రాష్ట్రంలో 20 వేల బూత్ కమిటీలు పూర్తి
రాష్ట్రంలో 20 వేల బూత్ కమిటీలు పూర్తి
Published Wed, May 3 2017 11:33 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు
పెదపూడి (అనపర్తి) : రాష్ట్రంలో 42, 300 పోలింగ్ బూత్‌లు ఉండగా, సుమారు 20 వేల కమిటీలు ఏర్పాటు చేశామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. మండలంలోని జి.మామిడాడలో బుధవారం బూత్ కమిటీ నాయకులు, పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ నెల 25 నాటికి మరో 10 వేలు పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 25 విజయవాడలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 75 వేల మంది బూత్ కమిటీల సభ్యులతో ఆయన సమావేశమవుతారన్నారు.
జూలై 15 నుంచి పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
విశాఖపట్నంలో జూలై నెల 15,16 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్టు వీర్రాజు చెప్పారు. ఆ సమావేశాలకు ప్రధాన మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నలుగురు డిప్యూటీ సీఎంలు, కేంద్ర పార్టీ మాజీ అధ్యక్షులు వెంకయ్యనాయుడు, నితిన్ ఘట్కారీ, రాజ్‌నాథ్‌సింగ్, మురళీ మనోహర్‌జోషి, తదితరులు హాజరవుతారన్నారు. ఆగస్ట్ 25, 26, 27లో అమిత్‌షా రాష్ట్రంలో పార్టీ విస్తరణ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా అందరూ కృషి చేయాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, జిల్లా కోశాధికారి మేడపాటి హరినారాయణరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి జి.వెంకటేశ్వరరావు, జిల్లా కిసాన్‌మోర్చా అ«ధ్యక్షుడు పి.సత్యనారాయణ, మండల అధ్యక్షుడు టీవీ కృష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మురముళ్ల వెంకటరమణ, మారిశెట్టి బుజ్జి, జిల్లా పార్టీ మజ్కూరి మోర్చా నాయకుడు బి.ఛత్రపతి శివాజీ, పార్టీ సీనియర్ నాయకుడు గుణ్ణం రామాంజనేయులు, మండల కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ఒరిస్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘ఉపాధి’తో జన్మభూమి కమిటీలకు సంబంధం లేదు..
రామచంద్రపురం : గ్రామాలలో చేపట్టే ఉపాధి హామీ పనులతో జన్మభూమి కమిటీలకు సంబంధం లేదని సోము వీర్రాజు అన్నారు. పట్టణంలో పార్టీ బూత్ కమిటీల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కేంద్రం అమలు జేస్తోన్న ఉపాధి పథకం ద్వారా కేవలం సర్పంచ్, గ్రామ సభల ద్వారా పనులు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. చెట్టు నీరు పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.6 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ పథకం కింద స్థానిక ప్రజాప్రతినిధులు మట్టి మాఫీయాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇసుక కోసం నదులను ఆక్రమించుకుంటూ రహదారులు వేస్తున్నారని ఆరోపించారు. తమిళనాడులో సిమెంట్ బస్తా రూ.240 ఉంటే ఇక్కడ రూ.310గా నిర్ణయించడం దారుణమన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు కొట్టువాడ హరిబాబు అద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ముఖ్య నాయకులతోపాటు రాష్ట్ర కార్యదర్శి కర్రి చిట్టిబాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు జాస్తి విజయలక్ష్మి, మచ్చా శివప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి సలాది సతీష్‌నాయుడు, యాండ్రబుల్లాబ్బాయి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement