ ఓటర్లతో పాటు 80 సంవత్సరాలు పైబడిన ఓటర్లకు పోలింగ్ స్టేషన్లలో వీల్ చైర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతం ప్రకటించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో 821 మందిని బైండోవర్ చేయడంతో పాటు వివిధ రకాల కేసులు 40,065 నమోదు చేశారు. ఈసీకి రాజగోపాల్‌రెడ్డి వివరణ తన కుటుంబ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి రూ.5.24 కోట్లను మునుగోడులోని కొందరికి బదిలీ చేసినట్టు టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుపై బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన వివరణను ఎన్నికల సంఘానికి పంపించామని సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. సీఈఓ కార్యాలయంపై రాజకీయ పార్టీల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని, ఓ అభ్యర్థి ఎన్నికల గుర్తును మార్చి కొత్త గుర్తును కేటాయించిన వ్యవహారంలో తమ కార్యాలయం పాత్ర ఏమీ లేదని తెలిపారు. -
మునుగోడు ఉపఎన్నిక కోసం 298 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు
-
ఆ తర్వాత మునుగోడులో స్థానికేతరులు ఉంటే కఠిన చర్యలు: ఈసీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటల వరకేనని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. ఆరు గంటల తర్వాత స్థానికేతరులు ఎవరూ నియోజకవర్గంలో ఉండకూదని ఆదేశించారు. నవంబర్ 3న ఉప ఎన్నిక ఓటింగ్ నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించారు సీఈఓ. నాన్ లోకల్ వాళ్ళు మునుగోడులో ఎవరు ఉన్నా చట్ట పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మునుగోడులో అణువణువు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని గుర్తు చేశారు. ‘మంగళవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించాము. ఎవరైనా ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్‌కు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. రేపు సాయంత్రం 6గంటల వరకు మునుగోడులో ప్రచారం ముగుస్తుంది. ఓటర్లకు ఇప్పటికే కొత్త డిజైన్‌తో కూడిన ఓటర్ ఐడి ఇచ్చాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశాము. ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ఇప్పటి వరకు 111 బెల్ట్ షాపులను సీజ్ చేశాము. 185 కేసులు నమోదు కాగా.. 6.80కోట్ల నగదు 4500లీటర్ల లిక్కర్ పట్టుకున్నాము. కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి వివరణ కాసేపటి క్రితమే అందింది. దీనిపై ఈసీకి నివేదిక పంపాము. రిటర్నింగ్ అధికారిపై సీఈఓ కార్యాలయం నుండి ఎలాంటి ఒత్తిడి లేదు. ’ అని వెల్లడించారు సీఈఓ వికాస్ రాజ్. మునుగోడు ఉప ఎన్నికల ఓటింగ్ కీలక అంశాలు ► నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► నవంబర్ 3న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ► 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ► 3366 పోలింగ్ సిబ్బందిని, 15 బలగాల సిబ్బంది మునుగోడులో మోహరిస్తున్నారు. ► ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ► 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ► వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: దేవుడే పంపాడేమో! మంటల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన వ్యక్తి -
కోటి మంది ఓటర్లు ఆధార్‌తో అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోటి మంది ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసుకుని దేశంలోనే రికార్డు సృష్టించార ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈ వో) వికాస్ రాజ్ తెలిపారు. గత ఆగస్టు 1న ప్రారంభించిన ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధాన కార్యక్రమానికి రాష్ట్రంలో మంచి స్పందన లభించిందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వయం సహా యక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) చొరవ తో రాష్ట్రంలో 40 లక్షలమంది ఓటర్లు ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నా రని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ హెచ్‌జీల సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఓటరు గుర్తింపుకార్డుల తో ఆధార్ అనుసంధానం స్వచ్ఛందంగా జరుగుతోందని స్పష్టం చేశారు. జిల్లా కలెక్ట ర్లు అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ల ఆధార్ వివరాలు బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. -
TS: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా వికాస్‌రాజ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా వికాస్‌రాజ్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన వికాస్‌రాజ్ ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నారు. సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రాష్ట్రంలో ఎలాంటి ఇతర పోస్టుల్లో కొనసాగరాదని, అదనపు బాధ్యతల్లో సైతం ఉండరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వికాస్‌రాజ్ గతంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. -
ఎట్టకేలకు ఎంపీడీఓలకు పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓ) సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు పదోన్నతులు లేకుండానే ఒకే పోస్టులో దీర్ఘకాలం పాటు పని చేసిన వారికి ఉపశమనం లభించింది. ప్రస్తుతమున్న నిబంధనలకు మినహాయింపులిస్తూ అడ్హాక్ తాత్కాలిక పద్ధతుల్లో 103 మంది ఎంపీడీఓ, డీపీఓలకు డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల్లో పదోన్నతి కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1996 తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్ 10 (ఏ) అనుగుణంగా ఎంపీడీఓలు/డీపీఓలను తాత్కాలికంగా జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కేడర్‌లో న్యాయస్థానం నిబంధనలకు లోబడి పదోన్నతులు కల్పిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు డిప్యూటీ సీఈఓలుగా పదోన్నతి పొందిన వారు ప్రస్తుతం పనిచేస్తున్న చోటే కొనసాగాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పదోన్నతులపై హర్షం.. దాదాపు 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పదోన్నతులు కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రాఘవేందర్రావు, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ బి.శేషాద్రి కృతజ్ఞతలు తెలిపారు. పదోన్నతుల కోసం కృషి చేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీనియర్ నేతలు కేటీఆర్, టి.హరీశ్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూప్రసాద్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. పదోన్నతుల ఉత్తర్వులు ఇవ్వడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ మినిస్టీరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు పైళ్ల జయప్రకాశ్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి నందకుమార్ హర్షం వ్యక్తం చేశారు. -
ఆర్జీయూకేటీ వ్యవహారంపై కమిటీలు
సాక్షి, హైదరాబాద్: రాజీవ్‌గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్జీయూకేటీ) వ్యవహారాలపై మూడు కమిటీలను నియమించారు. ఆర్జీయూకేటీ పాలక మండలి సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన విద్యాశాఖ కార్యదర్శులు వికాస్‌రాజ్, నీలం సహానీ ఇతర అధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. -
‘టెన్త్’ ద్వితీయ భాషలో 20 మార్కులకే పాస్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ద్వితీయ భాషలో ఉత్తీర్ణత మార్కులను 35 నుంచి 20కు తెలంగాణ ప్రభుత్వం కుదించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది వరకు అమల్లో ఉన్న పాత పరీక్షల విధానంలో ద్వితీయ భాష ఉతీర్ణత మార్కులు 20 మాత్రమే ఉండగా.. ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చిన పరీక్షల సంస్కరణల భాగంగా మార్కులను 35కు పెం చారు. హిందీ, తెలుగు తదితర భాషలను ద్వితీయ భాషగా స్వీకరించిన విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా పాత విధానం ప్రకారం ఉత్తీర్ణత మార్కులను 20కు తగ్గించాలని తాజా అసెంబ్లీ సమావేశాల్లో పలు రాజకీయ పక్షాలు చేసిన విజ్ఞప్తిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తూ ప్రకటన సైతం చేశారు. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల వ్యవధిలోనే సీఎం నిర్ణయాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు రావడం గమనార్హం. -
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు
ఏపీ ఇంటర్ బోర్డు చట్టం వర్తింపజేస్తూ ఏర్పాటు విద్యాశాఖ మంత్రి చైర్మన్‌గా బోర్డు... సభ్యుల్లో ఒకరు వైస్ చైర్మన్ 10 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉత్తర్వులు జూన్ 2 నుంచే అమల్లోకి సంబురాలు చేసుకున్న ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు అయింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు చట్టాన్ని తెలంగాణ బోర్డుకు వర్తింపజేస్తూ తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ సోమవారం జీవో 21 జారీ చేశారు. బోర్డు స్వరూపం, అందులో ఉండే అధికారులు, వారి స్థాయి తదితర వివరాలను ఉత్తర్వుల్లో వివరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని 101వ సెక్షన్ ప్రకారం ఈ ఉత్తర్వు లను వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్తర్వులు జూన్ 2 నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ యాక్ట్-1971లో ‘ఆంధ్రప్రదేశ్’ అని ఉన్న స్థానంలో ‘తెలంగాణ’ పదాన్ని చేర్చి, బోర్డుకు ఆ నిబంధనలను వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. బోర్డులో ఉండాల్సిన ఎక్స్ అఫిషియో సభ్యులు, నామినేటెడ్ సభ్యులు, కో-ఆప్టెడ్ సభ్యులు, వైస్ చైర్మన్ పదవులకు నియమించే వారి బాధ్యతలను వివరించారు. ఇదీ బోర్డు స్వరూపం..: విద్యాశాఖ మంత్రి చైర్మన్‌గా వ్యవహరించే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో ఎక్స్ అఫిషియో సభ్యులుగా 10 మంది ఉంటారు. అందులో విద్యాశాఖ కార్యదర్శి, కళాశాల విద్య కమిషనర్ అండ్ డెరైక్టర్, పాఠశాల విద్య కమిషనర్ అండ్ డెరైక్టర్, ఇంటర్ విద్య కమిషనర్ అండ్ డెరైక్టర్, సాంకేతిక విద్యా డెరైక్టర్, మెడికల్ సర్వీసెస్ డెరైక్టర్, ఇండ స్ట్రీస్ డెరైక్టర్, అగ్రికల్చర్ డెరైక్టర్, తె లుగు అకాడమీ డెరైక్టర్, కార్యదర్శి ఉంటారు. అలాగే ఆర్థిక శాఖ నుంచి ఒకరు, రాష్ట్రంలోని ఒక్కో యూనివర్సిటీ నుంచి ఒక్కొక్కరిని, ఏదైనా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ఒకరిని సభ్యులుగా నామినేట్ చేస్తారు. మరో ఆరుగురిని గుర్తింపు పొందిన, అనుబంధ జూనియర్ కాలేజీల నుంచి, ప్రైవేటు కాలేజీల నుంచి, మహిళ జూనియర్ కాలేజీల నుంచి నియమిస్తారు. బోర్డు నిబంధనల ప్రకారం విషయ నిపుణులు ముగ్గురిని కో-ఆప్టెడ్ సభ్యులుగా నియమిస్తారు. బోర్డు సభ్యుల్లో ఒకరిని వైస్ చైర్మన్‌గా నియమిస్తారు. పాలనాపరమైన అంశాలతో పాటు అన్నింటిలో చైర్మన్‌కు వైస్ చైర్మన్ సహకారం అందించాల్సి ఉంటుంది. చైర్మన్ లేనపుడు వైస్ చైర్మన్ విధులు నిర్వర్తిస్తారు. ఉద్యోగుల హర్షం.. బోర్డు ఏర్పాటు ఉత్తర్వులు జారీ కావడంతో ఇంటర్మీడియట్ బోర్డులోని తెలంగాణ ఉద్యోగులు, అధికారులు పెద్దఎత్తున సంబురాలు జరుపుకున్నారు. ఉద్యోగులు ఒకరికి ఒకరు స్వీట్లు పంచుకొని బాణసంచా పేల్చారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ విద్యా జేఏసీ కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, బోర్డు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు భీంసింగ్, ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు అంజన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బోర్డు ఏర్పాటైనందున ఏపీతో సంబంధం లేకుండా తెలంగాణలో వేరుగానే పరీక్షలు జరుగుతాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
460 స్కూల్స్ క్లోజ్
ఆదిలాబాద్ టౌన్ : రేషనలైజేషన్ ఫలితం వల్ల జిల్లాలో 460 పాఠశాలలు మూతపడనున్నాయి. దసరా సెలవుల తర్వాత వీటికి తాళాలు వేయనున్నారు. ఇందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ రెండు రోజుల క్రితం జీవో 6 విడుదల చేశారు. రేషనలైజేషన్ ప్రక్రియ అమలుకు షెడ్యూల్, మార్గదర్శకాలు, సూచన లు జారీ చేయాలని పాఠశాల విద్య కమిషనర్‌ను ఉత్తర్వుల్లో ఆదేశించారు. మరో రెండు మూడు రోజుల్లో మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉందని విద్యాశాఖ భావిస్తోంది. ఇది అమల్లోకి రాగానే ఆయా పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులకు స్థానచలనం కలగనుంది. ఈ జీవో ప్రకారం 19 మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను కిలోమీటరు పరిధిలోని ఇతర పాఠశాలలో విలీనం చేస్తారు. 460 పాఠశాలలకు తాళం.. జిల్లాలో ప్రస్తుతం 3,017 ప్రాథమిక పాఠశాలలు, 419 ప్రాథమికోన్నత పాఠశాలలు, 428 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 17 వేల మంది ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. కా గా ఉత్తర్వుల సంఖ్య 6, రేషనలైజేషన్ ప్రకారం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 19 కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను మూసివేయనున్నారు. ఈలెక్కన జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 290, ప్రాథమికోన్నత పాఠశాలలు 120 వరకు మూత పడనున్నాయి. అలాగే ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సం ఖ్య 75 కంటే తక్కువగా ఉంటే ఆ పాఠశాల మూత పడనుంది. జిల్లాలో పది ఉన్నత పాఠశాలలు, 40 సక్సెస్ ఉన్నత పాఠశాలలు మూత పడనున్నాయి. వెయ్యి మంది ఉపాధ్యాయులకు స్థాన చలనం ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ఉత్తర్వుల ప్రకారం 460 పాఠశాలల్లో పనిచేస్తున్న దాదాపు వెయ్యి మంది ఉపాధ్యాయులకు స్థాన చలనం కలగనుంది. వీరి పోస్టులు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలకు మార్చుతారు. దీంతో ఈ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు పది వేల మంది విద్యార్థులు సమీపంలోని పాఠశాలలకు వెళ్లాల్సిందే. ఇందులో కొంత మంది విద్యార్థులు దూర భారం ఉండడంతో డ్రాపౌట్‌గా మారే అవకాశం ఉంది. కాగా రేషనలైజేషన్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ సంఘలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ జీవో ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణరెడ్డిని వివరణ కోరగా జిల్లాలో 460 వరకు పాఠశాలలు ఇతర సమీప పాఠశాలల్లో విలీనం కానున్నాయని తెలిపారు. ప్రభుత్వం జీవో 6ను విడుదల చేసిందని దీనికి సంబంధించిన మార్గదర్శాలు రావాల్సి ఉందన్నారు. -
19 మంది లోపున్న బడులు మూసివేత
విద్యార్థులు లేకుంటే సమీపంలోని పాఠశాలల్లో విలీనం ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్దీకర ణ (రేషనలైజేషన్)కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ మేనేజ్మెంట్ల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉండాల్సిన విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య ను ఉత్తర్వుల్లో పొందుపరిచారు. 2013-14 డైస్ లెక్కల ఆధారంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ కోసం జిల్లా స్థాయిలో సాధికారిక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి సాధికారిక కమిటీకి చైర్మన్‌గా ఆ జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. జిల్లా విద్యాశాఖాధికారి సభ్య కార్యదర్శిగా, జాయింట్ కలెక్టర్, జెడ్పీ సీఈవో, ఐటీడీఏ పీవో, ఆర్వీఎం పీవో సభ్యులుగా ఉంటారు. రేషనలైజేషన్ ప్రక్రియ అమలుకు షెడ్యూల్, మార్గదర్శకాలు, సూచనలను జారీ చేయాల్సిందిగా పాఠశాల విద్యా కమిషనర్‌ను ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం 19 మం దిలోపు పిల్లలున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను కిలోమీటరు పరిధిలోని ఇతర పాఠశాలల్లో విలీనం చేస్తారు. ఆ స్కూళ్లలోని ఉపాధ్యాయ పోస్టులను విద్యార్థులున్న పాఠశాలలకు బదిలీ చేస్తారు. గిరి జన ప్రాంతాల్లో 19 మందిలోపు విద్యార్థులు ఉన్నా, లేకపోయినా కిలోమీటరు పరిధిలోని ఉన్న మరో ప్రభుత్వ లేదా సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలో విలీనం చేస్తారు. ఒకవేళ కిలోమీటర్ పరిధిలో మరో పాఠశాల లేకపోతే కనీసం 15 మంది విద్యార్థులున్నా ఆ పాఠశాలను కొనసాగిస్తారు. ఇక ఈ హేతుబద్దీకరణపై 29న విద్యాశాఖ అధికారులు సమావేశమై షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. వచ్చే నెల చివరలో ఈ రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఇవీ మార్గదర్శకాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్దీకరణలో భాగంగా ఉన్న పోస్టుల సర్దుబాటును మాత్రమే చేపడతారు. ఒక్క కొత్త పోస్టు కూడా సృష్టించరు. ప్రాథమిక పాఠశాలల్లో.. 19 మంది కంటే తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలలను కిలోమీటరు పరిధిలో ఉన్న మరో పాఠశాలలో విలీనం చేస్తారు. 20 నుంచి 60 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు ఎస్జీటీని ఇస్తారు. ఆ తరువాత ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను కేటాయిస్తారు. విద్యార్థుల సంఖ్య 151కి మించి ఉంటే ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంను ఇస్తారు. ఇక గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలను విలీనం చేయాల్సి వస్తే ఐటీడీఏ స్కూళ్లలో విలీనం చేస్తారు. పోస్టులను మాత్రం సంబంధిత యాజమాన్యంలోనే సర్దుబాటు చేస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో.. ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాల నిబంధనలే వర్తిస్తాయి. 6, 7, 8 తరగతుల్లో 19 మందికన్నా తక్కువగా విద్యార్థులు ఉంటే.. మూడు కిలోమీటర్ల పరిధిలోని ఉన్న మరో ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేస్తారు. 20 నుంచి 100 మంది విద్యార్థులున్న స్కూళ్లలో ఒక గణితం, ఒక ఆర్ట్స్ స్కూల్ అసిస్టెంట్, రెండు భాషా పండిట్ పోస్టులు ఉంటాయి. 101 నుంచి 140 మంది విద్యార్థులున్న స్కూళ్లలో గణితం టీచర్ పోస్టును అదనంగా ఇస్తారు. ఆ తరువాత ప్రతి 35 మంది విద్యార్థులకు ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్టును అదనంగా ఇస్తారు. ఈ స్కూళ్లలో సీనియర్ అయిన స్కూల్ అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయుడిగా వ్యవహరించాలి. స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు వారి సబ్జెక్టులను బోధిస్తూనే, అవసరమైతే ప్రాథమిక తరగతుల్లో బోధించాలి. ఉన్నత పాఠశాల్లో.. 6 నుంచి పదో తరగతి వరకు 75 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలల(ఇంగ్లిష్ మీడియంతో సహా)ను మూసివేసి విద్యార్థులను సమీపంలోని స్కూల్లో నమోదు చేస్తారు. 75 నుంచి 220 మంది విద్యార్థుల వరకు ఉంటే.. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో టీచర్ చొప్పున 9 మందిని ఇస్తారు. ఆ తరువాత ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను అదనంగా ఇస్తారు. ఉన్నత పాఠశాలల్లో ఒక తరగతిలో కనీస విద్యార్థుల సంఖ్య 40 మంది. 60కి మించితే రెండో సెక్షన్‌ను, 100 మందికి మించితే మూడో సెక్షన్‌ను ఏర్పాటు చేయాలి. పోస్టులను ఒక స్కూల్ నుంచి మరో పాఠశాలకు మా ర్చే పక్షంలో విద్యార్థుల నమోదు, సెక్షన్లను దృష్టిలో పెట్టుకొని కమిటీ నిర్ణయం తీసుకోవాలి. ప్రాంతీయ సంయుక్త సంచాలకుడి అనుమతి లేకుం డా జెడ్పీ, మున్సిపల్ స్కూళ్లలో నిర్వహిస్తున్న అదన పు సెక్షన్లను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీచేయాలి. మరికొన్ని నిబంధనలు.. బాలికల పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లో కో-ఎడ్యుకేషన్/ బాలుర పాఠశాలల్లో విలీనం చేయొద్దు. ఇంగ్లిషు మీడియం ఉన్న పాఠశాలల్లో 75 మందిలోపు పిల్లలు ఉంటే ఇంగ్లిషు మీడియం కోసం అదనంగా పోస్టులను ఇవ్వరు. 75 నుంచి 220 మంది వరకు పిల్లలున్న స్కూళ్లలో భాషేతర స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 4, 221 నుంచి 260 వరకు 6, 261 నుంచి 340 వరకు 7 పోస్టులు అదనంగా కేటాయిస్తారు. రేషనలైజేషన్‌లో సీనియారిటీ ప్రకారం జూనియర్ అయిన వారిని అదనపు టీచర్‌గా గుర్తిస్తారు.