హైదరాబాద్‌ చార్జర్స్‌ శుభారంభం | Hyderabad Charters beats Taraka Rama Club in Base Ball | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ చార్జర్స్‌ శుభారంభం

Published Mon, Feb 18 2019 10:07 AM | Last Updated on Mon, Feb 18 2019 10:07 AM

Hyderabad Charters beats Taraka Rama Club in Base Ball - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా బేస్‌బాల్‌ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న సీఎం కప్‌ బేస్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ చార్జర్స్‌ శుభారంభం చేసింది. ఆదివారం ఆడిన రెండు మ్యాచ్‌ల్లో... తొలి మ్యాచ్‌లో గెలుపొందిన హైదరాబాద్‌ చార్జర్స్, రెండో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. తొలుత హైదరాబాద్‌ చార్జర్స్‌ 3–2తో తారకరామ క్లబ్‌పై గెలుపొందింది. విజేత జట్టులో మణికంఠ, ఫణీంద్ర, సందీప్‌ తలా ఓ పరుగు చేశారు. తారకరామ తరఫున ప్రభు, మొయిన్‌ రాణించారు. హైదరాబాద్‌ చార్జర్స్, సన్నీ స్పోర్ట్స్‌ లీగ్‌ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్‌ డ్రా గా ముగిసింది.

ఈ మ్యాచ్‌లోనూ మణికంఠ, ఫణీంద్ర ఆకట్టుకున్నారు. చెరో 2 పరుగులు స్కోర్‌ చేశారు. హరీశ్, సందీప్‌ చెరో పాయింట్‌ సాధించారు. సన్నీ స్పోర్ట్స్‌ తరఫున మణికంఠ 2 పరుగులు చేయగా... విజయ్, కుమార్, సృజిత్, మొయిన్‌ తలా ఒక పరుగు సాధించారు. ఇతర మ్యాచ్‌ల్లో స్మాషర్స్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ (శ్రీతేజ 1, అభినవ్‌ 1) 2–1తో మారేడుపల్లి బ్లూస్‌ (హరినారాయణ 1)పై, సర్దార్‌ పటేల్‌ బేస్‌బాల్‌ క్లబ్‌ (నరేన్‌ 2, అరవింద్‌ 1) 3–2తో మారేడ్‌పల్లి యంగ్‌మెన్‌ (నరేందర్‌ 1, నర్సింగ్‌ 1)పై, మారేడ్‌పల్లి ప్లే గ్రౌండ్‌ (వికాస్‌ 1, చరణ్‌ 1, సాయితేజ 1, వినయ్‌ 1)4–0తో తారకరామ క్లబ్‌పై, మారేడ్‌పల్లి యంగ్‌ మెన్‌ (నర్సింగ్‌ 1, నరేందర్‌ 1, సంజయ్‌ 1, శుభమ్‌ 1) 4–1తో మారేడ్‌పల్లి బ్లూస్‌ (రాజు 1)పై విజయం సాధించి ముందంజ వేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement