న్యూఢిల్లీ: లద్దాఖ్‌లోని డెమ్‌చుక్ ప్రాంతంలోకి కొందరు చైనా సైనికులు, పౌరులు చొరబడ్డారు. సింధు నది అవతలి వైపు ఉన్న ఈ ప్రాంతంలో చైనా జాతీయ పతాకం, పలు బ్యానర్లు పట్టుకొని చైనీయులు కనిపించారు. అక్కడి భారతీయ గ్రామాల్లోని ప్రజలు దలైలామా పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడాన్ని నిరసిస్తూ వాళ్లు ఇలా చేశారు. ఈ ఘటన ఈ నెల 6వ తేదీన జరిగింది. వీళ్లంతా ఐదు వాహనాల్లో వచ్చి గ్రామంలోని కమ్యూనిటీ సెంటర్ దగ్గర ఇలా నిరసన తెలిపారు.
ఇదిలా ఉంటే, గత వారం ప్రధాని మోదీ దలైలామాకు 86వ పుట్టిన రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 2014లో మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దలైలామాతో మాట్లాడినట్లు అంగీకరించడం ఇదే తొలిసారి. కాగా, చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ 100వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపని భారత ప్రభుత్వం.. దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపడం చైనాకు మింగుడుపడడం లేదు. 2019లో మోదీ రెండోసారి గద్దెనెక్కిన తర్వాత కూడా దలైలామా పుట్టిన రోజుని అంశంగా తీసుకుని చైనీయులు ఇలానే నిరసన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment