‘రెండు రోజుల క్రితమే నా గుండె ఆగిపోయింది’ | Baseball Player Says His Life Turned To Ash After Died His Wife And Son | Sakshi
Sakshi News home page

బేస్‌ బాల్‌ ఆటగాడి భావోద్వేగ సందేశం!

Published Fri, Aug 30 2019 6:59 PM | Last Updated on Fri, Aug 30 2019 7:35 PM

Baseball Player Says His Life Turned To Ash After Died His Wife And Son - Sakshi

మూడు రోజుల క్రితం మైనర్‌ లీగ్‌ బేస్‌ బాల్‌  ఆటగాడు బ్లేక్‌ బివెన్స్‌ కుటుంబ సభ్యులు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బివెన్స్‌ భార్య, కుమారుడితో పాటు అత్తగారు కూడా మరణించారు. తన కుటుంబ సభ్యుల మరణవార్త తెలిసి బివెన్స్‌ కుప్పకూలిపోయాడు. వారి మరణంతో బివెన్స్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ‘నాకు తెలుస్తోంది నా జీవితం నాశనమైందని, రెండు రోజుల క్రితమే నా గుండె ఆగిపోయింది’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో వారి ఫొటోలు పోస్ట్‌ చేశాడు బివెన్స్‌. దాంతో పాటు కుటుంబ సభ్యులతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా భావోద్వేగ సందేశాన్ని పోస్ట్‌ చేశాడు.

బివెన్స్‌ తన 25 ఏళ్ల భార్య గురించి చెబుతూ ‘ఎమిలీ నువ్వు ప్రపంచంలోనే ఉత్తమమైన భార్యవి, తల్లివి కూడా. నువ్వు చూపించేంత ప్రేమను ఇంకెవరు చూపలేరు. నీ ప్రేమ, దయ నా జీవితాన్ని మార్చేశాయ’ని పేర్కొన్నాడు. తన 14నెల కుమారుడు కల్లెస్‌ గురించి...‘నువ్వు పుట్టిన తర్వాతే నాకు ప్రేమ అంటే ఏంటో అర్థయయ్యింది. నువ్వు ఏడిస్తే చుడలేక ఏదో ఒకటి చేసి  నిన్ను నవ్వించే వాడిని. నువ్వు లేకుండా నేను ఊపీరి పీల్చుకోలేను’ అంటూ కుమారుడిపై తనకు ఉన్న ప్రేమను తెలిపాడు. అలాగే 65 ఏళ్ల అత్తగారిని ఉద్దేశిస్తూ బివెన్స్‌ ‘తను కుటుంబం పట్ల చూపించే ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ తల్లి, కుతూళ్లు చనిపోయి కూడా కలిసి ఉన్నందుకు ఆనందంగా ఉందని’ తన భావోద్వేగాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు.

మంగళవారం వర్జీనియాలోని తన ఇంట్లో ఈ ముగ్గురు విగత జీవులుగా పడి ఉన్నట్లు బివెన్స్‌కు పోలీసులు సమాచారం అందించాడు. తన భార్యకు సోదరుడి వరుసైన మాథ్యూ థామస్‌ బెర్నాడ్‌ ఈ హత్య చేసుంటాడని బివెన్స్‌  అనుమానం వ్యక్తం చేశాడు. దీని గురించి బివెన్స్‌ మాట్లాడుతూ.. ‘మేము, బెర్నాడ్‌లు ఒకే చర్చికి వెళ్తాం. గత కొద్ది రోజులుగా అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. తరచూ మా కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు’ అని బివెన్స్‌ పోలీసులకు తెలిపాడు. దీంతో బెర్నాడ్‌పై కెసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Two days ago my heart was turned to ash. My life as I knew it is destroyed. The pain my family and I feel is unbearable and cannot be put into words. I shake and tremble at the thought of our future without them. Emily, my sweetheart, you are the best wife and mother this world has ever seen. You made me into the man I am today and you loved me with all of my flaws. You brought our precious baby boy into this world and made our family complete. Your love and kindness changed countless lives, including mine. My sweet little boy, dada loves you so much! I can’t breathe without you here. I finally understood what love was when you were born and I would have done anything for you. You have changed my life forever, you are my reason why. I long to hold the both of you again in heaven. I’m so glad you are with all your Great-grandmothers now, I know they are eating you up. This earth did not deserve either of you; you were just too wonderful to comprehend. Joan you were the best mother-in-law anyone could ask for. You loved your family more than anyone I’ve ever seen. You raised the most wonderful girl in the world. I’m so glad y’all are still together. You were the best Nana this world has ever seen and I will never forget you. Skip you are a wonderful father and grandfather. We will get through this together as a family. We will not let the devil win! Thank you God for giving me the most wonderful family in the world! I’ve been blessed beyond belief. Thank you to all my family and friends who have reached out to me during this time of sorrow. Thank you @raysbaseball @biscuitbaseball for your support through everything. I am comforted by all the messages and well wishes. I’m not sure what is next for me, but I do know God has a plan even though I can’t see it.

A post shared by Blake Bivens (@blakebbins) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement