Gujarat Polls: ఒక్క ఓటర్‌ కోసం పోలింగ్‌ బూత్‌.. 8 మంది సిబ్బంది | ECI Set Up Polling Booth For One Voter In Gir In Gujarat Elections | Sakshi
Sakshi News home page

Gujarat Polls: ఒక్క ఓటర్‌ కోసం పోలింగ్‌ బూత్‌.. 8 మంది సిబ్బంది

Published Thu, Dec 1 2022 6:26 PM | Last Updated on Thu, Dec 1 2022 6:26 PM

ECI Set Up Polling Booth For One Voter In Gir In Gujarat Elections - Sakshi

అందుకోసం సుమారు 8 మంది వరకు పోలింగ్‌, భద్రతా సిబ్బందిని పంపించింది.

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అయితే, ఈ పోలింగ్‌లో ఓ ఆసక్తికర విషయం ఉంది. ఓటింగ్‌ శాతం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం.. కేవలం ఒక్క ఓటర్‌ కోసం ఏకంగా పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేసింది. అందుకోసం సుమారు 8 మంది వరకు పోలింగ్‌, భద్రతా సిబ్బందిని పంపించింది. ఈ పోలింగ్‌ బూత్‌ దట్టమైన గిర్‌ అడవుల్లో ఉంటుంది. బనేజ్‌ ప్రాంతంలోని ఉనా నియోజకవర్గానికి తొలి విడతలో పోలింగ్‌ జరిగింది. అటవీ ప్రాంతంలో నివసించే మహంత్‌ హరిదాస్‌జీ ఉదాసిన్‌ అనే వ్యక్తి కోసం ఈ పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేశారు. 

తొలి విడతలో భాగంగా మహంత్‌ హరిదాస్‌జీ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఫోటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది ఎన్నికల కమిషన్‌. ఉనా అసెంబ్లీలోని బనేజ్‌ పోలింగ్‌ కేంద్రానికి 2002 నుంచి శివుని మందిరం వద్ద నివాసమున్న మహంత్‌ భరత్‌దాస్‌ అనే వ్యక్తి ఒక్కరే ఓటు వేసేందుకు వచ్చేవారు. అప్పట్లో ఆయన కోసమే ఈ పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేశారు. ఆయన మరణించిన తర్వాత పోలింగ్‌ బూత్‌ను మూసివేయాలనుకున్నారు. కానీ, ఆయన వారసుడిగా మహంత్‌ హరిదాస్‌జీ రావడం వల్ల తిరిగి పోలింగ్‌ బూత్‌ను ప్రారంభించారు.

ఇదీ చదవండి: ప్రశాంతంగా ముగిసిన గుజరాత్ తొలి విడత పోలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement