వీడియో: చరిత్రలో మొదటిరోజు.. దీపావళి వేడుకల్లో భారత్‌, చైనా బలగాలు | Diwali 2024: Indian and Chinese Army Soldiers Exchange Sweets | Sakshi
Sakshi News home page

వీడియో: చరిత్రలో మొదటిరోజు.. దీపావళి వేడుకల్లో భారత్‌, చైనా బలగాలు

Published Thu, Oct 31 2024 3:09 PM | Last Updated on Thu, Oct 31 2024 3:24 PM

Diwali 2024: Indian and Chinese Army Soldiers Exchange Sweets

ఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ వేళ ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. అటు, భారత సరిహద్దుల్లో కూడా పండుగ వాతావరణం నెలకొంది. దీపావళి సందర్బంగా భారత్‌-చైనా బలగాలు వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంట పలుచోట్ల స్వీట్స్‌ పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇటీవల రష్యాలో జరిగిన బ్రిక్స్‌ సమావేశాల సందర్బంగా భారత్‌, చైనా దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో ఎల్‌ఏసీ వెంట సరిహద్దుల్లో భారత్, చైనాలు తమ బలగాలను పూర్తిగా ఉపసహంరించుకున్నాయి. అంతేకాకుండగా.. తూర్పు లడఖ్‌లోని దెప్పాంగ్, దేమ్‌చుక్ ప్రాంతాల నుంచి సైన్యాల ఉపసంహరణ పూర్తయ్యిందని, త్వరలోనే పెట్రోలింగ్ ప్రారంభిస్తామని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎల్‌ఏసీ వద్ద ఒప్పందం అమలు వెరిఫికేషన్‌ ప్రక్రియ జరుగుతోంది. భవిష్యత్తులో కూడా చర్చలు కొనసాగుతాయని సైనిక వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు.. నేడు దీపావళి పండుగ సందర్భంగా భారత్‌, చైనాకు చెందిన సైనికులు స్వీట్లను ఇచ్చిపుచ్చుకున్నారు. లఢఖ్‌ సెక్టార్లోని కోంగ్లా ప్రదేశంలో ఎల్‌ఏసీ వెంట రెండు దేశాలకు చెందిన సైనికులు కలుసుకోవడం విశేషం. ఈ సందర్బంగా సైనికులు ఆనందం వ్యక్తం చేశారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement