
న్యూఢిల్లీ: హర్యానాలోని ఝజ్జర్‌లో మూడు అంచెల పంచాయతీ ఎన్నికల జరగుతున్నాయి. ఐతే పోలింగ్ బూత్ వద్ద మిషన్ చెడిపోవడంతో రెండు వర్గాల మధ్య బీకర పోరు జరిగింది. ఓటింగ్ వేస్తున్న సయయంతో అనుహ్యంగా ఈవీఎం మిషన్ పాడైందని రెండు ప్రత్యర్థి వర్గాలు ఊగిపోయి ఒకరిపై ఒకరు దాడులు జరుపుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు.
రెండు వర్గాలు వేరు చేయడానికి ప్రయత్నించిన దాడులు చేసుకోవడం ఆపలేదని అన్నారు. అలాగే హర్యానాలో నుహ్‌లో రెండు గ్రామాల్లో కూడా కొట్లాటలు, రాళ్లు రువ్వుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. హర్యానాలో తొమ్మిది జిల్లాలో జరగనున్న మూడు దశల ఎన్నికల్లో ఇది మొదటిది.
(చదవండి: వింత ఘటన: చెయ్యిని చుట్టేసి మరీ కాటేసిన నాగు.. కసితో కొరికి చంపాడు)