బీజింగ్ : భారత భూభాగంలోకి ఎవరూ రాలేదని, మన ఆర్మీ పోస్ట్‌లను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జరిగిన అఖిలపక్ష భేటీలో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై చైనా విదేశాంగ శాఖ స్పందిస్తూ మరోసారి తమ అక్కసు వెళ్లగక్కింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్‌కు ఘర్షణ తలెత్తిన గల్వాన్ లోయ ప్రాంతం వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఐసి) చైనా వైపు ఉందని అది మాదేనని ఆయన పేర్కొన్నారు. భారత బలగాలే తమ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడి ఏకపక్ష నిర్ణయాలతో రోడ్లు, వంతెనలతో పాటు ఇతర సౌకర్యాలను నిర్మిస్తుందంటూ విషం వెళ్లగక్కారు. (ఆ హక్కు చైనాకు లేదు : యూఎస్)
'చాలా సంవత్సరాలుగా చైనా సరిహద్దు దళాలు ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్నాయి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి భారత సరిహద్దు దళాలు గల్వాన్ లోయలోని ఎల్ఏసి వద్ద తమను సంప్రదించకుండానే ఏకపక్షంగా రోడ్లు, వంతెనలు, ఇతర సౌకర్యాలను నిర్మించింది. చైనా అనేక సందర్భాల్లో వీటిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. కానీ భారత్ అవేవి పట్టించుకోకుండా తమ ఆధీనంలోని ఎల్‌ఏసీని దాటి మమల్ని కావాలనే రెచ్చగొడుతుంది' అని చైనా విదేశాంగ శాఖ తమ ప్రకటనలో పేర్కొంది.('చైనా దురాక్రమణకు మోదీ లొంగిపోయారు')
Comments
Please login to add a commentAdd a comment