Ladakh region
-
వీడియో: చరిత్రలో మొదటిరోజు.. దీపావళి వేడుకల్లో భారత్, చైనా బలగాలు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ వేళ ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. అటు, భారత సరిహద్దుల్లో కూడా పండుగ వాతావరణం నెలకొంది. దీపావళి సందర్బంగా భారత్-చైనా బలగాలు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట పలుచోట్ల స్వీట్స్ పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇటీవల రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్బంగా భారత్, చైనా దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో ఎల్ఏసీ వెంట సరిహద్దుల్లో భారత్, చైనాలు తమ బలగాలను పూర్తిగా ఉపసహంరించుకున్నాయి. అంతేకాకుండగా.. తూర్పు లడఖ్‌లోని దెప్పాంగ్, దేమ్‌చుక్ ప్రాంతాల నుంచి సైన్యాల ఉపసంహరణ పూర్తయ్యిందని, త్వరలోనే పెట్రోలింగ్ ప్రారంభిస్తామని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎల్ఏసీ వద్ద ఒప్పందం అమలు వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోంది. భవిష్యత్తులో కూడా చర్చలు కొనసాగుతాయని సైనిక వర్గాలు వెల్లడించాయి.మరోవైపు.. నేడు దీపావళి పండుగ సందర్భంగా భారత్, చైనాకు చెందిన సైనికులు స్వీట్లను ఇచ్చిపుచ్చుకున్నారు. లఢఖ్ సెక్టార్‌లోని కోంగ్లా ప్రదేశంలో ఎల్ఏసీ వెంట రెండు దేశాలకు చెందిన సైనికులు కలుసుకోవడం విశేషం. ఈ సందర్బంగా సైనికులు ఆనందం వ్యక్తం చేశారు.Soldiers of the Indian and Chinese Army exchange sweets at KongkLa in Ladkah Sector on the occasion of #Diwali. (Source: Indian Army) pic.twitter.com/KKEJpEHgPo— ANI (@ANI) October 31, 2024 Just in: Indian, Chinese PLA troops exchange Diwali sweets in at least five border points along LAC in Ladakh; MoD statement says this marks a “new era of cooperation”.- Karakoram Pass, - Daulat Beg Oldie - Chushul-Moldo Meeting Point- Kongka La- Hot Springs pic.twitter.com/mepbzoFetG— Dhairya Maheshwari (@dhairyam14) October 31, 2024 -
మోదీ, జిన్‌పింగ్ భేటీ సఫలం.. భారత బోర్డర్లో కీలక పరిణామం
ఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తూర్పు లడఖ్ ప్రాంతం నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్తున్నట్టు భారత రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఇటీవల బ్రిక్స్ సమావేశాల సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందాల్లో భాగంగానే బలగాలు వెనక్కి వెళ్తున్నట్టు స్పష్టం చేసింది.రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్భంగా భారత్, చైనా మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా రెండు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగానే సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైందని భారత రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. తూర్పు లఢఖ్ సెక్టార్‌లోని రెండు కీలక ప్రాంతాలైన డెమ్చోక్, డెస్పాంగ్ నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్తున్నట్టు అధికారులు చెప్పారు.అలాగే, ఈ ప్రాంతంలోని సైనిక సామగ్రి, ఇతర పరికరాలను భారత బలగాలు వెనక్కి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. లడఖ్ నుంచి పశ్చిమ దిశగా భారత బలగాలు, తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నాయి. ఇదే సమయంలో ఎల్ఏసీ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరు దేశాల బలగాలు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. రెండు దేశాల బలగాలు అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత మరికొన్ని రోజుల్లోనే డెస్పాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను మళ్లీ ప్రారంభించనున్నట్టు సమాచారం.Disengagement of troops of India and China has started at two friction points in Demchok and Depsang Plains in Eastern Ladakh sector. As per the agreements between the two sides, the Indian troops have started pulling back equipment to rear locations in the respective areas:… pic.twitter.com/CzwAZs4sJG— ANI (@ANI) October 25, 2024ఇదిలా ఉండగా.. తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో 2020 జూన్ 15న భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ సందర్బంగా భారత్‌కు చెందిన 20 మంది జవాన్లు వీర మరణం పొందారు. ఇదే సమయంలో చైనా కూడా తన సైన్యాన్ని కోల్పోయింది. దీంతో, నాటి నుంచి ఎల్ఏసీ వెంబడి రెండు దేశాల బలగాలు భారీ సంఖ్యలో మోహరించాయి. అయితే, గాల్వాన్ దాడిలోనే తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందారు. -
లద్దాఖ్‌లో కేంద్రానికి ఎదురుదెబ్బ!
లద్దాఖ్: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది కేంద్ర ప్రభుత్వం. కశ్మీర్ ప్రాంత అభివృద్ధి, ప్రజలకు సుపరిపాలన, భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. అయితే, లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించటం, ఆరవ అధికరణ ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలని అక్కడి నేతలు కొద్ది రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. ప్రజాగ్రహాన్ని తొలగించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ వేశారు. అయితే, ఈ ప్యానల్లో భాగమయ్యేందుకు నిరాకరించారు లద్దాఖ్ నేతలు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండడం కన్నా జమ్ముకశ్మీర్‌తో కలవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ కమిటీ కార్యకలాపాల్లో భాగం కాకూడదని అపెక్స్ బాడీ ఆఫ్ లద్దాఖ్, కార్గిల్ డెమొక్రాటిక్ అలియాన్స్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. తమ డిమాండ్లను తీర్చే వరకు ప్యానల్‌తో కలిసేది లేదని తేల్చి చెప్పారు. ‘ప్రస్తుత పరిస్థితుల ప్రకారం.. పూర్వ జమ్మూకశ్మీర్‌లో కలవడమే మంచిదనే భావన కలుగుతోంది.’అని పేర్కొన్నారు అపెక్స్ బాడీ ఆఫ్ లేహ్, లద్దాఖ్ బుద్దిస్ట్ అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఛేరింగ్ డోర్జయ్. రాష్ట్ర హోదా, ప్రత్యేక హోదా కల్పించకుండా కమిటీని ఏర్పాటు చేసి లద్దాఖ్ ప్రజలను కేంద్రం పిచ్చివారిని చేయాలని చూస్తోందని ఆరోపించారు. కమిటీ అజెండాలో ఉద్యోగ భద్రత, లద్దాఖ్ ప్రజల గుర్తింపు, భూభాగాన్ని పరిరక్షిస్తామని చెబుతున్నారని, అయితే ఏ చట్టం, షెడ్యూల్ ప్రకారం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాది క్రితం రాష్ట్ర హోదా, ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ లద్దాఖ్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. లద్దాఖ్‌లో చైనాతో సరిహద్దు వివాదాల వేళ ఈ నిరసనలు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారాయి. ఇదీ చదవండి: ‘ఎయిరిండియా’ ఘటనపై టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కీలక వ్యాఖ్యలు -
చైనా దూకుడు.. భారత్‌కు పొంచి ఉన్న పెను ముప్పు!
డ్రాగన్ కంట్రీ చైనా.. ఎప్పుడూ భారత్ విషయంలో కవ్వింపులకు పాల్పడుతూనే ఉంటుంది. భారత సరిహద్దుల్లో చైనా అక్రమ నిర్మాణాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. హియాలయాల పొడవునా చైనా నిర్మాణాలు చేపడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఇక, లడఖ్ సమీపంలో చైనా మరో వంతెన నిర్మిస్తున్న విషయం శాటిలైట్ ఫొటోల ద్వారా బహిర్గతమైంది. ఈ విషయాన్ని అమెరికా ఆర్మీ పసిఫిక్ కమాండింగ్ జనరల్‌గా ఉన్న ఛార్లెస్ ఏ ఫ్లిన్ తెలిపారు. ఈ నేపథ్యంలో చైనా దూకుడు పట్ల భారత్‌ను ఆయన హెచ్చరించారు. లడఖ్‌లో జరుగుతున్న నిర్మాణాలు కళ్లు బైర్లు కమ్మే రీతిలో ఉన్నట్లు ఆయన ఆరోపించారు. చాలా ఆందోళనకర రీతిలో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. చైనా వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన చార్లెస్.. చైనా తన మిలిటరీ వనరులు అన్నింటినీ పెంచుకుంటుందని అన్నారు. చైనా కదలికలు ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి ఏమాత్రం ప్రయోజకరంకాదన్నారు. చైనా విధానాలు హిమాలయ సరిహద్దులో చాలా ఆందోళనకరీతిలో ఉన్నాయని తెలిపారు. వెస్ట్రన్ థియేటర్ కమాండ్ వాళ్లు నిర్మిస్తున్న కట్టడాలు ఆందోళనకరంగా ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో, చైనా చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా, భారత్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫ్లిన్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ అమెరికా సైనిక జనరల్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. తాజాగా ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో సమావేశమయ్యారు. #China builds a defence infrastructure in #Ladakh to frighten India! @TheTechOutlook https://t.co/tAH8GgZxHQ — The Tech Outlook (@TheTechOutlook) June 8, 2022 ఇది కూడా చదవండి: ఆర్ధిక పాఠాలు నేర్చుకుంటున్న శ్రీలంక... పొదుపు దిశగా అడుగులు -
Indian Army : జవాన్ అదిరిపోయే ఫీట్.. ఫిదా అవుతున్న ఇండియన్స్
సాక్షి, న్యూఢిల్లీ: భారత సైనం ఘనతను ఓ జవాన్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. తాము మానసికంగా, శారీరకంగా ఎంత దృఢంగా ఉన్నామో చెప్పకనే చెప్పారు. ఎముకలు కొరికే చలైనా, మండే ఎండకైనా, బీభత్సం సృష్టించే వానకైనా తాము బెదరమని తన పోరాట పటిమను చూపించారు. భారత జవాన్ చేసిన సాహాసం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మనోడి స్టంట్ చేసి భారతీయులు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఏం చేశాడంటే.. ఐటీబీపీ కమాండెంట్ రతన్ సింగ్ సోనాల్(55) మైనస్ 30 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద.. ఆగకుండా 60 పుష్ అప్స్ తీసి ఔరా అనిపించుకున్నారు. అది కూడా మాములు ప్రాంతంలో కాదు.. శీతల ప్రాంతమైన లద్దాఖ్‌లో 17,500 అడుగుల ఎత్తులో ఈ సాహసం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంత ఎత్తు, మంచులో కూడా రతన్ సింగ్ కొంచెం కూడా తన బ్యాలెన్స్ కోల్పోకుండా 60 పుష్ అప్స్ చేశాడు. అయితే, ఫిబ్రవరి 20న ఎత్తైన కర్జోక్ కంగ్రీ పర్వతాన్ని చేరుకున్న ఈ ఐటీబీపీ బృందం గడ్డ కట్టే చలిలో తమ పోరాటపటిమను ప్రదర్శిస్తోంది. వీరి ధైర్య సాహాసాలను చూసి సెల్యూట్ టూ ఇండియన్ ఆర్మీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Push-ups at icy heights... ITBP Commandant Ratan Singh Sonal (Age- 55 years) completes more than 60 push-ups at one go at 17,500 feet at minus 30 degree celsius temperature around in Ladakh.#Himveers #FitIndia #FitnessMotivation pic.twitter.com/Fc6BnfmGqH — ITBP (@ITBP_official) February 23, 2022 -
లద్దాఖ్‌లోకి చొరబడిన చైనీయులు..
న్యూఢిల్లీ: లద్దాఖ్‌లోని డెమ్‌చుక్ ప్రాంతంలోకి కొందరు చైనా సైనికులు, పౌరులు చొరబడ్డారు. సింధు నది అవతలి వైపు ఉన్న ఈ ప్రాంతంలో చైనా జాతీయ పతాకం, పలు బ్యానర్లు పట్టుకొని చైనీయులు కనిపించారు. అక్కడి భారతీయ గ్రామాల్లోని ప్రజలు దలైలామా పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడాన్ని నిరసిస్తూ వాళ్లు ఇలా చేశారు. ఈ ఘటన ఈ నెల 6వ తేదీన జరిగింది. వీళ్లంతా ఐదు వాహనాల్లో వచ్చి గ్రామంలోని కమ్యూనిటీ సెంటర్ దగ్గర ఇలా నిరసన తెలిపారు. ఇదిలా ఉంటే, గత వారం ప్రధాని మోదీ దలైలామాకు 86వ పుట్టిన రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 2014లో మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దలైలామాతో మాట్లాడినట్లు అంగీకరించడం ఇదే తొలిసారి. కాగా, చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ 100వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపని భారత ప్రభుత్వం.. దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపడం చైనాకు మింగుడుపడడం లేదు. 2019లో మోదీ రెండోసారి గద్దెనెక్కిన తర్వాత కూడా దలైలామా పుట్టిన రోజుని అంశంగా తీసుకుని చైనీయులు ఇలానే నిరసన తెలిపారు. -
కార్గిల్ @ మైనస్ 20.6
జమ్ము/శ్రీనగర్: జమ్ముకాశ్మీర్ లడఖ్ రీజియన్‌లోని కార్గిల్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. ఎముకల్ని కొరికేసే అంతటి చలి వాతావరణం నెలకొంది. బుధవారం ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్ 20.6గా డిగ్రీలుగా నమోదైంది. శీతల గాలులు కొనసాగుతున్నాయి. జమ్ము నగరం సైతం ఈ సీజన్లో అత్యంత శీతల రాత్రిగా నమోదైంది. ఇక్కడ ఉష్ణోగ్రత 4.3 డిగ్రీలుగా ఉంది. గురు, శుక్రవారాల్లో మరింత చల్లటి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. లేహ్‌లో ఈ సీజన్లో మరోసారి అత్యంత తక్కువ ఉష్ణోగ్రత మైనస్ 16.6 డిగ్రీలుగా నమోదైంది. పెహల్గాంలో మైనస్ 6.1, గుల్మార్గ్లో మైనస్ 6.8, కత్రాలో 6.2, బటోట్‌లో 2, బన్నిహిల్లో 0, భదేర్వా మైనస్ 0.1, ఉధంపూర్‌లో 3 డిగ్రీల సెల్సియస్ ఉంది. -
ఎల్ఏసీ వద్ద శాంతియుత వాతావరణం:చైనా
ఎల్ఏసీ వద్ద శాంతియుత వాతావరణం:చైనా బీజింగ్: కాశ్మీర్‌లోని లఢక్ సెక్టార్‌లోని వాస్తవాధీనరేఖ (ఎల్ఏసీ) వద్ద ప్రస్తుతం శాంతియుత వాతావరణం నెలకొని ఉందని చైనా స్పష్టం చేసింది. చైనా సైనికులు చొరబాట్లకు పాల్పడుతూ, భారత భూభాగంలోకి చొచ్చుకువస్తున్నారన్నవార్తలతో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా తాజా పరిస్థితిపై వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఎల్ఏసీ వద్ద శాంతియుత వాతావరణం ఉందని తెలిపింది. అసలు ఎల్ఏసీ నిర్ధారణపై భారత్, చైనాల మధ్య విభిన్నమైన వాదనలున్నాయని, సరిహద్దు సమస్యలుంటే ఉభయపక్షాలు చర్చలతో పరిష్కరించుకోవచ్చని చైనా సైన్యం సోమవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే,.. లఢక్ సెక్టార్లో తాజా ప్రతిష్టంభనపై చర్చ జరిగిందా? లేదా? అన్నది మాత్రం చైనా సైన్యం వివరించలేదు. లఢక్ వద్ద చుమర్ ప్రాంతంలో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీకి, భారత సైన్యానికి మధ్య గత వారంగా కొనసాగుతున్న ప్రతిష్టంభనపై పీటీఐ అడిగిన ప్రశ్నలకు స్పందనగా చైనా జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఈ వ్యాఖ్య చేశారు. సరిహద్దులో ఇటీవలి పరిణామాలపై మీడియాలో వెలువడిన వార్తలను తాము గమనించామన్నారు. -
మళ్లీ చైనా చొరబాటు మళ్లీ చైనా చొరబాటు
న్యూఢిల్లీ: భారత భూభాగంలోకి చైనా సైనిక దళాల చొరబాటు సమస్య మరింత తీవ్రంగా పరిణ మించింది. లడక్ ప్రాంతంలో చుమర్ సెక్టార్ గత రెండు రోజుల్లోనే రెండవ సారి చైనా సైన్యం చొరబాటుకు పాల్పడింది. గురువారం చొరబాటు జరిపి వెనక్కు మళ్లిన ప్రాంతంలోనే మరో చోట చైనా దళాలు భారత భూభాగంలోకి చొరబడ్డాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కి చెందిన దాదాపు 50మంది సైనికులు తొమ్మిది వాహనాల్లో వచ్చి, చుమర్ ప్రాంతంలో భారత్ పరిధిలోని ఒక చిన్న కొండపైకి చేరుకున్నారని, అంతకు ముందు అక్కడే మకాంవేసిన 35మంది సైనికులకు అదనంగా వారూ చేరారని అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దువద్ద భారతసైనికులకు వంద మీటర్ల దూరంలోనే వారి ముందే వాహనాలు దిగివెళ్లారని అధికార వర్గాలు తెలిపాయి. కొండపై ఉన్న చైనా సైనికుల కోసం చైనా హెలికాప్టర్లు ఆహారం పొట్లాలు జారవిడుస్తున్నాయని, అయితే, ెహ లికాప్టర్లు మాత్రం ఇప్పటివరకూ గ గనతల ంలో ఉల్లంఘనకు పాల్పడలేదని అధికారవర్గాలు తెలిపాయి. -
జమ్మూ కాశ్మీర్లో భూకంపం
జమ్మూ కాశ్మీర్ లడక్‌లోని ఉత్తర లేహ్ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 4.0గా నమోదు అయిందని తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున 3.51 గంటలకు ఆ భూమి కంపించిందని చెప్పారు. అయితే భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కాని సంభవించినట్లు తమకు సమాచారం అందలేదని తెలిపారు. భూమి కంపించడంతో భయాందోళనకు గురైన ప్రజలు విధుల్లోకి పరుగులు తీశారని చెప్పారు.