one vote
-
Lok sabha elections 2024: ఒక్క ఓటు కోసం 39 కిలోమీటర్ల ట్రెక్కింగ్..
ఈటానగర్: ప్రజాస్వామ్యం మామూలు వ్యక్తిని సైతం మెహమాన్‌ను చేస్తుంది. అందుకు ఉదాహరణ ఈ 44 ఏళ్ల సొకేలా తయాంగ్. అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజ్వా జిల్లాలోని మారుమూలన ఉన్న మలోగాం ఆమె గ్రామం. హయులియాంగ్ అసెంబ్లీతోపాటు, అరుణాచల్ ప్రదేశ్ ఈస్ట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి ఆ గ్రామం వస్తుంది. అక్కడ ఎన్నికలు మొదటి ఫేజ్‌లో జరగనున్నాయి. ఇంతకీ ఆమె మెహమాన్ ఎందుకయ్యారంటే.. ఆ ఊరులో ఓటరు ఆమె ఒక్కరే. ఆమె కోసం పోలింగ్ సిబ్బంది అంతా.. ఎన్నికలు జరిగే ఏప్రిల్ 19వ తేదీ కంటే ఒకరోజు ముందు.. అంటే ఏప్రిల్ 18న 39 కిలోమీటర్ల ఎత్తు కొండలు ఎక్కాల్సి ఉంటుంది. చైనా సరిహద్దుకు దగ్గరలో ఉన్న ఆ గ్రామంలో తయాంగ్ కోసం తాత్కాలికంగా ఓ పోలింగ్ బూత్ కూడా ఏర్పాటు చేయనున్నారు. మలోగామ్లో ఇంకొన్ని కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ వారిలో ఎవరూ ఓటు కోసం నమోదు చేసుకోలేదు. దీంతో వారికి ఓటర్ల జాబితాలో చోటు దక్కలేదు. ఒక్కరికోసం బూత్ ఎందుకని.. సమీపంలోని ఏదైనా పోలింగ్ బూత్‌లో ఓటు వేయాల్సిందిగా అధికారులు ఆమెను కోరారు. కానీ అందుకు తయాంగ్ అంగీకరించలేదు. దీంతో ఆమె ఓటు కోసం అధికారులు, భద్రతా సిబ్బంది, పోర్టర్లతో సహా పోలింగ్ బృందం హయులియాంగ్ నుంచి అనూహ్య వాతావరణం మధ్య ప్రమాదకరమైన భూభాగం గుండా కష్టతరమైన ప్రయాణం చేయనుంది. హయులియాంగ్ నుంచి మలోగామ్కి కాలి నడకన వెళ్లడానికి ఒక రోజంతా పడుతుంది. పోలింగ్ రోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బూత్ తెరచి ఉంటుంది. ‘‘నేను మా గ్రామంలో చాలా అరుదుగా ఉంటాను. ఏదైనా పని ఉన్నప్పుడు లేదా ఎన్నికల సమయంలో మాలోగాం వస్తుంటా. మిగతా సమయంలో మాకు వ్యవసాయ భూములు ఉన్న లోహిత్ జిల్లాలోని వక్రోలో ఉంటాను. ఏప్రిల్ 18 సాయంత్రంలోగా ఇంటికి చేరుకుని ఓటు వేస్తా’’ అని చెబుతున్నారు. -
Gujarat Polls: ఒక్క ఓటర్ కోసం పోలింగ్ బూత్.. 8 మంది సిబ్బంది
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే, ఈ పోలింగ్‌లో ఓ ఆసక్తికర విషయం ఉంది. ఓటింగ్ శాతం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం.. కేవలం ఒక్క ఓటర్ కోసం ఏకంగా పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేసింది. అందుకోసం సుమారు 8 మంది వరకు పోలింగ్, భద్రతా సిబ్బందిని పంపించింది. ఈ పోలింగ్ బూత్ దట్టమైన గిర్ అడవుల్లో ఉంటుంది. బనేజ్ ప్రాంతంలోని ఉనా నియోజకవర్గానికి తొలి విడతలో పోలింగ్ జరిగింది. అటవీ ప్రాంతంలో నివసించే మహంత్ హరిదాస్జీ ఉదాసిన్ అనే వ్యక్తి కోసం ఈ పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. తొలి విడతలో భాగంగా మహంత్ హరిదాస్జీ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేసింది ఎన్నికల కమిషన్. ఉనా అసెంబ్లీలోని బనేజ్ పోలింగ్ కేంద్రానికి 2002 నుంచి శివుని మందిరం వద్ద నివాసమున్న మహంత్ భరత్‌దాస్ అనే వ్యక్తి ఒక్కరే ఓటు వేసేందుకు వచ్చేవారు. అప్పట్లో ఆయన కోసమే ఈ పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. ఆయన మరణించిన తర్వాత పోలింగ్ బూత్‌ను మూసివేయాలనుకున్నారు. కానీ, ఆయన వారసుడిగా మహంత్ హరిదాస్జీ రావడం వల్ల తిరిగి పోలింగ్ బూత్‌ను ప్రారంభించారు. #ECI has set up a polling booth for only one voter, Mahant Haridasji Udasin in Banej (93-Una AC) in the dense jungles of Gir. Glimpses of Haridas Ji casting his vote during 1st phase of #GujaratElections2022.#novotertobeleftbehind #GujaratAssemblyPolls #ECI #EveryVoteMatters pic.twitter.com/FhDDELyRXU — Election Commission of India #SVEEP (@ECISVEEP) December 1, 2022 ఇదీ చదవండి: ప్రశాంతంగా ముగిసిన గుజరాత్ తొలి విడత పోలింగ్ -
‘కమలం ఇక్కడ కాలు మోపడం కష్టమే’
► జనంలోకి కెప్టెన్ ►డీఎండీకే వర్గాల్లో ఆనందం ►కమలం పాదం మోపడం కష్టమేనని వ్యాఖ్య ►ఒక ఓటు.. ముగ్గురు సీఎంలు చెన్నై: రెండు నెలల అనంతరం డీఎండీకే అధినేత విజయకాంత్ జనంలోకి వచ్చారు. ఆయన రాకతో డీఎండీకే వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. శనివారం విజయకాంత్ శివగంగైలో పర్యటించారు. తనదైన శైలిలో మీడియాతో మాట్లాడుతూ ఒక ఓటుతో ముగ్గురు సీఎంలను పదవిలో కూర్చోబెట్టిన ఘనత తమిళ ప్రజలకే దక్కిందని ఛలోక్తులు విసిరారు. డీఎండీకే అధినేత విజయకాంత్ కొంత కాలంగా తరచూ అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ వస్తున్న విషయం తెలిసిందే. సింగపూర్‌లో సైతం ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగినట్టు వార్తలు వచ్చాయి. మార్చి నెల ఆయన ఆస్పత్రిలో చేరిన సమాచారం డీఎండీకే వర్గాల్లో ఆందోళన రేకెత్తించింది. పోరూర్ సమీపంలోని ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారనే సమాచారంతో పార్టీ వర్గాలు పరుగులు తీశాయి. ప్రతి ఏడాది ఆయన వైద్య పరీక్షలు, చికిత్సల్లో బాగమేనని ఆ పార్టీ కార్యాలయం వివరణ ఇచ్చింది. అంతేకాకుండా కెప్టెన్‌ను సింగపూర్‌కు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమాచారం కార్యకర్తలను మరింత ఆందోళనలో పడేసింది. ఒక్కసారి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం, మరీ వేంటనే ఆసుపత్రిలో చేరడం వంటి పరిణామాలనతో విజయ్‌కాంత్ కిడ్నీ మార్పు శస్త్రచికిత్స అనివార్యం అవుతున్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. గత నెలలో డిశ్చార్జ్ అయి ఇంటికే పరిమితం కావడంతో తమ నాయకుడు జనంలోకి ఎప్పుడెప్పుడు వస్తారా అని పార్టీ శ్రేణులు ఎదురుచూశారు. అదే సమయంలో రకరకాల ప్రచారాలు, పుకార్లు, షికారలు చేశాయి. అయితే విజయ్‌కాంత్ పేరు మీద తరచూ డీఎండీకే కార్యాలయం ప్రజా సమస్యల మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద తరచూ ప్రకటల్ని విడుదల చేస్తూ వచ్చాయి. ఈ పరిస్థితులో శనివారం కెప్టెన్ ప్రజలోలకి రావడం డీఎండీకే వర్గాలకు ఆనందమేనని చెప్పాలి. జనంలోకి విజయకాంత్- ఆరోగ్యవంతుడిగా తాను ఉన్నానని చాటుకునే విధంగా శనివారం విజయకాంత్ హఠాత్తుగా శివగంగైలో పర్యటించారు. సతీమణి ప్రేమలతతో కలిసి కేడర్ ముందుకు వచ్చారు. తనదైన శైలిలో స్పందిస్తూ పర్యటనలో ముందుకు సాగారు. ఈసందర్భంగా మీడియా ప్రశ్నలకు తనదైన హావాభావాలు, డైలాగులతో స్పందించారు. అన్నాడీఎంకే ముక్కలు కావడం, ఆ పార్టీ గొడవల గురించి తనకు తెలియదంటూ సమాధానాలు దాట వేశారు. అయితే తమిళనాడు ప్రజలు ఎంతో ఘనతను సాధించారని చమత్కరించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక ఓటు వేసి ముగ్గురు సీఎంలను ఆ పదవిలో కూర్చో బెట్టారని ఎద్దేవా చేశారు. సీఎం జయలలిత అనారోగ్యంతో మరణించడం, పన్నీరు సీఎంగా దించడం, ఇప్పుడు పళని ఉన్నారని, తదుపరి ఎవరో అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మకై ముందుకు సాగుతున్నాయా..? వారి మధ్య ఒప్పందాలు కుదిరాయా..? అన్న విషయాలు తనకు తెలియనే తెలియదంటూ మరోమారు తనదైన శైలిలో స్పందించారు. తానొస్తున్నానన్న విషయం తెలుసుకుని, ఇక్కడ రాజకీయంగా అనేక ఎత్తుగడలు వేసి ఉన్నారని ధ్వజమెత్తారు. అనేక పథకాలను తుంగలో తొక్కేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, వ్యూహాలు రచించినా, తమిళనాడులో పాదం మోపడం మాత్రం కష్టమేనని పేర్కొన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, పొత్తు ఎవరితో అన్నది ఇక అప్పుడే అంటూ ముందుకు సాగారు.