కొత్తపేటలో రామచంద్రరావుకు నగదు అప్పగిస్తున్న శ్రీనివాస్
కొత్తపేట: ఆటోలో ప్రయాణించిన వ్యక్తి పొరపాటున వదిలేసిన నగదు కవరును తిరిగి తీసుకువెళ్లి అప్పగించడం ద్వారా ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే కొత్తపేట బోడిపాలెం ప్రాంతానికి చెందిన బండారు నాగేంద్రప్రసాద్ అనే చికెన్ షాపు యజమాని ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటివద్దే చికిత్స పొందుతున్నాడు. ఆయనను కొన్నిరోజులు తన ఇంటి వద్ద ఉంచుకునేందుకు ప్రసాద్ తమ్ముడు రామచంద్రరావు సోమవారం స్థానిక శ్రీకృష్ణదేవరాయనగర్‌లో తన ఇంటికి ఆటోలో పంపించారు.
తనతో పాటు తీసుకువెళ్లిన రూ.80 వేల నగదు, బ్యాంక్ పాస్‌బుక్ కవర్ ఆటోలో మరచిపోయారు. తరువాత ఆటో ఓనర్ కమ్ డ్రైవర్ సిద్ధంశెట్టి శ్రీనివాస్‌కు ఆ నగదు కవర్ కనిపించగా దానిలో రూ.80 వేలు నగదు ఉంది. వెంటనే బోడిపాలెంలో చికెన్ షాపు వద్దకు వెళ్లి రామచంద్రరావుకు అప్పగించాడు. దానిపై రామచంద్రరావుతో పాటు స్థానికులు శ్రీనివాస్ నిజాయతీని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment