booth
-
అవి డొల్ల కమిటీలేనా?
సాక్షి, హైదరాబాద్: సంస్థాగతంగా పార్టీ పటిష్టతకు, ఎన్నికల్లో బూత్‌ల వారీగా పైచేయి సాధనకు పోలింగ్‌బూత్ కమిటీలే కీలకమని బీజేపీ గట్టిగా విశ్వసిస్తోంది. అయితే పార్టీకి పోలింగ్‌బూత్ కమిటీలే బలమనుకుంటే.. చాలా చోట్ల బూత్‌కమిటీ అధ్యక్షులే లేరని, కమిటీ సభ్యుల్లో చాలా మంది చురుకుగా పనిచేయడం లేదని ముఖ్యనేతల పరిశీలనలో వెల్లడైనట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల 119 నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు పర్యటించిన సందర్భంగా వారు రూపొందించిన నివేదికల్లోనూ ఇదే విషయం బయట పడిందని వెల్లడైంది. ఈ నివేదికలు, ఇతరత్రా అందిన సమాచారం మేరకు.. క్షేత్రస్థాయిలో పరిస్థితి, పోలింగ్ బూత్ కమిటీల తీరు గురించి క్రాస్ చెక్ చేసినపుడు కూడా ఇదే విషయం తేలడంతో పార్టీ ముఖ్యనేతలకు కలవరం మొదలైందని సమాచారం. బూత్ కమిటీల్లో చాలాచోట్ల పోలింగ్ బూత్ అధ్యక్షులే లేరని, ఈ జాబితాల్లో పేర్లు ఉన్న వారిలో చాలామంది ప్రస్తుతం చురుకుగా పనిచేయకపోవడం, పలుచోట్ల బూత్ కమిటీ సభ్యులు కూడా మొక్కుబడిగా పనిచేయడం, పార్టీలో లేనివారి పేర్లు కమిటీల్లో చోటుచేసుకోవడం వంటివి బయటపడడంతో అర్జంట్‌గా ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు నాయకత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి పరిశీలనకు 450 మంది.. రాష్ట్రంలో బూత్‌కమిటీల నియామకానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం. ఈ నెల 26 నుంచి 19 రోజులపాటు రాష్ట్రంలో మూడుచోట్ల నుంచి బస్సు (రథ)యాత్రలు ప్రారంభించి, అక్టోబర్ 14న హైదరాబాద్‌లో ముగింపు సందర్భంగా ప్రధాని మోదీని ఆహ్వానించి బహిరంగసభ నిర్వహించాలని ముఖ్యనేతలు నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం రద్దు చేసుకున్నారు. ఇదిలా ఉండగా పోలింగ్ బూత్‌కమిటీలు సరిగా లేకపోవడమే దీనికి కారణమని విశ్వసనీయ సమాచారం. బూత్ కమిటీలు సక్రమంగా లేకుండా బస్సుయాత్రలు ఎలా విజయవంతం అవుతాయని బన్సల్ రాష్ట్రనేతలను నిలదీసినట్టు తెలిసింది. దీనిని సీరియస్ తీసుకున్న బన్సల్.. ఈ నెల 26 నుంచి వచ్చేనెల 2 దాకా రెండేసి మండలాల చొప్పున పరిశీలించి నివేదికల సమర్పణకు 450 మందిని క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధం చేసినట్టు పార్టీవర్గాల సమాచారం. వారికి అప్పగించిన మండలాలలో బూత్ కమిటీ అధ్యక్షుడు ఉన్నాడా, కమిటీలు ఉన్నాయా, శక్తి కేంద్ర ఇన్చార్జి ఉన్నాడా, మండల కమిటీ ఉందా, ఎంత మందితో ఉంది.. వంటి అంశాలను వారు లోతుగా పరిశీలించనున్నారు. రాష్ట్ర పార్టీ సిద్ధం చేసిన నమూనాకు అనుగుణంగా పోలింగ్‌బూత్ అధ్యక్షులు, కమిటీలపై వీరు నివేదికను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జిలతో మాట్లాడిన బన్సల్.. రాజకీయ కార్యక్రమాలను తగ్గించి సంస్థాగత విషయాలపై దృష్టి పెట్టాలని ఆదేశించినట్టు తెలిసింది. చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని పక్షంలో పార్టీ మండలా«ద్యక్షులను కూడా మార్చాలని, బూత్‌కమిటీలకు కొత్త అధ్యక్షులను నియమించాలని ఆయన సూచించినట్టు తెలిసింది. -
రామ్ గోపాల్ వర్మ నాటి హాట్ బ్యూటీ పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే
బర్ఖా మదన్ హిందీ, పంజాబీ సినిమాల్లో నటించడమే కాకుండా.. పలు సినిమాలకు నిర్మాత కూడా. అంతే కాదు తనొక మోడల్, చివరకు టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించడంతోపాటు కొన్ని టీవీ షోలను కూడా హోస్ట్ చేసింది. ఇలా సినిమా రంగానికి దగ్గరగా ఉన్న తను బౌద్ధ సిద్ధాంతాల పట్ల ఆకర్షితురాలై 2012 నవంబరులో బౌద్ధ సన్యాసిగా తన సన్యాసాన్ని పొంది, తన పేరును వేం. గ్యాల్టెన్ సామ్టెన్గా మార్చకుంది. తను ఇప్పడు ఇండియన్ నన్‌గా గుర్తిపు పొందింది. ఐశ్వర్యరాయ్, సుస్మితా సేన్లతో పోటీ బర్ఖా మదన్ 1994లో మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొంది. అప్పుడు బాలీవుడ్ హీరోయిన్గా కొనసాగుతున్న సుస్మితా సేన్ విజేతగా నిలిచారు. అదే పోటీలో మరో హీరోయిన్ ఐశ్వర్య రాయ్ మొదటి రన్నరప్‌గా నిలిచారు. బర్ఖా మదన్ మాత్రం మిస్ టూరిజం ఇండియాగా ఎంపికైంది. మలేషియాలో కూడా మిస్ టూరిజం ఇంటర్నేషనల్‌లో మూడవ రన్నరప్‌గా నిలిచింది. బాలీవుడ్లో ఎంట్రీ 1996లో, అక్షయ్ కుమార్, రేఖ రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ చిత్రం 'ఖిలాడియోన్ కా ఖిలాడి'లో బర్ఖా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఖిలాడీ సిరీస్ యొక్క నాల్గోవ సీజన్లో ఆమె నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు అందుకుంది. రామ్ గోపాల్ వర్మ భూత్‌లో బర్ఖా మదన్ బర్ఖా తన కెరీర్లో సెలెక్టివ్‌గా ఉంటూ, రామ్ గోపాల్ వర్మ యొక్క అతీంద్రియ భయానక చిత్రం భూత్‌లో మంజీత్ ఖోస్లా అనే దెయ్యం పాత్రను పోషించినప్పుడు విమర్శకులతో పాటు ప్రేక్షకులను భయభ్రాంతులకు గురి చేసింది. అంతలా ఆ సినిమా మెప్పస్తుంది. 2003 చలన చిత్రం అజయ్ దేవగన్, ఊర్మిళ మటోండ్కర్, నానా పటేకర్, రేఖ, ఫర్దీన్ ఖాన్‌లతో కలిసి కూడా నటించింది. బర్ఖా మదన్ ఇప్పుడు గ్యాల్టెన్ సామ్టెన్ సోచ్ లో,సుర్ఖాబ్ వంటి రెండు చిత్రాలను కూడా నిర్మించిన బర్ఖా మదన్‌కు బౌద్ధ గురువు దలైలామా అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నారు. దీంతో 2012లో బౌద్ధమతాన్ని స్వీకరించాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆమె సన్యాసిగా మారి తన పేరును గ్యాల్టెన్ సామ్టెన్గా మార్చకున్నారు. ఇప్పుడు ఆమె ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన పలు ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంది. (ఇదీ చదవండి: తమన్నాకు గోల్డెన్ ఛాన్స్.. మరోసారి ఆయనతో రొమాన్స్‌కు రెడీ) -
Gujarat Polls: ఒక్క ఓటర్ కోసం పోలింగ్ బూత్.. 8 మంది సిబ్బంది
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే, ఈ పోలింగ్‌లో ఓ ఆసక్తికర విషయం ఉంది. ఓటింగ్ శాతం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం.. కేవలం ఒక్క ఓటర్ కోసం ఏకంగా పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేసింది. అందుకోసం సుమారు 8 మంది వరకు పోలింగ్, భద్రతా సిబ్బందిని పంపించింది. ఈ పోలింగ్ బూత్ దట్టమైన గిర్ అడవుల్లో ఉంటుంది. బనేజ్ ప్రాంతంలోని ఉనా నియోజకవర్గానికి తొలి విడతలో పోలింగ్ జరిగింది. అటవీ ప్రాంతంలో నివసించే మహంత్ హరిదాస్జీ ఉదాసిన్ అనే వ్యక్తి కోసం ఈ పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. తొలి విడతలో భాగంగా మహంత్ హరిదాస్జీ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేసింది ఎన్నికల కమిషన్. ఉనా అసెంబ్లీలోని బనేజ్ పోలింగ్ కేంద్రానికి 2002 నుంచి శివుని మందిరం వద్ద నివాసమున్న మహంత్ భరత్‌దాస్ అనే వ్యక్తి ఒక్కరే ఓటు వేసేందుకు వచ్చేవారు. అప్పట్లో ఆయన కోసమే ఈ పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. ఆయన మరణించిన తర్వాత పోలింగ్ బూత్‌ను మూసివేయాలనుకున్నారు. కానీ, ఆయన వారసుడిగా మహంత్ హరిదాస్జీ రావడం వల్ల తిరిగి పోలింగ్ బూత్‌ను ప్రారంభించారు. #ECI has set up a polling booth for only one voter, Mahant Haridasji Udasin in Banej (93-Una AC) in the dense jungles of Gir. Glimpses of Haridas Ji casting his vote during 1st phase of #GujaratElections2022.#novotertobeleftbehind #GujaratAssemblyPolls #ECI #EveryVoteMatters pic.twitter.com/FhDDELyRXU — Election Commission of India #SVEEP (@ECISVEEP) December 1, 2022 ఇదీ చదవండి: ప్రశాంతంగా ముగిసిన గుజరాత్ తొలి విడత పోలింగ్ -
ఈవీఎం పాడవ్వడంతో తలెత్తిన ఘర్షణ...పలువురికి గాయాలు
న్యూఢిల్లీ: హర్యానాలోని ఝజ్జర్‌లో మూడు అంచెల పంచాయతీ ఎన్నికల జరగుతున్నాయి. ఐతే పోలింగ్ బూత్ వద్ద మిషన్ చెడిపోవడంతో రెండు వర్గాల మధ్య బీకర పోరు జరిగింది. ఓటింగ్ వేస్తున్న సయయంతో అనుహ్యంగా ఈవీఎం మిషన్ పాడైందని రెండు ప్రత్యర్థి వర్గాలు ఊగిపోయి ఒకరిపై ఒకరు దాడులు జరుపుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. రెండు వర్గాలు వేరు చేయడానికి ప్రయత్నించిన దాడులు చేసుకోవడం ఆపలేదని అన్నారు. అలాగే హర్యానాలో నుహ్‌లో రెండు గ్రామాల్లో కూడా కొట్లాటలు, రాళ్లు రువ్వుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. హర్యానాలో తొమ్మిది జిల్లాలో జరగనున్న మూడు దశల ఎన్నికల్లో ఇది మొదటిది. (చదవండి: వింత ఘటన: చెయ్యిని చుట్టేసి మరీ కాటేసిన నాగు.. కసితో కొరికి చంపాడు) -
కరోనా రాకుండా.. స్టీమ్ బూత్
సాక్షి, పలమనేరు: విధుల్లో ఉండేవారు కరోనా వైరస్ బారిన పడకుండా ‘కరోనా స్టీమ్ బూత్’ పేరిట ఓ యంత్రాన్ని రూపొందించాడు.. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరం గ్రామానికి చెందిన పవన్. చదివింది పదో తరగతే అయినా.. ఇప్పటికే పలు ప్రయోగాలు చేసి ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా అతడు తయారు చేసిన స్టీమ్ బూత్‌లోకి వెళితే నాలుగు నిమిషాల్లోనే శరీరమంతా శానిటైజేషన్ చేసుకోవచ్చు. దీంతో శరీరం, గొంతుతో సహా తల వెంట్రుకల్లో ఉండే వైరస్ మొత్తం నశిస్తుందని చెబుతున్నాడు. పబ్లిక్ టెలిఫోన్ బూత్‌లా ఉండే దీని తయారీకి కేవలం రూ.8 వేలు మాత్రమే ఖర్చు కావడం మరో విశేషం. వీటిని క్వారంటైన్ సెంటర్ల వద్ద లేదా ఎక్కువ జన సమూహాలుండే చోట అమర్చితే ఎంతో మేలుగా ఉంటుందని అంటున్నాడు పవన్. చిత్తూరును రెడ్ జిల్లాగా ప్రకటించిన కేంద్రం -
అనంతపురం: అసౌకర్యాలు.. అవస్థలు
సాక్షి, అనంతపురం న్యూసిటీ: నగరంలోని వివిధ పోలింగ్ బూత్‌లలో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. కనీసం తాగునీరు ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రజలు మండుటెండలో ఓటర్లు నరకం చూశారు. ఇక వృద్ధులు, ప్రమాదాలు జరిగి ఇబ్బందులు పడుతున్నవారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. 27వ డివిజన్ భాష్యం స్కూల్ 150, 151, 152వ బూత్‌లలో ర్యాంప్, మెట్లు పెద్దగా ఉండడంతో వృద్ధులు, మహిళలు, కాలు, చేయి విరిగిన వారు అవస్థలు పడ్డారు. 33వ డివిజన్ శ్రీకృష్ణదేవరాయ నగరపాలక ఉన్నత పాఠశాలలో వీల్‌చైర్ సదుపాయం లేకపోవడంతో దివ్యాంగురాలు నాగేంద్రమ్మను తమ్ముడు రమేష్ ఎత్తుకుని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటేయించాడు. 24వ డివిజన్ బుడ్డప్పనగర్ 230, 231, 232, 233 బూత్‌లలో వృద్ధులు, వికలాంగులు ఓటేసేందుకు ఇబ్బందులు పడ్డారు. అదే బూత్‌లలో నీరు లేకపోవడంతో మహిళలు వాటర్ ప్యాకెట్ల కోసం ఎగబడ్డారు. అరవిందనగర్ పోలింగ్ బూత్ 130, లా కళాశాల పోలింగ్ బూత్ 243, 244, 245, 246 బూత్‌లలో తాగునీరు, షామియాన ఏర్పాటు చేయకపోవడంతో ఓటర్లు ఎండలోనే ఇబ్బంది పడ్డారు. బుడ్డప్పనగర్ 236 బూత్‌లో ఓ బాలింత ఎండలో నిల్చోలేక కన్నీటి పర్యంతమైంది. అదే డివిజన్లో బారికేడ్లు సరిగా ఏర్పాటు చేయకపోవడంతో అవి కిందకు పడిపోయాయి. 242 బూత్లోనూ అదే పరిస్థితి. అగ్రికల్చర్ జేడీ ఆఫీస్ బూత్ నెంబర్ 242లో రెండు గంటల పాటు ఈవీఎంలు మొరాయించాయి. కేఎస్ఆర్ కళాశాల బూత్‌నెంబర్ 123లో ఈవీఎం మొరాయించడంతో గంటన్నర ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. బూత్ నెంబర్ 230లో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. బుడ్డప్పనగర్ పోలింగ్ బూత్ 236లో తన ఓటు లేదని గుప్తా అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు స్లిప్పు కోసం వెళితే మరో అడ్రస్ మార్చి తికమక చేశారన్నారు. శ్రీకృష్ణదేవరాయ స్కూల్లో జాన్ అనే వృద్ధుడు తన ఓటు గల్లంతైందని ఆవేదన వ్యక్తం చేశాడు. ► తలమర్లలో అర్ధరాత్రి వరకూ పోలింగ్ పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం తలమర్లలోని రెండో నంబర్ బూత్‌లో ఈవీఎం పలు దఫాలుగా మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో పరిస్థితి అదుపుతప్పింది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అక్కడకు చేరుకుని అధికారులతో చర్చించారు. రీపోలింగ్ జరపాలని జిల్లా ఎన్నికల అధికారి జి.వీరపాండియన్‌తో పాటు స్థానిక ప్రిసెడింగ్ అధికారిని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన అధికారులు.. కొత్త ఈవీఎంలు సమకూర్చి రాత్రి 8 గంటలకు పోలింగ్ ప్రారంభించారు. అర్ధరాత్రి వరకూ ఓటర్లు పోలింగ్ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►బాలయ్యకు చుక్కెదురు తనకు ఎదురు వచ్చిన వారిపై విచ్చణారహితంగా దాడి చేసే హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యను అదే నియోజకవర్గం గోళాపురం వాసులు బెంబేలెత్తించారు. వివరాల్లోకి వెళితే.. పోలింగ్ సరళిని పరిశీలిస్తూ.. గురువారం గోళాపురం గ్రామానికి వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ సతీమణి సవిత మాధవ్ చేరుకున్నారు. ఆమెకు గ్రామస్తులు ఘన స్వాగతం పలుకుతూ జై జగన్ అనే నినాదాలతో హోరెత్తించారు. కొద్ది సేపటికి బాలకృష్ణ కూడా అక్కడికి చేరుకున్నారు. పోలింగ్ బూత్‌ను పరిశీలించి బాలయ్య బయటకు రాగానే ఒక్కసారిగా గోళాపురం వాసులు జై జగన్ అంటూ ఆయనను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేశారు. వారి మధ్యలో నుంచి బాలయ్యను బయటకు తీసుకువచ్చేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అతి కష్టంపై బాలయ్య తన వాహనాన్ని ఎక్కి డోర్ వేసుకునే లోపు పలువురు వాహనంపైకి ఎక్కి బాలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, కిందకు దిగగానే.. అప్పటికే అవమాన భారంతో మండిపడుతున్న బాలయ్య.. ఒక్కసారిగా వాహనాన్ని ముందుకు దూకించారు. వాహనం వేగానికి దుమ్ము ఎగిసిపడి కొద్ది సేపటి వరకూ రహదారి కనిపించకుండా పోయింది. -
పోలింగ్ బూత్‌లలో జర భద్రం
సాక్షి, చీమకుర్తి(ప్రకాశం): ఎన్నికల్లో ఎలాగైనా గెలావాలి.. పోటీ చేసేవారైనా, వారి తరఫున వారి అభిమాన కార్యకర్తలైనా సరే.. ప్రత్యర్థిని ఓడించి గెలిచేందుకు, లేక గెలిపించేందుకు ఎంతకైనా సిద్ధమే. అందుకే పోలింగ్ జరిగే నాడు గ్రామాల్లో హోరాహోరీగా ఎన్నికలు జరిగే క్రమంలో ఎన్నికల విధులు నిర్వహించాలంటే అధికారులు భయాందోళనలు చెందుతుంటారు. అలాంటి వివాదాస్పద గ్రామాలలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పోలీసులకు తల ప్రాణం తోకకొచ్చినంత పనవుతుందని ఆందోళన చెందుతుంటారు. అలాంటి పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరిభాషలో పోలీసులు సమస్యాత్మక గ్రామాలుగాను, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా పోలీస్ రికార్డులలో ప్రత్యేకంగా నమోదై ఉంటుంది. పోలింగ్ రోజున జరిగే గొడవలతో పాటు పోలింగ్ ఏకపక్షంగా జరిగినా, పోటీలో ఉన్న ఒకే వ్యక్తికి 90 శాతానికి పైగా ఓట్లు పోలైనా అలాంటి పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా పోలీసులు ప్రత్యేక ముద్ర వేస్తారు. అత్యధికంగా సంతనూతలపాడు మండలంలో ఉన్నదే 60 పోలింగ్ స్టేషన్లు అయితే వాటిలో 54 క్రిటికల్ బూత్‌లే ఉండటం విశేషం. తర్వాత స్థానం నాగులుప్పలపాడు మండలంలో 74 బూత్‌లకు గాను 53 క్రిటికల్ బూత్‌లే ఉన్నాయి. అన్నిటికంటే తక్కువుగా మద్దిపాడు మండలంలో 54కి 24 బూత్‌లు మాత్రమే క్రిటికల్ గా నమోదై ఉన్నాయి. ఇక చీమకుర్తి పట్టణంలో 23 పోలింగ్ బూత్‌లు ఉంటే వాటిలో 21 పోలింగ్ బూత్‌లు క్రిటికల్‌గా నమోదై ఉన్నాయి. ఇక చీమకుర్తి మండలం మొత్తం మీద 68 బూత్‌లకు గాను 42 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా నమోదై ఉన్నాయి. మండలం క్రిటికల్ నార్మల్ మొత్తం చీమకుర్తి 42 26 68 సంతనూతలపాడు 54 6 60 మద్దిపాడు 24 30 54 నాగులుప్పలపాడు 53 21 74 మొత్తం 173 83 256 కేటగిరీలుగా విభజన.. చీమకుర్తి మండలంలోని కూనంనేనివారిపాలెం, గాడిపర్తివారిపాలెం, ఎర్రగుడిపాడు, ఇలపావులూరు, పల్లామల్లి వంటి గ్రామాలను ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. సమస్యాత్మక పోలింగ్‌కేంద్రాలను పోలీసులు మూడు రకాల కేటగిరీలుగా విభజించారు. నేర చరిత్ర, రిగ్గింగ్ స్వభావం ఎక్కువుగా ఉన్న పోలింగ్ కేంద్రాలను హైపర్ క్రిటికల్ గాను, మీడియం స్టేజిలో ఉన్న వాటిని క్రిటికల్ విభాగంలోను, సాధారణ స్థాయిలో ఉన్న వాటిని నార్మల్ పోలింగ్ స్టేషన్లుగాను విభజించారు. సంతనూతలపాడు నియోజకవర్గలోని నాలుగు మండలాల్లో మొత్తం 256 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వాటిలో హైపర్ క్రిటికల్ కేటగిరీలో ఒక్కటి కూడా లేదని, పోలీస్ రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి. క్రిటికల్ విభాగంలో 173, నార్మల్ విభాగంలో 83 ఉన్నాయి. నియోజకవర్గంలో 173 బూత్‌లు సమస్యాత్మకంగా ఉన్నాయి సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో కలిపి 256 పోలింగ్ బూత్‌లు ఉంటే వాటిలో 173 బూత్‌లు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా నమోదు చేయబడ్డాయి. 86 మాత్రమే నార్మల్ కండిషన్లో ఉన్నాయి. ఎన్నికలప్పుడు ఆయా గ్రామాలలో గతంలో జరిగిన నేరాలు, ఓటింగ్ సరళి ఒకే వ్యక్తికి ఏక పక్షంగా ఓట్లు పోలైనా క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా నమోదు చేయటమైనది. - ఓ.దుర్గా ప్రసాద్, సీఐ, ఒంగోలు రూరల్ -
పోలింగ్ ప్రాంతంలో పొగాకు ఉండదిక!
న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తులపై చట్టపరమైన నిషేధ నిబంధనలను పటిష్టస్థాయిలో అమలుచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులోభాగంగా, పోలింగ్ బూత్‌లలో పొగాకు సంబంధ ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయనున్నారు. బీడీ, సిగరెట్, గుట్కాలతోపాటు నమిలే పొగాకు ఉత్పత్తులనూ పోలింగ్ బూత్‌లలో నిషేధించింది. పొగ తాగడంసహా, ఉత్పత్తులపై నిషేధం పూర్తిగా అమలయ్యేలా జిల్లా ఎలక్టోరల్/జిల్లా మెజిస్ట్రేట్లను ఆదేశించాలని సూచిస్తూ అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఈసీ లేఖలు రాసింది. ‘దేశంలోని అన్ని పోలింగ్ బూత్‌లు పొగాకురహితంగా ఉండాలి’ అని ఈసీ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. -
ఇక భారమంతా బూత్ కమిటీలదే!
సాక్షి, హైదరాబాద్: ప్రచార గడువు ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ పోలింగ్‌పై దృష్టి పెట్టాయి. బూత్ స్థాయిలో ఓటర్లను సమీకరించి, ఓట్లు తమకు అనుకూలంగా పడే అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు వీలుగా బూత్ కమిటీలను అప్రమత్తం చేస్తున్నాయి. పార్టీకి అనుకూలంగా ఉన్న ఏ ఒక్క ఓటరును వదిలిపెట్టకుండా.. ప్రతి ఇంటికీ ఓటరు స్లిప్పులు పంచడం, వారి నుంచి ఓటు హామీ పొందడం, తటస్థులను మచ్చిక చేసుకోవడం లక్ష్యంగా బూత్ కమిటీలను పార్టీలు సిద్ధం చేశాయి. ఓటింగ్ శాతం పెంచడం, వృద్ధ, దివ్యాంగ ఓటర్లను బూత్‌లకు తీసుకొచ్చే భారాన్ని పార్టీలన్నీ బూత్‌కమిటీలపై పెట్టాయి. పోలింగ్ రోజు, అంతకుముందు రోజు ఓటర్లతో నేరుగా మాట్లాడేందుకు వీరే కీలకం కావడంతో బూత్ కమిటీల ఇన్చార్జిలను పార్టీలు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ప్రధాన పార్టీలన్నీ పోలింగ్ బూత్‌ల వారీగా పార్టీ కమిటీలు నియమించాయి. ఒక్కో బూత్ పరిధిలో 10 మంది ముఖ్య పార్టీ కార్యకర్తలు ప్రచారం నిర్వహించడంతో పాటు ఓటర్లతో సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించారు. కేటాయించిన బూత్‌ల పరిధిలో ఉన్న ఓటర్లను కలుస్తూ తమ పార్టీకే ఓటు వేయించే బాధ్యతను పూర్తిగా బూత్ కమిటీలకే అప్పగించారు. ఇదే బాటలో అన్ని పార్టీలు.. ప్రతి 10 నుంచి 20 మంది ఓటర్లకు ఒక బూత్‌స్థాయి నేత, ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇంచార్జి, బూత్కమిటీలను సమన్వయపరిచేందుకు 5 గ్రామాలకు ఒక పార్టీ నేతను కో–ఆర్డినేటర్‌గా నియమించారు. ఈ గ్రామాల ఇన్చార్జీలను సమన్వయం చేసేందుకు మండల స్థాయిలో ఒక నాయకుడు, మండల స్థాయిలో నాయకులను సమన్వయ పరిచేందుకు నియోజకవర్గ స్థాయిలో పార్టీ సీనియర్ నేతలను నియమించారు. దాదాపు అన్ని పార్టీలు ఇంచుమించు ఇదే తరహాలో కమిటీలు నియమించుకున్నాయి. కులాలు, మహిళా సంఘాలను ప్రభావితం చేసేపనిని కూడా కొంతమంది నేతలకు అప్పగించారు. ఇప్పటికే ఆయా సంఘాలతో మాట్లాడుతున్న నేతలు, పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పోరు హోరాహోరీగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఓటర్లను వ్యక్తిగతంగా ప్రభావితం చేసే అంశాలపై బూత్‌కమిటీలు ప్రత్యేక దృష్టిపెట్టాయి. కొత్త ఓటర్లతో చర్చించి పార్టీలకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తమ పార్టీకి తప్పకుండా పడతాయని భావించిన ఓట్లను వేయించడానికి మొదటి ప్రాధాన్యం ఇస్తూ, వృద్ధ, దివ్యాంగ ఓటర్లపై కమిటీలు దృష్టి పెడుతున్నాయి. ఈ బూత్‌కమిటీ నేతలకు పార్టీల అభ్యర్థులు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ ఓట్లు పడే మార్గాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. -
పార్టీకి జవసత్వాలు బూత్ కమిటీలే
