సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్‌కు చకచకా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ మొదలైంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలకు సిద్దమవుతున్నామన్నారు.
తాజాగా వికాస్‌రాజ్ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో పోలింగ్ కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి ఫస్ట్ టైం హోం ఓటింగ్ నిర్వహిస్తున్నాం. మొత్తం 3 కోట్ల 26లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 9 లక్షలకు పైగా యంగ్ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లు 4లక్షలు, ఈవీఎం బ్యాలెట్లు 8 లక్షల 84వేలు ప్రింట్ అయ్యాయి. ఎపిక్ కార్డులు 51 లక్షలు ప్రింట్ అయ్యి దాదాపు పంపిణీ అయ్యింది. ముగ్గురు స్పెషల్ అబ్జర్వర్లు స్టేట్‌కు వచ్చారు. ప్రతీ కౌంటింగ్ సెంటర్‌కు ఒక అబ్జర్వర్ ఉంటారు. మూడు కేటగిరీల్లో హోం ఓటింగ్ జరుగుతోంది. 9300 మంది 80ఏళ్లు పైబడిన వాళ్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2కోట్ల 81లక్షల ఓటర్ స్లిప్‌ల పంపిణీ పూర్తి అయ్యింది. ఎల్లుండి వరకు ఓటర్ స్లిప్ పంపిణీ పూర్తి అవుతుంది.
తెలంగాణలో మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 59వేల బ్యాలెట్ యూనిట్లు వాడుతున్నాం. రేపటి వరకు కమీషనింగ్ పూర్తి అవుతుంది. సీ విజిల్ యాప్ ద్వారా 6,600 ఫిర్యాదులు అందాయి. ఫ్లయింగ్ స్వ్కాడ్ వెహికిల్‌కు జీపీఎస్ ఉంటుంది. ప్రతీ సెగ్మెంట్‌కు మూడు ఎస్‌ఎస్‌టీ, ఫ్లయింగ్ స్వ్కాడ్స్ ఏర్పాటుచేశాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. తెలంగాణలో ఎన్నికల కోసం 377 కంపెనీల కేంద్ర బలగాలు పనిచేస్తున్నాయి. అర్బన్ ఏరియాల్లో ఓటింగ్ శాతం గతంలో తక్కువగా ఉంది. 3లక్షల మంది పోలింగ్ ప్రిపరేషన్‌లో పాల్గొంటున్నారు. డీఏ గురించి ప్రఫోజల్స్ వచ్చాయి. నిర్ణయం ECI ఇంకా తీసుకోలేదు. 64వేలు స్టేట్ పోలీసులు, 375కేంద్ర కంపెనీల నుంచి బలగాలు ఎన్నికల కోసం ఉన్నాయి. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ సమస్య లేదు. 114 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment