push ups
-
చలిపులికి సవాలు విసురుతూ....
మైనస్ 16 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్లో చలికి చేతులు కొంకర్లు పోతాయి. అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టం. అలాంటి వాతావరణంలో పుషప్‌లు చేయడం అంత వీజీ కాదు. అయితే ప్రముఖ ఫిట్నెస్ కోచ్ నేహా బంగియాకు అలాంటి వాతావరణం అవరోధం కాలేదు. కశ్మీర్‌కు వెళ్లిన నేహా అక్కడి ఆర్మీ సోల్జర్తో కలిసి స్పీడ్‌గా పుషప్‌లు చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. ‘ఇలాంటి అతిశీతల వాతావరణంలో కొన్నిరోజులు ఉండడానికే మాకు కష్టంగా అనిపించింది. మన సైనికులు మాత్రం ఇలాంటి వాతావరణాన్ని కూడా తట్టుకొని దేశంకోసం పనిచేస్తున్నారు’ అని కాప్షన్లో రాసింది నేహా బంగియా. -
వామ్మో..! మరీ ఇంత ప్రమాదకరంగా పుష్అప్స్ చేస్తారా..? వీడియో వైరల్..
ఒడిశా: ఫేమస్ కావడానికి ఏవో రకరకాల స్టంట్లు చెస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో అలాంటి వీడియోలను పోస్టు చేసి, వచ్చిన లైకులను చూసి గర్వంగా ఫీల్ అవుతుంటారు. ఈ మధ్య ఈ భయంకరమైన ట్రెండ్ మరీ ఎక్కువైంది. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. వీడియోలో ఓ వ్యక్తి చేసిన స్టంట్ మరీ ప్రమాదకరంగా ఉంది. రహదారిపై నిర్మించిన బోర్డుపై పుష్అప్స్ చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని బోలాన్‌గిరి జిల్లాలో జరిగింది. పట్నాగర్హ్ పట్టణానికి వెళ్లే మార్గంలో రహదారిపై ఊరిపేరును చూపుతూ ఓ పెద్ద బోర్డును నిర్మించారు గ్రామస్థులు. అయితే.. ఈ బోర్డుపై ఓ యువకుడు ప్రమాదకరంగా స్టంట్స్ చేశాడు. సన్నగా ఉండే ఆ సైన్బోర్డుపైకి ఎక్కి.. పుష్అప్స్ చేశాడు. ఓ పక్క బోర్డు క్రింద రోడ్డుపై వాహనాలు వెళ్తున్నాయి. మరోపక్క యువకుడు బోర్డుపై పుష్అప్స్ చేశాడు. స్థానికంగా అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ప్రమాదకరమైన స్టంట్స్ చూసి ఆందోళన చెందారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. View this post on Instagram A post shared by Sambalpuri Mahani (@sambalpuri_mahani._) సోషల్ మీడియాలో ఆ యువకుడు పుష్అప్స్ చేసిన వీడియోను పోస్టు చేసిన వారంలోనే మిలియన్ల లైక్స్ వచ్చాయి. వీడియోను చూసి వ్యూయర్స్ రకరకాలుగా స్పందించారు. ఇంత ధైర్యంగా ఎలా పుష్అప్స్ చేశారని కామెంట్లు పెట్టారు. ఆ యువకుని ధైర్యాన్ని కొందరు మెచ్చుకోగా .. మరికొందరు వ్యతిరేకంగా స్పందించారు. ఈ ప్రమాదకరమైన స్టంట్స్‌ను అంగీకరించలేమని కామెంట్లు పెట్టారు. ఇదీ చదవండి: సూపర్ పోలీస్.. రాకాసి అలల్లో పిల్లలను కాపాడి.. వీడియో వైరల్... -
గంటలో 3,206 పుష్ అప్లు
సిడ్నీ: జిమ్ చేసే సిక్స్‌ప్యాక్ బాడీ అయినా రోజూ 100 పుష్అప్లు చేస్తేనే బాగా అలిసిపోతారు. అలాంటిది ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి కేవలం గంటలో 3,206 పుష్అప్లు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన 33 ఏళ్ల లుకాస్ హెల్మెక్ పుష్ అప్లు చేయడం ద్వారా తనకున్న స్టామినా ఏంటో ప్రపంచానికి చూపించాడు. గంటకి 3,182 పుష్ అప్లు చేసి రికార్డు సా«ధించిన సాటి ఆస్ట్రేలియన్ డేనియల్ స్కాలి పేరు మీదున్న రికార్డుల్ని బద్దలు కొట్టాడు. లుకాస్ నిమిషానికి 53 పుష్ అప్లు చేశాడని గిన్నిస్ వరల్డ్ అధికారులు వెల్లడించారు. ఈ రికార్డు సాధించడానికి అనుభవజ్ఞులైన జిమర్ల దగ్గర రెండు మూడేళ్ల పాటు శిక్షణ కూడా తీసుకున్నట్టు లుకాస్ వెల్లడించాడు. -
రోడ్డుపైనే రాహుల్ గాంధీ పుషప్స్
సాక్షి, బళ్లారి: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో చిత్రదుర్గం జిల్లాలోకి ప్రవేశించింది. యాత్ర 34వ రోజు మంగళవారం ఉదయం వర్షం కారణంగా గంటపాటు ఆలస్యంగా మొదలైంది. హర్తికోటె నుంచి భారీ జన సందోహం మధ్య పాదయాత్ర ప్రారంభించారు. అందరినీ పలకరిస్తూ, చేయి ఊపుతూ పాదయాత్ర కొనసాగించారు. చెళ్లకెరె తాలూకాలో విద్యార్థులు ఆయనతో పాటు నడిచారు. గ్రామాల్లో ఇళ్లపై నుంచి జనం తిలకించారు. మధ్యలో భోజన విరామ సమయంలో రెండు చేతులూ లేని ఓ దివ్యాంగురాలు రాహుల్‌ను కలిశారు. కాగితంపై కాలితో ఆమె రాయడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. మరోచోట రాహుల్ పిల్లలు, స్థానికులతో కలిసి రోడ్డుపైనే పుషప్స్ తీశారు. సనికెరె వద్ద రాహుల్‌ను ఆషా, ఉపాధి హామీ, అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్ఎంలు కలిశారు. ‘దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం మన కూతుళ్లకు సమాన అవకాశాలు, భద్రత, గౌరవం తప్పక కల్పించాల్సిన అవసరం ఉంది’అని రాహుల్ అనంతరం ట్వీట్ చేశారు. యాత్రలో తనతో కలిసిన విద్యార్థినుల ఫొటోను షేర్ చేశారు. #BharatJodoYatra Push-Up Challenge! pic.twitter.com/SokyTW09uM — Congress (@INCIndia) October 11, 2022 ఇదీ చదవండి: దీపావళి బాణసంచా మోతపై షరతులు.. కేవలం ఆ 2 గంటలే! -
Indian Army : జవాన్ అదిరిపోయే ఫీట్.. ఫిదా అవుతున్న ఇండియన్స్
సాక్షి, న్యూఢిల్లీ: భారత సైనం ఘనతను ఓ జవాన్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. తాము మానసికంగా, శారీరకంగా ఎంత దృఢంగా ఉన్నామో చెప్పకనే చెప్పారు. ఎముకలు కొరికే చలైనా, మండే ఎండకైనా, బీభత్సం సృష్టించే వానకైనా తాము బెదరమని తన పోరాట పటిమను చూపించారు. భారత జవాన్ చేసిన సాహాసం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మనోడి స్టంట్ చేసి భారతీయులు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఏం చేశాడంటే.. ఐటీబీపీ కమాండెంట్ రతన్ సింగ్ సోనాల్(55) మైనస్ 30 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద.. ఆగకుండా 60 పుష్ అప్స్ తీసి ఔరా అనిపించుకున్నారు. అది కూడా మాములు ప్రాంతంలో కాదు.. శీతల ప్రాంతమైన లద్దాఖ్‌లో 17,500 అడుగుల ఎత్తులో ఈ సాహసం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంత ఎత్తు, మంచులో కూడా రతన్ సింగ్ కొంచెం కూడా తన బ్యాలెన్స్ కోల్పోకుండా 60 పుష్ అప్స్ చేశాడు. అయితే, ఫిబ్రవరి 20న ఎత్తైన కర్జోక్ కంగ్రీ పర్వతాన్ని చేరుకున్న ఈ ఐటీబీపీ బృందం గడ్డ కట్టే చలిలో తమ పోరాటపటిమను ప్రదర్శిస్తోంది. వీరి ధైర్య సాహాసాలను చూసి సెల్యూట్ టూ ఇండియన్ ఆర్మీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Push-ups at icy heights... ITBP Commandant Ratan Singh Sonal (Age- 55 years) completes more than 60 push-ups at one go at 17,500 feet at minus 30 degree celsius temperature around in Ladakh.#Himveers #FitIndia #FitnessMotivation pic.twitter.com/Fc6BnfmGqH — ITBP (@ITBP_official) February 23, 2022 -
తగ్గేదే లే! అంటున్న పిల్లి.. బాడీ బిల్డింగ్ పోటీలకు పంపాలి!
ఫిట్‌గా ఉండటం కోసం జిమ్‌లో గంటల తరబడి వర్క్ అవుట్లు, ఎక్సర్ సైజ్లు చూస్తూ ఉంటాం. అయితే మంచి శరీరాకృతి రావాలని జిమ్‌లో పుష్ అప్లు చేస్తాం. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? పిల్లిని కొంత మంది పెంపుడు కుక్కల వలే పెంచుకుంటారు. అయితే పిల్లులు చేసే అల్లరి మామూలు ఉండదు! అయితే ఓ పిల్లి జిమ్‌లో చేసిన పని.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్‌లో ఓ పిల్లి.. అచ్చం మనుషులు చేసినట్లే పుష్ అప్లు చేసింది. ఈ వీడియోను ఓ ట్విటర్ యూజర్ పోస్ట్ చేశారు. ‘క్యాట్ డూయింగ్ కిట్-అప్స్!!’ అని కామెంట్ జతచేశారు. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘నా కంటే అద్భుతంగా పుష్ అప్లు చేస్తోంది’.. ‘పిల్లి భలే చేస్తుందే.. బాడీబిల్డింగ్ పోటీలకు పంపాలి’.. ‘పుష్ అప్‌లతో తగ్గేదే లే! అంటున్న పిల్లి’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Cat doing kit-ups!!🐈💪😅 pic.twitter.com/9HjQnebWTN — 𝕐o̴g̴ (@Yoda4ever) November 26, 2021 -
అందమైన డ్రెస్‌లో అనా అరోరా పుషప్స్
-
పెళ్లికూతురి పుషప్స్ మామూలుగా లేవుగా
సోషల్ మీడియాలో వైరల్ కావడానికి పలువురు వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఓ ఫిట్నెస్ ఔత్సాహికురాలు వ్యాయామం ప్రాధాన్యం వివరిస్తూనే ఓ వైరల్ వీడియోను తీసి తన సోషల్ మీడియా ఖాతాల్లో విడుదల చేశారు. ఆమె చేసిన వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతలా ఆకట్టుకోవడానికి కారణమేమిటంటే.. పెళ్లి డ్రెస్‌లో ఆమె పుషప్స్ చేసింది. అనా అరోరా ఫిట్నెస్ వీడియోలు చేస్తూ వ్యాయామ ప్రాధాన్యం వివరిస్తుంటుంది. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఎరుపు రంగు లెహంగా చోలీలో అనా మెరిసింది. ఆమె వివాహం జూలైలో జరిగింది. ఈ పెళ్లి డ్రెస్‌లోనే ఆమె పుషప్స్ చేసి అందరినీ అబ్బురపరిచింది. అందమైన డ్రెస్‌లో అనా పుషప్స్ చేస్తున్న అప్పటి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆమె పుషప్స్ వీడియోను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 81 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ వీడియోతో పాటు మరో వీడియో, కొన్ని ఫొటోలు పంచుకున్నారు. -
సెల్ఫీ అడిగిన మహిళతో పుషప్‌లు.. నటుడిపై నెటిజన్లు ఫైర్
సెలబ్రిటీలు అన్నాక సెల్ఫీలు అడగడం కామన్. ముఖ్యంగా సిని పరిశ్రమకు చెందిన ప్రముఖులు కనిపిస్తే చాలు సెల్ఫీల కోసం ఎగబడతారు జనాలు. వాళ్లు కూడా సాధ్యమైనంత వరకు అభిమానుల కోరిక మేరకు సెల్ఫీలు ఇచ్చి వెళ్లిపోతారు. కానీ ఓ నటుడు మాత్రం తనను సెల్ఫీ అడిగిన ఓ మహిళతో పుషప్లో చేయించాడు. ఆయన చేసింది మంచి పనే అయినా.. ఇప్పుడు ట్రోలింగ్కి గురయ్యాడు. ఆ వివరాలేంటో చూద్దాం. ఇండియన్ టాప్ మోడల్, నటుడు మిలింద్ సోమన్ గురించి అందరికి తెలిసిందే. 80, 90 దశకాల్లో టాప్ మోడల్ ఆయన. మధు సప్రేతో కలిసి ఎన్నో యాడ్స్‌లో నటించారు. ప్రముఖ గాయని అలీషా చినాయ్ రూపొందించిన మేడ్ ఇన్ ఇండియా మ్యూజిక్‌తో భారీగా పాపులారిటీని సంపాదించుకొన్నారు. 53 ఏళ్ల మిలింద్.. మూడేళ్ల క్రితం తనకంటే వయసులో 26 ఏళ్లు చిన్నదైన అంకితా కోన్వార్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తరచుగా తన సోషల్ మీడియా వేదికగా ఆరోగ్యం సూత్రాలు పంచుతూ ఫిట్నెస్ను ప్రోత్సహిస్తారు. ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ ఫిట్నెస్ చిట్కాలు పంచుకుంటూ ఉంటాడు కూడా. ఆయన ఇటీవల ఒక పాత వీడియో తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆ వీడియోలో సెల్ఫీ అడిగిన మహిళను 10 పుషప్‌లు చేయమని అడగడంతో ఆమె వెంటనే పుషప్‌లు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా మిలింద్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. రాయ్‌పూర్‌లోని ఓ ప్లేస్ లో సెల్ఫీ అడిగిన ఆమెను ఇలా చేయించానని చెప్పుకొచ్చాడు. తర్వాత సోమన్ ఆ మహిళతో సెల్ఫీ దిగారు. అయితే ఆ మహిళ చీర ధరించి, అది కూడా రోడ్డు మీద పుషప్ లు చేయడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ‘ఫిట్నెస్ కోసం పుష్-అప్లు చేయడం ఖచ్చితంగా మంచిదే, కానీ మీరు మీతో సెల్ఫీ తీసుకోవటానికి ఇలా ఒక స్త్రీని రోడ్డు మీద పుష్-అప్లు చేయించడం బాలేదు’అని ఒక నెటిజన్, ఢ‘శారీరక వ్యాయామం చేయాలనే మీ ఉద్దేశం చాలా గొప్పది అయితే, ముందస్తు అనుభవం లేకుండా ఈ వయసులో పుష్-అప్స్ చేయమని అకస్మాత్తుగా చెప్పడం సరికాదు’అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) -
నలభై టు నాలుగు!
తమన్నా ఫిట్నెస్ మీద ఎంత దృష్టిపెడుతుంటారో తెలిసిందే. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేస్తూ ఫిట్‌గా ఉంటారు. షూటింగ్స్‌తో సంబంధం లేకుండా ఆమె డైలీ రొటీన్లో వర్కౌట్స్ ఓ భాగం. లాక్‌డౌన్‌లోనూ వ్యాయామం చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ని కూడా ఫిట్నెస్ మీద దృష్టిపెట్టమంటూ పోస్ట్స్ చేస్తుండేవారు. అయితే ఇటీవల తమన్నా కోవిడ్ బారినపడ్డ సంగతి తెలిసిందే. దాంతో వర్కౌట్స్‌కి చిన్న బ్రేక్ ఇచ్చారామె. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వర్కౌట్స్ మొదలెట్టారు. అయితే ఆమె గ్రాఫ్ నలభై నుంచి నాలుగుకి పడిపోయిందట. ‘‘కోవిడ్‌కి ముందు ఈజీగా 40 పుష్ అప్స్ చేసేదాన్ని. కోవిడ్ తర్వాత జస్ట్ నాలుగంటే నాలుగు చేయడం కూడా కష్టంగా అనిపించింది. కానీ మెల్లిగా మళ్లీ పికప్ అయ్యాను. కోవిడ్ వల్ల నీరసించిపోతాం. అయినా మన స్టామినాని మళ్లీ తిరిగి తెచ్చుకోవడం ముఖ్యం’’ అన్నారు తమన్నా. -
షాక్ ఇస్తున్న కత్రినా పుష్ అప్స్
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బాలీవుడ్ బ్యూటీస్ లో కత్రినాకైఫ్ ముందు వరుసలో ఉంటుంది. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో రెగ్యులర్ గా అప్ డేట్స్ ఇచ్చే కత్రినా తాజాగా ఓ షాకింగ్ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న టైగర్ జిందాహై షూటింగ్లో బిజీగా ఉన్న కత్రినా ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియో ఒకటి తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తెగ పుష్అప్స్ చేస్తున్నట్లుగా కనిపించింది కత్రినా. ముందు రెండు చేతులు నేల మీద ఆన్చి పుష్ అప్స్ చేసిన క్యాట్, తరువాత ఒక చేతిని మాత్రమే ఆన్చి చేస్తుంది. తరువాత రెండు చేతులు నేల మీద ఆన్చకుండానే పుష్ అప్స్ చేస్తుంది. ఇదిలా సాధ్యం అంటూ షాక్ అయ్యే లోపే ఆ సీక్రెట్ ఏంటో రివీల్ చేసేసింది. కత్రినా పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే లక్షల కొద్ది వ్యూస్ వేల కొద్ది కామెంట్స్ వచ్చాయి. -
షాక్ ఇస్తున్న కత్రినా పుష్ అప్స్