సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ, ఆమె బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై మూడో రోజూ ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ దాడులు కొనసాగాయి. రూ.1,500 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన దస్తావేజుల్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. శశికళ బంధువులు, ఆమె సన్నిహితులే లక్ష్యంగా హైదరాబాద్, బెంగళూరు సహా తమిళనాడులోని 40 చోట్ల ఐటీశాఖ తనిఖీలు నిర్వహించింది. సోదాల్లో రూ.1,200 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు, రూ.6 కోట్ల నగదు, 15 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
నోట్ల రద్దు సమయంలో నీలగిరి జిల్లాలోని కొడనాడు, గ్రీన్ టీ ఎస్టేట్స్‌లో పనిచేస్తున్న దాదాపు 800 కార్మికుల ఖాతాల్లో రూ.2 లక్షలు చొప్పున మొత్తం రూ.16 కోట్లు జమచేసిన విషయాన్ని ఐటీ శాఖ గుర్తించింది. రాజకీయ నాయకులంటే గోచీతో ప్లాట్‌ఫాం మీద బతకాలా? అని ఐటీ దాడుల నేపథ్యంలో దినకరన్ ప్రశ్నించారు. తానేం గాంధీ మనవడిని కాదని, సాధారణ వ్యక్తినన్నారు. ఐటీ శాఖ దాడుల కోసం బుక్‌చేసుకున్న 350 వాహనాలు ఎవరివో ఓసారి దృష్టి సారించాలన్నారు. శేఖర్‌రెడ్టి డైరీ ఆధారంగా దాడులు జరిగిఉంటే భారీగా నల్లధనం బయటపడి ఉండేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment