లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కేంద్రం ఎన్ని కొత్త చట్టాలను తీసుకొచ్చిన వాటిని మానవ మృగాళ్లు లెక్క చేయడం లేదు. బదౌన్ జిల్లాలో మానవ మృగాళ్ల అకృత్యానికి 32ఏళ్ల మహిళ బలైపోయింది. ఈ సామూహిక అత్యాచారానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో షాకింగ్ సంఘటన తెరపైకి వచ్చింది. మహిళపై సామూహిక అత్యాచారం 5 నెలల క్రితం జరిగింది. అయితే ఈ సంఘటన వీడియో నెట్‌లో ప్రసారం అయిన తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గురించి బాధితురాలు గురువారం (జనవరి 28) పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేసింది. వీడియో ఆధారంగా మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఐదుగురు మైనర్లు ఉన్నారు.(చదవండి: ఇంటి దొంగే.. రూ.10 కోట్లు డిమాండ్!)
ఐదు నెలల క్రితం కట్టెల కోసం దగ్గరలోని అడవికి వెళ్ళినప్పుడు అక్కడ యువకులు తనపై సామూహిక అత్యాచారం పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నిందితులు గ్యాంగ్‌రేప్‌ను కూడా చిత్రీకరించారని తెలిపింది. ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే వీడియో వైరల్ చేస్తామని, తన భర్త, పిల్లలను చంపేస్తామని నిందితులు బెదిరించినట్లు ఆమె తెలిపారు. అయితే, వీడియో ప్రసారం అయిన తర్వాతే ఆ మహిళ ధైర్యాన్ని కూడగట్టుకొని పోలీసులుకు ఫిర్యాదు చేసింది.
బడాన్ జిల్లా ఎస్ఎస్పి సంకల్ప్ శర్మ మాట్లాడుతూ.. నిందితుల్లో ఒకరు ఈ వీడియో క్లిప్‌లను గ్రామ పరిసర ప్రాంతాలలోని కొంతమందికి రూ.300 చొప్పున విక్రయించారని తెలిపారు. దీంతో ఈ వీడియో బయటకి వచ్చినట్లు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో కూడా బదౌన్ జిల్లాలో మానవ మృగాళ్ల అకృత్యానికి 50ఏళ్ల మహిళ అంత్యంత దారుణంగా బలైపోయింది. దేవాలయానికి వెళ్లిన 50ఏళ్ల మహిళపై కామాంధులు విరుచుకుపడ్డారు. ఆమె దేహంతో ఆటబొమ్మతో ఆడుకున్నట్లుగా అత్యంత కిరాతకంగా.. పాశవికంగా ఇష్టమొచ్చినట్లుగా ఆడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment