వాషింగ్టన్: అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్‌కు చెందిన ప్రాంతంగానే గుర్తిస్తున్నామని అమెరికా ప్రకటించింది. వాస్తవా«దీన రేఖ(ఎల్‌ఏసీ) ఆవలి వైపు ప్రాంతం కూడా తమదేనంటూ చైనా సైన్యం కానీ, పౌరులు గానీ ఏకపక్షంగా అక్రమంగా చొరబాట్లకు పాల్పడేందుకు చేసే ప్రయత్నాలను గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు అగ్రరాజ్యం తెలిపింది.
ఇటీవల ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించిన నేపథ్యంలో చైనా ఆర్మీ మరో మారు ఆ భూభాగం తమదేనంటూ ప్రకటించడంపై అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ ఉప అధికారప్రతినిధి వేదాంత్ పటేల్ మీడియాకు ఈ విషయం తెలిపారు. భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌ను టిబెట్‌లోని ‘జాంగ్నాన్’గా చైనా తరచూ పేర్కొంటోంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన భారత్..అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ తమదేనని, ఇకపైనా విడదీయరాని అంతర్భాగంగానే కొనసాగుతుందని బుధవారం పునరుద్ఘాటించిన విషయం తెలిసిందే.
అమెరికాకు సంబంధం లేదు:చైనా
అరుణాచల్ భారత్‌దేనంటూ అమెరికా చేసిన ప్రకటనను చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. భారత్–చైనా సరిహద్దు వివాదంతో అమెరికాకు ఏమాత్రం సంబంధం లేదని తెలిపింది. అమెరికా ఇతర దేశాల మధ్య వివాదాలను రెచ్చగొడుతూ, వాటిని తన స్వార్థ భౌగోళిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం అందరికీ తెలిసిందేనని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment