Voting machine
-
ఓటర్ల స్లిప్పుల పంపిణీ వేగంగా జరుగుతోంది: వికాస్ రాజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్‌కు చకచకా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ మొదలైంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలకు సిద్దమవుతున్నామన్నారు. తాజాగా వికాస్‌రాజ్ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో పోలింగ్ కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి ఫస్ట్ టైం హోం ఓటింగ్ నిర్వహిస్తున్నాం. మొత్తం 3 కోట్ల 26లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 9 లక్షలకు పైగా యంగ్ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లు 4లక్షలు, ఈవీఎం బ్యాలెట్లు 8 లక్షల 84వేలు ప్రింట్ అయ్యాయి. ఎపిక్ కార్డులు 51 లక్షలు ప్రింట్ అయ్యి దాదాపు పంపిణీ అయ్యింది. ముగ్గురు స్పెషల్ అబ్జర్వర్లు స్టేట్‌కు వచ్చారు. ప్రతీ కౌంటింగ్ సెంటర్‌కు ఒక అబ్జర్వర్ ఉంటారు. మూడు కేటగిరీల్లో హోం ఓటింగ్ జరుగుతోంది. 9300 మంది 80ఏళ్లు పైబడిన వాళ్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2కోట్ల 81లక్షల ఓటర్ స్లిప్‌ల పంపిణీ పూర్తి అయ్యింది. ఎల్లుండి వరకు ఓటర్ స్లిప్ పంపిణీ పూర్తి అవుతుంది. తెలంగాణలో మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 59వేల బ్యాలెట్ యూనిట్లు వాడుతున్నాం. రేపటి వరకు కమీషనింగ్ పూర్తి అవుతుంది. సీ విజిల్ యాప్ ద్వారా 6,600 ఫిర్యాదులు అందాయి. ఫ్లయింగ్ స్వ్కాడ్ వెహికిల్‌కు జీపీఎస్ ఉంటుంది. ప్రతీ సెగ్మెంట్‌కు మూడు ఎస్ఎస్టీ, ఫ్లయింగ్ స్వ్కాడ్స్ ఏర్పాటుచేశాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. తెలంగాణలో ఎన్నికల కోసం 377 కంపెనీల కేంద్ర బలగాలు పనిచేస్తున్నాయి. అర్బన్ ఏరియాల్లో ఓటింగ్ శాతం గతంలో తక్కువగా ఉంది. 3లక్షల మంది పోలింగ్ ప్రిపరేషన్లో పాల్గొంటున్నారు. డీఏ గురించి ప్రఫోజల్స్ వచ్చాయి. నిర్ణయం ECI ఇంకా తీసుకోలేదు. 64వేలు స్టేట్ పోలీసులు, 375కేంద్ర కంపెనీల నుంచి బలగాలు ఎన్నికల కోసం ఉన్నాయి. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ సమస్య లేదు. 114 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి’ అని తెలిపారు. -
ఓటు వలస వెళుతుందా? రిమోట్ ఓటింగ్‌పై పెరుగుతున్న రాజకీయ వేడి
ఓటు. ప్రజాస్వామ్యం మనకిచ్చిన శక్తిమంతమైన ఆయుధం. అయినా దానిని వినియోగించుకోవడంలో ఏదో తెలీని ఉదాసీనత కనిపిస్తోంది. ముఖ్యంగా ఉపాధి కోసం వేరే ఊళ్లు వెళ్లే వలసదారులు ఓటు వెయ్యడానికి సుముఖత చూపించడం లేదు. అందుకే దేశంలో ఎక్కడ నుంచైనా ఓటు వెయ్యడానికి వీలు కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం విప్లవాత్మక మార్పులకి శ్రీకారం చుట్టింది. అవే రిమోట్ ఓటింగ్ మెషీన్లు(ఆర్వీఎం). ఈ ఓటింగ్ మెషీన్ల ద్వారా సొంతూరుకి వెళ్లకుండా తాముండే ప్రాంతం నుంచి తమ నియోజకవర్గం అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం లభిస్తుంది. ఈ నమూనా ఆర్వీఎంలను ప్రదర్శించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 16న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ సహా 13 పార్టీలు వీటిని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై విశ్వాసమే లేకుండా ఉన్న ఈ సమయంలో ఈ కొత్త ప్రక్రియకు తెరతీసి ఓటింగ్ వ్యవస్థను గందరగోళం చెయ్యడమెందుకనే చర్చ మొదలైంది. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, జనతా దళ్ (యూ), శివసేన (ఉద్ధవ్ వర్గం), ఎన్సీపీ, సీపీఎం వ్యతిరేకంగా ఉండడంతో నమూనా ఆర్వీఎంల ప్రదర్శన జరగకుండానే సమావేశం ముగిసింది. అయితే వలస ఓటర్ల ఓటింగ్ శాతం పెంపు లక్ష్యంగా తాము చేస్తున్న ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లడానికి సీఈసీ రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఫిబ్రవరి 28 వరకు గడువు పెంచింది. ఎందుకీ ఆర్వీఎంలు ? వలస ఓటర్లలో మూడో వంతు మంది ఎన్నికల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 67.4శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. దాదాపుగా 30 కోట్ల మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఉన్న చోటు నుంచి సొంతూరికి వెళ్లే అవకాశం లేకపోవడం, ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడం వంటి ఎన్నో కారణాలతో వారు ఓటు వెయ్యడం లేదు. భారత ప్రధాన ఎన్నికల అధికారిగా రాజీవ్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వలస ఓటర్లపై దృష్టి కేంద్రీకరించి రిమోట్ ఓటింగ్ ప్రక్రియకు తెరతీశారు. ఆర్వీఎంలు ఎలా పని చేస్తాయి ? ప్రస్తుతం ఎన్నికల్లో వినియోగిస్తున్న ఎలక్ట్రానింగ్ ఓటింగ్ మెషీన్లకు (ఈవీఎం) ఇది సవరించిన వెర్షన్. ఇతర ప్రాంతాల్లో ఉన్న వలస ఓటర్లు తమ నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తాము ఏ ప్రాంతం నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటారో రిజిస్టర్ చేసుకోవాలి. అలా రిజిస్టర్ చేసుకున్న వారిని రిమోట్ ఓటర్లు అని పిలుస్తారు. తమ ప్రాంతంలో ఉన్న రిమోట్ పోలింగ్ బూత్‌కు వెళితే ఆ ఓటరు నియోజకవర్గం వివరాలను కానిస్టిట్యూయెన్సీ కార్డ్ రీడర్ (సీసీఆర్) ద్వారా స్కాన్ చేసి గుర్తిస్తారు. అప్పుడు ఆర్వీఎం మెషీన్ల్లపై ఆ నియోజకవర్గానికి సంబంధించిన బ్యాలెట్ పత్రం డిస్ప్లే అవుతుంది. తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తే రాష్ట్రం కోడ్, నియోజకవర్గం, అభ్యర్థుల నెంబర్ వివరాలన్నీ రిమోట్ కంట్రోల్ యూనిట్లో రికార్డు అవుతాయి. ఓటు నమోదైనట్టుగా వీవీప్యాట్ స్లిప్ వస్తుంది. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తయారు చేసిన ఆర్వీఎంలు ఇంటర్నెట్ అవసరం లేకుండా పని చేస్తాయి. ప్రతిపక్షాల అభ్యంతరాలు ఇవీ ► సీఈసీ ప్రతిపాదనలేవీ సమగ్రంగా లేవు. ఆర్వీఎంల వ్యవస్థ పైపైన రూపొందించినట్టుగా ఉంది. ► ఈవీఎంల పని తీరుపైనే సవాలక్ష సందేహాలున్న ప్రస్తుత పరిస్థితుల్లో అదే నమూనాలో రూపొందించిన ఆర్వీఎంలతో ఒనగూరే ప్రయోజనం ఉండదు. ► ప్రాంతీయ పార్టీలకు, చిన్న పార్టీలకు ఈ వ్యవస్థ ఏ మాత్రం అనుకూలం కాదు. దేశవ్యాప్తంగా ఏర్పాటయ్యే వివిధ పోలింగ్ బూత్‌లలో వారు తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకునే వనరులు ఆ పార్టీలకు ఉండవు. ► ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు వేరే రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉండకపోవడం వల్ల అక్కడ ఉండే వలస ఓటర్లని రాజకీయ పార్టీలు సులభంగా ప్రలోభ పెట్టొచ్చు ► ఓటరు స్థానికంగా నివాసం లేకపోతే రాజకీయ పార్టీలపై ఏర్పరచుకునే అభిప్రాయాలు, ఓటు వేయడంలో వారు తీసుకునే నిర్ణయాల్లో తప్పిదాలు జరిగే అవకాశం ఉంటుంది. ► దేశంలో ఒక చోట ఎన్నికలు జరుగుతూ ఉంటే, మరెక్కడి నుంచో ఓటు వేసే వ్యక్తి అసలు సిసలు ఓటరేనని ఎలా నమ్మాలి. ఓటింగ్‌లో జరిగే అక్రమాలు ఇకపై వివిధ నియోజకవర్గాలకు విస్తరిస్తాయి. ఈసీ ఎదుట ఉన్న సవాళ్లు ► అసలు వలస ఓటర్లు అంటే ఎవరు ? వారిని ఎలా గుర్తించాలి. వలస ఓటర్లను గుర్తించడంలో ఏర్పడే న్యాయపరమైన చిక్కుల్ని ఎదుర్కోవడం ► ఈవీఎంలకు సవరించిన వెర్షన్‌గా రూపొందించిన ఆర్వీఎంలలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలకు పరిష్కారం కనుగొనడం ► ఎన్నికల్లో ఎన్ని రిమోట్ ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న దానిపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవడం ► ఒక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతూ ఉంటే వలస ఓట్లు ఉండే అన్ని ప్రాంతాల్లోనూ ఎన్నికల నియమావళిని అమలు చేయడానికి ఎలాంటి కసరత్తు చేయాలి. ఇలాంటి సవాళ్లను అధిగమించడానికే ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరుతోంది. రిమోట్ ఓటింగ్ అనేది ఎన్నికల ప్రకియలో ఒక విప్లవాత్మకమైన మార్పు. పట్టణ ప్రాంతాల్లో, యువతలోనూ ఓటుపై ఆసక్తి పెంచడమే ధ్యేయంగా పని చేస్తున్నాం. కానీ దీని అమలులో ఎన్నో సవాళ్లున్నాయి. ఇది అంత సులభంగా జరిగేది కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్ణయాలు తీసుకోవడానికి సమయం పడుతుంది. మేం వేసే ప్రతీ అడుగు ముందడుగానే ఉంటుంది. రాజీవ్ కుమార్, సీఈసీ ధనిక పార్టీ అయిన బీజేపీకి ఇలాంటి ప్రక్రియలు అనుకూలంగా ఉంటాయి. ప్రాంతీయ పార్టీల ఆందోళనలో అర్థం ఉంది. రిమోట్ బూత్‌లున్న ప్రతిచోటా పోలింగ్ ఏజెంట్లను తెచ్చిపెట్టుకునే సామర్థ్యం వారికి ఉండదు. ఎన్నికల బరిలో ఉన్న పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్లు లేకుండా రిమోట్ ఓటింగ్ ప్రక్రియను నిర్వహించడం సరి కాదు. జగ్దీప్ చొకార్, అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫారమ్స్ సహ వ్యవస్థాపకుడు ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి గంటలో 10 నుంచి 12% ఓట్లు పోలయినట్టు గుర్తించాం. అంటే ప్రతీ 25–30 సెకండ్లకి ఒక ఓటు పోలయినట్టు లెక్క. అదెలా సాధ్యం. ఒక ఓటు నమోదు కావడానికి కనీసం 60 సెకండ్ల సమయం పడుతుంది. ఈవీఎంలలో కళ్లకు కట్టినట్టు ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే ఆర్వీఎం అవసరం ఏమొచ్చింది..? జైరామ్ రమేష్, కాంగ్రెస్ ఎంపీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈవీఎం పాడవ్వడంతో తలెత్తిన ఘర్షణ...పలువురికి గాయాలు
న్యూఢిల్లీ: హర్యానాలోని ఝజ్జర్‌లో మూడు అంచెల పంచాయతీ ఎన్నికల జరగుతున్నాయి. ఐతే పోలింగ్ బూత్ వద్ద మిషన్ చెడిపోవడంతో రెండు వర్గాల మధ్య బీకర పోరు జరిగింది. ఓటింగ్ వేస్తున్న సయయంతో అనుహ్యంగా ఈవీఎం మిషన్ పాడైందని రెండు ప్రత్యర్థి వర్గాలు ఊగిపోయి ఒకరిపై ఒకరు దాడులు జరుపుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. రెండు వర్గాలు వేరు చేయడానికి ప్రయత్నించిన దాడులు చేసుకోవడం ఆపలేదని అన్నారు. అలాగే హర్యానాలో నుహ్‌లో రెండు గ్రామాల్లో కూడా కొట్లాటలు, రాళ్లు రువ్వుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. హర్యానాలో తొమ్మిది జిల్లాలో జరగనున్న మూడు దశల ఎన్నికల్లో ఇది మొదటిది. (చదవండి: వింత ఘటన: చెయ్యిని చుట్టేసి మరీ కాటేసిన నాగు.. కసితో కొరికి చంపాడు) -
నచ్చకపోతే ‘నోటా’ నొక్కండి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి మీకు నచ్చలేదా.. మీరు మీ ఓటును ఎవరికీ వేయకుండా తిరస్కరించాలనుకుంటున్నారా.. గతంలో కాకున్నా ఇప్పుడు అది సాధ్యమే.. వచ్చే సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు మొదలు పెట్టింది. ఎన్నికల నిర్వహణలో పలు మార్పులు తీసుకువచ్చింది. నిర్వహణతోపాటు ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం)మిషన్లలో కూడా కొన్ని ప్రత్యేకమైన మార్పులు తీసుకురానుంది. ఈవీఎం మిషన్‌లో ‘నోటా’ అనే బటాన్ అమర్చనుంది. మీకు ఓటు వేయాలని ఉండి పోలింగ్ బూత్‌కు వెళ్లిన తర్వాత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోతే ఈవీఎంలో గల ‘నోటా’ బటన్నోక్కితే చాలు.. మీ తిరస్కరణ ఓటు అందులో నమోదు అవుతుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ సారి ఓటింగ్ యంత్రాలను సరికొత్త పద్ధతిలో రూపొందించింది. ఎన్నికల బరిలో నిల్చున్న అభ్యర్థులెవరూ తమకు నచ్చలేదని ఈ నోటా బటాన్ నొక్కితే చాలు మీకు అబ్యర్థులెవరూ నచ్చలేదని తెలిసిపోతుంది. ఒటరకు ఈ నోటా ఒక వజ్రాయుధంగా మారనుంది. ముఖ్యంగా గతంలో కంటే ఈ ఏడు 18 సంవత్సరాలు నిండిన యువతలో చాలా మార్పు వచ్చింది. ఓటు హక్కును వజ్రాయుధంలా మార్చుకొని సమాజంలో అన్యాయన్ని కూకటి వేళ్లతో పెకిలిద్దామనే సంకేతాలు యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓటుద్వారా సమసమాజ నిర్మాణం కోసం యువత ఎదురు చూస్తోంది. ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ‘నోటా’ బటన్ తీసుకురావడంపట్ల యువత ఆనందంగా ఉంది. గతంలో పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లామంటే అభ్యర్థి నచ్చినా.. నచ్చకున్నా ఎవరికో ఒకరికి ఓటు వేసి వచ్చేవాళ్లు. ఈసారి నోటా రావడంతో యువతకు ఎన్నికలపై ఆసక్తి ఏమేరకు ఉందో తెలియనుంది. ఓటింగ్ యంత్రాల్లో కొత్తగా వస్తున్న ఈ తిరస్కరణాస్త్రంను ఎంత మంది ఉపయోగిస్తారో కూడా నోటా ద్వారా తేలనుంది. ఈవీఎం గోదాం ప్రారంభం.. నిజామాబాద్ మండలం పాంగ్రా గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నం 443లో నిర్మిస్తున్న ఈవీయం మిషన్ల గొదాం ప్రారంభానికి సిద్ధమయ్యింది. గతంలో ఈవీఎం, బ్యాలెట్ బాక్సులను నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్‌లోని ఓ హల్లో ఉంచేవారు. వాటికి సెక్యురిటీ సరిగా లేకపొవడంతో గతంలో ఈవీఎం హాల్షెట్టర్ ను గుర్తుతెలియని వ్యక్తులు పగలగొట్టారు. దీంతో జిల్లా యంత్రాంగం మండలంలోని ప్రభుత్వ భూమిలో ఈవీఎం గొదాం కోసం అప్పటి కలెక్టర్ క్రిస్టినా చోంగ్తూ 1200 గజాల భూమికి ప్రతిపాదనలు సిద్ధం చేసి గోదాం నిర్మాణం కోసం ఈసీ అనుమతి కోసం కోరారు. కలెక్టర్ కోరిక మేరకు ఈవీఎం, ఎలక్షన్ సామగ్రి కోసం సొంత గోదాం ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈసీ కూడా గోదాం నిర్మాణానికి రూ. 98లక్షలు మంజూరు చేసింది. దీంతో అధికారులు పనులు ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో గొదాంను త్వరగా పూర్తి చేశారు. గోదాం ప్రారంభం అయితే దాదాపు జిల్లాలోని 2వేలకు పైగా ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాల్లోనే ఈవీఎం యంత్రాలన్ని ఈ గొదాంలో భద్రపరుచనున్నారు. రెండుమూడు రోజుల్లో ఈవీఎం మిషన్లను భద్రపరిచే గోదాంను ప్రారంభించడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు.