
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన ముగ్గురు బేస్‌బాల్ క్రీడాకారులు అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఈస్ట్ మారేడ్‌పల్లి శ్రీచైతన్య హైస్కూల్‌కు చెందిన చెల్సీ రోజ్, బోయిన్‌పల్లి సెయింట్ ఆండ్రూస్ స్కూల్ విద్యార్థి నాథన్ నీల్ పెరికా, సికింద్రాబాద్ సెయింట్ ప్యాట్రిక్ హైస్కూల్ ప్లేయర్ నరబియోన్ నోహ్ అమెరికాలోని లిటిల్ లీగ్ ఇంటర్నేషనల్ బేస్‌బాల్ క్యాంప్‌నకు ఎంపికయ్యారు. పెన్సిల్వేనియాలోని విలియమ్స్‌పోర్ట్ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 2 వరకు వీరు ఈ శిక్షణలో పాల్గొంటారు.
,
Comments
Please login to add a commentAdd a comment