పీఎంపాలెం: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో విఫలమైన అధికార టీడీపీని మట్టికరిపించడానికి బూత్ కన్వీ నర్లు, సభ్యులు క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా పని చేయాలని భీమిలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయ కర్త అక్కరమాని విజయనిర్మల పిలు పునిచ్చారు. ఆదివారం శిల్పారామంలో ఆ పార్టీ 4,5,6 వార్డుల బూత్ కమిటీలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజ ల ఉన్నతికోసం ప్రకటించిన నవరత్నాలును ప్రతి గడçపకు తీసుకెళ్లాలని సూచించారు. అలాగే వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. మహానేత వైఎస్ పాలన జగన్‌తోనే సాధ్యమనే విషయం ప్రజలకు అర్థమయ్యేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 5 వార్డు అధ్యక్షుడు పోతిన శ్రీనివాసరావు మాట్లాడుతూ వార్డులోని బూత్‌లకు చెందిన ఓట ర్లను కలసి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను వివరించాలన్నారు. పార్లమెంట్ బూత్ కమిటీ ఇన్చార్జి కిషోర్ మాట్లాడుతూ పార్టీకి జవసత్వాలు బూత్ కమిటీలే అన్నా రు. బూత్ కమిటీల విధులు బాధ్యతల గురించి సోదాహరణంగా వివరించారు. స్థానిక నాయకుడు పీవీజీ అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాలుగో వార్డు అధ్యక్షులు గాదె రోశిరెడ్డి , ఆరోవార్డు అధ్యక్షుడు లొడగల రామ్మోహన్, భీమిలి బూత్‌కమిటీ ఇన్చార్జి బి.రాజ్‌కుమార్,అన్నం వెంకటేశ్వర్లు , మహిళా విభాగం అధ్యక్షులు ధర్మాల సుజాత,ఎం.రాజేశ్వరి,కృపాజ్యోతి,పార్టీ స్టేట్ యూత్ సెక్రటరీ నల్లా రవికుమార్, సీనియర్ నాయకులు జేఎస్‌రెడ్డి , గుమ్మడి మధు, రాయిన సాయికుమార్, శివశంకరరెడ్డి పాల్గొన్నారు. -
రాష్ట్రంలో 20 వేల బూత్ కమిటీలు పూర్తి
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు పెదపూడి (అనపర్తి) : రాష్ట్రంలో 42, 300 పోలింగ్ బూత్‌లు ఉండగా, సుమారు 20 వేల కమిటీలు ఏర్పాటు చేశామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. మండలంలోని జి.మామిడాడలో బుధవారం బూత్ కమిటీ నాయకులు, పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ నెల 25 నాటికి మరో 10 వేలు పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 25 విజయవాడలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 75 వేల మంది బూత్ కమిటీల సభ్యులతో ఆయన సమావేశమవుతారన్నారు. జూలై 15 నుంచి పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విశాఖపట్నంలో జూలై నెల 15,16 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్టు వీర్రాజు చెప్పారు. ఆ సమావేశాలకు ప్రధాన మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నలుగురు డిప్యూటీ సీఎంలు, కేంద్ర పార్టీ మాజీ అధ్యక్షులు వెంకయ్యనాయుడు, నితిన్ ఘట్కారీ, రాజ్‌నాథ్‌సింగ్, మురళీ మనోహర్జోషి, తదితరులు హాజరవుతారన్నారు. ఆగస్ట్ 25, 26, 27లో అమిత్‌షా రాష్ట్రంలో పార్టీ విస్తరణ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా అందరూ కృషి చేయాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, జిల్లా కోశాధికారి మేడపాటి హరినారాయణరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి జి.వెంకటేశ్వరరావు, జిల్లా కిసాన్‌మోర్చా అ«ధ్యక్షుడు పి.సత్యనారాయణ, మండల అధ్యక్షుడు టీవీ కృష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మురముళ్ల వెంకటరమణ, మారిశెట్టి బుజ్జి, జిల్లా పార్టీ మజ్కూరి మోర్చా నాయకుడు బి.ఛత్రపతి శివాజీ, పార్టీ సీనియర్ నాయకుడు గుణ్ణం రామాంజనేయులు, మండల కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ఒరిస్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘ఉపాధి’తో జన్మభూమి కమిటీలకు సంబంధం లేదు.. రామచంద్రపురం : గ్రామాలలో చేపట్టే ఉపాధి హామీ పనులతో జన్మభూమి కమిటీలకు సంబంధం లేదని సోము వీర్రాజు అన్నారు. పట్టణంలో పార్టీ బూత్ కమిటీల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కేంద్రం అమలు జేస్తోన్న ఉపాధి పథకం ద్వారా కేవలం సర్పంచ్, గ్రామ సభల ద్వారా పనులు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. చెట్టు నీరు పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.6 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ పథకం కింద స్థానిక ప్రజాప్రతినిధులు మట్టి మాఫీయాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇసుక కోసం నదులను ఆక్రమించుకుంటూ రహదారులు వేస్తున్నారని ఆరోపించారు. తమిళనాడులో సిమెంట్ బస్తా రూ.240 ఉంటే ఇక్కడ రూ.310గా నిర్ణయించడం దారుణమన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు కొట్టువాడ హరిబాబు అద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ముఖ్య నాయకులతోపాటు రాష్ట్ర కార్యదర్శి కర్రి చిట్టిబాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు జాస్తి విజయలక్ష్మి, మచ్చా శివప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి సలాది సతీష్‌నాయుడు, యాండ్రబుల్లాబ్బాయి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి బూత్‌వద్ద జాతీయజెండా ఎగురవేయాలి
నల్లగొండ టూటౌన్ : సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా జిల్లాలోని అన్ని బూత్‌ల వద్ద జాతీయ జెండా ఎగురవేయాలని కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక గాంధీ పార్కులో జరిగిన నల్లగొండ నియోజకవర్గ బూత్‌కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్‌స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు జాతీయ జెండా ఎగురవేసేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ కార్యకర్తలు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు మెంబర్ వీరెళ్లి చంద్రశేఖర్, ఓరుగంటి రాములు, శ్రీరామోజు షణ్ముక, నూకల వెంకటనారాయణరెడ్డి, పల్లెబోయిన శ్యాసుందర్, బాకి పాపయ్య, గుండగోని గిరిబాబు, పోతెపాక సాంబయ్య, చింత ముత్యాల్రావు, బొజ్జ శేఖర్, పెరిక మునికుమార్, జగ్జీవన్‌రామ్ తదితరులున్నారు. -
బూత్‌లవారీ కౌంటింగ్ రద్దుపై మీరేమంటారు?: సుప్రీం
కేంద్రానికి నోటీసులు నాలుగు వారాల్లో సమాధానం చెప్పండి న్యూఢిల్లీ: ఎన్నికల్లో బూత్‌లవారీగా ఓట్ల లెక్కింపును రద్దు చేయాలన్న ఎన్నికల కమిషన్ (ఈసీ)విజ్ఞప్తిపై కేంద్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ అంశంపై 4 వారాల్లోగా తమ నిర్ణయమేంటో తేల్చి చెప్పాలని కేంద్రాన్ని సోమవారం ఆదేశించింది. ప్రస్తుత నిబంధనలను సవరించకుండా ఈ చర్య చేపట్టవచ్చో లేదో చెప్పాలంటూ ఈసీకి సూచించింది. ఎన్నికల్లో గెలిచినవారు.. తమకు తక్కువ ఓట్లువచ్చిన ప్రాంతంపై కక్షసాధింపునకు దిగడానికి ఈ బూత్‌ల వారీ లెక్కింపు ఆస్కారమిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. కేంద్రం ఈ అంశంపై ఐదేళ్లుగా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని, దీన్ని న్యాయ కమిషన్‌కు ఎందుకు రిఫర్ చేసిందని ప్రశ్నించింది. ‘ఈ విషయంలో ఎన్నికల సంఘం తన విధిని సక్రమంగా నిర్వర్తించగలదు. కానీ ఈ అంశంలో లా కమిషన్ ఏం చేస్తుందని.. వారి అభిప్రాయం అడిగారు. ఐదేళ్లుగా ఈ అంశాన్ని ఇలా నాన్చడంలో మీ ఉద్దేశం ఏమిటి’ అని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పంజాబ్‌కు చెందిన అడ్వొకేట్ వేసిన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.