ప్రముఖ బ్రిటన్ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ అంటే తెలియని వారుండరు. అతని పేరు తలుచుకుంటే గుర్తోచ్చేది జీవ పరిణామ సిద్ధాంతం. అంతా గొప్ప శాస్త్రవేత్తకు ప్రతిపాదించిన జీవ పరిణామా సిద్ధాంతానికి సంబంధించిన ఒక పత్రం వెలుగులోకి వచ్చింది. అదికూడా ఆయన సంతకంతో కూడిని లేఖ కావడం విశేషం. వాస్తవానికి ఆయన పరిశోధనల గురించి క్రమం తప్పకుండా ఒక ప్రతిలో నోట్ చేసి ఉండనందున ఆయనకు సంబంధించిన రచనలు ఇంత వరకు సరిగా దొరకలేదు.
ఒక వేళ దొరికినా వాటిలో సాధారణంగా డార్విన్ లేదా సీహెచ్ డార్విన్ అని మాత్రమే ఉంటుంది. కానీ అతని పూర్తి పేరుతో సంతకం చేసిని లేఖ దొరకడం అత్యంత అరుదు. ఈ మేరకు డార్విన్ ఆన్‌లైన్‌గా పిలిచే డేటాబేస్ క్యూరేటర్ ప్రొఫెసర్ జాన్ వాన్ వైహే మాట్లాడుతూ అత్యంత గొప్ప శాస్త్రవేత్త సంతకంతో కూడిన ప్రతి చాలా ప్రత్యకమైనది. అది ఆన్‌ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ మూడవ ఎడిషన్‌లో భాగానికి సంబంధించిన లేఖగా పేర్కొన్నారు. ఈ లేఖ న్యూయార్క్‌లోని సోథెబైస్ వేలంలో సుమారు రూ. 9 కోట్లు పలుకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆ లేఖలో డార్విన్...ఇందులో అసలు వాస్తవాలను పరిగణలోనికి తీసుకుని వెల్లడిస్తాను. జీవులు వాటి జాతుల వర్గీకరణ వైవిద్యాలను ఆ పరిణామ సిద్ధాంతం వివరిస్తోంది. ఒక్కోసారి ఆ వర్గీకరణ కూడా తప్పుగా ఉండొచ్చు. అదీ క్రమంగా తప్పుడు సిద్ధాంతాన్ని వివరించకూడదు. జీవ సారాంశం, దాని మూలం గురించి సమగ్రంగా వివరించడం అనేది కొంచెం క్లిష్టతరమైనదిగా పేర్కొనవచ్చు. అలాగే న్యూటన్ గురత్వాకర్షణ సిద్ధాంతం సారాంశం ఏంటనేది కచ్చితంగా వివరించలేం. కానీ న్యూటన్ తన పరిశోధనల్లో తత్వశాస్త్రంలోని అద్భుతమైన కొత్త సిద్ధాంతాలను పరిచయం చేశాడన్నారు.
(చదవండి: మరణించిన వారిని మళ్లీ పునర్జీవింప చేసే సంస్థ...మళ్లీ బతకాలని....)
Comments
Please login to add a commentAdd a comment