సాక్షి, న్యూఢిల్లీ: భారత సైనం ఘనతను ఓ జవాన్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. తాము మానసికంగా, శారీరకంగా ఎంత దృఢంగా ఉన్నామో చెప్పకనే చెప్పారు. ఎముకలు కొరికే చలైనా, మండే ఎండకైనా, బీభత్సం సృష్టించే వానకైనా తాము బెదరమని తన పోరాట పటిమను చూపించారు. భారత జవాన్ చేసిన సాహాసం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మనోడి స్టంట్ చేసి భారతీయులు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఏం చేశాడంటే..
ఐటీబీపీ కమాండెంట్ రతన్ సింగ్ సోనాల్(55) మైనస్ 30 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద.. ఆగకుండా 60 పుష్ అప్స్ తీసి ఔరా అనిపించుకున్నారు. అది కూడా మాములు ప్రాంతంలో కాదు.. శీతల ప్రాంతమైన లద్దాఖ్‌లో 17,500 అడుగుల ఎత్తులో ఈ సాహసం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంత ఎత్తు, మంచులో కూడా రతన్ సింగ్ కొంచెం కూడా తన బ్యాలెన్స్ కోల్పోకుండా 60 పుష్ అప్స్ చేశాడు.
అయితే, ఫిబ్రవరి 20న ఎత్తైన కర్జోక్ కంగ్రీ పర్వతాన్ని చేరుకున్న ఈ ఐటీబీపీ బృందం గడ్డ కట్టే చలిలో తమ పోరాటపటిమను ప్రదర్శిస్తోంది. వీరి ధైర్య సాహాసాలను చూసి సెల్యూట్ టూ ఇండియన్ ఆర్మీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Push-ups at icy heights...
— ITBP (@ITBP_official) February 23, 2022
ITBP Commandant Ratan Singh Sonal (Age- 55 years) completes more than 60 push-ups at one go at 17,500 feet at minus 30 degree celsius temperature around in Ladakh.#Himveers #FitIndia #FitnessMotivation pic.twitter.com/Fc6BnfmGqH
Comments
Please login to add a commentAdd a comment