న్యూఢిల్లీ: భారత్ ఎదుర్కొంటున్న భద్రతా పరమైన ముప్పుల్ని సమష్టి కృషితో సమర్ధంగా తిప్పికొట్టే లక్ష్యంతో ఆర్మీ, నౌక దళం, వాయుసేనలు మంగళవారం ఉమ్మ డి విధాన పత్రాన్ని ఆవిష్కరించాయి. దేశం ఎదుర్కొంటున్న భద్రత పరమైన ముప్పు ల్ని ఈ పత్రంలో ప్రస్తావించారు. సరిహ ద్దుల వెంట దాడులు, జమ్మూ కశ్మీర్‌లో సాగుతున్న పరోక్ష యుద్ధం, వివిధ ప్రాంతా ల్లో వామపక్ష తీవ్రవాదం ముఖ్య సమస్య లుగా పేర్కొన్నారు. త్రివిధ దళాల భద్రతా సిబ్బందికి ఉమ్మడి శిక్షణతో పాటు, ఏకీకృత కమాండ్ అండ్ కంట్రోలింగ్ విధానం అవలంభించాలని నిర్ణయించారు. ఈ విధాన పత్రాన్ని చైర్మన్ ఆఫ్ ద చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ, నేవీ చీప్ అడ్మిరల్ సునీల్ లాంబా ఆవిష్కరించగా.. కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, వాయు సేన చీఫ్ బీఎస్ ధనోవాలు పాల్గొన్నారు.
త్రివిధ దళాల ఉమ్మడి విధాన పత్రం ఆవిష్కరణ
Published Wed, Apr 26 2017 2:45 AM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM
Advertisement