Uttar Pradesh: 3 Men Physically Assaulted Woman In Moving Car In Agra, Details Inside - Sakshi
Sakshi News home page

మరో నిర్భయ.. షేర్డ్‌ ట్యాక్సీలో యువతిపై సామూహిక లైంగిక దాడి

Dec 28 2022 3:30 PM | Updated on Dec 28 2022 6:08 PM

Woman Physically Assault In Moving Car In Agra - Sakshi

దేశంలో రోజురోజుకు యువతులు, మహిళలపై లైంగికదాడులు పెరుగుతూనే ఉన్నాయి. కొందరు మృగాలు రెచ్చిపోతూ ఆఫీసులకు వెళ్లే యువతులు, నిర్మానుష్య ప్రాంతాల్లో వెళ్లే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. షేర్డ్‌ టాక్సీలో వెళ్తున్న యువతి లైంగికదాడికి గురైంది. 

వివరాల ప్రకారం.. ఆగ్రాకు చెందిన ఓ యువతి.. షేర్డ్‌ ట్యాక్సీ బుక్‌ చేసుకుంది. ఈ క్రమంలో ట్యాక్సీ రాగానే లోపల కూర్చుంది. అయితే, ట్యాక్సీ కొంత దూరం వెళ్లగానే మరో ముగ్గురు వ్యక్తులు ఎక్కారు. అనంతరం, కొద్ది దూరం వెళ్లగానే యువతిపై యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత, ఆమెను ఎత్మాద్‌పూర్‌ ఏరియాలో దించేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు ఎత్మాద్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ సందర్బంగా ఆగ్రా సీపీ ప్రీతింధర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. బాధితురాలు షేర్డ్‌ టాక్సీ బుక్‌ చేసుకుని వెళ్తుండగా ముగ్గురూ కలిసి తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాము. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా కారును గుర్తించి నిందితుల కోసం గాలిస్తున్నాము. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి వైద్య చిక్సితలు అందిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement