
సాక్షి, సిద్దిపేట జిల్లా: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి తలసాని శశ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఆ ఎన్నికల్లో గెలుపు తమదేనని జోస్యం చెప్పారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వ హయాంలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రం వద్ద అన్ని ఏర్పాట్లు చేశాం.త్రాగు నీరు,వసతి గదులు,బంగారు కిరీటం వంటి అనేక విధాలుగా మల్లన్న ఆలయం అభివృద్ధి చేశాం. కేసీఆర్ హయాంలో మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేశారు కాబట్టే గతంలో సుమారు ఐదు కోట్లు ఉన్న ఆదాయం .. ఇప్పుడు గణనీయంగా సుమారు 20కోట్లకు పైగా చేరింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14నెలలు అవుతున్న రైతులు, సబ్బండ వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు,420హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క గ్యారెంటీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హనీమూన్ పిరియడ్ అయిపోయింది. ఇకపై ప్రజల ఇబ్బందులపై శ్రద్ధ చూపాలి.
కులగణనపై ఏ కుల సంఘాల నాయకులు సంతృప్తి లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం మబ్బే పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ విధానాలను అన్ని గమనిస్తున్నారు. రాష్ట్ర జనాభా 4కోట్లకు పైగా జనాభా ఉంటే ప్రభుత్వం 3కోట్ల 70లక్షలుగా చూపిస్తుంది.
కులగణనపై హడావిడిగా అసెంబ్లీలో చేయాల్సి తీర్మానం చేయాల్సిన అవసరం లేదు.గతంలోనే మాజీ సిఎం కేసీఆర్ అసెంబ్లీలో కులగణనపై తీర్మానం ప్రవేశ పెట్టారు. మేడిగడ్డలో చిన్న సమస్య వస్తే భూతద్దంలో పెట్టీ చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బిసి సొరంగం ఘటనపై ఎవరు భాధ్యత వహిస్తారు. నోరు ఉందిగా అని ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. కేసీఆర్ దూరదృష్టి తోనే ప్రాజెక్టులను నిర్మించి రైతులకు అండగా నిలబడ్డారు.
అన్నివర్గాల ప్రజలను కదిలిస్తే ఏ ప్రభుత్వం ప్రజలకోసం పనిచేసింది వాళ్ళే చెబుతారు. న్యాయస్థానం తీర్పు మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం,ఆ ఎన్నికల్లో గెలుపు తమదేనని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment