మలి పోరుకు ముగిసిన నామినేషన్ల పర్వం
Published Tue, Jan 7 2014 4:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : మలి విడత పంచాయతీ పోరులో నామినేషన్ల స్వీకరణ ఘట్టం సోమవారంతో ముగి సింది. 2013 సంవత్సరం జూలైలో ఎన్నికలు జరగని నాలుగు సర్పంచ్, 75 వార్డు స్థానాలకు ఈనెల 3వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించగా గడువు ముగిసే సమయానికి మొత్తం 107 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ వి. సత్యసాయిశ్రీనివాస్ తెలిపారు.
రెండు పంచాయతీలకు దాఖలు కాని నామినేషన్లు
జిల్లాలో రెండు పంచాయతీల సర్పంచ్ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కొత్తవలస మండలం వియ్యంపేట, సీతానగరం మండలం జోగింపేట పంచాయతీలకు పాత పరిస్థితే పునరావృతమైంది. ఈ రెండు పంచాయతీల సర్పంచ్ స్థానాలకు కేటాయించిన రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని జిల్లా పంచాయతీ అధికారులు తెలిపారు. వియ్యంపేట సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ మహిళకు కేటాయించారు. అయితే గ్రామంలో ఒక ఎస్టీ మహిళ ఉన్నప్పటికీ ఆమె ఉపాధ్యాయినిగా పనిచేస్తుండడంతో పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. సీతానగరం మండలం జోగింపేట సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్ కేటాయించారు.
ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు లేకపోవడంతో ఆ స్థానానికి కూడా ఒక్క నామినేషనూ దాఖలు కాలేదు.ఈ పంచాయతీలో తొమ్మిది వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా అందులో కేవలం ఐదవ వార్డుకు మాత్రమే నామినేషన్ దాఖలైనట్లు అధికారులు తెలిపారు. వేపాడ మండలం గుడివాడ సర్పంచ్ స్థానానికి తొమ్మి నామినేషన్లు, సాలూరు మండలం పురోహితునివలస సర్పంచ్ స్థానానికి ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 75 వార్డు స్థానాలకు మలివిడతలో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీచేయగా అందులో జోగింపేట పంచాయతీ పరిధిలో 9 వార్డు లకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. జీఎల్‌పురం మండలంలోని మూడు వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. వార్డు ల్లో పోటీ చేసేందుకు మొత్తం 93 నామినేషన్ల దాఖలయ్యాయి.
నేడు నామినేషన్ల పరిశీలన
సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు మంగళవారం పరిశీలించనున్నా రు. 8వ తేదీ సాయింత్రం 5 లోగా తిరస్కరించిన నామినేషన్లపై సంబంధిత అభ్యర్థులు ఆర్డీవోలకు అప్పీలు చేసుకోవాలి.అప్పీలుకు వెంటనే రశీదు అందజేస్తూ దరఖాస్తు పరిష్కారానికి తేదీ, సమయం, కార్యాలయం కూడా తెలియజేస్తారు. 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోగా నామినేషన్లును ఉపసంహ రణకు గడువుగా నిర్ధేశించగా, అనంతరం అదే రోజున సాయంత్రం 5 గంటలకు పోటీల్లో ఉ న్న అభ్యర్థులు తుది జాబితా ప్రకటిస్తారు.
Advertisement
Advertisement