తలసాని కుమారునిపై కేసు | mp geetha husbend case againts to sai kiran | Sakshi
Sakshi News home page

తలసాని కుమారునిపై కేసు

Published Fri, Apr 1 2016 2:47 AM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM

mp geetha husbend case againts to sai kiran

నిర్బంధించారని ఫిర్యాదు చేసిన
ఎంపీ కొత్తపల్లి గీత భర్త

 సాక్షి, హైదరాబాద్: తనను నిర్బంధించడంతో పాటు బలవంతంగా డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారంటూ అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త పరుచూరి రామకోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుమారుడు సాయిపై పంజగుట్ట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. సాయి వ్యాపార భాగస్వామిగా ఉన్న రామకృష్ణనూ పోలీసులు నిందితుడిగా చేర్చారు. బుధవారం రామకృష్ణ డీడీ కాలనీకే చెందిన కృష్ణ ద్వారా తనకు ఫోన్ చేయించి తాజ్ కృష్ణ హోటల్‌కు రావాల్సిందిగా కోరాడని, తాను వెళ్లగా... అప్పటికే అక్కడ మంత్రి కుమారుడు సాయి ఉన్నాడని, తనను సాయి, రామకృష్ణ రాత్రి 12 గంటల వరకు నిర్భంధించి.. బెదిరించి మూడు డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని రామకోటేశ్వరరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement