బర్ఖా మదన్ హిందీ, పంజాబీ సినిమాల్లో నటించడమే కాకుండా.. పలు సినిమాలకు నిర్మాత కూడా. అంతే కాదు తనొక మోడల్, చివరకు టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించడంతోపాటు కొన్ని టీవీ షోలను కూడా హోస్ట్ చేసింది. ఇలా సినిమా రంగానికి దగ్గరగా ఉన్న తను బౌద్ధ సిద్ధాంతాల పట్ల ఆకర్షితురాలై 2012 నవంబరులో బౌద్ధ సన్యాసిగా తన సన్యాసాన్ని పొంది, తన పేరును వేం. గ్యాల్టెన్ సామ్‌టెన్‌గా మార్చకుంది. తను ఇప్పడు ఇండియన్ నన్‌గా గుర్తిపు పొందింది.
ఐశ్వర్యరాయ్, సుస్మితా సేన్‌లతో పోటీ
బర్ఖా మదన్ 1994లో మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొంది. అప్పుడు బాలీవుడ్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సుస్మితా సేన్ విజేతగా నిలిచారు. అదే పోటీలో మరో హీరోయిన్ ఐశ్వర్య రాయ్ మొదటి రన్నరప్‌గా నిలిచారు. బర్ఖా మదన్ మాత్రం మిస్ టూరిజం ఇండియాగా ఎంపికైంది. మలేషియాలో కూడా మిస్ టూరిజం ఇంటర్నేషనల్‌లో మూడవ రన్నరప్‌గా నిలిచింది.
బాలీవుడ్‌లో ఎంట్రీ
1996లో, అక్షయ్ కుమార్, రేఖ రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ చిత్రం 'ఖిలాడియోన్ కా ఖిలాడి'లో బర్ఖా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఖిలాడీ సిరీస్ యొక్క నాల్గోవ సీజన్‌లో ఆమె నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు అందుకుంది.
రామ్ గోపాల్ వర్మ భూత్‌లో బర్ఖా మదన్
బర్ఖా తన కెరీర్‌లో సెలెక్టివ్‌గా ఉంటూ, రామ్ గోపాల్ వర్మ యొక్క అతీంద్రియ భయానక చిత్రం భూత్‌లో మంజీత్ ఖోస్లా అనే దెయ్యం పాత్రను పోషించినప్పుడు విమర్శకులతో పాటు ప్రేక్షకులను భయభ్రాంతులకు గురి చేసింది. అంతలా ఆ సినిమా మెప్పస్తుంది. 2003 చలన చిత్రం అజయ్ దేవగన్, ఊర్మిళ మటోండ్కర్, నానా పటేకర్, రేఖ, ఫర్దీన్ ఖాన్‌లతో కలిసి కూడా నటించింది.
బర్ఖా మదన్ ఇప్పుడు గ్యాల్టెన్ సామ్టెన్
సోచ్ లో,సుర్ఖాబ్ వంటి రెండు చిత్రాలను కూడా నిర్మించిన బర్ఖా మదన్‌కు బౌద్ధ గురువు దలైలామా అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నారు. దీంతో 2012లో బౌద్ధమతాన్ని స్వీకరించాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆమె సన్యాసిగా మారి తన పేరును గ్యాల్టెన్ సామ్టెన్‌గా మార్చకున్నారు. ఇప్పుడు ఆమె ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన పలు ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంది.
(ఇదీ చదవండి: తమన్నాకు గోల్డెన్ ఛాన్స్.. మరోసారి ఆయనతో రొమాన్స్‌కు రెడీ)
Comments
Please login to add a commentAdd a comment