
ఉక్రెయిన్ సహాయార్థం వేలానికి ఉక్రెయిన్ అధ్యక్షుడి సంతకంతో కూడిన బేస్‌బాల్ వేలాని సిద్ధమవుతో్ంది. ఉక్రెయిన్ రాయబారిగా వ్లాదిమిర్ యెల్చెంకో ఉన్నసమయంలో ఆయన సంతకంతో కూడిన లేఖతో ఈ బేస్‌బాల్ అమెరికాకి వచ్చింది.
Baseball Up For Auction Proceeds To Support Relief Efforts In Ukraine: జెలెన్‌స్కీ సంతకం చేసిన మేజర్ లీగ్ బేస్‌బాల్(ఎంఎల్‌బీ) ఉక్రెయిన్ సహాయర్థం వేలాని సిద్ధమవుతోంది. 2019లో బిగ్ యాపిల్‌ను సందర్శించినందుకు గుర్తుగా ఉక్రేనియన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ఈ ఎంఎల్‌బీ బేస్‌బాల్ పై సంతకం చేశారు. ఈ ఎంఎల్‌బీ బేస్‌బాల్ పై ఉక్రెయిన్ భాషలోనూ, ఇంగ్లీష్ భాషలోనూ జెలన్‌స్కీ సంతకం ఉంటుంది. అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో ఉక్రెయిన్ రాయబారిగా వ్లాదిమిర్ యెల్చెంకో ఉన్నసమయంలో ఆయన సంతకంతో కూడిన లేఖతో ఈ బేస్‌బాల్ అమెరికాకి వచ్చింది. ప్రస్తుతం ఈ బేస్‌బాల్ ఆర్‌ఆర్ వేలం ద్వారా అమ్మాకానికి వెళ్తోంది. వేలంలో ఇది సుమారు రూ.11 లక్షలు వరకు పలుకుతుందని నిపుణుల అంచనా.
న్యూయార్క్‌లో ప్రభుత్వ వ్యవహారాల నిపుణుడిగా ఉన్న రాండీ ఎల్ కప్లాన్ ఈ బేస్ బాల్‌ను విక్రయిస్తున్నట్లు ఆర్‌ఆర్ వేలం హౌస్ తెలిపింది. అతను ఈ బేస్‌బాల్‌ని ఉక్రెయిన్ రాయబారి యెల్చెంకో నుండి బహుమతిగా అందుకున్నాడు. అంతేకాదు రాండీ ఎల్ కప్లాన్ సంపాదనలో కొంత భాగాన్ని ఉక్రెనియన్ సహాయ నిధికి విరాళంగా ఇవ్వాలని యోచిస్తున్నారు కూడా. ఆర్‌ఆర్ వేలం కూడా అదే ఫండ్‌కు ఈ బేస్‌బాల్ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇస్తామని పేర్కొంది.
మే 11న ఈ వేలం ముగియనుంది. ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశంతో రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయిలో దాడికి దిగాయి. గత రెండు నెలలకు పైగా నిరవధిక దాడులతో ఉక్రెయిన్‌ని శిథిలానగరంగా మార్చింది. వేలాది మంది నిరాశ్రయులవ్వగా, లక్షలాదిమంది వలస వెళ్లిపోయారు. ఇంకా చాలామంది ఉక్రెనియన్ పౌరులు భూగర్భ రైల్వేస్టేషన్లలోనే తలదాల్చుకుంటున్నారు.
(చదవండి: ఉక్రెయిన్ ఎదురుదాడి)