jawan video
-
Indian Army : జవాన్ అదిరిపోయే ఫీట్.. ఫిదా అవుతున్న ఇండియన్స్
సాక్షి, న్యూఢిల్లీ: భారత సైనం ఘనతను ఓ జవాన్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. తాము మానసికంగా, శారీరకంగా ఎంత దృఢంగా ఉన్నామో చెప్పకనే చెప్పారు. ఎముకలు కొరికే చలైనా, మండే ఎండకైనా, బీభత్సం సృష్టించే వానకైనా తాము బెదరమని తన పోరాట పటిమను చూపించారు. భారత జవాన్ చేసిన సాహాసం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మనోడి స్టంట్ చేసి భారతీయులు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఏం చేశాడంటే.. ఐటీబీపీ కమాండెంట్ రతన్ సింగ్ సోనాల్(55) మైనస్ 30 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద.. ఆగకుండా 60 పుష్ అప్స్ తీసి ఔరా అనిపించుకున్నారు. అది కూడా మాములు ప్రాంతంలో కాదు.. శీతల ప్రాంతమైన లద్దాఖ్‌లో 17,500 అడుగుల ఎత్తులో ఈ సాహసం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంత ఎత్తు, మంచులో కూడా రతన్ సింగ్ కొంచెం కూడా తన బ్యాలెన్స్ కోల్పోకుండా 60 పుష్ అప్స్ చేశాడు. అయితే, ఫిబ్రవరి 20న ఎత్తైన కర్జోక్ కంగ్రీ పర్వతాన్ని చేరుకున్న ఈ ఐటీబీపీ బృందం గడ్డ కట్టే చలిలో తమ పోరాటపటిమను ప్రదర్శిస్తోంది. వీరి ధైర్య సాహాసాలను చూసి సెల్యూట్ టూ ఇండియన్ ఆర్మీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Push-ups at icy heights... ITBP Commandant Ratan Singh Sonal (Age- 55 years) completes more than 60 push-ups at one go at 17,500 feet at minus 30 degree celsius temperature around in Ladakh.#Himveers #FitIndia #FitnessMotivation pic.twitter.com/Fc6BnfmGqH — ITBP (@ITBP_official) February 23, 2022 -
ఇండియన్ ఆర్మీలో ఆర్డర్లీ: సంచలన వీడియో
-
ఇండియన్ ఆర్మీలో ఆర్డర్లీ: సంచలన వీడియో
- ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారు: జవాన్ - స్పందించిన ఆర్మీ చీఫ్.. ఇక ‘ఫిర్యాదుల పెట్టె’ న్యూఢిల్లీ: నిన్నటిదాకా భద్రతా బలగాలకే పరిమితం అయిన ‘జవాన్ వీడియోల’ వ్యవహారం మొదటిసారి భారత సైన్యం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీలో కొందరు అధికారులు జవాన్లతో చేయించకూడని పనులు చేయిస్తున్నరని, దీనిపై రాష్ట్రపతి, ప్రధానులకు లేఖరాసినందుకు ప్రతీకారంగా తాను టార్చర్‌కు గురవుతున్నానంటూ ఓ ఆర్మీ జవాన్ శుక్రవారం సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్చేశాడు. భద్రతా బలగాల్లో పనిచేస్తోన్న జవాన్లకు సరైన భోజనం, జీతభత్యాలు అందడంలేదన్న బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ జవాన్ల వీడియోలపై దుమారం చల్లారకముందే మూడోది బయటికిరావడం గమనార్హం. డెహ్రాడూన్‌లోని 42వ ఇన్ఫంట్రీ బ్రిగేడ్‌లో లాన్స్ నాయక్‌గా పనిచేస్తోన్న యజ్ఙప్రతాప్ సింగ్.. శుక్రవారం యూట్యూబ్‌లో ఒక వీడియోను పోస్ట్చేశాడు. కొందరు అధికారులు.. కిందిస్థాయి జవాన్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని, షూపాలిష్ లాంటి పనులు చేయిస్తున్నారని సింగ్ ఆరోపించాడు. ఇదే విషయమై గతంలో తాను.. రాష్ట్రపతి, ప్రధాని, రక్షణశాఖ, హోంశాఖలకు లేఖలు రాశారనిని, దీనిపై ప్రధాని కార్యాలయం వివరణ కూడా అడిగిందని గుర్తుచేశాడు. ‘ఫిర్యాదు చేసే సమయంలో నేను ఆర్మీ నిబంధనలను ఉల్లంఘించలేదు. ఎప్పుడైతే ప్రధాని కార్యాలయం రిపోర్టు అడిగిందో, అప్పటి నుంచి నాపై వేధింపులు రెట్టింపు అయ్యాయి. ఆత్మహత్యకు ప్రేరేపించేలా అధికారులు నన్ను దూషిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడం ఆర్మీ నియమాలకు విరుద్ధం కాబట్టి నేనాపని చేయడంలేదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని వేడుకుంటున్నా’అని యజ్ఙప్రతాప్ సింగ్ వీడియోలో చెప్పారు. (భారత ‘బోర్డర్’లో సంచలనాలు) ఫిర్యాదుల పెట్టె: ఆర్మీ చీఫ్ కాగా, భద్రతా బలగాలు, ఆర్మీ జవాన్ల వరుస వీడియోలపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. అత్యున్నత బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇకపై అన్ని చోట్లా ‘ఫిర్యాదుల పెట్టెలు’(Complaint Boxs) ఉంచుతామని తెలిపారు. ‘తమ సమస్యలపై జవాన్లు వీడియోలు పోస్ట్ చేయడం కన్నా, పై అధికారులకు ఫిర్యాదుచేస్తే బాగుంటుంది’అని రావత్ హితవు పలికారు. ఇప్పటివరకు వెలుగుచూసిన వీడియో ఉదంతాలపై విచారణ జరుగుతున్నదని గుర్తుచేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేసే క్రమంలో పాకిస్థాన్‌పై ఏక్షణంలోనైనా సర్జికల్ దాడులకు సిద్ధమని రావత్ పేర్కొన్నారు. -
భారత ‘బోర్డర్’లో సంచలనాలు
-
భారత ‘బోర్డర్’లో సంచలనాలు
శ్రీనగర్: భారతదేశ సరిహద్దుల్లో మొదటి రక్షణ వలయమైన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)కు చీడ పట్టుకుంది. గొప్ప పేరుప్రతిష్ఠలున్న ఆ విభాగాన్ని కొందరు అధికారులు గబ్బుపట్టిస్తున్నారు. ఎండనకా వాననకా కాపలా కాస్తోన్న జవాన్లకు అందాల్సిన బలవర్ధక ఆహారపదార్థాలను నల్ల బజారులో అమ్ముకుంటున్నారు. పెట్రోల్, డీజిల్‌ను సైతం పక్కదారి పట్టిస్తున్నారు. ఇటీవలే జమ్ముకశ్మీర్ 29వ బెటాలియన్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ సోషల్ మీడియాలో పోస్ట్చేసిన వీడియో దుమారం చల్లారకముందే, బీఎస్ఎఫ్లో అక్రమాలపై మరికొన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. ఇంత జరుగుతున్నా కేంద్ర హోం శాఖ స్పందించకపోవడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (డ్యూటీలో అతనికి మొబైల్‌ఫోన్ ఎక్కడిది?) జమ్ముకశ్మీర్‌లోనే అతి ప్రధానమైన హుంహమా బీఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్స్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మీడియా సంస్థలు చేపట్టిన పరిశీలనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హుంహమా క్యాంపు చుట్టూ ఉండే నివాస ప్రాంతాల్లో కొన్ని దుకాణాలన్నాయి. ఆ దుకాణదారులతో బీఎస్ఎఫ్కు చెందిన కొందరు అధికారులు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వ గోడౌన్ల నుంచి క్యాంప్‌కు వచ్చే పప్పులు, ఇతర సరుకులు, కూరగాయల్లో కొంత భాగాన్నిఅధికారులు.. ప్రైవేటు దుకాణాలకు మళ్లిస్తారు. ‘మార్కెట్ ధరలతో పోల్చుకుంటే బీఎస్ఎఫ్ వాళ్లు మాకు తక్కువ ధరకే సరుకులు ఇస్తారు’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని దుకాణందారుడు మీడియాతో అన్నాడు. అందినకాడికి దోచుడే.. హుంహమా బీఎస్ఎఫ్ క్యాంప్ పక్కనే నివసించే ఓ కాంట్రాక్టర్ ఇలా చెప్పాడు..‘మా వాహనాలకు అవసరమైన పెట్రోల్, డీజిల్ ను బీఎస్ఎఫ్ ఆఫీసర్ల నుంచే కొనుక్కుంటాం. బంక్ ధర కంటే తక్కువకే ఇస్తారు’అని! కార్యాలయానికి అవసరమైన ఫర్నీచర్ కొనుగోళ్లలోనూ ఈ అక్రమ అధికారులు చేతివాటం చూపెడతారు. ‘ఫర్నీచర్ నాణ్యత తగ్గినా ఫర్వాలేదు.. మా కమీషన్ మాకు దక్కాల్సిందే’అని బీఎస్ఎఫ్ అధికారులు తనతో అన్నట్లు ఓ కర్పెంటర్ వెల్లడించాడు. (బీఎస్ఎఫ్ జవాన్ షాకింగ్ వీడియో) డిజిటల్ మోదీ.. ‘భద్రత’లో ‘ఈ’ లేమి! ఒకవైపు ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం మొత్తాన్ని డిజిటలైజ్ అయిపోతున్న(!) తరుణంలో బీఎస్ఎఫ్ లాంటి కీలక భద్రతా దళంలో కనీసం ‘ఈ-టెండర్’ వ్యవస్థ కూడా లేకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. క్యాంపులో ఉండే జవాన్లు, అధికారులకు ఎంత మొత్తంలో సరుకులు అవసరం ఉంటుంది? ఎంత పంపిణీ అవుతోంది? వినియోగం ఎంత? పక్కదారి పట్టేదెంత? తదితర వివరాలును పకడ్బందీగా నమోదుచేసి, పర్యవేక్షించే డిజిటల్ వ్యవస్థ ఏదీ బీఎస్ఎఫ్లో లేకపోవడం గమనార్హం. బీఎస్ఎఫ్ ఒక్కటేకాదు.. ఒక్క బీఎస్ఎఫ్లోనేకాదు కీలకమైన మరో నాలుగు (సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్బీ) భద్రతా దళాల్లోనూ అప్పుడప్పుడూ అక్రమాల మాట వినిపిస్తుంటుంది. కానీ ఈస్థాయిలో(‘జవాన్ వీడియో’) ఏనాడూ వెలుగులోకి రాలేదు. ఈ అంశంపై శ్రీనగర్ సీఆర్పీఎఫ్ ఐజీ(అడ్మినిస్ట్రేషన్) రవీందర్ సింగ్ సాహి స్పందిస్తూ.. జవాన్లకు దక్కాల్సిన సరుకులు నల్ల బజారుకు తరలించడం దారుణమన్నారు. బీఎస్ఎఫ్తో పోల్చుకుంటే సీఆర్పీఎఫ్లో సరుకుల కొనుగోళ్లుకు నిర్ధిష్టయంత్రాంగాన్ని రూపొందించామన్నారు.