న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్‌లోని దెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. గతవారం భారత్-చైనా దేశాల మధ్య జరిగిన కీల ఒప్పందంలో భాగంగా.. కీలక ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైనికులు తమ మౌలిక సదుపాయాలను, ఇతర సామగ్రిని వెనక్కి తీసుకున్నట్లు తాజాగా ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. భారత్, చైనా సైన్యాలు ఒకరి స్థావరాలను మరొకరు పరస్పరం తనిఖీ చేసుకుంటున్నాయని పేర్కొంది.
కాగా తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట పెట్రోలింగ్, దళాలుప సంహరణకు ఇటీవల భారత్, చైనా మధ్య ఇటీవల గస్తీ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. దీని ప్రకారం 2020 నాటి యథాస్థితి ఎల్‌ఏసీ వెంబడి ఇక కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు. ఈ క్రమంలో మూడురోజుల కిందట ఎల్‌ఏసీ వెంట బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలయ్యింది. అక్టోబర్ 29 లోగా బలగాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి.
2020 జూన్ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాలు ఎల్‌ఏసీ వెంబడి భారీ స్థాయిలో బలగాలను మోహరించాయి. అప్పటినుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment