gym centre
-
తగ్గేదే లే! అంటున్న పిల్లి.. బాడీ బిల్డింగ్ పోటీలకు పంపాలి!
ఫిట్‌గా ఉండటం కోసం జిమ్‌లో గంటల తరబడి వర్క్ అవుట్లు, ఎక్సర్ సైజ్లు చూస్తూ ఉంటాం. అయితే మంచి శరీరాకృతి రావాలని జిమ్‌లో పుష్ అప్లు చేస్తాం. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? పిల్లిని కొంత మంది పెంపుడు కుక్కల వలే పెంచుకుంటారు. అయితే పిల్లులు చేసే అల్లరి మామూలు ఉండదు! అయితే ఓ పిల్లి జిమ్‌లో చేసిన పని.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్‌లో ఓ పిల్లి.. అచ్చం మనుషులు చేసినట్లే పుష్ అప్లు చేసింది. ఈ వీడియోను ఓ ట్విటర్ యూజర్ పోస్ట్ చేశారు. ‘క్యాట్ డూయింగ్ కిట్-అప్స్!!’ అని కామెంట్ జతచేశారు. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘నా కంటే అద్భుతంగా పుష్ అప్లు చేస్తోంది’.. ‘పిల్లి భలే చేస్తుందే.. బాడీబిల్డింగ్ పోటీలకు పంపాలి’.. ‘పుష్ అప్‌లతో తగ్గేదే లే! అంటున్న పిల్లి’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Cat doing kit-ups!!🐈💪😅 pic.twitter.com/9HjQnebWTN — 𝕐o̴g̴ (@Yoda4ever) November 26, 2021 -
జిమ్ కోసం ఇన్నేసి రూల్సా.? ఇది జిమ్మా లేక ఇంకేందీ సామి
చండిగఢ్: ‘మీరు వేసుకునే లోదుస్తులపై స్టాంప్ ఉండాలి. స్మెల్ టెస్ట్ చేయించుకోవాలి’ అని ఓ క్లబ్ యాజమాన్యం సభ్యులకు ఆదేశాలు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. జిమ్‌కు వచ్చేవారందరూ ఇది తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకు అలా చెప్పారో.. కథ ఏమిటో తెలుసుకోండి. చండీగఢ్‌లోని లేక్ క్లబ్ ఇటీవల సభ్యులకు కొత్త నియమనిబంధనలు విడుదల చేసింది. అందులో భాగంగా పలు సూచనలు చేసింది. వాటిలో పైన పేర్కొన్న ప్రధాన సూచన సభ్యులను విస్మయానికి గురి చేసింది. ఈ రూల్స్‌కు సంబంధించిన ఫొటోను జర్నలిస్ట్ ఆర్ష్‌దీప్ సంధు ట్విటర్లో పంచుకోవడంతో ఈ విషయం బహిర్గతమైంది. నాలుగు సూచనలతో ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జిమ్‌కు వచ్చేవారు సరైన దుస్తులు ధరించి రావాలి. జిమ్ సూట్లలోనే రావాలి. లోదుస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలి. అనుమతి ఇచ్చిన వాటినే వేసుకోవాలి. ఆ దుస్తులు ఎలా ఉండాలో కార్యాలయంలో కొన్ని శాంపిల్స్ ఉన్నాయి. చూసుకోవచ్చు. మీ దుస్తులకు అనుమతి కోసం సభ్యులు మా వద్దకు తీసుకురావాలి. స్టాంప్‌లు వేసిన దుస్తులనే వేసుకోవాలి. సభ్యులు సరైన బూట్లు ధరించాలి. పరిశుభ్రంగా ఉండాలి. సాక్స్‌లు రోజుకొకసారి తప్పనిసరిగా ఉతకాలి. అపరిశుభ్రమైన బూట్లు.. వాసన వచ్చే సాక్స్‌లు ధరిస్తే ఆ సభ్యులకు జరిమానా విధిస్తాం. వాసన పరీక్ష (స్మెల్ టెస్ట్)లో మీరు ఫెయిలైతే చర్యలు ఉంటాయి. శారీరక దుర్వాసన కూడా రాకుండా చూసుకోవాలి. జిమ్ పరికరాలు శబ్ధం రాకుండా కసరత్తులు చేయాలి. కసరత్తులు చేసేప్పుడు అరవకూడదు.. శబ్దాలు చేయవద్దు. ఇతర భాషలు మాట్లాడేందుకు అనుమతి లేదు. కేవలం పంజాబీ భాషలోనే మాట్లాడాలి. అనుమతించిన తిట్లు మాత్రమే మాట్లాడాలి. జిమ్‌కు షార్ట్స్ వేసుకుని వచ్చేవారు తమ కాళ్లను షేవ్ చేసుకుని రావాలి. ఏకాగ్రత కోల్పోకుండా కాళ్లకు పట్టీలు ఉంటే ఇంట్లో ఉంచి రావాలి. ఉల్లంఘించినవారు శిక్షార్హులు. అని ఈ విధంగా నిబంధనలు పెట్టడంతో సభ్యులు ఖంగు తిన్నారు. జిమ్ చేయాలంటే ఇన్నేసీ రూల్సా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇన్నేసి రూల్స్ పాటించాలా? అని ప్రశ్నిస్తున్నారు. వాసన పరీక్షను సభ్యులు ఎలా పరాజయం పొందుతారు? అని ప్రశ్నిస్తున్నారు. * How does a member fail the "smell test"? * Who is incharge of smelling members ? * Can members wax instead of shave ? * "Only approved undergarment are to be worn ! And who will check the brand of the underwear ?" * what if the member abuses in another language ? 💪 — Tehseen Poonawalla Official 🇮🇳 (@tehseenp) August 3, 2021 Gym Suit pic.twitter.com/6VisGaHjOU — AchaTheekHai! (@neelaneelaamber) August 3, 2021 -
పైనుంచి అమ్మాయిల గదిలోకి ఊడిపడ్డాడు!
వాషింగ్టన్ : అమ్మాయిలు బట్టలు మార్చుకునే గదిలోకి తొంగిచూస్తూ అడ్డంగా బుక్కయ్యాడో వ్యక్తి. సీలింగ్‌పై నుంచి గదిలోకి పడి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన అమెరికాలోని వర్జీనియాలో ఆలస్యంగా వెలుగుచూసింది. స్టాండ్ఫోర్డ్ కౌంటీ షరీఫ్ తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసిన వివరాల మేరకు.. వర్జీనియాకు చెందిన బ్రియాన్ ఆంథోనీ జోయ్ శనివారం అక్కడి ఓ జిమ్‌కు వెళ్లాడు. వర్కవుట్లు చేయటం అయిపోయిన తర్వాత ఉమెన్స్ లాకర్ రూం( అమ్మాయిలు బట్టలు మార్చుకునే, దాచుకునే గది)లోని సీలింగ్‌పై నక్కి కూర్చున్నాడు.. అమ్మాయిలు ఏవరైనా బట్టలు మార్చుకుంటే చూద్దామని. కొద్దిసేపటి తర్వాత అతడి బరువు తాళలేకపోయిన సీలింగ్ షీటు ఊడిపోయింది. దీంతో అతడు పది అడుగుల ఎత్తునుంచి అమ్మాయిల గదిలోకి ఊడిపడ్డాడు. అదే సమయంలో గదిలోకి వచ్చిన ఓ అమ్మాయి అతడు పైనుంచి కిందపడటంతో బిత్తరపోయింది. ( పీపాలో నెల రోజులు.. మలం తిని బతికాడు) మొదట అతడ్ని జిమ్ సిబ్బంది అనుకుంది. అయితే అతడి ఒంటిపై యూనీఫాంకు బదులు మామూలు డ్రెస్ ఉండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. అతడు కిందపడిన వెంటనే పైకి లేచి, దొంగచూపులు చూస్తూ రూములోంచి బయటకు వెళ్లిపోయాడు. బ్రియాన్‌పై అనుమానం వచ్చిన ఓ వ్యక్తి అతడ్ని అడ్డగించి ప్రశ్నించగా.. సమాధానం చెప్పలేకపోయాడు. అక్కడినుంచి పారిపోయి జిమ్‌లోని బాత్రూమ్లో దాక్కున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బ్రియాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. View this post on Instagram A post shared by Jennifer Benitez Health Coach✨ (@fitwjenn) -
తెరుచుకున్న జిమ్‌లు, యోగా కేంద్రాలు
-
ఎఫ్ఎన్సీసీలో జిమ్ ప్రారంభం
బంజారాహిల్స్: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన జిమ్‌ను ఆదివారం సినీ హీరో విజయ్‌దేవరకొండ ప్రారంభించారు. సభ్యులంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. ఎఫ్ఎన్సీసీ దక్షిణ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని అధ్యక్షుడు కెఎల్.నారాయణ అన్నారు. కార్యక్రమంలో కె.ఎస్.రామారావు, రాజశేఖర్‌రెడ్డి, తుమ్మల రంగారావు, మోహన్ ముళ్ళపుడి, కిషోర్, నాగసుష్మ, శైలజ, తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో అందరూ చూస్తుండగానే..
సాక్షి, హైదరాబాద్: మెడికల్ ఎంట్రన్స్ ‘నీట్’లో అనుకున్న ర్యాంక్ రాకపోవడంతో ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. అందరూ చూస్తుండగానే పదో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. జిమ్‌కు వెళ్తున్నానని చెప్పి అంతలోనే విగతజీవిగా మారడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. హైదరాబాద్‌లోని అబిడ్స్ మయూర్ కుషాల్ కాంప్లెక్స్ వద్ద మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. టీవీ చానల్స్‌లో చూసి.. కాచిగూడ బర్కత్‌పురాలోని కైబాన్ అపార్ట్మెంట్లో నివసించే బట్టల వ్యాపారి రణ్వీర్ సింగ్, లవ్లీన్ కౌర్‌లకు ఇద్దరు కుమార్తెలున్నారు. వీరిలో పెద్ద కుమార్తె జస్లిన్ కౌర్(18) నారాయణగూడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ చదివింది. చదువుల్లో చురుగ్గా ఉండే జస్లిన్ మెడిసిన్ చదివి మంచి డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సోమవారం వెలువడిన ‘నీట్’ ఫలితాల్లో ఈమెకు అనుకున్నంత ర్యాంక్ రాలేదు. లక్ష వరకు ర్యాంకు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో కాస్త కుదుటపడినట్టే కనిపించింది. ప్రతిరోజూ మాదిరే మంగళవారం ఉదయం కూడా జిమ్‌కు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. చాలాసేపయినా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు మధ్యాహ్నం కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేస్తున్న సమయంలోనే టీవీ ఛానల్స్‌లో ఓ యువతి అబిడ్స్‌లోని బహుళ అంతస్థుల భవనం నుంచి కింద దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు ప్రసారమయ్యాయి. వాటిని చూసిన తల్లి లవ్లీన్ కౌర్ ఆమె మా బిడ్డే అంటూ కుప్పకూలింది. జనం చూస్తుండగానే.. జిమ్‌కు వెళ్తున్నానని ఇంటి నుంచి బయల్దేరిన జస్లిన్ కౌర్ ఉదయం 10 గంటల ప్రాంతంలో అబిడ్స్ మయూర్ కుషాల్ కాంప్లెక్స్‌కు చేరుకుంది. మెట్లు ఎక్కుతూ పదో అంతస్తుకు వెళ్లినట్టు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. సరిగ్గా 10.21 గంటల ప్రాంతంలో కిందకు దూకేందుకు సిద్ధమైంది. కింద నుంచి ఆమెను గమనించిన జనం వద్దు వద్దు అంటూ అరుపులు కేకలు పెట్టారు. ఆ తర్వాత 4 నిమిషాలకే జస్లిన్ కిందకు దూకి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు 108కి సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చి ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు క్షోభ మిగల్చకండి: తల్లిదండ్రులు జిమ్‌కు వెళ్తానని వెళ్లిన తమ కుమార్తె ఇలా ప్రాణాలు తీసుకుంటుందని అనుకోలేదంటూ జస్లిన్ తల్లిదండ్రులు బోరున విలపించారు. విద్యార్థులపై తల్లిదండ్రులు గంపెడు ఆశలు పెట్టుకుంటారని, ర్యాంకులు వచ్చినా, రాకపోయినా ధైర్యంగా ఉండాలి తప్ప ఇలా ప్రాణాలు తీసుకోని క్షోభ మిగల్చవద్దంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. -
మొన్న బాత్రూమ్లో... ఇప్పుడు జిమ్ సెంటర్లో..!
ఇప్పుడంతా సెల్ఫీ ట్రెండ్. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు దిగడం, వాటిని ఏ ట్విట్టర్లోనో, ఫేస్‌బుక్‌లోనో పెట్టడం ఫ్యాషనైపోయింది. మొన్నటికి మొన్న శ్రీయ బాత్రూమ్లో సెల్ఫీ దిగి, ట్విట్టర్లో పోస్ట్ చేశారు. జలకాలాడుతున్న ఫొటో కాదది. శుభ్రంగా డ్రెస్ చేసుకున్నాక ఫొటో దిగారు. ఇప్పుడు జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ సెల్ఫీ తీసుకున్నారు. తాను సెల్ఫీ తీసుకుంటూ, ఆ తతంగాన్ని మరొకరితో ఫొటోలు తీయించారామె. అనంతరం వాటిని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడా ఫొటోలు నెట్టింట వీర విహారం చేస్తున్నాయి. ‘లవ్ మై వర్కవుట్.. ఇట్స్ మై ఫన్’ అని ఆ ఫొటోలకు శ్రీయ మురిపెంగా చిన్న క్యాప్షన్ కూడా ఇచ్చుకున్నారు. అన్నట్లు శ్రీయ వయసు 30 కి పైనే. ఈ వయసులో ఇంత స్లిమ్‌గా ఉన్నారంటే.. ఈ బ్యూటీ ఫిజిక్ గురించి ఏ రేంజ్లో కేర్ తీసుకుంటున్నారో ఊహించవచ్చు.