dalai lama
-
14వ దలై లామా (బౌద్ధ గురువు) రాయని డైరీ
‘‘ఎలా ఉన్నారు?’’ అనే ప్రశ్నకు సమాధానం ఆ ప్రశ్న వేయటం వెనుక ఉన్నది పలకరింపా, పరామర్శా, ఆందోళనా లేక ఆరా తీయటమా అనే దానిని బట్టి మారుతూ ఉండవచ్చు. అయితే ఒక బౌద్ధ గురువు ఇలాంటి ఒక దైహికమైన ప్రశ్న ఎదుర్కొన్నప్పుడు ఆ గురువు ఇచ్చే సమాధానం... ప్రశ్న వేయటానికి వెనుక ఉన్న ఉద్దేశంతో నిమిత్తం లేకుండా సర్వకాల సర్వావస్థల్లో ఒకేలా ఉండాలి. అంటే... ఆయన ధర్మశాల పట్టణంలోని తన హిమాలయ నివాసంలో ఉన్నా, న్యూయార్క్‌లోని మోకాళ్ల శస్త్ర చికిత్సా కేంద్రంలో ఉన్నా సమాధానం మారకూడదు. అది కూడా, ‘‘నాకేం! నిక్షేపంగా ఉన్నాను’’ అని కాకుండా, ‘‘నీకేం! నిశ్చింతగా ఉండు’’ అని... భరోసా ఇచ్చేలా ఆ సమాధానం ఉండాలి. బౌద్ధాచార్యులైన ఒక దలై లామా ఎంతటి వృద్ధాప్యంలోనైనా ‘గుంభనం’గా ఉన్నప్పుడే ఆయన భక్తులు, అనుచరులు, పాలకులు ఆయన అంతిమ శ్వాసను గురించిన ఆలోచనలు చేయకుండా ఉంటారు.జూన్‌లో శస్త్ర చికిత్స జరిగాక నా మోకాలి కదలికలు కాస్త మెరుగుపడ్డాయి. నలుగురు కలిసి నడిపిస్తే నడవ గలుగుతున్నాను. ఇద్దరు కలిసి కూర్చోబెడితే కూర్చోగలుగుతున్నాను.ప్రపంచానికైతే నాకసలు చికిత్స జరిగింది కుడి కాలికా, ఎడమ కాలికా అన్న సంగతే తెలియదు. అదే ‘గుంభనత్వం’ అంటే! ఎవరికీ, ఏదీ తెలియనివ్వకపోవటం! ముఖ్యంగా మన ఆరోగ్యం గురించి! దర్శనాలకు సమయమౌతుండగా మిస్ డోల్మా త్సెరింగ్ తేఖాంగ్ వచ్చి, ‘‘ఎలా ఉన్నారు ఆచార్యా?’’ అని నన్ను పరామర్శించారు! ఆమె అలా మంద్రస్థాయిలో ఇటీవల కొంతకాలంగా నన్ను పరామర్శిస్తూ వస్తున్నారు!‘‘ఎందుకు మీరలా పదే పదే సందేహిస్తున్నారు మిస్ తేఖాంగ్?’’ అన్నాను. ధర్మశాలలోని ప్రవాస టిబెటన్ ప్రభుత్వ పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ ఆమె.వచ్చే ఏడాది జూలై 6కు నాకు 90 ఏళ్లు నిండుతాయన్న ఆలోచన... ఆరామంలోని అందరితో పాటుగా మిస్ తేఖాంగ్నూ హృదయ శూన్యతకు గురిచేస్తోందా?! లేక, మునుపటి దలైలామా 57 ఏళ్లకే పరమపదించటం వల్ల, అది ఊహించుకుని ఆమె కలత చెందుతున్నారా?!‘‘ఇప్పటిలా వారానికి మూడుసార్లు కాకుండా, వారానికి ఒకసారి మాత్రమే సందర్శకులను అనుమతించటం వల్ల మీకు మరికాస్త విశ్రాంతి దొరుకుతుందని సిక్యోంగ్ పెన్పా త్సెరిన్ తలపోస్తున్నారు ఆచార్యా’’ అన్నారు తేఖాంగ్. సిక్యోంగ్ పెన్పా త్సెరిన్... ప్రవాస టిబెటన్ ప్రభుత్వ ప్రధాని. ‘‘వృద్ధాప్యంలో విశ్రాంతి అవసరమే మిస్ తేఖాంగ్. కానీ కలలకు వృద్ధాప్యం ఉంటుందా?! నా కల ప్రకారం నేను 110 సంవత్సరాలు జీవించబోతానని మునుపు నేను చెప్పిన మాటనే ఇప్పుడూ చెబుతున్నాను. మీరూ, మీ ప్రధానే నా కలపై విశ్వాసం లేక చింతాక్రాంతులై ఉన్నట్లున్నారు. నేనెలా ఉన్నాను అనే దానికన్నా, నా తర్వాత ఎవరున్నారు అన్నదే మీఆందోళనగా నాకు కనిపిస్తోంది’’ అన్నాను చిరునవ్వుతో. తేఖాంగ్ కలవరంగా చూశారు. ‘‘ఆచార్యా... మేము కేవలం సామాన్యులం.మీ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేము. అందువల్లనే మీరేమైనా చెబుతారేమోనని ఎదురుచూస్తున్నాం...’’ అన్నారు మిస్ తేఖాంగ్! నాకర్థమైంది. వారు నా పునర్జన్మ కోసం చూస్తున్నారు! 15వ దలైలామా ఆగమనం కోసం నిరీక్షిస్తున్నారు. కానీ వారికి అర్థం కానిది ఏమిటంటే – మరణించాక మాత్రమే పునర్జన్మ ఉండదనీ, కర్తవ్య నిర్వహణ కాంక్ష అన్నది ఒకే జన్మలో అనేక పునర్జన్మల్ని ప్రసాదిస్తుందనీ!‘‘నా దగ్గరింకా 20 హ్యాపీ న్యూ ఇయర్లుమీ అందరి కోసం మిగిలే ఉన్నాయి మిస్ తేఖాంగ్. ధీమాగా ఉండండి...’’ అని ఆమెతో నవ్వుతూ చెప్పాను. -
రామ్ గోపాల్ వర్మ నాటి హాట్ బ్యూటీ పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే
బర్ఖా మదన్ హిందీ, పంజాబీ సినిమాల్లో నటించడమే కాకుండా.. పలు సినిమాలకు నిర్మాత కూడా. అంతే కాదు తనొక మోడల్, చివరకు టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించడంతోపాటు కొన్ని టీవీ షోలను కూడా హోస్ట్ చేసింది. ఇలా సినిమా రంగానికి దగ్గరగా ఉన్న తను బౌద్ధ సిద్ధాంతాల పట్ల ఆకర్షితురాలై 2012 నవంబరులో బౌద్ధ సన్యాసిగా తన సన్యాసాన్ని పొంది, తన పేరును వేం. గ్యాల్టెన్ సామ్టెన్గా మార్చకుంది. తను ఇప్పడు ఇండియన్ నన్‌గా గుర్తిపు పొందింది. ఐశ్వర్యరాయ్, సుస్మితా సేన్లతో పోటీ బర్ఖా మదన్ 1994లో మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొంది. అప్పుడు బాలీవుడ్ హీరోయిన్గా కొనసాగుతున్న సుస్మితా సేన్ విజేతగా నిలిచారు. అదే పోటీలో మరో హీరోయిన్ ఐశ్వర్య రాయ్ మొదటి రన్నరప్‌గా నిలిచారు. బర్ఖా మదన్ మాత్రం మిస్ టూరిజం ఇండియాగా ఎంపికైంది. మలేషియాలో కూడా మిస్ టూరిజం ఇంటర్నేషనల్‌లో మూడవ రన్నరప్‌గా నిలిచింది. బాలీవుడ్లో ఎంట్రీ 1996లో, అక్షయ్ కుమార్, రేఖ రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ చిత్రం 'ఖిలాడియోన్ కా ఖిలాడి'లో బర్ఖా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఖిలాడీ సిరీస్ యొక్క నాల్గోవ సీజన్లో ఆమె నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు అందుకుంది. రామ్ గోపాల్ వర్మ భూత్‌లో బర్ఖా మదన్ బర్ఖా తన కెరీర్లో సెలెక్టివ్‌గా ఉంటూ, రామ్ గోపాల్ వర్మ యొక్క అతీంద్రియ భయానక చిత్రం భూత్‌లో మంజీత్ ఖోస్లా అనే దెయ్యం పాత్రను పోషించినప్పుడు విమర్శకులతో పాటు ప్రేక్షకులను భయభ్రాంతులకు గురి చేసింది. అంతలా ఆ సినిమా మెప్పస్తుంది. 2003 చలన చిత్రం అజయ్ దేవగన్, ఊర్మిళ మటోండ్కర్, నానా పటేకర్, రేఖ, ఫర్దీన్ ఖాన్‌లతో కలిసి కూడా నటించింది. బర్ఖా మదన్ ఇప్పుడు గ్యాల్టెన్ సామ్టెన్ సోచ్ లో,సుర్ఖాబ్ వంటి రెండు చిత్రాలను కూడా నిర్మించిన బర్ఖా మదన్‌కు బౌద్ధ గురువు దలైలామా అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నారు. దీంతో 2012లో బౌద్ధమతాన్ని స్వీకరించాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆమె సన్యాసిగా మారి తన పేరును గ్యాల్టెన్ సామ్టెన్గా మార్చకున్నారు. ఇప్పుడు ఆమె ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన పలు ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంది. (ఇదీ చదవండి: తమన్నాకు గోల్డెన్ ఛాన్స్.. మరోసారి ఆయనతో రొమాన్స్‌కు రెడీ) -
బాలుడి పెదాలపై ముద్దు.. క్షమాపణలు చెప్పిన దలైలామా
ఉత్తర భారతదేశంలో జరిగిన ఒక కార్యక్రమంలో బౌద్ద మత గురువు దలైలామా ఒక బాలుడి పెదవులపై ముద్దుపెట్టుకుని, నాలుకను ముద్దు పెట్టమని కోరడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయన అనుసరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ అంశంపై దలైలామా ట్విటర్ వేదికగా స్పందించారు. ఆ బాలుడు, అతని కుటుంబసభ్యులకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. సోమవారం దలైలామా బృందం విడుదల చేసిన ప్రకటనలో.. దలైలామా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే చింతిస్తున్నట్లు తెలిపారు. బాలుడు, అతని కుటుంబ సభ్యులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులకు క్షమాపణలు చెప్పారు. దలైలామాను కలిసే వ్యక్తులు, ముఖ్యంగా చిన్నారులతో ఆయన సరదాగా ఉంటారు. కొన్ని సార్లు వారిని ఆటపట్టిస్తుంటారు. అయితే బాలుడి ఘటనకు ఆయన విచారం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. కాగా ఓ కార్యక్రమంలో తన వద్దకు ఆశీర్వాదం కోసం వెళ్లిన ఓ బాలుడి పెదాలపై దలైలామా ముద్దుపెట్టారు. అంతేకాదు తన నాలుకను ముద్దు పెట్టమని ఆ బాలుడ్ని కోరారు. దీంతో ఈ ఘటన వివాదానికి తెరలేపింది. దలైలామా బాలుడితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారేంటని నెటిజన్లు ఫైర్ అయ్యారు. -
పెదాలపై ముద్దుపెట్టిన దలైలామా.. వీడియో వైరల్.. నెటిజన్ల ఫైర్..
న్యూఢిల్లీ: టిబెట్ బౌద్ధమత గురువు, ఆధ్యాత్మికవేత్త దలైలామాకు సంబంధించిన ఓ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తన వద్దకు ఆశీర్వాదం కోసం వెళ్లిన ఓ బాలుడి పెదాలపై ఆయన ముద్దుపెట్టారు. అంతేకాదు తన నాలుకను ముద్దు పెట్టమని ఆ బాలుడ్ని కోరాడు. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. ఓ మత గురువు అయిన మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? పిల్లలతో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు అసహ్యంగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. అయితే దలైలామా బాలుడికి ముద్దుపెట్టే సమయంలో అక్కడున్నవారంతా కేరింతలతో చప్పట్లు కొట్టారు. వీరంతా ఇలా చేయడంపై పులువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దలైలామా బాలుడితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే మీరంతా ప్రోత్సహించడమేంటని ఫైర్ అయ్యారు. So the Dalai Lama is kissing an Indian boy at a Buddhist event and he even tries to touch his tongue. He actually says "suck my tongue" Now why would he do that? 🤔 pic.twitter.com/TjDizaDHZp — Richard (@ricwe123) April 8, 2023 మరికొందరు నెటిజన్లు మాత్రం దలైలామా ముద్దుపెడుతున్నప్పుడు ఆ బాలుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడని అన్నారు. చిన్నారిని పెదాలపై కిస్ చేయడమేంటి? ఇదేం సంప్రదాయం? నాలుకను ముద్దుపెట్టమని అడగడమేంటి అని ప్రశ్నించారు. అయితే ఓ నెటిజన్ మాత్రం వీరి విమర్శలకు సమాధానం చెప్పాడు. పెదాలు, నాలుకపై ముద్దుపెట్టడం టిబెట్ సంప్రదాయంలో ఓ భాగమని చెప్పుకొచ్చాడు. టిబెట్‌లో ఒకరి నాలుకను బయటకు తీయడం ఒక ఆచార పద్ధతి అని పేర్కొన్నాడు. ఈ సంప్రదాయం 9వ శతాబ్దానికి చెందిందని, లాంగ్ ధర్మా అనే అపఖ్యాతి పాలైన రాజు పాలన నుంచి ఇది కొనసాగుతోందన్నాడు. చదవండి: హెల్మెట్ లేకుండా స్కూటీపై మహిళా పోలీసులు.. ‘ఏంటి సర్.. ఇదే తప్పు మేం చేస్తే!’ -
దలైలామాపై చైనా గూఢచారి నిఘా
దలైలామాపై చైనా గూఢచారి నిఘా -
బిహార్‌లో నలుగురు విదేశీయులకు కరోనా.. ‘దలైలామా’ ఈవెంట్ వేళ కలకలం
పట్నా: కోవిడ్ మరోమారు విజృంభిస్తూ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. చైనాలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వేగంగా వ్యాప్తి చెందుతూ లక్షల మందికి సోకుతోంది. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చే వారిపై నిఘా పెంచింది భారత్. ఎయిర్‌పోర్టుల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో బిహార్‌లోని గయా అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అందులో ముగ్గురు ఇంగ్లాండ్, ఒకరు మయన్మార్‌కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. కోవిడ్ పాజిటివ్‌గా తేలిన విదేశీయులను ఐసోలేషన్‌కు తరలించారు. వారికి ఎలాంటి లక్షణాలు లేవని గయా సివిల్ సర్జన్ రంజన్ కుమార్ సింగ్ తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లో మొత్తం 33 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా అందులో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. డిసెంబర్ 20న వారంతా బ్యాంకాక్ నుంచి గయా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఇంగ్లాండ్ దేశీయులను బోధ్ గయాలోని హోటల్లో ఐసోలేషన్‌లో ఉంచగా.. మయన్మార్‌కు చెందిన వ్యక్తి ఢిల్లీకి వెళ్లారు. బోధ్ గయాలో డిసెంబర్ 29న బౌద్ధమత గురువు దలైలామా ప్రసంగం కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి లక్ష మందికిపైగా విదేశీ భక్తులు హాజరవుతారని అంచనా. 50 దేశాలపైగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ఈవెంట్‌కు మూడు రోజుల ముందు నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం సృష్టిస్తోంది. ఇదీ చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే భవనంలో విద్యార్థి ఆత్మహత్య.. ఏం జరిగింది? -
దలైలామాకు గాంధీ–మండేలా అవార్డు
ధర్మశాల: టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా గాంధీ–మండేలా పురస్కారం అందుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రా జిల్లా ధర్మశాల సమీపంలోని మెక్లాయిడ్ గంజ్‌లో శనివారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పురస్కారం ప్రదానం చేశారు. యుద్ధం ద్వారా ఏ సమస్యకూ పరిష్కారం లభించదని దలైలామా అన్నారు. గాంధీ, నెల్సన్ మండేలా ఆశయసాధనకు పోరాడే ఆసియా, ఆఫ్రియా దేశాల నేతలకు గాంధీ–మండేలా ఫౌండేషన్ 2019 నుంచి పురస్కారాలను ప్రదానం చేస్తోంది. -
ఇండియాకు దలైలామా
1959 టిబెటన్ తిరుగుబాటు ప్రారంభంలో తమ ప్రాణాలను కాపాడుకోడానికి దలైలామా, ఆయన పరివారం ఆ ఏడాది మార్చి 30 న భారతదేశంలోకి ప్రవేశించి, ఏప్రిల్ 18న అస్సాంలోని తేజ్‌పూర్‌కు చేరుకున్నారు. నాటి నుంచీ దలైలామా ఇండియాలో ఉంటున్నారు. గుజరాత్లో 2010లో జరిగిన ‘ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్’లో ఆయన మాట్లాడుతూ... ‘పైకి కనిపిస్తున్న నా రూపం టిబెట్‌ది, ఆధ్యాత్మికంగా నేను భారతీయుడిని, భారతమాత పుత్రుడిని’ అన్నారు. అత్యంత ప్రతిష్టాకరమైన నోబెల్ పురస్కార గ్రహీతలలో 14వ దలైలామా ఒకరు. శాంతి, అహింసా మార్గంలో టిబెట్ దేశానికి స్వాతంత్య్రం సంపాదించేందుకు అర్ధ శతాబ్దం పైగా చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈయనకు ఈ బహుమతిని ప్రదానం చేశారు. దలైలామా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల నుంచి శాంతి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. దలైలామాను యేషేనారెబల్, లామో ధోండ్రబ్గా పిలిచేవారు. ఆయన టిబెట్ దేశం ఈశాన్య ప్రాంతంలోని ‘తక్త్ సేర్’ అనే కుగ్రామంలో 1935వ సంవత్సరం జూలై ఆరవ తేదీన జన్మించారు. ఆయన రెండున్నర సంవత్సరాల వయస్సులోనే బుద్ధుని అవతారంగా గుర్తింపు పొందారు. ‘లామో ధోండ్రబ్’ను బుద్ధుని అంశగా గుర్తించడంతో పాటు తన వారసునిగా కూడా ప్రకటించారు 13వ దలైలామా. లామో ధోండ్రబ్ (నేటి దలైలామా) పదహారేళ్ల ప్రాయంలోనే టిబెట్ పరిపాలన వ్యవస్థకు అధిపతిగా నియమితులయ్యారు. అయితే 1954వ సంవత్సరంలో టిబెట్ చైనీయుల ఆక్రమణకు గురైంది. చైనీయుల వలసలు పెరిగిపోయి దేశం చైనా హస్తగతం అయింది. ఆ దశలో టిబెట్ పరిరక్షణ కోసం దలైలామా... మావోసేటుంగ్, చౌ ఎన్ లై మొదలైన నాయకులతో చర్చలు జరిపారు. ఆ చర్చలు విఫలం కావటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ అజ్ఞాత ప్రదేశం... భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ధర్మశాల. భారతదేశంలో ఆశ్రయం పొంది ‘ధర్మశాల’లో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. టిబెట్ స్వాతంత్య్రం కోసం ధర్మశాల నుంచే ప్రయత్నాలు కొనసాగించారు దలైలామా. ఆయన ఒక సందర్భంలో... తన శాంతియుత పోరాటానికి స్ఫూర్తి, ఆదర్శం భారత జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. నోబెల్ బహుమతి అందుకునే సమయంలో దలైలామా ‘‘నోబెల్ శాంతి పురస్కారానికి ఒక పీడిత ప్రతినిధిగా నన్ను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు. ప్రపంచంలోని పీడిత మానవులకు, స్వాతంత్య్రం కోసం పోరాడేవారికి, అణగదొక్కబడే వారికి... ప్రపంచ శాంతి కోసం పాటుపడే వారికీ ఈ బహుమతి అంకితం’’ అని పేర్కొన్నారు. -
చెత్తగా తీసిన సినిమా అది.. బాలేదంతే!
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! బాలేదంతే! ‘సమ్రాట్ పృథ్వీరాజ్’ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడినందున, రైట్–వింగ్ ద్వేషాన్నీ, ప్రచారాన్నీ ప్రేక్షకులు తిప్పికొట్టారని చాలా మంది అనాలోచిత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అది నిజం కాదు. ఇంకో అభిప్రాయం లేనంత చెత్తగా తీసిన సినిమా అది. అంతే! – మణిముగ్ధ శర్మ, విద్యావేత్త ఎదుర్కోక తప్పదు రష్యా అధ్యక్షుడు పుతిన్ తనను తాను ‘పీటర్ ద గ్రేట్’ (రష్యా చక్ర వర్తి)తో పోల్చుకుని, రష్యా తిరిగి తన భూభాగాలను పొందే తపనతో ఉందని చెబుతున్నారు. ఒక కథనం ప్రకారం, రష్యా ఆక్రమించుకున్న అత్యధిక ఉక్రెయినియన్ భూభాగా లను ‘రష్యన్ రీజియన్’గా ఏకం చేసే పథకంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు ఇవ్వడానికి ఇది సందర్భం కాకపోతే ఇంకేమిటి? – ఒలెక్సీ సోరోకిన్, ఉక్రెయిన్ జర్నలిస్ట్ శాంతి శాంతి ముస్లిం సమాజం శాంతియుతంగా ఉండాలని నా సలహా. దుందుడుకు చర్యలు దేశంలోని లౌకికవాదాన్ని బలహీనపర్చడానికే పనికొస్తాయి. – యశ్వంత్ సిన్హా, కేంద్ర మాజీ మంత్రి వేరుగా మాట్లాడకూడదా? టీకాల పట్ల అసమ్మతిపూరిత అభిప్రాయం ఉన్నవాళ్లను పర్యవేక్షించడానికీ, వారి మీద కేసులు వేయడానికీ ఇజ్రాయిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసిందని వార్త. పోలీసులు కాదు, అటార్నీ జనరల్ కాదు, స్వయంగా ఆరోగ్య మంత్రిత్వశాఖే రంగం లోకి దిగుతోంది. ఆరోగ్య కార్యకర్తలకు బూస్టర్ డోసులను తప్పనిసరి చేసిన తెల్లారే ఇది జరుగుతోంది. – ఎలీ డేవిడ్, పరిశోధకుడు మన ప్రేమ అందాలి మొత్తం విశ్వం పట్ల పరోపకార బుద్ధితో ఉండట మనే భావనను గనక గట్టిగా పరిగణిస్తే, ఇంక శత్రువులు ఉండే అవకాశం ఎక్కడ? నిజంగా మానవాళి వాస్తవిక శత్రువులు ఏమంటే– కోపం, ద్వేషం లాంటి ప్రతికూల ఉద్వేగాలు. చెప్పాలంటే, ఈ భావనలు అధికంగా ఉన్నవాళ్ల పట్ల మనం మరింత కరుణతో వ్యవహరించాలి. – దలైలామా, బౌద్ధ గురువు ఆందోళనాపూరిత భవిష్యత్ కర్ణాటకలోని ఒక రోడ్డు మీద ఉరితీసిన ‘నూపుర్ శర్మ’ దిష్టిబొమ్మ వేలాడుతోంది. అధికారులకు నా అభ్యర్థన ఏమిటంటే, దయచేసి దాన్ని తొలగించొద్దు. ఇండియా మారిన బాధాకరమైన తీరుకు ఇంతకంటే ప్రతీకాత్మక చిత్రం ఇంకొకటి ఉండదు. ఇది మన భవిష్యత్తు, దాన్ని మనం ప్రదర్శించుకోవాలి. – ఆనంద్ రంగనాథన్, రచయిత తోసేస్తే సరి మే నెలలో ద్రవ్యోల్బణం 8.6 శాతాన్ని తాకింది. నలభై ఏళ్లలో అమెరికాలో ఇదే అత్యధికం. మే నెల కల్లా ద్రవ్యోల్బణం తగ్గు ముఖం పడుతుందన్న ‘నిపుణులు’ తప్పని మరోసారి తేలింది. ఇంకేం? రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను నిందిద్దాం. – అఫ్షైన్ ఇమ్రానీ, కార్డియాలజిస్ట్ -
రెండేళ్ల తర్వాత కనిపించిన దలైలామా
ధర్మశాల: దేశంలో కోవిడ్ మహమ్మారి ప్రబలిన దాదాపు రెండేళ్ల తర్వాత బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా శుక్రవారం బయటకు వచ్చారు. ధర్మశాలలో ఉన్న బౌద్ధ సన్యాసులు, ఇతర సభ్యులకు జాతక కథలను ఆయన బోధించారు. అనంతరం, టిబెటన్ బౌద్ధుల ప్రధాన ఆలయం వద్ద బోధిచిత్త వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా దలైలామా మాట్లాడుతూ..‘శుక్రవారం ఢిల్లీ వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. అయితే, నా ఆరోగ్యం చాలా బాగుండటంతో వెళ్లడం మానేశాను. మా డాక్టర్‌తో కూడా ఇప్పుడు బాక్సింగ్ ఆడుకుంటున్నాను’ అంటూ ఆయన చమత్కరించారు. -
రష్యా-ఉక్రెయిన్ యుద్దంపై స్పందించిన దలైలామా.. ఏమన్నారంటే..
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా వైఖరిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించారు. యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలంటూ పలు దేశాలు సైతం రష్యాను కోరాయి. తాజాగా టిబెటియన్ ఆధ్యాత్యిక నేత దలైలామా.. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై స్పందించారు. దలైలామా సోమవారం మాట్లాడుతూ.. యుద్ధాలకు కాలం చెల్లిందని, అహింస ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. కాగా, రెండు దేశాల మధ్య హింసాత్మక ఘటనలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవులంతా ఒక్కటే అన్న భావాన్ని పెంపొందించుకోవాలని రెండు దేశాలకు సూచించారు. అహింస మాత్రమే సమస్యలను త్వరిగతిన పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. అప్పుడే శాంతియుత ప్రపంచాన్ని నిర్మించే అవకాశం ఉంటుందని సూచించారు. ఈ క్రమంలోనే.. మనం ఆశ కోల్పోకూడదు. 20వ శతాబ్దమంతా యుద్ధం, రక్తపాతమయమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 21వ శతాబ్దం చర్చల శతాబ్దంగా ఉండాలని కోరారు. అందరి మధ్య పరస్పర అవగాహన కలిగి ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం ద్వారానే నిజమైన శాంతి ఏర్పడుతుందని పేర్కొన్నారు. -
లద్దాఖ్‌లోకి చొరబడిన చైనీయులు..
న్యూఢిల్లీ: లద్దాఖ్‌లోని డెమ్‌చుక్ ప్రాంతంలోకి కొందరు చైనా సైనికులు, పౌరులు చొరబడ్డారు. సింధు నది అవతలి వైపు ఉన్న ఈ ప్రాంతంలో చైనా జాతీయ పతాకం, పలు బ్యానర్లు పట్టుకొని చైనీయులు కనిపించారు. అక్కడి భారతీయ గ్రామాల్లోని ప్రజలు దలైలామా పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడాన్ని నిరసిస్తూ వాళ్లు ఇలా చేశారు. ఈ ఘటన ఈ నెల 6వ తేదీన జరిగింది. వీళ్లంతా ఐదు వాహనాల్లో వచ్చి గ్రామంలోని కమ్యూనిటీ సెంటర్ దగ్గర ఇలా నిరసన తెలిపారు. ఇదిలా ఉంటే, గత వారం ప్రధాని మోదీ దలైలామాకు 86వ పుట్టిన రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 2014లో మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దలైలామాతో మాట్లాడినట్లు అంగీకరించడం ఇదే తొలిసారి. కాగా, చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ 100వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపని భారత ప్రభుత్వం.. దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపడం చైనాకు మింగుడుపడడం లేదు. 2019లో మోదీ రెండోసారి గద్దెనెక్కిన తర్వాత కూడా దలైలామా పుట్టిన రోజుని అంశంగా తీసుకుని చైనీయులు ఇలానే నిరసన తెలిపారు. -
కరోనా సునామీ : దలైలామా సాయం
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 విలయంతో అల్లాడుతున్న భారత్‌కు సాయం చేసేందుకు ప్రపంచ దేశాలుముందుకొస్తున్నాయి. కరోనా నిర్యూలనకు దేశం చేస్తున్న ప్రయత్నాలకు టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా మద్దతుగా నిలిచారు. పీఎం-కేర్స్ ఫండ్‌కు సహకరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మహమ్మారి విస్తరణను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను దలైలామా ప్రశంసించారు. ముఖ్యంగా ఫ్రంట్లైన్లో పనిచేస్తున్న వారి కృషిని ఆయన అభినందించారు. (ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌సేల్: భారీ ఆఫర్లు) భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా వరుస సవాళ్లను ఆందోళనతో గమనిస్తూనే ఉన్నానంటూ దలైలామా ఆవేదన వ్యక్తంచేశారు. ఈ భయంకరమైన కరోనా సునామిలో తోటి భారతీయ సోదర, సోదరీ మణులకు తన సంఘీభావంగా పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం ఇవ్వమని దలైలామా ట్రస్ట్‌ను కోరానని ఆయన చెప్పారు. ఈ మహమ్మారి ముప్పు త్వరలోనే ముగిసిపోవాలని ఆయన కోరుకున్నారు. మరోవైపు దేశంలో రోజుకు 3లక్షలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్న క్రమంలో మంగళవారం నాటికి 3,23,144 మంది కొత్తగా క రోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,76,36,307కు పెరిగింది. అయితే జాతీయ రికవరీ రేటు 82.54 శాతంగాఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. (కరోనా రెండో దశ : స్వల్పంగా తగ్గిన పాజిటివ్ కేసులు) -
చైనాకు మరో షాకిచ్చిన అమెరికా
వాషింగ్టన్: రెండు ఆధిపత్ యరాజ్యాల మధ్య పోరు రోజురోజుకు మరింత ముదురుతోంది. తాజాగా అమెరికా చైనాకు షాకిచ్చే మరో బిల్లును పాస్ చేసింది. ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడిని ఎంచుకునే హక్కు టిబెటన్లకే కల్పించే బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ద టిబెటన్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్ ఆఫ్ 2020 (టీపీఎస్ఏ) ప్రకారం టిబెట్ ప్రధాన నగరమైన లాసాలో యుఎస్ కాన్సులేట్ ఏర్పాటు చేయనుంది. అలాగే దలైలామాకు వారసుడిని ఎన్నుకునే సంపూర్ణ హక్కు టిబెటన్లకు దక్కనుంది.మరోవైపు ఇదొక చారిత్రాత్మక చర్యగా, చైనాకు స్పష్టమైన సందేశంగా ధర్మశాల అభివర్ణించింది. ఈ నిర్ణయం ప్రస్తుత దలైలామా, టిబెటన్ బుద్ధిస్ట్ లీడర్లు, టిబెట్ ప్రజలదే అని టీపీఎస్ఏ స్పష్టం చేస్తోందని సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఈ బిల్లుకు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలిపింది. అంతేకాదు ఈ వ్యవహారంలో చైనా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుంటే, తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా హెచ్చరించింది. దీనిపై స్పందించిన చైనా అమెరికాపై మండిపడుతోంది. అమెరికా తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ నిర్ణయం ద్వైపాక్షిక సంబంధాలను మరింత దెబ్బతీసుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మంగళవారం బీజింగ్‌లోని ఒక సమావేశంలో చెప్పారు. దీనిపై సంతకం చేయకూడదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ డిమాండ్ చేసింది. టీపీఎస్ఏ చట్టం టిబెటన్ స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయంగా సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్షుడు లాబ్సాంగ్ సాంగాయ్ పేర్కొన్నారు. దీని కోసం తాము రెండేళ్లుగా డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. చైనా ఇప్పటికే తరువాతి దలైలామాను నియమించే ప్రక్రియను మొదలుపెట్టిన నేపథ్యంలో అమెరికా ఈ చట్టాన్ని తీసుకురావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా తొమ్మిదేళ్ల క్రితం టిబెట్‌పై దాడి చేసి, చైనాకు వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాటును దారుణంగా అణచివేసిన చైనా టిబెట్ బౌద్ధమతాన్నికూల్చివేసేందుకు ప్రయత్నిస్తోంది. భారతదేశంలో 80 వేల మంది టిబెటన్లు ప్రవాసంలో ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా, ఐరోపాలో 150,000 మంది ఉన్నారు. -
ఒక్క మంత్రంతో కరోనా వైరస్ మాయం..!
ధర్మశాల: ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మంత్రాలు పఠించాలని చైనాలోని తన అనుచరులకు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా సూచించారు. వుహాన్ నగరంలో కరోనా వైరస్ వల్ల ఆ దేశంలో ఇప్పటివరకూ 130 మంది చనిపోగా వేలాది మంది ఆ వైరస్ బారిన పడ్డారు. దీంతో చైనాలోని కొందరు ఆయన భక్తులు.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సలహా ఇవ్వాలని ఫేస్బుక్ వేదికగా దలైలామాను కోరారు. (ఆ పిశాచి ఎక్కడ దాక్కున్నా వదలం : చైనా అధ్యక్షుడు) దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘తారా మంత్రం’ పఠించాలని సూచించారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి ఈ మంత్రం సాయపడుతుందని చెప్పారు. ‘ఓం తారే తుత్తారే తురే సోహా’ అంటూ మంత్రం పఠిస్తున్న ఆడియో క్లిప్‌ను కూడా తన పోస్టుకు దలైలామా జతచేశారు. తార మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. మంత్రం జపించి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఎలాంటి బాధలు ఉండవు అని దలైలామా పేర్కొన్నారు. టిబెటన్ ఆధ్యాత్మిక గురువు స్వయంగా తన గొంతును ఫేస్బుక్లో పోస్టు చేశారు. దలైలామా పేర్కొన్న ఆ మంత్రం ప్రస్తుతం చైనాలో వైరల్ అవుతోంది. గత ఇరవై నాలుగు గంటల్లో 1300 కొత్త కేసులు నమోదయ్యాయి. దగ్గు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు వైరస్ లక్షణాలని వైద్య నిపుణలు చెబుతున్నారు. (ఈ బీరు తాగితే కరోనా వైరస్ సోకుతుందా..!) -
దలైలామాకు మాత్రమే ఆ అధికారం ఉంది
సిమ్లా: టిబెట్ మతపెద్దలు బుధవారం ధర్మశాలలో సమావేశమై దలైలామా వారసుడి ఎంపిక విషయమై చర్చించారు. లామాకే సర్వాధికారాలు ఉండి తన వారసుడిని ఎన్నుకునే ఆచారం అనాదిగా వస్తుందని.. అదే ప్రస్తుత లామా కొనసాగిస్తారని తీర్మానం చేశారు. 3 రోజులపాటు జరిగిన టిబెటన్ మత సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీనియర్ బౌద్ధ లామాలు, టిబెట్ మతపెద్దలు, నాయకులు పాల్గొన్నారు. టిబెట్‌లో 800 సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారాన్ని ఆయన కొనసాగిస్తారని.. తదుపరి లామాను ఎన్నుకునే హక్కు కేవలం ప్రస్తుత లామాకు మాత్రమే ఉందని, నిర్ణయం పూర్తిగా దలైలామా వ్యక్తిగతమని పేర్కొన్నారు. అంతేకాక చైనా ఎన్నుకునే లామాను.. టిబెటన్లు ఎన్నడూ గౌరవించరని, లామాను నిర్ణయించే అధికారం ఇతర వ్యక్తులకు, ప్రభుత్వానికి లేదంటూ ఈ మేరకు నొక్కిచెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత మత గురువులలో ఒకరైన దలైలామాను చైనాలోనే కాక ప్రపంచం నలుమూలలా అనుసరిస్తున్నావారు ఉన్నారు. నిత్యం ఆయనను గౌరవిస్తూ.. నిర్దేశించిన మార్గంలో నడిచేవారు ప్రపంచం నలువైపులా ఉండడంతో.. దలైలామా వారసుడిని ఎంపిక చేసే అర్హత ప్రపంచానికి ఉందని గతవారం యూఎస్ రాయబారి శ్యాముల్ బ్రౌన్ తెలిపారు. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడిని ఎంపిక చేసే హక్కు చైనాకు మాత్రమే ఉందనే వాదనను ఆయన తోసిపుచ్చారు. తదుపరి దలైలామా ఎవరనే విషయంపై నెలకొన్న ఉత్కంఠను అధిగమించడానికి ఐక్కరాజ్యసమితి సహా ఇతర ప్రపంచ దేశాలు చర్చలు జరపాలని యూఎస్ తరపున కోరారు. ముఖ్యంగా మత స్వేచ్ఛ, మానవ హక్కులు గురించి పట్టించుకునే యూరోపియన్ దేశాల ప్రభుత్వాలు దలైలామా వారసుడిని ఎంపికపై దృష్టి సారించాలని శ్యాముల్ బ్రౌన్ పేర్కొన్నారు. దలైలామాను తాను చాలాసార్లు యూఎస్‌లో కలిశానని అన్నారు. టిబెట్ బౌద్ధులకు మాత్రమే దలైలామా వారసుడిని ఎంపిక చేసే అధికారం ఉందని, చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వానికి ఆ అధికారం లేదని పునరుద్ఘటించారు. సాధారణంగా టిబెట్‌కే పరిమితమైన దలైలామా వెతుకులాటలో.. ప్రస్తుతమున్న 14వ దలైలామాను ఎన్నుకోవడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. టిబెట్‌కు చెందిన ప్రస్తుత 14వ దలైలామా కేవలం రెండేళ్ళ వయసులో 1937 సంవత్సరంలో ఎన్నికయ్యారు. నాలుగు సంవత్సరాల వయస్సులో అతను అధికారికంగా 14వ దలైలామాగా గుర్తించబడ్డారు. 1959లో టిబెట్‌ను స్వాధీనం చేసుకునేందుకు చైనా సాయుధ దళాలను పంపినపుడు, దలైలామా అక్కడి నుంచి భారత్‌కు తరలి వచ్చి ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్నారు. 1989లో ఆయన నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. అయితే దలైలామా వారసుడు చైనా నుంచే వస్తాడని ఇప్పటికే చైనా ప్రకటించింది. తనకు 90 ఏళ్ల వయసు వచ్చాక తన వారసుడిని నిర్ణయిస్తానని దలైలామా 2011లో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వయసు 84 ఏళ్లు. తాను మరణించిన తరువాత.. చైనా ఏకపక్షంగా వ్యవహరించి తన వారసుడిని ప్రకటిస్తే.. అతడిని టిబెట్ బౌద్ధులు గౌరవించే పరిస్థితి ఉండబోదని గతంలో స్పష్టం చేశారు. తదుపరి దలైలామాను నిర్ణయించే హక్కు ఇతరులకు లేదన్నారు. చైనా ఎంపికచేసే వారసుడికి గౌరవం దక్కబోదని, తన వారసుడు భారత్‌లోని తన అనుచరుల్లో ఒకరు కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. తదుపరి దలైలామా వారసుడి ఎంపిక విషయంలో దలైలామా స్పందన చైనాకు మింగుడు పడటం లేదు. గతంలో దలైలామా మాట్లాడుతూ.. తన తర్వాత వచ్చే దలైలామా ఒక వేళ మహిళ అయితే.. ఆమె మరింత ఆకర్షణీయంగా ఉండాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. ఆ తర్వాత క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే. -
సారీ చెప్పిన దలైలామా!
న్యూఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, బౌద్ధమత ప్రబోధకులు దలైలామా ప్రపంచ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు దలైలామా కార్యాలయం ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని రోజుల క్రితం బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో దలైలామా మహిళల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓ మహిళ మీ వారసురాలు కావడం మీకు అంగీకారమేనా అని విలేకరి అడిగిన ప్రశ్నకు దలైలామా సమాధానమిస్తూ.. మహిళా దలైలామా వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే ఆమె తనలా కాకుండా చాలా అందంగా ఉండాలన్నారు. అలా అయితేనే జనాలు ఆమెను చూడ్డానికి ఉత్సాహం చూపిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దలైలామా. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆయన వ్యాఖ్యలు పితృస్వామ్య వ్యవస్థకు అద్దం పడుతున్నాయని మండిపడ్ద సంగతి విధితమే. గతంలో స్త్రీ పురుషులిద్దరికీ బౌద్ధమతంలో సమాన హక్కులు ఉంటాయని చెప్పిన దలైలామా ఇప్పుడిలా మాట్లాడటం తగదన్నారు. అందంగా ఉంటేనే ఎక్కువ ఆధ్యాత్మికత ఉన్నాట్లా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో వెనక్కి తగ్గిన దలైలామా క్షమాపణలు చెప్పారు. -
‘ఆమె చాలా అందంగా ఉంటేనే లాభం’
టిబెట్ : ప్రముఖ బౌద్ధ ధర్మ గురువు దలైలామా ఇంటర్నెట్ వేదికగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజుల క్రితం బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో దలైలామా మహిళల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళ మీ వారసురాలు కావడం మీకు అంగీకారమేనా అని విలేకరి అడిగిన ప్రశ్నకు దలైలామా సమాధానమిస్తూ.. మహిళా దలైలామా వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే ఆమె తనలా కాకుండా చాలా అందంగా ఉండాలన్నారు. అలా అయితేనే జనాలు ఆమెను చూడ్డానికి ఉత్సాహం చూపిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దలైలామా. దలైలామా వ్యాఖ్యల పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్త్రీపురుషులిద్దరికీ బౌద్ధమతంలో సమాన హక్కులు ఉంటాయని చెప్పిన దలైలామా ఇప్పుడిలా మాట్లాడటం తగదన్నారు. ఆయన వ్యాఖ్యలు పితృస్వామ్య వ్యవస్థకు అద్దం పడుతున్నాయంటూ నెజటిన్లు మండిపడుతున్నారు. అందంగా ఉంటేనే ఎక్కువ ఆధ్యాత్మికత ఉన్నాట్లా అంటూ ప్రశ్నిస్తున్నారు. in the end, yet another patriarch — Alan (@CityLondonAlan) June 28, 2019 -
భవిష్యత్‌లో మహిళా దలైలామా!
ముంబై: భవిష్యత్తులో మహిళా దలైలామా వచ్చే అవకాశ ముందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, బౌద్ధమత ప్రబోధకులు దలైలామా అన్నారు. బౌద్ధ సంప్రదాయం చాలా ఉదారమైనదని, స్త్రీపురుషులిద్దరికీ బౌద్ధమతంలో సమాన హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. శుక్రవారం ఐఐటీ బాంబేలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘భవిష్యత్‌లో సమర్థవంతమైన మహిళ వస్తే కచ్చితంగా ఆమె మహిళా దలైలామా అవ్వచ్చు. ఎందుకంటే, బౌద్ధ సంప్రదాయం చాలా ఉదారవాదమైంది. ప్రస్తుతం భారత్, టిబెట్ దేశాల్లోని అత్యున్నత స్థానాల్లో పురుషులతో సమానంగా మహిళలు ఉన్నారు. చిన్ననాటి నుంచే మానసిక పరిశుభ్రతకు చాలా ప్రాముఖ్యం ఇవ్వాలి. ఎందుకంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా మెదడు ప్రశాంతంగా ఉండాలి. మెదడు, భావోద్వేగాలకు సంబంధించిన జ్ఞానం భారత్‌లో 3 వేల ఏళ్ల కంటే పురాతనమైంది. 3 వేల ఏళ్ల పురాతన నాగరికత కలిగిన దేశం భారత్ ఒక్కటే. మెదడుని ప్రశాంతంగా ఉంచే పద్ధతులు భారత్‌లో అప్పటి నుంచే ఉన్నాయి. ఆనందం అనేది ప్రశాంతతకు సంబంధించినది. అయితే 20వ శతాబ్దంలో అత్యంత హింస చెలరేగుతోంది. 21వ శతాబ్దం మాత్రం దీన్ని పునరావృతం చేయరాదు. దయా హృదయంతో మానవ మేధస్సు అత్యంత ఆవశక్యమైంది’ అని దలైలామా అన్నారు. -
కర్ణాటకలో దలైలామా హత్యకు కుట్ర
దొడ్డబళ్లాపురం: బౌద్ధ మత గురువు దలైలామా హత్యకు కుట్ర పన్నినట్టుగా కర్ణాటకలోని రామనగరలో పట్టుబడిన టెర్రరిస్టు వెల్లడించినట్టు తెలిసింది. గత ఆగస్టు 7న రామనగరకు వచ్చిన ఎన్ఐఏ బృందం జేఎంబీ టెర్రరిస్ట్ మునీర్‌ను అరెస్టు చేయడం తెలిసిందే. బంగ్లాదేశ్‌కు చెందిన ఇతడు అక్కడ పలు పేలుళ్లలో ప్రధాన నిందితుడు. పోలీసులు గాలిస్తుండడంతో భారత్‌లోకి చొరబడి బట్టల వ్యాపారిగా మారి బెంగళూరు, రామనగరలో మకాం వేసి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఇతని వ్యవహారాలపై ఎన్ఐఏ నిఘా వేసి పట్టుకుంది. విచారణలో మునీర్ ఒక్కొక్కటీ బయటపెడుతుంటే దర్యాప్తు అధికారులే నివ్వెరపోతున్నారు. దలైలామా తరచూ మైసూరు సమీపంలోని బైలుకుప్పె టిబెటన్ పునరావాస కేంద్రానికి వస్తుంటారు. ఆ సమయంలో హత్య చేయాలని రామనగరలో కుట్ర పన్నినట్లు మునీర్ వివరించాడు. దలైలామాను హత్య చేయడం ద్వారా భారత్ సహా పలు దేశాల్లో చిచ్చు పెట్టాలన్నది ఉగ్రవాదుల వ్యూహంగా అనుమానిస్తున్నారు. 2018 జనవరి 18న బిహార్‌లోని బుద్ధగయలో జరిగిన కార్యక్రమంలో బాంబు పెట్టి దలైలామా, బిహార్ గవర్నర్ ఇద్దరినీ ఒకేసారి హత్య చేయాలని కుట్ర పన్నినట్లు మునీర్ బయటపెట్టాడు. ఈ కుట్రలో పాల్గొంటున్న ముగ్గురు అనుమానితులను ఎన్ఐఏ అరెస్టు చేయడంతో పథకం పారలేదు. -
‘గాంధీజీ.. జిన్నాను ప్రధాని చేయాలనుకున్నారు’
పనాజి : మహ్మద్ అలీ జిన్నాను గనుక ప్రధాని చేసి ఉంటే అవిభాజ్య భారత్ ముక్కలయ్యేది కాదని బౌద్ధ గురువు దలైలామా అన్నారు. గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. ఈ క్రమంలో తప్పులు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటూ ఓ విద్యార్థి ఆయనను ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరు జీవితంలో ఎప్పుడో ఒకసారి తప్పు చేస్తారన్న దలైలామా.. ఇందుకు భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ వంటి గొప్ప వ్యక్తులు కూడా అతీతం కాదంటూ సమధానమిచ్చారు. ‘మహ్మద్ అలీ జిన్నాను ప్రధాని చేయాలని మహాత్మా గాంధీ భావించారు. కానీ అందుకు నెహ్రూ ఒప్పుకోలేదు. తాను ప్రధాని అవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఒకవేళ నెహ్రూ గనుక ఆ తప్పు చేయకపోయి ఉంటే జిన్నా ప్రధాని అయ్యేవారు. భారతదేశం.. భారత్, పాకిస్తాన్‌గా విడిపోయేది కాదు. అయినా తప్పులు జరగడం సహజం’ అని దలైలామా వ్యాఖ్యానించారు. -
సంతోషం కోసం ఓ పిరియడ్!
న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థుల కోసం ‘హ్యాపీనెస్ కరిక్యులమ్’ (కొత్త తరహా సిలబస్)ను ఢిల్లీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. దీన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆధ్యాత్మిక గురువు దలైలామా సంయుక్తంగా సోమవారం ప్రారంభించారు. ఈ సిలబస్‌పై ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి వరకు ఈ ‘హ్యాపీనెస్’ పిరియడ్ 45 నిమిషాలపాటు ఉండనుంది. ‘ధ్యానంతో పాటు విలువైన విద్య, మానసిక వ్యాయామాలు ఉంటాయి. 40 మంది ప్రభుత్వ స్కూళ్ల టీచర్లు, విద్యావేత్తలు అధ్యయనం చేసి దీన్ని రూపొందించారు. తీవ్రవాదం, అవినీతి, కాలుష్యంలాంటి అధునిక సమస్యలను ఇలాంటి మానవీయ విద్యను అందించడం ద్వారా పరిష్కరించవచ్చని ఆశిస్తున్నాం’ అని సిసోడియా చెప్పారు. ఆధునిక విద్య, ప్రాచీన జ్ఞానం ఏకం చేయడంతో ప్రతికూల భావాల్ని అధిగమించగల్గుతామని దలైలామా అన్నారు. -
అమా సిస్టర్ ఆఫ్ లామా
ఆమె చుట్టూ బాలల వికసిత వదనాలు. అప్పుడే విచ్చుకున్న పువ్వుల్లాంటì ఆ ముఖాలను చూస్తుంటే ఆమెకి మరో ప్రపంచమే తెలియదు. ఎందుకంటే అది ఆమె సృష్టించుకున్న ప్రపంచం! ‘బాల్యానికి కష్టాలు ఉండకూడదు. బాల్యం ఒత్తిడులకు లోను కాకూడదు. బాల్యం చిదిమిన మొగ్గ అవకూడదు...’ అనుకున్నారు ఆమె. ఆమె పేరు.. జెట్సన్ పెమా. అందరూ పిలుచుకునే పేరు.. ‘అమా’. అమా అంటే అమ్మ. దలైలామాకు సొంత చెల్లి! జన్మభూమి అని చెప్పుకోడానికి ఓ దేశం అంటూ లేకుండా కాందిశీకుల్లా వచ్చి, ఆశ్రయం ఇచ్చిన పొరుగు దేశంలో తలదాచుకుని బతుకు వెళ్లబారుస్తున్నామనే ఆవేదన ఓ వైపు.. దేశాల మధ్య ఆధిపత్య పోరులో పిల్లలు నలిగిపోకూడదనే బాధ్యత మరోవైపు... ఈ రెండే జెట్సన్ పెమా జీవితాన్ని నడిపిస్తున్నాయి. 52 వేల మంది పిల్లలు, వారి భవిష్యత్తు కోసం స్థాపించిన విద్యాసంస్థలతో కాందిశీకులకు అండగా నిలుస్తున్నారు ‘అమా లా’. అమా లా అంటే టిబెట్ భాషలో ‘టిబెట్ దేశమాత’ అని. 77 ఏళ్ల జెట్సన్ పెమాను మనదేశం ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా సత్కరించింది. మహిళలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘నారీశక్తి’ని ప్రదానం చేసి గౌరవించింది. చైనా ఆక్రమణతో చెల్లాచెదురు జెట్సన్ పెమా 1940, జూలై ఏడవ తేదీన టిబెట్‌లోని లాసాలో పుట్టారు. నలుగురు పిల్లల్లో చిన్నది. అమె పెద్దన్న టెన్జిన్ గ్యాస్‌తో. అతడే ప్రస్తుత 14వ దలైలామా. టిబెట్‌ను చైనా ఆక్రమించుకున్నప్పుడు సంభవించిన అభద్రతల కారణంగా టిబెట్ వాసులు భారీ సంఖ్యలో దేశం వదిలి పారిపోయారు. వేలాది టిబెటన్లు ఇండియాకి వచ్చేశారు. అలా వచ్చిన వారిలో పెమా కుటుంబం కూడా ఉంది. మొదట కాలింపాంగ్ లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్, ఆ తర్వాత డార్జిలింగ్‌లోని లోరెటో కాన్వెంట్లో చదువుకున్నారు పెమా. ఉన్నత చదువుల కోసం 1960లో కేంబ్రిడ్జికి వెళ్లారు. ఇంగ్లండ్, స్విట్జర్లాండ్లలో చదువు పూర్తయిన తర్వాత 1964లో తిరిగి ఇండియాకి వచ్చేశారు. అమ్మలా అక్కున చేర్చుకున్నారు అప్పటికి ఆమె పెద్దక్క త్సెర్లింగ్ దోల్మా టాక్లా జబ్బు పడ్డారు. దోల్మాను చూసుకోవడంతోపాటు దోల్మా సంరక్షణలో ఉన్న టిబెట్ అనాథ పిల్లల బాధ్యత కూడా పెమా తీసుకున్నారు. తమ ఆశ్రయంలో ఉన్న పిల్లలతోపాటు, దారీతెన్నూ లేకుండా పుట్టకొకరు చెట్టుకొకరుగా మిగిలిపోయిన వేలాది చిన్నారులను చేరదీశారామె. కాందిశీకులుగా వచ్చి అనాథలుగా మారిన పిల్లలను అమ్మలా అక్కున చేర్చుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాల వేదికగా వారికి ఒక నీడనిచ్చి, అన్నం పెట్టారామె. కానీ అది మాత్రమే సరిపోదని ఆమె అనుకున్నారు. పిల్లల కోసం ప్రత్యేక గ్రామాలు! కాందిశీకులుగా మారిన చిన్నారుల కోసం బడి పెట్టించారు పెమా. మొదట్లో ఇది తాత్కాలిక అవసరమనే అనుకున్నారు. ఆశ్రయం కల్పించి, ఆరేడేళ్లు వచ్చిన పిల్లల్ని సమీపంలోని పాఠశాలల్లో చదివించేవారు. అయితే టిబెట్ నుంచి వలసల ప్రవాహం తగ్గలేదు కదా ఇంకా పెరుగుతూనే ఉంది. అప్పుడు భారత ప్రభుత్వాన్ని సంప్రదించి హిమాలయ పర్వత శ్రేణులలో ఆమె ‘టిబెటన్ చిల్డ్రన్స్ విలేజెస్’ పేరుతో స్కూళ్లను స్థాపించారు. ఆ స్కూళ్లలో టిబెట్ పిల్లలు, హిందూ, క్రైస్తవ క్యాథలిక్, ప్రొటెస్టెంట్ పిల్లలు కూడా చదువుకుంటున్నారిప్పుడు. జెట్సన్ పెమా చదువు పూర్తి చేసుకుని ఇండియాకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 52 వేల మంది ఏ దారీతెన్నూ లేని పిల్లలను గ్రాడ్యుయేట్లను చేశారు. మొత్తం పది రెసిడెన్షియల్ స్కూళ్లు, 17 డే స్కూళ్లు, మూడు వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లు, నాలుగు కాలేజీలు, మూడు హాస్టళ్లను స్థాపించారు. మహిళల్నీ, వృద్ధుల్నీ చేరదీశారు పిల్లల సంరక్షణకు ఒక చక్కటి దారి పడింది. చదువుకుని బయటకు వచ్చిన పిల్లలు ఉద్యోగాలలో స్థిరపడే వరకు ఒక ఆశ్రయం కావాలి. అందుకోసం యూత్ హాస్టల్స్ ఏర్పాటు చేశారు జెట్సన్ పెమా. ఇక భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలలో తలదాచుకున్న మహిళలు, వృద్ధులకు ఒక దారి చూపించాలి. అందుకోసం ఆశ్రమాలు నెలకొల్పారు. టిబెట్ నుంచి భారత్‌కు వచ్చిన మహిళలు, వృద్ధులు ఆ ఆశ్రమాలలో తలదాచుకుంటున్నారు. అందుకే వీరంతా జెట్సన్ పెమాను ‘మదర్ ఆఫ్ టిబెట్’ గా అంతా అభిమానిస్తున్నారు. యునెస్కో పురస్కారం అమా జెట్సన్ ప్రతిపాదించిన ‘టిబెటన్ చిల్డ్రన్స్ విలేజ్’ ఆలోచన వినూత్నమైంది. ఆ ప్రతిపాదనకు భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందడంలోనూ ఆమె విజయం సాధించారు. ఆ తర్వాత వాటి స్థాపనలో నిమగ్నమయ్యారు. భారత ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆమె టిబెట్ పిల్లల పునరావాసాన్ని ఒక యజ్ఞంలా చేశారు. ఆ సేవలను గుర్తించిన యునెస్కో 1999లో ఆమెను అవార్డుతో గౌరవించింది. టిబెట్‌ను వదిలేయడమేనా?! పిల్లలు, మహిళలు, వృద్ధులు... ఒక్కమాటలో చెప్పాలంటే నిరాశ్రయులందరికీ ఆశ్రయం కల్పించారు జెట్సన్ పెమా. భారతదేశం తల్లిలా ఆదుకుంటే, ఆ దేశంలో తమ వాళ్ల కోసం తన ఒడిని విశాలం చేసింది పెమా. మరి తాము కోల్పోయిన టిబెట్‌ను అలా వదిలేసుకోవడమేనా? ఆమెలో ఆవేదన రగులుతూనే ఉండేది. దలైలామా ఆదేశంతో వాస్తవాల అన్వేషణ కోసం విస్తృతంగా ఆమె పర్యటించారు. ప్రవాసంలో ఉన్న టిబెట్ వాసుల కోసం ఏర్పాటైన మంత్రివర్గంలో కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. టిబెట్ పరిపాలనలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ కూడా పెమానే. – మంజీర -
దలైలామాను కలిశారో.. అంతే..
సాక్షి, న్యూఢిల్లీ: బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాను విదేశీ నాయకులు ఎవరైనా కలిస్తే.. దానిని తీవ్ర నేరంగా పరిగణిస్తామంటూ చైనా శనివారం ఘాటు హెచ్చరికలు జారీచేసింది. టిబేట్ మతనాయకుడైన దలైలామాను 'వేర్పాటువాద' నేతగా భావిస్తున్న చైనా.. ఆయనకు ఏ దేశమైన ఆతిథ్యమిచ్చినా, విదేశీ నాయకుడు ఎవరైనా ఆయనను కలిసినా సహించబోమంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. విదేశీ నేతలు ఎవరైనా వ్యక్తిగతంగా దలైలామాను కలుసుకోవచ్చునని భావిస్తూ ఉండవచ్చునని, కానీ, తమ ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు అలా చేయరాదని చెప్పుకొచ్చింది. 1959లో చైనా పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నించి విఫలమైన దలైలామా ప్రస్తుతం భారత్‌లో ప్రవాసముంటున్న సంగతి తెలిసిందే. నోబెల్ శాంతిపురస్కారాన్ని గెలుచుకున్న దలైలామాను చైనా ప్రమాదకర వేర్పాటువాదిగా అభివర్ణిస్తూ వస్తోంది. మరోవైపు దలైలామా తన హిమాలయ మాతృభూమి అయిన టిబేట్‌కు సముచితమైన స్వతంత్ర ప్రాతిపత్తి కావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దలైలామాను ఏ దేశమైనా, ఏ సంస్థ అయినా, ఏ వ్యక్తి అయినా కలిస్తే.. అది చైనా ప్రజల సెంటిమెంట్‌కు విరుద్ధమైన తీవ్ర నేరమే' అంటూ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వానికి చెందిన ఎగ్జిక్యూటివ్ వైస్ మినిష్టర్ ఝాంగ్ యిజియాంగ్ అన్నారు. గతంలో ప్రపంచ నేతలు ఎవరైనా దలైలామాను కలిస్తే.. చైనా నిరసన తెలిపిదే. కానీ, తాజాగా దలైలామాపై చైనా తన వైఖరిని కఠినతరం చేసినట్టు కనిపిస్తోంది. -
'చంపాలనుకుంటే చంపేస్తారంతే..'
ఇంపాల్ : ఉగ్రవాదులకు ప్రత్యేక మత అభిమానం ఉండదని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. వారు చంపేయాలనుకుంటే చంపేస్తారని, ఉగ్రవాదాన్ని కొనసాగించడమే వారి అభిమతంగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రత్యేకంగా ముస్లిం ఉగ్రవాది, క్రైస్తవ ఉగ్రవాది అంటూ ఉండడని, ఏ మతానికి చెందినవారైనా ఉగ్రవాదులుగా మారే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. ఇంపాల్‌లో ఓ రిసెప్షన్ పాల్గొన్న సందర్భంగా ఆమన మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై కూడా విమర్శలు చేశారు. అమెరికానే తన తొలి ప్రాధాన్యం అనే ట్రంప్ నినాదం సరికాదని అన్నారు. హింస పరిష్కారాన్ని చూపెట్టబోదని, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా మనం సృష్టించుకున్నవేనని అన్నారు. దాదాపు వెయ్యేళ్ల అహింసా చరిత్రను కలిగిన భారతదేశం ప్రపంచ శాంతిని స్థాపించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు తమ భావోద్వేగాలను తమ నియంత్రణలో పెట్టుకోవాలని, ఆగ్రహం ప్రజల రోగ నిరోధక శక్తిని హరిస్తుందని, ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని కూడా హితవు పలికారు. -
చైనాకు ‘చెప్పు దెబ్బ’ పడాల్సిందే..!
-
చైనాకు ‘చెప్పు దెబ్బ’ పడాల్సిందే..!
- ప్రపంచ శాంతి,సామరస్య సమ్మేళనంలో బాబా రాందేవ్ - బౌద్ధగురువు దలైలామాతో ఫన్నీ మూమెంట్.. వీడియో వైరల్ ముంబై: భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతోన్న చైనాను ఉద్దేశించి ప్రముఖ యోగా గురువు, పతంజలి సంస్థల వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిబెటన్ బౌద్ధగురువు దలైలామాతో కలిసి.. ఆదివారం ముంబైలో జరిగిన ప్రపంచ శాంతి, సామరస్య సమ్మేళనంలో రాందేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురిమధ్య ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయింది. చైనాకు అలానే చెప్పాలి : ‘చైనాకు శాంతి, సామరస్యం అంటే ఏమిటో తెలియదు. ఒకవేళ తెలిసుంటే, దలైలామా ఇక్కడ(ఇండియాలో) ఆశ్రయం పొందాల్సిన అవసరమే వచ్చేదికాదు. అందుకే ఇండియా.. చైనాతో ‘కుక్క కాటుకు చెప్పుదెబ్బ’ అన్నట్లుగా వ్యవహరించాలి. యోగా లాంటి శాంతియుత పద్ధతుల్లో నచ్చచెప్పితే అర్థం చేసుకోలేనివాళ్లకు యుద్ధంతోనే సమాధానం చెప్పాలి’ అని రాందేవ్ అన్నారు. దలైలామా ఉద్బోధ: ప్రపంచంలో అశాంతికి కారణం హింసావాదమేనని బౌద్ధగురువు దలైలామా అన్నారు. ‘భయం విసుగును పుట్టిస్తుంది. విసుగువల్ల కోపం జనిస్తుంది. ఆ కోపం మనిషిని హింసవైపునకు నడిపిస్తుంది. కాబట్టి ప్రజలంతా భయం లేకుండా జీవించాలి’ అని లామా అన్నారు. -
‘నా బ్రెయిన్లో ప్రతికణం భారతీయతే’
బెంగళూరు: టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా భారత్‌ను మరోసారి పొగడ్తల్లో ముంచెత్తారు. ‘భారత్ అంటే గురువు. మనమంతా ఫాలోవర్సులం’ అని ఆయన చెప్పారు. మంగళవారం బెంగళూరులో ‘సామాజిక న్యాయం డాక్టర్ బీఆర్ అంబేద్కర్’ అనే అంశంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి సెమినార్లో పాల్గొన్న ఆయన ఇప్పటికీ అందరం సుభిక్షంగా ఉన్నామంటే అది భారతీయ ప్రాచీన భారతీయ సమాజం విలువలు, జ్ఞాన సంపదే కారణం అని చెప్పారు. అందుకే తన దృష్టిలో భారత్ గురువు అని చెప్పారు. ‘నన్ను నేను భారతీయుడిగానే భావిస్తాను.. నా మెదడులోని ప్రతి కణం కూడా ప్రాచీన భారతీయ సమాజ జ్ఞానం, విలువలతో నిండిపోయింది.. అలాగే, నా శరీరం అంటే భారతీయ రైస్, దాల్’ అని దలైలామా అన్నారు. భూస్వామ్య వ్యవస్థ కారణంగానే కులవ్యవస్థ పుట్టుకొచ్చిందన్న ఆయన దాని వల్లే సామాజిక న్యాయం కొరవడిందని చెప్పారు. కుల వ్యవస్థ అనేది భారతీయ సమాజంలో ప్రతికూల దృక్పథంగా మిగిలిపోయిందని, దానిని తొలగించాల్సిన అవసరం ఉందని సూచించారు. కొన్నిచోట్ల మతం పేరుతో భూస్వామ్య విధానాలు కనబరుస్తున్నారని, అవి అలా ఉండకూడదని, దానిని కూడా నిర్మూలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. -
భారత్‌కు భారీ మూల్యం తప్పదు: డ్రాగన్ బుసలు!
భారత్‌పై డ్రాగన్ మరోసారి బుసలు కొట్టింది. దలైలామాను అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించేందుకు అనుమతించడం వల్ల భారత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ.. తన కనుసన్నలలో ఉండే ప్రభుత్వ మీడియాతో చైనా హెచ్చరికలు చేయించింది. దలైలామా పర్యటనకు ప్రతిఘటనగానే అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాల పేర్లను మార్చినట్టు సంకేతాలు ఇచ్చింది. దక్షిణ టిబేట్లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదేనని వాదిస్తున్న చైనా తాజాగా ఆ రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల పేర్లను మారుస్తున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ ప్రకటనను భారత్ తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రతి అంగుళం కూడా తమదేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో చైనా జాతీయవాద పత్రిక గ్లోబల్ టైమ్స్ స్పందిస్తూ.. ‘చైనా ఇప్పుడు దక్షిణ టిబేట్‌లోని పేర్లను ఎందుకు ప్రామాణీకరించిందో భారత్ ఓసారి తీవ్రంగా ఆలోచించుకోవాలి. దలైలామాను వాడుకోవడం భారత్‌కు సరైన చాయిస్ కాదు. ఒకవేళ భారత్ ఇదే గేమ్‌ను కొనసాగించదలుచుకుంటే.. ఆ దేశానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది’ అని వ్యాఖ్యానించింది. భారత్ కంటే చైనా బలమైన దేశమని, ఒకవేళ ఏ దేశం బలంగా ఉందో చూడాలని భావిస్తే.. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికి చైనా చర్చల జోలికి రానేరాదని తెగేసి చెప్పింది. అంతేకాకుండా చైనా తాజా చర్యలను ప్రతీకార చర్యలుగా అభివర్ణిస్తూ భారత మీడియా కథనాలు రాసిందని, ఇది అసంబద్ధమైనదంటూ పేర్కొంది. -
భారత్‌పై చైనా నోట మళ్లీ అదే మాట!
-
భారత్‌పై చైనా నోట మళ్లీ అదే మాట!
బౌద్ధుల మతనాయకుడు దలైలామాను ఉపయోగించుకొని చైనా ప్రయోజనాలను దెబ్బతీసేందుకు భారత్ ప్రయత్నించకూడదని ఆ దేశం పేర్కొంది. దలైలామా ఇటీవల చేపట్టిన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన వల్ల ఇరుదేశాల సంబంధాలకు నష్టం కలిగించిందని మరోసారి వ్యాఖ్యానించింది. ‘దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటన భారత్-చైనా సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. టిబేట్‌పై తీసుకున్న కట్టుబాటును భారత్ పాటించాల్సిన అవసరముంది. చైనా ప్రయోజనాలకు తక్కువ చేసేందుకు దలైలామాను ఆ దేశం వాడుకోకూడదు’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లు కాంగ్ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలోని దక్షిణ టిబేట్లో భాగమని చైనా మొండిగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. ధర్మశాల కేంద్రంగా బౌద్ధుల మతనాయకుడిగా, టిబేట్ ఆధ్యాత్మిక గురువుగా ఉన్న దలైలామా ప్రత్యేక దేశంగా టిబేట్ ఏర్పాటుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్నది. -
భారత్‌పై విషం చిమ్మిన చైనా
బీజింగ్: భారత్‌పై మరోసారి చైనా విషం చిమ్మింది. అసత్య కథనాన్ని అక్కడి మీడియా వండివార్చింది. భారత్ అక్రమంగా పరిపాలిస్తున్న అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని, తీవ్ర కష్టాలుపడుతున్నారని ఇష్టరీతినా ఓ చైనాకు చెందిన అధికారిక పత్రిక రాసింది. అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు తిరిగి చైనాకు వచ్చేయాలని అనుకుంటున్నట్లు కూడా అందులో పేర్కొంది. దలైలామాకు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఇస్తే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలోనే అక్కడి పేపర్లో ఇలాంటి కథనం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘చట్ట విరుద్ధంగా భారత్ పరిపాలిస్తున్న దక్షిణ టిబెట్(అరుణాచల్ ప్రదేశ్‌లో భాగం. దీనిని చైనా తమదిగా చెప్పుకుంటోంది) ప్రాంతంలోని ప్రజలంతా తీవ్ర కష్టాలు, దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఒకరకమైన వివక్షను చవిచూస్తూ వారు ఇండియాకు తిరిగొచ్చేయాలని అనుకుంటున్నారు’ అంటూ చైనా డెయిలీ రాసుకొచ్చింది. -
చైనా లామాయణం
-
దలైలామాకు భారత రత్న?
తవాంగ్ : టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు భారత్ అత్యుత్తమ పురస్కారం భారత రత్నను ఇవ్వాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కోరుతోంది. దలైలామాకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సంతక సేకరణ క్యాంపెయిన్ ను కూడా ప్రారంభించింది. ఓ వైపు దలైలామా భారత్ పర్యటనకు చైనా తీవ్ర అభ్యంతరం చెబుతున్నా... ఆయన శుక్రవారం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ చేరారు. ఆయన రావడానికి ఒక్క రోజు ముందు అంటే ఏప్రిల్ 6న ఆర్ఎస్ఎస్ ఈ క్యాంపెయిన్ ను లాంచ్ చేసింది. ఇప్పటికీ 5000 సంతకాలు సేకరించామని, 25వేల సంతకాలు పొందిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్దకు ఈ అభ్యర్థనను తీసుకెళ్తామని ఆర్ఎస్ఎస్ చెబుతోంది. దలైలామాకు 1989లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. టెంపుల్టన్ ప్రైజ్-2012కి కూడా ఆయన ఎంపికయ్యారు. భారత రత్న పురస్కారం, నోబెల్ శాంతి బహుమతి కంటే భిన్నమైనదని, అంతర్జాతీయంగా మంచి మెసేజ్ ను అందించడానికి ఇది తోడ్పడుతుందని ఆర్ఎస్ఎస్ పేర్కొంది. దలైలామా భారతరత్నకు అర్హుడని, ఆయన భారత్ సంతతికి చెందిన వారని తెలిపింది. -
దలైలామాపై భగ్గుమన్న చైనా.. భారత్‌కు అల్టిమేటం!
-
చైనాకు వ్యతిరేకంగా భారత్ నన్ను వాడుకోలేదు!
న్యూఢిల్లీ: తన అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బౌద్ధమత గురువు దలైలామా స్పందించారు. చైనాకు వ్యతిరేకంగా భారత్ తననెప్పుడు వాడుకోలేదని ఆయన అన్నారు. టిబేట్ ప్రాంతానికి అర్థమంతమైన స్వయం పరిపాలన, స్వతంత్రతను చైనా అందించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. 'చైనాలో భారత్‌ను ప్రేమించేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ కొంతమంది సంకుచిత దృక్పథం కలిగిన రాజకీయా నాయకులు నన్ను రాక్షసుడిగా చూస్తున్నారు' అని అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న దలైలామా బుధవారం మీడియాతో పేర్కొన్నారు. దౌత్యపరంగా చైనాను సవాల్ చేసేందుకే దలైలామాను భారత్ వాడుకుంటున్నదని ఆ దేశం చేస్తున్న వాదనను దలైలామా తోసిపుచ్చారు. 'భారత్‌కు నేను చాలా సుదీర్ఘకాలపు అతిథిని. నన్ను చైనాకు విరుద్ధంగా భారత్ వాడుకోలేదు' అని అన్నారు. అరుణాచల్‌లో దలైలామా పర్యటనను వెంటనే నిలిపివేయాలని భారత్‌ను చైనా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ 'వివాదాస్పద ప్రాంతం'లో దలైలామా పర్యటనకు అనుమతించడం ద్వారా భారత్ తమతో సంబంధాలను చెడగొట్టుకునే సాహసం చేసిందని డ్రాగన్ మండిపడింది. -
దలైలామాపై భగ్గుమన్న చైనా.. భారత్‌కు అల్టిమేటం!
బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్‌లో కొనసాగుతున్న బౌద్ధ మత గురువు దలైలామా పర్యటనపై చైనా భగ్గుమంది. 'వివాదాస్పద ఆ ప్రాంతం'లో దలైలామా పర్యటనను వెంటనే నిలిపివేయాలని భారత్‌కు అల్టిమేటం జారీచేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లో దలైలామా పర్యటనకు అనుమతించడం ద్వారా భారత్ తమతో సంబంధాలను చెడగొట్టుకునే సాహసం చేసిందని మండిపడింది. 81 ఏళ్ల టిబేట్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా మంగళవారం నుంచి వారం రోజులపాటు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దలైలామా పర్యటన భారత్ అంతర్గత విషయమని, ఈ విషయంలో రాద్ధాంతం చేయడం తగదని భారత్ ఇప్పటికే చైనాకు హితవు పలికింది. అయితే, అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబేట్లో భాగమని మొండిగా వాదిస్తున్న చైనా.. సరిహద్దుల్లో ఆ వివాదాస్పద ప్రాంతానికి దలైలామాను ఎలా అనుమతిస్తారని ప్రశ్నించింది. 'తప్పుడు చర్యలను వెంటనే మానుకోవాలని భారత పక్షాన్ని కోరుతున్నాం. సున్నితమైన విషయాలను రెచ్చగొట్టదు. భారత్-చైనా సంబంధాల వృద్ధికి దోహదపడే సమగ్ర చర్యలు తీసుకోవాలి' అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హు చున్యింగ్ బుధవారం మీడియాతో అన్నారు. దలైలామా ఆధ్యాత్మిక కారణాలతోనే ఈ పర్యటన చేస్తున్నారన్న భారత వాదనను సైతం చైనా తోసిపుచ్చింది. వివాదాస్పద ప్రాంతంలో దలైలామా ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్నారంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని వ్యాఖ్యానించింది. '14వ దలైలామా పాత్ర ఏమిటో భారత్‌కు చాలా బాగా తెలుసు. వివాదాస్పద ప్రాంతంలో ఈ పర్యటనకు అనుమతించడమంటే.. టిబేట్ విషయంలో భారత్ చిత్తశుద్ధికి వ్యతిరేకమే అవుతుంది. అంతేకాకుండా సరిహద్దుల్లో వివాదాన్ని రేపుతుంది' అని చున్యింగ్ పేర్కొన్నారు. తమ అభ్యంతరాలను బేఖాతరు చేసి మరీ దలైలామా పర్యటనను అనుమతించినందుకు భారత్‌కు తమ నిరసనను తెలుపుతామని చైనా పేర్కొంది. ఇది ఇరుదేశాల సంబంధాలను దారుణంగా దెబ్బతీయడమే కాకుండా సరిహద్దు వివాదంలో ఉద్రిక్తతలు పెంచవచ్చునంటూ సంకేతాలు ఇచ్చింది. -
చైనా వార్నింగ్ పై స్పందించిన భారత్
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో అంతర్గత భాగమని, దీన్ని ఎవరూ వేరు చేయలేరని భారత్ స్పష్టం చేసింది. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చైనాకు సూచించింది. చైనా వ్యవహారాల్లో తమ దేశం తలదూర్చడం లేదని, అలాగే చైనా కూడా తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని భావిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. టిబెట్ ఆధ్యాత్మిక బౌద్ధ గురువు దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇది పూర్తిగా మతపరమైన పర్యటన అని, ఇందులో ఎటువంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు. నేటి నుంచి వారం రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్ లో దలైలామా పర్యటించనున్నారు. సరిహద్దులో సున్నిత ప్రాంతమైన తవాంగ్ లో దలైలామా పర్యటించనుండడంపై చైనా తీవ్ర అభ్యంతరం చేసింది. ఆయన పర్యటనను అడ్డుకోకుంటే దౌత్యపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. -
‘ఈ జవాను 58 ఏళ్ల కింద నన్ను రక్షించాడు’
న్యూఢిల్లీ: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా భావోద్వేగానికి లోనయ్యారు. 58 ఏళ్ల కిందట తనకు అంగరక్షకుడిగా పనిచేసిన ఓ సైనికుడిని కలిసిన క్షణంలో సంతోషంలో మునిగిపోయారు. ప్రస్తుతం అసోం పర్యటనలో ఉన్న ఆయన నమామి బ్రహ్మపుత్ర నది ఉత్సవంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంతో ఆప్తులుగా భావించిన నాటి అంగరక్షకుల్లో ఒకరిని కలిసి తన్మయత్వం చెందారు. చైనా సైనికుల దురాక్రమణ చర్యలను నిరసిస్తున్న దలైలామాను బందించాలని చైనా సేనలు ప్రయత్నించిన సమయంలో 1959 మార్చి నెలలో టిబెట్ నుంచి తప్పించుకుని ఇండియాకు దలైలామా వచ్చారు. ఆ సమయంలో ఆయనకు అంగరక్షకులుగా అస్సాం రైఫిల్స్ గార్డ్స్ ఐదుగురు పనిచేశారు. వారిలో ఒకరైన జవాను నరేన్ చంద్ర దాస్‌ను దలైలామా ఆదివారం కలుసుకున్నారు. ‘మీకు చాలా ధన్యవాదాలు. 58 ఏళ్ల కిందట నాకు అంగరక్షకులుగా ఉండి నన్ను కాపాడిన అస్సాం రైఫిల్స్ గార్డ్స్లలో ఒకరైన మిమ్మల్ని కలిసినందుకు నాకు మహదానందంగా ఉంది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. -
స్మిత్ బృందానికి దలైలామా ఆశీర్వాదం
ఆస్ట్రేలియా ఆటగాళ్లు టిబెట్ ఆధ్యాత్మిక బౌద్ధ గురువు దలైలామాను కలిశారు. శుక్రవారం ధర్మశాల మెక్లియోడ్ గంజ్‌లోని ఆయన మందిరంలో కలిసిన ఆసీస్ క్రికెటర్లను దలైలామా ఆశీర్వదించారు. అనంతరం ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ మాట్లాడుతూ ‘బౌద్ధ గురువును కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో గడిపిన క్షణాలు అహ్లాదకరంగా సాగాయి. ప్రశాంతంగా నిద్రపోవడం ఎలాగో ఆయన్ని అడిగి తెలుసుకున్నాను. ముక్కు మూసుకొని మేమంతా ఆయన ముందు కూర్చుంటే మమ్మల్ని ఆశీర్వదించి పంపారు. దీంతో తదుపరి ఐదు రోజులు ఎలాంటి కలవరపాటు లేకుండా కంటినిండా నిద్రపోతాను’ అని అన్నాడు. దలైలామాతో భేటీ వల్ల ఎలాంటి లబ్ధి పొందారని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘చెప్పలేనంత ప్రశాంతత పొందాం. ఆయనతో ఏదైనా ఇట్టే నేర్చుకోవచ్చు. మాకిది చక్కని అనుభూతి. శిరోభారం తగ్గి ఎక్కడలేని ఉపశమనం లభించింది’ అని స్మిత్ చెప్పాడు. ఈ సందర్భంగా కెప్టెన్ స్మిత్ ఆసీస్ క్రికెటర్లందరూ సంతకం చేసిన జెర్సీని దలైలామాకు అందజేశాడు. -
దలైలామా..సన్ ఆఫ్ ఇండియా
-
'ఆయన వస్తే మాకు సంతోషం దూరం'
దలైలామాను రానివ్వద్దు అమెరికా వర్సిటీలో చైనా విద్యార్థుల నిరసన లాస్ ఏంజెలెస్: అమెరికాలోని కాలిఫోర్నియా శాన్‌డియాగో విశ్వవిద్యాలయంలో జరిగే ఓ వేడుకలో ప్రసంగించాల్సిందిగా బౌద్ధమత గురువు దలైలామాను వర్సిటీ యాజమాన్యం ఆహ్వానించడం వివాదాస్పదమైంది. జూన్‌లో జరిగే విద్యా సంవత్సర ప్రారంభ వేడుకలకు దలైలామా రావడాన్ని చైనా విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దలైలామా తమ దేశాన్ని చీల్చి, ఐక్యతను దెబ్బతీయాలని చూస్తున్నారనీ, ఆయన వస్తే తమకు సంతోషం దూరం అవుతుందని చైనా విద్యార్థులు గట్టి నిరసన తెలుపుతున్నారు. మరోవైపు దలైలామాకు పంపిన ఆహ్వానంపై వెనక్కు తగ్గేది లేదని వర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి. వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని తాము గౌరవిస్తామనీ, తన అభిప్రాయాలు చెప్పే హక్కు దలైలామాకు ఉందని విశ్వవిద్యాలయ అధికారులు పేర్కొన్నారు. -
రాజధానిలో భద్రత డొల్ల
సాక్షి, అమరావతి : అది రాజధాని ప్రాంతంలోని తాడేపల్లి గ్రామం. ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున ఏపీ07టీజీ 7477 నంబర్ ట్రాక్టర్ అపహరణకు గురైంది. 8వ తేదీన బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరా ఫుటేజీలపై ఆ«ధారపడ్డారు. తాడేపల్లి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ట్రాక్టర్ వారధిపై నుంచి వెళ్లడాన్ని స్పష్టంగా గమనించారు. అదే దారిలో సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించుకుంటూ బ్యారేజీ నుంచి విజయవాడ నగరంలోకి వెళితే ట్రాక్టర్ దొంగను పట్టుకోవచ్చని ధీమాగా ముందుకు సాగారు. అయితే ప్రకాశం బ్యారేజీపై విజయవాడ వైపు ఉన్న 15 సీసీ కెమెరాల్లో ఏ ఒక్కటీ పనిచేయడం లేదని తెలిసి కంగుతిన్నారు. అంతే కాదు విజయవాడ నగరంలోని వన్‌టౌన్, ప్రధాన రహదారిలోనూ సీసీ కెమెరాల్లో ఏ ఒక్కటీ పనిచేయడంలేదని పోలీసులకే అనుభవమైంది. ఫుటేజీ చూడటానికి అసలు సీపీ కెమెరాలే పనిచేయడం లేదని నిర్ధారించారు. ఇంతకీ ట్రాక్టర్ వెళ్లిన దారిలో వెదుకుదామని వెళితే నిఘా నిద్రపోతున్న వైనం వెలుగు చూసింది. ప్రకాశం బ్యారేజీ, వన్‌టౌన్‌కు ఆనుకుని ఉన్న విజయవాడ ప్రధాన రోడ్డు మార్గంలో నిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణిస్తుంటారు. ఈ మార్గంలో లెక్కకు మిక్కిలి సీసీ కెమెరాలు ఏర్పాటుచేసినప్పటికీ అవి ఏమేరకు పనిచేస్తున్నాయో పరిశీలించడంలో మాత్రం ఘోర వైఫల్యం కన్పిస్తోంది. చిత్రం ఏమిటంటే ప్రకాశం బ్యారేజీ వద్ద ఒక స్తంభానికి ఏకంగా ఏడు సీసీ కెమెరాలు బిగించారు. అందులో ఏ ఒక్కటీ పనిచేయడంలేదని గుర్తించారు. మూడు రోజలపాటు జరుగుతున్న మహిళా పార్లమెంట్ సదస్సుకు సైతం దేశవిదేశాల నుంచి ప్రముఖులు వచ్చారు. బౌద్ధమత గురువు దలైలామాకు, మావోయిస్టుల నుంచి చంద్రబాబుకు హాని ఉందని గతంలోనే నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇటువంటి కీలక సమయంలో సీసీ కెమెరాలు ఎంత వరకు పనిచేస్తున్నాయనే పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కన్పిచడం గమనార్హం. -
ప్రపంచానికి భారతే మార్గదర్శి
భారతీయ తత్వమే శాంతికి దోవ: దలైలామా సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రపంచంలోని అన్ని మతాలవారు భారత్‌లో జీవిస్తున్నారు. చిన్నచిన్న భేదాభిప్రాయాలతో అడపాదడపా చికాకులు ఉంటున్నా పరమత సహనంతో సహజీవనం చేస్తున్నారు. ముంబైలో పార్సీలు లక్షమందే ఉన్నా వారిలో ఎన్నడూ అభద్రతా భావం కనిపించదు. ఇలా అల్పసంఖ్యాకులూ సంతోషంగా ఉండగలుగుతుండటమే ఈ దేశ ప్రత్యేకత. సనాతన భారతీయతత్వమే దీనికి కారణం’’ అని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. భారత్‌లో మాదిరి సంఘటిత, సహజీవన సౌందర్యం ప్రపంచం లో మరెక్కడా కనిపించదని పేర్కొన్నారు. అశాంతితో రగిలిపోతున్న ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది భారతీయ తత్వమేనని, అదే శాంతికి తోవ చూపుతుందని సూచిం చారు. ఈ విషయంలో భారత్ కూడా ప్రధాన భూమిక పోషించాలని ఆకాంక్షించారు. ‘‘ఇస్లాం మతంలో భాగమైనా షియా, సున్నీ లు పరస్పరం మారణకాండకు దిగుతున్నారు. కానీ ప్రపంచంలోనే ఎక్కువ ముస్లిం జనాభా ఉన్న రెండో అతిపెద్ద దేశమైన భారత్‌లో మాత్రం ఆ భావన లేకపోవటం గొప్ప విషయం. పరమత సహనంతో పరిఢవిల్లుతున్న ఈ దేశ గొప్పతనాన్ని ప్రపంచం అనుసరిస్తే శాంతికాముకంగా వర్ధిల్లుతుంది’’ అని పేర్కొ న్నారు. తాను భారత్‌ను దైవభూమిగా కంటే మానవీయ విలువలున్న నేలగా భావిస్తాన న్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని మాదా పూర్లో దక్షిణాసియాకు హబ్‌గా ఏర్పాటు కానున్న దలైలామా నైతిక విలువల కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం హైటెక్స్ ప్రాంగణంలో జరిగిన సభలో నీతి, విలువలు, నడవడిక అన్న అంశాలపై ఆయన ప్రసంగించారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పాశ్చాత్య భావజాలం ప్రమాదకరం నైతిక విలువలు, అహింస, కరుణ, భిన్నత్వం లో ఏకత్వం వంటి ఉన్నత విలువలతో ప్రపంచానికి మార్గదర్శనం చేసిన భారత్‌లో ప్రస్తుతం కొంతమార్పు కనిపిస్తోందని దలై లామా ఆందోళన వ్యక్తం చేశారు. ఆధునిక భారత యువతలో పాశ్చాత్యీకరణ మోజు కనిపిస్తోందని, ఇది తీవ్రరూపం దాల్చేలోపు ఓసారి సనాత భారతీయ ఔన్నత్యాన్ని మన నం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో ప్రగతివైపు సాగుతూనే ఉన్నత విలువలతో కూడిన సనాతన సంప్రదాయాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. అలాంటి సనాతన విలువలను ప్రోదికొల్పేందుకే నైతిక విలువల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. చాలా మంది రాజకీయ నేతలకంటే తనకే భారతీయ సనాతన సంప్రదాయాలపై అవగాహన ఉందని వ్యాఖ్యానించారు. ‘‘నేను కొంతకాలంగా శాస్త్రవేత్తలతో మమేకమవుతూ అటు సనాతన పద్ధతులు, ఇటు ఆధునిక అడుగుల మధ్య సమన్వయం కోసం యత్నిస్తున్నా. నాగార్జును డి విధానాలు, క్వాంటమ్ ఫిజిక్స్ థియరీ దగ్గరగా ఉన్న విషయాన్ని గుర్తించాను. ఈ మేళవింపుతో ఆధునిక సమాజం ముందుకు సాగినప్పుడు యుద్ధాలకు అవకాశమే లేదు. ఆయుధ సంపత్తిపై ఎక్కువ ఖర్చు చేయాల్సిన దుస్థితి ఉండదు’’ అని అన్నారు. నాన్న కోపిష్టి.. అమ్మ కరుణామూర్తి పిల్లలను గొప్పవారిగా తీర్చిదిద్దటంలో తల్లి దండ్రుల పాత్ర ఎనలేనిదని, ఇందులో తల్లి పాత్ర అత్యంత ముఖ్యమైందని దలైలామా చెప్పారు. పురుషులతో పోలిస్తే ఆడవారిలో కరుణ, అహింస, నైతికత పాళ్లు ఎక్కువగా ఉంటాయన్నారు. ‘‘మా నాన్న చాలా కోపిష్టి.. మా అమ్మ కరుణామూర్తి.. అందుకే నేను నాన్న పోలికలు రావద్దని కోరుకున్నా.. చిన్న ప్పుడు బద్ధకంగా ఉండే నేను తల్లి వల్లే మారిపోయా’’ అని చెప్పారు. మీకు ఇంతటి చురుకుదనం ఎలా: కేటీఆర్ ప్రసంగం తర్వాత ప్రశ్నలు అడిగేందుకు దలైలామా అవకాశం ఇవ్వగా.. ‘‘82 ఏళ్ల వయసులో 22 ఏళ్ల కుర్రాడిలా ఎలా ఉంటున్నారు’’ అని మంత్రి కేటీఆర్ అడిగారు. అందుకు ఆయన బదులిస్తూ... ‘‘22 ఏళ్ల యువకుడిలా ఉన్నాననటం అతిశయోక్తి. కానీ 60 ఏళ్ల వ్యక్తిలా మాత్రం కనిపిస్తా. దానికి మనసును ప్రశాంతంగా ఉంచుకోవటమే కారణం. ఎవరికీ హాని చేయలేదనే భావన మనలో ఉండాలి. అది నేర్పింది నాకు భారతీయ తత్వమే. రోజుకు తొమ్మిది గంటల నిద్ర, ఐదు గంటల ధ్యానం చేస్తాను’’ అని చెప్పారు. టిబెటెన్ అయి కూడా తనను తాను భారతీయ పుత్రిడిగానే అభివర్ణించుకుంటానని పేర్కొన్నారు. విపశ్యన ధ్యాన పద్ధతిని అలవర్చుకోవాలని సూచించారు. ఇతరులకు సాయం చేయటం, ఎవరికీ హానీ చేయని మంచితనం, సంతృప్తికర జీవనం గడిపితే మరణం కూడా గొప్పగా ఉంటుందన్నారు. చర్చల శతాబ్ది కావాలి.. పేరు, ఊరు, రంగు, భాష, ప్రాంతం, దేశం, మతం.. ఇలా వేర్వేరు అయినా మనుషులంతా ఒక్కటేనన్న భావన ప్రజ ల్లో కలగాలని దలైలామా అన్నా రు. ఈ ప్రాథమిక అంశాన్ని వదిలేసి వేర్వేరు అన్న భావనకు ప్రాధాన్యం ఇచ్చి కలహిం చుకుంటున్నారని అన్నారు. ప్రతి సమ స్యకు చర్చల ద్వారా పరిష్కారం కనుగొ నాలని సూచించారు. ఇది ‘చర్చల శతా బ్దంగా, శాంతియుత శతాబ్దంగా మిగిలి పోవాలని పేర్కొన్నారు. ఒకప్పుడు జర్మన్ కంటికి ఫ్రెంచివాళ్లు శత్రువుగా, ఫ్రెంచ్ కంటికి జర్మన్లు శత్రువులుగా కనిపిం చేవారన్నారు. కానీ నేటి యువత దాన్ని మార్చి స్నేహపూర్వక పొరుగు దేశస్తులుగా మారిపోయారన్నారు. అందుకే ఇప్పుడు యురోపియన్ యూనియన్ బలంగా మారిందని, ప్రపంచమంతా ఓ సమూహంగా మారాలని అన్నారు. -
మహిళా నాయకత్వంతోనే సమాజ శాంతి
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, నోబెల్ గ్రహీత దలైలామా - ప్రేమ, జాలిని ప్రోత్సహించడంలో మాతృమూర్తిని మించిన వారు లేరు - అలాంటి వారి పట్ల వివక్ష తగదు.. సమస్యలకు చర్చే పరిష్కారం - మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి - ప్రస్తుత విద్యా వ్యవస్థ అంతా వ్యాపారమయం - మనసు ప్రశాంతంగా ఉంటే బాహ్య ప్రపంచమూ బాగుంటుంది పవిత్ర సంగమం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి ఈ ప్రపంచంలోని సగం దేశాలకైనా మహిళలు నాయకత్వం వహించినప్పుడే సమాజం శాంతియుతంగా ఉంటుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, నోబెల్ గ్రహీత దలైలామా హితవు పలికారు. వ్యథాభరిత సమాజం నుంచి విముక్తి కావాలని ఆకాంక్షించారు. మానవతా విలువల్ని ప్రోది చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 20వ శతాబ్దంలో తప్పు ఎక్కడ దొర్లిందో విశ్లేషించాల్సిన తరుణమిదేనన్నారు. వేదన, క్షోభ స్థానంలో జాలి, దయ వంటి లక్షణాలున్న సమాజ స్థాపన కోసం పాటుపడాలన్నారు. విజయవాడకు సమీపంలోని పవిత్ర సంగమంలో శుక్రవారం ప్రారంభమైన జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు విశిష్ట అతిథిగా హాజరైన దలైలామా కీలకోపన్యాసం చేశారు. ‘నేను మామూలుగా సోదరీ సోదరులారా అని సమావేశాలను ప్రారంభిస్తుంటాను. కానీ ఈసారి ఓపక్క వేదికపై పెద్దక్కలు, సోదరీ మణులు, మరికొందరు సోదరులు ఉన్నందున ఎల్డర్ సిస్టర్స్, సిస్టర్స్, ఫ్యూ బ్రదర్స్ అంటూ ప్రారంభిస్తున్నా. ఏమైనా మనమందరం మానవులం. మనందరికీ మానసిక, భౌతిక, భావోద్వేగాలుంటాయి. మానవత్వమే మానవ సమాజ సందేశం. సమాజంలో చాలా సమస్యలుంటాయి. ఇవేవీ అప్పటికప్పుడు శైశవ దశలో సృష్టించినవి కావు. ఎదుగుతున్న క్రమంలో వచ్చినవే జాతి, మతం, విశ్వాసం, విరోధం, స్త్రీ, పురుష వివక్ష తదితరాలు. కానీ ప్రాథమికంగా మనమందరం ఒక్కటే. పటిష్టమైన విశ్వాసాలు, మానవులందరూ ఒక్కటేనన్న భావన ప్రాతిపదికన నిజమైన సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించాలన్నది నా అభిమతం. స్త్రీ కూడా మనిషే. సమాజ పరిణామ క్రమంలో కుటుంబాలతో పాటు జనసాంద్రత పెరిగింది. వ్యవసాయ వ్యవస్థలు వచ్చాయి. దాంతోపాటే సమాజంలో చోరీలు, దోపిడీలు వంటి అవలక్షణాలు అధికమయ్యాయి. వీటిని నియంత్రించేందుకు నాయకత్వం కావాల్సి వచ్చింది. అప్పుడు విద్య లేదు కనుక భౌతికంగా ఎవరు శక్తివంతులైతే వారి చేతికే నాయకత్వం దక్కేది. మతం పుట్టుక కూడా ఆ దశలో నుంచి వచ్చిందే. ఇప్పుడు వాటిని సమీక్షించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది’అన్నారు. ప్రేమ, జాలి, క్షమ గుణాలున్న విద్య అవసరం ప్రస్తుత విద్యా వ్యవస్థ వ్యాపారమయమై, భౌతిక అవసరాలే ప్రాతిపదికగా ఉందని దలైలామా ఆవేదన వ్యక్తం చేశారు. ‘మానవ విలువలకు స్థానం లేకుండా పోతోంది. ఎంతసేపూ ఆదాయం, డబ్బు చుట్టూనే తిరుగుతోంది. జాలి, దయ కలిగిన మానవ సమాజాన్ని సృష్టించాలి. ప్రేమ, జాలి, కనికరం, క్షమ వంటి విషయాలున్న విద్య నేటి అవసరం. ఇటువంటి విలువల్ని ప్రోత్సహించడంలో మాతృమూర్తిని మించిన వారు లేరు. అటువంటి వ్యక్తి పట్ల వివక్ష తగదు. గత శతాబ్దంలో జరిగిన హింస, వివక్షకు తావులేకుండా ప్రస్తుత 21వ శతాబ్దాన్ని నిర్మించుకోవాలి. చిన్న తనం నుంచే మానవతా విలువలు నేర్పాలి. మితిమీరిన హింసకు, మానవ హననానికీ తావు లేకుండా చూడాలి. జాతి, మతం, వర్ణం, వివక్ష పేరిట జరిగే హింసపై మనం ఆలోచించాల్సిన సమయం ఇది. 21వ శతాబ్దంలో శాంతియుత సమాజం కావాలి. దానికి మనశ్శాంతి అవసరం. అది ఉన్నప్పుడు సమాజ శాంతి కూడా సాధ్యమవుతుంది. ఈ శతాబ్దం కేంద్ర బింధువు చర్చ (డైలాగ్) కావాలి. తప్పుడు అభిప్రాయాలతో కాకుండా అవగాహనతో ముందుకు సాగాలి. చర్చలు, సంప్రదింపులే పరిష్కార మార్గాలు. ఆయుధం లేని సమాజం కావాలి. ఈ ప్రపంచం నిరాయుధ ప్రపంచంగా ఉండాలి. అది మన మనస్సుతోనే ప్రారంభం కావాలి. ఇతరుల బాధ, క్షోభను అర్థం చేసుకోవడంలో మహిళలు చాలా సున్నితంగా ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ భూగోళంపై 200 దేశాలున్నాయి. మహిళా నేతలు మరింత మంది వస్తే ఈ ప్రపంచం అంత భద్రంగా ఉంటుంది. అందుకే మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంద’న్నారు. -
మన మధ్య దలైలామా వద్దు
బీజింగ్: చైనా, ప్రవాసంలో ఉన్న టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా మధ్య చర్చలకు చొరవ చూపుతామన్న అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది. చైనాకు వ్యతిరేకంగా దలైలామాను పురమాయించే యత్నాలను అమెరికా మానుకోవాలని, దాని వల్ల అమెరికాకు ఎలాంటి ప్రయోజనం కలగక పోగా, చైనా–అమెరికా సంబంధాలు దెబ్బతింటాయని చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ విలువలు, మత వ్యవహారాల కమిటీ చైర్మన్ ఝూ వీకున్ హెచ్చరించారు. -
టిబెటన్లపై మరోసారి చైనా ఉక్కుపాదం
న్యూఢిల్లీ: చైనా వేలమంది టిబెటన్లను అడ్డుకుంటోంది. బోధ్ గయలో జరుగుతున్న కార్యక్రమానికి హాజరుకాకుండా వారిని నిలువరిస్తోంది. ఈ కార్యక్రమానికి చైనాకు బద్ధ విరోధి అయిన ప్రముఖ బౌద్ధమత గురువు దలై లామా హాజరు అవుతుండటమే అందుకు ప్రధాన కారణం. ఈ విషయాన్ని నేపాల్, చైనా మీడియా వర్గాలు ధ్రువీకరించాయి. ప్రత్యేకవాదం, ఉగ్రవాదం మితిమీరుతుందనే కారణంతో ఇటీవల చైనా పలు ట్రావెలింగ్ పరిమితులు ప్రవేశపెట్టినట్లు చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ చెప్పింది. ఇలాంటి నిబంధనలు గతంలో ఒక్కసారి కూడా ఉండేవి కావని, ఇటీవల ఉన్న పలంగా ప్రవేశపెట్టారని కూడా అది పేర్కొంది. అంతేకాకుండా ఇప్పటికే చైనా ఆధీనంలోని టిబెట్ వాసుల దగ్గర నుంచి పాస్‌పోర్ట్‌లను చైనా అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని కూడా తెలిసింది. గత ఏడాది (2016) నవంబర్ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు చైనా మీడియానే స్వయంగా తెలిపింది. 'ప్రత్యేకంగా నేపాల్‌కు టిబెటన్లు చేసే ప్రయాణాలపై తాత్కాలికంగా పరిమితులు విధించారు. జనవరి 10 వరకు ఎలాంటి టికెట్ బుకింగ్‌లు చేయవద్దని ఉన్నపలంగా తమ ఆదేశాలు అమలు చేయాలని ఎయిర్‌లైన్స్, ఇతర మార్గాలకు సంబంధించిన ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటుచేసే సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది' అని నేపాల్ మీడియా వర్గాలు తెలిపాయి. -
'భారత్ అందరికీ గురువు'
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో మద్యపానం నిషేధాన్ని సమర్థనీయంగా అమలు చేస్తుండటం గర్వించదగిన విషయం అన్నారు. బుధవారం నితీశ్‌తో భేటీ అయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 'ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేను చాలా ఏళ్లుగా మంచి మిత్రులం. ఆయనను కలిసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో ప్రజల ఎన్నో సమస్యలతో ఆగ్రహాలతో, ఒత్తిడిలతో, చిరాకులతో ఉంటుంటారు. మద్యపానంపై నిషేదం విధించడం చాలా మంచి విషయం. అది ప్రజలకు మంచి చేస్తుంది. మద్యం తాగడం మంచిది కాదు. అది మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఇందులో నుంచి బయటపడాలంటే మనసుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. భారతదేశమంటేనే అందరికీ గురువు. మనందరం శిష్యులం. భారత్‌తో సంబంధాలు పెట్టుకున్నవారి మధ్య గురుశిష్య సంబంధమే ఉంటుంది' అని ఆయన మీడియాతో చెప్పారు. ఈ రోజుల్లో ప్రపంచ దేశాల్లోని శాస్త్రవేత్తలు కూడా భారతీయ పురాతన శాస్త్రాలను, తత్వశాస్త్రాన్ని తిరగేస్తున్నారని అన్నారు. -
మాతో పెట్టుకోవద్దు
భారత్‌కు చైనా హెచ్చరిక బీజింగ్: తైవాన్ విషయంలో ట్రంప్‌తో తాము వ్యవహరించిన విధానాన్ని చూసి నేర్చుకోవాలని భారత్‌ను ఉద్దేశించి చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. దారితప్పిన పిల్లాడి లాంటి పనులు మానుకోవాలని భారత్‌ను సున్నితంగా హెచ్చరించింది. మంగోలియాకు భారత్ ఒక బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించడాన్ని ఉటంకిస్తూ ఈ కథనం రాసింది. తాము అభ్యంతరం చెప్పినా దలైలామాను మంగోలియా ఆహ్వానించడంపై మండిపడుతున్న చైనా.. గతంలో ఆదేశంపై పలు ఆంక్షలు విధించింది. దీని నుంచి బయటపడటానికి భారత్ సాయం మంగోలియా కోరింది. గతంలో ‘ఒన్ చైనా’ సూత్రంపై ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అంతేగాక తైవాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడారు. దానిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తర్వాత దక్షిణ చైనా సముద్రంలో అమెరికా డ్రోన్ ను సీజ్ చేసిన విషయం తెలిసిందే. సున్నితమైన విషయాల్లో తమతో తగాదా పెట్టుకోవాలంటే అమెరికాయే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుందని, తాము తట్టుకోగలమని భావించే భారత్ ధైర్యం ప్రదర్శిస్తోందా అంటూ ఆ పత్రిక వ్యాఖ్యానించింది. -
దలైలామా పర్యటనతో సంబంధాలకు చేటు
బీజింగ్: టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా అరుణాచల్‌ప్రదేశ్ పర్యటించడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బ తింటాయని భారత్‌ను చైనా హెచ్చరించింది. అరుణాచల్‌ను దక్షిణ టిబెట్‌లో భూభాగంగా పేర్కొంటున్న చైనా ఆ ప్రాంతంలోకి దలైలామాను ఆహ్వానిస్తే సరిహద్దుల్లో శాంతి సుస్థిరతలు దెబ్బతినే అవకాశం ఉందని, ఈ విషయాన్ని చైనా తీవ్రంగా పరిగణిస్తుందని ఆ దేశ ప్రతినిధి లు కాంగ్ చెప్పారు. చైనాలో వేర్పాటువాదాన్ని దలైలామా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. -
చైనా మళ్లీ అదే పాట
భారత్-చైనా సరిహద్దు ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్‌లో ఎవరూ పర్యటించినా చైనా పాడిందే పాటగా తన అక్కసును వెళ్లగక్కుతూ వస్తోంది.. అంతకముందు అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించిన చైనా.. నేడు బౌద్ద మత గురువు దలైలామా పర్యటనపై కూడా మండిపడింది.. టిబెటిన్ మత గురువు దలైలామా అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించడాన్ని తాము తీవ్రంగా తప్పుబడుతున్నామని, ఈ పర్యటన వల్ల సరిహద్దు ప్రాంతాల్లో శాంతికి నష్టం వాటిల్లి, అస్థిరత ఏర్పరుడుతుందని వ్యాఖ్యానించింది. "ఇరుదేశాల మధ్య వివాదాస్పదమైన ప్రాంతంలో దలైలామాను పర్యటనకు ఆహ్వానించడం, శాంతికి, స్థిరత్వానికి నష్టం వాటిల్లుతుంది. దీంతో పాటు చైనా, భారత్ ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయి" అని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం ప్రేమ్ ఖండు ఇచ్చిన ఆహ్వానం మేరకు వచ్చే ఏడాది దలైలామా భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ప్రాంతంలో సందర్శించనున్నారు. దలైలామా పర్యటనను కేంద్ర విదేశాంగ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పష్టంచేశారు. దక్షిణ టిబెట్‌లో అరుణాచల్ ప్రదేశ్ ఓ భాగమని పేర్కొంటూ, ఆ సరిహద్దులో సుమారు 4వేల కిలోమీటర్ల మేర ఉన్న ప్రాంతమంతా వివాదస్పదమైందనిగా చైనా చెబుతోంది.. గతవారం అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ తవాంగ్‌లో పర్యటించినప్పుడు కూడా బీజింగ్ ఈ విధమైన రీతిలోనే స్పందించింది. చైనా, భారత్‌కు ఉన్న వివాదాస్పదమైన సరిహద్దు ప్రాంతంలో అమెరికాను తలదూర్చవద్దని హెచ్చరించింది. -
చైనాకు ఝలక్.. దలైలామాకు ఓకే
న్యూఢిల్లీ/ధర్మశాల: టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా త్వరలో భారత్‌లో అడుగుపెట్టనున్నారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు ఇచ్చిన ఆహ్వానానికి అంగీకరించిన ఆయన కొత్త ఏడాదిలో(2017) మార్చి మధ్యలో అక్కడి తవాంగ్ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అయితే, ఈ పర్యటనపై ఈ నెల ప్రారంభంలోనే ప్రకటన వెలువడినప్పటికీ దీనిపై అధికారికంగా ధ్రువీకరణ జరగలేదు. దలైలామా పర్యటనతో భారత్-చైనా సంబంధాలు ఎలా ఉంటాయో అనే చర్చ ప్రారంభమైంది. అంతకుముందు అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు రానుండగా బీజింగ్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. భారత్-చైనా మధ్య ఈ ప్రాంతంపై వివాదం ఉన్న నేపథ్యంలో అమెరికా అందులో అడుగుపెట్టొద్దని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దలైలామా పర్యటన ఏ పరిణామాలకు దారి తీస్తుందో అని ఆసక్తి నెలకొంది. అయితే, భారత్ మాత్రం దలైలామా పర్యటనపై తన వైఖరి కుండబద్ధలు కొట్టింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఈ అంశంపై ప్రకటన చేస్తూ'బౌద్ధ మత గురువు దలైలామా భారత అతిథి. ఆయన దేశంలో ఎక్కడైనా పర్యటించవొచ్చు. ఆయన గతంలో అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఇప్పుడు మరోసారి పర్యటనకు వచ్చినా ఏమీ జరగబోదని భావిస్తున్నాం' అని స్పష్టం చేశారు. -
ట్రంప్‌ను అనుకరించిన దలైలామా
టిబెట్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డ్రొనాల్డ్ ట్రంప్‌ను ప్రముఖ ఆధ్యాత్మిక బౌద్ధ గురువు దలైలామా అనుకరించి ఆకట్టుకున్నారు. 'బ్రిటన్ గుడ్ మార్నింగ్' పత్రిక జర్నలిస్టు పీర్స్ మోర్గాన్ శుక్రవారం దలైలామాను ఇంటర్వూ చేసిన సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇప్పటి వరకు మీరు ఎవరిరైనా వివాదాస్పద వ్యక్తిని కలుసుకున్నారా? అయితే ఆ వ్యక్తి ఎవరని మోర్గాన్ ప్రశ్నించారు. దీనికి దలైలామా నవ్వుతూ... నేను ఇప్పటి వరకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని కలుసుకోలేదని చెబుతూనే.. ట్రంప్ తన జుట్టు దువ్వుకోవడాన్ని, మాట్లాడే విధానాన్ని ఆయన అనుకరించారు. ట్రంప్ మిమ్మల్ని అధ్యక్ష భవనానికి ఆహ్వానిస్తే అతన్నికోరేదేమిటి అన్న మరో ప్రశ్నకు దలైలామా స్పందిస్తూ... 'దయ చూపించు' అని సమాధానం చెప్పారు. దీనిని మోర్గాన్ ట్వీటర్లో పోస్ట్ చేయగానే 320 రీట్వీట్లు, 400 లైక్‌లు వచ్చాయి. -
'షాక్.. సల్మాన్ ప్రేయసి కాదట.. ఫ్రెండేనట'
ముంబయి: తమ మధ్య ఉన్న బంధాన్ని ఇప్పటికే వీధివీధిన కోడై కూస్తున్న మీడియాకు బాలీవుడ్ కండల వీరు, మోస్ట్ లేట్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ గర్ల్ ప్రెండ్, రొమేనియా సుందరి లులియా అవాక్కయ్యే విషయం చెప్పింది. వారిద్దరి మధ్య ఉంది ప్రేమ పూర్వక సంబంధం కాదంట. స్నేహ పూర్వక సంబంధమేనట. 'మేం స్నేహితులం ఎప్పటికీ స్నేహితులం అంతే. మా మధ్య ఇంకేం లేదు' అంటూ ఈ రొమేనియన్ బ్యూటీ నోరు విప్పింది. ఓ మేగజిన్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె 'మేం ప్రేమికులం కాదు.. స్నేహితులం. స్నేహితులు అంటే స్నేహితులమంతే. ప్రేమ కాదు. మీరు ఏవైతే వింటున్నారో అవన్నీ ఊహాగానాలే' అని ఆమె చెప్పేసింది. ఇటీవల సల్మాన్ ఖాన్, లులియా వంతూరు తో కలిసి 14వ బౌద్ధమత గురువును కలిశారు. 'ట్యూబ్ లైట్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నఈ సూపర్ స్టార్ సల్మాన్ టిబెటన్ ఆధ్యాత్మిక బౌద్ధమత గురువు దలైలామాతో సమావేశ మయ్యారు. దాంతో ఇక సల్మాన్ ఈ రొమేనియా భామతో సెట్టయిపోయినట్లేనని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పటికే అదే విషయం గురించి మాట్లాడుతుండగా అదేం లేదంటూ ఆమె వివరణ ఇచ్చింది. -
సరైన దారిలో నడవండి: చైనా
బీజింగ్: ‘ఇప్పటికీ సమయం మించిపోయిందేమీ లేదు.. మీరు ప్రత్యేక వాదాన్ని విడిచి పెట్టి సరైన దారిలో నడవండి’ అని టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు చైనా పిలుపునిచ్చింది. టిబెట్ వివాదానికి స్వస్తి పలికే ఉద్దేశంలో మధ్యేమార్గంగా టిబెట్‌కు స్వయంప్రతిపత్తి కల్పించాలని దలైలామా చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హాంగ్ లీ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘దలైలామా చైనాను విడగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటికీ సమయం మించిపోయింది లేదు. మీరు ప్రత్యేక వాదాన్ని విడిచి సరైన మార్గంలో నడవండి’ అని హితబోధ చేశారు. తమకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలన్న డిమాండ్ పై గతంలో టిబెట్ తో చైనా చర్చలు జరిపిన విఫలమయ్యాయి. గత కొన్నేళ్లు రెండు వైపుల చర్చలు లేవు. మరోవైపు ధర్మశాల (హిమాచల్‌ప్రదేశ్) నుంచి దలైలామా తిరిగి రావాలని కోరుతూ ఇటీవల కాలంలో 120 మందిపైగా టిబెటన్లు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారు. -
అతన్ని కలిసి ఆమె తప్పు చేసింది!
'స్టెఫని జానే ఏంజెలీనా గెర్మనొట్టా' అనే అసలు పేరు కంటే 'లేడీగాగా'గా ప్రపంచఖ్యాతి పొందిన పాప్ సింగర్ మరో వివాదాన్ని ఎదుర్కొంటోంది. గాయని, రచయిత్రి, నటిగానే కాక సామాజిక సేవలోనూ ముందున్న ఈ న్యూయార్క్ సంచలనం ఇటీవల ఓ అంతర్జాత సదస్సులో పాలుపంచుకుంది. 'దయాగుణం వల్ల కలిగే మేలులు' అనే అంశంపై జరిగిన ఆ సదస్సుకు టిబెట్ మతగురువు దలైలామా కూడా హాజరయ్యారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అవకాశం కావడంతో లేడీగాగా.. దలైలామాతో ప్రత్యేకంగా భేటీ అయి, పలు అంశాలపై మాట్లాడింది. భేటీ అనంతరం లామాతో కలిసి దిగిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతే చైనా నెటిజన్లు ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడ్డారు. 'మీ ఇద్దరిదీ బ్యాడ్ రొమాన్స్..' అని ఒకరంటే, 'నేను గాగాను ఆరాధించేవాణ్ని.. ఇకపై ఆమె అభిమానిగా ఉండదల్చుకోవట్లేదు' అని ఇంకొకరు.. 'అతన్ని కలిసి ఆమె తప్పుచేసింది' అని మరొకరు.. ఇలా లెక్కకు మిక్కిలి అసహన వ్యాఖ్యలు చేశారు. తాము భద్ధశత్రువుగా భావించే దలైలామాను లేడీగాగా కలుసుకోవడంపై అటు చైనా ప్రభుత్వం కూడా గుర్రుగా ఉన్నట్లు, గాయనిపై నిషేధం విధించే యోచనలో ఉన్నట్లు స్థానిక మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. అమెరికా తర్వాత లేడీగాగాకు ఎక్కువమంది అభిమానులున్న దేశం చైనానే. కాగా, నిషేధం వార్తల్లో నిజం లేదని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి హాంగ్ లీ పేర్కొన్నారు. వీడియోల్లో అసభ్యకరమైన నృత్యాలు చేస్తోందంటూ లేడీగాగాపై చైనా గతంలో మూడేళ్ల నిషేధం విధించింది. 2014లో ఆ నిషేధాన్ని ఎత్తేసిన తర్వాత మళ్లీ అలాంటి వార్తలు రావడం ఇదే తొలిసారి. ఈ సంఘటనలపై ఆమె ఇంకా స్పందించలేదు. -
దలైలామా..లేడీగాగా..చైనా వార్నింగ్
బీజింగ్: ప్రముఖ ఆధ్యాత్మిక బౌద్ధ గురువు దలైలామాను చైనా మరోసారి హెచ్చరించింది. దలైలామా అమెరికాతో మైత్రిని కొనసాగించడంపై చైనా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న దలైలామా ఆదివారం ఇండియానా పోలీస్ లో అమెరికా మేయర్ల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చైనా విదేశాంగ ప్రతినిధి హాంగ్ లీ స్పందిస్తూ..దలైలామా టిబెట్ పై అంతర్జాతీయంగా మద్దతును సాధించడానికే విదేశాలలో పర్యటిస్తున్నారని ఆరోపించారు. కాగా అంతకు ముందు తనను కలిసిన పాప్ సింగర్ లేడీగాగాకు ప్రేమ, కరుణ, ఆధ్యాత్మిక విషయాలను ఆయన వివరించారు. ఇక రెండు వారాల క్రితం ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయిన విషయం తెలిసిందే. -
దలైలామాతో ఒబామా భేటీ
వాషింగ్టన్: ప్రముఖ ఆధ్యాత్మిక మతగురువు దలైలామాతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భేటీ అయ్యారు. వైట్ హౌస్‌లోని మాప్ రూమ్‌లో ఈ సమావేశం జరిగింది. పూర్తిగా ప్రయివేట్‌గా కొనసాగిన వీరి భేటీకి మీడియాను అనుమతించలేదు. కాగా దలైలామాతో ఒబామా సమావేశం కావటం ఇది నాలుగోసారి. మరోవైపు ఈ భేటీని చైనా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే చైనా హెచ్చరికలను ఒబామా ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు కొనసాగుతున్నారు. అయితే అధికారిక కార్యాలయం ఓవల్‌లో కాకుండా వైట్‌హౌస్‌లో దలైలామాతో ఒబామా భేటీ కావటం విశేషం. కాగా ఇది కేవలం వ్యక్తిగత సమావేశం మాత్రమేనని, ద్వైపాక్షిక చర్చలు కాదని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి జోష్ ఎర్నెస్ట్ తెలిపారు. మానవ హక్కులు, సమానత, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై ఒబామా, దలైలామ మధ్య చర్చలు జరిగినట్లు వెల్లడించారు. అయితే ఇతర వివరాలను మీడియాకు వెల్లడించేందుకు నిరాకరించారు. భేటీ అనంతరం మరోవైపు ఫ్లోరిడా రాష్ట్రం ఆర్లెండోలో పల్స్ నైట్ క్లబ్ దాడి ఘటనలో మృతి చెందనవారికి దలైలామ సంతాపం తెలిపినట్లు వైట్‌హౌస్ పేర్కొంది. ఇక అమెరికా అధ్యక్షుడు ఒబామాతో దలైలామా సమావేశ మైనప్పుడల్లా చైనా ఆగ్రహం ప్రదర్శిస్తోంది. దలైలామను వేర్పాటువాదిగా పేర్కొంటూ ఈ సమావేశాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. స్వేచ్ఛ పేరుతో చైనా సార్వభౌమాధికారాన్ని, భద్రతను దెబ్బతీస్తే మాత్రం సహించేది లేదంటూ చైనా మంత్రిత్వ శాఖ ప్రతినిధి లూ కాంగ్ నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దలైలామాతో ఏ దేశ నాయకుడు, ఏ రూపంలో సమావేశం జరిపినా చైనా ఖచ్చితంగా వ్యతిరేకిస్తుందన్నారు. టిబెట్‌కు సంబంధించిన అంశాల పేరుతో చైనా అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నాతాము గట్టిగా వ్యతిరేకిస్తామని లూ కాంగ్ హెచ్చరించారు. -
ఉగ్రవాదులతో చర్చలు జరగాలి: దలైలామా
రోమ్: ఇస్లాం మతానికి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. ఓ ఇటాలియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో చర్చలు జరిపితే సత్పలితాలు ఉంటాయని చెప్పారు. 'ఇస్లాం అనేది శాంతితో కూడుకున్న మతం. అందులో ఉన్నవారే తమ సొంతమతానికి, సొంత సోదరులకు హానీ కలిగిస్తున్నారు' అని ఆయన చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ తో సరైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. -
బిహార్ ఎన్నికలపై దలైలామా వ్యాఖ్యలు
జలంధర్: దేశంలోని మెజారిటీ హిందువులు శాంతి, సామరస్యాలను విశ్వసిస్తున్నారడానికి బిహార్ ప్రజాతీర్పే నిదర్శనమని బౌద్ధుల ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా పేర్కొన్నారు. 'భారత్‌లో సుదీర్ఘకాలం నుంచి శాంతి, సామరస్యపూర్వక సంప్రదాయం నెలకొని ఉంది. ఇటీవలి బిహార్ ఎన్నికల్లో ప్రజాతీర్పు కూడా.. మెజారిటీ హిందువులు శాంతి, సామరస్యాలను కోరుకుంటున్నారని ఋజువు చేసింది' అని ఆయన పేర్కొన్నారు. అయితే దలైలామా ఏ రాజకీయ పార్టీ పేరును నేరుగా ప్రస్తావించలేదు. 'ఈ సామరస్య వాతావరణం కారణంగానే మతసహనం కలిగిన దేశంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ అన్ని మతాలకు, వ్యక్తులకు సమాన హక్కులు కలవు' అని ఆయన చెప్పారు. జలంధర్‌లో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన దలైలామా విలేకరులతో మాట్లాడారు. 'మతసహనం అంటే అన్ని మతాలను గౌరవించడమే కాదు వ్యక్తులను కూడా గౌరవించడం. అందువల్లే బౌద్ధమతం భారత్‌లో పుట్టింది. అందువల్లే భారత్‌ను గురువుగా, బౌద్ధులను శిష్యులుగా భావిస్తారు' అని ఆయన చెప్పారు. -
మహిళలు దేశాధిపతులైతే..శాంతియుత ప్రపంచం!
చెన్నై: అసమ్మతి గళాలను కూడా గౌరవించాల్సిన అవసరముందని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా పేర్కొన్నారు. అన్నిమత విశ్వాసాలనే కాదు.. ఏ మతవిశ్వాసం లేనివారిని కూడా గౌరవించడమే లౌకికవాదమని ఆయన అన్నారు. దేశంలో పరమత అసహనం పెరిగిపోయిందంటూ ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. 'మీతో ఏకీభవించనివారిని నిర్మూలించాలనుకోవడం సరికాదు' అని చెప్పారు. 'ప్రపంచ శాంతికి మానవ దృక్కోణం' అనే అంశంపై మద్రాస్ ఐఐటీలో దలైలామా మంగళవారం ఉపన్యసించారు. గడిచిన శతాబ్దమంతా హింసతో నిండిపోయిందని, ప్రస్తుతం కూడా అది కొనసాగడం మూర్ఖత్వమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 'ప్రపంచంలోని ఏడు వందల కోట్ల జనాభాలో వందకోట్లమంది వరకు మత అవిశ్వాసులు ఉన్నారు. వారిని కూడా గౌరవించాల్సిన అవసరముంది. ఎందుకంటే మత విశ్వాసం అనేది ఒకరి వ్యక్తిగత విషయం' అని చెప్పారు. మతసామరస్యంలో యావత్ ప్రపంచానికి భారత్ ఆదర్శప్రాయమని కొనియాడారు. తదుపరి దలైలామ మహిళ అయ్యే అవకాశముందా? అన్న ప్రశ్నకు తప్పకుండా అవ్వొచ్చు అని బదులిచ్చారు. 'నేను గతంలో చాలాసార్లు చెప్పాను. ఆమె అందంగా ఉండాలి. ఎందుకంటే ముఖం కూడా కొంత మార్పును తీసుకురాగలదు! కాదంటారా?' అని నవ్వుతూ చెప్పారు. మహిళలు దేశాధిపతులైతే ప్రపంచం మరింత శాంతియుతంగా ఉంటుందని దలైలామా అభిప్రాయపడ్డారు. -
'నా ఆరోగ్యం గురించి బెంగ వద్దు'
ధర్మశాల: తన ఆరోగ్యం గురించి ఎవరూ బెంగపెట్టుకోవద్దని టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, సుదీర్ఘ పర్యటనల తర్వాత చాలా సమయం విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు అయనకు సూచించినట్లు వివరించారు ఆధ్యాత్మిక గురువు త్వరలో చేయబోయే పర్యటనలు, కార్యాచరణ వివరాలు ఆయన అధికారిక వెబ్సైట్లో ఉంచిన విషయం విదితమే. శాస్త్రవేత్తలతో దక్షిణ భారతదేశంలోనిర్వహించనున్న సదస్సులో కూడా ఆయన పాల్గొనున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న దలైలామా 3న ధర్మశాలకు విచ్చేయనున్న తరుణంలో ఈ విధంగా స్పందించారు. గత పదేళ్లుగా హెల్త్ చెకప్ కోసం మయో ఆస్పత్రికి వస్తున్నానని చెప్పారు. ఇందులో పెద్ద విశేషమేం లేదని.. భారత్‌లోనూ న్యూఢిల్లీలో ఆరోగ్య పరీక్షల నిమిత్తం అప్పుడప్పుడూ డాక్టర్లను సంప్రదిస్తుంటానన్నారు. చిన్న చిన్న విషయాలపై కూడా శ్రద్ధ తీసుకోవాలని తన మిత్రుడు, జర్మనీ డాక్టర్ గతంలో తనకు సూచించిన విషయాన్ని దలైలామా ఈ సందర్భంగా గుర్తుచేశారు. -
దలైలామాకు ధారాదత్తమా!
రెండోమాట వర్తమాన దృశ్యం మాత్రం ఇది- ఐచ్ఛికంగా కాకుండా బలవంతంగా, ప్రలోభాల వల్ల భూసేకరణకు ఆమోదించిన రైతులు కూడా ‘మా భూములు మాకు ఇచ్చేయండి’ అంటూ ఎదురు దరఖాస్తులతో కోర్టుల వైపు కదం తొక్కుతున్నారు. దలైలామా ఈ సమయంలో సందట్లో సడేమియా వలే జింబో నగర ప్రవేశంలా అమరావతిలో ప్రవేశించబోవడం, విగ్రహాలను విగ్రహారాధనను నిషేధించి సత్యాన్వేషిగా మరణించేదాకా ప్రవర్ధిల్లిన గౌతమ బుద్ధుని వాస్తవ బోధనలకు అపచారంగానే భావించాలి. చైనాలో అంతర్భాగమైన స్వయం పాలిత టిబెట్ నుంచి ధర్మశాల (హిమాచల్‌ప్రదేశ్)కు శరణార్థిగా వచ్చిన ఆధ్యాత్మిక గురువు దలైలామా. ఆది బౌద్ధానికి విరుద్ధమైన మహాయాన శాఖను ఆశ్రయించి అక్కడ నుంచే కార్యకలాపాలు (రాజకీయాలు సహా) సాగించుకుంటున్నారాయన. ఇటీవల అక్కడ ఆయన కార్యకలాపాలకీ, ప్రాణానికీ హాని ఏర్పడింది. కాబట్టి ధర్మశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని బౌద్ధక్షేత్రం, నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటిం చిన అమరావతిపైన దలైలామా దృష్టి పడింది. దలైలామాతో చర్చలు? నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి చంద్రబాబునాయుడి కొత్త ప్రభు త్వం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. అందుకే దలైలామా కోరి కను అవకాశంగా తీసుకుని అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు సీనియర్లు కొత్త రాజధాని నిర్మాణానికి నిధుల విషయమై ఆయనతో చర్చలు జరుపుతున్నట్టు ఇటీవల వార్తలు పొక్కాయి. అమరావతిలో తనకు ఆశ్రయం కల్పించే పక్షంలో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి రూ.50,000 కోట్లు సేకరించి పెడతానని దలైలామా మాట కూడా ఇచ్చినట్టు ఒక స్థానిక దినపత్రికలో ప్రముఖంగా వార్త వెలువడిన సంగతి మరువరాదు. బౌద్ధ యుగావిష్కరణలో భాగంగా ఒక వెలుగు వెలిగి, ప్రస్తుతం శిథిలాలతో ఉన్న అమరావతికి దలైలామా- రాజకీయ బేహారుల మధ్య మంతనాల పుణ్యమా అని పూర్వ వైభవం రావచ్చునేమో వేచి చూడాలి. అప్పుడు పదివేల ఎకరాల సొంత ఎస్టేట్ నిర్మాణం కోసం కన్నువేసి రాజధాని నిర్మాణం కోసం బృహత్ పథకం నమూనాను తయారుచేసిన సింగపూర్ బేహారుల, జాపనీస్ ప్రైవేటు కంపెనీల ప్రతిపత్తి ఏమవుతుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్ రైతాంగానికీ, డ్వాక్రా మహిళలకూ ఎన్నికలలో హామీ పడిన రుణమాఫీ ఇప్పటికే అరకొరగా వాయిదా మార్గం పట్టగా, రాజధాని నిర్మా ణం పూర్తి కావడమనేది అంతుచిక్కని చిత్రపటం. ఎందుకంటే- సమైక్య రాష్ట్ర ప్రతిపత్తిని కాస్తా చెడగొట్టుకున్నారు. ఇక పదవీ వ్యామోహంతో అనుచిత రాజకీయ సంకీర్ణంలో పాలకులు చేరడంతో కేంద్రం కూడా ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య, తరువాత బోడి మల్లయ్య చందంగా రాష్ట్ర పాలకులను ఇబ్బందులలోకి నెట్టి తమాషా చూస్తోంది. వాతావరణ పరిస్థితులను బట్టి కృష్ణా-గోదావరి తీరస్థ ప్రాంతం నూతన రాజధాని నిర్మాణానికి అనువైనదికాదని కొత్తరాజధాని కోసం ఏర్పా టు చేసిన శివరామకృష్ణన్ సాధికార సంఘం విభజనకు ముందే స్పష్టం చేసిం ది. విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి (వీజీఎంటీ) ప్రాంతం రాజధానికి తగదనీ, హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు వంటిది ఇక్కడ సాధ్యం కాదనీ కూడా ఆ సంఘం తేల్చి చెప్పింది. అన్నపూర్ణ వంటి ఇక్కడి భూము లను నాశనం చేసుకోవద్దని కూడా సలహా ఇచ్చింది. రైతులనూ, రైతు కూలీ లను వలస బాట పట్టించవద్దని కూడా గట్టిగా చెప్పింది. మన పాలకులు ససే మిరా అన్నారు. బలవంతంగా భూసేకరణ పేరిట చట్టం తెచ్చి బెదిరింపుల మధ్య భూములను స్వాధీనం చేసుకుని, రైతులను కోర్టుల చుట్టూ తిరగండి అని వదిలేశారు. సమాధానం కోసం కోర్టులు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తే, వాటినీ నిర్వీర్యం చేసే మార్గాలు ఆలోచిస్తున్నారు పాలకులు. వరదలూ, భూకంపాల చరిత్రే ప్రకృతి ఒడిదుడుకులకు, భూకంపాలకు కోస్తా తీరస్థ ప్రాంతం ఎంత ప్రసిద్ధో నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యుడు, సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు డాక్టర్ యార్లగడ్డ బాలగంగాధరరావును కదిపితే తెలుస్తుంది. ఇంటిపేర్లు, గ్రామ నామాల పుట్టుపూర్వోత్తరాల గుట్టువిప్పిన ఆచార్య గంగాధరరావు చెప్పిన ప్రకారం, శివరామకృష్ణన్ కమిటీ హెచ్చరిక పూర్తిగా వాస్తవం. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం ఉద్దేశించిన ప్రాంతంలోని 32 గ్రామాల చరిత్రను పరామర్శిస్తూ ప్రయోజనకరమైన ఓ చిరుపొత్తాన్ని ఇటీవలనే (2015) వెలువరించారు. ఎలాంటిది ఈ కృష్ణాతీరస్థ ప్రాంతం? భూగర్భ, వర్షపాత, వరద, పెనుతుపాను బీభత్సాలను బిక్కుబిక్కుమంటూ అనుభవిం చిన ప్రాంతమిది. రాజధానిగా ఎంపిక చేసిన (అమరావతి) ప్రాంత చారిత్రక వైశిష్ట్యాన్నీ, బౌద్ధ వ్యాప్తినీ ప్రస్తావించడంతో పాటు, ఈ ప్రాంతానికి ప్రమా దం తెచ్చిపెట్టే పరిస్థితులను గురించి కూడా ఆ పుస్తకంలో డాక్టర్ గంగాధర రావు చర్చించారు. ఇక్కడ భూతలం దక్షిణం నుంచి ఉత్తరానికీ, పడమటి నుంచి తూర్పు నకూ వాలిపోయింది. ఈ కారణంగానే జల ప్రవాహాలన్నీ కృష్ణానదిలో సంగమిస్తున్నాయి. గుంటూరు నుంచి అమరావతి మార్గం వైపుగా విశాల మైన భూభాగం మీద కురిసే వాననీరు వాగై పుల్లేరు పేరుతో ప్రవ హిస్తోంది. మంగళగిరి నుంచి తుళ్లూరు మీదుగా అమరావతి వెళుతున్న రహదారి కృష్ణానదీ ప్రవాహానికి దక్షిణపు సరిహద్దు. వరదలలో ఆ సరిహద్దు వరకు నది పొంగిన దాఖ లాలు ఉన్నాయి. సాధారణ వరదలే కాదు, పదిహేడో శతాబ్దం నుంచి తుపానులు; భూకంపాలూ తుపానులూ ఒకే సమయంలో సంభవిం చినట్టుగా కూడా జనశ్రుతంగా వినవస్తోంది. అందువల్లనే నెల్లూరు నుంచి వెంకటగిరి నుంచి మంగళగిరి పర్యంతం భూమి మీద నిమ్నోన్నతాలు ఏర్ప డినట్టు కైఫియతులు సాక్ష్యం పలుకుతున్నాయని ఆచార్య బాలగంగాధరరావు వెల్లడించారు. ఈ కారణం వల్లనే కృష్ణా ప్రవాహం బందరుకు (మచిలీ పట్నం) ప్రవహించే మార్గం కాస్తా మేట వేసి పూర్తిగా దక్షిణానికి మళ్లింది. అందుకే తొలి తొలి ఆంధ్ర పాలకుడు శ్రీకాకుళేంద్ర నాయకస్వామి పూర్వపు ఆలయం వరదతో శిథిలమైంది. దాని అవశేషాలతోనే ప్రస్తుత నిర్మాణం జరిగిందని చెబుతూ, మరిన్ని విశేషాలను కూడా డాక్టర్ బాలగంగాధరరావు వెల్లడించారు. ఈ పరిణామాలతోనే ‘‘పెన్న, గుండ్లకమ్మ ప్రవాహాల ముఖ ద్వారాలే మారిపోయాయి. చివరికి ఉద్దేశిత రాజధాని ప్రాంతంలోనే మరో సంఘటన జరిగింది. కాకతి గణపతిదేవుడు తన కుమార్తె పేరిట శ్రీరుద్ర దేవిపురంలో నిర్మించిన గోళకీమఠం (నేటి మల్కాపురం) సుడిగుండంలో చిక్కుకుపోయి శిథిలమైపోయింద’’ని మనం మరచిపోరాదు. ఫలితంగా ఈ ప్రాంతంలోని బందంరావూరు, ఉప్పుంబాలూరు, పెనుంబడియ గ్రామాలు నదిపాలబడినాయి. తరచుగా సంభవిస్తూ ఉండే కృష్ణా వరదల కారణంగా ముందు చెప్పుకున్న రహదారికి ఉత్తర భాగమంతా ఒండ్రుతో ఇసుక కలసిన గరపనేల ఏర్పడింది. ఆ రహదారికి దక్షిణం వైపు నల్లరేగడి భూములు అధికం కాగా, కొంత ఎర్రనేల కూడా ఉంది. ఈ నేలల స్వభావం పండించే పంట లపైన కూడా ఉంది. సందట్లో సడేమియా నిజానికి రాజధాని కోసం ఎంపిక చేసిన ప్రాంతమంతా మాగాణి భూములే. అమరావతి పేరుకు ఇంద్రుడి రాజధాని అయినా, చంద్రుడి విహార కేంద్రం అయినా, దేవతల నివాస స్థలమైనా చరిత్రకు అందిన వాస్తవమే ముఖ్యం కాని, ఊహాజనిత నామాలు కాదు. సుమారు 125 రకాల పంటలకు కేంద్రం రాజధాని భూములు. కూరగాయలు, పండ్లతోటలు, అరటి, కంద, పసుపు, నిమ్మ, మునగ, జామతోటలకు ప్రసిద్ధి. బంతి, గులాబీ, కాగడామల్లి, కనకాం బరాలు వంటి పుష్పజాతులకు ఈ నేల ప్రసిద్ధి. తుళ్లూరు పొగాకు పంటకు, పెనుమాక వంకాయలకు పేరెన్నికగన్నాయి. వెంకటపాలెం దొండకు, రాయ పూడి జామకు పేరు. అందుకే వైవిధ్యభరితమైన సంపదను చూస్తూ చూస్తూ కోల్పోవడానికి రాజధాని ప్రాంత రైతులూ, వ్యవసాయ కార్మికులూ ససేమిరా ఇష్టపడడం లేదు. అయితే ఇష్టపడినట్టు నటిస్తున్న వారు ఎవరైనా ఉంటే వారు పాలకపక్షం వారు. వర్తమాన దృశ్యం మాత్రం ఇది- ఐచ్ఛికంగా కాకుం డా బలవంతంగా, ప్రలోభాల వల్ల భూసేకరణకు ఆమోదించిన రైతులు కూడా ‘మా భూములు మాకు ఇచ్చేయండి’ అంటూ ఎదురు దరఖాస్తులతో కోర్టుల వైపు కదం తొక్కుతున్నారు. దలైలామా ఈ సమయంలో సందట్లో సడేమియా వలే జింబో నగర ప్రవేశంలా అమరావతిలో ప్రవేశించబోవడం, విగ్రహాలను విగ్రహారాధనను నిషేధించి సత్యాన్వేషిగా మరణించేదాకా ప్రవర్ధిల్లిన గౌతమ బుద్ధుని వాస్తవ బోధనలకు అపచారంగానే భావించాలి. టిబెట్‌లో ఆదినుంచీ బానిస వ్యవ స్థకు మూల విరాట్టులైన లామాల వ్యవస్థ ఎలాంటిదో, ఆ చిన్న భూభాగం విమోచన తరువాత అమెరికా పత్రికా రచయిత్రి అన్నా లూయీస్ట్రాంగ్ (టిబెటన్ ఇంటర్వ్యూస్) మాటలలోనే విందాం: ‘‘ప్రజానుకూల సంస్క రణలు టిబెట్ సమాజాన్ని తాకే దాకా ఆ ప్రజల గొంతు వెయ్యేండ్లుగా మూగ బోయింది. వారిని పట్టించుకున్న వారు లేరు. నేడో! టిబెటన్ ప్రజలూ, పాత బానిసలూ చరిత్రను తిరగరాస్తున్నారు. టిబెట్ చరిత్ర నిర్మాతలుగా చరిత్ర లోకి ఎక్కారు.’’ కనుక దలైలామా స్థానం నవ చైనాలో అంతర్భాగమైన టిబెట్‌లోనే గాని పరదేశాలలో కాదు. హిమాచల్‌లోనూ, అమరావతిలోనూ కాదు. నవధాన్యాలకు తోటకూర కాడ ముష్టి. (వ్యాసకర్త మొబైల్: 9848318414) -
నా గురువు భారత్: దలైలామా
సూరత్: భారత్‌ను తన గురువుగా పరిగణిస్తానని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా తెలిపారు. తొలిసారి గుజరాత్‌కు విచ్చేసిన దలైలామా తన పర్యటనలో భాగంగా గురువారం సూరత్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నా మనసంతా నలంద ఆలోచనలతో నిండిపోయింది. అది ప్రాచీన భారత ఆధ్యాత్మిక సంస్థ. అందుకే నేను భారత్‌ను గురువుగా భావిస్తా’’ అని చెప్పారు. దలైలామా సేవలకు గుర్తింపుగా సూరత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త అందిస్తున్న సంతోక్బా అవార్డును అందుకునేందుకు దలైలామా సూరత్ వచ్చారు. అవార్డు కింద రూ. 25 లక్షల నగదు, వజ్రంతో కూడిన జ్ఞాపికను అందిస్తున్నారు. -
'భారతీయులు మా గురువులు'
సూరత్: భారతీయులను తాము గురువులుగా పరిగణిస్తామని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, టిబెటన్ల ఆధ్యాత్మిక నేత దలైలామా చెప్పారు. తొలిసారిగా ఆయన ఈరోజు గుజరాత్లో పర్యటించారు. సంతోక్బా అవార్డు అందుకునేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు. ఈ అవార్డు కింద 25 లక్షల రూపాయల నగదుతోపాటు వజ్రం పొదిగి బంగారు పూతతో రూపొందించిన ఒక జ్ఞాపినకు అందజేస్తారు. సూరత్ విమానాశ్రయంలో దలైలామా విలేకరులతో మామాట్లాడారు. ప్రాచీన కాలంలోనే ఇక్కడి నలంద విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రఖ్యాతి పొందిందన్నారు. తన మనసు నలంద( ప్రాచీన బౌద్ధారామం) ఆలోచనలతో నిండి ఉంటుందని చెప్పారు. అందుకే భారతీయులు తమకు గురువులని ఆయన అన్నారు. -
కాశ్మీర్ వరద మృతులకు దలైలామా సంతాపం
ధర్మశాల : జమ్మూ కాశ్మీర్ వరదల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు టిబెట్ ఆధ్యాత్మిక బౌద్ధమత గురువు దలైలామా గురువారం సంతాపం తెలిపారు. వరదల బీభత్సంతో సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టంపై ఆయన జమ్మూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు రాసిన ఓ లేఖలో తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగించవల్సిందిగా దలైలామా సూచించారు. అలాగే వినాశకరమైన వైపరీత్యంతో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు దలైలామా ట్రస్ట్ నుంచి విరాళం ప్రకటించారు. విరాళాన్ని ముఖ్యమంత్రి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్‌కు పంపించినట్లు ధర్మశాలలోని దలైలామా కార్యాలయం వెల్లడించింది. మరోవైపు భారీ వరదలతో అతలాకుతలమైన జమ్మూకాశ్మీర్‌లో బాధితులను ఆదుకునేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఇప్పటివరకూ వరద ప్రాంతాల్లో 77 వేలమంది బాధితులను రక్షించారు. మృతుల సంఖ్య 215కి పెరిగింది. -
దలైలామాకు వీసా నిరాకరణ
కేప్‌టౌన్: ప్రముఖ భౌద్ధ మత గురువు దలైలామాకు దక్షిణాఫ్రికా మరోసారి వీసా నిరాకరించింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 15 తేదీ వరకూ దక్షిణాఫ్రికాలో జరగనున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల ప్రపంచ సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఆగస్టు 27న వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దలైలామా పర్యటన వల్ల చైనాతో సంబంధాలకు ఇబ్బందులు ఏర్పడతాయని భావించిన దక్షిణాఫ్రికా ఆయనకు వీసా నిరాకరించింది. వీసా నిరాకరించడంతో దలైలామా ప్రస్తుతానికి తన దక్షిణాఫ్రికా పర్యటన రద్దు చేసుకున్నారని ఆ దేశంలో దలైలామా ప్రతినిధి నాంగ్సా ఛోడన్ తెలిపారు. దలైలామాకు దక్షిణాఫ్రికా వీసా నిరాకరించడం గత ఐదేళ్లలో ఇది మూడోసారి. మరోవైపు దలైలామాకు అనుమతి నిరాకరిస్తే సదస్సును బహిష్కరించాలని పలువురు నోబెల్ శాంతి బహుమతి అవార్డు గ్రహీతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. -
శాస్త్రి అంకితభావం అపూర్వం
న్యూఢిల్లీ: భారత్ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అంకితభావం అపూర్వమని టిబెటన్ మతగురువు దలైలామా కొనియాడారు. ఆయన మరికొన్ని రోజులు బతికిఉంటే దేశానికి మరింత సేవ చేసేవారని పేర్కొన్నారు. నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘లాల్ బహదూర్ శాస్త్రి: లెస్సన్ ఇన్ లీడర్షిప్’ పేరుతో శాస్త్రి తనయుడు అనిల్ శాస్త్రి, పవన్ చౌదరి సంయుక్తంగా రాసిన జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘శాస్త్రి చాలా అంకితభావంతో దేశం కోసం పనిచేశారు. ఆయన మరికొన్ని సంవత్సరాలు బతికి ఉంటే దేశాభివృద్ది కోసం మరింత సేవ చేసేవారు. 1965లో పాక్‌తో యుద్ధం జరిగిన సమయంలో ఆయన చాలా ధైర్యంగా వ్యవహరించారు. భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు ఆయన ప్రతినిధిగా కనిపించేవారు. చాలా గొప్ప వ్యక్తి. ఆయనలోని అంకితభావాన్ని చాలా దగ్గరగా చూశాను. ఆయన అభిమానుల్లో నేనూ ఒకడిని. ప్రధానిగా ఉన్న సమయంలోనే నేను శాస్త్రిని కలిశాను. మాటలకు, చేతలకు పొంతన ఉండాలని భావించే వ్యక్తి. ఎదుటివారి పట్ల దయ, జాలి చూపే హృదయం ఆయన సొంతం. చిన్నప్పుడు నేనో పుస్తకాన్ని కొనుక్కున్నాను. అది నా జీవితంలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. అలాగే తండ్రి జీవితాన్ని అనిల్‌శాస్త్రి మనకు పుస్తకంగా అందిస్తున్నారు. ఇది ఎందరికో స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నానన్నారు. -
నేపాల్‌కు సాగిన ‘డ్రాగన్’ నాలుక
టిబెట్ మారుమూల ప్రాంతాలలో కూడా ప్రవేశించడానికి ఈ మార్గం చైనాకు వీలు కల్పిస్తుంది. ఇది ఇంతటితో ఆగుతుందంటే ఎవరికీ నమ్మకం కలగడం లేదు. చైనా ధోరణి, గతానుభవాలు ఇందుకు కారణం. మన పొరుగు బడుగు దేశం టిబెట్ రాజకీయ భవితవ్యం, రూపురేఖలు మారిపోయే రోజు దగ్గరలోనే ఉంది. క్వింఘాయ్-టిబెట్ రైల్వేమార్గాన్ని నేపాల్ సరిహద్దులలోని షిగాట్సే పట్ట ణం వరకు విస్తరించే ప్రణాళిక త్వరలోనే పూర్తి కాబోతోందని ఈ మధ్య చైనా ప్రకటించింది. గంటకు 120 కిలోమీటర్ల వేగం తో సాగే రైళ్ల కోసం చేపట్టిన విస్తరణ ప్రణాళిక ఇది. అక్టోబర్‌లో పూర్తి కాబోయే ఈ మార్గం వల్ల లాషా నుంచి టిబెట్ అవతలి (నేపాల్ వైపు)అంచులకు చేరుకోవడానికి ఐదు గంటలు పట్టే ప్రయాణం రెండు గంటలకు తగ్గుతుంది. ఈ ప్రకటన, ఈ ప్రణాళిక వెనుక ఉద్దేశాన్ని కొంచెం గమనించినా టిబెట్ రూపురేఖలు అనూహ్యంగా ఉండబోతున్నాయని గట్టిగా చెప్పవచ్చు. ఈ రైలు మార్గం ఉద్దేశం అభివృద్ధేనని చైనా చెబుతున్నది. కానీ టిబెట్ మారుమూల ప్రాంతాలలో కూడా ప్రవేశించడానికి ఈ మార్గం చైనాకు వీలు కల్పిస్తుంది. ఈ మార్గం ఇంతటితో ఆగుతుందంటే ఎవరికీ నమ్మకం కలగడం లేదు. చైనా ధోరణి, గతానుభవాలు ఇందుకు కారణం. ఈ రైలు మార్గాన్ని మరి కొంత విస్తరించి, నేపాల్ రాజధాని కఠ్మాండు వరకు విస్తరించడానికి ఆర్థిక సాయం చేయదలచినట్టు చైనా సంకేతాలు ఇచ్చిం ది. నేపాల్ కూడా ఆసక్తి చూపుతోంది. కానీ భారత్‌కు ఉండే అభ్యంతరాల వల్ల ఆచితూచి వ్యవహరిస్తున్నది. షిగాట్సే పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని రైలు మార్గం పొడిగించడంలోనే చైనా వ్యూహాత్మక దృష్టి బయటపడుతోంది. ఇది టిబెట్, నేపాల్ సరిహద్దులలో ఉంది. తషీల్హ్యునోప్ బౌద్ధ మ ఠం ఇక్కడిదే. నిజానికి ఇది మంచి యాత్రాస్థలం. పంచన్ లామాల ప్రధాన పీఠం. పదకొండో పంచన్‌లామా గియాన్సినా నొర్బు చైనా మద్దతుదారు. గెలుగ్పా అనే బౌద్ధ తెగకు (టిబెట్‌లో రెండో పెద్ద తెగ) ఈయనే ఆధ్యాత్మిక గురువు. అంటే దలైలామా తరువాత పెద్ద ఆధ్యాత్మిక గురువు ఇతడే. వీటికితోడు నేపాల్ చైనా వైపు మొగ్గుతున్న సూచనలు ఇటీవల కాలంలో నిగ్గు తేలుతున్నాయి. టిబెట్ సరిహద్దులలోని టాటాపోనీ అనే పట్టణంలో రవాణా కేంద్రం ఏర్పాటు చేసుకోవడానికి ఆ రెండు దేశాల మధ్య అవగాహన కుదిరింది. ఇది చైనా నిర్మిస్తున్న రైలు మార్గానికి ఉపకరించేదే. మొన్న జనవరిలో చైనా ప్రధాని వెన్ జియాబావో నేపాల్‌లో పర్యటించినపుడు రైలు మార్గం నేపాల్ వరకు విస్తరించడం గురించి చర్చ జరిగింది. 1959 నుంచి భారత్‌లోనే ప్రవాస ప్రభుత్వం నడుపుతున్న దలైలామా చైనా ఆధిపత్యం గురించి ఇటీవల చేసిన ప్రకటన కూడా ముఖ్యమైనదే. స్వయం ప్రతిపత్తితో చైనాలో అంతర్భాగంగా ఉండడానికి టిబెట్‌కు అభ్యంతరం లేదని ఆయన ప్రకటించారు. కానీ కమ్యూనిస్టుల మీద ఆయన నిప్పులు చెరిగారు. అయితే చైనా ప్రభుత్వానికీ, పార్టీకీ మధ్య విభజన రేఖ ఎంత పలచనో దలైలామాకు తెలియనిది కాదు. నిజానికి టిబెట్‌కు సంపూర్ణ స్వాతంత్య్రం కోసం జరుగుతున్న ఉద్యమానికి ఆయ న ఎప్పుడూ మద్దతుదారు కాదు. దలైలామా నాయకత్వంలోని తెగతో పాటు, టిబెట్ బౌద్ధులలో రెండో పెద్ద తెగ గెలుగ్పాలు కూడా చైనాకు దగ్గరైన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైలు మార్గ విస్తరణ పథకాన్ని చైనా రహస్యంగా సాగించడం లేదు. టిబెట్ మీదుగా భారత సరిహద్దులలోని రెండు పట్టణాల వరకు ఈ రైలు మార్గం విస్తరించే యోచన ఉన్నదని 2012లో చైనా ప్రక టించింది. అలాగే నేపాల్‌కు కూడా ఈ రైలు మార్గం విస్తరింప చేసే అవకాశం ఉందని ఎలాంటి శషభిషలు లేకుండానే చైనా అధికారులు అప్పుడే ప్రకటించారు. అంతకుముందే, 2011 డిసెంబర్లో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు ములాయం సింగ్ ఈ విషయం మీద మన ప్రధానిని పార్లమెంటులో నిలదీశారు. ఇండియా మీద దాడికి చైనా సన్నాహాలు చేస్తున్నదని ములాయం సూటిగానే హెచ్చరించారు. కొన్ని సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ చైనా దాడికి దిగుతుందని భావించడం లేదని ప్రధాని సమాధానం ఇచ్చారు. చైనా కదలికల మీద భారత్ నిఘా ఉందని రక్షణ మంత్రి ఆంటోనీ కూడా చెప్పారు. చిత్రం ఏమిటంటే 1962 నాటి చైనా దాడికి ముందు ప్రథమ ప్రధాని నెహ్రూ కూడా ఇలాంటి సమాధానమే ఇచ్చారు. రైలు మార్గాలు సరుకులు, ప్రయాణికుల రవాణాకే కాదు, సైనికులను వేగంగా తరలించడానికి ఉపయోగపడతాయని ప్రపంచమంతటికీ తెలుసు. కనీసం దీనినైనా మన నేతలు గుర్తించాలి. టిబెట్ భవితవ్యం మారిపోతే దాని ప్రభావం మొదట పడేది భారత్ మీదనే. - డాక్టర్ గోపరాజు నారాయణరావు