ప్రతీకాత్మక చిత్రం
శ్రీకాకుళం : కోడిశ గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య శనివారం జరిగిన కొట్లాటలో నలుగురు గాయపడ్డారు. ఎస్సై షేక్ మహ్మద్ ఆలీ అందజేసిన వివరాల ప్రకారం.. కొమ్మోజి సింహాచలం, రాజీవ్‌లు అన్నదమ్ములు. సింహాచలం ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో రాజీవ్ స్నానం చేస్తున్నాడు. ‘ ఇక్కడ ఎందుకు స్నానం చేస్తున్నావు, బురద అయిపోతుంద’ని సింహాచలం అనడంతో వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కుటుంబ సభ్యులు కూడా వీరికి తోడై చెక్కపేలతో కొట్టుకోవడంతో రాజీవ్, మన్మథరావు, రామారావు, జనార్దనరావు గాయపడ్డారని ఎస్సై తెలిపారు. క్షతగాత్రులను రాజాం సామాజిక ఆస్పత్రికి చికిత్సకోసం తరలించారు. అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. సింహాచలం, రాజీవ్ వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు 11 మందిపై కేసు నమోదు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment