Line of Actual Control
-
వీడియో: చరిత్రలో మొదటిరోజు.. దీపావళి వేడుకల్లో భారత్, చైనా బలగాలు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ వేళ ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. అటు, భారత సరిహద్దుల్లో కూడా పండుగ వాతావరణం నెలకొంది. దీపావళి సందర్బంగా భారత్-చైనా బలగాలు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట పలుచోట్ల స్వీట్స్ పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇటీవల రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్బంగా భారత్, చైనా దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో ఎల్ఏసీ వెంట సరిహద్దుల్లో భారత్, చైనాలు తమ బలగాలను పూర్తిగా ఉపసహంరించుకున్నాయి. అంతేకాకుండగా.. తూర్పు లడఖ్‌లోని దెప్పాంగ్, దేమ్‌చుక్ ప్రాంతాల నుంచి సైన్యాల ఉపసంహరణ పూర్తయ్యిందని, త్వరలోనే పెట్రోలింగ్ ప్రారంభిస్తామని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎల్ఏసీ వద్ద ఒప్పందం అమలు వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోంది. భవిష్యత్తులో కూడా చర్చలు కొనసాగుతాయని సైనిక వర్గాలు వెల్లడించాయి.మరోవైపు.. నేడు దీపావళి పండుగ సందర్భంగా భారత్, చైనాకు చెందిన సైనికులు స్వీట్లను ఇచ్చిపుచ్చుకున్నారు. లఢఖ్ సెక్టార్‌లోని కోంగ్లా ప్రదేశంలో ఎల్ఏసీ వెంట రెండు దేశాలకు చెందిన సైనికులు కలుసుకోవడం విశేషం. ఈ సందర్బంగా సైనికులు ఆనందం వ్యక్తం చేశారు.Soldiers of the Indian and Chinese Army exchange sweets at KongkLa in Ladkah Sector on the occasion of #Diwali. (Source: Indian Army) pic.twitter.com/KKEJpEHgPo— ANI (@ANI) October 31, 2024 Just in: Indian, Chinese PLA troops exchange Diwali sweets in at least five border points along LAC in Ladakh; MoD statement says this marks a “new era of cooperation”.- Karakoram Pass, - Daulat Beg Oldie - Chushul-Moldo Meeting Point- Kongka La- Hot Springs pic.twitter.com/mepbzoFetG— Dhairya Maheshwari (@dhairyam14) October 31, 2024 -
లద్ధాఖ్‌లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ పూర్తి!
న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్లోని దెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. గతవారం భారత్-చైనా దేశాల మధ్య జరిగిన కీల ఒప్పందంలో భాగంగా.. కీలక ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైనికులు తమ మౌలిక సదుపాయాలను, ఇతర సామగ్రిని వెనక్కి తీసుకున్నట్లు తాజాగా ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. భారత్, చైనా సైన్యాలు ఒకరి స్థావరాలను మరొకరు పరస్పరం తనిఖీ చేసుకుంటున్నాయని పేర్కొంది.కాగా తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట పెట్రోలింగ్, దళాలుప సంహరణకు ఇటీవల భారత్, చైనా మధ్య ఇటీవల గస్తీ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. దీని ప్రకారం 2020 నాటి యథాస్థితి ఎల్ఏసీ వెంబడి ఇక కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు. ఈ క్రమంలో మూడురోజుల కిందట ఎల్ఏసీ వెంట బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలయ్యింది. అక్టోబర్ 29 లోగా బలగాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి.2020 జూన్ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాలు ఎల్ఏసీ వెంబడి భారీ స్థాయిలో బలగాలను మోహరించాయి. అప్పటినుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
ఆర్మీ కాన్వాయ్‌పై ముష్కరుల కాల్పులు
జమ్మూ: జమ్మూ జిల్లాలోని అఖ్నూర్ సెక్టార్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. వాస్తవాధీన రేఖకు సమీపంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా ఆర్మీ కాన్వాయ్‌పైకి ఉగ్ర మూకలు కాల్పులకు దిగాయి. బలగాలు అప్రమత్తమై దీటుగా స్పందించడంతో ప్రమాదం తప్పింది. అనంతరం ముష్కరులు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పరారయ్యారు. ఆ ప్రాంతాన్ని దిగ్బంధించిన బలగాలు అదనంగా పోలీసులను, ఆర్మీని తరలించి గాలింపు ముమ్మరం చేశారు. ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతడి వద్ద ఆయుధం స్వాధీనం చేసుసుకున్నారు. హెలికాప్టర్‌ను రంగంలోకి దించి బలగాలు ఓ భవనం బేస్మెంట్లో ఉగ్రవాదులు దాగినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా భారీ పేలుళ్లు, కాల్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు సభ్యుల ముష్కరుల ముఠా ఆదివారం రాత్రి సరిహద్దులు దాటి దొంగచాటుగా దేశంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ అంబులెన్సుకు కనీసం డజను బుల్లెట్లు తగిలాయని చెప్పారు. అంతకుముందు, ఉగ్రవాదులు అస్సన్ ఆలయంలోకి ప్రవేశించి సెల్‌ఫోన్ కోసం అక్కడి వారిని అడిగారు, ఇంతలోనే అటుగా వస్తున్న ఆర్మీ కాన్వాయ్‌ని గమనించి కాల్పులకు దిగారన్నారు. -
సరిహద్దు గస్తీపై కీలక పురోగతి
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ విషయమై చైనాతో నెలకొన్న నాలుగేళ్ల పై చిలుకు సైనిక వివాదం కొలిక్కి వచి్చంది. ఇరు దేశాల దౌత్య, సైనిక ఉన్నతాధికారులు కొద్ది వారాలుగా జరుపుతున్న చర్చల ఫలితంగా ఈ విషయమై కీలక ఒప్పందం కుదిరింది. విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ సోమవారం ఈ మేరకు ప్రకటించారు. ‘‘తాజా ఒప్పందం ఫలితంగా తూర్పు లద్దాఖ్‌లోని దెస్పాంగ్, దెమ్చోక్ తదితర ప్రాంతాల నుంచి చైనా సైన్యం వెనుదిరుగుతుంది. అక్కడ ఇకపై భారత సైన్యం 2020కి ముందు మాదిరిగా గస్తీ కాస్తుంది’’ అని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల దిశగా దీన్నో మంచి ముందడుగుగా అభివర్ణించారు. రష్యాలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో భాగంగా మంగళ, బుధవారాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ప్రధాని కీలక భేటీ ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. ఈ వివాదానికి తెర దించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా గత వారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చర్చలు జరిపారు. చైనాతో సరిహద్దు వివాదానికి సంబంధించి 75 శాతం సమస్యలు ఇప్పటికే పరిష్కారమైనట్టు జైశంకర్ గత నెలలో పేర్కొన్నారు. -
భారత సరిహద్దుల్లో చైనా బంకర్ల నిర్మాణం!
భారత్‌ను కవ్వించే ప్రయత్నాలు చేస్తోంది చైనా. ఇప్పటికే భారత సరిహద్దులను డ్రాగన్ దేశం అస్థిరపరిచే కుట్రను గత కొన్నేళ్లుగా అమలు చేస్తోంది. అయితే తాజాగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) తూర్పు లడఖ్‌లోని ప్యాగ్యాంగ్ సరస్సు చుట్టుపక్కల అండర్‌గ్రౌండ్ బంకర్లు నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా కనిపిస్తోందని రక్షణ రంగ నిపుణులు వెల్లడించారు. ఆయుధాలు, ఇంధనం, సైనిక వాహనాల కోసం చైనా ఆర్మీ బంకర్లు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ప్యాగ్యాంగ్ సరస్సుకు ఉత్తర వైపు పర్వతాల మధ్య చైనా ఆర్మీ బేస్ సిర్జాప్ వద్ద బంకర్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ బంకర్ల నిర్మాణాలు వాస్తవాధీన రేఖకు కేవలం ఐదు కిలోమిటర్ల దూరంలోనే ఉంది. ప్రస్తుతం ఈ బంకర్లు నిర్మిస్త్ను ప్రాంతంలో 2020 ప్రారంభమైన ప్రతిష్టంభనకు ముందు ఎటువంటి మానవ సంచారం లేదు.2021-22 మధ్య నిర్మించిన బంకర్లుగా కనిపిస్తున్నాయి. ఈ బేస్‌లో ఆయుధాలు, ఇంధనం, ఇతర సామాగ్రి భద్రపరచం కోసం నిర్మించిన బంకర్లుగా కనిపిస్తున్నాయి. యూఎస్‌కు చెందిన బ్లాక్‌స్కై సంస్థ అందించిన ఉపగ్రహ చిత్రాల ఈ విషయం తెలుస్తోంది. సాటిలైట్ మే 30న తీసినఫొటోలో ఒక పెద్ద బంకర్.. దానికి ఎనిమిది ఎన్ట్రెన్స్లు. మరో చిన్న బంకర్.. దానికి ఐదు ఎన్ట్రెన్స్ ఉన్నట్లు స్పష్టం తెలుస్తోంది.అదే విధంగా పక్కనే పలు పెద్ద బిల్డింగ్లు, సైనిక వాహనాలతో అనేక షెల్టర్లు ఉన్నాయి. సైనిక వాహనాలను గగనతల దాడుల నుంచి రక్షించుకోవడానికి చైనా ఆర్మీ షెల్టర్లు నిర్మించుకున్నట్లు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. ఇటీవల జరిగిన ఎస్సీవో సదస్సు సందర్భంగా ఆస్తానాలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భేటీ అయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలపై లోతుగా చర్చించారు. సరిహద్దుల్లో నెలకొన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఇరు నేతలూ తీర్మానించారు. ఇందుకోసం సైనిక, దౌత్య మార్గాల్లో ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు అంగీకారం తెలిపారు. -
భారత్ Vs చైనా: అరుణాచల్‌పై మళ్లీ కవ్వింపులు..
బీజింగ్: డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి భారత్‌తో కవ్వింపు చర్యలకు దిగింది. ఎన్నికల వేళ భారత సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మరో దుందుడుకు చర్యకు దిగింది. తాజాగా అరుణాచల్‌లో కొన్ని ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది.కాగా, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదేనని ఇటీవలే చైనా వితండవాదం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా మరో అడుగు వేసి మరోసారి అక్కడి ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల శాఖ ఇటీవల ఈ కొత్త పేర్లను విడుదల చేశారు.అరుణాచల్‌లోని మొత్తం 30 ప్రాంతాలకు చైనా తాజాగా కొత్త పేర్లను పెట్టినట్లు తెలుస్తోంది. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో చైనా చర్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ.. ఈరోజు నేను మీ ఇంటి పేరు మర్చినట్లయితే అది నాది అవుతుందా?. అరుణాచల్ భారత్‌లో ఒక రాష్ట్రం. అరుణాచల్ ఎల్లప్పుడూ భారత్ భూభాగమే. పేర్లు మార్చడం వల్ల ప్రభావం ఏమీ ఉండదు. వాస్తవాధీన రేఖ వద్ద మా సైనం మోహరించి ఉంది అని కామెంట్స్ చేశారు.#WATCH | Surat, Gujarat: On China's claim regarding Arunachal Pradesh, EAM Dr S Jaishankar says, "If today I change the name of your house, will it become mine? Arunachal Pradesh was, is and will always be a state of India. Changing names does not have an effect...Our army is… pic.twitter.com/EaN66BfNFj— ANI (@ANI) April 1, 2024 ఇదిలా ఉండగా.. భారత భూభాగంలోని ప్రదేశాల పేర్లను మార్చేందుకు చైనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. చైనా 2017లో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు ప్రదేశాలకు, 2021లో 15 స్థలాలకు, 2023లో 11 ప్రాంతాలకు కొత్త పేర్లను చైనా ప్రకటించింది. ఇవన్నీ తమ దేశంలోని ప్రాంతాలేనని చెప్పుకొచ్చింది. -
భారత్ Vs చైనా: అరుణాచల్‌పై మళ్లీ కవ్వింపులు..
బీజింగ్: డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి భారత్‌తో కవ్వింపు చర్యలకు దిగింది. ఎన్నికల వేళ భారత సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మరో దుందుడుకు చర్యకు దిగింది. తాజాగా అరుణాచల్‌లో కొన్ని ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. కాగా, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదేనని ఇటీవలే చైనా వితండవాదం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా మరో అడుగు వేసి మరోసారి అక్కడి ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల శాఖ ఇటీవల ఈ కొత్త పేర్లను విడుదల చేశారు. అరుణాచల్‌లోని మొత్తం 30 ప్రాంతాలకు చైనా తాజాగా కొత్త పేర్లను పెట్టినట్లు తెలుస్తోంది. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో చైనా చర్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ.. ఈరోజు నేను మీ ఇంటి పేరు మర్చినట్లయితే అది నాది అవుతుందా?. అరుణాచల్ భారత్‌లో ఒక రాష్ట్రం. అరుణాచల్ ఎల్లప్పుడూ భారత్ భూభాగమే. పేర్లు మార్చడం వల్ల ప్రభావం ఏమీ ఉండదు. వాస్తవాధీన రేఖ వద్ద మా సైనం మోహరించి ఉంది అని కామెంట్స్ చేశారు. #WATCH | Surat, Gujarat: On China's claim regarding Arunachal Pradesh, EAM Dr S Jaishankar says, "If today I change the name of your house, will it become mine? Arunachal Pradesh was, is and will always be a state of India. Changing names does not have an effect...Our army is… pic.twitter.com/EaN66BfNFj — ANI (@ANI) April 1, 2024 ఇదిలా ఉండగా.. భారత భూభాగంలోని ప్రదేశాల పేర్లను మార్చేందుకు చైనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. చైనా 2017లో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు ప్రదేశాలకు, 2021లో 15 స్థలాలకు, 2023లో 11 ప్రాంతాలకు కొత్త పేర్లను చైనా ప్రకటించింది. ఇవన్నీ తమ దేశంలోని ప్రాంతాలేనని చెప్పుకొచ్చింది. -
అరుణాచల్ భారత్‌దే: అమెరికా
వాషింగ్టన్: అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్‌కు చెందిన ప్రాంతంగానే గుర్తిస్తున్నామని అమెరికా ప్రకటించింది. వాస్తవా«దీన రేఖ(ఎల్ఏసీ) ఆవలి వైపు ప్రాంతం కూడా తమదేనంటూ చైనా సైన్యం కానీ, పౌరులు గానీ ఏకపక్షంగా అక్రమంగా చొరబాట్లకు పాల్పడేందుకు చేసే ప్రయత్నాలను గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు అగ్రరాజ్యం తెలిపింది. ఇటీవల ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించిన నేపథ్యంలో చైనా ఆర్మీ మరో మారు ఆ భూభాగం తమదేనంటూ ప్రకటించడంపై అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ ఉప అధికారప్రతినిధి వేదాంత్ పటేల్ మీడియాకు ఈ విషయం తెలిపారు. భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌ను టిబెట్‌లోని ‘జాంగ్నాన్’గా చైనా తరచూ పేర్కొంటోంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన భారత్..అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ తమదేనని, ఇకపైనా విడదీయరాని అంతర్భాగంగానే కొనసాగుతుందని బుధవారం పునరుద్ఘాటించిన విషయం తెలిసిందే. అమెరికాకు సంబంధం లేదు:చైనా అరుణాచల్ భారత్‌దేనంటూ అమెరికా చేసిన ప్రకటనను చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. భారత్–చైనా సరిహద్దు వివాదంతో అమెరికాకు ఏమాత్రం సంబంధం లేదని తెలిపింది. అమెరికా ఇతర దేశాల మధ్య వివాదాలను రెచ్చగొడుతూ, వాటిని తన స్వార్థ భౌగోళిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం అందరికీ తెలిసిందేనని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ వ్యాఖ్యానించారు. -
Tawang dominates Parliament: ‘చైనా’పై చర్చించాల్సిందే
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వెంట చైనా సైనికులతో భారత సేన ఘర్షణ అంశాన్ని పార్లమెంట్లో చర్చించాల్సిందేనన్న ఉభయసభల్లో విపక్షాలు పట్టుబట్టాయి. అయితే, ఈ అంశాన్ని రాజ్యసభ, లోక్‌సభల్లో చర్చించే ప్రసక్తేలేదని ఇరుసభల సభాపతులు తేల్చిచెప్పడంతో విపక్ష సభ్యులు వాకౌట్‌చేశారు. బుధవారం ఉదయం లోక్‌సభలో ప్రశ్నావళి ముగియగానే సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘1962లో భారత్–చైనా యుద్ధంపై స్వయంగా ప్రధాని నెహ్రూనే చర్చించారు. ఆనాడు 165 మంది సభ్యులకు మాట్లాడే అవకాశమిచ్చారు. ఇప్పుడూ తవాంగ్‌లో చైనా దుందుడుకుపై సభలో చర్చించాల్సిందే’ అని పట్టుబట్టారు. చర్చించాలా వద్దా అనేది సభావ్యవహారాల సలహా కమిటీ భేటీలో నిర్ణయిస్తామని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా స్పష్టంచేశారు. ఇందుకు ఒప్పుకోబోమంటూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు సైతం వేర్వేరు అంశాలపై ప్రభుత్వాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, ఎన్సీ పార్టీల సభ్యులు కొందరు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను దాటి చైనా సైనికులు భారత భూభాగంలోకి వచ్చిన అంశాన్ని చర్చించాలంటూ రాజ్యసభలోనూ విపక్షాలు డిమాండ్ల మోత మోగించాయి. అయితే, ఈ అంశంపై చర్చకు ముందస్తు నోటీసు ఇవ్వనికారణంగా రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ చర్చకు నిరాకరించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, ఆర్జేyీ తదితర పార్టీల సభ్యులు వాకౌట్ చేశారు. -
చైనా ఆర్మీని తరిమికొట్టిన భారత బలగాలు.. వీడియో వైరల్
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టర్లోని వాస్తవాధీన రేఖ వద్ద ఇటీవల భారత్ చైనా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్9న భారత్ భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా ఆర్మీ ప్రయత్నించిందని.. డ్రాగన్ చర్యను భారత బలగాలు ధీటుగా అడ్డుకున్నాయని మంగళవారం లోక్‌సభలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. అయితే చైనా, భారత్ దళాల దాడి ఘటనను కేంద్రం ధృవీకరించిన మరుసటి రోజే ఓ వీడియో బయటకు వచ్చింది. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. చైనా దళాలు భారత భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.భారత్ భూభాగంలోకి చొచ్చుకు వస్తున్న చైనా జవాన్లను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పి కొట్టాయి. సరిహద్దు దాటాలనుకుంటున్న చైనా ఆర్మీని.. భారత సైనికులు ధైర్యంగా అడ్డుకున్నారు. గుంపుగా వచ్చిన చైనా దళాలపై ఇండియన్ ఆర్మీ లాఠీలతో మూకుమ్మడిగా దాడి చేసింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో డిసెంబర్ 9 జరిగిన ఘటనకు సంబంధించినది కాదని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. 2020లో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత ఈ దాడి ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. -
భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ.. ఇరు వర్గాలకు గాయాలు!
ఈటానగర్: సరిహద్దులో భారత్-చైనా బలగాల మధ్య మరోసారి ఘర్షణ చెలరేగింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ వాస్తవాధీన రేఖ వద్ద ఇరు వర్గాలు బాహాబాహీకి దిగినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 9న జరిగిన ఈ ఘటనలో రెండు దేశాల సైనికులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఘర్షణ అనంతరం భారత్-చైనా బలగాలు ఆ ప్రాంతం నుంచి వెనుదిరిగినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే చైనా సైనికులే వాస్తవాధీన రేఖను చేరుకోవడంతో భారత బలగాలు ప్రతిఘటించినట్లు సమాచారం. దాదాపు 300 మంది చైనా సైనికులు 17,000 అడుగుల ఎత్తులోని భారత పోస్టును తమ అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. మన సైనికులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరు వర్గాలు గొడవపడ్డాయి. ఈ ఘర్షణలో ఆరుగురు భారత సైనికులకు గాయలవ్వగా.. వారిని చికిత్స నిమిత్తం గువహటి ఆస్పత్రికి తరలించినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో భారత సైనికుల కంటే చైనా సైనికులే ఎక్కువ సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. 2020 జూన్ 15న జమ్ముకశ్మీర్ సరిహద్దు ప్రాంతం గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ హింసాత్మక ఘటనలో ఇరు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అనేక మార్లు చర్చల అనంతరం సరిహద్దులో బలగాల ఉపసంహరణ జరిగింది. ఇప్పుడు మళ్లీ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనా మరోమారు కయ్యానికి కాలు దువ్వుతోంది. చదవండి: త్వరలో రూ.2,000 నోట్లు రద్దు! బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు.. -
తైవాన్ టెన్షన్ల నడుమ భారత్‌తో చర్చలు జరిపేందుకు వచ్చిన చైనా
న్యూఢిల్లీ: లడఖ్ ప్రాంతంలోని భారత వైమానిక దళానికి చెందిన సీనియర్ అధికారులు చైనాతో సైనిక చర్చల్లో పాల్గొన్నారు. భారత్ గగనతలంలో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉండేందుకై అధికారులు చైనాతో చర్చలు సాగిస్తోంది. ఐతే గత కొన్ని కొన్ని రోజుల్లో ఎలాంటి ఘటన జరగలేదు గానీ ఇటీవల ఒక చైనా మిలటరీ విమానం నియంత్రరేఖకు సమీపంలో సుమారు 10 కి.మీ దూరంలో ఎగిరినట్లు అధికారుల గుర్తించారు. దీంతో భారత వైమానికదళ అధికారులు ఈ విషయమైన స్పందించాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు భారత్ చైనాతో చర్చల సాగిస్తోంది. అదీగాక టిబెట్ ప్రాంతంలో చైనా సైనిక విన్యాసాలను నిర్వహిస్తోంది. వాటిలో అతి ముఖ్యమైన వైమానిక దళ విభాగం ఉంది. అంతేకాదు టిబెట్ సమీపంలోనే ఎయిర్‌బేస్‌కి సంబంధించిన మౌలిక సదుపాయాలను కూడా చైనా నిర్మిస్తోంది. నియంత్రణ రేఖకు సంబంధించి ఇరు దేశాల మధ్య భిన్నమైన వాదన కూడా ఉంది. వాస్తవానికి నియంత్రణ రేఖకు సంబంధించిన నిబంధనలు ప్రకారం ఏ మిలటరీ విమానం వాస్తవ నియంత్రణ రేఖకు 10 కి.మీ లోపు ప్రయాణించ కూడదు. ఈ మేరకు జూన్25న చైనాకు సంబంధించిన జే11 విమానం తూర్పు లడఖ్ ప్రాంతంలోని నియంత్రణ రేఖకు సమీపంగా వచ్చినట్లు భారత్ గుర్తించింది. దీంతో భారత వైమానిక దళ అధికారులు అప్రమత్తమవ్వడమే కాకుండా ఇరు దేశాల సైనికలు వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. చైనా గత కొంతకాలంగా వాస్తవ నియంత్రణరేఖకు సమీపంలో విమానాలను ఎగరవేస్తూ గగనతల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. చైనా ఒక వైపు తైవాన్ విషయమై తీవ్ర సంఘర్షణకు లోనవుతూ కూడా భారత్‌తో చర్చలు సాగించడానికి ముందుకు రావడం గమనార్హం. (చదవండి: తప్పులు సరిదిద్దకోండి!... కెనడాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చైన) -
‘చైనా పదే పదే ఇలా ఎందుకు చేస్తుందో చెప్పలేను’
Chinese aircraft breached the Indian perceived LAC: భారత్-చైనా మధ్య 16వ రౌండ్ అత్యున్నత స్థాయి సైనిక చర్చలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి మాట్లాడుతూ....వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) అంతటా గగనతలంలో వైమానిక దళాలు నిరంతరం పర్యవేక్షిస్తాయని చెప్పారు. ఏదైనా చైనా విమానం భారత గగనతలానికి కొంచెం దగ్గరగా వచ్చినట్లు గుర్తించిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఐతే జూన్ చివరి వారంలో ఒక చైనీస్ విమానం భారత్ వాస్తవ నియంత్రణ రేఖను దాటి కొన్ని నిమిషాలపాటు ఘర్షణ ప్రాంతాల మీదుగా ఎగిరిందని తెలిపారు. భారత్ రాడార్ సాయంతో ఆ యుద్ధ విమానాన్ని గుర్తించామని ఆ విమానాన్ని అడ్డుకున్నట్లు కూడా వివరించారు. చైనా విమానాలు వాస్తవ నియంత్రణ రేఖ వద్దకు వచ్చినప్పుడల్లా.. తమ వైమానిక కార్యకలాపాలను అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఐతే చైనీయుల ఇలా పదేపదే ఎందుకు చేస్తున్నారనే విషయంపై సరైన వివరణను ఇవ్వలేనని చౌదరి అన్నారు. ఈ క్రమంలోనే తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణ ప్రాంతాల్లో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించే రీత్యా ఈ 16వ రౌండ్ అత్యున్నత స్థాయి సైనిక చర్చలు జరుగుతున్నాయి అని చెప్పారు. ఈ చర్చలు భారత్ వాస్తవాధీన రేఖ వైపున ఉన్న చుషుల్ మోల్డో ప్రాంతంలో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యాయని తెలిపారు. గతంలో భారత సైన్యం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మధ్య 15వ రౌండ్ చర్చలు మార్చి 11న దాదాపు 13 గంటల పాటు జరిగింది. ఐతే ఈ చర్చలు ఫలించలేదు. ఈ మేరకు ప్రభుత్వం చేపట్టిన అగ్నిపథ్ పథకం గురించి కూడా ఐఎఎఫ్ చీఫ్ మాట్లాడారు. దీనికి సంబంధించి దాదాపు 7.5 లక్షల దరఖాస్తులను స్వీకరించామన్నారు. ఇది సాయుధ దళాల్లో చేరేందుకు యువతలో ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది. డిసెంబర్లో శిక్షణ ప్రారంభించేలా.. ఎంపిక ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడం ఒక పెద్ద సవాలు అని చెప్పారు. పైగా ఈ ఏడాది ఎయిర్‌ఫోర్స్ డే పరేడ్‌ను చండీగఢ్‌లో నిర్వహించనున్నట్లు చౌదరి తెలిపారు. (చదవండి: ప్రజలకు తక్షణ ఉపశమన కార్యక్రమాలు అందించాలి) -
సరిహద్దులో రెచ్చిపోతున్న చైనా.. విమానంతో చక్కర్లు కొడుతూ..
న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతల పర్వం మళ్లీ మొదలైంది. గతంలో మాదిరిగానే డ్రాగన్ కంట్రీ మళ్లీ తన కపట బుద్ధిని ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఇటీవల లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద చైనా ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి చొచ్చుకొచ్చింది. వాస్తవాధీన రేఖ వెంబడి చక్కర్లు కొట్టింది. దీంతో భారత సైన్యం అప్రమత్తమవడంతో చైనా విమానం వెనుతిరిగింది. కాగా గత కొంతకాలంగా ఆ ప్రాంతంలో చైనా ఈ తరహా ఉల్లంఘనకు పాల్పడటం ఇదే మొదటి సారని భారత సైనిక వర్గాలు తెలిపాయి. తీరు మారని చైనా.. ఇప్పటికే చైనాతో పలుమార్లు భారత్ చర్చలు జరిపినప్పటికీ అవి ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. తాజాగా మరోసారి భారత్‌పై కవ్వింపులకు దిగింది డ్రాగన్ కంట్రీ. వివరాల ప్రకారం.. జూన్ చివరి వారంలో తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద చైనా విమానం భారత స్థావరాలకు చాలా దగ్గరగా వచ్చింది. భారత వైమానిక దళం దీన్ని గమనించి వెంటనే అప్రమత్తం కావడంతో చైనా విమానం దూరంగా వెళ్లిపోయింది. సరిహద్దు ప్రాంతంలో మోహరించిన ఐఏఎఫ్(IAF) రాడార్ ద్వారా చైనా విమానాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. తూర్పు లడఖ్‌కు సమీపంలో చైనా వైమానిక దళం నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో డ్రిల్స్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెప్పారు. చైనీయులు 2020లో చేసిన విధంగానే ఏదైనా దుస్సాహసాన్ని పాల్పడితే వాటిని అరికట్టడానికి తూర్పు లడఖ్ సెక్టార్లో భారత్ బలమైన చర్యలు తీసుకుంది. చదవండి: తోటి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. వీడియో తీసి -
చైనా దుశ్చర్య: అరుణాచల్ ప్రదేశ్‌లో 100 ఇళ్ల నిర్మాణం
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా రక్షణశాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. వాస్తవాధీన రేఖ (లైన్ ఆఫ్ ఆక్చువల్ కంట్రోల్) దాటి వచ్చిన చైనా అరుణాచల్ ప్రదేశ్‌లో 100 ఇళ్లతో కొత్త గ్రామాన్ని సృష్టించుకుంది. దీనికి సంబంధించిన నివేదికను యూఎస్ కాంగ్రెస్‌కు సమర్పించింది. భారత భూ భాగంగా పేర్కొంటున్న ప్రాంతంలోనే చైనా ఈ నిర్మాణం చేపట్టింది. చదవండి: కుప్పకూలిన 21 అంతస్తుల భవనం: 36కు చేరిన మృతుల సంఖ్య మెక్న్‌మోహన్ రేఖకు దక్షిణాన భారత సరిహద్దుల్లో ఈ గ్రామం నిర్మించారని బయటపడింది. అరుణచల్‌ప్రదేశ్‌లో డ్రాగన్ దేశం ఒక గ్రామాన్నే నిర్మించిన విషయమై ఉపగ్రహ చాయాచిత్రం ఆధారంగా జాతీయ మీడియా (ఎన్డీటీవీ) ఈ ఏడాది ప్రారంభంలో ఓ వార్తాకథనం ప్రచురించింది. ‘2020లో, పీఆర్సీ (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) ఎల్ఏటీ తూర్పు సెక్టార్లో టిబెట్ అటానమస్ రీజియన్, భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్ మధ్య వివాదాస్పద భూభాగంలో 100 ఇళ్లతో ఓ గ్రామాన్ని నిర్మించింది’ అని నివేదిక పేర్కొంది. చదవండి: మరో మహిళతో భర్త ఫోటోలు: ఐదుగురు పిల్లలను బాత్‌టబ్‌లో ముంచి ఈ గ్రామం అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సుబాన్సిరి జిల్లాలోని సారి చు నది ఒడ్డున ఉంది. ఈ ప్రాంతం 1962 యుద్ధానికి ముందు కూడా భారతదేశం- చైనా సైనికుల మధ్య ఘర్షణలను దారితీసింది. చైనా ఒక దశాబ్దానికి పైగా ఈ ప్రాంతంలో చిన్న సైనిక స్థావరాన్ని నిర్వహిస్తోంది. అయితే భారత భూభాగంలోకి మరింత చొచ్చుకొని 2020లో అది పూర్తి స్థాయి గ్రామాన్ని నిర్మించుకుంది. అంతేగాక అదే ప్రాంతంలో రహదారి నిర్మాణాలు కూడా ఏర్పాటు చేస్తోంది. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్య, సైనిక సంభాషణలు, చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఎల్ఏసీ వద్ద చైనా వ్యూహాత్మక చర్యలను కొనసాగిస్తోందని అమెరికా నివేదిక పేర్కొంది. -
లద్దాఖ్‌లో ‘వజ్ర’ రెజిమెంట్
న్యూఢిల్లీ: చైనా కవ్వింపు చర్యలతో భారత్ అప్రమత్తమైంది. వాస్తవా«దీన రేఖ వెంబడి డ్రాగన్ దేశం భారీగా సైన్యాన్ని ఆయుధ సంపత్తిని మోహరిస్తుండగా దీటుగా ప్రతిచర్యలు ప్రారంభించింది. లద్దాఖ్ సెక్టార్‌లోని ఫార్వర్డ్ ప్రాంతాల్లో మొట్టమొదటి కె–9 వజ్ర శతఘ్నులతో కూడిన బలగాలను తరలించింది. ఈ సెల్ఫ్ ప్రొపెల్డ్ శతఘ్నులకు 50 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలను ఛేదించే శక్తి ఉంది. ‘పర్వతప్రాంతాల్లోనూ కె–9 వజ్ర విజయవంతంగా పనిచేస్తున్నట్లు ప్రయోగ పరీక్షల్లో రుజువైంది. ఇటీవలే ఉత్పత్తయిన ఈ హొవిట్జర్ల మొత్తం రెజిమెంట్‌ను ఇక్కడ మోహరించాం. ఇవి చాలా సహాయకారిగా ఉంటాయి’అని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ తెలిపారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. ‘చైనా వైపు పరిణామాలను నిత్యం కనిపెట్టి చూస్తున్నాం. తూర్పులద్దాఖ్‌తోపాటు, మన తూర్పు కమాండ్ పరిధిలో చైనా గణనీయంగా బలగాలను మోహరించింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. ఈ పరిస్థితుల్లో ఎలాంటి దుందుడుకు చర్యనైనా తిప్పికొట్టేందుకు ఉపక్రమించాం. ఆర్మీ, ఆయుధ సంపత్తి మోహరింపుతోపాటు మౌలిక సౌకర్యాలను మెరుగుపరిచాం’అని ఆర్మీ చీఫ్ వెల్లడించారు. కాగా, దక్షిణకొరియా తయారీ కె–9 థండర్‌కు దేశీయంగా అభివృద్ధి చేసిన రూపమే కె–9 వజ్ర. ఈ శతఘ్నులను ముంబైకి చెందిన లార్సెన్ అండ్ టూబ్రో సంస్థ దక్షిణకొరియా సంస్థ భాగస్వామ్యంతో ఉత్పత్తి చేస్తోంది. భారత్–చైనాల మధ్య వాస్తవా«దీన రేఖ వెంబడి 3,488 కిలోమీటర్ల మేర వివాదం నడుస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్ కూడా తనదేననీ, అది దక్షిణ టిబెట్‌లోని భాగమేనని చైనా వాదిస్తుండగా భారత్ ఖండిస్తోంది. గత ఏడాది పాంగాంగో సరస్సు ప్రాంతంలో జరిగిన తీవ్ర ఘర్షణల అనంతరం సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. రెండు వైపులా వేలాదిగా బలగాలను సరిహద్దుల్లోకి తరలించాయి. -
డ్రాగన్ దుశ్చర్య.. 55 గుర్రాలపై భారతీయ భూభాగంలోకి..
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో తరచూ వివాదాలు సృష్టిస్తున్న చైనా మరోమారు తన దుర్భుద్ధిని చూపింది. గతనెల దాదాపు వందమందికి పైగా చైనా సైనికులు ఎల్ఏసీ(వాస్తవాధీన రేఖ)ని అతిక్రమించారని ఎకనమిక్‌టైమ్స్ కథనం పేర్కొంది. ఉత్తరాఖండ్‌లోని బారాహటి సెక్టార్‌లోని ఎల్ఏసీ వద్ద ఆగస్టు 30న సరిహద్దు దాటివచ్చిన చైనా సైనికులు మూడుగంటలకు పైగా గడిపి వెనక్కు వెళ్లారని తెలిపింది. 55 గుర్రాలపై వచ్చిన వీళ్లు అక్కడ ఇండియా ఏర్పరుచుకున్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశారని, అక్కడున్న ఒక బ్రిడ్జిని ధ్వంసం చేశారని కథనంలో వెల్లడించింది. చదవండి: (చైనాను బూచిగా చూపుతున్నాయి!) టున్జున్లా కనుమ మార్గం గుండా వచ్చిన చైనా సైనికులు భారతీయ భూభాగంలోకి సుమారు 5 కిలోమీటర్ల వరకు చొచ్చుకువచ్చినట్లు తెలిపింది. ఇదే సమయంలో స్థానికులు నుంచి సమాచారం అందుకొని అక్కడకు ఐటీబీపీ బలగాలు వెంటనే వచ్చాయి. వారు రాకముందే చైనా సైనికులు వెనక్కుపోయారు. చైనా దుశ్చర్యకు ప్రతిస్పందనగా భారతీయ బలగాలు ఇక్కడ పెట్రోలింగ్ ఆరంభించాయని సదరు కథనం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఇరు దేశాలూ బలగాల ఉపసంహరణకు అంగీకరించినా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. వాస్తవాధీన రేఖపై ఇరుదేశాల అవగాహనలో తేడాల వల్లనే తరచూ చైనా బలగాలు సరిహద్దులు దాటుతున్నాయని సైనిక వర్గాలు తెలిపాయి. చదవండి: (భారతీయులపై ఆంక్షలు.. సమర్థించుకున్న చైనా) -
మరోసారి బయటపడ్డ చైనా దుష్ట పన్నాగాలు.. ఈసారి
న్యూఢిల్లీ: చైనా దుష్ట పన్నాగాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి సుదీర్ఘ కాలం తన సైన్యం పీఎల్ఏ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) మకాం వేసేందుకు వీలుగా శాశ్వత నిర్మాణాలు చేపడుతోంది. వీటిలో తిష్ట వేసి ఉండే బలగాలు అవసరమైన పరిస్థితుల్లో తక్షణమే ఎల్ఏసీ వద్దకు చేరుకునేందుకు వీలవుతుంది. సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ కాంక్రీట్ నిర్మాణాలను తాము చూసినట్లు భారత సైనిక వర్గాలు తెలిపాయి. ఉత్తర సిక్కింలోని ‘నకు లా’కు కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఇటువంటి కాంక్రీట్ క్యాంప్ ఒకటి ఉందని పేర్కొన్నాయి. ఇలాంటి నిర్మాణాలే, భారత్‌కు చెందిన అరుణాచల్ ప్రదేశ్, తూర్పులద్దాఖ్ సమీపంలోనూ ఉన్నాయని సైనిక వర్గాలు వివరించాయి. కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రహదారులను కూడా చైనా మెరుగుపర్చిందనీ, దీనివల్ల ఎల్ఏసీ వెంట తలెత్తే ఎటువంటి పరిస్థితుల్లోనైనా వేగంగా స్పందించేందుకు పీఎల్ఏకు అవకాశం ఏర్పడుతుందన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో చేపట్టిన ఈ నిర్మాణాల కారణంగా డ్రాగన్ సైన్యం భారత భూభాగం వైపు వేగంగా కదిలే గణనీయంగా సామర్థ్యం మెరుగైందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. సరిహద్దు కొండ ప్రాంతాల్లోని ఫార్వర్డ్ పోస్టుల్లో మోహరించే బలగాల్లో 90 శాతం వరకు అతిశీతల పరిస్థితుల కారణంగా చైనా వెంటవెంటనే మార్చాల్సి వస్తోంది. అత్యాధునిక సౌకర్యాలు, అదనపు భద్రత హంగులు సమకూర్చిన కాంక్రీట్ నిర్మాణాలతో ఆ అవసరం తప్పుతుందని అంటున్నారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై ఓ కన్నేసి, అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపడతామని సైనిక వర్గాలు చెప్పాయి. గత ఏడాది నుంచి ఎల్ఏసీ వెంట ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భారత, చైనా బలగాలు సిక్కింలోని నకు లా ప్రాంతంతోపాటు తూర్పు లద్దాఖ్‌లోని పలు ప్రాంతాల్లో బాహాబాహీ తలపడిన విషయం తెలిసిందే. -
చైనా వక్రబుద్ధి: భారత జవాన్లకు గాయాలు
గ్యాంగ్‌టక్: సందు దొరికితే చాలు భారత భూభాగంలో చొచ్చుకొచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది చైనా. కన్ను మూసి తెరిచేలోగా దొరికిన కాడికి దోచుకునేందుకు గుంటనక్కలా కాచుకుని కూర్చుంటుంది. భారత సైన్యం ఎన్నిసార్లు హెచ్చరించినా డ్రాగన్ ఆర్మీ తన వక్రబుద్ధిని పోనిచ్చుకోలేదు. తాజాగా చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా అలర్ట్ అయిన భారత సైనికులు వారిని వెనక్కు వెళ్లగొట్టి డ్రాగన్ తోక ముడిచేలా చేశారు. గతవారం సిక్కింలోని నాకులా లోయలో సుమారు 20 మంది చైనా సైనికులు సరిహద్దు దాటి రహస్యంగా భారత్‌లోకి వచ్చేందుకు కుట్ర పన్నారు. వీరి ఎత్తుగడ అర్థమైన జవాన్లు వెంటనే వారిని వెళ్లిపొమ్మని హెచ్చరించారు. మాట చెవికెక్కించుకోని డ్రాగన్ ఆర్మీ ఆయుధాలు బయటకు తీసింది. (చదవండి: 63 సంవత్సరాల మహిళకు 43 ఏళ్ల జైలు శిక్ష..!) ఈ క్రమంలో భారత్-చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ జరగ్గా సైనికులు ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. ఈ దాడిలో నలుగురు భారత జవాన్లు గాయాలపాలయ్యారు. పైగా అక్కడి వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ తీవ్రంగా పోరాడిన సైనికులు వారిని విజయవంతంగా వెనక్కు వెళ్లగొట్టారు. జనవరి 20న జరిగిన ఈ ఘర్షణ లోకల్ కమాండర్ల చర్చలతో సద్దుమణిగిందని ఇండియన్ ఆర్మీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా భారత్- చైనా ఆర్మీ అధికారులు సమావేశమైన మరుసటి రోజే ఈ ఘర్షణ జరగడం గమనార్హం. గతేడాది జూన్ 15న కూడా లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా మధ్య ఘర్షణ తలెత్తగా.. 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. (చదవండి: బలగాల మోహరింపు.. ఒప్పందానికి చైనా తూట్లు) -
బలగాల మోహరింపు.. ఒప్పందానికి చైనా తూట్లు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఉన్న ఘర్షణాత్మక ప్రాంతాలకు కొత్తగా బలగాలను తరలించరాదన్న ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించింది. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖకు చైనా వైపున్న మిలటరీ పాయింట్స్‌లో బలగాల సంఖ్యను పెంచింది. ఉద్రిక్తతలను తొలగించే ఉద్దేశంతో గతంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ చైనా ఈ చర్యలకు పాల్పడింది. వ్యూహాత్మకంగా కీలకమైన ఘర్షణాత్మక ప్రదేశాలకు కొత్తగా బలగాలను పంపించరాదని గతేడాది సెప్టెంబర్ 21న జరిగిన 6వ విడత చర్చల సమయంలో చైనానే ప్రతిపాదించడం గమనార్హం. తమ ప్రతిపాదనపై కుదిరిన ఒప్పందాన్నే చైనా ఉల్లంఘించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ నెలాఖరు నుంచే బలగాల మోహరింపు కార్యక్రమాన్ని చైనా చేపట్టిందని వెల్లడించాయి. చైనా చర్యలను గమనించిన భారత్.. ముందు జాగ్రత్తగా పలు కీలక ప్రాంతాల్లో బలగాలను మోహరించింది. దాంతో, ఇరుదేశాల సాయుధ దళాలు, యుద్ధ ట్యాంకులు మరింత దగ్గరగా మోహరించిన పరిస్థితి మరోసారి నెలకొంది. చైనాతో 9వ విడత చర్చలు భారత్, చైనాల మధ్య ఆర్మీ కమాండర్ స్థాయిలో మరో విడత చర్చలు ఆదివారం జరిగా యి. దాదాపు రెండున్నర నెలల తరువాత జరిగిన 9వ విడత చర్చలు ఇవి. నవంబర్ 6న ఇరు దేశాల మధ్య 8వ విడత చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లోని అన్ని వివాదాస్పద కేంద్రాల నుంచి బలగాల ఉపసంహరణ కొనసాగాలన్న అంశంపై 9వ విడత చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖకు ఆవలివైపు(చైనా వైపు) మోల్దో సరిహద్దు పాయింట్ వద్ద ఉదయం 10 గంటలకు ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి 14 కార్ప్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ పీజీకే మెనన్ నాయకత్వం వహించారు. ప్రస్తుతం తూర్పు లద్దాఖ్‌లోని పలు వ్యూహాత్మక పర్వత ప్రాంతాల్లో సుమారు 50 వేల మంది భారత సైనికులు మోహరించి ఉన్నారు. చైనా కూడా దాదాపు అంతే సంఖ్యలో సైనికులను సిద్ధంగా ఉంచింది. మరిన్ని దళాలను పంపించకూడదని, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు ప్రయత్నించ కూడదని, 6వ విడత చర్చల సందర్భంగా ఇరుదేశాలు అంగీకరించిన విషయం తెలిసిందే. -
దృఢ భారత్.. నేతాజీకి గర్వకారణం
కోల్‌కతా/సాక్షి, న్యూఢిల్లీ: బలమైన భారతదేశం నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) నుంచి వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వరకూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అడుగు జాడల్లో నడుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నేతాజీ ఇప్పుడు జీవించి ఉంటే అన్ని విధాలా బలోపేతమైన భారత్‌ను చూసి గర్వపడేవారని అన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి మనమే సొంతంగా టీకాలు అభివృద్ధి చేసుకోవడం, ఇతర దేశాలకు సైతం టీకాలను అందజేయడం, మన దేశ సార్వభౌమత్వానికి సవాలు ఎదురైనప్పుడు దీటుగా జవాబు ఇవ్వడం చూసి నేతాజీ ఎంతగానో గర్వపడేవారని పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ‘పరాక్రమ్ దివస్’ వేడుకలను కేంద్ర ప్రభుత్వం శనివారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఎల్ఏసీ నుంచి ఎల్ఓసీ వరకు బలమైన భారత్ రూపుదిద్దుకోవాలని నేతాజీ కలలుగన్నారని, ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తున్నామని తెలిపారు. అజేయమైన సైనిక శక్తి మన సొంతమని చెప్పారు. తేజస్, రఫేల్ వంటి అత్యాధునిక ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకున్నామని వివరించారు. దీవికి బోస్ పేరుపెట్టడం నా అదృష్టం ఆత్మనిర్భర్ భారత్, సోనార్ బంగ్లాను(బంగారు బెంగాల్) కలగనడానికి నేతాజీ గొప్ప స్ఫూర్తి అని నరేంద్ర మోదీ కొనియాడారు. బోస్ పేరు విన్నప్పుడల్లా తాను ఎంతగానో స్ఫూర్తి పొందుతానని చెప్పారు. ఆయన స్వాతంత్య్రం కోసం అర్థించలేదని, దాని కోసం పోరాటం సాగించారని శ్లాఘించారు. 2018లో అండమాన్‌లోని ఓ దీవికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవిగా నామకరణం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. బోస్‌కు సంబంధించిన ఫైళ్లను ప్రజల ముందుంచామని అన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్(ఐఎన్ఏ) సభ్యులు సైతం గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొంటారని తెలిపారు. ప్రతి ఒక్క భారతీయుడు బోస్‌కు రుణపడి ఉన్నాడని ఉద్ఘాటించారు. 130 కోట్ల మందిలోని ప్రతి రక్తం చుక్క బోస్‌కు రుణపడి ఉంటుందన్నారు. గృహ నిర్బంధం నుంచి తప్పించుకొనే ముందు సుభాష్ చంద్రబోస్ తన మేనల్లుడు శిశిర్ బోస్‌ను ‘నా కోసం నువ్వు ఏదైనా చేస్తావా?’ అంటూ ప్రశ్నించారని గుర్తుచేశారు. గుండెపై చెయ్యి వేసుకొని, నేతాజీ సమక్షంలో ఉన్నట్లు ఊహించుకుంటే అదే ప్రశ్న వినిపిస్తుందన్నారు. భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి ఇది ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించినట్లుగానే ఆత్మనిర్భర్ భారత్‌లోనూ బెంగాల్ ముఖ్యమైన పాత్ర పోషించాలన్నారు. జైశ్రీరామ్‌లో తప్పేముంది?: బీజేపీ మమతా బెనర్జీ తీరు పట్ల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గియా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఓ వర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. జైశ్రీరామ్ నినాదంలో తప్పేముందని నిలదీశారు. జైశ్రీరామ్ అనేది రాజకీయ నినాదం కాదని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. ఈ నినాదంలో ఎలాంటి తప్పు లేదని, నేతాజీ జయంతిని రాజకీయం చేయొద్దని నేతాజీ బంధువు చంద్రకుమార్ బోస్ సూచించారు. తమ రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించారని బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్‌రంజన్ చౌదరి ధ్వజమెత్తారు. ఒక మహిళను పది మందిలో అవమానించడం దారుణమన్నారు. ఈ ఘటన తమ రాష్ట్రానికే అవమానమని సీపీఎం సీనియర్ నేత బిమన్ బోస్ పేర్కొన్నారు. సీఎం మాట్లాడుతుండగా నినాదాలు చేయడాన్ని టీఎంసీ ముఖ్య అధికార ప్రతినిధి డెరెక్ ఓ బ్రెయిన్ తప్పుపట్టారు. బోస్ నివాసంలో మోదీ కోల్‌కతాలో సుభాష్ చంద్రబోస్ నివాసం ‘నేతాజీ భవన్’ను ప్రధాని మోదీ సందర్శించారు. అనంతరం నేషనల్ లైబ్రరీలో నేతాజీపై నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్లో పాల్గొన్నారు. అక్కడ కళాకారులు, ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు. నన్ను పిలిచి అవమానిస్తారా? బెంగాల్ సీఎం మమత విక్టోరియా మెమోరియల్ హాల్లో జరిగిన నేతాజీ జయంతి కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురయ్యింది. ప్రసంగించేందుకు ఆమె ఉద్యుక్తురాలు కాగానే కొందరు ప్రధాని సమక్షంలో జైశ్రీరామ్ అంటూ బిగ్గరగా నినదించారు. దీంతో అసహనానికి గురైన మమత ప్రసంగించేందుకు నిరాకరించారు. తనను ఈ వేడుకకు పిలిచి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమే తప్ప రాజకీయ కార్యక్రమం కాదన్నారు. ఇలాంటి చోట మర్యాద పాటించాలన్నారు. పిలిచి అవమానించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. తాను ఇక మాట్లాడబోనని, జై బంగ్లా, జైహింద్ అంటూ ముగించారు. -
‘సరిహద్దు ఉద్రిక్తత.. యుద్ధం రాదని చెప్పలేం’
న్యూఢిల్లీ: సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని.. చైనాతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి రాదని చెప్పలేము అన్నారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. శుక్రవారం ఇరు దేశాల మధ్య ఎనిమిదవ రౌండ్ కమాండర్ స్థాయి చర్చలు జరగనున్న నేపథ్యంలో రావత్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా రావత్ మాట్లాడుతూ.. ‘తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి పరిస్థితులు ఉద్రిక్తతంగానే ఉన్నాయి. లద్దాఖ్‌లో పెను సాహసానికి పాల్పడిన పిపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఊహించని ఫలితాలు చవి చూడాల్సి వచ్చింది. మన దళాలు చైనా ఆర్మీ చర్యలను ఎంతో ధృడంగా ఎదుర్కొన్నాయి’ అని తెలిపారు. ‘మొత్తం భద్రతా చర్యల్లో భాగంగా సరిహద్దు ఘర్షణలు, అతిక్రమణలు, ప్రేరేపించని వ్యూహాత్మక సైనిక చర్యలు వంటి కవ్వింపు చర్యలతో సరిహద్దులో ఒక పెద్ద సంఘర్షణ తలెత్తింది. దీన్ని తేలికగా తీసుకోలేము’ అన్నారు. ఇక భద్రతా సవాళ్ల గురించి మాట్లాడుతూ.. అణ్వాయుధ సంపత్తి కల రెండు పొరుగు దేశాలతో నిరంతర ఘర్షణ తప్పదని.. ఫలితంగా ప్రాంతీయ వ్యూహాత్మక అస్థితరకు దారి తీసే అవకాశం ఉందన్నారు. యుద్ధానికి కాలు దువ్వుతున్న ఇరు దేశాలతో భారత్ ఎంతో సమన్వయంగా వ్యవహరిస్తుందని అన్నారు రావత్. (చదవండి: భారత సైన్యం కీలక నిర్ణయం..!) అలానే సీమాంతర ఉగ్రవాదంపై కూడా స్పందించారు రావత్. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాద చర్యలను భారత రక్షణ దళాలు బలంగా తిప్పి కొడతాయని తెలిపారు. ‘ఉడి, బాలాకోట్ ప్రాంతంలో చేసిన సర్జికల్ స్ట్రైయిక్స్‌తో పాక్‌కు గుణపాఠం నేర్పాము. ఇక దాయాది దేశం మన భూభాగంలోకి ఎల్ఓసీ వెంబడి ఉగ్రవాదులను పంపించాలంటే భయపడుతుంది’ అన్నారు. జమ్ము కశ్మీర్లో పాక్, భారత్ వ్యతిరేక ప్రచారంతో పరోక్ష యుద్ధానికి కాలు దువ్వుతుంది. ఫలితంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయని రావత్ తెలిపారు. -
చైనా కొత్త ఎత్తుగడ; అప్పుడే ఉపసంహరణ!
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో ఘర్షణ తర్వాత భారత్- చైనా దేశాలు వాస్తవాధీన రేఖ వెంబడి భారీ స్థాయిలో యుద్ధ ట్యాంకులను మోహరించాయి. కౌంటర్ అటాక్ కోసం మిసైళ్ల మోహరింపు సహా ఇతర యుద్ధ సామాగ్రిని బార్డర్‌కు తరలించాయి. అయితే ఇవి కేవలం ముందు జాగ్రత్త చర్యలు మాత్రమేనని, చర్చల ద్వారానే ఉద్రిక్తతలకు స్వస్తి పలకాలన్నదే తమ ఉద్దేశమని, ఇరు దేశాల మధ్య జరుగుతున్న మిలిటరీ స్థాయి చర్చలు సుస్పష్టం చేస్తున్నాయి. కానీ మూడేళ్ల క్రితం డోక్లాం వివాదంలో, ఇటీవలి జూన్ 15 నాటి ఘటన తర్వాత డ్రాగన్ ఆర్మీ ఎంతటి ఘాతుకానికి పాల్పడేందుకైనా వెనకాడబోదన్న విషయం, చైనా సైన్యం కుయుక్తులు మరోసారి బట్టబయలయ్యాయి. ఇలాంటి తరుణంలో బలగాల ఉపసంహరణ విషయంలోనూ డ్రాగన్ అనుసరిస్తున్న వైఖరిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.(చదవండి: రణరంగంలో డ్రోన్లదే ప్రాధాన్యత) చైనా కుయుక్తులు తూర్పు లదాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నాటి నుంచి ఇప్పటికే పలు దఫాలుగా ఈ విషయం గురించి ఇరు వర్గాల మిలిటరీ అధికారుల మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు విభేదాలను పరిష్కరించుకునే అంశం మీద దృష్టి పెట్టిన వేళ చైనా, అనేకమార్లు దుందుడుకుగా వ్యవహరించింది. ఎల్ఏసీ వెంబడి 5జీ నెట్వర్క్ ఏర్పాటు ప్రయత్నాలతో పాటుగా ప్యాంగ్యాంగ్ సరస్సు వద్ద కొత్తగా నిర్మాణాలు చేపట్టడం సహా, డోక్లాం, నకు లా, సిక్కిం సెక్టార్ల వద్ద డ్రాగన్ కొత్తగా రెండు ఎయిర్ డిఫెన్స్ స్థావరాలు నిర్మిచండం వంటి కవ్వింపు చర్యలకు దిగింది. డోక్లాం పీఠభూమిలో భారత్- చైనా-భూటాన్ ట్రై జంక్షన్లో ఆర్మీ కార్యకలాపాలకు డ్రాగన్ చేపట్టిన కొత్త నిర్మాణాల ఫొటోలు కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి పిలవడమే లక్ష్యంగా జరుగుతున్న చర్చల్లో చైనా మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. (అణ్వాయుధాలను రెట్టింపు చేసుకునే పనిలో చైనా!?) యథాతథస్థితి నెలకొన్న తర్వాతే తొలుత యుద్ధ ట్యాంకులు, ఇతర సామాగ్రిని బార్డర్ నుంచి ఉపసంహరించుకున్న తర్వాతే, ఉద్రిక్తతలు తగ్గుతాయని, అప్పుడే బలగాల ఉపసంహరణ ప్రక్రియ కూడా సాఫీగా సాగిపోతుందనే వాదనను డ్రాగన్ లేవలెత్తినట్లు సమాచారం. అయితే చైనా కుయుక్తులను పసిగట్టిన భారత్, పలు దశల్లో బలగాలను వెనక్కి పిలిచి, వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే ఉద్రిక్తతలు చల్లారే అవకాశం ఉందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక, లదాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి 1597 కిలోమీటర్ల మేర ఏప్రిల్ 2020 ముందునాటి యథాతథస్థితి నెలకొన్న తర్వాతే ఇది సాధ్యమవుతుందని తేల్చిచెప్పినట్లు సమాచారం. మిలిటరీ స్థాయి చర్చల్లో ఈ మేరకు ఇరువర్గాల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.(యుద్ధానికి సిద్ధంగా ఉండండి: జిన్‌పింగ్) ఒకవేళ తోక జాడిస్తే ఈ నేపథ్యంలో... యుద్ధ ట్యాంకులు, ఫిరంగి దళాలను వెనక్కి పిలవడం భారత్‌కు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని మిలిటరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పీఎల్ఏ మళ్లీ తోకజాడిస్తే, యుద్ధ సామాగ్రిని అంతత్వరగా బార్డర్‌కు తరలించలేమని, అదే సమయంలో ఇప్పటికే సరిహద్దుల్లో భారీస్థాయిలో రహదారులు, వంతెనల నిర్మాణాలు చేపట్టినందున డ్రాగన్‌కు వేగంగా కదిలి మరోసారి విషం చిమ్మే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్యాంగ్యాంగ్, హాట్‌స్ప్రింగ్స్‌లో చైనా ఆర్మీ గతంలో ప్రదర్శించిన దుందుడుకు వైఖరిని దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇక బలగాల ఉపసంహరణ విషయంలో చైనా జాప్యానికి గల కారణాలపై జాతీయ భద్రతా నిపుణులు మరో వాదనను తెరపైకి తీసుకువస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలతో ఈ అంశాన్ని ముడిపెడుతున్నారు.(భారత సరిహద్దులో 60 వేల చైనా సైన్యం: అమెరికా) అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం ఉంటుందా? ఈ క్రమంలో, నవంబరు 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసేంత వరకు డ్రాగన్ చర్చల సాగదీతతకే ప్రాధాన్యం ఇస్తుందని, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అనుకూల ఫలితాలు వెలువడే అవకాశం ఉంటే ఒకలా, వ్యతిరేక పవనాలు వీస్తే చైనా ఆర్మీ వైఖరి మరోలా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం చైనా, తైవాన్‌పై ఎక్కువగా దృష్టి సారించిందని, అధ్యక్ష ఎన్నికల ఫలితం తర్వాత భారత సరిహద్దుల్లో అనుసరించే వైఖరిపై ఓ స్పష్టత వస్తుందని చెబుతున్నారు. కాగా తమ అంతర్భాగమని చైనా చెప్పుకొంటున్న తైవాన్‌కు అమెరికా అన్ని విధాలుగా అండగా ఉంటున్న సంగతి తెలిసిందే. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే! అయితే మరో వర్గం మాత్రం ఈ వాదనలను కొట్టిపారేస్తోంది. వుహాన్‌లో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రభావం, ఆర్థిక వ్యవస్థ పతనం, రాజకీయపరంగా వస్తున్న విమర్శలు తదితర అంతర్గత అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే జిన్‌పింగ్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చేదాకా వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగుతునాయని పేర్కొంటున్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డ్రాగన్ ఇలా చేస్తోందని విమర్శిస్తున్నారు. -
ఎల్ఏసీ వద్ద పాకిస్తాన్ సైనికులు!
న్యూఢిల్లీ/లేహ్: భారత్–చైనా సరిహద్దు అయిన వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనా సైన్యంతోపాటు దాని సన్నిహిత మిత్ర దేశం పాకిస్తాన్ సైనికులు కూడా తిష్ట వేశారా? చైనాకు మద్దతుగా వారు కూడా పహారా కాస్తున్నారా? చైనా జర్నలిస్టు షెన్ షెవీ శనివారం షేర్ చేసిన ఓ వీడియోను గమనిస్తే ఇది నిజమేనని స్పష్టమవుతోంది. 52 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో చైనా సైనికులతోపాటు గుబురు గడ్డంతో ఉన్న మరో సిపాయి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాడు. అతడి రూపురేఖలు, ఎత్తు, దేహ దారుఢ్యం వంటివి చైనా పౌరుల కంటే పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎల్ఏసీ వద్ద చైనాకు సాయంగా పాకిస్తాన్ సైన్యం సైతం రంగంలోకి దిగిందని పలువురు భావిస్తున్నారు. అలాగే పాకిస్తాన్ సైనికులకు చైనా శిక్షణ ఇస్తోందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సరిహద్దులో భారత్–చైనా సైనికుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 12న భారత్–చైనా ఆర్మీ ఏడో రౌండ్ చర్చలు న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించుకునే దిశగా భారత్–చైనా ఆర్మీ ఏడో దఫా చర్చలు ఈ నెల 12వ తేదీన జరగనున్నాయి.తూర్పు లద్దాఖ్‌లోని ఉద్రిక్త ప్రాంతాల నుంచి ఇరు దేశాలు సైన్యాలను ఉపసంహరించుకునే కచ్చితమైన రోడ్ మ్యాప్ రూపొందించడమే ఈ సమావేశం ఎజెండా అని విశ్వసనీయ వర్గాల సమాచారం. సెప్టెంబర్ 21వ తేదీన జరిగిన చర్చల్లో సరిహద్దుల్లోకి మరిన్ని అదనపు బలగాలను పంపించరాదనే నిర్ణయంతోపాటు పలు కీలక అంశాల్లో ఏకాభిప్రాయం సాధించారు. సైన్యం, వైమానిక దళం ఉమ్మడి కార్యాచరణ తూర్పు లద్దాఖ్‌లో చైనా సైన్యం దూకుడును అడ్డుకోవాలని భారత సైన్యం నిర్ణయించింది. వైమానిక దళంతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని భావి స్తోంది. సరిహద్దులో చెలరేగిపోతున్న చైనా సైనికులకు తగిన గుణపాఠం నేర్పడానికి భారత సైన్యం, వైమానిక దళం సన్నద్ధమ వుతున్నాయి. త్రివిధ దళాలను ఎప్పటి కప్పుడు సమన్వయ పరుస్తూ ముందుకు నడిపించడానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సూచనలతోనే సైన్యం, వైమానిక దళం కలిసి పని చేయనున్నాయి. లేహ్ ఎయిర్ ఫీల్డ్‌లో ఇప్పటికే వైమానిక దళం యుద్ధ విమానాలను మోహరించింది. వాస్తవా« దీన రేఖ(ఎల్ఏసీ) వద్ద పరిస్థితి మరింత దిగజారితే వెంటనే ఉమ్మడిగా కొన్ని ఆపరేషన్లు చేపట్టడానికి సైన్యం, వైమానిక దళం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
సరిహద్దుల్లో క్షిపణుల మోహరింపు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, చైనాలు ఆధునిక ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేస్తున్నాయి. 2 వేల కి.మీల వరకు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను, భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులను జిన్జియాంగ్, టిబెట్ ప్రాంతాల్లో చైనా మోహరించింది. ప్రతిగా బ్రహ్మోస్, నిర్భయ్, భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల ఆకాశ్ క్షిపణులను భారత్ సిద్ధం చేసింది. బ్రహ్మోస్‌ది 500 కి.మీల రేంజ్ కాగా, నిర్భయ్‌ది 800 కి.మీ.ల రేంజ్. 40 కి.మీ.ల దూరంలోని శత్రు లక్ష్యాలను ఆకాశ్ ఛేదించగలదు. చైనా తన ఆయుధ వ్యవస్థలను ఆక్రమిత అక్సాయ్ చిన్ ప్రాంతంలోనే కాకుండా, వాస్తవాధీన రేఖ వెంట కస్ఘర్, హోటన్, లాసా, నింగ్చి.. తదితర ప్రాంతాల్లోనూ మోహరించింది. ఆకాశం నుంచి ఆకాశంలో ఉన్న లక్ష్యాలను, ఆకాశం నుంచి భూమిపైన ఉన్న లక్ష్యాలను ఛేదించగల అత్యంత శక్తివంత బ్రహ్మోస్ క్షిపణి 300 కి.మీ.ల వార్‌హెడ్‌ను మోసుకుని వెళ్లగలదు. టిబెట్, జిన్‌జియాంగ్‌ల్లోని చైనా వైమానిక స్థావరాలను బ్రహ్మోస్ క్షిపణి లక్ష్యంగా చేసుకోగలదు. లద్దాఖ్ ప్రాంతంలో ఈ క్షిపణులను అవసరమైనంత సంఖ్యలో భారత్ సిద్ధంగా ఉంచింది. ఎస్‌యూ30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. హిందూ మహా సముద్రంలోని కార్ నికోబార్ ద్వీపంలో ఉన్న భారత వైమానిక కేంద్రం నుంచి కూడా దీన్ని ప్రయోగించే వీలుంది. కార్‌నికోబార్‌లోని వైమానిక కేంద్రం నుంచి బ్రహ్మోస్, నిర్భయ్ క్షిపణులను ప్రయోగించి మలక్కా జలసంధి నుంచి లేదా సుందా జలసంధి నుంచి వచ్చే చైనా యుద్ధ నౌకలను సమర్ధంగా ఎదుర్కోవచ్చు. ప్రస్తుతం భారత్ వద్ద నిర్భయ్ క్షిపణుల సంఖ్య పరిమితంగా ఉంది. నిర్భయ్ క్షిపణి భూమిపై నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు. లద్దాఖ్ ప్రాంతంలో ఆకాశ్ క్షిపణులను కూడా అవసరమైన సంఖ్యలో భారత్ మోహరించింది. భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను చేధించే ఈ క్షిపణి వాస్తవాధీన రేఖ దాటి వచ్చే చైనా విమానాలను లక్ష్యంగా చేసుకోగలదు. ఆకాశ్ క్షిపణిలోని రాడార్ ఏకకాలంలో 64 లక్ష్యాలను గుర్తించగలదు. అందులో 12 లక్ష్యాలపై దాడి చేయగలదు. ఆకాశంలోనే శత్రుదేశ యుద్ధవిమానాలు, క్రూయిజ్ మిస్సైల్స్, బాలిస్టిక్ మిస్సైల్స్‌ను కూల్చివేయగలదు. ఈ మధ్యకాలంలో అక్సాయ్‌చిన్ ప్రాంతంలో చైనా వైమానిక దళ విమానాల కార్యకలాపాలు కొంత తగ్గాయి కానీ, కారాకోరం పాస్ దగ్గరలోని దౌలత్‌బేగ్ ఓల్డీ ప్రాంతంలో పెరిగాయి. రూ. 2,290 కోట్లతో రక్షణ కొనుగోళ్లు డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్‌ను ఆవిష్కరించిన రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాల కోసం రూ. 2,290 కోట్ల విలువైన ఆయుధాలు, ఇతర సాయుధ వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో అమెరికా నుంచి కొనుగోలు చేసే 72 వేల ఎస్ఐజీ సావర్ తుపాకులు ఉన్నాయి. ఆర్మీ కోసం వీటిని రూ. 780 కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రక్షణ శాఖకు చెందిన అత్యున్నత నిర్ణయ మండలి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సోమవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షతన సమావేశమై ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ రూ. 2,290 కోట్లలో రూ. 970 కోట్లతో నౌకాదళం, వైమానిక దళం కోసం ‘స్మార్ట్ ఎయిర్‌ఫీల్డ్ వెపన్(ఎస్ఏఏడబ్ల్యూ)’ వ్యవస్థలను కొనుగోలు చేయనున్నారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ క్షేత్రస్థాయి దళాల మధ్య అడ్డంకులు లేని సమాచార పంపిణీ కోసం రూ. 540 కోట్లతో హెచ్ఎఫ్ రేడియో సెట్స్‌ను సమకూర్చాలని నిర్ణయించారు. భారత్‌ను అంతర్జాతీయ మిలటరీ వ్యవస్థల తయారీ కేంద్రంగా మార్చడం, సాయుధ సామగ్రిని సమకూర్చుకోవడంలో అనవసర జాప్యాలను నివారించడం, అత్యవసర కొనుగోలు నిర్ణయాలను త్రివిధ దళాలే సులభమైన విధానం ద్వారా తీసుకునే అవకాశం కల్పించడం.. లక్ష్యాలుగా ‘డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్(డీఏపీ)’ని రాజ్‌నాథ్ ఆవిష్కరించారు. ఈ కొత్త విధానం ప్రకారం, భారత్‌లో ఉత్పత్తి చేసే సంస్థలకు డిఫెన్స్ కొనుగోళ్లలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆధునిక సమాచార సాంకేతికతల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలైన డీఆర్డీఓ, డీపీఎస్‌యూలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని డీఏపీని రూపొందించామని రాజ్‌నాథ్ చెప్పారు. -
చైనాకు బదులిచ్చేందుకు మిసైళ్లతో..
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చైనా ఆర్మీ నుంచి ఎదురయ్యే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికైనా భారత్ సమాయత్తమవుతోంది. పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్‌కు దీటుగా సమాధానమిచ్చేందుకు వీలుగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా యుద్ధ ట్యాంకులు, ఇతర సామగ్రిని ఇప్పటికే తరలించింది. అదే విధంగా.. జిన్జియాంగ్, టిబెట్ ప్రాంతంలో చైనా భారీ స్థాయిలో క్షిపణులు మోహరిస్తోందన్న వార్తల నేపథ్యంలో బ్రహ్మోస్, నిర్భయ్, ఆకాశ్ వంటి మిసైళ్లతో చెక్ పెట్టేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. చైనా గనుక హద్దు దాటితే వీటితో పాటు ఈ సూపర్ సోనిక్ నిర్భయ్‌ను రంగంలోకి దించేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. (చదవండి: ప్రతికూల వాతావ‘రణ’మైనా రెడీ!) ఇక ఎల్ఏసీ వెంబడి వివాదాస్పద ఆక్సాయ్ చిన్తో పాటు కష్గర్, హొటాన్, లాసా, నియాంగిచిల్ ప్రాంతాల్లో చైనా దుందుడుకుగా వ్యవహరిస్తున్న తరుణంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గాల్లో నుంచి గాల్లోకి, గాల్లో నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించగలిగే బ్రహ్మోస్ 500 కిలోమీటర్లు, 800 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల నిర్భయ్ క్రూయిజ్ మిసైల్ ద్వారా ప్రత్యర్థి దేశ ఆర్మీ పన్నాగాలను తిప్పికొట్టేందుకు సన్నద్ధమవుతోంది. తూర్పు లదాఖ్‌లో ఘర్షణ వాతావరణం, హిందూ మహాసముద్రంలో పీఎల్ఏ యుద్ధనౌకలు మోహరించిన వేళ, కార్ నికోబార్‌లోని ఐఏఎఫ్ ఎయిర్‌బేస్‌లో సు- 30 ఎమ్కేఐ యుద్ధ విమానాలను మోహరించి ఎయిర్- టూ- ఎయిర్ రిఫ్యూల్లర్స్(గాల్లోనే ఇంధనం నింపుకునేలా) ఉపయోగించి చురుగ్గా కదులుతూ ప్రత్యర్థులకు దీటుగా బదులిచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అదే విధంగా.. నిర్భయ్ వంటి సూపర్సోనిక్ మిస్సైళ్లలోని అంతర క్షిపణుల ద్వారా సుమారు 1000 కిలోమీటర్ల పరిధిలో గల లక్ష్యాలను చేరుకునేలా(100 మీటర్ల నుంచి 4 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరటం సహా టార్గెట్‌ను ఫిక్స్ చేసి సమర్థవంతంగా ఛేదించేలా) ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఒకేసారి 64 టార్గెట్లను ట్రాక్ చేసి, ఒకేసారి పన్నెండింటిపై విరుచకుపడగలిగే 3-డీ రాజేంద్ర రాడార్ కలిగి ఉన్న ఆకాశ్ క్షిపణిని ప్రయోగించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కాగా యుద్ధ విమానాలు, క్రూయిజ్ మిసైళ్లు, బాలిస్టిక్ మిసైళ్లను కూడా పేల్చేయగల సామర్థ్యం దీనిసొంతం. -
ఎల్ఏసీని గౌరవించాలి
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను చైనా గౌరవించాలని, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలు మానుకోవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చైనా రక్షణ మంత్రి వెయి ఫెంఘెకు స్పష్టంచేశారు. భారత్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు కట్టుబడి ఉందన్నారు. ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోవడానికి భారత్ సిద్ధంగా లేదని చెప్పారు. శుక్రవారం మాస్కోలో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు సందర్భంగా వీరిద్దరు రెండు గంటల 20 నిమిషాలపాటు భేటీ అయ్యారు. గత మేలో తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దులో ఉద్రిక్తత నెలకొన్న తర్వాత ఇరుదేశాల మధ్య జరిగిన ఉన్నతస్థాయి భేటీ ఇదే కావడం గమనార్హం. ఉభయులు సరిహద్దుతోపాటు, ఇరుదేశాల సంబంధాలపై నిర్మొహమాటంగా, లోతుగా చర్చించుకున్నారని విదేశాంగ శాఖ శనివారం తెలిపింది. సరిహద్దులో ప్రస్తుత పరిస్థితుల నిర్వహణలో బాధ్యతాయుతంగా మెలగాలని, అలజడి రేగేలా ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఉభయపక్షాలు నడుచుకోవాలని రాజ్‌నాథ్ చెప్పారు. ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా బలగాలు పెద్ద ఎత్తున కవ్వింపు చర్యలకు దిగి ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించాయని రాజ్‌నాథ్.. ఫెంఘె దృష్టికి తీసుకెళ్లారు. ఉభయ దేశాలు దౌత్య, మిలిటరీ మార్గాల ద్వారా చర్చలను కొనసాగించాలని, వీలైనంత త్వరగా బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. శాంతిని పునరుద్ధరించేలా ఇరు దేశాధినేతల ఏకాభిప్రాయం మేరకు నడుచుకోవడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం అవుతాయని, దీనివల్ల విభేదాలు వివాదాలుగా మారకుండా ఉంటాయన్నారు. ఎల్ఏసీ వెంబడి గల్వాన్ లోయలో గత కొద్ది నెలలుగా చేస్తున్న అభివృద్ధి పనుల గురించి రాజ్‌నాథ్ చర్చల సందర్భంగా సూత్రప్రాయంగా చెప్పారు. సరిహద్దులో భారత బలగాలు వివాదాలకు తావీయకుండా ఎల్లప్పుడు ఎంతో బాధ్యతాయుతంగా మెలుగుతున్నాయని, అదే సమయంలో భారత సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ పడబోమని తేల్చిచెప్పారు. చైనా అడిగిన అన్ని అంశాలకు రాజ్‌నాథ్ బదులిచ్చారని, వారు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. రెచ్చగొట్టే చర్యలొద్దు: చైనా వివాదం శాంతియుతంగా పరిష్కారం కావాలని తాము కూడా కోరుకుంటున్నట్లు చైనా మంత్రి ఫెంఘె రాజ్‌నాథ్‌కు చెప్పారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ద్వైపాక్షిక ఒప్పందాలను కచ్చితంగా అమలు చేయాలని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని పేర్కొన్నట్లు చెప్పింది. ఉద్రిక్త నివారణకు కలిసి పనిచేయాలని, సంబంధాల పురోగతిపై దృష్టి పెట్టాలని ఫెంఘె చెప్పారంది. వివాదానికి కారణం భారతేనని, చైనా భూభాగాన్ని అంగుళం కూడా వదులుకోబోమని ఫెంఘె చెప్పారంటూ చైనా ఒక ప్రకటన విడుదల చేసి తన వక్రబుద్ధి చాటుకుంది. ఉద్రిక్తత నివారణకు సాయం చేస్తా: ట్రంప్ వాషింగ్టన్: భారత్–చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అక్కడి పరిస్థితి ‘చాలా అసహ్యంగా’ ఉందని అభివర్ణించారు. చైనా చాలా దూకుడుగా వ్యవహరిస్తోందని, అవసరమైతే వివాద పరిష్కారానికి సాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ట్రంప్ శుక్రవారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిపై భారత్, చైనాలతో మాట్లాడుతున్నానని పునరుద్ఘాటించారు. భారత్, చైనా రక్షణ మంత్రుల భేటీ సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
చైనా ఆర్మీకి దీటుగా బదులిస్తున్న భారత సైన్యం
సాక్షి, న్యూఢిల్లీ: సరిహద్దుల్లో తరచుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా ఆర్మీకి భారత సైన్యం దీటుగా జవాబిస్తోంది. తూర్పు లదాఖ్‌లో దూకుడుగా ముందుకు సాగుతున్న జవాన్లు... ప్యాంగ్యాంగ్ సో సరస్సు దక్షిణ భాగాన కీలక శిఖరాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న డ్రాగన్ సైనికులకు సరైన సమాధానం ఇవ్వాలని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో భారత ఆర్మీ ఈ మేరకు ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు భారీ ఎత్తున సైనిక బలగాలు, యుద్ధ ట్యాంకులను మోహరించాయి. దీంతో భారత్- చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. (చదవండి: సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం: చైనా) కాగా ప్యాంగ్యాంగ్ సరస్సు వద్ద యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఒప్పందానికి తూట్లు పొడుస్తూ చైనా మిలిటరీ సోమవారం దుస్సాహసానికి దిగిన విషయం తెలిసిందే. ఇందుకు దీటుగా బదులిచ్చిన భారత సైన్యం.. డ్రాగన్ సైనికుల కుయుక్తులను తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఇరు దేశాలు మరో దఫా సైనిక చర్చలు చేపట్టాయి. సరిహద్దులో భారత్ వైపున్న చుషుల్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు బ్రిగేడ్ కమాండర్ స్థాయి అధికారులు చర్చలు ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. (చదవండి: భారత్, చైనా మిలటరీ చర్చలు) -
దేనికైనా సిద్ధం!
-
ఎల్ఏసీలో సంసిద్ధంగా వైమానిక దళం
న్యూఢిల్లీ: తూర్పులద్దాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంట చైనా సైనిక సంపత్తిని తరలించడంతో భారత్ దీటుగా చర్యలు తీసుకుంటోంది. అమెరికా, రష్యా తయారీ యుద్ధ, రవాణా విమానాలను ఈ ప్రాంతంలో వాడుతోంది. కీలకప్రాంతాల్లో నిఘా విధులతోపాటు ఫార్వర్డ్ పోస్టులకు జవాన్లను, ఇతర ముఖ్యమైన పరికరాలు, సామగ్రిని ఇవి తరలిస్తున్నాయి. రష్యా తయారీ అత్యాధునిక సుఖోయ్–30 ఎంకేఐలు, ఎంఐజీ–29 యుద్ధ విమానాలు ఇప్పటికే గగనతలంలో పహారాకాస్తున్నాయి. సరిహద్దులకు సమీపంలోని ఈ వైమానిక కేంద్రంలో అమెరికా తయారీ రవాణా వాహనాలు సీ–17, సీ–130జేతోపాటు రష్యా తయారీ ఇల్యుషిన్–76, ఆంటొనొవ్–32లు కూడా ఇక్కడ మోహరించారు. తూర్పు లద్దాఖ్ సెక్టార్లో యుద్ధ విధుల కోసమే ప్రత్యేకించిన అపాచీ యుద్ధ విమానాలను వినియోగించుకుంటున్నారు. ఆర్మీ, ఐటీబీపీ బలగాలను సరిహద్దుల సమీపంలోకి తరలించేందుకు చినూక్, ఎంఐ–17వీఐ హెలికాప్టర్లను రంగంలోకి దించారు. మొత్తమ్మీద ఈ ఎయిర్ బేస్ విమానాల రాకపోకలతో సందడిగా మారింది. ‘ఈ ప్రాంతంలో ఈ ఎయిర్ బేస్ చాలా కీలకమైంది. యుద్ధ విధులతోపాటు, ఇతర అవసరాలకు కూడా ఇక్కడి నుంచే సరఫరాలు అందుతుంటాయి. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది’ ఓ అధికారి అన్నారు. -
వేగంగా బలగాలు వెనక్కి
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మక సరిహద్దు ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించడానికి సంబంధించి జూన్ 6న ఇరుదేశాల సైన్యాధికారుల మధ్య కుదిరిన ఒప్పందాల అమలును వేగవంతం చేయాలని భారత్, చైనా నిర్ణయించాయి. తద్వారా సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొంటాయని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను రెండు దేశాలు విధిగా గౌరవించాలని నిర్ణయించినట్లు తెలిపింది. భారత్, చైనా బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి దౌత్య చర్చలు జరిపాయి. ఈ చర్చల్లో భారత్ తరఫు విదేశాంగ శాఖలోని తూర్పు ఆసియా వ్యవహారాల సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాస్తవ, చైనా తరఫున ఆ దేశ విదేశాంగ శాఖలోని డైరెక్టర్ జనరల్ వూ జియాంఘావో పాల్గొన్నారు. దౌత్య, మిలటరీ మార్గాల్లో సంప్రదింపులను కొనసాగించాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ చర్చల్లో తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో పరిస్థితిని విపులంగా చర్చించారని, గల్వాన్ లోయలో జూన్ 15న జరిగిన హింసాత్మక ఘర్షణల విషయమై భారత్, చైనాను నిలదీసిందని వెల్లడించింది. అయితే, ఒక వైపు చర్చలు సాగిస్తూనే, మరోవైపు, తూర్పు లద్దాఖ్‌తో పాటు సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లోని ఎల్ఏసీ వెంబడి ఉన్న కీలక ప్రాంతాలకు మరిన్ని బలగాలకు చైనా పంపిస్తుండటం గమనార్హం. చైనా నోట మళ్లీ అదే మాట.. గల్వాన్‌లో ఇరుదేశాల సైనికులు మృతి చెందడానికి భారత్‌దే బాధ్యత అని చైనా మరోసారి వ్యాఖ్యానించింది. చైనా రక్షణ, విదేశాంగ శాఖల అధికారులు బుధవారం వేర్వేరుగా ఇదే విషయాన్ని వక్కాణించారు. భారత్, చైనాలు ముఖ్యమైన పొరుగు దేశాలని, ప్రస్తుత సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రెండు దేశాలు కృషి చేయాలని రక్షణ శాఖ అధికార ప్రతినిధి వూ క్వియాన్ పేర్కొన్నారు. జూన్ 15 నాటి గల్వాన్ లోయ ఘర్షణకు భారత దేశమే కారణమని, భారత సైనికులు రెచ్చగొట్టడం వల్లనే ఆ ఘర్షణలు జరిగాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ అన్నారు. భారత విదేశాంగ శాఖ, భారత మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడంపై మీడియా ప్రశ్నించగా.. తాను వాస్తవాలు చెబుతున్నానన్నారు. ఆర్మీ చీఫ్ పర్యటన తూర్పు లద్దాఖ్‌లోని చైనా సరిహద్దుకు సమీపంగా ఉన్న సైనిక కేంద్రాలను ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె బుధవారం సందర్శించారు. చైనాతో ఇటీవలి ఘర్షణల సమయంలో అత్యంత ధైర్య సాహసాలు చూపిన ఐదుగురు సైనికులకు ప్రశంసాపూర్వక బ్యాడ్జెస్‌ను అందించారు. లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో సైనిక బలగాల సన్నద్ధతను వరుసగా రెండోరోజు జనరల్ నరవణె పరిశీలించారు. ఫార్వర్డ్ పోస్ట్‌ల్లో విధుల్లో ఉన్న సైనికులతో మాట్లాడారు. ఆర్మీ చీఫ్‌కు 14 కార్ప్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హరీందర్ సింగ్, నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ యోగేశ్ కుమార్ జోషి క్షేత్రస్థాయిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను వివరించారు. -
తాజా ఫొటోలు: చైనా పన్నాగాలు బట్టబయలు!
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని అన్ని వివాదాస్పద, ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి బలగాలను ఉపసంహరించాలని ఇరు దేశాలు ఏకాభిప్రాయానికొచ్చిన మరునాడే చైనా పన్నాగాలు బయటపడ్డాయి. ఒకవైపు రెండు దేశాల లెఫ్ట్‌నెంట్ జనరల్ స్థాయి అధికారుల చర్చలు జరుగుతుండగానే డ్రాగన్ దేశం ఉద్రిక్త ప్రాంతంలో పనులు కొనసాగించింది. తాజాగా విడుదలైన హై రిజల్యూషన్ ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో గల్వాన్ నది వద్ద వాస్తవాధీన రేఖకు ఇరువైపులా చైనా పలు రక్షనాత్మక నిర్మాణాలు చేపట్టినట్టు వెల్లడైంది. భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న ప్యాట్రోల్ పాయింట్ 14 వద్ద చైనా బలగాలకు వసతి గృహాలు, గల్వాన్ నదిపై కల్వర్టు చేపట్టినట్టు తెలుస్తోంది. జూన్ 22కు సంబంధిచిన ఈ ఉపగ్రహ చిత్రాలను మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసింది. వీటి ప్రకారం ప్యాట్రోల్ పాయింట్ 14 వద్ద మే 22న ఒక్క టెంట్ మాత్రమే ఉండగా.. తాజాగా వెలువడ్డ చిత్రాలు చైనా రక్షణాత్మక స్థానాలను చూపుతున్నాయి. (చదవండి: బాయ్ కాట్ చైనా : సీఏఐటీ మరో అడుగు) దాంతో పాటు గల్వాన్ నది వద్ద రోడ్డు వెడల్పు పనులనూ చైనా చేపట్టినట్టు తెలుస్తోంది. అంతకుముందు విడుదలైన ఛాయాచిత్రాల్లో అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు. ఒక టెంట్ మాత్రమే ఉంది. కాగా, చైనా ఆకస్మిక దాడికి చేసేందుకే వాస్తవాధీన రేఖ వెంబడి రక్షణాత్మక నిర్మాణాలు చేపట్టి ఉండొచ్చని రిటైర్డ్ ఆర్మీ మేజర్ జనరల్ రమేశ్ పాధి అనుమానం వ్యక్తం చేశారు. బలగాలను మోహరించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఇక జూన్ 15 రాత్రి జరిగన ఘర్షణల్లో కల్నల్ సంతోష్‌బాబు సహా 20 మంది భారత సైనికులు అమరలైన సంగతి తెలిసిందే. ఇక తమ వైపు నుంచి ఒక కమాండర్ మృతి చెందినట్టు చైనా అంగీకరించినట్టు తెలిసింది. 45 మంది సైనికులు కూడ మరణించినట్టు అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. (చదవండి: బలగాల ఉపసంహరణ) -
గాల్వన్ లోయను చైనాకు వదిలేశారా?
ముంబై: లద్ధాఖ్లోని గాల్వన్ లోయ ప్రాంతంపై సర్వ అధికారాలు తమకే చెందుతాయన్న చైనా ప్రకటనపై కేంద్రం స్పందించాలని శివసేన ఉపాధ్యక్షురాలు, ఎంపీ ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు. సరిహద్దుల్లో శాంతి నెలకొనేలా చర్యలకు సిద్ధమంటూనే చైనా పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మన భూభాగంలోకి ఎవరూ రాలేదని మోదీ దేశానికి హామీ ఇచ్చారు. కానీ గాల్వన్ లోయ తమదిగా చైనా చెప్పుకుంటోంది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. మాకు కొన్ని అనుమానాలున్నాయి. గాల్వన్ లోయను మనం విడిచిపెట్టామా లేదా అక్కడి నుంచి చైనా సైన్యాన్ని వెళ్లగొట్టారా? దేశ ప్రజలందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు’ అంటూ చతుర్వేది ట్వీట్ చేశారు. (మరి మన జవాన్లు ఎక్కడ గాయపడ్డారు: చిదంబరం) Yesterday PM Modi assured the nation that no posts/territory have been ceded to China, but here China claims Galwan Valley as theirs. This is unacceptable& GoI needs to clarify or respond to this. Have we ceded our Galwan Valley or ousted the PLA from there? Nation needs to know. pic.twitter.com/FhVH4vvW4j — Priyanka Chaturvedi (@priyankac19) June 20, 2020 జూన్ 15న లద్ధాఖ్‌లో గాల్వన్ లోయలో సరిహద్దు వివాదంలో తలెత్తిన ఘర్షణలో భారత్‌కు చెందిన కల్నల్ సహా 20 మంది సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. వాస్తవాధీన రేఖ (ఎల్ఓసీ)కు అటు (చైనా) వైపే కార్యకలాపాలు కొనసాగించుకోవాలని శుక్రవారం చైనాకు భారత్ స్పష్టం చేసింది. మన భూభాగంలోకి ఎవరూ రాలేదని, సరిహద్దు క్షేమమని, మన ఆర్మీ పోస్టులను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఒక్క అడుగు కూడా మన భూభాగాన్ని వదులుకునేది లేదని శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీ నేతలతో మోదీ అన్నారు. (రాహుల్-అమిత్ షా మధ్య ట్విటర్ వార్ ) -
గల్వాన్ లోయ మాదే : చైనా
బీజింగ్ : భారత భూభాగంలోకి ఎవరూ రాలేదని, మన ఆర్మీ పోస్ట్‌లను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జరిగిన అఖిలపక్ష భేటీలో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై చైనా విదేశాంగ శాఖ స్పందిస్తూ మరోసారి తమ అక్కసు వెళ్లగక్కింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్కు ఘర్షణ తలెత్తిన గల్వాన్ లోయ ప్రాంతం వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఐసి) చైనా వైపు ఉందని అది మాదేనని ఆయన పేర్కొన్నారు. భారత బలగాలే తమ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడి ఏకపక్ష నిర్ణయాలతో రోడ్లు, వంతెనలతో పాటు ఇతర సౌకర్యాలను నిర్మిస్తుందంటూ విషం వెళ్లగక్కారు. (ఆ హక్కు చైనాకు లేదు : యూఎస్) 'చాలా సంవత్సరాలుగా చైనా సరిహద్దు దళాలు ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్నాయి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి భారత సరిహద్దు దళాలు గల్వాన్ లోయలోని ఎల్ఏసి వద్ద తమను సంప్రదించకుండానే ఏకపక్షంగా రోడ్లు, వంతెనలు, ఇతర సౌకర్యాలను నిర్మించింది. చైనా అనేక సందర్భాల్లో వీటిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. కానీ భారత్ అవేవి పట్టించుకోకుండా తమ ఆధీనంలోని ఎల్ఏసీని దాటి మమల్ని కావాలనే రెచ్చగొడుతుంది' అని చైనా విదేశాంగ శాఖ తమ ప్రకటనలో పేర్కొంది.('చైనా దురాక్రమణకు మోదీ లొంగిపోయారు') -
చైనా సైనిక మరణాలపై అంతా గందరగోళం
సాక్షి, న్యూఢిల్లీ : చైనా, భారత దేశాల వాస్తవాధీన రేఖ వద్ద జూన్ 15వ తేదీన ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన సంఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించారని భారత సైనిక వర్గాలు, ప్రభుత్వం ధ్రువీకరించింది. చైనా వైపు ఎంత మంది మరణించారన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ఘర్షణలో ఐదుగురు చైనా సైనికులు మరణించారని, 11 మంది సైనికులు గాయపడ్డారంటూ తొలుత కొన్ని మీడియా సంస్థలు, కొందరు జర్నలిస్టులు వార్తలను ప్రసారం చేశారు. ఆ సంఖ్యను ఎవరూ ధ్రువీకరించలేదు. ఆ తర్వాత 43 మంది చైనా సైనికులు మరణించారంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రకటించాయి. భారత ప్రభుత్వం కూడా ఆ సంఖ్యనే చెబుతూ వస్తోంది. చైనా ప్రభుత్వంగానీ, సైనిక వర్గాలుగా ఎంత మంది మర ణించారన్న విషయాన్ని ఇంతవరకు చూచాయిగా కూడా వెల్లడించలేదు. ‘టైమ్స్ నౌ’ టెలివిజన్ ఛానల్ జూన్ 17వ తేదీన ‘బ్రేకింగ్ న్యూస్’ పేరిట ‘30 మంది తమ సైనికులు మరణించారన్న విషయన్ని చైనా అంగీకరించింది, ఇదిగో వారి జాబితా’ అంటూ పేర్లను చదివింది. ‘చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్’ కథనం ప్రకారం అంటూ టైమ్స్ నౌ టీవీ యాంకర్లు రాహుల్ శివశంకర్, నావికా కుమార్‌లు 30 పేర్లను చదివారు. ఎందుకైన మంచిదనుకున్నారేమో! ‘గ్లోబల్ టైమ్స్ వెల్లడించిన జాబితా కూడా నకిలీది కావొచ్చు’ అంటూ రాహుల్ శివశంకర్ ఓ నొక్కు నొక్కారు. 30 మంది మరణించరంటూ మొదట ట్వీట్లు చేసిన టైమ్స్ నౌ ఆ తర్వాత వాటిని తొలగించింది. (చైనా చెర నుంచి సైనికులు విడుదల..!) చైనా సరిహద్దు వ్యవహారాలను పర్యవేక్షించే ‘వెస్టర్న్ థియేటర్ కమాండ్’ అధికార ప్రతినిధి కథనం ప్రకారం 30 మంది చైనా సైనికులు మరణించరంటూ ఫేస్బుక్, ట్విటర్లో కూడా 30 పేర్లు విరివిగా వైరల్ అయ్యాయి. ఆ పేర్లు, టైమ్స్ నౌ వెల్లడించిన పేర్ల జాబితా ఒకటే. వాస్తవానికి చైనాకు చెందిన గ్లోబల్స్ టైమ్స్, వెబ్సైట్స్లోగానీ, ట్విటర్లోగానీ చైనాకు చెందిన మృతుల గురించి ఎలాంటి వార్తను ప్రచురించలేదు. ఈ విషయాన్ని నకిలీ వార్తలను వెతికి పట్టుకొనే ‘ఆల్ట్ న్యూస్’ కూడా ధ్రువీకరించింది. గతంలో కూడా చైనా గ్లోబల్ టైమ్స్ పేరిట పలు నకిలీ వార్తలు ప్రసారమైనట్లు వెల్లడించింది. (బయటపడ్డ చైనా కుట్ర.. తాజా ఫొటోలు!) -
76 మంది జవాన్లకు గాయాలు : భారత ఆర్మీ
ఢిల్లీ : లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 76 మంది భారతీయ జవాన్లు గాయపడ్డారని భారత ఆర్మీ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలోనే విధుల్లో చేరుతారని వెల్లడించారు. గాయపడినవారిలో 18 మంది లేహ్‌లోని దవాఖానలో చికిత్స పొందుతున్నారని, వారు 15 రోజుల్లో డ్యూటీలో చేరే అవకాశం ఉందన్నారు. కాగా మిగిలిన 56 మంది వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారని, వారంతా రెండు వారాల్లో తిరిగి విధులకు హాజరవుతారని పేర్కొన్నారు. (నేపాల్ కొత్త మ్యాప్‌కు చట్టబద్ధత) సోమవారం(జూన్ 15) అర్థరాత్రి తర్వాత గాల్వన్ లోయలోని పెట్రోల్ పాయింట్ 14 వద్ద భారత బలగాలపై చైనా సైనికులు రాళ్లు, ఇనుప రాడ్లు, కట్టెలతో విక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఇందులో కల్నల్ సంతోష్‌బాబు సహా 20 మంది భారతీయ సైనికులు మృతిచెందారు. ఈ ఘర్షణలో చైనాకు చెందిన సైనికులు సుమారు 45 మంది చనిపోయి ఉండవచ్చని భారత ఆర్మీ ప్రకటించింది. అయితే మృతుల సంఖ్యను చైనా అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదన్న సంగతి తెలిసిందే. అయితే భారత ఆర్మీకి చెందిన కొందరు జవాన్లు చైనా కస్టడీలో ఉన్నారంటూ కొన్ని పత్రికలు వార్తలు ప్రచురించడంపై ఆర్మీ స్పందించింది. ' ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది సైనికులు మరణించారు. భారత బలగాల్లో ఎవరు కూడా చైనా కస్టడీలో లేరు. అనవసరంగా తప్పుడు కథనాలు రాయొద్దు' అంటూ తెలిపారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌కు ఫోన్ చేసిన సందర్భంగా గాల్వన్ లోయ ఘర్షణ ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని భారత్ చైనాకు స్పష్టం చేసింది. ఈ ఘర్షణకు, సైనికుల మరణాలకు కారణం చైనా వ్యవహరించిన తీరేనని పేర్కొంది. క్షేత్రస్థాయిలో మార్పులు చేయాలన్న ముందస్తు ఆలోచనతో చైనా వ్యవహరించిందని, ఇది గతంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు వ్యతిరేకమని తేల్చి చెప్పింది. (బుల్డోజర్లతో నదీ ప్రవాహం మళ్లింపు!) -
భారత జవాన్లను నిర్బంధించిన చైనా, ఆపై
న్యూఢిల్లీ: భారత్ చైనా సరిహద్దు వద్ద కొంతకాలంగా ఘర్షణలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈక్రమంలో లడఖ్‌లో సరిహద్దు వద్ద గస్తీ కాస్తున్న భారత జవాన్లను చైనా ఆర్మీ దళాలు నిర్బంధించి విడుదల చేసినట్లు సమాచారం. ప్యాంగ్యాంగ్ వద్ద చోటు చేసుకుంటున్న ఘర్షణలు మొదలుకొని సరిహద్దు వద్ద తలెత్తిన పరిస్థితుల గురించి ఆర్మీ అధికారులు సవివరంగా ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీని ప్రకారం.. ఆర్మీ అధికారులు ప్రధానమంత్రి ఆఫీసుకు వివరించారు. గత బుధవారం తూర్పు లఢక్‌లోని ప్యాంగ్యాంగ్ సరస్సు తీరం వెంబడి భారత్, చైనా దళాల మధ్య ఘర్షణలు చెలరేగగా పరస్పరం రాళ్లు విసురుకున్నారు. ఈ సమయంలో చైనా.. భారత జవాన్లను వారి ఆయుధాలతో సహా లాక్కుని నిర్బంధించింది. అనంతరం వారిని వదిలేసింది. విషయం తెలుసుకున్న ఇరు దేశాల ఆర్మీ కమాండర్లు సరిహద్దు వద్ద సమావేశమవడంతో పరిస్థితి సద్దుమణిగింది. (‘చైనా హెలికాప్టర్ చొరబాటుకు యత్నించింది’) ఆ తర్వాత కూడా సరిహద్దు వద్ద గగనతలంలో చైనా హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. మరోవైపు చైనా దళాలు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చి తూర్పు లడఖ్‌లోని మూడు ప్రాంతాలైన ప్యాంగాంగ్, డెమ్చోక్, గల్వాన్‌లో పెద్ద సంఖ్యలో కోటలు, బోట్లు, గుడారాలు ఏర్పాటు చేశాయి. అయితే ప్రస్తుతం వాటిని చైనా తొలగించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అటు చైనాతోపాటు ఇటు భారత్ కూడా సరిహద్దులో అదనపు బలాలను మెహరించింది. ఇదిలా వుండగా వాస్తవాధీణ రేఖ వెంబడి గస్తీ కాస్తున్న భారత దళాల పెట్రోలింగ్‌కు చైనా ఆటంకం కలిగించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం వాస్తవాధీణ రేఖకు లోపలే ఆర్మీ కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపింది. కాగా గల్వాన్‌లో భారత్ చేపట్టిన రహదారి నిర్మాణంపై చైనా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఘర్షణలకు దిగుతోందని అధికారులు భావిస్తున్నారు. కాగా పరిస్థితులును పర్యవేక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్ ఎమ్ నరవనె శుక్రవారం లేహ్‌ను సందర్శించారు. (భారత్ పహారాకు చైనా ఆటంకం) -
సరిహద్దులో చైనా ఆగడాలు
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వద్ద భారత పెట్రోలింగ్‌కు చైనా ఆటంకం కలిగిస్తోందని భారత విదేశాంగ శాఖ అసహనం వ్యక్తం చేసింది. భారత సైనిక కార్యకలాపాలు వాస్తవాధీన రేఖకు లోపలే ఉన్నాయని వెల్లడించింది. భారత దళాలు సిక్కింలో ఎల్ఏసీని దాటలేదని స్పష్టం చేసింది. సరిహద్దు వెంట శాంతి భద్రతలకు భారత్ కట్టుబడి ఉందని తెలిపింది. కానీ తమ రక్షక దళాల భద్రత విషయంలో రాజీపడబోమని దీటుగా జవాబిచ్చింది. కాగా భారత్ సరిహద్దుల్లో చైనా ఇటీవల కవ్వింపు చర్యలకు దిగడంతో భారత సైన్యం అప్రమత్తమైన సంగతి తెలిసిందే. (డ్రాగన్ దూకుడుపై అమెరికా ఫైర్) గాల్వన్ నది దగ్గర చైనా గుడారాలు వేసిందని నివేదికలు వచ్చిన తర్వాత భారత్ ఆ ప్రాంతంలో అధిక సంఖ్యలో దళాలను మొహరించింది. మరోవైపు గత నెలలో ఉత్తర సిక్కిం, లడఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సరస్సు తీరం వెంబడి భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగగా పరస్పరం రాళ్లు విసురుకున్నారు. మరోసారి సరిహద్దులో చైనా హెలికాప్టర్లు గగనతలంలో కనిపించడంతో భారత్ సైతం సుఖోయ్-30 విమానాలను మొహరించింది. చైనా దుందుడుకు చర్యలపై అమెరికా సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. (‘చైనా హెలికాప్టర్ చొరబాటుకు యత్నించింది’) -
డ్రాగన్ దూకుడు ఇందుకే..
శ్రీనగర్ : నియంత్రణ రేఖ వెంబడి పాక్ యుద్ధ విమానాల పెట్రోలింగ్ నేపథ్యంలో భారత్ విషయంలో చైనా సైతం కవ్వింపు చర్యలకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. లడఖ్‌లో నియంత్రణ రేఖ వెంబడి చైనా యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చర్యతో భారత సైన్యం అప్రమత్తమైంది. చైనా యుద్ధ విమానాల పెట్రోలింగ్‌తో భారత వాయుసేన పెద్దసంఖ్యలో యుద్ధ విమానాలను లడఖ్‌లో మోహరించింది. కాగా కోవిడ్-19 మూలాలపై ప్రపంచ దేశాలు చైనా వైపు సందేహంగా చూడటంతో పాటు పలు బహుళజాతి కంపెనీలు బీజింగ్ నుంచి భారత్‌కు తమ కార్యకలాపాలను తరలించాలని యోచిస్తుండటంతో అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై ఒత్తిడి పెరిగింది. చైనాను చుట్టుముడుతున్న ఒత్తిళ్లతోనే డ్రాగన్ ఆర్మీ అసహనంతో దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన యుద్ధ నౌకలు దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద జలాల్లోకి ప్రవేశించాయని భద్రతా దళాలు భావిస్తున్నాయి. చదవండి : వూహాన్ జనాభా మొత్తానికి కరోనా టెస్టులు -
ఒంటెలతో సరిహద్దు పహారా!
సాక్షి, చండీగఢ్ : లడఖ్‌లోని నియంత్రణ రేఖ వద్ద చొరబాట్లను అరికట్టేందుకు భారత్ మరో వ్యూహాత్మక ప్రయోగానికి తెరతీస్తోంది. లడఖ్ నియంత్రణ రేఖనుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడే ప్రయత్నాలు గతంలో అధికంగా జరిగాయి. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ.. ఆ ప్రాంతంలో ఒంటెలను గస్తీ కోసం ఉపయోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సరిహద్దుల్లో పహారాతో పాటూ, సైనికులకు ఆయుధాలు, ఇతర నిత్యావసర వస్తువుల రవాణాకు ఈ ఒంటెలను ఆర్మీ ఉపయోగించుకోవాలని యోచన చేస్తోంది. ప్రయోగాత్మక దశలో రెండు మూపురాలున్న ఒంటెలను ఇందుకు వినియోగించుకోవాలని ఆర్మీ నిర్ణయం తీసుకుంది. రెండు మూపురాలున్న ఒంటెలు అలవోకగా 180 నుంచి 200 కిలోల బరువును మోసుకెళ్లగలవు. అంతేకాక ఇవి రెండుగంటల వ్యవధిలో 10 నుంచి 15 కిలోమీటర్ల దూరాన్ని అనాయాసంగా ప్రయాణించగలవు. ప్రస్తుతం మన సైన్యం కంచరగాడిదలు, గుర్రాలను ఉపయోగించుకుంటోంది. ఈ ప్రణాళిక విజయవంతమైతే సైన్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మిగిలిన జంతువులకన్నా.. రెండు మూపురాలున్న ఒంటెలు ఎడారిలో అత్యంత వేగంగా ప్రయాణించగలవు. ఇదిలావుండగా.. రెండు మూపురాలు ఉండే ఒంటెలు లడఖ్‌లోని నూబ్రా లోయలో మాత్రమే కనిపిస్తాయి. ప్రయోగాత్మక ప్రాజెక్టు సఫలమైతే ఒకే మూపురంగల ఒంటెలకు కూడా సైన్య శిక్షణ ఇస్తుందని తెలుస్తోంది. అంతేకాక సైన్యంలోని వివిధ అవసరాలకు ఒంటెలను వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. -
సరిహద్దుల్లో సాయుధ మిలిటెంట్లు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌ను ముంచెత్తిన భారీ వరదలను ఆసరాగా చేసుకుని దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారని భారత సైన్యం వెల్లడించింది. వాస్తవాధీన రేఖ(ఎల్వోసీ) వెంబడి దేశంలోకి చొరబడేందుకు మిలిటెంట్లు చేసిన ప్రయత్నాలను సమర్థంగా తిప్పికొట్టినట్టు తెలిపింది. కాశ్మీర్‌లోకి ప్రవేశించేందుకు 200 మంది సాయుధ మిలిటెంట్లు సరిహద్దుల వద్ద తిష్ట వేశారని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. వరదలను అదనుగా చేసుకుని సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాల నుంచి దేశంలోకి ప్రవేశించేందుకు వీరు ప్రయత్నిస్తున్నారని, అయితే ఉగ్రవాదుల ప్రయత్నాలను సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని చెప్పారు. జవాన్ల కాల్పుల్లో ఐదుగురు చొరబాటుదార్లు హతమయ్యారన్నారు. -
మళ్లీ భారత భూభాగంలోకి చైనా చొరబాట్లు
న్యూఢిల్లీ: ఈశాన్య లడఖ్‌లోని చుమర్ ప్రాంతంలోని భారత భూభాగం నుంచి వెనక్కు వెళ్లి రెండు రోజులైనా గడవకముందే.. చైనా సైనికులు మరోసారి భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చారు. 50 మంది చైనా సైనికులు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను దాటి.. దగ్గర్లోని ఒక పర్వతంపైకి చేరారని శనివారం అధికార వర్గాలు వెల్లడించాయి. 35 మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) బలగాలు శుక్రవారం భారత భూభాగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే మరో 300 మంది సైనికులు ఎల్ఏసీకి దగ్గరలో కనిపిస్తున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. దాంతో భారత సైనికులు కూడా ఆ ప్రాంతంలో మోహరించడం ప్రారంభించారు. లడఖ్ ప్రాంతానికి చెందిన చివరి గ్రామం చుమర్. ఇది హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉంది. ఆ ప్రాంతం తమదేనని చాన్నాళ్లుగా చైనా వాదిస్తూ.. తరచుగా చొరబాట్లకు పాల్పడుతూ వస్తోంది. అయితే భారత పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్‌తో సైనికుల చొరబాటు అంశాన్ని భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తావించారు.దాంతో దాదాపు ఎనిమిది రోజుల తర్వాత వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు చాలావరకు సడలిపోయాయని భావిస్తున్న తరుణంలో చైనా బలగాలు మళ్లీ భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు యత్నాలు ఆరంభించాయి. -
వెనుదిరిగిన చైనా సైన్యం.. మోడీ ఎఫెక్ట్?
ఇన్నాళ్లుగా లడఖ్ ప్రాంతంలో భారత సరిహద్దు దళాలకు కంటిమీద కునుకు లేకుండా పదే పదే కవ్విస్తూ, చొరబాట్లకు పాల్పడుతున్న చైనా సైన్యం.. వెనకడుగు వేసింది. గురువారం నుంచి ఆ ప్రాంతంలో చైనా బలగాలు వెనక్కి వెళ్లడం మొదలుపెట్టాయి. ఇదంతా చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్‌తో భారత ప్రధాని నరేంద్రమోడీ చర్చించిన తర్వాతే జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు తెరదించాల్సిందేనని, అసలు అక్కడి విషయం ఏంటో త్వరగా తేల్చాల్సిందేనని మోడీ కుండ బద్దలుకొట్టినట్లు చెప్పడం ఇందుకు ఉపయోగపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఇలాంటి ఉద్రిక్తతలు ఉండటం తన పర్యటన మీద కూడా దుష్ప్రభావం చూపిస్తుందని జింగ్ పింగ్ సైతం ఇదే సందర్భంలో మోడీతో చెప్పారట. దాంతో దాదాపు ఎనిమిది రోజుల తర్వాత వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు చాలావరకు సడలిపోయాయి. ఇంతకాలం చైనాతో ఈ సమస్య గురించి ప్రస్తావించడానికే మన దేశం ముందు, వెనక ఆడేది. కానీ ఒక్కసారిగా దౌత్య సంబంధాల విషయంలో ప్రభుత్వం తీరు మారిపోవడం ఇప్పుడు ఉపయోగపడింది. ఎన్నాళ్లనుంచో చైనాతో సరిహద్దు సమస్య నలుగుతున్నా, ఇప్పటికి దానికి ఒక పరిష్కార మార్గం లభించినట్లయింది.