తల్లి ఎన్నికల్లో గెలిచిందని.. కూతురిపై గ్యాంగ్ రేప్
వారణాసి: ఉత్తరప్రదేశ్లో దారుణ సంఘటన జరిగింది. మీర్జాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో (బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్) ఓడిపోయినందుకు ప్రతీకారంతో విజేత కూతురిపై అమానుషంగా ప్రవర్తించారు. ఎన్నికల్లో గెలిచిన మహిళ కూతురిని ప్రత్యర్థులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలు అవమానభారంతో ఆత్మహత్య చేసుకుంది.
ఇంటర్ చదువుతున్న బాధితురాలు గత బుధవారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేసి లైంగికదాడి చేశారు. ఆ మరుసటి రోజు బాధితురాలితో కలసి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకునేందుకు నిరాకరించారు. శుక్రవారం బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నాక, తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసినట్టు మీర్జాపూర్ జిల్లా ఎస్పీ చెప్పారు.