
ఫిట్‌గా ఉండటం కోసం జిమ్‌లో గంటల తరబడి వర్క్ అవుట్లు, ఎక్సర్ సైజ్‌లు చూస్తూ ఉంటాం. అయితే మంచి శరీరాకృతి రావాలని జిమ్‌లో పుష్ అప్‌లు చేస్తాం. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? పిల్లిని కొంత మంది పెంపుడు కుక్కల వలే పెంచుకుంటారు. అయితే పిల్లులు చేసే అల్లరి మామూలు ఉండదు! అయితే ఓ పిల్లి జిమ్‌లో చేసిన పని.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జిమ్‌లో ఓ పిల్లి.. అచ్చం మనుషులు చేసినట్లే పుష్ అప్‌లు చేసింది. ఈ వీడియోను ఓ ట్విటర్ యూజర్ పోస్ట్ చేశారు. ‘క్యాట్ డూయింగ్ కిట్-అప్స్!!’ అని కామెంట్ జతచేశారు. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘నా కంటే అద్భుతంగా పుష్ అప్‌లు చేస్తోంది’.. ‘పిల్లి భలే చేస్తుందే.. బాడీబిల్డింగ్ పోటీలకు పంపాలి’.. ‘పుష్ అప్‌లతో తగ్గేదే లే! అంటున్న పిల్లి’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Cat doing kit-ups!!🐈💪😅 pic.twitter.com/9HjQnebWTN
— 𝕐o̴g̴ (@Yoda4ever) November 26, 2021
Comments
Please login to add a commentAdd a comment