handover
-
రాష్ట్రం భూమి ఇచ్చినా.. రైల్వేజోన్‌పై కేంద్రందే కిరికిరి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్, విభజన చట్టంలోని హామీ అయిన విశాఖపట్నం రైల్వేజోన్‌కు సంబంధించిన కూత ఈ ఏడాది రైల్వే బడ్జెట్లోనూ వినిపించలేదు. పైగా దీనిపై కేంద్రం మరోసారి కిరికిరీ పెడుతోంది. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఢిల్లీలో విలేకరుల సమా వేశంలో జోన్ అంశంపై నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెట్టేసేందుకు యత్నించారు. రైల్వేజోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించాల్సి ఉందని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉంది.కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కప్పిపుచ్చేందుకు సమాధానాన్ని దాటవేసే ఉద్దేశంతోనే ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై నెపం నెట్టేసేందుకు ప్రయత్నిస్తూ అసత్య ఆరోపణలు చేయడం విభ్రాంతి కల్గించింది. ఎందుకంటే.. కేంద్రమంత్రి చెప్పిన 52 ఎకరాలకు, రైల్వేజోన్ వ్యవ హారానికి అసలు ప్రత్యక్ష సంబంధమేలేదు. ఆయన చెబుతున్న 52 ఎకరాలను రైల్వేకు కేటాయించకుండా తాత్సారం చేసింది గత టీడీపీ ప్రభుత్వం. ఇక అసలు విషయం ఏమిటంటే.. ఆ 52 ఎకరాలను రైల్వేకు అప్పగిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. గత నెల 2న జీవీఎంసీ కమిషనర్ రైల్వే అధికారులకు లేఖ రాశారు. వాస్తవాలిలా ఉంటే.. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఇందుకు విరుద్ధంగా రైల్వేజోన్‌పై అవాస్తవాలు వల్లెవేశారు. కేవలం ఒ డిశాలోని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ యన ఈ విధంగా మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ వ్యవహారాన్ని తాత్సారం చేస్తున్నట్లుగా స్పష్ట మవుతోంది. అసలు ఈ రైల్వేజోన్ అంశంపై వాస్తవాలు ఏమిటంటే.. ► విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ను రైల్వే శాఖ రూపొందించింది. భవనాలు, ఇతర అవసరాల కోసం విశాఖలో 950 ఎకరాలు అందుబాటులో ఉందని స్పష్టంగా పేర్కొంది. ► రాష్టప్రభుత్వ ఒత్తిడితో విశాఖపట్నంలో రైల్వే జోన్ కార్యాలయాల నిర్మాణానికి గతేడాది రూ.170 కోట్లు కూడా కేటాయించింది. ► రైల్వేజోన్ ఆచరణలోకి రావాలంటే సాంకేతికంగా కీలక అంశాలపై కేంద్రం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోంది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేజోన్, సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేజోన్లతో ఏపీ పరిధిలో ఆస్తుల పంపకం, కొత్త డివిజన్ల ఏర్పా టు, ఉద్యోగుల కేటాయింపు, కొత్త కార్యాలయా ల ఏర్పాటు తదితర అంశాలను ఓ కొలిక్కి తీసు కువచ్చి దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ను ఆచర ణలోకి తీసుకురావాలి. కానీ.. కేంద్రం బడ్జెట్లో ఈ విషయాలేవీ కనీసం ప్రస్తావించలేదు. ► ఇక రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించనందునే రైల్వేజోన్ ఏర్పాటులో జాప్యం జరుగుతోందన డం హాస్యాస్పదం. ఎందుకంటే.. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రైల్వే భూమికి బదులుగా రైల్వేశాఖకు భూమి కేటాయించాలని ఆయన చెబుతున్నారు. కానీ, విశాఖలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2013లో రైల్వే భూములను తీసుకుంది. అందుకు ప్రత్యామ్నాయంగా రైల్వేశాఖకు 52 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేశాఖ మధ్య అంతకుముందే ఒప్పందం కుదిరింది. అంటే.. రాష్ట్ర విభజనకు ఏడాది ముందు సంగతి అది. ► 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించారు. విభజన చట్టంలో విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీకి అంతకుముందటి రైల్వే భూమి తీసుకున్న దానికి సంబంధమేలేదు. ఆ అంశంతో ముడిపెట్టకుండా విభజన చట్టం ప్రకారం రైల్వేజోన్‌ను ఏర్పాటుచేయాలి. అందుకోసం 950 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని కూడా డీపీఆర్‌లో కేంద్ర ప్రభుత్వమే స్పష్టంగా పేర్కొంది. ఆ విషయాన్ని కప్పిపుచ్చుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యకరం. ► వాస్తవానికి రైల్వేకు కేటాయించాలని 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన 52 ఎకరాలపై వివాదం ఏర్పడింది. అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రైల్వేశాఖ అధికారులు ప్రయత్నిస్తే అక్కడి గిరిజనులు అడ్డుకున్నారు. సమస్య సున్నితంగా మారడంతో రైల్వేశాఖ వెనక్కి తగ్గింది. దీనిపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కూడా మౌనంగా ఉండిపోయింది. అప్పట్లో కూడా రైల్వేశాఖ ఆ విషయంపై పట్టుబట్టలేదు. ► ఇక భూమి సమస్యతోనే రైల్వేజోన్ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని రైల్వేశాఖ ఇప్పటివరకు చెప్పనేలేదు. రైల్వేజోన్ అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఈ నాలుగున్నరేళ్లలో ఎన్నోసార్లు సమావేశమయ్యారు. ఏ ఒక్క సమావేశంలో కూడా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించనేలేదు. రెల్వేకు 52 ఎకరాలు అప్పగింత.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఇంకా అప్పగించలేదని చెబుతున్న 52 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైల్వేకు అప్పగించేసింది. ఈ మేరకు గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఆ భూముల్లో ఉన్న ఆక్రమణలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించారు. వాటిని పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్నారు. జీవీఎంసీ పరిధిలోని ముడసర్లోవ సర్వే నెంబర్లు 57, 58, 59, 61, 62, 63, 64, 65తో ఉన్న 52 ఎకరాలను రైల్వేశాఖకు అప్పగించారు. ఈ మేరకు జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ సీఎం శ్రీకాంత్ వర్మ ఈ ఏడాది జనవరి 2నే విశాఖలోని ఈస్ట్‌కోస్ట్ డీఆర్ఎంకు లేఖ ద్వారా తెలియజేశారు. వాస్తవం ఇలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం భూమిని అప్పగించలేదని రైల్వేమంత్రి వ్యాఖ్యానించడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు ఢిల్లీలోని పచ్చమీడియా ప్రతినిధులు ఉద్దేశపూర్వకంగా అడిగిన ప్రశ్నలకు ప్రభావితమైన ఆయన అవాస్తవాలు మాట్లాడడం కేంద్రమంత్రి స్థాయికి తగినట్లుగా లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఒడిశాలో రాజకీయ ప్రయోజనాల కోసమేనా? ఒడిశాలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నది స్పష్టమవుతోంది. ప్రధానంగా విశాఖ కేంద్రంగా వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్ చేస్తుండగా.. వాల్తేర్ రైల్వే డివిజన్‌ను రద్దుచేసి.. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్ల తోనే కొత్త జోన్ ఏర్పాటుపై డీపీఆర్‌లో ప్రస్తావించారు. దీనిపై రాష్ట్రంలో తీవ్ర విమర్శలు వ్యక్తమ య్యాయి. ఎందుకంటే.. విజయవాడ నుంచి విశాఖ 350 కి.మీ. దూరంలో ఉండగా.. రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఇచ్చాపురం 580 కి.మీ. దూరంలో ఉంది. అంతవరకు విజయవాడ రైల్వే డివిజన్‌గా ఏర్పాటుచేస్తే పరిపాలన నిర్వహణ సమస్యలు ఏర్పడతాయి. అందుకే వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగిస్తూనే విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తూర్పు కోస్తా జోన్లో అత్యధిక రాబడి ఉన్న వాల్తేర్ డివి జన్ను రద్దుచేయాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేజోన్ ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. ఒడిశాలో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకే ఇలా వ్యవహరిస్తోంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశా కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కావడంతో ఆయన ఒడిశాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నెలలోగా ప్రాజెక్టుల అప్పగింత
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను నెల రోజుల్లోగా కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సమ్మతి తెలిపా యి. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్ సీలు, కృష్ణా బోర్డు సమావేశమై.. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించిన 15 ప్రధాన కాంపోనెంట్లు/ఔట్ లెట్లను కృష్ణా బోర్డుకు అప్పగించడంలో అనుసరించాల్సిన విధివిధానాల(హ్యాండింగ్ ఓవర్ ప్రొటోకాల్స్)కు అంగీకారం తెలిపాయి. అదేవిధంగా పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణా ళికను వారం రోజుల్లోగా సిద్ధం చేస్తామని తెలిపా యి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర జలశక్తి శాఖ తాజాగా ప్రకటించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదాల పరిష్కారానికి ఈ నెల 17న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాలు ఈ మేరకు అంగీకరించినట్టు సమావేశపు మినట్స్‌లో ఆ శాఖ పొందుపరిచింది. తెలంగాణ తరఫున రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ సి.మురళీధర్, ఏపీ తర ఫున ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణ రెడ్డితో పాటు కృష్ణా బోర్డు చైర్మన్ శివనందన్‌కుమార్, కేంద్ర జలసంఘం చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాగర్ వద్ద నో ఎంట్రీ నాగార్జునసాగర్ డ్యామ్ పరిసరాల్లో సీఆర్పీఎఫ్ బలగాలు పటిష్ట బందోబస్తును కొనసాగించను న్నాయి. కృష్ణా బోర్డు నుంచి ముందస్తు అనుమతి లేకుంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీర్లు / అధికారులను సైతం ఇకపై డ్యామ్ పరిసరాల్లోకి అనుమతించరు. ఈ విషయంపై సైతం రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. నాగార్జునసాగర్ డ్యామ్ రెండు రాష్ట్రాల భూభాగాల పరిధిలో చెరి సగం వస్తుండగా, ఏదైనా మరమ్మతు పనులు చేపట్టేందుకు సంబంధిత భూభాగం పరిధిలోని రాష్ట్రం ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కృష్ణా బోర్డు పర్యవేక్షణలోనే ఈ పనులు చేయాల్సి ఉంటుంది. కేఆర్ఎంబీకి చెల్లించాల్సిన బకాయిలను సైతం తక్షణమే చెల్లిస్తామని రెండు రాష్ట్రాలు సమ్మతి తెలిపాయి. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలులో పురోగతిని సమీక్షించేందుకు 15 రోజుల తర్వాత మళ్లీ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ, ఏపీ వాదనలు ఇవే.. ఇతర అంశాలపై చర్చించి పరిష్కరించుకోవ డానికి ముందు నాగార్జునసాగర్ వద్ద 2023 డిసెంబర్ 28కి ముందు నెలకొని ఉన్న పరిస్థితులను పునరుద్ధరించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈ సమావేశంలో కోరారు. కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణకు 50:50 నిష్పత్తిలో కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. విద్యుదుత్పత్తి ద్వారా నీళ్లను తెలంగాణ కిందికి విడుదల చేస్తుండడంతో శ్రీశైలం జలాశ యంలో నిల్వలు అడుగంటిపోతున్నాయని ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశి భూషణ్‌కుమార్ సమావేశం దృష్టికి తీసుకె ళ్లారు. సాగర్ కుడికాల్వ ద్వారా ఏపీకి నీటి విడుదల కోసం కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చినా తెలంగాణ అధికారుల దయాదా క్షిణ్యాలపై ఆధారపడి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో తీసు కున్న నిర్ణయాలకు కట్టుబడి సాగర్ నుంచి నీటివిడుదలను నిలుపుదల చేశామని తెలిపారు. -
ఆ గృహ కొనుగోలుదారులకు శుభవార్త! 3 నెలల్లో ఫ్లాట్లు
న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్‌కు చెందిన గృహ కొనుగోలుదారులకు శుభవార్త. 2 నుంచి 3 నెలల్లో 11,858 ఫ్లాట్లను డెలివరీ చేస్తామని కోర్టు రిసీవర్ సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి సుప్రీం ధర్మాసనానికి శుక్రవారం తెలియజేశారు. నిర్మించాల్సిన 38,000 ఫ్లాట్లలో 11,000 యూనిట్లకు పైగా ఫ్లాట్ కొనుగోలుదారులకు అప్పగిస్తున్నారని ఇది చాలా కీలక పరిణామమని తెలిపారు. వచ్చే నెలలో వచ్చే పండుగ సీజన్లో ఎన్బీసీసీ పూర్తి చేసిన 5,428 ఫ్లాట్లను గృహ కొనుగోలు దారులకు ఇవ్వనున్నట్లు, సుప్రీంకు సీనియర్ న్యాయవాది తెలిపారు. విద్యుత్ నీటి కనెక్షన్‌తో గృహ కొనుగోలుదారులకు ఇవ్వనున్నట్లు కోర్టు రిసీవర్ వెంకటరమణి ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనానికి నివేదించారు. ఈ పూర్తయిన ఫ్లాట్లన్నీ గృహ కొనుగోలుదారుల నుండి పూర్తి చెల్లింపు తర్వాత మాత్రమే అప్పగిస్తామనివెంకటరమణి స్పష్టం చేశారు. అలాగే ఫోరెన్సిక్ ఆడిటర్లు రూ. 3870.38 కోట్లను గృహ కొనుగోలుదారుల నుండి గ్రహించాల్సిన మొత్తంగా అందించారని, అయితే క్రాస్-చెకింగ్‌లో ఈ మొత్తం 3,014 కోట్లుగా గుర్తించామన్నారు. రూ. 3,014 కోట్లలో ఇప్పటి వరకు 22,701 మంది గృహ కొనుగోలుదారుల నుంచి రూ. 1,275 కోట్లు పొందామని, మిగిలిన మొత్తాన్ని 7939 మంది గృహ కొనుగోలుదారుల నుంచి స్వీకరించాల్సి ఉందని, ఈ విషయంలో షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. చెల్లింపు ప్లాన్ ప్రకారం అక్టోబర్ 2024 నాటికి పూర్తికావాల్సిఉందని వెంకటరమణి తెలిపారు. -
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
కొత్తపేట: ఆటోలో ప్రయాణించిన వ్యక్తి పొరపాటున వదిలేసిన నగదు కవరును తిరిగి తీసుకువెళ్లి అప్పగించడం ద్వారా ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే కొత్తపేట బోడిపాలెం ప్రాంతానికి చెందిన బండారు నాగేంద్రప్రసాద్ అనే చికెన్ షాపు యజమాని ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటివద్దే చికిత్స పొందుతున్నాడు. ఆయనను కొన్నిరోజులు తన ఇంటి వద్ద ఉంచుకునేందుకు ప్రసాద్ తమ్ముడు రామచంద్రరావు సోమవారం స్థానిక శ్రీకృష్ణదేవరాయనగర్‌లో తన ఇంటికి ఆటోలో పంపించారు. తనతో పాటు తీసుకువెళ్లిన రూ.80 వేల నగదు, బ్యాంక్ పాస్‌బుక్ కవర్ ఆటోలో మరచిపోయారు. తరువాత ఆటో ఓనర్ కమ్ డ్రైవర్ సిద్ధంశెట్టి శ్రీనివాస్‌కు ఆ నగదు కవర్ కనిపించగా దానిలో రూ.80 వేలు నగదు ఉంది. వెంటనే బోడిపాలెంలో చికెన్ షాపు వద్దకు వెళ్లి రామచంద్రరావుకు అప్పగించాడు. దానిపై రామచంద్రరావుతో పాటు స్థానికులు శ్రీనివాస్ నిజాయతీని అభినందించారు. -
మూడోరోజూ ఐటీ దాడులు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ, ఆమె బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై మూడో రోజూ ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ దాడులు కొనసాగాయి. రూ.1,500 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన దస్తావేజుల్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. శశికళ బంధువులు, ఆమె సన్నిహితులే లక్ష్యంగా హైదరాబాద్, బెంగళూరు సహా తమిళనాడులోని 40 చోట్ల ఐటీశాఖ తనిఖీలు నిర్వహించింది. సోదాల్లో రూ.1,200 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు, రూ.6 కోట్ల నగదు, 15 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నోట్ల రద్దు సమయంలో నీలగిరి జిల్లాలోని కొడనాడు, గ్రీన్ టీ ఎస్టేట్స్‌లో పనిచేస్తున్న దాదాపు 800 కార్మికుల ఖాతాల్లో రూ.2 లక్షలు చొప్పున మొత్తం రూ.16 కోట్లు జమచేసిన విషయాన్ని ఐటీ శాఖ గుర్తించింది. రాజకీయ నాయకులంటే గోచీతో ప్లాట్‌ఫాం మీద బతకాలా? అని ఐటీ దాడుల నేపథ్యంలో దినకరన్ ప్రశ్నించారు. తానేం గాంధీ మనవడిని కాదని, సాధారణ వ్యక్తినన్నారు. ఐటీ శాఖ దాడుల కోసం బుక్‌చేసుకున్న 350 వాహనాలు ఎవరివో ఓసారి దృష్టి సారించాలన్నారు. శేఖర్‌రెడ్టి డైరీ ఆధారంగా దాడులు జరిగిఉంటే భారీగా నల్లధనం బయటపడి ఉండేదన్నారు. -
నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలి
–టీ యూవీ కన్వీనర్ చెరుకు సుధాకర్ తిరుమలగిరి : నయీమ్ డైరీలో ఉన్న నేతల పేర్లు బయట పెట్టాలని.. లేదంటే ఆ కేసును సీబీఐకి అప్పగించాలని తెలంగాణ ఉద్యమ వేదిక (టీయూవీ) రాష్ట్ర కన్వీనర్ చెరుకు సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తిరుమలగిరిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నÄæూమ్ కేసు విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా డైరీలో ఉన్న ప్రజా ప్రతినిధులను, పోలీసులను కఠినంగా శిక్షించాలన్నారు. లేనిచో సుప్రీంకోర్టు జడ్జిచే విచారణ చేపట్టాలని కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా జిల్లాల, మండలాల పునర్విభజన ఉండాలని కోరారు. రాష్ట్రంలో విష జ్వరాలతో వేలాది మంది చనిపోతున్నారని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక వైద్యం సరిగా అందడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని ఆరోపించారు. మిషన్ కాకతీయ, భగీరథ, ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లలో కోట్లాది రూపాయల అవినీతి జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏపూరి సోమన్న, గఫార్‌ఖాన్, ఎర్ర ప్రశాంత్, రమేష్, రాము గౌడ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
స్వాధీనం చేసుకుంటారా? సర్దుకుపోతారా?
సాక్షి ప్రతినిధి– నెల్లూరు: నెల్లూరు పట్టణంలోని ట్రంకు రోడ్డులో రూ.100 కోట్లకు పైగా విలువయ్యే రంగనాథస్వామికి చెందిన వాణిజ్య భవన సముదాయాలను దేవాదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటారా? లేక అధికార పార్టీ ముఖ్య నాయకులకు సరెండర్ అవుతారా? ప్రజలు, రాజకీయ వర్గా ల్లో ఈ చర్చ ప్రారంభమైంది. దేవాలయాల భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు ఏవీ చెల్లవని సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసైనా ఈ భూ మిని రక్షించుకునే దిశగా అడుగులు వేస్తారా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహా రంపై శనివారం సాక్షిలో ప్రచురితమైన ‘‘ రంగడి భూమి గోవిందా’’ కథనంపై దేవాదాయశాఖ కమిషనర్ స్థానిక అధికారులను నివేదిక కోరారు. నెల్లూరుకు చెందిన ఐతా చెంచు రామయ్య ముత్యాల శెట్టి 1894 సెప్టెంబరు 28వ తేదీ తనకు చెందిన 1.08 ఎకరాల భూమి శ్రీ రంగనాథస్వామి రథోత్సవ నిర్వహణ, ప్రసాదాల పంపిణీ కోసం దేవస్థానానికి దానం చేసిన విషయం తెలిసిందే. 1917వ సంవత్సరం సెప్టెంబరు 25వ తేదీ అప్పటి ధర్మకర్తల మండలి ఈ భూమిని ఎ. వెంకయ్యకు 99 సంవత్సరాల లీజుకు ఇచ్చారు. వెంకయ్య తన లీజును నెల్లూరుకే చెందిన ఎన్.చలపతిరావుకు బదిలీ చేశారు. ఆ తర్వాత ఈ భూమి చాలా మంది చేతులు మారి ప్రస్తుతం వ్యాపార సముదాయాల్లో 42 మంది అనధికారిక లీజుదారులు ఉన్నారు. భూ మి దేవస్థానానిదేననీ దీన్ని దేవాదాయశాఖ స్వాధీ నం చేసుకోవచ్చని హై కోర్టు 30–7–1997లో తీర్పు చెప్పింది. అప్పటి టీడీపీ ముఖ్య నేతలు దేవాదాయశాఖ అధికారులపై ఒత్తిడి తేవడంతో వారు హై కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా నిలిపేశారు. దీంతో ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టే సమయం రావడానికి మరో 19 ఏళ్లు పట్టింది. టీడీపీ ముఖ్య నేతల ఒత్తిళ్లు తీవ్రంగా ఉండటంతో ఇప్పుడు కూడా ఈ భవనాలను స్వాధీనం చేసుకునేందు కు తటపటాయిస్తున్నారు. వెంకయ్యకు ఇచ్చిన 99 సంవత్సరాల లీజు ఈ ఏడాది సెప్టెంబరు 25వ తేదీతో ముగియనుంది. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయొచ్చు దేవాలయాలకు చెందిన భూములు ఎవరు అమ్మినా, కొన్నా, ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగినా చెల్లుబాటు కాదనీ, ఆ భూములు ఆలయాలకే చెందుతాయని తిరుమల–తిరుపతి దేవస్థానంకు తిరుపతిలోని మహవీర్ థియేటర్ యాజమాన్యానికి జరిగిన వాజ్యంలో సుప్రీం కోర్టు స్పష్టంగా తీర్పు నిచ్చింది. ఈ తీర్పు ఆధారంగానే తిరుపతి తిలక్ రోడ్డులోని మహవీర్ థియేటర్ స్థలాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుని నిర్మాణాలను కూల్చివేసింది. ప్రస్తుతం ఈ భూమిలోనే శ్రీదేవి కాంప్లెక్స్ నిర్మిం చింది. ఈ తీర్పు ఆధారంగానైనా రంగనాథ స్వామి ఆలయ అధికారులు ట్రంకు రోడ్డులోని ఆలయ భూమిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. -
ఐవీఆర్సీఎల్... బ్యాంకుల చేతికే
ఎస్డీఆర్ అమలును ప్రకటించిన జేఎల్ఎఫ్ రిఫరెన్స్ డే నవంబర్ 26 త్వరలో కార్యాచరణ ప్రణాళిక హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగ కంపెనీ ఐవీఆర్సీఎల్... ప్రస్తుత యాజమాన్యం చేతుల్లోంచి జారిపోతోంది. భారీగా అప్పుల్లో కూరుకుపోయిన ఈ సంస్థలో యాజమాన్య హక్కుల్ని తీసుకోవాలని రుణాలిచ్చిన బ్యాంకులు నిర్ణయించటంతో ఇప్పటిదాకా ఉన్న సందిగ్ధత తొలగిపోయింది. ఐవీఆర్‌సీఎల్‌లో వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణను (ఎస్డీఆర్) అమలు చేస్తున్నట్లు జాయింట్ లెండర్స్ ఫోరమ్ (జేఎల్ఎఫ్) ప్రకటించింది. ఈ మేరకు నవంబర్ 26న జరిగిన సమావేశంలో జేఎల్ఎఫ్ నిర్ణయం తీసుకుందని... ఐవీఆర్సీఎల్ మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. ఎస్డీఆర్ అమలుకు నవంబర్ 26వ తేదీనే రిఫరెన్స్ తేదీగా కూడా నిర్ణయించారు. రుణాల ఊబిలో కూరుకుపోయిన కంపెనీలు కోలుకోవడానికి అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ నిర్వహణలో విఫలమైతే ఎస్డీఆర్ పథకం కింద ఆ కంపెనీలో యాజమాన్య (మెజారిటీ) హక్కులను పొందడానికి రుణాలిచ్చిన సంస్థలకు అవకాశం ఉంటుంది. ఈ మేరకు గతంలోనే ఆర్బీఐ అనుమతులిచ్చింది. ఎసీడీఆర్ పథకం పూర్తి స్థాయిలో అమలు చేయడానికి బ్యాంకులకు 18 నెలల కాలపరిమితి కూడా ఉంటుంది. ఇందులో భాగంగా తొలుత రుణాలిచ్చిన సంస్థలు ఒక జేఎల్ఎఫ్గా ఏర్పడి కంపెనీలో మెజారిటీ వాటా 51 శాతం, అంత కంటే ఎక్కువ వాటాను తీసుకోవచ్చు. లేదా ఇచ్చిన అప్పును పూర్తి ఈక్విటీగా మార్చుకోవచ్చు. ఇలా అప్పును ఈక్విటీగా మార్చుకోవాలంటే మొత్తం రుణ విలువలో 75 శాతం రుణం ఇచ్చిన సంస్థలు... లేదా అప్పులిచ్చిన సంస్థల్లో 60 శాతం ఆమోదించాల్సి ఉంటుంది. నేడో రేపో కార్యాచరణ ప్రణాళిక... ఐవీఆర్సీఎల్ విషయానికి వస్తే బ్యాంకులు మెజారిటీ వాటాను తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ముంబైలో ఎస్బీఐ నేతృత్వంలో జరిగే సీనియర్ లెండర్స్ సమావేశంలో ‘కరెక్టివ్ యాక్షన్ ప్లాన్’ తయారు చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం బ్యాంకుల వద్ద 48% వాటా ఉండటంతో 51% వాటాను తీసుకోవడం ద్వారా కంపెనీ నిర్వహణ బాధ్యతలను చేపట్టాలన్నది బ్యాంకర్ల నిర్ణయంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఐవీఆర్సీఎల్ బోర్డులో బ్యాంకుల నుంచి ఇద్దరు ప్రతినిధులున్నారు. కంపెనీ గాడిలో పడిన తర్వాత కొత్త వారికి వాటాలను విక్రయించడమా? లేక ఈ రంగంలోని నిపుణులతో బ్యాంకులే కంపెనీని నిర్వహించడమా? అన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఎస్డీఆర్ అమల్లోకి వస్తే ప్రస్తుతం కంపెనీలో 8.28% వాటా కలిగి ఉన్న ప్రస్తుత ప్రమోటర్లకు కంపెనీ రోజువారీ కార్యకలాపాల్లో ఎలాంటి సంబంధాలు ఉండవు. కేవలం ఇన్వెస్టర్లుగానే కొనసాగుతారు. మా దృష్టికి రాలేదు కాగా కంపెనీని కాపాడుకోవటానికి దీన్ని రెండుగా విడదీయాలని ప్రమోటర్లు ప్రతిపాదిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ఒకటిరెండు బ్యాంకుల ఉన్నతాధికారులను ‘సాక్షి’ సంప్రదించింది. అయితే ఈ ప్రతిపాదన జేఎల్ఎఫ్ వద్దకు రాలేదని, ఈ వార్తలు కేవలం పేపర్లలోనే చూశామని వారు చెప్పారు. ‘‘అధికారికంగా మాకు ఇలాంటి ప్రతిపాదనలేమీ రాలేదు. ఒకవేళ ఈ ప్రతిపాదనతో కంపెనీకి మేలు జరుగుతుందంటే జేఎల్ఎఫ్ ఈ అంశాన్ని తప్పక పరిశీలిస్తుంది’’ అని ఓ బ్యాంకు ఉన్నతాధికారి తెలియజేశారు. అప్పులు అధికంగా ఉన్న అసెట్ హోల్డింగ్‌ను విడదీయడం ద్వారా ప్రధాన ఆదాయ వనరైన ఈపీసీ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగించడం ద్వారా అప్పులు తగ్గించుకోవాలన్నది ప్రస్తుత ప్రమోటర్ల ఆలోచన. ఈ ప్రతిపాదనను బ్యాంకర్లు ఆమోదిస్తారా లేదా అన్నది వచ్చే రెండు రోజుల్లో తెలుస్తుంది. తాజా వార్తలతో ఒక దశలో 12% పెరిగిన ఐవీఆర్సీఎల్ షేరు లాభాల స్వీకరణతో చివరకు 2.3% పెరిగి రూ. 10.95 వద్ద ముగిసింది. గత 2 రోజుల్లో ఐవీఆర్సీఎల్ 33% పెరగ్గా, నెలన్నరలో సుమారు 100% పెరిగింది.