signed
-
డార్విన్ సంతకంతో కూడిన లేఖ వేలంలో ఎంత పలుకుతోందంటే...
ప్రముఖ బ్రిటన్ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ అంటే తెలియని వారుండరు. అతని పేరు తలుచుకుంటే గుర్తోచ్చేది జీవ పరిణామ సిద్ధాంతం. అంతా గొప్ప శాస్త్రవేత్తకు ప్రతిపాదించిన జీవ పరిణామా సిద్ధాంతానికి సంబంధించిన ఒక పత్రం వెలుగులోకి వచ్చింది. అదికూడా ఆయన సంతకంతో కూడిని లేఖ కావడం విశేషం. వాస్తవానికి ఆయన పరిశోధనల గురించి క్రమం తప్పకుండా ఒక ప్రతిలో నోట్ చేసి ఉండనందున ఆయనకు సంబంధించిన రచనలు ఇంత వరకు సరిగా దొరకలేదు. ఒక వేళ దొరికినా వాటిలో సాధారణంగా డార్విన్ లేదా సీహెచ్ డార్విన్ అని మాత్రమే ఉంటుంది. కానీ అతని పూర్తి పేరుతో సంతకం చేసిని లేఖ దొరకడం అత్యంత అరుదు. ఈ మేరకు డార్విన్ ఆన్‌లైన్‌గా పిలిచే డేటాబేస్ క్యూరేటర్ ప్రొఫెసర్ జాన్ వాన్ వైహే మాట్లాడుతూ అత్యంత గొప్ప శాస్త్రవేత్త సంతకంతో కూడిన ప్రతి చాలా ప్రత్యకమైనది. అది ఆన్ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ మూడవ ఎడిషన్‌లో భాగానికి సంబంధించిన లేఖగా పేర్కొన్నారు. ఈ లేఖ న్యూయార్క్‌లోని సోథెబైస్ వేలంలో సుమారు రూ. 9 కోట్లు పలుకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ లేఖలో డార్విన్...ఇందులో అసలు వాస్తవాలను పరిగణలోనికి తీసుకుని వెల్లడిస్తాను. జీవులు వాటి జాతుల వర్గీకరణ వైవిద్యాలను ఆ పరిణామ సిద్ధాంతం వివరిస్తోంది. ఒక్కోసారి ఆ వర్గీకరణ కూడా తప్పుగా ఉండొచ్చు. అదీ క్రమంగా తప్పుడు సిద్ధాంతాన్ని వివరించకూడదు. జీవ సారాంశం, దాని మూలం గురించి సమగ్రంగా వివరించడం అనేది కొంచెం క్లిష్టతరమైనదిగా పేర్కొనవచ్చు. అలాగే న్యూటన్ గురత్వాకర్షణ సిద్ధాంతం సారాంశం ఏంటనేది కచ్చితంగా వివరించలేం. కానీ న్యూటన్ తన పరిశోధనల్లో తత్వశాస్త్రంలోని అద్భుతమైన కొత్త సిద్ధాంతాలను పరిచయం చేశాడన్నారు. (చదవండి: మరణించిన వారిని మళ్లీ పునర్జీవింప చేసే సంస్థ...మళ్లీ బతకాలని....) -
జెలెన్స్కీ సంతకంతో కూడిన బేస్‌బాల్ వేలం
Baseball Up For Auction Proceeds To Support Relief Efforts In Ukraine: జెలెన్స్కీ సంతకం చేసిన మేజర్ లీగ్ బేస్‌బాల్(ఎంఎల్‌బీ) ఉక్రెయిన్ సహాయర్థం వేలాని సిద్ధమవుతోంది. 2019లో బిగ్ యాపిల్‌ను సందర్శించినందుకు గుర్తుగా ఉక్రేనియన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఈ ఎంఎల్‌బీ బేస్‌బాల్ పై సంతకం చేశారు. ఈ ఎంఎల్‌బీ బేస్‌బాల్ పై ఉక్రెయిన్ భాషలోనూ, ఇంగ్లీష్ భాషలోనూ జెలన్స్కీ సంతకం ఉంటుంది. అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో ఉక్రెయిన్ రాయబారిగా వ్లాదిమిర్ యెల్చెంకో ఉన్నసమయంలో ఆయన సంతకంతో కూడిన లేఖతో ఈ బేస్‌బాల్ అమెరికాకి వచ్చింది. ప్రస్తుతం ఈ బేస్‌బాల్ ఆర్ఆర్ వేలం ద్వారా అమ్మాకానికి వెళ్తోంది. వేలంలో ఇది సుమారు రూ.11 లక్షలు వరకు పలుకుతుందని నిపుణుల అంచనా. న్యూయార్క్‌లో ప్రభుత్వ వ్యవహారాల నిపుణుడిగా ఉన్న రాండీ ఎల్ కప్లాన్ ఈ బేస్ బాల్‌ను విక్రయిస్తున్నట్లు ఆర్ఆర్ వేలం హౌస్ తెలిపింది. అతను ఈ బేస్‌బాల్‌ని ఉక్రెయిన్ రాయబారి యెల్చెంకో నుండి బహుమతిగా అందుకున్నాడు. అంతేకాదు రాండీ ఎల్ కప్లాన్ సంపాదనలో కొంత భాగాన్ని ఉక్రెనియన్ సహాయ నిధికి విరాళంగా ఇవ్వాలని యోచిస్తున్నారు కూడా. ఆర్ఆర్ వేలం కూడా అదే ఫండ్‌కు ఈ బేస్‌బాల్ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇస్తామని పేర్కొంది. మే 11న ఈ వేలం ముగియనుంది. ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశంతో రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయిలో దాడికి దిగాయి. గత రెండు నెలలకు పైగా నిరవధిక దాడులతో ఉక్రెయిన్‌ని శిథిలానగరంగా మార్చింది. వేలాది మంది నిరాశ్రయులవ్వగా, లక్షలాదిమంది వలస వెళ్లిపోయారు. ఇంకా చాలామంది ఉక్రెనియన్ పౌరులు భూగర్భ రైల్వేస్టేషన్లలోనే తలదాల్చుకుంటున్నారు. (చదవండి: ఉక్రెయిన్ ఎదురుదాడి) -
చారిత్రక ఘట్టం: ఈయూ సభ్యత్వ దరఖాస్తుపై సంతకం చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
President Volodymyr Zelenskyy Signed The Application: గత కొన్ని రోజులుగా రష్యా ఉక్రెయిన్ల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అధ్యక్షుల మధ్య జరిగిన తాజా చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఎవరికివారు తమదైన శైలిలో యుద్ధ వ్యూహాలతో సాగిపోతున్నారు. ఆ తదుపరి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో వెంటనే సభ్యత్వం ఇవ్వాలని అభ్యర్థించిన సంగతి కూడా తెలిసిందే. ఈ మేరకు జెలెన్స్కీ యుద్ధంలో దెబ్బతిన్న తమ దేశం కోసం వెంటనే ప్రత్యేక విధానంలో యూరోపియన్ యూనియన్ సభ్యత్వం పొందేందుకు అనుమతించమని కోరుతూ దరఖాస్తుపై సంతకం కూడా చేశారు. ప్రధాన మంత్రి డెనిస్ ష్మిహాల్, ఉక్రెయిన్ ఏకసభ్య పార్లమెంట్ ఛైర్మన్ రుస్లాన్ స్టెఫాన్చుక్ సమక్షంలో ఈ దరఖాస్తు పై సంతకం చేశారు. దీనిపై రాష్ట్రపతి సంతకం కూడా ఉంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేస్తూ .."ఇది ఉక్రెయిన్ ప్రజల హక్కు దీనికి మేము అర్హులం" అని ట్యాగ్‌ని జోడించి మరీ పోస్ట్ చేశారు. మరోవైపు ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడినందుకు గానూ రష్యాని ప్రపంచ దేశాలు దౌత్య పరంగా ఆర్థిక పరమైన విషయంలో ఏకాకిని చేసింది. అంతేకాదు బెల్జియం, ఫిన్లాండ్, కెనడా తమ గగనతలం నుంచి రష్యన్ విమానాలను నిషేధించిన ఇతర దేశాల జాబితాలో చేరాయి. President @ZelenskyyUa has signed application for the membership of #Ukraine in the European Union. This is a historic moment! pic.twitter.com/rmzdgIwArc — Verkhovna Rada of Ukraine (@ua_parliament) February 28, 2022 (చదవండి: రష్యా బలగాలు విఫలం?..అందుకే బెలారస్ దిగనుందా?) -
జపాన్‌తో అణుబంధం
మోదీ-షింజోశిఖరాగ్రంలో చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు - ఎన్పీటీపై సంతకం చేయకపోరుునా భారత్‌కు జపాన్ మినహారుుంపు - మౌలికరంగంలో పెట్టుబడులు, అంతరిక్ష, వ్యవసాయ సహకారం సహా జపాన్-భారత్‌ల మధ్య మరో 9 ఒప్పందాలు ఖరారు టోక్యో: ఇరు దేశాల అణు పరిశ్రమల మధ్య భాగస్వామ్యానికి ద్వారాలు తెరుస్తూ భారత్‌తో చరిత్రాత్మక పౌర అణు ఒప్పందంపై జపాన్ శుక్రవారం సంతకం చేసింది. దీంతో జపాన్ తన అణు సాంకేతికతను, రియాక్టర్లను భారత్‌కు ఎగుమతి చేసేందుకు దారులు తెరుచుకున్నాయి. జపాన్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశ ప్రధాని షింజో అబేతో సమావేశమై చర్చలు జరిపారు. అణు ఒప్పందంతో పాటు.. మౌలిక రంగంలో జపాన్ పెట్టుబడులు పెంచడం, రైల్వేలు, అంతరిక్షం, వ్యవసాయ రంగాల్లో సహకారం తదితరాల్లో సంబంధాలను బలోపేతం చేస్తూ మరో 9 ఒప్పందాలూ కుదిరారుు. అణ్వస్త్ర దాడికి (రెండో ప్రపంచ యుద్ధంలో) గురైన ఏకై క దేశమైన జపాన్‌తో ఆరేళ్ల పాటు చర్చల అనంతరం ఈ పౌర అణు సహకార ఒప్పందం కుదిరింది. అణుశక్తి విషయంలో కఠిన విధానాలు అవలంబించే జపాన్.. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)పై భారత్ సంతకం చేయకపోరుునా కూడా అణుశక్తిని శాంతియుత అవసరాలకు వినియోగించుకునేందుకు భారత్‌కు మినహారుుంపునిస్తూ ఈ ఒప్పందం చేసుకుంది. అమెరికా, రష్యా, దక్షిణ కొరియా, మంగోలియా, ఫ్రాన్స, నమీబియా, అర్జెంటీనా, కెనడా, కజకిస్తాన్, ఆస్ట్రేలియాలతో ఇప్పటికే భారత్ అణు ఒప్పందాలు చేసుకుంది. శిఖరాగ్ర భేటీ తర్వాత మోదీ, షింజోలు మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛ ఇంధన భాగస్వామ్య నిర్మాణం కోసం కృషిలో ఈ ఒప్పందం చరిత్రాత్మక ముందడుగు అని మోదీ పేర్కొన్నారు. ఈ రంగంలో తమ సహకారం వాతావరణ మార్పు సమస్యపై పోరాడేందుకు దోహదపడుతుందన్నారు. ఒప్పందానికి మద్దతిచ్చినందుకు షింజోకు, జపాన్ ప్రభుత్వం, పార్లమెంటులకు కృతజ్ఞతలు తెలిపారు. అణ్వస్త్ర రహిత ప్రపంచాన్ని సృష్టించాలన్న తమ లక్ష్యానికి అణుగుణంగా ఈ ఒప్పందం ఉందని, దీనిపై సంతకం చేయటం సంతోషకరమని షింజో అన్నారు. భాగస్వామ్యంతో ప్రపంచానికి మేలు అనంతరం.. తన గౌరవార్థం షింజో ఏర్పాటు చేసిన ఒక విందు సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ఇరు దేశాలూ సన్నిహిత భాగస్వాములుగా కేవలం తమ సమాజాల ప్రయోజనాల కోసమే కాకుండా.. ఈ ప్రాంతానికి, ప్రపంచానికి కూడా ప్రయోజనం కలిగించే కృషి చాలా చేయగలవన్నారు. ఎన్పీటీని ప్రపంచవ్యాప్తం చేయటం, సమగ్ర అణుపరీక్ష నిషేధ ఒప్పందం (సీటీబీటీ) అమలులో ప్రవేశం, (ఎఫ్ఎంసీటీ)పై త్వరగా చర్చలు ప్రారంభించాల్సిన అవసరముందని షింజో పేర్కొన్నారు. బలమైన ఆర్థిక భాగస్వామ్యం, వాణిజ్య, తయారీ, పెట్టుబడి సంబంధాల వృద్ధి, స్వచ్ఛ ఇంధనంపై దృష్టి కేంద్రీకరణ, పౌరుల భద్రతపై భాగస్వామ్యం, మౌలిక సదుపాయాల్లో సహకారం తదితరాలు కీలకాంశాలని మోదీ వివరించారు. ఇతర కీలక ఒప్పందాలు... రైల్వేలు, రవాణా, నౌకాశ్రయ టెర్మినళ్లు, టోల్ రోడ్లు, విమానాశ్రయ టెర్మినళ్లు, పట్టణాభివృద్ధిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో సహకారానికి, పెట్టుబడుల ప్రోత్సాహానికి జాతీయ పెట్టుబడులు, మౌలికసదుపాయాల నిధి - జపాన్ ఓవర్సీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఫర్ ట్రాన్సపోర్ట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. అంతరిక్ష సాంకేతికతలో సహకారం పెంపొందించుకోవడానికి.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) - జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ ఏజెన్సీ (జాక్సా)ల మధ్య ఒకటి, భారత భూశాస్త్రాల మంత్రిత్వశాఖ - జపాన్ మెరైన్-ఎర్త్ సెన్సైస్‌ల మధ్య మరొకటి - రెండు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయాలి.. ఉగ్రవాద వ్యాప్తిపై భారత్, జపాన్‌లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారుు. ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలను నిర్మూలించి, వారి వ్యవస్థలను ధ్వంసం చేయడానికి, ఉగ్రవాదుల సీమాంతర కదలికలను నిలిపివేయడానికి ప్రపంచ దేశాలు కృషి చేయాలని కోరాయి. మోదీ, షింజోల భేటీ అనంతరం ప్రకటన విడుదల చేస్తూ.. ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాల్లోనూ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద సంస్థలను గుర్తించటానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానం 1267, సంబంధిత ఇతర తీర్మానాలను అన్ని దేశాలూ అమలు చేయాలని కోరాయి. ముంబై, పఠాన్‌కోట్ దాడుల సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలని ఇరువురు నేతలూ పాకిస్తాన్‌కు సూచించారు. వ్యూహాత్మక దక్షిణ చైనా సముద్రంలో సరిహద్దు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, భారత్, జపాన్‌లు పరోక్షంగా చైనాను ఉటంకిస్తూ పిలుపునిచ్చారుు. మోదీ శుక్రవారం జపాన్ చక్రవర్తి అకిహిటోను కలిశారు. ఇరు దేశాల మధ్య అనుబంధాలు, ఆసియా భవిష్యత్తు గురించి ఆయనతో చర్చించారు. 2023లో హైస్పీడ్ రైలు ఇరు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త కోణాన్ని.. జపాన్ సహాయంతో ముంబై -అహ్మదాబాద్‌ల మధ్య నిర్మిస్తున్న హైస్పీడ్ ట్రైన్ కారిడార్ ప్రతిఫలిస్తోందని షింజే అభివర్ణించారు. ఈ ప్రాజెక్టును డిజైన్ చేయడం ఈ ఏడాది చివర్లో మొదలవుతుందని, ఈ ఏడాదే శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందనితెలిపారు. 2018 లో నిర్మాణం ప్రారంభమవుతుందని, 2023 నుంచి హైస్పీడ్ రైలు సేవలు ఆరంభమవుతాయన్నారు. భారత్‌లో 30,000 మందికి శిక్షణనిచ్చేందుకు జపాన్ ప్రైవేట్ రంగం ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్‌ను స్థాపించనున్నట్లు తెలిపారు. -
భారత్, జపాన్ మధ్య అణు ఒప్పందం
-
సంతకం చేయొద్దు
బెంగళూరు : శాసనసభలో ఆమోదం పొందినప్పటికీృబహత్ బెంగళూరు మహానగర పాలికె విభజనకు సంబంధించిన బిల్లు రాజ్యాంగ విరుద్ధమైనదేనని, అందువల్ల ఆ బిల్లుపై ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకం చేయవద్దని గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాను బీజేపీ, జేడీఎస్ నేతలు కోరారు. బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో ఇరు పార్టీ నాయకులు వేర్వేరుగా గవర్నర్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. భేటీ అనంతరం మీడియాతో శాసనసభ విపక్షనేత జగదీష్ శెట్టర్ మాట్లాడారు. ‘బీబీఎంపీ విభజన విషయమై హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురైనా.. ఇంకా బుద్ధి రావడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓడిపోతామన్న భయంతోనే కాంగ్రెస్ నాయకులు విభజన పేరుతో కాలయాపన చేస్తున్నారు. విభజన విషయమై బి.ఎస్.పాటిల్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను చట్టసభల్లో ప్రవేశపెట్టలేదు. ప్రజల అవగాహన కోసం ఈ నివేదికను బహిరంగ పరచలేదు. అందువల్ల విభజన విషయమై ప్రభుత్వమే రూపొందించిన ముసాయిదా బిల్లు శాసనసభలో అనుమతిపొందడం రాజ్యాంగ విరుద్ధం.’ అని అన్నారు. ఇదే సందర్భంలో శాసనమండలి విపక్షనేత ఈశ్వరప్ప మాట్లాడుతూ...‘శాసనమండలిలో కర్ణాటక నగర పాలికె విభజన-15 ముసాయిదా బిల్లు తిరస్కరణకు గురైన స్పీకర్ కాగోడు తిమ్మప్ప అసంతృప్తి వ్యక్తం చేయడం సరికాదు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకుని మండలి సభ్యులు ‘ముసాయిదా బిల్లు’కు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే మండలి సభ్యుల వ్యవహారం నచ్చలేదని స్పీకర్ పేర్కొనడం హాస్యాస్పదం. ఈ విషయాన్ని మండలిలో ప్రస్తావిస్తా’ అని అన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో బీజేపీ సీనియర్ నాయకులు ఆర్.అశోక్, వీ.సోమణ్ణ, విశ్వనాథ్, రఘు తదితరులు ఉన్నారు. రాజీవ్ ఆశయాలను తుంగలో తొక్కి : కుమార బీబీఎంపీని విభజన చేసి తీరాల్సిందేనన్న అధికార కాంగ్రెస్ వైఖరి దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ ఆశయాలను మంట గల్పినట్లుగా ఉందని జేడీఎల్సీ నేత కుమారస్వామి అన్నారు. బీబీఎంపీ విభజన ముసాయిదా బిల్లుపై సంతకం చేయకూడదంటూ గవర్నర్‌ను కుమారస్వామి నేృతత్వంలో జేడీఎస్ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థలకు బలం చేకూర్చేలా రాజీవ్‌గాంధీ అధికార కేంద్రీకరణను ఎంతో కష్టపడి అమల్లోకి తీసుకువచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే రాజకీయ లబ్ధికోసం స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు వ్యతిరేకిస్తున్నా బీబీఎంపీని ముక్కలు చేయాలని సిద్ధు సర్కార్ ప్రయత్నిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు భవిష్యత్‌లో ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ విన్నపం పట్ల గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా సానుకూలంగా స్పందించారన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో జేడీఎస్ నాయకులు బసవరాజ్ హొరట్టి, చలువరాయస్వామి తదితరులు ఉన్నారు. -
కమిషనర్ల ‘సెల్’ పంచాయతీ!
సిమ్ కార్డు ఇవ్వని పాత కమిషనర్ పాత తేదీలతో ఫైళ్లపై సంతకాలు! చెక్కులను, క్యాష్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్న నూతన కమిషనర్ మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : మచిలీపట్నం మున్సిపాలిటీ పాత, కొత్త కమిషనర్ల మధ్య ‘సెల్ పంచాయతీ’ హల్చల్ చేస్తుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారగణంలో ఇది తీవ్ర చర్చనీయాంశమయ్యింది. వివరాల్లోకి వెళితే ై ఇక్కడ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన ఎస్.శివరామకృష్ణకు హెదరాబాద్లోని డీఎంఏ కార్యాలయానికి బదిలీ అయింది. గత జనవరి 27వ తేదీన మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా ఏ మారుతిదివాకర్ బాధ్యతల్ని స్వీకరించారు. ఈయన బాధ్యతలు స్వీకరించి దాదాపు 20 రోజులవుతున్నా పాత కమిషనర్ శివరామకృష్ణ ప్రభుత్వం కేటాయించిన సెల్ సిమ్‌ను నూతన కమిషనర్‌కు అప్పగించలేదు. సహజంగా ఏ అధికారి బదిలీ అయినా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారికి ఈ సిమ్‌ను ఇచ్చేస్తారు. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన మారుతిదివాకర్ వద్ద ఈ సిమ్ లేకపోవటంతో పలు సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు పట్టణ ప్రజలు ఈ ఫోన్ నంబర్‌కు కాల్ చేస్తుంటే స్విచ్ఆఫ్ డైలర్ టోన్ వస్తోంది. దీంతో నూతన కమిషనర్ ఫోన్ నంబర్ తెలియక సమస్యలపై ఫిర్యాదు చేయాలని భావించే పట్టణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల మధ్య ఏమైనా విభేదాలు ఉంటే వారువారు చూసుకోవాలే కానీ తమను ఇబ్బందులకు గురి చేయకూడదు కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పాత కమిషనర్ తీరుపై చర్చ : బదిలీపై వెళ్లిన పాత కమిషనర్ శివరామకృష్ణ తీరుపై పలువురు మున్సిపల్ ఉద్యోగులతో పాటు పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడకు నూతన కమిషనర్‌గా వేరే వ్యక్తి వస్తున్నాడని తెలిసిన ఆయన వచ్చే కమిషనర్‌కు కనీసం ఒక్క అటెండర్‌ను లేకుండా చేశాడని చర్చించుకుంటున్నారు. ఆయనకు అటెండర్లుగా పని చేసిన గణేష్, సాంబశివరావుకు పదోన్నతులు కల్పించి రెవెన్యూ విభాగానికి బదిలీ చేశారు. తమకు పదోన్నతులు ఇచ్చారనే కారణంతో వీరిద్దరూ కమిషనర్ ఛాంబర్లో ఉన్న పలు పుస్తకాలను, వస్తువులను, చివరికి కమిషనర్ సీటుపై ఉండే టర్కీ టవల్‌ను సైతం లేకుండా తీసేశారు. నూతన కమిషనర్‌గా మారుతీదివాకర్ బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆయన ఛాంబర్ బోసిపోయేలా చేశారనే విమర్శలున్నాయి. నూతన కమిషనర్‌కు కనీసం అంటెండర్లు లేకుండా చేయటంతో వేరే విభాగాల్లో పని చేసే వారిని ఈయన అటెండర్లుగా నియమించుకున్నారు. అలాగే మునిసిపాలిటీకి సంబంధించిన పలు ఫైళ్లపై పాత కమిషనర్ ఇప్పటికీ పాత తేదీలను వేస్తూ సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. వీటితో పాటు ఇటీవల ఆయన పలువురికి పాత తేదీలతో చెక్కులను ఇచ్చారనే వాదనలున్నాయి. ఈ నేపధ్యంలోనే అకౌంటెంట్ వద్ద ఉన్న చెక్, క్యాష్ పుస్తకాలను నూతన కమిషనర్ మారుతీదివాకర్ స్వాధీనపర్చుకున్నారు. అలాగే కార్యాలయంలో ఉన్న సీసీ కెమేరాలకు అను సంధానం చేసిన ఆన్లైన్ లింక్‌ను పొందుపర్చిన ల్యాప్‌టాప్ పాత కమిషనర్ శివరామకృష్ణ వద్దే ఉందని చెబుతున్నారు. సెల్‌సిమ్ ఇంకా ఇవ్వలేదు, మారుతీదివాకర్, కమిషనర్ : కమిషనర్‌గా పనిచేసి బదిలీ అయిన శివరామకృష్ణ ఇంకా సెల్ఫోన్సిమ్ ఇవ్వలేదు. దీంతో పర్సనల్ ఫోన్ నంబర్‌నే ఉపయోగిస్తున్నా. ఉన్నతాధికారులు, ప్రజలు తనకు ఫోన్ చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. చెక్కులు పాత తేదీలతో బ్యాంక్‌లకు వెళుతున్నాయనే వాదనలు రావటంతో చెక్‌బుక్‌లను అకౌంటెంట్ నుంచి తీసుకుని నా వద్దే ఉంచాను.