group fight
-
ఈవీఎం పాడవ్వడంతో తలెత్తిన ఘర్షణ...పలువురికి గాయాలు
న్యూఢిల్లీ: హర్యానాలోని ఝజ్జర్‌లో మూడు అంచెల పంచాయతీ ఎన్నికల జరగుతున్నాయి. ఐతే పోలింగ్ బూత్ వద్ద మిషన్ చెడిపోవడంతో రెండు వర్గాల మధ్య బీకర పోరు జరిగింది. ఓటింగ్ వేస్తున్న సయయంతో అనుహ్యంగా ఈవీఎం మిషన్ పాడైందని రెండు ప్రత్యర్థి వర్గాలు ఊగిపోయి ఒకరిపై ఒకరు దాడులు జరుపుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. రెండు వర్గాలు వేరు చేయడానికి ప్రయత్నించిన దాడులు చేసుకోవడం ఆపలేదని అన్నారు. అలాగే హర్యానాలో నుహ్‌లో రెండు గ్రామాల్లో కూడా కొట్లాటలు, రాళ్లు రువ్వుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. హర్యానాలో తొమ్మిది జిల్లాలో జరగనున్న మూడు దశల ఎన్నికల్లో ఇది మొదటిది. (చదవండి: వింత ఘటన: చెయ్యిని చుట్టేసి మరీ కాటేసిన నాగు.. కసితో కొరికి చంపాడు) -
ఇక్కడ ఎందుకు స్నానం చేస్తున్నావు
శ్రీకాకుళం : కోడిశ గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య శనివారం జరిగిన కొట్లాటలో నలుగురు గాయపడ్డారు. ఎస్సై షేక్ మహ్మద్ ఆలీ అందజేసిన వివరాల ప్రకారం.. కొమ్మోజి సింహాచలం, రాజీవ్‌లు అన్నదమ్ములు. సింహాచలం ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో రాజీవ్ స్నానం చేస్తున్నాడు. ‘ ఇక్కడ ఎందుకు స్నానం చేస్తున్నావు, బురద అయిపోతుంద’ని సింహాచలం అనడంతో వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కుటుంబ సభ్యులు కూడా వీరికి తోడై చెక్కపేలతో కొట్టుకోవడంతో రాజీవ్, మన్మథరావు, రామారావు, జనార్దనరావు గాయపడ్డారని ఎస్సై తెలిపారు. క్షతగాత్రులను రాజాం సామాజిక ఆస్పత్రికి చికిత్సకోసం తరలించారు. అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. సింహాచలం, రాజీవ్ వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు 11 మందిపై కేసు నమోదు చేశామన్నారు. -
టీఆర్ఎస్లో వర్గ పోరాటం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరాటం భగ్గుమంది. గుండాల మండలం టీఆర్ఎస్లో నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో గుండాల టీఆర్ఎస్ మండల కార్యదర్శి ఖదీర్‌పై మండల అధ్యక్షుడు భాస్కర్ శనివారం దాడిచేశాడు. ఖదీర్‌పై భాస్కర్ కర్రలతో దాడిచేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఖదీర్ గుండాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
టీడీపీలో భగ్గుమన్న వర్గ విబేధాలు
► పేట్రేగిన కన్నబాబు వర్గీయులు ► ఆనం అనుయాయుల కరకట్టను తగులబెట్టిన వైనం ► పోలీస్‌స్టేషన్ ఎదుటే బాధితులపై దాడి నెల్లూరు: టీడీపీ వర్గవిభేదాల్లో ఓ వర్గం పేట్రేగిపోయింది. తమకు జరిగిన అన్యాయంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నవారిని స్టేషన్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంది. రాళ్లు, రాడ్లతో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచింది. ఈ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్‌పేటలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. పెద్దబ్బీపురం గ్రామానికి చెందిన ఆనం వర్గీయులైన అల్లంపాటి సీతారామిరెడ్డి, ఉమ్మడిశెట్టి వెంగయ్యలకు చెందిన నిమ్మ, మామిడి తోటల చుట్టూ ఉన్న కరకట్టను కన్నబాబు వర్గీయులైన మాధవరెడ్డి తదితరులు మంగళవారం ఉదయం తగులబెట్టారు. వెంటనే ఈ విషయాన్ని బాధితులు స్థానిక సర్పంచ్ తగరపు మాలకొండయ్యకు తెలిపి ఆత్మకూరు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైరింజన్ గ్రామానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్న సమయంలోనే సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ విషయమై సమావేశం నిర్వహించారు. కరకట్ట తగులబెట్టిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించి ఆ మేరకు సీతారామిరెడ్డి, వెంగయ్య, సర్పంచ్ తగరపు మాలకొండయ్యలు కారులో ఏఎస్‌పేటలోని పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే వారు పోలీసులకు ఫిర్యాదు చేయనున్న విషయం తెలుసుకున్న కన్నబాబు వర్గీయులైన మాధవరెడ్డి, ఊసా మాలకొండయ్య, కొండాస్వామి, బొమ్మినేని చినవెంగయ్య, నరసయ్య, మధుసూదన్, ఊసా రవి తదితరులు మరో కారులో పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. బాధితులు స్టేషన్లోకి వెళ్తుండగా ముందుగానే కారులో తమ వెంట తెచ్చుకున్న రాళ్లు, రాడ్లతో వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో వెంగయ్య, సీతారామిరెడ్డిల తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావమైంది. సర్పంచ్ మాలకొండయ్యకు ఓ మోస్తరు గాయాలు కాగా తప్పించుకుని పారిపోయాడు. తీవ్ర గాయమైన వెంగయ్య పరుగున పోలీస్‌స్టేషన్ లోపలకు వెళ్లి పడిపోయాడు. ఆ సమయంలో ఎస్సై నెల్లూరులో క్రైం మీటింగ్‌కు వెళ్లారని పోలీసులు తెలిపారు. కేçసు నమోదు చేసుకుని బాధితులను చికిత్స కోసం ఆత్మకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దాడి చేసిన వారు గతంలోనూ తమ తోటల్లోని నిమ్మ, మామిడి నరికి వేశారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఏకంగా ప్రాణాలు తీసేందుకు ఒడిగట్టారని బాధితులు వాపోయారు. -
ప్రాణం తీసిన ప్రేమ వివాదం
గుమ్మలక్ష్మీపురం : ప్రేమ వివాహానికి సంబంధించి తాడికొండ గ్రామంలో ఇరు వర్గాల మధ్య నెలకొన్న వివాదంలో నిమ్మల సారంగి(68) బీపీకి గురై మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఎల్విన్‌పేట ఎస్ఐ కిరణ్‌కుమార్ తెలిపిన వివరాలు...తాడికొండ గ్రామానికి చెందిన పాలక మహేంద్ర అనే యువకుడు అదే గ్రామానికి చెందిననిమ్మక దివ్యను ప్రేమ పేరిట మూడు నెలల కిందట గ్రామం నుంచి తీసుకుపోయాడు. అప్పట్లో దివ్య తల్లిదండ్రులు మహేంద్ర తల్లిదండ్రులను నిలదీశారు. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య పలుమార్లు వివాదం నెలకొంది. ఈ క్రమంలో మహేంద్ర తల్లిదండ్రులు పాలక రామా రావు, సులోచనలు దివ్యను తీసుకువస్తామని చెప్పి మూడు నెలల కిందట గ్రామం నుంచి వెళ్లారు. తరువాత శుక్రవారం మహేంద్ర తల్లిదండ్రులు గ్రామానికి వచ్చారు. విషయం తెలుసుకున్న దివ్య తల్లిదండ్రులు వారింటికి వెళ్లి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య పెద్ద వివాదం చోటు చేసుకుని కేకలు వేసుకున్నారు. ఈ దశలో దివ్య పెద్దనాన్న నిమ్మల సారంగి(60) పెద్దగా కేకలు వేయడంతో రక్తపోటుకు గురై కుప్పకూలిపోయాడు. స్పందించిన కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
తమ్ముళ్ల బాహాబాహీ
కొంతమూరు గ్రామకమిటీ ఎన్నిక రసాభాస ప్రస్తుత అధ్యక్షుడు వద్దంటూ నినాదాలు సభ్యత్వాలు లేకుండా చేశారని ఆరోపణ రాజమహేంద్రవరం రూరల్ : తెలుగుదేశం పార్టీలో ఉన్న అసమ్మతి సెగలు గ్రామ స్థాయి సంస్థాగత ఎన్నికలలో ఒక్కసారిగా బయటపడ్డాయి. జన్మభూమి కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షులు అసలైన కార్యకర్తలకు గుర్తింపునివ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తమైంది. టీడీపీ సభ్యత్వాలు సైతం రాయలేదని బహిరంగంగా ఆరోపించడంతో పాటు, బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటన మంగళవారం కొంతమూరులో చోటు చేసుకుంది. పార్టీ కొంతమూరు గ్రామ కమిటీ ఎన్నికల సమావేశం గ్రామ టీడీపీ అధ్యక్షుడు దండమూడి సత్యప్రసాద్ ఇంటి వద్ద ఖాళీస్థలంలో నిర్వహించారు. పరిశీలకులుగా జిల్లా టీఎ¯ŒSటీయూసీ అధ్యక్షుడు నక్కాచిట్టిబాబు, కార్పొరేటర్లు పల్లిశ్రీనివాసరావు, మానుపాటి తాతారావు, మాజీ కార్పొరేటర్ యార్లగడ్డ శేఖర్ హాజరయ్యారు. కార్యకర్తలు అభిప్రాయం తీసుకుంటుండగానే కంటిపూడి బలరామకృష్ణ వర్గీయులు, దండమూడి ప్రసాద్ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దండమూడి ప్రసాద్‌ను ఎట్టి పరిస్థితుల్లోను గ్రామ అధ్యక్షుడిగా నియమించడానికి వీలులేదని, కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని, జన్మభూమి కమిటీ సభ్యుల పేరుతో దోచుకుతింటున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామకమిటీతో పాటు జన్మభూమి కమిటీ సభ్యులను కూడా మార్చాలన్నారు. దండమూడి ప్రసాద్ వర్గీయులకు మాత్రమే సభ్యత్వాలు ఇచ్చారని, మిగిలినవారికి లేకుండా చేశారని ఆరోపించారు. 20 ఏళ్లపాటు గ్రామ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన తనకు సభ్యత్వం లేకుండా చేశారని బలరామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో బలరామకృష్ణ వర్గీయులు, ప్రసాద్ వర్గీయులు బాహాబాహీకి దిగి తోసుకుని కుర్చీలు విసురుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చివరకు పరిశీలకులు ఇరువర్గాలు ప్రతిపాదనలు ఇవ్వాలని వాటిని రూరల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన తరువాత కమిటీని నియమిస్తామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
కేంద్రమంత్రి సాక్షిగా టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు
కనిగిరి : ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కొన్ని నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత వర్గపోరు కేంద్రమంత్రి సుజనాచౌదరి సాక్షిగా భగ్గుమంది. కనిగిరిలో శనివారం ఏర్పాటు చేసిన ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ ప్రమాణస్వీకారోత్సవానికి కేంద్రమంత్రి సుజనాచౌదరి హాజరయ్యారు. కాగా, దారపనేనికి ఏఎంసీ చైర్మన్ పదవి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ఎమ్మెల్యే కదిరి బాబూరావు వ్యతిరేక వర్గీయులు మూకుమ్మడిగా కార్యక్రమాన్ని బహిష్కరించారు. మాజీ ఎంపీపీ, టీడీపీ కనిగిరి మండలాధ్యక్షుడు బేరి పుల్లారెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిషలు కష్టపడ్డ తమను ఎమ్మెల్యే బాబూరావు పట్టించుకోవట్లేదని, ఏఎంసీ ప్రమాణస్వీకారానికి తమను కాదని ఇతర జిల్లాలు (గుంటూరు, నెల్లూరు, విజయవాడ) నుంచి నుంచి మనుషులను తీసుకొచ్చుకున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే కదిరి బాబూరావు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తమ నిరసన తెలిపేందుకే కేంద్ర మంత్రి పాల్గొన్న కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు పుల్లారెడ్డి తెలిపారు. పార్టీ కనిగిరి పట్టణ అధ్యక్షుడు, వైస్ చైర్మన్ వీవీఆర్ మనోహర్‌రావు, కౌన్సిలర్ల ఎస్కే ఫయాజ్, జాళ్లపాలెం సుబ్బారెడ్డి, పువ్వాడి వెంకటేశ్వర్లు, రాంబాబు, మోపాడు రిజర్వాయర్ చైర్మన్ అడుసుమల్లి ప్రభాకర్‌లు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బాయికాట్ చేసినవారిలో ఉన్నారు. మరో ఇద్దరు పార్టీ మండల అధ్యక్షులు సొంతపనుల సాకుతో ప్రమాణస్వీకారోత్సవానికి దూరంగా ఉన్నారు. అసమ్మతి వర్గంలోని వారు ఎక్కువ మంది ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరులే కావటం గమనార్హం. ప్రమాణస్వీకారోత్సవ సభలో కేంద్రమంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలంటూ హితబోధ చేశారు.