పైనుంచి అమ్మాయిల గదిలోకి ఊడిపడ్డాడు! | Man Fell From Ceiling While Watching Into Womens Room | Sakshi
Sakshi News home page

పైనుంచి అమ్మాయిల గదిలోకి ఊడిపడ్డాడు!

Published Wed, Feb 3 2021 7:06 PM | Last Updated on Wed, Feb 3 2021 8:47 PM

Man Fell From Ceiling While Watching Into Womens Room - Sakshi

ప్రత్యక్ష సాక్షి, ఇన్‌సెట్‌లో బ్రియానా్‌

అమ్మాయిలు ఏవరైనా బట్టలు మార్చుకుంటుంటే చూద్దామని...

వాషింగ్టన్‌ : అమ్మాయిలు బట్టలు మార్చుకునే గదిలోకి తొంగిచూస్తూ అడ్డంగా బుక్కయ్యాడో వ్యక్తి. సీలింగ్‌పై నుంచి గదిలోకి పడి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన అమెరికాలోని వర్జీనియాలో ఆలస్యంగా వెలుగుచూసింది. స్టాండ్‌ఫోర్డ్‌ కౌంటీ షరీఫ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో షేర్‌ చేసిన వివరాల మేరకు.. వర్జీనియాకు చెందిన బ్రియాన్‌ ఆంథోనీ జోయ్‌ శనివారం అక్కడి ఓ జిమ్‌కు వెళ్లాడు. వర్కవుట్లు చేయటం అయిపోయిన తర్వాత ఉమెన్స్‌ లాకర్‌ రూం( అమ్మాయిలు బట్టలు మార్చుకునే, దాచుకునే గది)లోని సీలింగ్‌పై నక్కి కూర్చున్నాడు.. అమ్మాయిలు ఏవరైనా బట్టలు మార్చుకుంటే చూద్దామని. కొద్దిసేపటి తర్వాత అతడి బరువు తాళలేకపోయిన సీలింగ్‌ షీటు ఊడిపోయింది. దీంతో అతడు పది అడుగుల ఎత్తునుంచి అమ్మాయిల గదిలోకి ఊడిపడ్డాడు. అదే సమయంలో గదిలోకి వచ్చిన ఓ అమ్మాయి అతడు పైనుంచి కిందపడటంతో బిత్తరపోయింది. ( పీపాలో నెల రోజులు.. మలం తిని బతికాడు)

మొదట అతడ్ని జిమ్‌ సిబ్బంది అనుకుంది. అయితే అతడి ఒంటిపై యూనీఫాం‌కు బదులు మామూలు డ్రెస్‌ ఉండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. అతడు కిందపడిన వెంటనే పైకి లేచి, దొంగచూపులు చూస్తూ రూములోంచి బయటకు వెళ్లిపోయాడు.  బ్రియాన్‌పై అనుమానం వచ్చిన ఓ వ్యక్తి అతడ్ని అడ్డగించి ప్రశ్నించగా.. సమాధానం చెప్పలేకపోయాడు. అక్కడినుంచి పారిపోయి జిమ్‌లోని బాత్‌రూమ్‌లో దాక్కున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బ్రియాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement