
శరద్ పవార్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: 1999లో వాజ్‌పేయి ప్రభుత్వా న్ని పడగొట్టిన ప్రతిపక్షంలోని ఆ ఒక్క ఓటు తను ఒప్పించి వేయించిందేనని సీనియర్ నేత, ఎన్‌సీపీ(ఎస్‌పీ)చీఫ్ శరద్ పవార్ పేర్కొన్నారు. శుక్రవారం మహారాష్ట్ర సంసద్‌లో అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
1999 లోక్‌సభలో ఒక్క ఓటు తేడాతో వాజ్‌పేయి ప్రభుత్వం గద్దె దిగి పోవడానికి దారి తీసిన పరిణామాలను ఆయన గుర్తు చేశారు. ఓ ఎంపీతో సుమారు 10 నిమిషాలపాటు మాట్లాడాక అధికార పక్షం ఎన్‌డీలోని ఆ ఒక్క సభ్యుడి ఓటును ప్రతిపక్షానికి అనుకూలంగా వేసేలా ఒప్పించింది తనేనంటూ చెప్పుకొచ్చారు. దాని ఫలితంగానే ఆ ప్రభుత్వం కుప్పకూలిందన్నారు. ఈ సందర్భంగా నీలేశ్‌కుమార్ కులకర్ణి రచించిన ‘సన్సద్ భవన్ టు సెంట్రల్ విస్టా’ పుస్తకావిష్కరణ జరిగింది.