
బేస్‌బాల్ గేమ్ అంటేనే ప్రమాదానికి పెట్టింది పేరు. మాములుగానే బేస్‌బాల్ గేమ్‌లో మూతి, ముక్కు పగలడం ఖాయం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఫ్రీవే సిరీస్‌లో భాగంతగా డాడ్జర్స్, ఏంజెల్స్ మధ్య బేస్‌బాల్ మ్యాచ్ జరిగింది. బ్యాటర్ కొట్టిన ఒక బంతి ప్లేట్ అంపైర్ ముక్కు పగిలేలా చేసింది. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో మైక్ ట్రౌట్స్ డాడ్జర్స్ వేసిన బంతిని బలంగా బాదాడు.
అయితే ఈ క్రమంలో బ్యాట్ నుంచి హ్యాండిల్ వేరు కావడంతో అది నేరుగా పిచర్(క్యాచ్ తీసుకునేవాడు) వెనకాల ఉన్న ప్లేట్ అంపైర్ టామ్లిన్‌సన్ వైపు దూసుకెళ్లింది. ఆ బ్యాట్ నేరుగా టామ్లిన్‌సన్ కన్ను, ముక్కు మధ్య భాగంలో బలంగా తాకింది. నొప్పితో విలవిల్లాడిన టామ్లిన్‌సన్ అక్కడే కుప్పకూలాడు. రన్ పూర్తయిన తర్వాత గ్రౌండ్‌లోకి వచ్చిన మెడికల్ సిబ్బంది టామ్లిన్‌సన్‌ను పరిశీలించగా.. ముక్కు, కన్ను నుంచి రక్తం కారింది. వెంటనే అతన్ని చికిత్స కోసం బయటికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు. ''అది బేస్‌బాల్ గేమ్.. ఏమరపాటుగా ఉన్నారంటే అంతే సంగతి'' అంటే పేర్కొన్నాడు. ఇక 31 ఏళ్ల టామ్లిన్‌సన్ 2020లో ఎంఎల్‌బీ డెబ్యూ ఇచ్చాడు.
Scary moment in LA.
— Bleacher Report (@BleacherReport) June 15, 2022
The home plate umpire is struck in the face by Mike Trout's broken bat 😳 pic.twitter.com/8pieLT7mKB
Comments
Please login to add a commentAdd a comment