base ball
-
వామ్మో కట్టెముక్కను విరిచినట్లు.. బ్యాట్‌ను సింపుల్‌గా
మనుషులకు కోపం సహజం. అందులో కొంతమంది కోపాన్ని తట్టుకోవడం కష్టం. కోపంలో ఉన్న వ్యక్తి తనకు ఏది ఎదురుపడితే దానిని విరిచేయడమో లేక పగులగొట్టడమో చేస్తుంటారు. తాజాగా బేస్‌బాల్ ఆటలో తాను ఔటయ్యాననే కోపంలో బ్యాట్‌ను రెండు ముక్కలు చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏదో కట్టెముక్కును విరగొట్టినట్లుగా సింపుల్‌గా బ్యాట్‌ను విరిచేయడం ఆసక్తిగా మారింది. విషయంలోకి వెళితే.. న్యూయార్క్ మెట్స్, మియామి మార్లిన్స్ మధ్య బేస్‌బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూయార్క్ మెట్స్ 5-3 తేడాతో మియామి మార్లిన్స్పై విజయం అందుకుంది. అయితే మ్యాచ్ విజయం కంటే న్యూయార్క్ మెట్స్ స్టార్ పీట్ అలోన్సో చర్య ఎక్కువ హైలైట్ అయింది. 8వ ఇన్నింగ్స్‌లో పీట్ అలోన్సో షాట్ ఆడే ప్రయత్నంలో ఔట్ అయ్యాడు. కీలక సమయంలో ఔటయ్యానన్న బాధ పీట్ అలోన్సో కళ్లలో స్పష్టంగా కనిపించింది. అంతే ఉగ్రంగా మారిపోయిన పీట్.. ఏదో కట్టెముక్కను విరిచేసిట్లు బ్యాట్‌ను తొడ బాగంలో పెట్టుకొని సింపుల్‌గా రెండు ముక్కలు చేసి పారేశాడు. దీనికి సంబంధించిన వీడియోపై మీరు ఒక లుక్కేయండి. Pete was not happy. pic.twitter.com/iQ7hKWm0Qf — Bally Sports Florida & Bally Sports Sun (@BallySportsFL) June 25, 2022 చదవండి: కోపం వస్తే మాములుగా ఉండదు.. మరోసారి నిరూపితం రోహిత్ దూరమైతే!.. కోహ్లి లేదా పంత్ కాదనుకుంటే రహానే? -
అది బేస్‌బాల్ గేమ్.. ఏమరపాటుగా ఉంటే అంతే సంగతి!
బేస్‌బాల్ గేమ్ అంటేనే ప్రమాదానికి పెట్టింది పేరు. మాములుగానే బేస్‌బాల్ గేమ్‌లో మూతి, ముక్కు పగలడం ఖాయం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఫ్రీవే సిరీస్‌లో భాగంతగా డాడ్జర్స్, ఏంజెల్స్ మధ్య బేస్‌బాల్ మ్యాచ్ జరిగింది. బ్యాటర్ కొట్టిన ఒక బంతి ప్లేట్ అంపైర్ ముక్కు పగిలేలా చేసింది. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో మైక్ ట్రౌట్స్ డాడ్జర్స్ వేసిన బంతిని బలంగా బాదాడు. అయితే ఈ క్రమంలో బ్యాట్ నుంచి హ్యాండిల్ వేరు కావడంతో అది నేరుగా పిచర్(క్యాచ్ తీసుకునేవాడు) వెనకాల ఉన్న ప్లేట్ అంపైర్ టామ్లిన్సన్ వైపు దూసుకెళ్లింది. ఆ బ్యాట్ నేరుగా టామ్లిన్సన్ కన్ను, ముక్కు మధ్య భాగంలో బలంగా తాకింది. నొప్పితో విలవిల్లాడిన టామ్లిన్సన్ అక్కడే కుప్పకూలాడు. రన్ పూర్తయిన తర్వాత గ్రౌండ్లోకి వచ్చిన మెడికల్ సిబ్బంది టామ్లిన్సన్ను పరిశీలించగా.. ముక్కు, కన్ను నుంచి రక్తం కారింది. వెంటనే అతన్ని చికిత్స కోసం బయటికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు. ''అది బేస్‌బాల్ గేమ్.. ఏమరపాటుగా ఉన్నారంటే అంతే సంగతి'' అంటే పేర్కొన్నాడు. ఇక 31 ఏళ్ల టామ్లిన్సన్ 2020లో ఎంఎల్‌బీ డెబ్యూ ఇచ్చాడు. Scary moment in LA. The home plate umpire is struck in the face by Mike Trout's broken bat 😳 pic.twitter.com/8pieLT7mKB — Bleacher Report (@BleacherReport) June 15, 2022 -
జెలెన్స్కీ సంతకంతో కూడిన బేస్‌బాల్ వేలం
Baseball Up For Auction Proceeds To Support Relief Efforts In Ukraine: జెలెన్స్కీ సంతకం చేసిన మేజర్ లీగ్ బేస్‌బాల్(ఎంఎల్‌బీ) ఉక్రెయిన్ సహాయర్థం వేలాని సిద్ధమవుతోంది. 2019లో బిగ్ యాపిల్‌ను సందర్శించినందుకు గుర్తుగా ఉక్రేనియన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఈ ఎంఎల్‌బీ బేస్‌బాల్ పై సంతకం చేశారు. ఈ ఎంఎల్‌బీ బేస్‌బాల్ పై ఉక్రెయిన్ భాషలోనూ, ఇంగ్లీష్ భాషలోనూ జెలన్స్కీ సంతకం ఉంటుంది. అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో ఉక్రెయిన్ రాయబారిగా వ్లాదిమిర్ యెల్చెంకో ఉన్నసమయంలో ఆయన సంతకంతో కూడిన లేఖతో ఈ బేస్‌బాల్ అమెరికాకి వచ్చింది. ప్రస్తుతం ఈ బేస్‌బాల్ ఆర్ఆర్ వేలం ద్వారా అమ్మాకానికి వెళ్తోంది. వేలంలో ఇది సుమారు రూ.11 లక్షలు వరకు పలుకుతుందని నిపుణుల అంచనా. న్యూయార్క్‌లో ప్రభుత్వ వ్యవహారాల నిపుణుడిగా ఉన్న రాండీ ఎల్ కప్లాన్ ఈ బేస్ బాల్‌ను విక్రయిస్తున్నట్లు ఆర్ఆర్ వేలం హౌస్ తెలిపింది. అతను ఈ బేస్‌బాల్‌ని ఉక్రెయిన్ రాయబారి యెల్చెంకో నుండి బహుమతిగా అందుకున్నాడు. అంతేకాదు రాండీ ఎల్ కప్లాన్ సంపాదనలో కొంత భాగాన్ని ఉక్రెనియన్ సహాయ నిధికి విరాళంగా ఇవ్వాలని యోచిస్తున్నారు కూడా. ఆర్ఆర్ వేలం కూడా అదే ఫండ్‌కు ఈ బేస్‌బాల్ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇస్తామని పేర్కొంది. మే 11న ఈ వేలం ముగియనుంది. ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశంతో రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయిలో దాడికి దిగాయి. గత రెండు నెలలకు పైగా నిరవధిక దాడులతో ఉక్రెయిన్‌ని శిథిలానగరంగా మార్చింది. వేలాది మంది నిరాశ్రయులవ్వగా, లక్షలాదిమంది వలస వెళ్లిపోయారు. ఇంకా చాలామంది ఉక్రెనియన్ పౌరులు భూగర్భ రైల్వేస్టేషన్లలోనే తలదాల్చుకుంటున్నారు. (చదవండి: ఉక్రెయిన్ ఎదురుదాడి) -
‘రెండు రోజుల క్రితమే నా గుండె ఆగిపోయింది’
మూడు రోజుల క్రితం మైనర్ లీగ్ బేస్ బాల్ ఆటగాడు బ్లేక్ బివెన్స్ కుటుంబ సభ్యులు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బివెన్స్ భార్య, కుమారుడితో పాటు అత్తగారు కూడా మరణించారు. తన కుటుంబ సభ్యుల మరణవార్త తెలిసి బివెన్స్ కుప్పకూలిపోయాడు. వారి మరణంతో బివెన్స్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ‘నాకు తెలుస్తోంది నా జీవితం నాశనమైందని, రెండు రోజుల క్రితమే నా గుండె ఆగిపోయింది’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో వారి ఫొటోలు పోస్ట్ చేశాడు బివెన్స్. దాంతో పాటు కుటుంబ సభ్యులతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశాడు. బివెన్స్ తన 25 ఏళ్ల భార్య గురించి చెబుతూ ‘ఎమిలీ నువ్వు ప్రపంచంలోనే ఉత్తమమైన భార్యవి, తల్లివి కూడా. నువ్వు చూపించేంత ప్రేమను ఇంకెవరు చూపలేరు. నీ ప్రేమ, దయ నా జీవితాన్ని మార్చేశాయ’ని పేర్కొన్నాడు. తన 14నెల కుమారుడు కల్లెస్ గురించి...‘నువ్వు పుట్టిన తర్వాతే నాకు ప్రేమ అంటే ఏంటో అర్థయయ్యింది. నువ్వు ఏడిస్తే చుడలేక ఏదో ఒకటి చేసి నిన్ను నవ్వించే వాడిని. నువ్వు లేకుండా నేను ఊపీరి పీల్చుకోలేను’ అంటూ కుమారుడిపై తనకు ఉన్న ప్రేమను తెలిపాడు. అలాగే 65 ఏళ్ల అత్తగారిని ఉద్దేశిస్తూ బివెన్స్ ‘తను కుటుంబం పట్ల చూపించే ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ తల్లి, కుతూళ్లు చనిపోయి కూడా కలిసి ఉన్నందుకు ఆనందంగా ఉందని’ తన భావోద్వేగాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. మంగళవారం వర్జీనియాలోని తన ఇంట్లో ఈ ముగ్గురు విగత జీవులుగా పడి ఉన్నట్లు బివెన్స్కు పోలీసులు సమాచారం అందించాడు. తన భార్యకు సోదరుడి వరుసైన మాథ్యూ థామస్ బెర్నాడ్ ఈ హత్య చేసుంటాడని బివెన్స్ అనుమానం వ్యక్తం చేశాడు. దీని గురించి బివెన్స్ మాట్లాడుతూ.. ‘మేము, బెర్నాడ్‌లు ఒకే చర్చికి వెళ్తాం. గత కొద్ది రోజులుగా అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. తరచూ మా కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు’ అని బివెన్స్ పోలీసులకు తెలిపాడు. దీంతో బెర్నాడ్పై కెసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. View this post on Instagram Two days ago my heart was turned to ash. My life as I knew it is destroyed. The pain my family and I feel is unbearable and cannot be put into words. I shake and tremble at the thought of our future without them. Emily, my sweetheart, you are the best wife and mother this world has ever seen. You made me into the man I am today and you loved me with all of my flaws. You brought our precious baby boy into this world and made our family complete. Your love and kindness changed countless lives, including mine. My sweet little boy, dada loves you so much! I can’t breathe without you here. I finally understood what love was when you were born and I would have done anything for you. You have changed my life forever, you are my reason why. I long to hold the both of you again in heaven. I’m so glad you are with all your Great-grandmothers now, I know they are eating you up. This earth did not deserve either of you; you were just too wonderful to comprehend. Joan you were the best mother-in-law anyone could ask for. You loved your family more than anyone I’ve ever seen. You raised the most wonderful girl in the world. I’m so glad y’all are still together. You were the best Nana this world has ever seen and I will never forget you. Skip you are a wonderful father and grandfather. We will get through this together as a family. We will not let the devil win! Thank you God for giving me the most wonderful family in the world! I’ve been blessed beyond belief. Thank you to all my family and friends who have reached out to me during this time of sorrow. Thank you @raysbaseball @biscuitbaseball for your support through everything. I am comforted by all the messages and well wishes. I’m not sure what is next for me, but I do know God has a plan even though I can’t see it. A post shared by Blake Bivens (@blakebbins) on Aug 29, 2019 at 6:55pm PDT -
బేస్‌బాల్ క్యాంప్‌నకు మనోళ్లు ముగ్గురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన ముగ్గురు బేస్‌బాల్ క్రీడాకారులు అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఈస్ట్ మారేడ్‌పల్లి శ్రీచైతన్య హైస్కూల్‌కు చెందిన చెల్సీ రోజ్, బోయిన్పల్లి సెయింట్ ఆండ్రూస్ స్కూల్ విద్యార్థి నాథన్ నీల్ పెరికా, సికింద్రాబాద్ సెయింట్ ప్యాట్రిక్ హైస్కూల్ ప్లేయర్ నరబియోన్ నోహ్ అమెరికాలోని లిటిల్ లీగ్ ఇంటర్నేషనల్ బేస్‌బాల్ క్యాంప్‌నకు ఎంపికయ్యారు. పెన్సిల్వేనియాలోని విలియమ్స్పోర్ట్ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 2 వరకు వీరు ఈ శిక్షణలో పాల్గొంటారు. , -
హైదరాబాద్ చార్జర్స్ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బేస్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న సీఎం కప్ బేస్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ చార్జర్స్ శుభారంభం చేసింది. ఆదివారం ఆడిన రెండు మ్యాచ్‌ల్లో... తొలి మ్యాచ్‌లో గెలుపొందిన హైదరాబాద్ చార్జర్స్, రెండో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. తొలుత హైదరాబాద్ చార్జర్స్ 3–2తో తారకరామ క్లబ్‌పై గెలుపొందింది. విజేత జట్టులో మణికంఠ, ఫణీంద్ర, సందీప్ తలా ఓ పరుగు చేశారు. తారకరామ తరఫున ప్రభు, మొయిన్ రాణించారు. హైదరాబాద్ చార్జర్స్, సన్నీ స్పోర్ట్స్ లీగ్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఈ మ్యాచ్‌లోనూ మణికంఠ, ఫణీంద్ర ఆకట్టుకున్నారు. చెరో 2 పరుగులు స్కోర్ చేశారు. హరీశ్, సందీప్ చెరో పాయింట్ సాధించారు. సన్నీ స్పోర్ట్స్ తరఫున మణికంఠ 2 పరుగులు చేయగా... విజయ్, కుమార్, సృజిత్, మొయిన్ తలా ఒక పరుగు సాధించారు. ఇతర మ్యాచ్‌ల్లో స్మాషర్స్ స్పోర్ట్స్ క్లబ్ (శ్రీతేజ 1, అభినవ్ 1) 2–1తో మారేడుపల్లి బ్లూస్ (హరినారాయణ 1)పై, సర్దార్ పటేల్ బేస్‌బాల్ క్లబ్ (నరేన్ 2, అరవింద్ 1) 3–2తో మారేడ్‌పల్లి యంగ్‌మెన్ (నరేందర్ 1, నర్సింగ్ 1)పై, మారేడ్‌పల్లి ప్లే గ్రౌండ్ (వికాస్ 1, చరణ్ 1, సాయితేజ 1, వినయ్ 1)4–0తో తారకరామ క్లబ్‌పై, మారేడ్‌పల్లి యంగ్ మెన్ (నర్సింగ్ 1, నరేందర్ 1, సంజయ్ 1, శుభమ్ 1) 4–1తో మారేడ్‌పల్లి బ్లూస్ (రాజు 1)పై విజయం సాధించి ముందంజ వేశాయి. -
బాల్ 'అక్కడ' తగిలితే..రియాక్షన్ ఇక్కడ
-
రేపటి నుంచి ఎస్జీఎఫ్ గేమ్స్
సాక్షి, హైదరాబాద్: అండర్-19 హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. నగరంలోని వివిధ వేదికల్లో మొత్తం 19 క్రీడాంశాల్లో బాలబాలికల విభాగాలలో ఈ పోటీలను నిర్వహిస్తారు. సెప్టెంబర్ 16: చెస్ జీజేసీ, కూకట్పల్లి సెప్టెంబర్ 16: టార్గెట్బాల్, ఎల్బీ స్టేడియం హ్యాండ్‌బాల్ పీజీ సెప్టెంబర్ 16: సైక్లింగ్, ఓయూ సైక్లింగ్ స్టేడియం సెప్టెంబర్ 16: వెయిట్ లిఫ్టింగ్, ఎల్బీ స్టేడియం సెప్టెంబర్ 16: పవర్ లిఫ్టింగ్, ఎల్బీ స్టేడియం సెప్టెంబర్ 16: ఫెన్సింగ్, ఎల్బీ స్టేడియం సెప్టెంబర్ 16: జిమ్నాస్టిక్స్, ఎల్బీ స్టేడియం సెప్టెంబర్ 16: యోగా, ఎల్బీ స్టేడియం సెప్టెంబర్ 16: టెన్నికాయిట్, ఎల్బీ స్టేడియం సెప్టెంబర్ 16: టెన్నిస్ వాలీబాల్, జీహెచ్ఎంసీ, ముషీరాబాద్ పీజీ సెప్టెంబర్ 16: బీచ్ వాలీబాల్, జీహెచ్ఎంసీ, సికింద్రాబాద్ స్విమ్మింగ్‌పూల్ సెప్టెంబర్ 17: స్విమ్మింగ్, జీహెచ్ఎంసీ, సికింద్రాబాద్ స్విమ్మింగ్‌పూల్ సెప్టెంబర్ 18: సాఫ్ట్ టెన్నిస్, ఇందిరాపార్క్ టెన్నిస్ కోర్ట్ సెప్టెంబర్ 18: సూపర్‌సెవెన్ క్రికెట్, భవన్స కాలేజ్, సైనిక్‌పురి సెప్టెంబర్ 19: బాస్కెట్‌బాల్, వీపీజీ జీహెచ్ఎంసీ, బాస్కెట్‌బాల్ కోర్ట్ సెప్టెంబర్ 20: ఫీల్డ్ ఆర్చరీ, ఎగ్జిబిషన్ గ్రౌండ్స సెప్టెంబర్ 20: సెపక్తక్రా వీపీజీ, ఇండోర్ స్టేడియం సెప్టెంబర్ 22: నెట్‌బాల్, జీజేసీ, కాచిగూడ సెప్టెంబర్ 22: బేస్‌బాల్, జీసీపీఈ -
బేస్‌బాల్ రాష్ట్ర జట్టుకు భూలక్ష్మి ఎంపిక
అమరావతి : సబ్ జూనియర్స్ బేస్‌బాల్ రాష్ట్ర జట్టుకు అమరావతి శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్‌కు చెందిన టెన్త్ విద్యార్థిని కె. భూలక్ష్మి ఎంపికైనట్లు హెచ్ఎం కొల్లి లక్ష్మీనారాయణ సోమవారం విలేకరులకు తెలిపారు. ఈనెల 13, 14 తేదీల్లో ఏలూరు సమీపంలోని పెదపాలెంలో జరిగిన రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొన్న భూలక్ష్మి ప్రతిభ చూపి రాష్ట్ర జట్టుకు ఎంపికైందని చెప్పారు. సెప్టెంబరు12న కేరళలోని త్రివేండ్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొంటుదని తెలిపారు. విద్యార్థినిని వ్యాయామ ఉపాధ్యాయురాలు అనురాధ తదితరులు అభినందించారు. -
బేస్ బాల్ నుంచి క్రికెట్ వైపు!
టోక్యో: బేస్ బాల్ గేమ్ అంటేనే మనకు గుర్తొచ్చే దేశం జపాన్. ఈ దేశాన్ని బేస్ బాల్ కింగ్ అని కూడా పిలుస్తారు. అయితే ఆ దేశం బేస్ బాల్ నుంచి క్రికెట్ వైపు అడుగులు వేస్తోంది. అంతర్జాతీయంగా క్రికెట్‌కు విశేషమైన ఆదరణ పెరగడం జపాన్ ను సైతం ఆకర్షించింది. ఆ క్రీడలో దూసుకుపోవాలని జపాన్ ఉవ్విళ్లూరుతోంది. వచ్చే వరల్డ్ కప్ నాటికి క్వాలిఫయింగ్ రౌండ్లోకి ప్రవేశించడానికి యత్నాలు చేస్తున్నట్లు ఆ దేశ క్రికెట్ కెప్టెన్ మాసోమీ కొబాయాషి తెలిపాడు. ఇప్పటికే జపాన్‌లో 200 జట్లు ఉండగా, దాదాపు 3,000 మంది క్రికెట్ ను ఆడేందుకు సిద్ధమయ్యారన్నాడు. ఇటీవల కాలంలో తమ దేశంలో క్రికెట్ కు బాగా ఆదరణ పెరిగిందన్నాడు. గత నవంబర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సానో క్రికెట్ స్టేడియం కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ త్వరలో చైనా, సౌత్ కొరియా, హాంకాంగ్ జట్లతో ఈస్ట్ ఆసియా కప్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. జపాన్ క్రికెట్ అసోసియేషన్‌కు అలెక్స్ మియాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్నారు.