document
-
ఎన్నో మలుపులు.. మరెన్నో చీకటి కోణాలు
అది దేశ వాణిజ్య నగరం ముంబై. 2012లో బయటపడ్డ ఓ నేరం.. దేశం మొత్తాన్ని ఆకర్షించింది. దాదాపు పదేళ్లకు పైనే దాని గురించి మాట్లాడుకునేలా చేసింది. తన రహస్యం ఎక్కడ బయటపడుతుందో అని సొంత బిడ్డను ఓ కన్నతల్లే పొట్టనబెట్టుకున్న కేసది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తీసిపోని ఈ వాస్తవ గాథ.. ఇప్పుడు డాక్యు-సిరీస్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముంబై మెట్రో వన్ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున షీనా బోరా(22) 2012, ఏప్రిల్ 24న అదృశ్యమైంది. మళ్లీ ఆమె కనిపించనే లేదు. శవంగా తేలడంతో పోలీస్ దర్యాప్తు మొదలైంది. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇంద్రాణీ ముఖర్జీకి మీడియా ఎగ్జిక్యూటివ్‌గా సొసైటీలో మంచి పేరుంది. షీనా అంటే ప్రాణం అన్నట్లుగా ఇంద్రాణి ఉండేది. అలాంటిది పోలీసులు ఆమె వైపు మళ్లుతారని ఎవరూ ఊహించి ఉండరు. అప్పటికే అక్రమంగా ఆయుధాల్ని కలిగి ఉన్నాడనే అభియోగాలతో ఆమె డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ అరెస్ట్ అయ్యాడు. అతనిచ్చిన సమాచారమే.. మొత్తం కేసునే మలుపు తిప్పింది. ♦ఇంద్రాణీ ముఖర్జీ.. మొత్తం ముగ్గుర్ని పెళ్లాడింది. ఆమెకు మొదటి భర్త ద్వారా షీనాతోపాటు మైఖేల్ జన్మించారు. అతడి నుంచి విడిపోయిన తర్వాత పిల్లలిద్దర్నీ గువాహటిలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచిన ఇంద్రాణీ.. సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని పెళ్లాడింది. కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. అనంతరం మీడియా ఎగ్జిక్యూటివ్ అయిన పీటర్ ముఖర్జియాను మూడో వివాహం చేసుకుంది. ♦అప్పటికే వయసుకొచ్చిన షీనా.. ముంబైకి వచ్చి ఇంద్రాణిని కలుసుకుంది. తన మొదటి పెళ్లి, పిల్లల గురించి పీటర్ దగ్గర దాచిపెట్టిన ఇంద్రాణి.. తన కూతుర్ని చెల్లెలిగా పరిచయం చేసింది. ఈ క్రమంలో పీటర్ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌తో షీనా సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. తన కూతురు వ్యవహరిస్తోన్న తీరు ఇంద్రాణికి నచ్చలేదు. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో.. పీటర్‌కు అసలు విషయం చెబుతానంటూ షీనా బ్లాక్‌మెయిలింగ్ మొదలుపెట్టింది. అప్పటికే వ్యాపారంలోనూ ఆమె అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు నష్టాలు చవిచూస్తూ ఉంది. ఆ సమయంలోనే షీనా తీరుతో విసిగిపోయిన ఇంద్రాణీ ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించింది. అందుకు రెండో భర్త సంజీవ్ ఖన్నా సహకారం కోరింది. ♦రెండో భర్త సంజీవ్‌ఖన్నాతో కలిసి ఇంద్రాణీ ఈ హత్యకు కుట్రపన్నినట్లు దర్యాప్తులో తేలింది. అసలు షీనాను ముంబైలోని ఆమె ఇంట్లోనే హత్యచేయాలని సంజీవ్‌ఖన్నా సూచించాడట. కానీ, ఆ ఇంట్లో షీనాతోపాటు తన భర్త(మూడో భర్త) పీటర్ ముఖర్జియా, కొడుకు రాహుల్ ముఖర్జియా కూడా ఉన్నందువల్లే ఇంద్రాణి ఆ ప్లాన్‌కు ఒప్పుకోలేదు. ఈ కేసులో రాహుల్ పేరు రావడం ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ♦దీంతో పీటర్ ముఖర్జియా ముంబైలో లేని సమయం చూసి.. షీనాను ఇంటికి పిలిచి హత్యచేయాలని ఇంద్రాణీ సంజీవ్‌కు సూచించింది. సొంతింట్లో హత్యజరిగితే పోలీసులు ఇంద్రాణీని అనుమానించే అవకాశం ఉండడంతో వద్దని సంజీవ్‌ఖన్నా ఆమెను వారించాడు. దీంతో ఇద్దరూ కలిసి.. కారులోనే షీనాను హత్యచేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం డ్రైవర్ శ్యాంరాయ్‌ను చేర్చుకుని హత్యకు కుట్ర పన్నారు. ♦1996లో ఐఎన్ఎక్స్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ పేరిట కోల్‌కతాలో రిక్రూట్మెంట్ కంపెనీని ఏర్పాటు చేసిన ఇంద్రాణీని 2008లో ది వాల్ స్ట్రీట్ జర్నల్ ‘50 విమెన్ టు వాచ్’లో ఒకరిగా గుర్తించింది. కానీ ఐఎన్ఎక్స్ మీడియాలో అక్రమాలతో పాటు కూతురి హత్య కేసు కారణంగా ఆమె జీవితం తలకిందులైంది. కన్న కూతురు షీనాను హత్య చేసేందుకు ఎన్ని ప్లాన్లు వేసింది? ఏది వర్కవుట్ అయింది? పోలీస్ డైరీ ఆధారంగా.. షీనా బోరా హత్యకేసులో ముగ్గురు నిందితుల వాంగ్మూలాలతో పాటు... కాల్‌డాటా రికార్డులను పోలీసులు పోల్చిచూశారు. 23 ఏప్రిల్ 2012న జరిగిన సంఘటనలతో ఓ టైం లైన్ తయారు చేశారు. అది.. ఏప్రిల్ 23, 2012.. ఉదయం 9గంటలు: డ్రైవర్ శ్యాంరాయ్‌తో కలిసి ఇంద్రాణీ ముఖర్జీ.. రాయ్‌గఢ్ అడవుల్లోకి వెళ్లి రెక్కీ నిర్వహించింది. షీనాను హత్యచేశాక మృతదేహం ఎక్కడ పారేయ్యాలో నిర్ణయించుకుంది. ఉదయం 11.30నిమిషాలకు: రెండో భర్త సంజీవ్‌ఖన్నాకు ఫోన్‌చేసిన ఇంద్రాణి.. దాదాపు 7నిమిషాలు మాట్లాడింది. ఉదయం 11.37నిమిషాలకు: ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఉన్న హిల్‌టాప్ హోటల్లో సంజీవ్‌ఖన్నా కోసం ఇంద్రాణి ఓ రూమ్ బుక్ చేసింది. అది.. ఏప్రిల్ 24, 2012.. మద్యాహ్నం 1.47నిమిషాలకు: సంజీవ్ ఖన్నా కోల్‌కతా నుంచి ముంబై చేరుకుని... ట్యాక్సీలో హిల్‌టాప్ హోటల్ చేరుకున్నాడు. మద్యాహ్నం 1.53నిమిషాలకు: ఇంద్రాణికి కాల్చేసి తాను ముంబై చేరుకున్నానని చెప్పిన సంజీవ్‌ఖన్నా మద్యాహ్నం 2.38నిమిషాలకు: సంజీవ్‌ఖన్నాకు ఫోన్‌చేసి రూమ్‌లో సదుపాయాలు సరిగానే ఉన్నాయా అని అడిగి తెలుసుకుంది ఇంద్రాణి. మద్యాహ్నం 3.11నిమిషాలకు: మరోసారి రెండోభర్త సంజీవ్‌ఖన్నాకు కాల్చేసి... హత్యకు సంబంధించి ప్లాన్‌పై డిస్కస్ చేసింది ఇంద్రాణి. సాయంత్రం 6గంటలకు: హిల్‌టాప్ హోటల్ నుంచి సంజీవ్‌ఖన్నాను హిల్‌టాప్ హోటల్ నుంచి పికప్ చేసుకుంది. ఇంద్రాణి డ్రైవర్ శ్యాంమనోహర్ కారు డ్రైవ్ చేస్తున్నారు. సాయంత్రం 6.45 నిమిషాలకు: ముంబైలోని లింకింగ్ రోడ్ చేరుకున్న ముగ్గురు... షీనాబోరా కోసం ఎదురుచూశారు. సాయంత్రం 7.03 నిమిషాలకు: లింకింగ్ రోడ్‌లోని నేషనల్ కాలేజ్ సమీపంలో తన కోసం వెయిట్ చేస్తున్న ఓపెల్ కోర్సా కారులో కూర్చుంది షీనా. సాయంత్రం 7.16నిమిషాలకు: ఇంద్రాణి సూచన మేరకు డ్రైవర్ శ్యాం మనోహర్.. నవీ ముంబై వైపు కారు నడిపాడు. అక్కడి నుంచి కారు ఐరోలీ వైపు ప్రయాణించింది. రాత్రి 8.27 నిమిషాలకు: ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై కారు వేగంగా వెలుతున్న సమయంలో... కారు ఆపాల్సిందిగా డ్రైవర్‌ను ఇంద్రాణి ఆదేశించింది. అయితే అప్పటికే షీనాబోరాకు ఇంద్రాణీ, సంజీవ్‌ఖన్నాలు మత్తు మందు ఇచ్చిన విషయం డ్రైవర్‌కు తెలియదు. దీంతో తాను టాయిలెట్‌కు వెళతానని చెప్పి డ్రైవర్ శ్యాంమనోహర్ కారు దిగి వెళ్లాడు. డ్రైవర్ వెళ్లగానే ఇంద్రాణీ తన కూతురు షీనా చేతులు గట్టిగా పట్టుకుంది. సంజీవ్‌ఖన్నా షీనా గొంతు నులిమి చంపేశాడు. డ్రైవర్ టాయిలెట్‌కు వెళ్లి తిరిగి రాగానే కారును దూరంగా పోనివ్వమని.. ఇంద్రాణి చెప్పింది. అయితే అప్పటికే చీకటి కావడంతో తమ ప్లాన్ మార్చుకోవాలని ఇంద్రాణీ, సంజీవ్‌లు నిర్ణయించుకున్నారు. రాయ్‌గఢ్ వెళ్లడం కష్టం కాబట్టి దగ్గరలో ఉన్న లోనావాలా అటవీ ప్రాతంలోనే శవాన్ని పూడ్చిపెడదామని సంజీవ్ అన్నాడు. రాత్రి 9.01నిమిషాలకు: ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని విఖ్రోలి ప్రాంతంలో పోలీస్ గస్తీని చూడగానే వీరు ముగ్గురు భయపడ్డారు. రాత్రి 9.14నిమిషాలకు: వెంటనే యూటర్న్ తీసుకుని తిరిగి వర్లీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాత్రి శవాన్ని కారులోనే ఉంచి పీటర్ ముఖర్జియా ఇంట్లోని గ్యారేజ్‌లో ఉంచాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 11.01 నిమిషాలకు: షీనా మృతదేహాన్ని ఒక బ్యాగులో కుక్కి... కారు డిక్కీలో ఉంచారు. అది.. ఏప్రిల్ 25, 2012 అర్థరాత్రి 12.19నిమిషాలకు: సంజీవ్‌ఖన్నా తన హిల్‌టాప్ హోటల్‌కు బయలేదేరాడు అర్ధరాత్రి 12.30నిమిషాలకు: సంజీవ్‌ఖన్నాకు కాల్చేసిన ఇంద్రాణి... ఉదయం ఏంచేయాలనే దానిపై ఇద్దరు చర్చించుకున్నారు. అర్ధరాత్రి12. 57నిమిషాలకు: కారులోనే ఉన్న డ్రైవర్ శ్యాం రాయ్‌కు ఫోన్‌చేసింది ఇంద్రాణి. అర్ధరాత్రి 01.19నిమిషాలకు: మరోసారి డ్రైవర్ శ్యాంరాయ్‌కు ఫోన్ చేసిని ఇంద్రాణి... బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. అర్ధరాత్రి 02.30నిమిషాలకు: తన గదిలోంచి కిందికి దిగివచ్చిన ఇంద్రాణీ... డ్రైవర్‌తో కలిసి హిల్‌టాప్ హోటల్‌కు బయలుదేరి వెళ్లింది. అర్ధరాత్రి 02.47 నిమిషాలకు: రాయ్‌గఢ్‌లోని గగోడే బుద్రుక్ గ్రామానికి బయలుదేరిన ఇంద్రాణీ, సంజీవ్‌ఖన్నా, డ్రైవర్ శ్యాంరాయ్. తెల్లవారుజామున 04.21 నిమిషాలకు: గగోడే బుద్రుక్ గ్రామ సమీపంలో చేరుకోగానే... కారులోంచి మృతదేహాన్ని బయటకు తీశారు. తన కూతురు శవాన్ని చూసి భయపడ్డ ఇంద్రాణీ.. వెంటనే శవాన్ని దహనం చేయాలని చెప్పింది. తెల్లవారుజామున 04.33నిమిషాలకు: కారు దగ్గరికి వెళ్లి నిల్చున్న ఇంద్రాణి... సంజీవ్‌ఖన్న, శ్యాంరాయ్‌లు శవాన్ని మట్టుబెట్టేవరకు ఎదురుచూసింది. ఉదయం 05.13నిమిషాలకు: అక్కడి నుంచి బయలుదేరిన ముగ్గురు కొద్దిదూరం వెళ్లి... తిరిగి శవాన్ని మట్టుబెట్టిన ప్రాంతంలో ఎవరైనా మనుషులు ఉన్నారా చూసి ఇంటికి బయలుదేరారు. ఉదయం 07.33నిమిషాలకు: ముంబై చేరుకున్న ముగ్గురు ఎవరి గమ్యస్థానాలకు వారు వెళ్లిపోయారు. ట్విస్టుల పర్వం సాగిందిలా.. ♦April 24, 2012: షీనా బోరా ఉద్యోగానికి సెలవు పెట్టింది. ఆమె ఉద్యోగానికే రాజీనామా చేసిందని ఒకవైపు మీడియా.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిందని కుటుంబం ప్రకటించింది. అప్పటికి మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. ♦May 23, 2012: నెలరోజుల తర్వాత.. మహారాష్ట్ర రాయ్‌గఢ్‌లో షీనా బోరా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.. ఆపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు మొదలైంది. ♦August 2015: మూడేళ్ల తర్వాత.. కూతురిని చంపిందనే అభియోగాలపై ఇంద్రాణి ముఖర్జీ అరెస్ట్ అయ్యింది. ఆ మరుసటిరోజే కోల్‌కతాలో ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ♦August 2015: ఇంద్రాణి ముఖర్జీ డ్రైవర్ శ్యామ్ రాయ్ కూడా అరెస్ట్ అయ్యాడు. ఈ ముగ్గురు నిందితుల్ని క్రైమ్ సీన్ రీక్రియేన్ చేశారు. దర్యాప్తులో డ్రైవర్ శ్యామ్ షీనాను హత్య చేసి.. మృతదేహాన్ని పడేశామని ఒప్పుకున్నాడు. ఇంద్రాణితో పాటు సంజీవ్ ఖన్నా కూడా ఇందులో భాగం అయ్యారని చెప్పాడు. ♦September 2015: షీనా బోరా కేసులో ఇది ఊహించని మలుపు. షీనా బోరా అసలు తండ్రిని తానేనంటూ కోల్‌కతాకు చెందిన సిద్ధార్థ దాస్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత.. కేసు సీబీఐ చేతికి వెళ్లింది. ముగ్గురు నిందితులపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ♦November 2015: షీనా బోరా హత్య కేసులో.. ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియాను సైతం సీబీఐ అరెస్ట్ చేసింది. ♦2016: ఇంద్రాణి ముఖర్జీ, ఆమె డ్రైవర్‌పై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత పీటర్ పేరును కూడా చేర్చారు. రాహుల్‌తో రిలేషన్షిప్ కారణంగానే.. ఇంద్రాణీ ఈ ఘాతుకానికి పాల్పడిందని సీబీఐ అందులో పేర్కొంది. ♦January-February 2017: కోర్టు విచారణ ప్రారంభం. షీనా బోరాను చంపేందుకు కుట్ర.. ఎత్తుకెళ్లి చంపడం.. ఆధారాలను నాశనం చేసే కుట్ర.. తప్పుడు సమాచారం ఇవ్వడం.. లాంటి అభియోగాలపై వాదప్రతివాదనలు మొదలయ్యాయి. ♦October 2019: ఇంద్రాణి, పీటర్ ముఖర్జియాలకు విడాకులు మంజూరు చేసిన ముంబై ఫ్యామిలీ కోర్టు ♦March 2020: పీటర్ ముఖర్జియాకు బెయిల్ ♦July 2021: బెయిల్ కోరుతూ నాలుగు పిటిషన్లు దాఖలు చేస్తే.. అన్నింటిని సీబీఐ స్పెషల్ కోర్టు తిరస్కరించింది ♦August 2021: షీనా బోరా హత్య కేసు దర్యాప్తును ముగించినట్లు ప్రకటించుకున్న సీబీఐ ♦February 10, 2022: సుప్రీం కోర్టుకు చేరిన ఇంద్రాణి ముఖర్జీ బెయిల్ అభ్యర్థన ♦February 18, 2022: సీబీఐతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం స్పందన కోరుతూ సుప్రీం నోటీసులు ♦March 25, 2022: ఇంద్రాణి ముఖర్జీ బెయిల్‌ను తిరస్కరించాలని సీబీఐ వాదన ♦May 18, 2022: ఇంద్రాణి ముఖర్జీ ఆరున్నరేళ్లు జైల్లో గడపడంతో సుప్రీం బెయిల్ ఇచ్చేందుకు అభ్యంతరాలు చెప్పలేదు.. మంజూరు చేసింది. కన్న కుమార్తెనే హత్య చేసిందని ఆరోపణ ఎదుర్కొంటూ ఆరేళ్లపాటు జైలు జీవితం గడిపిన ఇంద్రాణి(50)కి 2022లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో పదేళ్లయినా ఈ కేసు విచారణ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని, కాబట్టి.. బెయిల్ మంజూరు చేయాలని ఇంద్రాణి తరపు న్యాయవాది ముకుల్ విజ్ఞప్తి చేశారు. అయితే.. ఆరున్నరేళ్లు జైల్లో గడపడం అంటే చాలా సుదీర్ఘ కాలమని ఈ సందర్భంగా కోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేనందున ఆమెకు బెయిల్ ఇవ్వడమే సబబుగా భావించింది. సుప్రీం ఊరట ఇచ్చాక.. ముంబై సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా షరతులతో కూడిన అనుమతి ఇచ్చిందామెకు. దీంతో.. మే 20, 2022 శుక్రవారం సాయంత్రం ఆమె బైకుల్లా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది.. జైలు నుంచి బయటకు వచ్చాక ఇంద్రాణి చెప్పిన తొలి మాట. ‘ఒక కుటుంబంలోని చీకటి రహస్యం..యావత్ దేశాన్ని కుదిపేసిన సంచలన కుంభకోణం’ .. ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ సందర్భంగా.. మొదట ఈ సిరీస్‌ను ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ భావించింది. అయితే, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఓటీటీలో విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ సీబీఐ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన డివిజన్ బెంచ్.. దర్యాప్తు సంస్థతోపాటు న్యాయస్థానం వీక్షించేందుకు ముందస్తుగా ప్రదర్శించాలని సదరు ఓటీటీ సంస్థను ఆదేశించింది. దీనికి నెట్‌ఫ్లిక్స్ అంగీకరించింది. విచారణ పూర్తయ్యేవరకు ప్రసారం చేయబోమని న్యాయస్థానానికి తెలిపింది. తాజాగా దీనిపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో దీని విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. -
"పక్షిజల" : పక్షుల పట్ల ఆసక్తే ప్రకృతి ప్రేమికురాలిగా మార్చింది!
పచ్చటి ఊరు వదిలి కాంక్రీట్ జంగిల్లోకి అడుగుపెట్టిన శుభా భట్‌కు బెంగళూరులోని ‘ఐఐఎస్సీ’ క్యాంపస్ రూపంలో ప్రకృతి ప్రపంచం దగ్గరైంది. ఎన్నో పక్షులు నేస్తాలు అయ్యాయి. ‘పక్షులను ప్రేమించడానికి వాటి శాస్త్రీయ నామాలతో పనిలేదు’ అని హాస్యానికి అన్నా శుభాభట్ విషయంలో అది నిజం. ఎన్నో పక్షులకు సంబంధించి శాస్త్రీయ నామాలు, పుట్టు పూర్వోత్తరాలు తెలియకపోయినా వాటిని ప్రేమించింది. పక్షులను చూస్తున్నంతసేపూ తనకు శుభ సమయమే. శాస్త్రీయ కోణం కంటే అనుభూతులు, భావోద్వేగాల కోణంలో రెండు వందల జాతుల పక్షులకు సంబంధించి తన పరిశీలనలను ‘పక్షి జల’ పేరుతో ఫొటో డాక్యుమెంటేషన్ చేసింది శుభా భట్... పెళ్లయిన తరువాత బెంగళూరు మహానగరంలోకి అడుగు పెట్టింది శుభా భట్. పచ్చని పల్లెటూరి నుంచి వచ్చిన తనకు వాహనాల రణగొణధ్వనులు తప్ప పక్షుల కిలకిలారావాలేవీ వినిపించేవి కాదు. దీంతో ఇంటి నాలుగు గోడల మధ్య నేషనల్ జాగ్రఫీ చానల్ చూడడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) క్యాంపస్‌లోకి అడుగు పెట్టడం మళ్లీ పుట్టింటికి వచ్చినట్లుగా అనిపించింది శుభా భట్‌కు. ఆమె భర్త నవకాంత్ భట్ పరిశోధకుడు. ఐఐఎస్సీ క్యాంపస్‌లోకి ఎన్నో పక్షులు వచ్చిపోతుంటాయి. వాటిలో ఎప్పుడూ వచ్చే పక్షులతో పాటు అరుదైన అతిథుల్లాంటి పక్షులు కూడా ఉంటాయి. దాహార్తితో ఉన్న పక్షుల కోసం తన ఇంటిముందు మట్టిపాత్రలో నీళ్లు పెట్టి దూరంగా కూర్చునేది. దురదృష్టవశాత్తు ఒక్క పక్షి కూడా వచ్చేది కాదు. క్యాంపస్‌లోనే మరో చోటికి మకాం మార్చినప్పుడు కూడా ఇంటిముందు మట్టి పాత్రలలో నీళ్లు పెట్టి కూర్చొనేది. ఈసారి మాత్రం అదృష్టం తలుపు తట్టింది. కాకులు, పిచ్చుకలు... రకరకాల పక్షులు వచ్చి నీళ్లు తాగి వెళ్లేవి. ఈ ఉత్సాహంతో మరిన్ని మట్టిపాత్రలు ఇంటి చుట్టూ పెట్టేది. పేరు తెలిసిన పక్షులతో పాటు బొత్తిగా అపరిచితమైన పక్షులూ వచ్చి నీళ్లు తాగి వెళ్లేవి. అవి నీళ్లు తాగే దృశ్యం శుభకు అపురూపంగా అనిపించేది. నీటికి, పక్షులకు మధ్య ఉండే సంబంధాన్ని గురించి లోతుగా ఆలోచించేలా చేసేది. ఒకరోజు ఒక పక్షి చెట్టు కొమ్మల్లో నుంచి రాలిపడుతున్న నీటిబిందువులలో ఆనందంగా జలకాలాడుతున్న దృశ్యం చూసిన తరువాత చెట్లపై కూడా నీళ్లు పోయడం అలవాటు చేసుకుంది. మొత్తానికైతే శుభ ఉండే ఇల్లు పక్షులకు నచ్చిన ఇల్లు అయింది. ‘ఇక్కడకి వస్తే మనకు ప్రమాదమేమీ లేదు’ అనే నమ్మకం వాటికి కలిగింది. కొన్ని సంవత్సరాల క్రితం కశ్మీర్‌కు చెందిన అరుదైన కశ్మీర్ ఫ్లైక్యాచర్ శుభ కంటపడింది. కర్ణాటక గడ్డపై అరుదైన కశ్మీర్ పక్షిని వీడియో రికార్డ్ చేసిన ఘనత దక్కించుకుంది శుభ. ఫొటోగ్రాఫర్ కావాలని ఎప్పుడూ అనుకోలేదు శుభ. అయితే రకరకాల పక్షులు నీళ్లు తాగుతున్న అందమైన దృశ్యాలు కనువిందు చేస్తున్న రోజుల్లో కెమెరాను చేతుల్లోకి తీసుకుంది. ‘పక్షి జల’ పుస్తకంతో రచయిత్రిగా కూడా మారింది. ఈ పుస్తకాన్ని ఐఐఎస్సీ ప్రెస్ ప్రచురించింది. ‘పుస్తకం రాయాలని ఎప్పుడూ అనుకోలేదు. బాటనీ, బయోలజీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి రాకపోయినా ఈ పుస్తకం రాశానంటే కారణం ప్రకృతిపై నాకు ఉన్న ప్రేమ. దీంట్లో నా పరిశీలనలు, భావాలు, అనుభవాలు కనిపిస్తాయి. పక్షి జల చదివిన వాళ్లు ఎవరైనా తమ ఇంటి పరిసరాలలో పక్షుల దాహార్తిని తీర్చడానికి, వాటి జలకేళిని దర్శించడానికి నీటితో నిండిన మట్టిపాత్రలు ఏర్పాటు చేస్తే ఈ పుస్తకం ప్రయోజనం నెరవేరినట్లే’ అంటుంది శుభ. మనది కాని ప్రపంచంలోకి తొంగిచూడాలంటే అద్భుతశక్తులేవీ అవసరం లేకపోవచ్చుగానీ ఆసక్తి మాత్రం ఉండాలి. శుభా భట్‌కు ఆసక్తి అనే శక్తి ఉంది. ఆ ఆసక్తే ఆమెని పక్షుల ప్రపంచంలోకి వెళ్లేలా చేసింది. (చదవండి: పురిటి కోసం పక్షులు ఎంచుకున్న ప్రాంతం, విదేశాల నుంచి వస్తుంటాయి) -
మరో 4 జిల్లాల్లో ప్రైమ్ రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: తమ ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రజలు సులభంగా చేసుకునేలా ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం కార్డ్ ప్రైమ్ మరో 4 జిల్లాల్లో ప్రారంభమైంది. నంద్యాల, విశాఖ, అనకాపల్లి, తిరుపతి జిల్లాల్లోని 51 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సోమవారం నుంచి ఈ విధానంలోనే రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. గత రెండు నెలల నుంచి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని 24 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. అక్కడ విజయవంతంగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండటంతో దశల వారీగా మిగిలిన అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తున్నారు. ఈ నెల 14న శ్రీకాకుళం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించనున్నారు. దశల వారీగా ఈ నెలాఖరుకల్లా అన్ని జిల్లాల్లో కొత్త రిజిస్ట్రేషన్ల విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపై ఈ–సిగ్నేచర్తోనే.. ప్రస్తుతం డాక్యుమెంట్లో ఆస్తి యజమాని సంతకాలు పెట్టే విధానాన్ని కొనసాగిస్తున్నా త్వరలో ఈ–సిగ్నేచర్‌ను మాత్రమే అనుమతించనున్నారు. సబ్ రిజిస్ట్రార్ సంతకాలు ఇప్పటికే ఈ–సైన్ల ద్వారా జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వ్యవసాయ భూములైతే ఆన్లైన్లో నమోదు చేయించుకోవడానికి తహశీల్దార్ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. రిజిస్ట్రేషన్ పూర్తవగానే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ కూడా కొత్త విధానంలో జరిగిపోతుంది. రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లను సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, గ్రామ, వార్డు సచివాలయాలు, మీ–సేవా కేంద్రాలు, సీఎస్సీ కేంద్రాల్లో ఎక్కడైనా తీసుకోవచ్చు. అవగాహన లేకే ‘జిరాక్సుల’ ప్రచారం కొత్త రిజిస్ట్రేషన్ల విధానంలో ప్రజల డాక్యుమెంట్లను వారికివ్వకుండా జిరాక్సులు మాత్రం వారికిచ్చి, ఒరిజినల్ డాక్యుమెంట్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే ఉంచుతారనే ప్రచారంపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ స్పందించారు. లక్షల డాక్యుమెంట్లను దాచిపెట్టేటన్ని బీరువాలు, కప్‌బోర్డులు తమ ఆఫీసుల్లో లేవన్నారు. జిరాక్సుల ప్రచారం అపోహ మాత్రమేనని, అవగాహన లేకుండా ఇలాంటి ప్రచారాలు చేయడం తగదన్నారు. -
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇక అన్నింటికీ ఆ సర్టిఫికెటే ఆధారం!
విద్యా సంస్థల్లో అడ్మిషన్ల దగ్గర నుంచి ఆధార్ కార్డ్ వరకు ఇక అన్నింటికీ జనన ధ్రువీకరణ పత్రమే (Birth Certificate) ఆధారం కానుంది. అన్ని రకాల అవసరాలకూ బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌గా పరిగణించబోతోంది కేంద్ర ప్రభుత్వం. స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు, డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డ్ (Aadhaar Card), వోటర్ కార్డులకు దరఖాస్తు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌తో సహా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల పనులకు బర్త్ సర్టిఫికెట్‌ను ఏకైక ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించవచ్చు. ఈమేరకు సవరించిన కొత్త చట్టం అక్టోబర్ 1 నుంచి అమలులోకి రాబోతోంది. జనన మరణాల నమోదు (సవరణ) చట్టం-2023ను పార్లమెంట్ గత వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన సంగతి తెలిసిందే. "జనన మరణాల నమోదు (సవరణ) చట్టం-2023లోని సెక్షన్ 1 సబ్-సెక్షన్ (2) ద్వారా వచ్చిన అధికారాలను ఉపయోగించి, కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబర్ 1 నుంచి దీన్ని అమలు చేస్తోంది" అని కేంద్ర హోం శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. బర్త్ సర్టిఫికెట్ ఉంటే చాలు.. జనన,మరణాల నమోదు (సవరణ) చట్టం-2023 అమలులోకి వచ్చిన తేదీ లేదా ఆ తర్వాత జన్మించినవారు పుట్టిన తేదీ, ప్రదేశాన్ని నిరూపించడానికి జనన ధ్రువీకరణ పత్రాన్ని ఒకే పత్రంగా ఉపయోగించడానికి చట్టం అనుమతిస్తుంది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు, వివాహ నమోదు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థ లేదా ప్రభుత్వ రంగ సంస్థ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఏదైనా చట్టబద్ధమైన లేదా స్వయంప్రతిపత్త సంస్థలో ఉద్యోగ నియామకం కోసం కూడా బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌గా సమర్పించవచ్చు. (వాహన డీలర్లకు కీలక ఆదేశాలు.. ఇక ఆ సౌకర్యం కూడా..) ఈ చట్టం ప్రకారం.. నమోదిత జనన, మరణాల జాతీయ డేటాబేస్‌ను నిర్వహించడానికి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు అధికారం ఉంది. చీఫ్ రిజిస్ట్రార్లు (రాష్ట్రాలచే నియమించిన), రిజిస్ట్రార్లు (స్థానిక ప్రాంతాల్లో రాష్ట్రాలచే నియమించిన) జనన, మరణ డేటాను జాతీయ డేటాబేస్‌తో పంచుకోవడానికి బాధ్యత వహిస్తారు. ప్రతి రాష్ట్రం కూడా రాష్ట్ర స్థాయిలో ఇలాంటి డేటాబేస్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. -
‘గోల్డెన్’డీల్.. ఒక్క డాక్యుమెంట్ రూ.15.96 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ‘గోల్డెన్’డీల్స్ వస్తున్నాయి. 2023 సంవత్సరం ప్రారంభంలోనే మంచి బోణీ అందింది. జనవరి తొలివారంలో ఒకే ఒక్క డాక్యుమెంట్ రిజి స్ట్రేషన్‌తో ఏకంగా రూ.15.96 కోట్ల ఆదాయం సమకూరింది. గండిపేట సబ్‌రిజిస్ట్రార్ పరిధిలోని బండ్లగూడ జాగీర్‌లో ఉన్న 75,072 చదరపు గజాల భూమిని మైనార్టీ ట్రస్టు నుంచి మరో ఎడ్యుకేషనల్ ట్రస్టుకు బదలాయిస్తూ (కన్వేయన్స్) ఈ లావాదేవీ జరిగింది. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఈ భూమి మొత్తం మార్కెట్ విలువను రూ.210 కోట్లుగా లెక్కించి, రూ.15.96 కోట్ల ఫీజు వసూలు చేశారు. 2022–23 ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచీ ఆరేడు జాక్‌పాట్ లావాదేవీలు జరిగినట్టు రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల ద్వారా తాజాగా తెలిసింది. ఇంతకు ముందు ఇంకా పెద్ద డీల్ 2022 మేలో ఒకే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ద్వారా ఏకంగా రూ.35.51 కోట్ల ఆదాయం సమకూరింది. కూకట్పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోకి వచ్చే మిస్కిపేటలో 1,54,880 చదరపు గజాల భూమిని ఓ ఆయిల్ కార్పొరేషన్, ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కలిసి మరో రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించాయి. ఈ భూమి మార్కెట్ విలువ రూ.466 కోట్లుగా నిర్ధారించిన రిజిస్ట్రేషన్లశాఖ అధికారులు 35.51 కోట్ల ఫీజు వసూలు చేశారు. ఇక గండిపేట, రాజేంద్రనగర్, వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోనూ పలు భారీ లావాదేవీలు జరిగాయని.. కేవలం 5 డాక్యుమెంట్ల ద్వారానే రూ.100 కోట్లకుపైగా రెవెన్యూ సమకూరిందని అధికారవర్గాలు తెలిపాయి. రూ.14,500 కోట్లదాకా ఆదాయం! రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని పరిశీలిస్తే.. ఫిబ్రవరి 13 నాటికి రూ.12,310 కోట్ల వరకు ఖజానాకు చేరినట్టు అధికారవర్గాలు తెలిపాయి. మరో నెలన్నర రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో.. ఇంకో రూ.2,000 కోట్ల నుంచి రూ.2,200 కోట్ల వరకు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం 2022–23 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల్లో పేర్కొన్న విధంగా రూ.16 వేల కోట్లు, 2023–24కు నిర్దేశించుకున్న రూ.18 వేల కోట్లు సమకూరే అవకాశం లేదని.. రిజిస్ట్రేషన్ ఫీజులు లేదా భూ విలువలను సవరిస్తేనే లక్ష్యం చేరుకోవడం సాధ్యమని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూము లు, ఆస్తుల రిజిస్ట్రేషన్లన్నీ కలిపి రూ.14,500 కోట్ల మేరకు సమకూరవచ్చని అంటున్నారు. -
డార్విన్ సంతకంతో కూడిన లేఖ వేలంలో ఎంత పలుకుతోందంటే...
ప్రముఖ బ్రిటన్ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ అంటే తెలియని వారుండరు. అతని పేరు తలుచుకుంటే గుర్తోచ్చేది జీవ పరిణామ సిద్ధాంతం. అంతా గొప్ప శాస్త్రవేత్తకు ప్రతిపాదించిన జీవ పరిణామా సిద్ధాంతానికి సంబంధించిన ఒక పత్రం వెలుగులోకి వచ్చింది. అదికూడా ఆయన సంతకంతో కూడిని లేఖ కావడం విశేషం. వాస్తవానికి ఆయన పరిశోధనల గురించి క్రమం తప్పకుండా ఒక ప్రతిలో నోట్ చేసి ఉండనందున ఆయనకు సంబంధించిన రచనలు ఇంత వరకు సరిగా దొరకలేదు. ఒక వేళ దొరికినా వాటిలో సాధారణంగా డార్విన్ లేదా సీహెచ్ డార్విన్ అని మాత్రమే ఉంటుంది. కానీ అతని పూర్తి పేరుతో సంతకం చేసిని లేఖ దొరకడం అత్యంత అరుదు. ఈ మేరకు డార్విన్ ఆన్‌లైన్‌గా పిలిచే డేటాబేస్ క్యూరేటర్ ప్రొఫెసర్ జాన్ వాన్ వైహే మాట్లాడుతూ అత్యంత గొప్ప శాస్త్రవేత్త సంతకంతో కూడిన ప్రతి చాలా ప్రత్యకమైనది. అది ఆన్ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ మూడవ ఎడిషన్‌లో భాగానికి సంబంధించిన లేఖగా పేర్కొన్నారు. ఈ లేఖ న్యూయార్క్‌లోని సోథెబైస్ వేలంలో సుమారు రూ. 9 కోట్లు పలుకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ లేఖలో డార్విన్...ఇందులో అసలు వాస్తవాలను పరిగణలోనికి తీసుకుని వెల్లడిస్తాను. జీవులు వాటి జాతుల వర్గీకరణ వైవిద్యాలను ఆ పరిణామ సిద్ధాంతం వివరిస్తోంది. ఒక్కోసారి ఆ వర్గీకరణ కూడా తప్పుగా ఉండొచ్చు. అదీ క్రమంగా తప్పుడు సిద్ధాంతాన్ని వివరించకూడదు. జీవ సారాంశం, దాని మూలం గురించి సమగ్రంగా వివరించడం అనేది కొంచెం క్లిష్టతరమైనదిగా పేర్కొనవచ్చు. అలాగే న్యూటన్ గురత్వాకర్షణ సిద్ధాంతం సారాంశం ఏంటనేది కచ్చితంగా వివరించలేం. కానీ న్యూటన్ తన పరిశోధనల్లో తత్వశాస్త్రంలోని అద్భుతమైన కొత్త సిద్ధాంతాలను పరిచయం చేశాడన్నారు. (చదవండి: మరణించిన వారిని మళ్లీ పునర్జీవింప చేసే సంస్థ...మళ్లీ బతకాలని....) -
మూడోరోజూ ఐటీ దాడులు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ, ఆమె బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై మూడో రోజూ ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ దాడులు కొనసాగాయి. రూ.1,500 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన దస్తావేజుల్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. శశికళ బంధువులు, ఆమె సన్నిహితులే లక్ష్యంగా హైదరాబాద్, బెంగళూరు సహా తమిళనాడులోని 40 చోట్ల ఐటీశాఖ తనిఖీలు నిర్వహించింది. సోదాల్లో రూ.1,200 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు, రూ.6 కోట్ల నగదు, 15 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నోట్ల రద్దు సమయంలో నీలగిరి జిల్లాలోని కొడనాడు, గ్రీన్ టీ ఎస్టేట్స్‌లో పనిచేస్తున్న దాదాపు 800 కార్మికుల ఖాతాల్లో రూ.2 లక్షలు చొప్పున మొత్తం రూ.16 కోట్లు జమచేసిన విషయాన్ని ఐటీ శాఖ గుర్తించింది. రాజకీయ నాయకులంటే గోచీతో ప్లాట్‌ఫాం మీద బతకాలా? అని ఐటీ దాడుల నేపథ్యంలో దినకరన్ ప్రశ్నించారు. తానేం గాంధీ మనవడిని కాదని, సాధారణ వ్యక్తినన్నారు. ఐటీ శాఖ దాడుల కోసం బుక్‌చేసుకున్న 350 వాహనాలు ఎవరివో ఓసారి దృష్టి సారించాలన్నారు. శేఖర్‌రెడ్టి డైరీ ఆధారంగా దాడులు జరిగిఉంటే భారీగా నల్లధనం బయటపడి ఉండేదన్నారు. -
త్రివిధ దళాల ఉమ్మడి విధాన పత్రం ఆవిష్కరణ
న్యూఢిల్లీ: భారత్ ఎదుర్కొంటున్న భద్రతా పరమైన ముప్పుల్ని సమష్టి కృషితో సమర్ధంగా తిప్పికొట్టే లక్ష్యంతో ఆర్మీ, నౌక దళం, వాయుసేనలు మంగళవారం ఉమ్మ డి విధాన పత్రాన్ని ఆవిష్కరించాయి. దేశం ఎదుర్కొంటున్న భద్రత పరమైన ముప్పు ల్ని ఈ పత్రంలో ప్రస్తావించారు. సరిహ ద్దుల వెంట దాడులు, జమ్మూ కశ్మీర్లో సాగుతున్న పరోక్ష యుద్ధం, వివిధ ప్రాంతా ల్లో వామపక్ష తీవ్రవాదం ముఖ్య సమస్య లుగా పేర్కొన్నారు. త్రివిధ దళాల భద్రతా సిబ్బందికి ఉమ్మడి శిక్షణతో పాటు, ఏకీకృత కమాండ్ అండ్ కంట్రోలింగ్ విధానం అవలంభించాలని నిర్ణయించారు. ఈ విధాన పత్రాన్ని చైర్మన్ ఆఫ్ ద చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ, నేవీ చీప్ అడ్మిరల్ సునీల్ లాంబా ఆవిష్కరించగా.. కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, వాయు సేన చీఫ్ బీఎస్ ధనోవాలు పాల్గొన్నారు. -
అరెస్టులు చూపించకుండా మంతనాలు
రంగంలోకి టీడీపీ ప్రముఖులు ‘ఓ నయీం ముఠా’కు పోలీసుల మద్దతు సాక్షి, రాజమహేంద్రవరం : నకిలీ డాక్యుమెంట్లతో రూ. 4 కోట్ల విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న కేసులో ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పోలాకి పరమేశ్వరరావు, హార్డ్‌వేర్ వ్యాపారి ఆకుల సాయిబాబా అరెస్ట్‌లను చూపించకుండా టీడీపీ పెద్దలు రంగంలోకి దిగారు. అరెస్ట్ కాకుండా హైకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చా యంటూ బ్యాంకుకు వెళ్లిన పరమేశ్వర రావును, దుకాణానికి వచ్చిన సాయిబాబాను ఒకటోపట్టణ ఎస్సై సీహెచ్ రాజశేఖర్ బుధ వారం మ«ధ్యాహ్నం అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారు చెప్పిన ఉత్తర్వు లు ఒక లాయర్ ఇచ్చిన కాపీ కావడంతో పోలీసులు వాటిని తిరస్కరించారు. దీంతో టీడీపీ పెద్దలు రంగంలోకి దిగి వారిని అరెస్ట్ చేయకుండా ఒత్తిడి చేశారు. లాయర్ ఇచ్చిన కాపీతో వదిలిపెట్టాలని జిల్లాకు చెందిన ‘ఉప’ముఖ్య నేత పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. అప్పటికే ఈ విషయం మీడియాకు తెలియడంతో వ్యవహారం గురువారం 11 గంటల వరకు నడిచింది. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ చల్లా శంకరరావు, పలువురు డైరెక్టర్లు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీసులతో మంతనాలు జరిపారు. హైకోర్టు ఉత్వర్వులే లాయర్ తన లెటర్‌హెడ్‌లో ఉత్తర్వుల నంబర్‌తో పంపిం చాడని వాదించి. తాము స్థలం యజమానితో రాజీ చేసుకుంటా మంటూ తమ సొంత పూచీకత్తుపై విడింపించుకుని వెళ్లారు. నిందితులకు పోలీసులకు మద్దతు..? బాధితుడు బండారు వెంకటరమణ తన స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్టర్ చేయించుకున్నా రని డిసెంబర్ 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా ఏ ఒక్కరినీ పట్టుకోలేదు. గుంటూరులో ఉన్న 1/4 వాటా యజమాని వరదరాజులనాయుడు వద్దకు వెళ్లగా ఆయన కదలలేని స్థితిలో ఉండడంతో జరిగిన విష యాన్ని ఓ పేపర్‌పై రాయించుకుని వచ్చారు తప్ప అసలు నిందితులను పట్టుకోలేదు. అరెస్ట్‌లు కాకుండా ఉత్తర్వులు తెచ్చుకునేందుకు వారు విశాఖపట్నం, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు కొంత మంది వెళ్లగా, మరికొంత మంది నగరంలోనే ఉంటున్నారు. ఇక సాధ్యం కాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. తరచూ స్నేహితులతో తమ మొబైల్ నుంచి మాట్లాడుతున్నారు. అయినా పోలీసులు వారిని పట్టుకోకపోవడం గమనార్హం. ఈ వ్యవహారంలో నిందితులు అరెస్ట్ కాకుండా ఉత్తర్వులు తెచ్చుకునేందుకు పోలీసులకు పెద్ద మొత్తంలో ముడుపులు అందాయన్న ఆరోపణలు వస్తున్నాయి. చివరికి బుధవారం ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పోలాకి పరమేశ్వరరావు, ఆకుల సాయిబాబాలను కూడా ప్రైవేటు వ్యక్తుల ప్రోద్బలంతోనే అరెస్ట్ చేయడం గమనార్హం. -
తలసాని కుమారునిపై కేసు
♦ నిర్బంధించారని ఫిర్యాదు చేసిన ♦ ఎంపీ కొత్తపల్లి గీత భర్త సాక్షి, హైదరాబాద్: తనను నిర్బంధించడంతో పాటు బలవంతంగా డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారంటూ అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త పరుచూరి రామకోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుమారుడు సాయిపై పంజగుట్ట పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. సాయి వ్యాపార భాగస్వామిగా ఉన్న రామకృష్ణనూ పోలీసులు నిందితుడిగా చేర్చారు. బుధవారం రామకృష్ణ డీడీ కాలనీకే చెందిన కృష్ణ ద్వారా తనకు ఫోన్ చేయించి తాజ్ కృష్ణ హోటల్‌కు రావాల్సిందిగా కోరాడని, తాను వెళ్లగా... అప్పటికే అక్కడ మంత్రి కుమారుడు సాయి ఉన్నాడని, తనను సాయి, రామకృష్ణ రాత్రి 12 గంటల వరకు నిర్భంధించి.. బెదిరించి మూడు డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని రామకోటేశ్వరరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఏపీకి ప్రత్యేక హోదాపై డాక్యుమెంట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్ర ప్రభుత్వం డాక్యుమెంట్ రూపొందించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని కలిసినపుడు ఈ డాక్యుమెంట్‌ను అందజేయనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, అన్ని వర్గాల ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను ఈ డాక్యుమెంట్లో పొందుపర్చారు. ఇదిలావుండగా, ప్రధాన మంత్రి మోదీతో చంద్రబాబు భేటి వాయిదా పడింది. షెడ్యూలు ప్రకారం గురువారం చంద్రబాబు, ప్రధానితో భేటీ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ నెల 25 నుంచి 31 తేదీలోపు చంద్రబాబు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలుస్తారని సమాచారం. -
భూముల క్రమబద్ధీకరణ గడువు పెంచాలి: సీపీఐ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ గడువు పెంచాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది, 125 గజాలు, ఆ పైన ఆక్రమించుకుని ఎలాంటి నిర్మాణాలు లేకుండా ఖాళీగా ఉన్న ప్లాట్లను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని, గతంలో భూపోరాటాల సందర్భంగా పెట్టిన కేసులన్నింటిని ఎత్తేయాలని తీర్మానం ఆమోదించింది. ఆదివారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశం పలు తీర్మానాలు చేసింది. క్రమబద్ధీకరణ పేరుతో భూకబ్జాదారులు లాభపడకుండా చూడాలని, అక్రమ లేఅవుట్లు చేసి అమ్మినవారిని కఠినంగా శిక్షించాలని కోరింది. రాష్ట్రంలోని 338 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని, వ్యవసాయకూలీలు, పేదలకు కరువు భృతిని అందించాలని విజ్ఞప్తి చేసింది. మార్చి 7-10 తేదీల్లో ఖమ్మంలో జరగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభ ల డాక్యుమెంట్‌లోని అంశాలపై చర్చించి ఈ సమావేశం ఆమోదించింది. -
సులభంగా క్లెయిమ్
బీమా కంపెనీ పనితీరును గుర్తించడంలో క్లెయిమ్‌ల పరిష్కారం అనేది చాలా ప్రధానమైనది. అందుకే ఇప్పుడు బీమా కంపెనీలు త్వరితగతిన క్లెయిమ్ పరిష్కారంపై దృష్టి సారిస్తున్నాయి. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి చికాకులు లేకుండా సులభంగా క్లెయిమ్ మొత్తం పొందొచ్చు. క్లెయిమ్ సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను తెలుసుకుందాం... కంపెనీకి తెలియ చేయడం క్లెయిమ్‌లో అత్యంత కీలకమైన, ముఖ్యమైన అంశం ఏమిటంటే..పాలసీదారుడి మరణానికి సంబంధించిన వార్త బీమా కంపెనీకి తెలియచేయడమే. అప్పటి నుంచే క్లెయిమ్ ప్రక్రియ అనేది మొదలవుతుంది. సాధ్యమైనంత తొందరగా కంపెనీ కార్యాలయంలో కాని లేదా ఈ మెయిల్ ద్వారా కాని వివరాలను చెప్పొచ్చు. పాలసీదారుని పేరు, పాలసీ నంబర్, మరణం సంభవించిన తేదీ, మరణానికి కారణం, క్లెయిమ్ కోరుతున్నవారి వివరాలన్నీ తెలియచేయాలి. ఇవన్నీ కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే. ఇవి అందితేనే క్లెయిమ్ ప్రక్రియ మొదలవుతుంది. ఇవి జత చేయాలి.. ప్రాథమికంగా క్లెయిమ్ గురించి బీమా కంపెనీకి తెలియచేసిన తర్వాత అధికారికంగా క్లెయిమ్ దరఖాస్తు దాఖలు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు కొన్ని కాగితాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. క్లెయిమ్ దరఖాస్తును పూర్తి చేసి దానిని ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్‌తో బీమా కంపెనీకి అందచేయాలి. వీటితో పాటు మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ నుంచి తీసుకున్న మరణ ధుృవీకరణ పత్రంతో పాటు క్లెయిమ్ కోసం దరఖాస్తు చేస్తున్న నామినీ ఫొటోలు, గుర్తింపు కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. జత చేసే జిరాక్స్ కాపీలన్నీ కనీసం ఏదైనా ఒక గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టెడ్ చేయించాలి. సాధారణంగా బీమా కంపెనీకి ఈ వివరాలు సరిపోతాయి. కొన్ని సందర్భాల్లో క్లెయిమ్‌ను బట్టి అదనపు సమాచారాన్ని అడుగుతాయి. కాలపరిమితి ఉందా? క్లెయిమ్ కోసం దరఖాస్తు చేయడానికి ఎటువంటి కాలపరిమితి లేదు కాని ఆలస్యం కాకుండా ఉండాలంటే ఎంత తొందరగా క్లెయిమ్ చేసుకుంటే అంత తొందరగా పూర్తవుతుంది. కాని క్లెయిమ్‌కు దరఖాస్తు చేసిన తర్వాత గరిష్టంగా 30 రోజుల్లో క్లెయిమ్‌ను పరిష్కరించాలని, ఒకవేళ ఆలస్యం అయితే దానికి గల కారణాలను తెలియచేయాలని ఐఆర్డీఏ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు చాలా బీమా కంపెనీలు క్లెయిమ్ స్టేటస్‌ను ఆన్లైన్లో తెలుసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. ఒక వేళ బీమా కంపెనీ సరైన కారణాలు చూపకుండా క్లెయిమ్ పరిష్కారం చేయడంలో ఆలస్యం చేస్తే ఐఆర్డీఏకి చెందిన ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐజీఎంఎస్)ను సంప్రదించవచ్చు. లేదా పాలసీదారుడు వినియోగదారుల ఫోరం, కోర్టు, అంబుడ్స్‌మన్‌లో ఏదో ఒకదాన్ని ఆశ్రయించవచ్చు. -
మౌస్ కూడా స్కాన్ చేస్తుంది
తిరువనంతపురం: ముఖ్యమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసుకోడానికి స్కానర్ లేదే అని ఇకపై బాధపడాల్సిన అవసరం లేదు.. ఇకపై మీ ఇబ్బందులను కంప్యూటర్ మౌస్ తీర్చనుంది. స్కానర్‌లా పనిచేసే కొత్తరకం మౌస్‌లు వచ్చేస్తున్నాయి. ‘మొబ్స్కాన్’గా పిలిచే ఈ మౌస్‌లు స్కాన్ చేసిన డాక్యుమెంట్లను ఎడిట్ చేసేలా అభివృద్ధిపరిచారు. ఈ మొబ్స్కాన్ను బుధవారం తిరువనంతపురంలో అధికారికంగా ఆవిష్కరించినట్లు కంపెనీ అధికారి మైఖెల్బార్న్ తెలిపారు. ‘చూడడానికి సాధారణ కంప్యూటర్మౌస్లా ఉన్నా దీనికి అంతర్భాగంలో కెమెరా ఉంటుంది. పదాలను, టేబుల్స్‌ను, చిత్రాలను ఈ కెమెరా ఆధారంగా మొబ్స్కాన్ ఎడిట్ చేసుకుంటుంది’ అని కంపెనీ ముఖ్యఅధికారి ఏజీ. డక్యుడా వివరించారు. ఈ కొత్తరకం మౌస్ ధర సుమారు రూ. 6 వేలుగా నిర్ణయించారు. -
లేఖర్లలో ‘ఆన్లైన్’ అలజడి
మాడుగుల, న్యూస్‌లైన్ : మీసేవ ద్వారా (ఆన్లైన్లో) భూ రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో తమ ఉపాధి పోతుందని లెసైన్సులున్న దస్తావేజులేఖరులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారు 700 మంది దస్తాలేఖరులున్నారు. ఇప్పుడు ఆన్లైన్ విధానం వల్ల తమ కుటుంబాలకు జీవనోపాధి పోతుందని, ఉద్యోగాలు లేకపోయినా దస్తావేజులు రాసుకుంటూ జీవనం సాగిస్తున్నామని పేర్కొంటున్నారు. ఇప్పటికే అడంగల్, ఈసీలకు మీసేవలో పనులు జరగక అత్యవసర సమయాల్లో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. గతంలో సగటున ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రోజుకి పది నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఆన్లైన్ పద్ధతి రావడంతో కనీసం ఒక్క డాక్యుమెంటు అవ్వడం లేదని రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు. మీసేవ ద్వారా అడంగల్, ఈసీలు రిజిస్ట్రేషన్లు చేయించుకునే పద్ధతిని ఉపసంహరించుకోవాలని దస్తావేజులేఖరులు, రైతులు కోరుతున్నారు. ఈ విషయమై మాడుగుల ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ పి.శంకరరావును ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా గతంలో పట్టాదారు పాసు పుస్తకాలుంటే రిజిస్ట్రేషన్ చేసేవారమన్నారు. ఇప్పుడు ఆన్లైన్లో సర్వే నంబర్లుంటేనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని చెప్పారు. ఈవిధంగా రైతులకు అడంగల్‌లో పేర్లు లేక ఆన్లైన్లో తమ పట్టాదారు పాసుపుస్తకం నంబర్లు నమోదు కాక రిజిస్ట్రేషన్లు చేయించుకోలేకపోతున్నారన్నారు. ప్రభుత్వమే లెసైన్సులిచ్చింది గతంలో ప్రభుత్వం దస్తావేజులు రాయడానికి లెసైన్సులిచ్చింది. దీంతో దస్తావేజులు రాసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. రిజిస్ట్రేషన్లు మీసేవకు అప్పగిస్తే మా కుటుంబాలు రోడ్డున పడతాయి. మీసేవకు అప్పగిస్తే ఆందోళనకు దిగుతాం. - కొసిరెడ్డి కృష్ణమూర్తి, దస్తావేజులేఖరి, మాడుగుల. రిజిస్ట్రేషన్లు అవ్వలేదు పాసు పుస్తకాలు ఆన్లైన్లో పెట్టడానికి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా పనులు కావడం లేదు. ఈ పద్ధతి ద్వారా మా పనులవడం లేదు. అడంగల్‌లో చేర్చి ఆన్లైన్లో పెట్టకపోవడంతో భూములను విక్రయించుకోలేకపోతున్నాం. - మట్టా రాజేష్, మాడుగుల.