Panchayat poll
-
ఈవీఎం పాడవ్వడంతో తలెత్తిన ఘర్షణ...పలువురికి గాయాలు
న్యూఢిల్లీ: హర్యానాలోని ఝజ్జర్‌లో మూడు అంచెల పంచాయతీ ఎన్నికల జరగుతున్నాయి. ఐతే పోలింగ్ బూత్ వద్ద మిషన్ చెడిపోవడంతో రెండు వర్గాల మధ్య బీకర పోరు జరిగింది. ఓటింగ్ వేస్తున్న సయయంతో అనుహ్యంగా ఈవీఎం మిషన్ పాడైందని రెండు ప్రత్యర్థి వర్గాలు ఊగిపోయి ఒకరిపై ఒకరు దాడులు జరుపుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. రెండు వర్గాలు వేరు చేయడానికి ప్రయత్నించిన దాడులు చేసుకోవడం ఆపలేదని అన్నారు. అలాగే హర్యానాలో నుహ్‌లో రెండు గ్రామాల్లో కూడా కొట్లాటలు, రాళ్లు రువ్వుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. హర్యానాలో తొమ్మిది జిల్లాలో జరగనున్న మూడు దశల ఎన్నికల్లో ఇది మొదటిది. (చదవండి: వింత ఘటన: చెయ్యిని చుట్టేసి మరీ కాటేసిన నాగు.. కసితో కొరికి చంపాడు) -
తెలంగాణలో నేడు రెండో విడత పంచాయితీ ఎన్నికలు
-
తల్లి ఎన్నికల్లో గెలిచిందని.. కూతురిపై గ్యాంగ్ రేప్
-
తల్లి ఎన్నికల్లో గెలిచిందని.. కూతురిపై గ్యాంగ్ రేప్
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన జరిగింది. మీర్జాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో (బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్) ఓడిపోయినందుకు ప్రతీకారంతో విజేత కూతురిపై అమానుషంగా ప్రవర్తించారు. ఎన్నికల్లో గెలిచిన మహిళ కూతురిని ప్రత్యర్థులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలు అవమానభారంతో ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ చదువుతున్న బాధితురాలు గత బుధవారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేసి లైంగికదాడి చేశారు. ఆ మరుసటి రోజు బాధితురాలితో కలసి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకునేందుకు నిరాకరించారు. శుక్రవారం బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నాక, తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసినట్టు మీర్జాపూర్ జిల్లా ఎస్పీ చెప్పారు. -
మలి పోరుకు ముగిసిన నామినేషన్ల పర్వం
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : మలి విడత పంచాయతీ పోరులో నామినేషన్ల స్వీకరణ ఘట్టం సోమవారంతో ముగి సింది. 2013 సంవత్సరం జూలైలో ఎన్నికలు జరగని నాలుగు సర్పంచ్, 75 వార్డు స్థానాలకు ఈనెల 3వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించగా గడువు ముగిసే సమయానికి మొత్తం 107 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ వి. సత్యసాయిశ్రీనివాస్ తెలిపారు. రెండు పంచాయతీలకు దాఖలు కాని నామినేషన్లు జిల్లాలో రెండు పంచాయతీల సర్పంచ్ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కొత్తవలస మండలం వియ్యంపేట, సీతానగరం మండలం జోగింపేట పంచాయతీలకు పాత పరిస్థితే పునరావృతమైంది. ఈ రెండు పంచాయతీల సర్పంచ్ స్థానాలకు కేటాయించిన రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని జిల్లా పంచాయతీ అధికారులు తెలిపారు. వియ్యంపేట సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ మహిళకు కేటాయించారు. అయితే గ్రామంలో ఒక ఎస్టీ మహిళ ఉన్నప్పటికీ ఆమె ఉపాధ్యాయినిగా పనిచేస్తుండడంతో పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. సీతానగరం మండలం జోగింపేట సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్ కేటాయించారు. ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు లేకపోవడంతో ఆ స్థానానికి కూడా ఒక్క నామినేషనూ దాఖలు కాలేదు.ఈ పంచాయతీలో తొమ్మిది వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా అందులో కేవలం ఐదవ వార్డుకు మాత్రమే నామినేషన్ దాఖలైనట్లు అధికారులు తెలిపారు. వేపాడ మండలం గుడివాడ సర్పంచ్ స్థానానికి తొమ్మి నామినేషన్లు, సాలూరు మండలం పురోహితునివలస సర్పంచ్ స్థానానికి ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 75 వార్డు స్థానాలకు మలివిడతలో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీచేయగా అందులో జోగింపేట పంచాయతీ పరిధిలో 9 వార్డు లకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. జీఎల్‌పురం మండలంలోని మూడు వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. వార్డు ల్లో పోటీ చేసేందుకు మొత్తం 93 నామినేషన్ల దాఖలయ్యాయి. నేడు నామినేషన్ల పరిశీలన సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు మంగళవారం పరిశీలించనున్నా రు. 8వ తేదీ సాయింత్రం 5 లోగా తిరస్కరించిన నామినేషన్లపై సంబంధిత అభ్యర్థులు ఆర్డీవోలకు అప్పీలు చేసుకోవాలి.అప్పీలుకు వెంటనే రశీదు అందజేస్తూ దరఖాస్తు పరిష్కారానికి తేదీ, సమయం, కార్యాలయం కూడా తెలియజేస్తారు. 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోగా నామినేషన్లును ఉపసంహ రణకు గడువుగా నిర్ధేశించగా, అనంతరం అదే రోజున సాయంత్రం 5 గంటలకు పోటీల్లో ఉ న్న అభ్యర్థులు తుది జాబితా ప్రకటిస్తారు. -
పంచాయతీ నామినేషన్ల గడువు పూర్తి
శ్రీకాకుళం సిటీ,న్యూస్‌లైన్: జిల్లాలో ఈ నెల 18న జరగనున్న పలు పంచాయతీల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. జిల్లాలో మొత్తం 18 మండలాల్లోని 8 గ్రామ సర్పంచ్‌లు, 76 వార్డు సభ్యుల స్థానాలకు ఈనెల 3 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో చివరి రోజునే అత్యధికంగా దాఖలయ్యాయి. 8 సర్పంచ్‌లకు మొత్తం 28 నామినేషన్లు దాఖలు కాగా, అందులో కంచిలి మండలం శాసనం సర్పంచ్ స్థానానికి 2, బుడితి (సారవకోట)కు 5, కొల్లివలస (ఆమదాలవలస)కు 7, చల్లయ్యవలస (పోలాకి)కు 6, సంతబొమ్మాళి సర్పంచ్ స్థానానికి 7 నామినేషన్లు దాఖలు కాగా, బుడుమూరు (లావేరు) స్థానానికి ఒకేఒక్క నామినేషన్ దాఖలయ్యింది. కోటబొమ్మాళి మండలంలోని పట్టుపురం గ్రామ సర్పంచ్ స్థానంతో పాటు, పంచాయతీలో ఉన్న మొత్తం 8 వార్డులకు కూడా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అలాగే, కొత్తూరు మండలంలో ఎన్నికలు జరగాల్సిన పొన్నుటూరు సర్పంచ్, 7వవార్డు స్థానాలకు కూడా ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. ఇక వార్డు సభ్యుల స్థానాల్లో మొత్తం 76 వార్డులకు గాను 67 నామినేషన్లు దాఖలయ్యాయి. మెళియాపుట్టి మండలం గంగరాజుపురంలో ఎన్నికలు జరగాల్సిన 4,5 వార్డులకు, సారవకోట మండలం తొగిరిలోని 3,4,7 వార్డులకు, అలాగే కరడశింగిలో 1,4,7 వార్డులకు, రామకృష్ణపురంలో 7వ వార్డుకు, లావేరు మండలం పెదరావుపల్లిలో 2వార్డు, కోటబొమ్మాళి మండలం కస్తూరిపాడులో 7వ వార్డు, దంతలోని 4వవార్డుకు కూడా నామినేషన్లు దాఖలు కాలేదు. నేడు ఉదయం 11 గంటల నుంచి అధికారుల సమక్షంలో నామినేషన్ల స్క్రూట్నీ ప్రక్రియ జరుగనుంది. పట్టుపురంలో ఎన్నిక లేనట్టే కోటబొమ్మాళి: మండలంలోని పట్టుపురం పంచాయతీలోని సర్పంచ్, 8 వార్డులకు, దంతలోని నాలుగో వార్డు, కస్తూరిపాడులో ఏడో వార్డుకు నామినేషన్లు వేయలేదు. ఈ సారికూడా ఎన్నికలు లేనట్టేనని ఎన్నికల అధికారి చింతాడ లక్ష్మీబాయి తెలిపారు. ఈ పంచాయతీల్లో గడిచిన జూలైలో కేటాయించిన రిజర్వేషన్లే మళ్లీ కేటాయించడంతో సంబంధిత కేటగిరీకి చెందిన అభ్యర్థులు లేకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ పంచాయతీల్లో ఉన్న ఏనేటికొండలు సామాజిక వర్గానికి చెందిన వారికి గడచిన 2002 వరకు రెవెన్యూ యంత్రాంగం ఎస్టీలుగా కులధ్రువపత్రాలను మంజూరు చేసినా, తర్వాత కాలం నుంచి ధ్రువపత్రాలను జారీచేయడం నిలిపివేసింది. గత ఎన్నికల్లోనూ ఇదే రిజర్వేన్పై ఒక్క నామినేషనూ దాఖలుకాక ఎన్నిక ఆగిపోగా, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంతో మళ్లీ అదే రిజర్వేషన్లు కేటాయించడంతో మళ్లీ నామినేషన్లు పడలేదని ఆయా గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఎస్టీలు లేనప్పుడు వారికి ఎలా రిజర్వు చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
మణికొండలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
హైదరాబాద్ నగర శివారులోని మణికొండ పంచాయతీ పోలింగ్ శనివారం ఉదయం 7.00 గంటలకు మొదలైంది. అధికారులు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. అయితే తమ ఓటు హక్కు గల్లంతైందని ఓటర్లు ఆందోళనకు దిగారు. నేడు జరుగుతున్న మణికొండ పంచాయతీ సర్పంచి పదవికి ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆ పంచాయతీలోని మొత్తం14 వార్డులకు 63 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 35 పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో విలీనం చేశారు. అయితే మణికొండ పంచాయతీకి పోలింగ్ అనివార్యం అయింది. మధ్యాహ్నం 1.00 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. -
సర్పంచ్ పదవుల వేలంపై ఈసీ ఆగ్రహం