Shashikala
-
వీధికెక్కిన సినీ జంట
యశవంతపుర: తన భార్య వేధిస్తోందంటూ కన్నడ నటి శశికళపై భర్త, సినీ దర్శకుడు టీజీ హర్షవర్ధన్ బెంగళూరు విద్యారణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. 2021లో ఓ సినిమా షూటింగ్లో శశికళ, హర్షవర్దన్‌కు పరిచయమైంది. తరువాత ఇద్దరూ ప్రేమలో పడి సహజీవనం ప్రారంభించారు. కొన్నిరోజుల తరువాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసి, తమ ఫోన్ సంభాషణలను రికార్డ్ చేసి బెదిరించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పెళ్లికి ఒప్పుకోవడం లేదని నాగరభావిలోని ఆఫీసుకు వచ్చి కారంపొడి చల్లి దాడి చేసింది. 2022లో ఆమె ఫిర్యాదు చేయగా అన్నపూర్ణేశ్వరినగర పోలీసులు తనను అరెస్టు చేశారన్నారు. సినిమా రంగంలో లేకుండా చేస్తానని బెదిరించిందన్నారు. చివరకు 2022 మార్చిలో శశికళను వివాహం చేసుకున్నాను. కొద్ది రోజులకు కొందరు నిర్మాతలు, డైరెక్టర్లు మా ఇంటికి వచ్చేవారు. అదేమని ప్రశ్నించినందుకు నన్ను బయటకు పంపి, రెండు గంటల తరువాత మళ్లీ ఇంటిలోకి రానిచ్చేది. ఇలా అనేక రకాలుగా వేధింపులకు గురిచేస్తోందని, ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని ఫిర్యాదులో తెలిపాడు. పోలీసులు శశికళతో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. -
కిచెన్ క్వీన్ శశికళ.. ఈమె వంటలకు విదేశీయులు కూడా ఫిదా
ఉదయ్‌పూర్ కిచెన్ క్వీన్ శశికళ మనదేశంలో కంటే విదేశాల్లో బాగా ఫేమస్. ఆమె గరిట తిప్పిందంటే ఎవరైనా ఆహా అనాల్సిందే. ఆమె వంట చేస్తే నలభీములు సైతం వంక పెట్టలేరు. పాకశాస్త్రంలో అద్భుతమైన ప్రావీణ్యం ఆమె సొంతం. అందుకే ఆమె దగ్గర వంటలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి వస్తుంటారు. ఒకప్పుడు భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న శశికళ ఇప్పుడు ఎంతోమంది విదేశీయులకు వంటలు నేర్పిస్తూ, వ్యాపారవేత్తగానూ ఆదర్శంగా నిలుస్తుంది. రాజస్థాన్‌కు చెందిన శశికళ జీవితం ఒకప్పుడు సాధాసీదాగానే ఉండేది. క్యాన్సర్ కారణంగా భర్తను కోల్పోయి చిన్నాచితక పనిచేసుకుంటూ ఒంటరిగా కాలం వెళ్లదీసేది. కానీ అనుకోకుండా ఆమె దశ తిరిగింది. ఒకప్పుడు ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా రాని అతి సామాన్యురాలైన శశికళ ఇప్పుడు అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడేస్తుంది. ఆమె దగ్గర వంటలు నేర్చుకోవడానికి 30 దేశాలకు చెందిన వాళ్లు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటున్నారంటే ఆమె వండే వంటలు ఎంత స్పెషలో ఈపాటికే అర్థమైపోయింటుంది. ఓసారి ఐరీష్ నుంచి వచ్చి దంపతులకు శశికళ మన భారతీయ వంటలు వండి వడ్డించింది. ఆ రుచికి ఫిదా అయిన ఆ దంపతులు వెంటనే శశికళతో కుకింగ్ క్లాసెస్ ప్రారంభించమని ప్రోత్సహించారు. అలా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతుంది. మొదట్లో ఇంగ్లీష్ రాక చాలా ఇబ్బంది పడేది శశికళ. కానీ ఇప్పుడు అనర్గళంగా మాట్లాడుతూ అదరగొడుతుంది. శశికళ వద్ద కుకింగ్ పాఠాలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి స్వయంగా ఉదయ్‌పూర్ వస్తుంటారు. -
చిన్నమ్మతో ‘రాములమ్మ’ భేటీ
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళతో తెలంగాణ బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి భేటీ అయ్యారు. ఈ రహస్య భేటీ వివరాలు.. శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ శశికళ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టి తీరుతానన్న ధీమాను శశికళ వ్యక్తం చేశారు. అలాగే, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కనీ్వనర్ పన్నీరు సెల్వం, కో– కన్వీనర్ పళనిస్వామి మధ్య సాగుతున్న అంతర్గాత విబేధాలను తనకు అనుకూలంగా మలచుకునే పనిలో పడ్డారు. ఇందుకు తగ్గట్టుగా ఆ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయానికి అవకాశమే లేదంటూ కూడా శశికళ వ్యాఖ్యానించారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలకు దగ్గరయ్యే దిశగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో చిన్నమ్మతో చెన్నైలో బీజేపీ నేత విజయశాంతి భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసింది. రహస్యంగా ఈ భేటీ జరిగినట్టు చిన్నమ్మ శిబిరం వర్గాల ద్వారా శనివారం వెలుగులోకి వచ్చింది. గతంలో ఓ మారు చిన్నమ్మతో విజయశాంతి భేటీ బహిరంగానే చెన్నైలో జరిగింది. అయితే, తాజా భేటీ రహస్యంగా జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: గుజరాత్ ఫైల్స్ బ్లాక్ చేసి నన్ను ద్వేషించారు: ప్రధాని మోదీ -
అమ్మకు ఘన నివాళి.. మెరీనా తీరంలో ఉద్రిక్తత
సాక్షి, చెన్నై(తమిళనాడు): దివంగత ముఖ్యమంత్రి అమ్మ జయలలిత ఐదో వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. వాడవాడల్లో అన్నాడీఎంకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మ సమాధి సాక్షిగా కుట్రలను భగ్నం చేస్తామని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ పెద్దలు పన్నీరు సెల్వం, పళని స్వామి ప్రతిజ్ఞ చేశారు. గెలుపే లక్ష్యంగా అందరం ఏకం అవుదామని చిన్నమ్మ శశికళ పిలుపునిచ్చారు. ఇరు వర్గాలు అమ్మ సమాధి సాక్షిగా బల ప్రదర్శనకు దిగడంతో మెరీనా తీరంలో ఉద్రిక్తత నెలకొంది. పోటాపోటీ.. అన్నాడీఎంకే నేతలు వాడవాడల్లో జయలలిత విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తామేమి తక్కువ తిన్నామా..? అన్నట్టుగా అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించాయి. సమాధి వద్ద నివాళులు మెరీనా తీరంలోని అమ్మ సమాధి వద్దకు నేతలు క్యూకట్టారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో కన్వీనర్ పళనిస్వామి, ప్రిసీడియం(తాత్కాలిక) చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతినిధులు పెద్దఎత్తున తరలివచ్చారు. నల్ల చొక్కాలు ధరించిన నేతలు అమ్మ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అమ్మ సేవలను గుర్తు చేస్తూ ఆమె ఆశయ సాధన లక్ష్యంగా అందరి చేత పన్నీరు సెల్వం ప్రతిజ్ఞ చేయించారు. అన్నాడీఎంకేను కైవశం చేసుకునేందుకు పగటి కలలు కంటున్న వారి కుట్రలను భగ్నం చేస్తామని అమ్మ సమాధి సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. అమ్మకు నివాళులర్పించినానంతరం ఎంజీఆర్ సమా«ధి వద్దకు నేతలు వెళ్లడం సహజం. అయితే ఈసారి ఎంజీఆర్‌ను మరిచారు. అటు వైపుగా వెళ్లకుండానే నేతలు వెళ్లిపోవడం గమనార్హం బల ప్రదర్శనకు వేదికగా.. మెరీనా తీరంలోని అమ్మ సమాధి సాక్షిగా వర్ధంతి కార్యక్రమాన్ని అన్నాడీఎంకే, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు బల ప్రదర్శనకు వేదికగా చేసుకున్నాయి. దీంతో మెరీనా తీరంలో ఉద్రిక్తత నెలకొంది. పన్నీరు, పళని నివాళులర్పించి వెళ్తున్న సమయంలో ఏఎంఎంకే నేతలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీశాయి. పళని స్వామి వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు చెప్పులు, రాళ్లు విసరడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. దినకరన్ మద్దతుతో కొందరు దాడులకు ప్రయత్నించారని అన్నాడీఎంకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దినకరన్ ఓపెన్ టాప్ వాహనంలో ప్రచారానికి వెళ్తున్నట్టుగా మద్దతుదారులతో తరలిరావడం గమనార్హం. కన్నీటితో చిన్నమ్మ ప్రతిజ్ఞ జయలలిత నెచ్చెలి శశికళ సమాధి వద్దకు చేరుకుని అంజలి ఘటించారు. ఆమె వెన్నంటి మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థులను ఓడించడం కోసం అందరం ఏకం అవుదామని అమ్మ సమాధి వద్ద ప్రతిజ్ఞ చేస్తూ అన్నాడీఎంకే వర్గాలకు పరోక్షంగా చిన్నమ్మ పిలుపునిచ్చారు. ఈ సమయంలో ఆమె ఉద్వేగానికి గురై కన్నీటి నివాళులర్పించారు. అనంతరం అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం నేత దినకరన్ సమాధి వద్దకు చేరుకుని అంజలి ఘటించారు. -
చిన్నమ్మ మద్దతు మాకే!
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ మానసిక ఆదరణ, మద్దతు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకే అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దినకరన్ ధీమా వ్యక్తం చేశారు. దుష్టశక్తి డీఎంకేను, ద్రోహశక్తి అన్నాడీఎంకే పాలకుల్ని అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకుంటామన్నారు. దినకరన్ అమ్మమక్కల్ మున్నేట్ర కళగం, విజయకాంత్ డీఎండీకేతో పాటు ఎస్‌డీపీఐలు కూటమిగా ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కూటమి ఒప్పందాలు జరిగిన రోజున దినకరన్ చెన్నైలో లేరు. కోవిల్పట్టిలో నామినేషన్ దాఖలు చేసి చెన్నైకు వచ్చిన ఆయన మంగళవారం ఎన్నికల ప్రచారం శ్రీకారం చుట్టారు. ఈ పరిస్థితుల్లో బుధవారం కోయంబేడులోని డీఎండీకే కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆ పార్టీ నేత విజయకాంత్‌తో భేటీ అయ్యారు. అనంతరం దినకరన్ మీడియాతో మాట్లాడుతూ తమది విజయకూటమి అని ప్రకటించారు. దుష్టశక్తుల్ని రానివ్వం.. ఈ ఎన్నికల్లో డీఎండీకే 60, ఎస్డీపీఐ ఆరుచోట్ల పోటీ చేస్తున్నాయని దినకరన్ తెలిపారు. డీఎండీకే కూటమిలోకి రాగానే, ముందుగా తాను ప్రకటించిన 42 మంది పార్టీ అభ్యర్థులు స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారని వివరించారు. ఆ మేరకు ఆర్మీ కట్టుబాట్లతో తమ కేడర్ ఉన్నారని పేర్కొన్నారు. విజయకాంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశానని పేర్కొంటూ, తమ ఇద్దరి సిద్ధాంతం లక్ష్యం ఒక్కటే అన్నారు. డీఎంకే, అన్నాడీఎంకే అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవడమేనని స్పష్టం చేశారు. చదవండి: ఎన్నికలకు దూరంగా రజనీకాంత్ స్నేహితుడు కమల్ సీఎం కావడం ఖాయం.. -
సీఎం పీఠంపై వివాదం: చిన్నమ్మతో సవాల్
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికలు ఒక వైపు, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ విడుదల మరో వైపు సవాళ్లు విసురుతున్న వేళ సర్వసభ్య సమావేశంతో అన్నాడీఎంకే అగ్రజులంతా శనివారం ఒకే వేదికపై రానున్నారు. ఎన్నికల్లో తలపడనున్న కూటమి పార్టీల వైఖరిపై కసరత్తు చేయనున్నారు. అధికారపార్టీ హోదాలో ఈసారికి ఇదే తుది సమావేశం కావడం గమనార్హం. తమిళనాడులోని అన్ని రాజకీయపార్టీలు ఏడాదికి ఒకసారి సర్వసభ్య సమావేశం, రెండుసార్లు కార్యనిర్వాహకుల సమావేశాన్ని నిర్వహించాలి. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలి. ఈ ప్రకారం అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం గత ఏడాది డిసెంబర్లో జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యనిర్వాహక సమావేశాన్ని మాత్రమే నిర్వహించారు. ఈ సమయంలో 11 మంది సభ్యులతో మార్గదర్శకాల కమిటీని ఏర్పాటు చేసుకుని పార్టీ పరమైన నిర్ణయాలపై వారికి కొన్ని అధికారాలు ఇచ్చారు. అయితే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సర్వసభ్యం ఆమోదించాల్సి ఉంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టి లాక్డౌన్లో అనేక సడలింపులు చోటుచేసుకోవడంతో సర్వసభ్య సమా వేశానికి అన్నాడీఎంకే సిద్ధమైంది. చెన్నై శివారు వానగరం శ్రీనివాస కల్యాణమండపంలో శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి పార్టీ కన్వీనర్, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, కో–కన్వీనర్, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, 302 మంది కార్యనిర్వాహకసభ్యులు సహా 3,500 మంది హాజరుకానున్నారు. శశికళ వస్తే ఎలా? అన్నాడీఎంకే బహిష్కృతనేత దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చిలి శశికళ ఈనెల 27వ తేదీన జైలు నుంచి విడుదల కానున్నారు. అన్నాడీఎంకే శ్రేణులకు అసెంబ్లీ ఎన్నికలతోపాటు శశికళను ఎదుర్కోవడం కూడా సవాలుగా మారే పరిస్థితులున్నాయి. జయలలిత మరణం సమయంలో ముఖ్యమంత్రిగా ఉండిన పన్నీర్‌సెల్వం చేత శశికళ బలవంతంగా రాజీనామా చేయించారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికై గవర్నర్ ఆమోదానికి పంపిన దశలో ఆమె జైలుపాలయ్యారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం శశికళకు తృటిలో తప్పిపోగా ప్రత్యామ్నాయంగా ఎడపాడిని ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో శశికళను ఎడపాడే స్వయంగా పార్టీ నుంచి బహిష్కరించాల్సి వచ్చింది. నాలుగేళ్ల జైలుశిక్ష ముగించుకుని ఈనెల 27న శశికళ జైలు నుంచి విడుదలవుతున్నారు. జయ హయాంలోనే పార్టీలో చక్రం తిప్పిన శశికళకు పాద నమస్కారాలు చేసే స్థాయిలో అన్నాడీఎంకేలో అనుంగు శిష్యులున్నారు. రేపు జైలు నుంచి విడుదలైతే పార్టీలో ఎలాంటి ప్రకంపనలు ఎదురవుతాయోనని అగ్రనేతలు చెవులు కొరుక్కుంటున్నారు. శశికళ విడుదల, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న దశలో పార్టీ సర్వసభ్య సమావేశం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్నాడీఎంకే కూటమిలోని మిత్రపక్షపార్టీల గురించి చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా కూటమి నుంచి ఎడపాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై బీజేపీ అభ్యంతరం లేవనెత్తడం, 60 సీట్లకు పట్టుబడడంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈనెల 27న శశికళ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉండడంతో పార్టీలో ఆ ప్రభావంపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. -
నోట్ల రద్దు వేళ శశికళ ఆస్తులు పైపైకి
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ పెద్ద నోట్ల రద్దు సమయంలో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆదాయపన్ను శాఖ (ఐటీ) విచారణలో తేలింది. ఆ సమయంలో ఆమె మాల్స్, భవనాలను కొనుగోలు చేసినట్టు గుర్తించారు. పెరోల్‌పై బయటకు వచ్చిన సమయంలో కొన్ని ఆస్తులు చేతులు మారినట్లు కనుగొన్నారు. మద్రాసు హైకోర్టులో శశికళ ఆదాయ వ్యవహారాలకు సంబంధించిన ఓ పిటిషన్‌పై స్టే విధించాలని శశికళ రిట్ దాఖలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఐటీ శాఖను కోర్టు ఆదేశించింది. శనివారం న్యాయమూర్తి అనితా సుధాకర్ ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. శశికళ ఆదాయ, ఆస్తుల వ్యవహారం ముగిసిన అధ్యాయమని, ఇప్పుడు దానిపై విచారణ అవసరం లేదని శశికళ తరఫు లాయర్ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో శశికళ చెన్నై పెరంబూరు, మదురై, కేకే నగర్లలో షాపింగ్ మాల్స్ పుదుచ్చేరిలో ఒక రిసార్ట్, కోయంబత్తూరులో పేపర్ మిల్, చెన్నై ఒరగడంలో చక్కెర మిల్లు, పాత మహాబలిపురం రోడ్డులో సాఫ్ట్వేర్ కంపెనీ, కోయంబత్తూరులో 50 పవన విద్యుత్ ప్లాంట్లు కొనుగోలు చేసినట్టు ఐటీ తరఫు న్యాయవాది ఆధారాలను కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ ఆస్తులన్నీ నగదు ద్వారానే జరిగినట్టు చెప్పారు. దీనిని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి త్వరితగతిన అన్ని ప్రక్రియలు ముగించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను వాయిదా వేశారు. -
చిన్నమ్మ మరోసారి చక్రం తిప్పేనా?
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో తాజాగా కొత్త చర్చ మొదలైంది. సీనియర్లుగా ఉన్న కొందరు మాజీ ఎంపీలు చిన్నమ్మ శశికళ అండ్ ఫ్యామిలీ కోసం రాయబారంమొదలెట్టినట్టుగా సమాచారాలు వెలువడుతున్నాయి. త్వరలో జైలు నుంచి బయటకు రానున్న శశికళను మళ్లీ అన్నాడీఎంకేలోకి చేర్చుకుందామన్నట్టుగా ఈ మాజీలు రాయబారం మొదలెట్టినట్టుగా చర్చ జోరందుకుంది. జయలలిత నెచ్చెలి శశికళ ఒకప్పడు అన్నాడీఎంకేలో చక్రం తిప్పిన విషయం తెలిసిందే. అమ్మ మరణంతో అన్నాడీఎంకే పగ్గాలు చేజిక్కించుకుని సీఎం కుర్చీలో కూర్చునే ప్రయత్నం బెడిసికొట్టింది. అక్రమాస్తుల కేసులో కటకటాలపాలు కాక తప్పలేదు. పరప్పన అగ్రహార చెరకు చిన్నమ్మ వెళ్లినానంతరం అన్నాడీఎంకేలో పరిస్థితులు మారాయి. తాను ఏరి కోరి ఎంపిక చేసిన సీఎం పళనిస్వామి సైతం చిన్నమ్మకు వ్యతిరేకంగా వ్యవహరించక తప్పలేదు. చిన్నమ్మ కుటుంబాన్ని అన్నాడీఎంకే నుంచి సాగనంపి, పార్టీని చీల్చే ప్రయత్నంలో ఉన్న పన్నీరును అక్కున చేర్చుకున్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకే సమన్వయ కమిటీకి అధ్యక్షుడుగా పన్నీరుసెల్వం, ఉపాధ్యక్షుడుగా పళనిస్వామి ముందుకు సాగుతున్నారు. అలాగే, పాలనాపరంగా ప్రభుత్వంలో సీఎంగా పళని, డిప్యూటీగా పన్నీరు వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పరప్పన అగ్రహార జైల్లో ఉన్న చిన్న శశికళ సత్ప్రవర్తన కారణంగా ఈ ఏడాది చివరిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారాలు వెలువడుతున్నాయి. ఇందుకు తగ్గ ప్రయత్నాలు కూడా సాగుతున్నాయని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ బయటకు రాగానే ఆమెను మళ్లీ అన్నాడీఎంకేలోకి ఆహ్వానించే విధంగా మాజీ ఎంపీలు కొందరు రాయబారం మొదలెట్టి ఉండడం వెలుగులోకి వచ్చింది. రాయబారం: చిన్నమ్మ శశికళకు అత్యంత సన్నిహితులుగా ఉన్న అనేక మంది నేతలు అన్నాడీఎంకేలో ఉన్నారనే చెప్పవచ్చు. అయితే, పరిస్థితుల ప్రభావం కారణంగా వీరంతా మౌనంగా ఉన్నారు. చిన్నమ్మ జైలు నుంచి రాబోతుండడం దాదాపు ఖరారవుతుండడంతో ఈ నేతలు తమ గలాన్ని విప్పేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కొందరు మాజీ ఎంపీలు చిన్నమ్మ తరఫున రాయబారాన్ని అన్నాడీఎంకే సమన్వయ కమిటీతో సాగించే పనిలో ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. తంబిదురై వంటి నేతలు కూడా చిన్నమ్మకు అనుకూలంగానే ఉన్నట్టు సమాచారం. ఈ మాజీలు తొలుత పళనిస్వామి శిబిరంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపి ఉన్నట్టుగా అన్నాడీఎంకేలో చర్చ జోరందుకుంది. పళని శిబిరం చిన్నమ్మకు అనుకూలంగా ఉన్నా, పన్నీరు ఎలా వ్యవహరిస్తారో అన్నది అంతుచిక్కని దృష్ట్యా ఆయన్ని కూడా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు ఆ మాజీలు మొదలెట్టి ఉన్నారు. తంబిదురై రెండు రోజుల క్రితం పన్నీరు సెల్వంను కలిసినట్టు చర్చ ఊపందుకుని ఉంది. దినకరన్‌ను మినహాయించి తక్కిన చిన్నమ్మ కుటుంబీకులను అన్నాడీఎంకేలోకి తీసుకురావడం ద్వారా పార్టీకే లాభం చేకూరుతుందన్న విషయాన్ని ఆ మాజీలు పన్నీరు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుతం అన్నాడీఎంకే సమన్వయ కమిటీ, ప్రభుత్వం ఎలా పయణం సాగిస్తున్నదో దాన్ని అలాగే కొనసాగించేందుకు చిన్నమ్మ ఫ్యామిలీ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. పార్టీ, పాలన వ్యవహారాల్లో ఎలాంటి జోక్యం అన్నది ఇప్పట్లో చిన్నమ్మ చేసుకోబోరని అయితే, ఆమె సేవలు తప్పనిసరి అయిన పక్షంలో రంగంలోకి దింపే విధంగా ముందుకుసాగుదామని ఆ మాజీలు రాయబారాన్ని, సంప్రదింపులను వేగవంతం చేసి ఉండడం అన్నాడీఎంకేలో చర్చకే కాదు గందరగోళానికి సైతం దారి తీసింది. -
బీజేపీలోకి శశికళ నమ్మిన బంటు?!
సాక్షి, చెన్నై: బీజేపీలోకి చేరడానికి చిన్నమ్మ శశికళ నమ్మినబంటు పుహళేంది సిద్ధం అవుతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అయితే, చిన్నమ్మతో సంప్రదింపుల తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్, ఆ పార్టీ అధికార ప్రతినిధి పుహళేంది మధ్య సాగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ వర్గాలు ఆయనతో టచ్‌లోకి వచ్చినట్టు సమాచారం. మంచి వ్యాఖ్యాతగా ఉన్న ఆయన్ను తమ వైపునకు తిప్పుకుంటే ఉపయోగపడుతాడనే భావనతో కమలనాథులు ఆహ్వానం పలికినట్టు తెలుస్తోంది. అయితే.. చిన్నమ్మ శశికళతో సాగే భేటీ మేరకు తదుపరి తన నిర్ణయాన్ని ప్రకటించాలని సంకల్పించి ఉన్నా, కమలనాథుల ఆహ్వానంపై కృతజ్ఞతలు తెలిపే విధంగా పుహళేంది స్పందించడం గమనార్హం. ఈ విషయం గురించి మంగళవారం మీడియాతో మాట్లాడిన పుహళేంది...చిన్నమ్మ శశికళ త్వరలో బయటకు రానున్నారని, ఆమె రాకతో అన్నీ సర్దుకుంటాయని వ్యాఖ్యానించారు. ఒక్క జయకుమార్ తప్ప..సీఎంతో పాటు మిగిలిన మంత్రులు ఎవరూ కూడా శశికళకు వ్యతిరేకంగా స్పందించిన దాఖలాలు లేవన్నారు. ఆమె బయటకు వస్తే, పరిస్థితులు అన్నీ మారుతాయని, ఆమె త్వరలో వస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ నుంచి తనకు ఆహ్వానం పలికినట్టుగా మీడియాల్లో వార్తలు చూశానని, అలా జరిగి ఉంటే.. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. చిన్నమ్మ రాకతో అందరూ ఆమె చుట్టు చేరుతారని, ఇది జరిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, దినకరన్ మీడియాతో మాట్లాడుతూ చిన్నమ్మ శశికళ విడుదలకు తగ్గ చర్యలు, ప్రయత్నాలు వేగవంతం చేసి ఉన్నట్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ దృష్ట్యా, శశికళ ముందుగానే జైలు నుంచి బయటకు వచ్చే సమయం ఆసన్నం అవుతోందని ఆమె అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
జైలు నుంచి బయటకు రాబోతున్న చిన్నమ్మ!
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ మరి కొన్ని నెలల్లో జైలు నుంచి బయటకు రాబోతున్నట్టుగా తమిళనాట చర్చ జోరందుకుంది. సత్ప్రవర్తన కారణంగా ఆమెను విడుదల చేయడానికి జైళ్ల శాఖ కర్ణాటక ప్రభుత్వానికి సిఫారసు చేసి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. డిసెంబరులో చిన్నమ్మ విడుదల కావచ్చనట్టుగా అమ్మ శిబిరంలో ఎదురుచూపులు పెరగడం గమనార్హం. అన్నాడీఎంకేలో ఒకప్పుడు అమ్మ జయలలితతో కలిసి ఆమె నెచ్చెలి, చిన్నమ్మ శశికళ చక్రం తిప్పిన విషయం తెలిసిందే. 1991–96 కాలంలో వీరి అక్రమార్జనకు హద్దే లేదన్న ఆరోపణలు జోరుగానే సాగాయి. ఇందుకు తగ్గట్టుగా డీఎంకే సర్కారు అధికారంలోకి రావడంతో జయలలితతోపాటుగా చిన్నమ్మ శశికళ, వారి బంధుగణం మీద కేసుల మోత మోగాయి. ఇందులో అక్రమాస్తుల కేసు కూడా ఒకటి. తొలుత తమిళనాట, ఆ తదుపరి కర్ణాటక ప్రత్యేక కోర్టులో ఏళ్ల తరబడి సాగిన ఈ కేసు విచారణ చివరకు సుప్రీంకోర్టుకు సైతం చేరింది. ఎట్టకేలకు ఈ కేసులో సుప్రీంకోర్టు అందర్నీ దోషులుగా తేల్చింది. అయితే, అమ్మ జయలలిత మరణించడంతో, ఆమె పేరును పక్కన పెట్టి చిన్నమ్మ శశికళ, ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌లకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ 2017 ఫిబ్రవరిలో కోర్టు తీర్పు ఇవ్వడంతో సీఎం పగ్గాలు చేపట్టాలన్న ఆకాంక్షతో ఉరకలు తీసిన చిన్నమ్మ శశికళకు కారాగార వాసం తప్పలేదు. సత్ప్రవర్తనతో బయటకు వచ్చేనా..! ఈ ఏడాది ఫిబ్రవరితో చిన్నమ్మ శశికళ జైలు శిక్ష కాలం రెండేళ్లు ముగిసింది. ఈ కాలంలో ఆమె జైలులో నడుచుకున్న విధానాన్ని సత్ప్రవర్తన పరిధిలోకి కర్ణాటక అధికార వర్గాలు తీసుకొచ్చినట్టు సమాచారం. సత్ప్రవర్తనతో వ్యవహరించిన శశికళను ముందస్తుగానే విడుదల చేయడానికి తగ్గట్టుగా కర్ణాటక ప్రభుత్వానికి ఆ రాష్ట్ర జైళ్ల శాఖ సిఫారసు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీని మీద తమిళ మీడియాల్లో వార్తలు రావడంతో ఇక్కడున్న అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాల్లో ఆనందం తాండవం చేస్తోంది. అలాగే, అన్నాడీఎంకేలో ముందస్తు విడుదల అన్నది చర్చకు దారి తీసింది. కర్ణాటక జైళ్ల శాఖ సిఫారసును ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన పక్షంలో తమ చిన్నమ్మ డిసెంబరులో జైలు నుంచి బయటకు రావచ్చనట్టుగా అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. వాస్తవానికి జైలు శిక్ష కాలం 2021లో ముగుస్తుంది. అయితే, ముందుస్తుగానే ఆమెను విడుదల చేయాడానికి సన్నాహాలు సాగుతుండడం వెనుక రాజకీయ వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా..? అన్న చర్చ తమిళనాట ఊపందుకోవడం ఆలోచించాల్సిందే. అయితే, ఆమెను ఎలా సత్ప్రవర్తన కింద విడుదల చేస్తారో అన్న ప్రశ్నను సంధించే వాళ్లూ ఉన్నారు. జైలు జీవితంలో భాగంగా ఆమె ఇష్టారాజ్యంగా షాపింగ్‌కు వెళ్లి వస్తుండడం వంటి వీడియో దృశ్యాలు బయటకు రావడం, గతంలో కర్ణాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులు కొందరు ఆ శాఖ డీజీపీ మీదే ఆరోపణలు గుప్పించిన వ్యవహారం కోర్టులో విచారణలో ఉండటం వంటి అంశాలను తెర మీదకు తెస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చిన్నమ్మ ముందస్తుగా విడుదలైన పక్షంలో తెర వెనుక రాజకీయం తథ్యం అని వ్యాఖ్యానించే వాళ్లు మరీ ఎక్కువే. -
చిన్నమ్మ ఆస్తులు జప్తు?
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ అండ్ బృందానికి శనివారంతో రెండేళ్ల జైలు శిక్ష ముగిసింది. మరో రెండేళ్ల శిక్షా కాలం అనుభవించాల్సి ఉంది. ఇంత వరకు ఈ ముగ్గురు తలా రూ. పది కోట్ల జరిమానా చెల్లించని దృష్ట్యా, వారి ఆస్తులు జప్తు అయ్యేనా అన్న ప్రశ్న మొదలైంది. అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చిన్నమ్మ శశికళ సీఎం ఆశల్ని అడియాసలు చేసిన విషయం తెలిసిందే. అమ్మ జయలలిత మరణంతో ఆమెను దోషిగా పేర్కొన్నా, కేసు నుంచి తప్పించారు. ఇక, ఆమె నెచ్చెలి, చిన్నమ్మ శశికళ, బంధువులు ఇలవరసి, సుధాకరన్ జైలు శిక్ష ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ముగ్గురికి తలా నాలుగేళ్లు జైలు శిక్షను సుప్రీంకోర్టు విధించింది. దీంతో 2017 ఫిబ్రవరి 15న సాయంత్రం బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో చిన్నమ్మ అండ్ బృందం లొంగిపోయారు. అప్పటి నుంచి జైలుకే పరిమితం అయ్యారు. ఈ మధ్య కాలంలో చిన్నమ్మ శశికళ, ఇలవరసి లగ్జరీ జీవితాన్ని జైల్లో అనుభవిస్తుండడం వెలుగులోకి వచ్చింది. దీనిపై కర్ణాటక సర్కారు విచారణను సైతం ముగించింది. ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ అండ్ బృందం జైలుకు వెళ్లి రెండేళ్లు అవుతోంది. శనివారంతో వారి శిక్షలో సగం కాలం గడిచింది. మిగిలిన రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. అయితే, జైలులో సత్ప్రవర్తన కారణంగా శశికళ ముందస్తుగా కూడా విడుదల కావచ్చనట్టుగా కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. రూ.పది కోట్ల జరిమానా: జైలు శిక్ష తీర్పు సమయంలో ఆ ముగ్గురికి తలా రూ. పది కోట్లు చొప్పున జరిమానాను సుప్రీంకోర్టు విధించింది. అయితే, ఇంత వరకు ఆ ముగ్గురు జరిమానాను చెల్లించనట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఈ జరిమానా కేసును తొలుత తమ గుప్పెట్లోకి తీసుకున్న తమిళనాడు ఏసీబీ నేతృత్వంలో వసూలు చేయాలా..? లేదా, కేసును నడిపిన కర్ణాటక ప్రత్యేక కోర్టులో చెల్లించాలా అన్న ప్రశ్న తలెత్తడంతో ఇంతకాలం ఆ జరిమానా గురించి ఎవ్వరూ పట్టించుకోనట్టు సమాచారం. శిక్షా కాలంలో సగం రోజులు గడవడంతో తాజాగా ఆ జరిమానా వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు సంప్రదింపులు జరిపి, జరిమానా వసూలు వ్యవహారంలో ఓ నిర్ణయానికి రావాల్సి ఉందని ఏసీబీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక వేళ ఆ మొత్తాన్ని ఆ ముగ్గురు చెల్లించని పక్షంలో కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మేరకు ఆస్తుల జప్తునకు ఆస్కారం ఉందంటున్నారు. -
ఊరికి పరంపర
చెట్టు ఎంత ఎదిగినా వేళ్లను వదిలిపెట్టదు. తాను ఎదుగుతున్న కొద్దీ వేళ్లను కూడా అంతగా విస్తరించుకుంటుంది. మహావృక్షంగా మారిన తర్వాత ఊడలను దించుకుంటుంది. మరి.. మనుషులం? మన మూలాలను పుటుక్కున తెంచేసుకుంటున్నాం. ‘ఎంత ఎత్తుకి ఎదిగినా పాదాలు ఉండాల్సింది నేల మీదనే’ అనే చిన్న సూత్రాన్ని మర్చిపోతున్నాం. ‘‘అది గుర్తు చేయడానికే ‘పరంపర’ కల్చరల్ ఆర్గనైజేషన్‌ను స్థాపించాం.. అంటున్నారు డాక్టర్ శ్రీనాగి, శశికళ. దేవాలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ‘‘తమిళనాడు, కర్ణాటక వాళ్లు సంస్కృతికి దూరం కారు. ఎంత పెద్ద చదువులు చదివినా, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నా సరే.. ఏడాదిలో ఒకసారి వారి సొంత ప్రదేశాలకు చేరిపోతారు. అందరూ కలిసి సంగీతం, నాట్యాలతో వాళ్ల సంప్రదాయ రీతులను ప్రదర్శించుకుంటారు. ఇక్కడ ప్రదర్శకులు వేరు, ప్రేక్షకులు వేరు కాదు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కళలో ప్రవేశం ఉంటుంది. చిన్నదో పెద్దదో ఏదో ఒక బాధ్యత తీసుకుంటారు. ఒకరు ప్రదర్శిస్తుంటే మిగిలిన వాళ్లు ప్రేక్షకులైపోతారు. సాంస్కృతిక వేడుకలు పూర్తయిన తర్వాత తిరిగి తమ తమ ఉద్యోగాలకు వెళ్లిపోతారు. ఐదేళ్ల కిందట ఒక స్నేహితురాలి ఆహ్వానంతో బెంగళూరుకెళ్లినప్పుడు వాళ్ల సంప్రదాయం, సంస్కృతిని పరిరక్షించుకుంటున్న తీరు తెలిసింది. తెలుగువాళ్లకు అలవాటు చేద్దామనిపించింది’’ అన్నారు డాక్టర్ శ్రీనాగి. మనకూ వేదికలు.. వేడుకలు ‘‘మనదైన శాస్త్రీయ సంగీత కచేరీలు, సంప్రదాయ నాట్యరీతులు ఉన్నాయి. వాటిని ప్రదర్శించడానికి హైదరాబాద్‌లో రవీంద్రభారతి, శిల్పకళావేదిక వంటి వేదికలూ ఉన్నాయి. ప్రతి పట్టణంలోనూ ఇలాంటి వేదికలూ ఉండనే ఉన్నాయి. అయితే కళాభిరుచి ఉన్న వాళ్లను మాత్రమే ఆకర్షిస్తాయవి. సంస్కృతి గురించి ఏమీ తెలియని వారికి కూడా మన సంస్కృతి మూలాల దగ్గరకు తీసుకురావాలంటే మాకు కనిపించిన మార్గం ఒక్కటే. ఆ కార్యక్రమాలను వారి ముంగిటకు తీసుకెళ్లడమే. అందుకే నాలుగేళ్ల నుంచి కళాసాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను తీసుకున్నాం’’ అని పరంపర కల్చరల్ ఆర్గనైజేషన్ గురించి చెప్పారు శశికళ. డాక్టర్ శ్రీనాగి, శశికళ ఇద్దరూ తమవంతు బాధ్యతగా సామాజిక కార్యక్రమాలను నిర్వహింస్తుంటారు. ‘రోష్ని’ స్వచ్ఛంద సంస్థ స్థాపనలోనూ కీలకంగా వ్యవహరించారు శశికళ. రోష్ని సంస్థ ఆత్మహత్యకు పాల్పడే వారిని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇస్తుంది. జీవితం మీద ఆసక్తి కోల్పోకుండా చేస్తుంది. జీవితంలో కష్టాలుంటాయి, కానీ అవి జీవితానికి డెడ్ఎండ్లు కాదు, టర్నింగ్‌లు మాత్రమేననే మంచి మాటలతో నిరాశానిస్పృహలను తొలగించి జీవితేచ్ఛ కలిగిస్తుంటుంది రోష్ని సంస్థ. వీరిద్దరి స్నేహం ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల పరిరక్షణ బాధ్యతను తలకెత్తుకుంది. ‘పరంపర... నర్చరింగ్ కల్చర్’ అనే ట్యాగ్‌లైన్‌లోనే తామేం చెప్పదలుచుకున్నామో ఉందంటారు శ్రీనాగి, శశికళ. గుడిలోనే ఎందుకు? సాంస్కృతిక కార్యక్రమాలను గుడి ఆవరణలో నిర్వహించడం వెనుక బలమైన కారణాన్ని చెబుతున్నారీ మహిళలు. ‘‘ప్రతి ఊళ్లోనూ ఆలయం ఉంటుంది. గుడి ధార్మిక ప్రదేశమే. అయితే మతపరమైన పరిధితో గిరిగీసుకునే ప్రదేశం కాదు. ఆ గ్రామస్తు లందరికీ సమావేశ వేదిక. ఊరికి, ఊళ్లో వాళ్లకు సంబంధించిన ఏ అంశాన్నయినా గుడి ఆవరణలోనే చర్చించుకునేవాళ్లు. ఆ సంస్కృతిని గుర్తు చేయడానికే గుడి ఆవరణను ఎంచుకున్నాం. ఎక్కడెక్కడ ప్రాచీన ఆలయాలున్నాయో శోధించాం. శంషాబాద్ దగ్గర అమ్మపల్లె రామచంద్రస్వామి ఆలయం ఏడు వందల ఏళ్ల నాటిది. మనం గుజరాత్కెళ్లి చూసొచ్చే స్టెప్‌వెల్ కూడా ఉందీ ఆలయం సమీపాన. చాలామందికి అక్కడ అంత గొప్ప ప్రాచీన ఆలయం ఉందనే సంగతి కూడా తెలియదు. నాలుగేళ్లు మేము ఆ ఆలయంలో కూడా ఒక వేడుకను నిర్వహించడంతో ఇప్పుడు అక్కడికి భక్తులు ముఖ్యంగా పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. భువనగిరిలోని అక్కన్న మాదన్నల ఆలయానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యం ఈతరం చాలా మందికి తెలియడమే లేదు. మా గుడి సంబరాల నిర్వహణకు ప్రాచీన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలనే ఎన్నుకుంటున్నాం. కళాకారుల ఎంపికలో మేము ఇప్పటికే పేరు గడించిన వారి కోసం ప్రయత్నించడం లేదు. టాలెంట్ ఉండి పెద్దగా గుర్తింపునకు నోచుకోని వారి కోసం గాలించినంత పని చేస్తున్నాం. ఇదంతా స్వచ్ఛందంగా చేస్తున్న పని. ప్రదర్శనకు టికెట్ ఉండదు. వీలయినంత ఎక్కువ మందికి మన మూలాలను తెలియచేయడమే మా ఉద్దేశం. ఎవరైనా స్థానికంగా మాకు సహకరిస్తే వారి సహాయం తీసుకుంటున్నాం. మై హోమ్, బీవీఆర్, ఏఎమ్ఆర్ వంటి సంస్థలు కొంత వరకు ఆర్థిక తోడ్పాడునిస్తున్నాయి. గద్వాల్ కోటలో ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్’ నృత్యనాటకాలను ప్రదర్శించాం. మహబూబాబాద్‌లో ‘నర్తనశాల’ ప్రదర్శించాం. ఆ ప్రదర్శన గురించి తెలిసిన వరంగల్ ఎమ్మెల్యే తర్వాతి ప్రదర్శన భద్రకాళి ఆలయంలో పెట్టమని అడిగారు. అలా ఎక్కడికక్కడ స్థానికంగా ఎవరైనా ముందుకు వచ్చి సహకరిస్తే మాకు కొంత బరువు తగ్గుతుంది. అలా లేనిచోట పూర్తి బాధ్యత మాదే. ఈ వేడుకలు ఈ రోజు (జనవరి 11న) మొదలయ్యాయి. ఏటా జనవరి నుంచి మార్చి వరకు సాగే ఈ కార్యక్రమాల్లో మాతో కలిసి పనిచేయడానికి ఆసక్తి ఉన్న వాళ్లందరికీ ఇదే మా ఆహ్వానం’’ అన్నారు డాక్టర్ శ్రీనాగి, శశికళ. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి కార్యక్రమాల ‘పరంపర’: జనవరి 11 : కనకదుర్గ ఆలయం, విజయవాడ (ముగిశాయి) జనవరి 13 : భావ నారాయణ ఆలయం, బాపట్ల; జనవరి 16 : వేయి స్తంభాల గుడి, వరంగల్ జనవరి 19 : శ్రీ రామచంద్రస్వామి ఆలయం , అమ్మపల్లె, శంషాబాద్, హైదరాబాద్ జనవరి 27 : వేణుగోపాల స్వామి ఆలయం, అక్కన్నమాదన్న ఆలయం, భువనగిరి ఫిబ్రవరి 2 : వీరభద్రస్వామి ఆలయం, అప్పా సర్వీస్ రోడ్, నార్సింగి, హైదరాబాద్ ఫిబ్రవరి 22 : అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయం, మామిడిపల్లి, నిజామాబాద్ మార్చి 4 : ధర్మపురి క్షేత్రం, మియాపూర్, హైదరాబాద్ -
మరో కొత్తపార్టీ!
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ కుటుంబం నుంచి మరో కొత్త పార్టీ శనివారం ఆవిర్భవించింది. అన్నా, ఎంజీఆర్ మక్కల్ కళగం పేరిట పార్టీని టీటీవీ భాస్కరన్ ఏర్పాటు చేశారు. నీలంకరైలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో పార్టీ పేరును, జెండాను భాస్కరన్ ప్రకటించారు. తమ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. తిరువారూర్ జిల్లా మన్నార్‌కుడి కేంద్రంగా చిన్నమ్మ శశికళ కుటుంబం ఒకప్పుడు సాగించిన రాజకీయదందా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మ జయలలిత, నెచ్చెలి శశికళను అడ్డం పెట్టుకుని ఈ కుటుంబం మన్నార్‌కుడి మాఫియాగా ఎదిగిందని చెప్పవచ్చు. అయితే, జయలలిత మరణం తదుపరి పరిణామాలు, చిన్నమ్మ జైలు జీవితం వెరసి ఈ కుటుంబాన్ని కష్టాలపాలు చేశాయి. చిన్నమ్మ గుప్పెట్లో ఉన్న అన్నాడీఎంకే చేజారడం పెద్ద షాక్. ఆ తదుపరి పరిణామాలు చిన్నమ్మ ఫ్యామిలీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఐటీ దాడులు ఓ వైపు, పాత కేసుల విచారణలు మరోవైపు ఈ కుటుంబానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అదే సమయంలో రాజకీయ ఉనికి చాటుకునే రీతిలో చిన్నమ్మ ప్రతినిధిగా, ఆమె అక్క వనితామణి కుమారుడు దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఏర్పాటు చేశారు. అన్నాడీఎంకే కేడర్‌ను చీల్చడంలో సఫలీకృతుడైన దినకరన్, తన బలాన్ని చాటుకునేందుకు రంకెలు వేస్తున్నారు. ఈ పార్టీ రూపంలో చిన్నమ్మ సోదరుడు, మేనమామ దివాకరన్‌తో ఏర్పడ్డ విభేదాలు దినకరన్‌కు కొత్త చిక్కుల్ని తెచ్చి పెట్టాయి. చిన్నమ్మ కుటుంబం నుంచి మరో పార్టీ దివాకరన్ నేతృత్వంలో పుట్టుకు వచ్చింది. తన వారసుడు జై ఆనంద్‌ను రాజకీయంగా ఉన్న స్థానంలో కూర్చొబెట్టడం లక్ష్యంగా అన్నాద్రావిడర్ కళగంను దివాకరన్ ప్రకటించుకున్నారు. ఈయన సైతం తన బలాన్ని చాటే దిశగా కుస్తీలు పట్టే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో అన్నయ్య దినకరన్, మేనమామ దివాకరన్లనుఢీకొట్టే రీతిలో చిన్నమ్మ కుటుంబం నుంచి మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఈ పార్టీని దినకరన్ సోదరుడు, నటుడు టీటీవీ భాస్కరన్ ప్రకటించారు. అన్నా, ఎంజీఆర్ మక్కల్ కళగం: కుటుంబ విభేదాల నేపథ్యంలో అన్నయ్య దినకరన్, మేనమామ దివాకరన్ బాటలో కొత్త పార్టీ ప్రకటనకు గత నెల భాస్కరన్ సిద్ధమయ్యారు. అయితే, భాస్కరన్ మహానాడును తలపించే రీతిలో తిరుత్తణి వేదికగా పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే, అధికార పక్షం భాస్కరన్‌కు చెక్ పెట్టే రీతిలో వ్యవహరించింది. హంగామాతో సత్తా చాటుకోవాలనుకున్న భాస్కరన్ మహానాడుకు అనుమతి నిరాకరించారు. దీంతో వెనక్కు తగ్గిన భాస్కరన్, హంగు ఆర్భాటాలు లేకుండా, నిరాడంబరంగా శనివారం నీలాంకరై వేదికగా తన కొత్త పార్టీని ప్రకటించుకున్నారు. ఉదయం తన నివాసంలో దురైరాజ్ – ఝాన్సీ దంపతులకు వివాహాన్ని తన చేతుల మీదుగా భాస్కరన్ జరిపించారు. అనంతరం కొత్త పార్టీని మద్దతుదారులు, అభిమానుల సమక్షంలో ప్రకటించారు. అన్నా జయంతిని పురస్కరించుకుని పార్టీని ప్రకటించాలన్న లక్ష్యంతో ఈ ప్రకటన చేస్తున్నట్టు వివరించారు. అన్నా, ఎంజీఆర్ మక్కల్ కళగంగా పార్టీ పేరును ప్రకటించారు. పై భాగంలో ఆరంజ్ (కమలా పండు) రంగు, మధ్య భాగంలో పచ్చ, కింది భాగంలో నలుపు వర్ణంతో కూడి మధ్య భాగంలో ఎంజీఆర్ ముఖ చిత్రంతో పార్టీ జెండాను ఆవిష్కరించారు. భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ భారీ ఎత్తున పార్టీని ప్రకటించాలని తాను సంకల్పించినా, అందుకు తగ్గ అనుమతుల్ని ఈ పాలకులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. తన పార్టీని చూసి పాలకులకే గుబులు పట్టుకుందంటే, ఇక, మిగిలిన పార్టీలకు తనను చూస్తే ముచ్చెమటలేనని ధీమా వ్యక్తం చేశారు. అన్నా జయంతి సందర్భంగా పార్టీని ప్రకటించాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం నిరాడంబర ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. త్వరలో పార్టీ కార్యవర్గం ప్రకటించనున్నట్టు తెలిపారు. తమ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ముందుకు సాగుతుందని ప్రకటించారు. మోదీని మళ్లీ పీఎం చేయడం లక్ష్యంగా శ్రమిస్తామన్నారు. అవినీతి రహిత పాలన లక్ష్యంగా ముందుకు సాగే వాళ్లతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాని తెలిపారు. అన్నా, ఎంజీఆర్ మద్దతుదారులు, అభిమానుల్ని కలుపుకుని బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. కాగా, అన్నయ్య మద్దతుదారుల్ని ఇరకాటంలో పెట్టే రీతిలో తమ్ముడు పార్టీ పేరును ప్రకటించడం గమనార్హం. అన్నయ్య దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే)ను ప్రకటించుకున్నారు. ఇక అన్నా, ఎంజీఆర్ మక్కల్ కళగం (ఏఎంఎంకే)ను తమ్ముడు ప్రకటించడం గమనార్హం. -
గుట్కా మాఫియాపై సీబీఐ పంజా
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో మూడేళ్లుగా రహస్యంగా సాగుతున్న గుట్కా అక్రమ అమ్మకాలపై సీబీఐ పంజా విసిరింది. గుట్కా తయారీదారుల నుంచి రూ.40 కోట్ల ముడుపులు పుచ్చుకున్నారన్న ఆరోపణలపై ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, డీజీపీ టీకే రాజేంద్రన్, చెన్నై నగర మాజీ పోలీస్ కమిషనర్ జార్జ్ ఇళ్లపై బుధవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. తమిళనాడులో మొత్తం 40 చోట్ల, బెంగళూరు, ముంబైలో రెండు చోట్ల దాడులు జరిగినట్లు తెలిసింది. రూ.250 కోట్ల ఆదాయ పన్నును ఎగవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ గుట్కా వ్యాపారి గిడ్డంగులపై అధికారులు సోదాలు నిర్వహించడంతో గతేడాది జూలై 8న ఈ స్కాం వెలుగుచూసింది. ఆదాయ పన్ను ఎగవేత ఆరోపణలపై విజయభాస్కర్ నివాసంలో గతంలో ఐటీ అధికారులు కూడా సోదాలు జరిపారు. పదవిలో ఉండగా సీబీఐ దాడులు ఎదుర్కొన్న తొలి డీజీపీ రాజేంద్రనే కావడం గమనార్హం. మాజీ మంత్రి, ఐఆర్ఎస్ నివాసాల్లోనూ గుట్కా మాఫియాపై ఆధారాలు లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే అనుమాని తుల నివాసాలపై సీబీఐ దాడులు ప్రారంభమయ్యాయి. చెన్నై గ్రీన్‌వేస్‌రోడ్డులోని ఆరోగ్యమంత్రి విజయభాస్కర్ నివాసంలో ఐదుగురు, ముగప్పేరీలోని డీజీపీ రాజేంద్రన్ ఇంట్లో పది మంది అధికారులు సోదాలు జరిపారు. నొళంబూరులో నివసిస్తున్న మాజీ పోలీస్ కమిషనర్ జార్జ్ ఇంట్లో ఐదుగురు అధికారులు తనిఖీలు చేశారు. వీరుగాక విజయభాస్కర్ అనుచరులు, సహాయకులు, తిరువళ్లూరులో నివసిస్తున్న మాజీ మంత్రి రమణ, 2009 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారిణి గుల్జార్ బేగం తదితరుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. అన్ని చోట్ల నుంచి కొన్ని కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విజయభాస్కర్, రాజేంద్రన్‌ను వారివారి పదవుల నుంచి తొలగించాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. నిషేధాన్ని నీరుగార్చిన మంత్రి గుట్కా, పాన్ మసాలా తదితర మత్తుపదార్థాల అమ్మకాలపై 2013లో తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా రాష్ట్రవ్యాప్తంగా గుట్కా అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగాయి. దీంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుట్కా హోల్‌సేల్ వ్యాపారి మాధవరావుకు చెందిన గిడ్డంగిపై ఆకస్మిక దాడులు నిర్వహించి భారీ ఎత్తున సరుకును, ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు.ఆ డైరీలో కార్పొరేషన్‌లోని కిందిస్థాయి అధికారి మొదలుకుని ఐపీఎస్ అధికారులు, ఒక మంత్రి వరకు ఎవరెవరికి ఎంతెంత ముడుపులు, ఏయే తేదీల్లో ముట్టజెప్పిన వివరాలు ఉన్నాయి. గుట్కాపై నిషేధాన్ని మంత్రి, అధికారులే నీరుగార్చేశారని తెలుసుకుని ఐటీ అధికారులు విస్తుపోయారు. డైరీలో ఉన్న లెక్కల ప్రకారం మంత్రి, 23 మంది అధికారులకు సగటున రూ.60 లక్షల చొప్పున మొత్తం రూ.40 కోట్ల వరకు ముడుపులు చెల్లించినట్లు తేలింది. శశికళకూ సంబంధాలు? జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగానే గుట్కా అక్రమాలపై ఆదాయ పన్ను శాఖ రాసిన లేఖ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు, డీజీపీ అశోక్‌కుమార్‌లకు చేరింది. అయితే వారు ఈ విషయాన్ని జయలలిత దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ఆమె చనిపోయిన తరువాత గుట్కా కేసు దాదాపుగా అటకెక్కింది. ఆ తరువాత జయలలిత నివాసంలో సోదాలు జరిపినప్పుడు శశికళ గదిలో ఐటీ శాఖ రాసిన ఉత్తరం దొరకడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. గుట్కా అమ్మకాలు గుట్టుగా సాగడంలో శశికళ ప్రమేయం ఉందన్న అనుమానంతో, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని అవినీతి నిరోధకశాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. డీఎంకే ఎమ్మెల్యే, సీనియర్ నేత దురైమురుగన్ విజ్ఞప్తి మేరకు గత ఏప్రిల్ నెలలో మద్రాస్ హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. చెన్నైలో రాజేంద్రన్ ఇల్లు -
తమిళనాడులో మరో కొత్త పార్టీ
చెన్నై : తమిళనాడులో కొత్త పార్టీలకు కొదవలేకుండా పోతుంది. తాజాగా శశికళ సోదరుడు దివాకరన్ కొత్త రాజకీయా పార్టీని స్థాపించారు. గతంలో అన్నాడీఎంకే నుంచి బయటికిచ్చిన శశికళ వర్గం నాయకుడు దినకరన్ పెట్టిన అమ్మ మక్కల్ మున్నెట్రా కదగజం పార్టీలో ఉన్న దివాకరన్ ఇప్పుడు ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుని ‘అమ్మ అని’ అనగా ‘అమ్మ జట్టు’ అనే కొత్త పార్టీని నెలకొల్పారు. తెలుపు, నలుపు, ఎరుపు, మధ్యలో ఆకుపచ్చ వర్ణాలతో పార్టీ జెండాను ఆదివారం చెన్నైలో ఆవిష్కరించారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం అనంతరం తమిళనాడలో ఇప్పటికే దినకరన్, ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌లు కొత్త పార్టీలను స్థాపించిన సంగతి తెలిసిందే. అలాగే గతంతో జయలలిత మేనకోడలు దీప కూడా ఎంజీఆర్ అమ్మ దీప పేరవాయి పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. సుపర్‌స్టార్ రజనీకాంత్ కూడా రాజకీయ పార్టీ పడతానని ప్రకటించారు. కేవలం జయ మరణం కారణంగానే తమిళనాడులో ఇన్ని రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. -
అమ్మ ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించింది
సాక్షి, చెన్నై: అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత (అమ్మ) ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని ఆమె నెచ్చెలి శశికళ ఓ అఫిడవిట్లో తెలిపారు. జయ మరణానికి దారితీసిన పరిస్థితులను విచారిస్తున్న ఆరుముగసామి కమిషన్‌కు శశికళ తరఫు లాయర్ సమర్పించిన ఆ అఫిడవిట్ వివరాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి, బెయిల్ మీద బయటకు వచ్చాక జయలలిత తీవ్ర మనోవేదనకు గురయ్యారని శశికళ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించిందనీ, 2016 సెప్టెంబరు 22న రాత్రి బాత్రూంలో పడిపోవడంతో డాక్టర్ శివకుమార్‌ను పిలిపించానని తెలిపారు. అపోలో ఆస్పత్రికి వెళ్లే దారిలోనే జయ స్పృహలోకి వచ్చి, ఆస్పత్రికి వద్దే వద్దని కోప్పడ్డారని పేర్కొన్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి, చికిత్స జరిపిన వైద్యులు, డిసెంబరు ఐదు వరకు ఆమెను ఎవరెవరు పరామర్శించారు తదితర వివరాలను ప్రమాణ పత్రంలో పొందుపరిచారు. గవర్నర్ విద్యాసాగర్ రావు, భద్రత అధికారులు వీర పెరుమాళ్ స్వామి, పెరుమాళ్ స్వామి, అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న పన్నీరు సెల్వం, ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్, కార్మిక మంత్రి నిలోఫర్ కబిల్, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై తదితరులు జయలలితను పరామర్శించిన వారిలో ఉన్నట్లు వివరించారు. డిసెంబరు నాలుగో తేదీన ‘జై హనుమాన్’ సీరియల్ చూసిన కాసేపటికే ఆమెలో వణుకుడును పుట్టిందనీ ఆ మరుసటి రోజే చనిపోయారని తెలిపారు. -
ఎమ్మెల్యేగా దినకరన్ ప్రమాణం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి టీటీవీ దినకరన్ శుక్రవారం పదవీ ప్రమాణం చేశారు. సచివాలయంలో స్పీకర్ ధనపాల్ ఆయనతో ప్రమాణం చేయించారు. కాగా దినకరన్‌కు మద్దతుగా నిలిచారనే ఆరోపణలపై గురువారం 46 మందిపై వేటువేసిన సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం.. శుక్రవారం మాజీ మంత్రి రాధాకృష్ణన్ సహా 164 మంది పార్టీ నేతలను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ బాధ్యతలు, ప్రాథమిక సభ్యత్వం నుంచి వారిని తొలగిస్తూ ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వం కూలిపోయేవరకు శశికళ మౌనవ్రతం? అన్నాడీఎంకే ప్రభుత్వం కూలిపోయే వరకు శశికళ మౌనవ్రతంలోనే ఉంటారని దినకరన్ అనుచరులు రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారు. దినకరన్ 2 రోజుల క్రితం బెంగళూరు వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసు కున్నారు. జయ వర్ధంతి రోజైన ఈనెల 5 నుంచి శశికళ మౌన వ్రతం లో ఉన్నందున ఆమె ఏమీ మాట్లాడ లేదు.. జనవరి చివరి వరకు వ్రతాన్ని కొనసాగిస్తారని మీడియాతో దినకరన్ చెప్పారు. జయ మరణానికి దారితీసిన పరిస్థితులపై ఆధారాలు సమర్పించాల్సిందిగా విచారణ కమిషన్ సమన్లు జారీచేసిన సమయంలో శశికళ మౌనవ్రతంలోకి వెళ్లడం చర్చనీయాంశమైంది. -
జయలలిత మృతి కేసు.. విచారణలో కీలక ఘట్టం..
అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ విచారణ జోరును పెంచింది. అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ, అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి, ఆయన కుమార్తె ప్రీతారెడ్డిలకు శుక్రవారం సమన్లు జారీచేయడం ద్వారా విచారణ కీలకదశకు చేరుకుంది. సాక్షి, చెన్నై: అమ్మ అనారోగ్యం, 75 రోజుల తరువాత ఆకస్మిక మరణం ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత కోసం తమిళనాడు ప్రభుత్వం తరపున వివిధ విభాగాలకు చెందిన వైద్యుల బృందం, ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులు విదేశాల నుంచి ప్రత్యేక వైద్య నిపుణులు...ఇలా అమ్మకు అంతర్జాతీయ స్థాయిలో వైద్యం అందింది. జయకు కేవలం జ్వరం, డీ హైడ్రేషన్లతో స్వల్ప అనారోగ్యమేనని చేరిన వెంటనే అపోలో ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. నిజాన్ని దాచాల్సి వచ్చింది.. అయితే అదంతా అబద్దమని, వాస్తవానికి జయ విషమ పరిస్థితిలో చేరారని అపోలో ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి ఇటీవల ప్రకటించారు. జయకు తీవ్ర అనారోగ్యం అని ప్రకటిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు తలెత్తుతాయనే ఆలోచనతో నిజాన్ని దాచాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు. అంతకు కొన్నినెలల ముందే మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్ సైతం అమ్మ ఆరోగ్యం విషయంలో అనేక అబద్ధాలు ఆడాం, మన్నించండి అని బహిరంగసభలో ప్రజలను వేడుకున్నాడు. ఇలాంటి అనుమానాలు.. పెనుభూతాల నడుమ తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబరు 25వ తేదీన జయ మరణంపై విచారణ కమిషన్ వేసింది. రిటైర్డు న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ ప్రారంభించారు. డీఎంకే వైద్యవిభాగ కార్యదర్శి డాక్టర్ శరవణన్ కమిషన్ ముందు హాజరై...అమ్మ చనిపోయిన స్థితిలో వేలిముద్రలు సేకరించి ఉప ఎన్నికలకు బీ ఫారం విడుదల చేశారని వాంగ్మూలం ఇచ్చి సంచలనం రేపారు. ఆ తరువాత జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్, దీప భర్త మాధవన్, తమిళనాడు ప్రభుత్వ మాజీ సీఎస్‌లు షీలా బాలకృష్ణన్, రామమోహన్‌రావు తదితర ముఖ్యులు తమ వాంగ్మూలం ఇచ్చారు. విచారణలో కీలక ఘట్టం.. ఇదిలా ఉండగా, విచారణలో భాగంగా శశికళ, ప్రతాప్ సీ రెడ్డి, ప్రీతారెడ్డిలకు కమిషన్ శుక్రవారం సమన్లు పంపడంతో జయ మరణంపై జరుగుతున్న విచారణ కీలక ఘట్టానికి చేరుకుంది. జయ ఆసుపత్రికి వచ్చినపుడే విషమపరిస్థిలో ఉన్నారని ప్రతాప్ సీ రెడ్డి చెప్పగా అంతకు కొన్ని నిమిషాల ముందు ఇంట్లో జయకు ఏమి జరిగిందనే ప్రశ్న తలెత్తింది. జయకు సీరియస్ అయిన సమయంలో శశికళ మాత్రమే ఉంది. జయ ఆసుపత్రిలో ఉండగా ఆమెకు అందుతున్న వైద్యసేవలను అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, అపోలో గ్రూప్ ఎగ్జిక్యుటివ్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి పర్యవేక్షించారు. దీంతో విచారణ కమిషన్ ఈ ముగ్గురికీ సమన్లు జారీచేసింది. బెంగళూరు జైలు అధికారుల ద్వారా శశికళకు ఈ సమన్లు అందాయి. 15 రోజుల్లోగా బదులివ్వాలని శశికళను కమిషన్ ఆదేశించింది. శశికళ తరఫున ముందుగా ఆమె న్యాయవాది హాజరై వాంగ్మూలం ఇస్తారు. అందుకు కమిషన్ సంతృప్తి చెందని పక్షంలో శశికళను నేరుగా పిలిపించుకుని లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తారని సమాచారం. అలాగే ప్రతాప్ సీ రెడ్డికి పదిరోజుల గడువు ఇచ్చారు. ఈ లెక్కన వచ్చే ఏడాది జనవరి 2వ తేదీన కమిషన్ ముందు ఆయన హాజరుకావాల్సి ఉంటుంది. అలాగే జయకు సంబంధించి ఆసుపత్రి విడుదల చేసిన అన్ని బులెటిన్లు పదిరోజుల్లోగా కమిషన్ కు అందజేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి. ప్రీతారెడ్డి సమన్ల వివరాలు తెలియరాలేదు. ఇదిలా ఉండగా, జయవిచారణ కమిషన్ నివేదిక సమర్పించేందుకు ప్రభుత్వం ఇచ్చిన మూడునెలల గడువు వచ్చే ఏడాది జనవరి 25వ తేదీతో ముగుస్తుంది. ఇంకా అనేక అంశాలు విచారణ రావాల్సిన కారణంగా గడువును మరో ఆరునెలలు పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
శశికళ, ఇళవరసిలపై మరో కేసు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: పది బోగస్ సంస్థల ద్వారా అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ, ఆమె వదిన ఇళవరసి కోట్ల రూపాయల మోసాలకు పాల్పడినట్లు సీబీఐ గుర్తించింది. త్వరలో వారిద్దరిపై అధికారులు మరో కేసు నమోదు చేయనున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మూతపడ్డ బోగస్ సంస్థల్లో శశికళ, ఇళవరసి, వారి బంధువులకు చెందిన పది కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీల్లో రూ. 1,012 కోట్ల అవకతవకలు సాగినట్లుగా చెన్నై ఐటీ అధికారులు గుర్తించారు. బోగస్ సంస్థలకు ఇళవరసి కుమారుడు వివేక్, కుమార్తెలు కృష్ణప్రియ, షకీల, మిత్రులు బినామీలుగా ఉన్నారు. బోగస్ కంపెనీల్లో పేర్కొన్న చిరునామాల్లో ఆయా సంస్థలు కాకుండా ఇళ్లు, ఒకే చిరునామాతో అనేక సంస్థలు ఉన్నాయి. మరోవైపు, విదేశాల నుంచి వస్తువుల దిగుమతి పేరుతో ఆరు బోగస్ సంస్థల ద్వారా రూ.174 కోట్లు విదేశాలకు పంపినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. -
ఇక శశి, ఇళవరసిల విచారణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: మెరుపు దాడులతో శశికళ బంధువర్గాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన ఆదాయపు పన్నుశాఖ ఇక శశికళ, ఇళవరసిలపై దృష్టి సారించనుంది. ఐటీ దాడుల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా బెంగళూరు జైలులో వీరిద్దరినీ విచారించనుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజన్‌ను పరామర్శించేందుకు శశికళ ఇటీవల పెరోల్‌పై చెన్నైకి వచ్చినపుడు 622 ఆస్తుల రిజిస్ట్రేషన్లలో మార్పులు, చేర్పులు చేసినట్లు ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఈ తతంగమంతా ఇళవరసి కుమార్తె కృష్ణప్రియ ఇంట్లో జరిగినట్లు అభియోగం. దాడులు ముగిసిన నాటి నుంచి శశికళ బంధువులను ఐటీ కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. ఆస్తులు కూడగట్టడంలో ప్రధానపాత్ర పోషించిన శశికళను, ఆమె అన్న భార్య ఇళవరసిలను విచారించేందుకు ఐటీ అధికారులు బెంగళూరు జైలుకు వెళ్లనున్నట్లు సమాచారం. దినకరన్ సోదరికి శిక్ష ఖరారు టీ నగర్ (చెన్నై): శశికళ సోదరి బి.వనితామణి కుమార్తె శీతలాదేవికి మూడేళ్లు, ఆమె భర్త ఎస్ఆర్ భాస్కరన్‌కు ఐదేళ్ల జైలు శిక్షను విధిస్తూ గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ మద్రాసు హైకోర్టు గురువారం తీర్పునిచ్చింది. శీతలాదేవి దినకరన్‌కు చెల్లెలు. భాస్కరన్ రిజర్వు బ్యాంకు మాజీ ఉద్యోగి. 1988– 97 మధ్యకాలంలో భాస్కరన్ తన భార్య పేరిట ఆదాయానికి మించి రూ.1.68కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు సీబీఐ 1998లో కేసు వేసింది. కేసు విచారించిన సీబీఐ కోర్టు భాస్కరన్‌కు ఐదేళ్ల శిక్ష, రూ.20 లక్షలు జరిమానా, శీతలాదేవికి మూడేళ్ల శిక్ష, రూ.10 లక్షలు జరిమానా విధిస్తూ 2008లో తీర్పుచెప్పింది. దీనిపై వీరు 2008లో హైకోర్టును ఆశ్రయించగా, శిక్షను నిలిపేసి హైకోర్టు విచారణ చేపట్టింది. తాజాగా సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు జడ్జి జయచంద్రన్ తీర్పుచెప్పారు. -
మూడోరోజూ ఐటీ దాడులు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ, ఆమె బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై మూడో రోజూ ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ దాడులు కొనసాగాయి. రూ.1,500 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన దస్తావేజుల్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. శశికళ బంధువులు, ఆమె సన్నిహితులే లక్ష్యంగా హైదరాబాద్, బెంగళూరు సహా తమిళనాడులోని 40 చోట్ల ఐటీశాఖ తనిఖీలు నిర్వహించింది. సోదాల్లో రూ.1,200 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు, రూ.6 కోట్ల నగదు, 15 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నోట్ల రద్దు సమయంలో నీలగిరి జిల్లాలోని కొడనాడు, గ్రీన్ టీ ఎస్టేట్స్‌లో పనిచేస్తున్న దాదాపు 800 కార్మికుల ఖాతాల్లో రూ.2 లక్షలు చొప్పున మొత్తం రూ.16 కోట్లు జమచేసిన విషయాన్ని ఐటీ శాఖ గుర్తించింది. రాజకీయ నాయకులంటే గోచీతో ప్లాట్‌ఫాం మీద బతకాలా? అని ఐటీ దాడుల నేపథ్యంలో దినకరన్ ప్రశ్నించారు. తానేం గాంధీ మనవడిని కాదని, సాధారణ వ్యక్తినన్నారు. ఐటీ శాఖ దాడుల కోసం బుక్‌చేసుకున్న 350 వాహనాలు ఎవరివో ఓసారి దృష్టి సారించాలన్నారు. శేఖర్‌రెడ్టి డైరీ ఆధారంగా దాడులు జరిగిఉంటే భారీగా నల్లధనం బయటపడి ఉండేదన్నారు. -
వెయ్యి కోట్ల పన్ను ఎగవేత!
సాక్షి, చెన్నై: ‘ఆపరేషన్ క్లీన్ మనీ’లో భాగంగా చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో శశికళ సన్నిహితుల ఇళ్లలో ఐటీ సోదాలు రెండో రోజూ కొనసాగాయి. ఈ సోదాల్లో శశికళ, ఆమె కుటుంబ సభ్యులు రూ. 1000 కోట్ల పన్ను ఎగవేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, బంగారు నగలు, వెండి, వజ్రాలు బయటపడినట్లు తెలిసింది. పెద్ద సంఖ్యలో బినామీ సంస్థల ద్వారా నగదు బట్వాడా, బ్యాంకు ఖాతాలు, విదేశీ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన రికార్డులు స్వాధీనంచేసుకున్నట్లు సమాచారం. బంధువుల నుంచి పనిమనుషుల వరకు.. అక్రమాస్తుల కేసులో శిక్షననుభవిస్తున్న శశికళ, ఆమె భర్త నటరాజన్, సోదరుడు దివాకరన్, మేనల్లుడు దినకరన్‌లతో పాటు సన్నిహితులు, వారి సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది, వారి బంధువులు, వారి వంట, పనిమనుషులు, జ్యోతిష్కుడు, వైద్యుడు, ఆడిటర్.. ఇలా ఆ కుటుంబంతో సంబంధమున్న వారి ఇళ్లల్లో, కార్యాలయాల్లో శుక్రవారం దాడులుచేశారు. రెండో రోజు 147 చోట్ల తనిఖీల్లో ఐటీ వర్గాలు నిమగ్నమయ్యాయి. పలుచోట్ల శశికళ, దినకరన్, దివాకరన్ మద్దతుదారులు దాడులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. శశికళ స్వగ్రామం మన్నార్గుడిలో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో ఆమె మద్దతుదారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ తనిఖీల్లో వెయ్యి కోట్ల మేరకు పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలు చిక్కినట్టు ఓ అధికారి పేర్కొన్నారు. అలాగే, మన్నార్గుడిలోని దివాకరన్ కళాశాలలో రూ.25 లక్షలు విలువగల నగలు, వెండి బయట పడ్డట్టు తెలిసింది. ప్రధానంగా పది బినామీ సంస్థల వివరాలతో పాటు, విదేశాల్లోని అనేక సంస్థల్లో శశికళ కుటుంబం పెట్టుబడులకు సంబంధించిన రికార్డులు, దస్తావేజుల్ని ఐటీ వర్గాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. -
తమిళనాట ఐటీ అటాక్!
సాక్షి, చెన్నై: దినకరన్‌తోపాటు అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న శశికళ, ఆమె సన్నిహితుల ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపుదాడులు చేసి.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ శాఖ చరిత్రలో తొలిసారిగా తమిళనాడు వ్యాప్తంగా గురువారం ఏకకాలంలో 187 చోట్ల ఈ దాడులు జరగటం చర్చనీయాంశమైంది. పుదుచ్చేరి, బెంగళూరుల్లోని వీరి బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు జరిగాయి. అన్నాడీఎంకే (శశికళ వర్గం) ఆధ్వర్యంలో నడుస్తున్న జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రిక కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. ‘ఆపరేషన్ క్లీన్ మనీ’లో భాగంగానే ఈ దాడులు జరిగినట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. జయలలిత మరణానంతరం శశికళ వర్గం ఆధ్వర్యంలో జయ టీవీ నడుస్తోంది. ఈ దాడుల్లో భారీగానే రికార్డులు బయటపడ్డట్టు సమాచారం. మన్నార్గుడిలో శశికళ సోదరుడు దివాకరన్ ఇంట్లో తనిఖీల అనంతరం అతన్ని అధికారులు విచారణకు తీసుకెళ్లినట్టు సమాచారం. ఉదయం ఆరుగంటల నుంచే.. జయలలిత నెచ్చెలి శశికళపై ఉన్న అక్రమాస్తులకు సంబంధించిన కేసులో బుధవారం తుది విచారణ పూర్తయింది. తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ క్రమంలో శశికళ, దినకరన్ కుటుంబాలే లక్ష్యంగా ఏకకాలంలో తమిళనాడు, పుదుచ్చేరి, బెంగళూరుల్లో ఐటీ దాడులు జరగడం తమిళనాట సంచలనం రేపింది. శశికళ భర్త నటరాజన్, సోదరుడు దివాకరన్, అక్క వనితామణి కుమారులు దినకరన్, భాస్కరన్, అన్న సుందరవనన్ కుమారుడు డాక్టర్ వెంకటేషన్, శశికళతో పాటు పరప్పన అగ్రహార జైల్లో ఉన్న ఇలవరసి కుమారుడు వివేక్ జయరామన్, కుమార్తె కృష్ణప్రియ, బంధువు కళియ పెరుమాల్, దివాకరన్ అల్లుడు డాక్టర్ విక్రమ్, స్నేహితులు అగ్రి రాజేంద్రన్, మన్నార్గుడి సుజయ్, సహాయకుడు వినాయకం, న్యాయవాది సెంథిల్, ఆడిటర్ చంద్రశేఖరన్, పారిశ్రామికవేత్త ఆర్ముగస్వామిలతో పాటు శశికళ, దినకరన్ మద్దతు అన్నాడీఎంకే నాయకులు, వారి బంధువులు, బినామీల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు సాగాయి. ఉదయం ఆరు గంటల నుంచి 1,800 మంది ఐటీ అధికారులు ఈ దాడుల్లో నిమగ్నమయ్యారు. వేర్వేరు బృందాలుగా తంజావూరు, తిరువారూర్, మన్నార్గుడి, కోయంబత్తూరు, నామక్కల్, తిరుచ్చి, ఈరోడ్, పుదుకోట్టై తదితర ప్రాంతాల్లో పోలీసు పహారాతో తనిఖీలు నిర్వహించారు. చెన్నైలోనే 20 చోట్ల తనిఖీలు చేశారు. గురువారం రాత్రి వరకు ఈ తనిఖీలు జరిగాయి. బెంగళూరులోని మురుగేష్‌పాళ్యలో ఉంటున్న శశికళ ఆప్తుడు, అన్నాడీఎంకే కర్ణాటక ఇన్చార్జ్ పుహళేంది ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. బెదిరింపులకు భయపడం: దినకరన్ తమను అణగదొక్కే లక్ష్యంతో కేంద్రం రచించిన వ్యూహాన్ని ఐటీ వర్గాలు అమలు చేస్తున్నాయని దినకరన్ మండిపడ్డారు. చిన్నమ్మను, తనను రాజకీయాల్లో లేకుండా చేయడం లక్ష్యంగా కుట్ర జరుగుతోందన్నారు. జయ అనారోగ్యం గుట్టు చిక్కినట్లేనా? జయలలితకు ఇష్టమైన జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రికల కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. ఈ తనిఖీల కారణంగా టీవీ ప్రత్యక్ష ప్రసారాలకు ఆటంకం కలగటంతో మీడియా వర్గాలనుంచి ఆగ్రహం వ్యక్తమైంది. జయ టీవీ కార్యాలయం తనిఖీల్లో జయ వైద్య చికిత్సల రికార్డులు దొరికినట్లు సమాచారం. దీంతోపాటు జయ టీవీకి అనుబంధంగా ఉన్న మిడాస్ డిస్టిలరీస్, జాజ్ సినిమా, పలు నగల దుకాణాలు, ఇతర కార్యాలయాల్లోనూ సోదాలు సాగాయి. జయకు అత్యంత ఇష్టమైన నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌లోనూ ఐటీ దాడులు సాగాయి. కొన్నిచోట్ల ఎవరికీ అనుమానం రాకుండా ‘శ్రీని వెడ్స్ మహి’ అన్న పెళ్లి వేడుక బోర్డు ఉన్న వాహనాల్లో అధికా రులు సోదాలు జరిగే ప్రాంతాలకు వచ్చా రు. అక్రమ పెట్టబడులు, నోట్లరద్దు అనం తరం భారీగా నగదు డిపాజిట్లు, బినామీ ఆస్తులపై ఆర్థిక ఇంటెలిజెన్స్ యూనిట్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే దాడు లు జరిగినట్లుగా అధికారులు చెప్పారు. -
ఛలో బెంగళూరు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఐదు రోజుల పాటు హాయిగా బంధువులతో గడిపిన అన్నాడీఎంకే నేత శశికళకు గురువారం బెంగళూరు జైలుకు పయనం అవుతున్నారు. బెంగళూరు జైలు అధికారులు మంజూరు చేసిన ఐదురోజుల పెరోల్ గడువు బుధవారంతో ముగియడంతో నిరాశ, నిస్పృహల నడుమ తిరుగుముఖం పడుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ బెంగళూరు జైల్లో ఏడునెలలుగా శిక్ష అనుభవిస్తున్నారు. ఆమె భర్త నటరాజన్ అనారోగ్య కారణాలతో ప్రస్తుతం చెన్నై గ్లోబల్ ఆస్పత్రిలోæ చికిత్స పొందుతుండగా, ఆయనకు ఇటీవలే అవయవ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. భర్తను పరామర్శించేందుకు 15 రోజుల పెరోల్‌కు ఆమె దరఖాస్తు చేసుకోగా ఈనెల 6వ తేదీన ఐదురోజుల పెరోల్ మంజూరైంది. దీంతో అదేరోజు కారులో ఆమె చెన్నైకి చేరుకున్నారు. తన బంధువు, తోటి ఖైదీ ఇళవరసి కుమార్తె కృష్ణప్రియ ఇంటిలో ఉంటూ భర్త ఉన్న ఆస్పత్రికి వెళ్లి వస్తున్నారు. చివరి రోజైన బుధవారం సైతం ఐదోసారి భర్తను చూసి వచ్చారు. నేతలపై నిరాశ జైలు గోడల మధ్యకు వెళ్లిన 233 రోజుల తరువాత పెరోల్ పుణ్యమాని బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టిన శశికళకు నిరాశే మిగిలింది. ఆప్తులు, బంధువుల నుంచి మంచి ఆదరణ లభించినా తాను పెంచి పోషించిన అన్నాడీఎంకే నేతల నుంచి కనీస పలకరింపు కొరవడిందనే బాధ ఆమె మెదడును తొలిచివేసింది. పెరోల్లో బస చేసిన ఇల్లు, భర్త ఉన్న ఆస్పత్రి మినహా మరెక్కడికీ వెళ్లరాదని, రాజకీయ జోక్యం అసలు పనికిరాదని వంటి కఠిన నిబంధనలు శశికళను కట్టిపడేశాయి. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది బహిష్కృత ఎమ్మెల్యేలు సైతం ఆమెను కలవలేకపోయారు. అధికారంలో ఉన్న నేతలు పూర్తిగా ముఖం చాటేశారు. మంత్రులెవరూ శశికళను కలవలేదని మంత్రి జయకుమార్ బుధవారం ప్రకటించారు. గురువారం ఉదయం బెంగళూరుకు పయనం అవుతున్నారు. పెరోల్ నిబంధనల ప్రకారం గురువారం సాయంత్రం 5 గంట ల్లోగా శశికళ జైలుకు చేరాల్సి ఉంది. -
చిన్నమ్మ వద్దు..‘అమ్మ’నే శాశ్వతం
-
చిన్నమ్మ వద్దు.. ‘అమ్మ’నే శాశ్వతం
► పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ తొలగింపు ► జయ శాశ్వత ప్రధాన కార్యదర్శి ► అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో నిర్ణయం ► ప్రభుత్వాన్ని కూలుస్తా: దినకరన్ సాక్షి, చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీ నుంచి ‘చిన్నమ్మ’ శశికళ, ఆమె కుటుంబీకులను దూరం చేసే ప్రక్రియలో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు మరింత వేగం పెంచారు. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను మంగళవారం తొలగించారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉంటూ పార్టీలో శశికళ చేపట్టిన నియామకాలన్నీ చెల్లవని ఏఐఏడీఎంకే స్పష్టం చేసింది. గతంలో శశికళ తన మేనల్లుడు దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించడం తెలిసిందే.శశికళ చేసిన నియామకాలు చెల్లవని పార్టీ తీర్మానించడంతో దినకరన్‌ను నియామకం కూడా రద్దైనట్లైంది. దినకరన్ సృష్టించిన అడ్డంకులను అధిగమించి, హైకోర్టు అనుమతితో కట్టుదిట్టమైన భద్రత నడుమ చెన్నై నగరంలో పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. అన్నాడీఎంకేకు శాశ్వత అధ్యక్షుడు ఎంజీ రామచంద్రన్, శాశ్వత ప్రధాన కార్యదర్శి ‘అమ్మ’ జయలలితేననీ, వారి స్థానాలను మరెవ్వరితోనూ భర్తీ చేయకూడదంటూ సమావేశంలో పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. కొత్తగా పార్టీలో కో–ఆర్డినేటర్, జాయింట్ కో–ఆర్డినేటర్ పదవులను సృష్టించి వాటిని వరసగా పన్నీర్‌సెల్వం, పళనిస్వామిలకు కేటాయించారు. వచ్చే ఎన్నికల వరకు వారు ఈ పదవుల్లో కొనసాగుతారు. కొత్త నిబంధనల ప్రకారం పార్టీకి సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం ఈ పదవుల్లోని వారికి ఉంటుంది. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ అధ్యక్షతన పళని, పన్నీర్ల నేతృత్వంలో సర్వసభ్య సమావేశం జరిగింది. పార్టీలో శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్‌ల ఆధిపత్యాన్ని నిలువరించడమే లక్ష్యంగా పళని, పన్నీర్ల వర్గాలు ఇటీవల ఏకమైన విషయం తెలిసిందే. పళని మాట్లాడుతూ అన్నాడీఎంకేను నిర్వీర్యం చేయడం ఎవరి తరం కాదనీ, వెయ్యి మంది దినకరన్‌లు వచ్చినా ఏమీ చేయలేరని అన్నారు. జయ ఉన్న సమయంలో ఏయే కట్టుబాట్లు పార్టీలో అమల్లో ఉన్నాయో వాటితోనే ముందుకు సాగుతామని పన్నీర్ పేర్కొన్నారు. సమావేశంలో మొత్తం 14 తీర్మానాలు చేశారు. మదురైలో దినకరన్ మంతనాలు శశికళను పదవి నుంచి తొలగించడంతో ఆమె మద్దతుదారులు పలు చోట్ల ఆందోళనకు దిగారు. పళని, పన్నీర్ దిష్టిబొమ్మల్ని దగ్ధం చేశారు. మరోవైపు సర్వసభ్య సమావేశం సాగుతుండగానే దినకరన్ మదురైలో తన వర్గం వారితో మంతనాలు సాగించారు. సర్వసభ్య సమావేశాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన శశికళ ఏర్పాటు చేయాల్సి ఉందనీ, కాబట్టి పళని, పన్నీర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం చెల్లదని దినకరన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు సీఎం మార్పు కోసం ప్రయత్నించాననీ, ఇకపై ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా పనిచేస్తానని దినకరన్ శపథం చేశారు. త్వరలోనే శశికళ ఆదేశాలతో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తామంటూ ప్రకటించారు. మంగళవారం నాటి సర్వసభ్య సమావేశంలో తీసుకునే నిర్ణయాలనే తీర్పు సమయంలో పరిగణనలోకి తీసుకుంటామని మద్రాసు హైకోర్టు చెప్పడం తెలిసిందే. శశికళను పదవి నుంచి తప్పించడం చెల్లుతుందో లేదో హైకోర్టే తన తీర్పులో చెబుతుందని దినకరన్ అన్నారు. కాగా, మైసూరులోని ఓ రిసార్ట్‌లో ఉన్న దినకరన్ వర్గం ఎమ్మెల్యేల్లో ఒకరు... తాము అక్కడ బందీలుగా ఉన్నామంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు సీఎం పళనిస్వామి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునేలా విశ్వాస పరీక్ష పెట్టేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ ప్రతిపక్ష డీఎంకే నేత స్టాలిన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. -
తమిళ రాజకీయాల్లో రోజుకో మలుపు
-
శశికళ, దినకరన్‌లపై వేటు
► సీఎం పళని నిర్ణయం ► పార్టీ భేటీకి 30 మంది ఎమ్మెల్యేల గైర్హాజరు సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేపుతున్నాయి.తాజాగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌లను పార్టీ నుంచి బహిష్కరిస్తూ సీఎం పళని స్వామి అధ్యక్షతన సోమవారం జరిగిన అన్నాడీఎంకే సమావేశంలో నిర్ణయించారు. వారి అధీనంలోని నమదు ఎంజీఆర్ దినపత్రిక, జయ టీవీని స్వాధీనం చేసుకోవాలని, ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేందుకు వచ్చేనెల 12న పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. ఈ భేటీకి 113 మంది ఎమ్మెల్యేలకుగానూ 83 మంది మాత్రమే హాజరయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్ని ఎన్నికల సం ఘం గుర్తించలేదని, అందువల్ల ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ నియామకం చెల్లదని పళని చెప్పారు. ఢిల్లీకి పళని, దినకరన్ వర్గాలు సీఎం పళని, దినకరన్ వర్గాల పంచాయతీ ఢిల్లీకి చేరింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకంపై ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకునేందుకు సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, ఐదుగురితో కూడిన మంత్రుల బృందం మంగళవారం ఈసీని కలవనుంది. పళని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు మంగళవారం రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. కాగా, జూలై 18న అసెంబ్లీలో నిషేధిత గుట్కాల్ని ప్రదర్శిం చారంటూ ప్రతిపక్ష నేత స్టాలిన్ సహా 21 మంది డీఎంకే ఎమ్మెల్యేలకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసుల్ని జారీచేశారు. -
తమిళనాట పళని ప్రభుత్వం నిలిచేనా?
-
జైలు బయట శశికళ షికార్లు!
ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న వీడియో సాక్షి, బెంగళూరు: అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళ(61)కు రాజభోగాలు అందుతున్నాయని ఫిర్యాదు చేసిన జైళ్ల శాఖ మాజీ డీఐజీ రూప.. అందుకు సంబంధించిన ఆధారాలను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు సమర్పించారు. వాటిలో ఓ వీడియో తాజాగా ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో సల్వార్ కమీజ్ ధరించిన శశికళ, ఆమె బంధువు ఇళవరసితో కలసి షాపింగ్ బ్యాగులతో జైలులోకి వస్తున్నారు. ఆ సమయంలో ముగ్గురు పురుష సెంట్రీలు కూడా అక్కడ ఉన్నారు. జైలు నిబంధనల ప్రకారం మహిళా ఖైదీల బ్యారక్ వద్ద పురుష వార్డన్లు, సెంట్రీలు కానీ ఉండకూడదు. అదే సమయంలో మహిళా సూపరింటెండెంట్ అధికారి కూడా శశికళ, ఇళవరసిలతోపాటు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే శశికళ బయటి నుంచి వస్తున్నారనే అనుమానించాల్సి ఉంటుందని ఓ పోలీస్ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. జైల్లో శశికళ రాజభోగాలు పొందిన వైనంపై మరో 74 ఆధారాలు కూడా ఏసీబీకి చేరాయి. అయితే ఈ వీడియోను ఏ రోజు రికార్డు చేశారన్న అంశంపై స్పష్టత లేదు. మరోవైపు ఈ ఘటన గురించి తనకెలాంటి సమాచారం లేదని జైలు డైరెక్టర్ జనరల్ నహర్ సింగ్ మేఘరిఖ్ తెలిపారు. -
పళని ప్రభుత్వం నిలిచేనా?
అవిశ్వాస తీర్మానంపై స్టాలిన్ యోచన ► కూల్చివేత తప్పదు: శశికళ వర్గం హెచ్చరిక ► మ్యాజిక్ ఫిగర్‌కు 13 సీట్ల దూరంలో సర్కారు ► శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలోని రెండు వర్గాల విలీనం పళనిస్వామి ప్రభుత్వానికి సంతోషం కంటే చిక్కులు తెచ్చిపెట్టనుంది. ఓవైపు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తన వర్గం (28 మంది)ఎమ్మెల్యేలతో బయటకు వచ్చే పరిస్థితి నెలకొనడం, ప్రధాన ప్రతిపక్షనేత స్టాలిన్ అవిశ్వాస తీర్మాన సన్నాహాల్లో ఉండటంతో అన్నాడీఎంకే ప్రభుత్వం పూర్తికాలం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జయలలిత కన్నుమూసినప్పటినుంచీ అధికారం కోసం డీఎంకే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అటు శశికళ జైలుకెళ్లినప్పటినుంచీ పార్టీ, ప్రభుత్వంపై పెత్తనం కోసం టీటీవీ దినకరన్ పాకులాడుతున్నారు. ఈ నేపథ్యంలో శరవేగంగా మారుతున్న తమిళ రాజకీయాల్లో తర్వాత ఏం జరగనుందనేది ఆసక్తి రేపుతోంది. దినకరన్ వర్గం రాజీనామా చేస్తే! తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్య 234 (జయలలిత మరణంతో ఆర్కేనగర్ ఖాళీగా ఉంది). ఇందులో ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. జయ మరణం తర్వాత పన్నీర్ వర్గం విడిపోవటంతో జరిగిన విశ్వాస పరీక్షలో పళనిస్వామి 122 సీట్లతో గట్టెక్కారు. ఇందులో పళనిస్వామి వద్ద 94 మంది ఎమ్మెల్యేలుండగా.. దినకరన్, దివాకరన్ (20+8 మంది సభ్యులు)లు మద్దతు తెలిపారు. అయితే తాజా విలీనం, శశికళను పార్టీనుంచి బహిష్కరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలతో దినకరన్, దివాకరన్ అసంతృప్తితో ఉన్నారు. వీరు మంగళవారం గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ కానున్నారు. ఒకవేళ వీరందరితో దినకరన్ రాజీనామా చేయిస్తే.. (చెన్నైలో ఈ చర్చ జరగుతోంది) మ్యాజిక్ ఫిగర్ 104కు తగ్గి.. పన్నీర్, పళనిలకు (94+11=105) మేలు జరుగుతుంది. అయితే, ఇన్నిరోజులు కష్టపడీ దినకరన్ ఇంత సులువుగా పళనికి అవకాశమిస్తారా అనేది ప్రశ్నార్థకమే. మద్దతు వెనక్కి తీసుకుంటే? ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఈ 28 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌కు వెల్లడిస్తే.. పళని సర్కారు మైనారిటీలో పడుతుంది. అప్పుడు స్టాలిన్ పెట్టే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వీరు ఓటేస్తే.. ప్రభుత్వం కూలటం ఖాయమే. అసెంబ్లీలో డీఎంకేకు 89, కాంగ్రెస్‌కు 8 మంది ఎమ్మెల్యేలుండగా ముస్లింలీగ్‌కు ఒక సభ్యుడున్నాడు. స్టాలిన్‌కు దినకరన్ వర్గం మద్దతిచ్చినట్లయితే.. ఈ కూటమి బలం (89+8+1+28) 126కు చేరుతుంది. అయితే.. అన్నాడీఎంకేను ఓడించేందుకు దినకరన్ వర్గం డీఎంకేతో చేతులు కలుపుతుందా అనేదానిపై చర్చ జరుగుతోంది. స్టాలిన్, దినకరన్ లక్ష్యం పళని ప్రభుత్వంపై వ్యతిరేకతే కనుక వీరిద్దరూ కలవటంలో తప్పేముందనే వాదనా చెన్నై రాజకీయాల్లో వినబడుతోంది. వారం రోజుల క్రితం స్టాలిన్ లండన్ వెళ్లినపుడు దినకరన్ దూత ఆయన్ను కలసి చర్చించినట్లు తమిళ పత్రికల్లో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రభుత్వ భవిష్యత్తు డీఎంకే చేతుల్లోకి వెళ్లిపోయింది. -
సెంట్రల్ జైలు బయట శశికళ షికార్లు!
-
సిస్టర్’ శశికళ
► చిన్నమ్మకు అవే మర్యాదలు ► సమాచార హక్కు చట్టంతో బట్టబయలు ► సామాజిక కార్యకర్త నరసింహమూర్తి సుప్రీం కోర్టులో పిటిషన్ తమిళనాడు ప్రజలకు ఒకప్పుడు శశికళగా తెలుసు. జయలలిత కన్నుమూసిన తరువాత చిన్నమ్మగా పరిచయం. బెంగళూరు జైలు కెళ్లిన నాటి నుంచి ఖైదీ శశికళగా నాలుగేళ్లపాటూ స్థిరమైన నామధేయం. మరి ఈ సిస్టర్ శశికళ ఎవరబ్బా అనుకుంటున్నారా. ఆమె మరెవరో కాదు బెంగళూరు జైలు అధికారుల చేత సిస్టర్ అంటూ ఎంతో గౌరవంగా పిలిపించుకునే మన శశికళే. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ప్రజల చిన్నమ్మ కర్ణాటక పౌరుల (జైలు అధికారులు)కు సోదరి అయ్యారు. సాధారణ ఖైదీ శశికళ అసాధారణ ఖైదీగా సేవలు అందుకోవడంతోపాటు జైలు అధికారులు, సిబ్బందితో సిస్టర్ అని పిలిపించుకునే స్థాయికి ఎదిగారని బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త నరసింహమూర్తి ఈ వివరాలను బైటపెట్టారు. అన్నాడీఎంకే (అమ్మ) ప్రధాన కార్యదర్శి శశికళ జైలు జీవితం గురించి సమాచార హక్కు చట్టం ద్వారా ఆయన సేకరించిన వివరాలను తమిళ సాయంకాల దినపత్రిక ‘తమిళ్ మురసు’ సోమవారం ప్రచురించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.సాధారణ ఖైదీగా జీవనం గడపాల్సిన శశికళ జైలు నిబంధనలకు ఏ మాత్రం లోబడకుండా వ్యవహరిస్తున్నట్లు తాను సమాచారం సేకరించానని ఆయన తెలిపారు. ప్రత్యేక దుస్తులు, ఐదు గదుల్లో ప్రత్యేక వసతులు, ప్రత్యేక వంటగది, పనివారలు, బయట నుంచి మందులు, కాళ్లు, చేతులు మసాజ్ చేసేందుకు పనివారు.. ఇలా అనేక సౌకర్యాలు పొందుతున్నట్లు కర్ణాటక జైళ్లశాఖ మాజీ డీఐజీ రూప లిఖితపూర్వక ఫిర్యాదుచేసిన సంగతిని ఆయన గుర్తుచేశారు. జైళ్లశాఖ ఉన్నతాధికారులకు శశికళ రూ.2 కోట్లు ముడుపులు చెల్లించి ఆ సౌకర్యాలు పొందుతున్నట్లుగా డీఐజీ చేసిన ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం రిటైర్డు ఐఏఎస్ వినయ్‌కుమార్ విచారణ జరుపుతున్నా శశికళ దర్జా జీవితాన్ని కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. జైలు నిబంధనల ప్రకారం శిక్ష అనుభవిస్తున్న ఖైదీ నెలకు రెండుసార్లు మాత్రమే ములాఖత్ కింద తనకోసం వచ్చేవారితో మాట్లాడవచ్చునని ఆయన అన్నారు. అయితే గత నెల 1, 5, 6, 11, 28, 31 ఇలా ఆరుసార్లు శశికళ తనవారిని కలుసుకున్నారని చెప్పారు. అలాగే ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఖైదీలను కలుసుకోవాల్సి ఉంది. అయితే శశికళను కలుసుకున్న వారు సాయంత్రం 6 గంటలు దాటినా ఆమెతోనే ఉన్నారు. గతనెల 11వ తేదీన షకీలా, వివేక్, కీర్తన, జయ, వెట్రివేల్, తమిళ్‌సెల్వన్, నాగరాజ్ మొత్తం ఏడుగురు శశికళతో మాట్లాడారని, వారిలో నలుగురు బంధువులమని పేర్కొనగా, మిగిలిన ముగ్గురు ఏమీ స్పష్టం చేయకుండానే కలుసుకోవడం గమనార్హమని ఆయన తెలిపారు. అలాగే జూలై 5వ తేదీన డాక్టర్ వెంకటేష్, టీటీవీ దినకరన్, పళనివేల్, ఎమ్మెల్యే కేవీ రామలింగం, తమిళ్‌మగన్ హుస్సేన్, వెట్రివేల్ తదితరులు సందర్శకుల సమయం దాటిపోయిన తరువాత కూడా గంటల తరబడి శశికళతో కూర్చుని మాట్లాడుకున్నారని చెప్పారు. నెలకు ఇద్దరు చొప్పున శశికళ జైలుకెళ్లిన ఈ ఏడు నెలల్లో 14 మందికి గానూ 52 మందితో ఆమె ములాఖత్ అయ్యారని ఆయన చెప్పారు. గత నెల 28వ తేదీన ఒక ఖైదీ తండ్రి చనిపోగా ఈవిషయాన్ని చెప్పేందుకు ఖైదీ భార్య, మరో మహిళ ఉదయం 8 గంటలకు రాగా సాయంత్రం 5 గంటలకు వరకు జైలు అధికారులు అనుమతించలేదని ఆయన తెలిపారు. అంతేగాక అనేక హామీ పత్రాలు, తనిఖీలు జరిగిన తరువాతనే వారిని ఆనుమతించారని తెలిపారు. ధనవంతులకు అనేక వెసులుబాట్లు, పేదలకు కఠిన నిబంధనలా అని నరసింహమూర్తి ప్రశ్నించారు. తన కోసం వచ్చే సందర్శకులతో గంటల తరబడి మాట్లాడుతూ జైలులో ఆమె దర్బార్ నిర్వహిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. సాధారణ ఖైదీగా ఉన్న శశికళను సిస్టర్ అని మర్యాదగా సంబోధిస్తూ సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు సమాచార హక్కు చట్టం కింద సేకరించిన వివరాలను సాక్ష్యాధారాలతో సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు ఆయన తెలిపారు. -
క్షమాపణ చెప్పకపోతే రూ.50 కోట్లకు దావా
డీఐజీ రూపకు కర్ణాటక జైళ్ల శాఖ మాజీ డీజీపీ లీగల్ నోటీసులు సాక్షి, బెంగళూరు: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అక్రమాల వివాదం మరో మలుపు తిరిగింది. రాష్ట్ర జైళ్ల శాఖ మాజీ డీజీపీ సత్యనారాయణరావ్ ప్రస్తుత బెంగళూరు నగర ట్రాఫిక్ కమిషనర్, జైళ్లశాఖ మాజీ డీఐజీ రూప మౌద్గిల్‌కి బుధవారం లీగల్ నోటీసులు పంపించారు. తనపై చేసిన ఆరోపణలకు మూడ్రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే రూ.50 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. సెంట్రల్జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళ నుంచి రూ.2 కోట్ల ముడుపులు తీసుకుని ప్రత్యేక సౌకర్యాలు కల్పించారని సత్యనారాయణరావ్పై రూప ఇటీవల ఆరోపణలు చేయడం, సర్కారుకు నివేదికలు పంపడం తెలిసిందే. -
చెర మారేనా?
♦ చిన్నమ్మ చుట్టూ చిక్కులు ♦ జయకుమార్ నోట బహిష్కృత మాట సాక్షి, చెన్నై: లగ్జరీ జీవితం గుట్టురట్టుతో చిన్నమ్మ శశికళను పరప్పన అగ్రహార చెర నుంచి మరో చెరకు మార్చే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఆమెను చిక్కులు చుట్టుముడుతున్న సమయంలో తమకేంటి సంబంధం అంటూ ఆర్థిక మంత్రి జయకుమార్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. శశికళ, దినకరన్‌లను ఎప్పుడో బహిష్కరించామని, ఇందులో ఎలాంటి మార్పులేదని ఆయన ఆదివారం మీడియ ముందు స్పష్టం చేశారు. తమిళనాడులోనే కాదు, ఎక్కడున్నా, తమ రూటే సెపరేటు అన్నట్టుగా చిన్నమ్మ శశికళ లగ్జరీ వ్యవహారం పరప్పన అగ్రహార చెరలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళకు రాచమర్యాదలు అందుతున్నట్టుగా వచ్చిన సంకేతాలు కర్ణాటకలోనే, తమిళనాట కూడా రాజకీయంగా చర్చకు దారి తీసింది. కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీగా రూప స్వయంగా వివరాలను బయట పెట్టడం , ఆధారాలు ఉన్నట్టు ప్రకటించడంతో విచారణ కమిషన్ రంగంలోకి దిగింది. ఆదివారం విచారణ సాగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. పరప్పన అగ్రహార చెరలో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగినట్టు విచారణలో వెలుగు చూసినట్టు సమాచారం. అదే సమయంలో డీఐజీ రూప మరో లేఖను విడుదల చేయడంతో చిన్నమ్మను చిక్కులు చుట్టుముట్టాయి. అదే సమయంలో ఆ చెరలో ఉన్న పలువురు ఖైదీలను బళ్లారి చెరకు మార్చడంతో, ఇక చిన్నమ్మ వంతు రానున్నదన్న సంకేతాలు వెలువడ్డాయి. ఆమెను కూడా జైలు మార్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అయితే, కర్ణాటకలోని మరో జైలుకు మార్చేనా లేదా, మరేదేని కీలక నిర్ణయం తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే. ఇక, చిన్నమ్మను చెన్నై పుళల్‌జైలుకు తీసుకొచ్చే రీతిలో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏదేని వ్యూహాన్ని రచించేనా అన్న చర్చ బయలు దేరింది. అయితే, ఆ దిశగా ప్రయత్నాలు అనుమానంగా మారింది. ఇందుకు అద్దం పట్టే రీతిలో ఆర్థిక మంత్రి జయకుమార్ ఓ మీడియాతో మాట్లాడుతూ స్పందించారు. జయకుమార్ నోట అదే మాట: శశికళ, దినకరన్‌లు జైలుకు వెళ్లిన సమయంలో ఏ›ప్రిల్‌లో మంత్రి వర్గం సమావేశమైనట్టు ఆర్థిక మంత్రి జయకుమార్ వ్యాఖ్యానించారు. ఇందులో మంత్రులందరూ మూకుమ్మడిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. శశికళ, దినకరన్‌లను బహిష్కరిస్తూ నిర్ణయాన్ని అప్పట్లో తీసుకున్నామని, ఇందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. దివంగత నేతలు ఎంజీయార్, అమ్మ జయలలిత చేతుల మీదుగా మహాశక్తిగా అవతరించిన అన్నాడీఎంకేను రక్షించుకుంటామని, ఎవరి గుప్పెట్లోకి చేరనివ్వకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తామన్నారు. శశికళ, దినకరన్‌లకు పార్టీతో, ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని, తామెవ్వరి కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా చెర మార్పు విషయంగా స్పందించడం గమనార్హం. అయితే, అటవీ శాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్‌తో పాటు మరికొందరు చిన్నమ్మను చిక్కులు చుట్టు ముట్టడంపై ఆవేదన వ్యక్తం చేయడం ఆలోచించాల్సిందే. -
చిక్కుల్లో చిన్నమ్మ
⇒ క్రైం సినిమాలా లంచంపై కథనం ⇒ ఆరునెలల లగ్జరీల ఖర్చు రూ.15 కోట్లని ప్రచారం ⇒ సీబీఐ విచారణకు దీప డిమాండ్ సీఎం కాబోయి సెంట్రల్ జైలు ఖైదీగా మారిన అన్నాడీఎంకే (అమ్మ) ప్రధానకార్యదర్శి శశికళను ఇంకా చెడ్డరోజులు వెంటాడుతున్నాయి. బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో గుట్టుగా కాలం వెళ్లదీస్తున్న చిన్నమ్మకు కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూప రూపంలో చిక్కులు వచ్చిపడ్డాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జైలుకు వెళ్లిన శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు సాధారణ గదులు, ఖైదీలందరితో సమానంగా ఆహారం అందజేశారు. డీజీపీ సత్యనారాయణరావు తొలిరోజుల్లో చాలా కఠినంగా వ్యవహరించారు. బైట నుంచి ఆహరం, మందులు వస్తున్నట్లు తెలుసుకుని మండిపడ్డారు. ఇదే విధానం కొనసాగితే నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తయ్యేనాటికి తమ వారు జీవచ్చవాల్లా మారిపోవడం ఖాయమని ఆందోళన చెందిన ఇళవరసి కుమారుడు వివేక్ డీజీపీని మచ్చిక చేసుకునేందుకు అన్నాడీఎంకే బెంగళూరు శాఖ ప్రముఖ నేతను డీజీపీపై ప్రయోగించాడు. చాలా స్ట్రిక్టు ఆఫీసరుగా ప్రచారంలో ఉండే జైళ్లశాఖ ఉన్నతాధికారి ఒకరు స్నేహితులతో కలిసి బెంగళూరు, హైదరాబాద్, దుబాయ్‌లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు తెలుసుకున్నారు. వీరి ద్వారా జైలు అధికారిని లైన్లో పెట్టేందుకు హైదరాబాద్‌లో తొలిదశ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో బెంగళూరుకు చెందిన పెద్ద బిల్డర్ కూడా పాల్గొన్నాడు. చర్చల్లో పురోగతి ఫలితంగా బెంగళూరు–హొసూరు రహదారిలో ఉన్న ఎలక్ట్రానిక్ సిటీలోని రూ.70 లక్షల విలువైన ఒక ఫ్లాట్‌ను, పెద్ద మొత్తంలో నగదును అందజేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ ముగిసిన వెంటనే జైల్లో శశికళ స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించినట్లు సమాచారం. ప్రత్యేక వంటగది, చెన్నై పోయెస్‌గార్డెన్ నుంచి వంటపని వారు, శశికళ కాళ్లు, చేతులకు మసాజ్ చేసేందుకు కొందరు వ్యక్తులు యథేచ్ఛగా జైలులోపలికి, బైటకు రాకపోకలు జరిగాయి. రెండో దశ చర్చలకు జైలు తరఫున దుబాయ్ నుంచి వ్యక్తులు వచ్చారు. బెంగళూరు శివార్లలోని ఒక ఫాంహౌస్‌లో చర్చలు ముగిసిన తరువాత హైదరాబాద్‌లోని ఒక తోటలో భారీ మొత్తం ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీల కోసం జైళ్ల అధికారి హైదరాబాద్–బెంగళూరు మధ్య అనేకసార్లు విమాన ప్రయాణం చేశారని, విమాన ఖర్చులు సైతం శశికళ తరఫు వ్యక్తులే భరించినట్లు సమాచారం. జైళ్ల నిబంధనలు తోసిరాజని.. జైళ్లలో ఖైదీలు పాటించాల్సిన నిబంధనలను శశికళ పూర్తిగా ధిక్కరించినట్లు అక్కడి రికార్డులే చెబుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో వందకు పైగా ములాఖత్‌లు, 50కి పైగా వివిధరంగాలకు చెందిన వారితో ములాఖత్‌లు, జైలు అధికారుల వాహనాల్లోనే బైటకు వెళ్లిరావడం సమాచార హక్కు చట్టం కింద వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల జైలు శిక్షను పునఃపరిశీలించాలని శశికళ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉండగా, జైల్లో లగ్జరీ జీవితం కోసం రూ.15 కోట్ల వరకు ఖర్చుచేసినట్లుగా జరుగుతున్న ప్రచారం చిన్నమ్మను మరింత చిక్కులో పడేసింది. శశికళను రాజకీయంగా అణిచివేయాలని కొందరు వ్యక్తులు పన్నుతున్న కుట్రల ఫలితంగా ఆమె మెడపై అనేక సమస్యల కత్తులు వేలాడుతున్నాయి. అంతేగాక సదరు ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం విచారణ అధికారిని నియమించడం, తన వద్ద వీడియోలతో కూడిన ఆధారాలు ఉన్నాయని డీఐజీ రూప ప్రకటించడం శశికళను, ఆమెకు సహకరించిన వారికి వణుకు పుట్టిస్తోంది. సీబీఐ విచారణ జరపాలి: దీప శశికళపై డీఐజీ రూప చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని అన్నాడీఎంకే జే దీప వర్గం (ఎంజీఆర్ అమ్మ దీప పేరవై) ప్రధాన కార్యదర్శి దీప శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సందర్భం వచ్చినçప్పుడు కర్ణాటక సీఎంను కలుసుకుంటానని ఆమె తెలిపారు. -
నేను ఎలాంటి తప్పు చేయలేదు: డీఐజీ రూప
బెంగళూరు : తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనను టార్గెట్ చేయడం సరికాదని జైళ్ల డీఐజీ రూప మౌద్గిల్ అన్నారు. ఆమె శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ నివేదికలో తాను చెప్పిన అన్ని విషయాలకు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. తాను ఎక్కడా ప్రోటోకాల్ ఉల్లంఘించలేదని డీఐజీ రూప స్పష్టం చేశారు. సర్వీస్ రూల్స్ అందరికీ వర్తించాలని, తన ఒక్కదానికే కాదని అన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘిస్తే అందరిపై చర్యలు తీసుకోవాలని రూప వ్యాఖ్యానించారు. ‘జైళ్ల శాఖ డీఐజీగా నేను జూన్ 23న బాధ్యతలు స్వీకరించాను. విధుల్లో భాగంగా ఈనెల 10న నేను పరప్పన జైలుకు వెళ్లాను. ఆ తరువాతి రోజే మీ (సత్యనారాయణ) కార్యాలయం నుంచి నాకు మెమో వచ్చింది. అందులో ‘మిమ్ములను పరప్పన అగ్రహార జైలుకు ఎవరు వెళ్లమన్నారు’ అని ప్రశ్నించారు. నా అధికార పరిధి ప్రకారం జైళ్లకు వెళ్లి తనిఖీ చేయడం, తప్పు చేసిన సిబ్బంది నుంచి వివరణ కోరడం కూడా నా విధి. నా విధులను సక్రమంగా నిర్వర్తిస్తుంటే మీరు మెమో జారీ చేయడం అత్యంత శోచనీయం’ అని ఘాటుగా పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శశికళ, స్టాంపుల కేసు దోషి తెల్గీ నుంచి జైళ్ల శాఖ ఐజీపీ సత్యనారాయణరావు ముడుపులు తీసుకుని రాచమర్యాదలు చేస్తున్నారని ఆ శాఖ డీఐజీ రూప చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని అన్నారు. అయితే డీఐజీ రూప సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకంగా డీజీపీ సత్యనారాయణ జైళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని పలుమార్లు మీడియా ముందు బహిరంగంగా మాట్లాడటం తగదని అన్నారు. ఈ విషయంపై హోం శాఖ కార్యదర్శితో చర్చించి పరప్పనజైలు వ్యవహారంపై క్షుణ్ణంగా విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా దావణగెరె స్వస్థలమైన జైళ్ల డీఐజీ రూప ప్రతిభావనిగా పేరు తెచ్చుకున్నారు. పనిచేసిన ప్రతిచోటా ఆమె సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు. 2000లో సివిల్స్‌లో 43వ ర్యాంక్ సాధించి ఐపీఎస్‌ను ఎంచుకున్నారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందారు. షార్ప్ షూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆ బ్యాచ్‌లో ఓవరాల్‌గా 5వ స్థానంలో నిలిచారు. పోలీసు శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను 2016 జనవరి 26న రాష్ట్రపతి పోలీసు పతకాన్ని అందుకున్నారు. ఓ కేసులో కోర్టు తీర్పు ప్రకారం అప్పటి మధ్యప్రదేశ్ సీఎం ఉమాభారతీని ఎస్పీ హోదాలో అరెస్టు చేశారు. ఆమె బెంగళూరు డీసీపీగా ఉండగా వీవీఐపీల భద్రతా సిబ్బందిని తొలగించి లా అండ్ ఆర్డర్ విభాగానికి మార్చడం అప్పట్లో సంచలనం సృష్టించింది. డీసీపీ (సిటీ ఆర్మ్డ్ రిజర్వ్) గా విధులు నిర్వర్తించే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా యెడ్యూరప్ప ఓ ఊరేగింపులో ఎక్కువ వాహనాలను వినియోగించడాన్ని గుర్తించిన రూప వెంటనే వాటిని తొలగించి వార్తల్లోకెక్కారు. -
శశికళ తరలింపునకు రంగం సిద్ధం!
బెంగళూరు : అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళను అక్కడ నుంచి తరలించేందుకు రంగం సిద్ధం అవుతోంది. జైళ్లశాఖ అధికారులు ఆమెను మరో జైలుకు మార్చే యోచనలో ఉన్నారు. కాగా శశికళ తనకు కారాగారంలో సకల సౌకర్యాలు లభించేందుకు వీలుగా రూ. 2 కోట్లు జైలు అధికారులకు లంచం చెల్లించిందని, ఈ వ్యవహారంలో కర్ణాటక జైళ్లశాఖ డీజీపీ హెచ్ఎన్ సత్యనారాయణరావుకు సైతం ముడుపులు అందాయని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. జైళ్లశాఖ డీఐజీ రూప ఈ మేరకు తన నివేదికలో సంచలన విషయాలు వెల్లడించడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. మరోవైపు డీఐజీ రూప గురువారమిక్కడ మాట్లాడుతూ.. తన నివేదికలో చెప్పిన ప్రతి విషయం వాస్తవమేనన్నారు. నివేదికలో పొందుపరిచిన ప్రతి అంశానికి తాను కట్టుబడి ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. తనపై ఎవరి ఒత్తిడి లేదని, విచారణలో అన్ని విషయాలు వెలుగు చూస్తాయని డీఐజీ రూప పేర్కొన్నారు. ఇక తనపై వచ్చిన ఆరోపణలను జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణ కొట్టిపారేశారు. శశికళకు నిబంధనలకు విరుద్ధంగా జైలులో ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని తెలిపారు. -
శశికళకు ప్రత్యేక వంటగది!
సాక్షి, బెంగళూరు: అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక వంటగది వసతి కల్పించారా? ఇంకా అక్కడ అనేక అక్రమాలు జరుగుతున్నాయా? కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూప ఆ శాఖ డీజీపీ సత్యనారాయణకు జైలులోని అక్రమాలపై లేఖ రాయడంతో ఈ విషయాలు వెలుగు చూశాయి. ఆరుపేజీలతో కూడిన ఈ లేఖ జైళ్లశాఖలో కలకలం రేపుతోంది. శశికళకేగాక పలువురు ఖైదీలకూ ఇదే విధమైన వసతి లభిస్తోందని రూప తన లేఖలో తెలిపారు. శశికళకు జైల్లో అక్రమంగా సౌకర్యాలు కల్పించినందుకు ఒక జైళ్లశాఖ ఉన్నతాధికారికి రూ.2 కోట్ల ముడుపులు దక్కినట్లు తేలింది. -
చిన్నమ్మ ఉపదేశం
► ఐక్యత కోసం బంధువులకు లేఖాస్త్రం ► ఒకే వేదికగా దినకరన్, దివాకరన్ ► ఆధిపత్యానికి పళని పావులు ► దినకరన్‌కు చెక్ పెట్టే యోచన సాక్షి, చెన్నై: మనం.. మనం తన్నుకుంటే.. లాభం కమలం పెద్దలకు, సీఎం పళనికి మాత్రమేనన్న విషయాన్ని గ్రహించాలని బంధు జనానికి, కుటుంబీకులకు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, చిన్నమ్మ శశికళ లేఖాస్త్రం సంధించి ఉన్నారు. ఐక్యతతో ముందుకు సాగాలన్న శశికళ పిలుపునకు ఆమె సోదరుడు దివాకరన్ స్పందించినట్టున్నారు. దినకరన్‌తో కలిసి ముందుకు సాగేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక.. దినకరన్‌కు చెక్ పెట్టడం లక్ష్యంగా సీఎం పళనిస్వామి పావులు వేగంగానే కదుపుతున్నారు. అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాల ఎపిసోడ్ రాజకీయ ఉత్కంఠను రేపుతోంది. ఓవైపు ఇంటిపోరు, మరోవైపు ముడుపుల వ్యవహారం వెరసి సీఎం పళని స్వామి ఇరకాటంలో పడే పరిస్థితి. అయితే, రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో కేంద్రానికి మద్దతిచ్చే యోచనతో పళని దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని తనకు ఆదేశాలు పంపిన ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌కు చెక్‌పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఈనెల 21న పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరగాల్సిన ఇఫ్తార్ విందు ఏర్పాట్లను మైనారిటీ విభాగం నేత, ఎంపీ అన్వర్ రాజకు పళనిస్వామి అప్పగించడం గమనించాల్సిన విషయం. పార్టీ వ్యవహారాల్లో దినకరన్ తలదూర్చేందుకు వీలు లేని రీతిలో పళని తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఉరకలు తీస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అన్నాడీఎంకే మద్దతు బీజేపీకి అన్న విషయాన్ని స్పష్టంచేస్తూ, పార్టీ తరపున ఒకటి రెండు రోజుల్లో ముందుగానే అధికారిక ప్రకటన చేయించేందుకు సిద్ధం అవుతున్నారు. పార్టీ విప్ ముందుగా జారీ అయిన పక్షంలో, తలా ఓ దిక్కుగా ఉన్న ఎమ్మెల్యేలు ధిక్కరించరని పళనిస్వామి ధీమాగా ఉన్నారని చెప్పవచ్చు. లేఖాస్త్రం సీఎం పళని స్వామి దూకుడు పెంచడంతో బంధు జనాన్ని ఒకే వేదిక మీదకు తెచ్చే బాధ్యతను పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ శశికళ తన భుజాన వేసుకున్నట్టున్నారు. అక్కడి నుంచి బంధు జనానికి లేఖాస్త్రం సంధించి ఉన్నారు. ఇందులో మనం.. మనం తన్నుకుంటే, లాభం ఢిల్లీలోని కమలం పెద్దలకు, రాష్ట్రంలోని సీఎం పళని స్వామికి మాత్రమేనన్న విషయాన్ని పరిగణించి ముందుకు సాగాలని హితబోధ చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అందుకే కాబోలు ఇన్నాళ్లు శశికళ సోదరుడు దివాకరన్ చెప్పినట్టుగా ఆడుతున్న ఎమ్మెల్యేలు పలువురు దినకరన్‌కు మద్దతుగా శనివారం పెదవి విప్పారు. ఈ ఇద్దరు ఇక ఏమైనట్టేనని, పళనిని ఇరకాటంలో పెట్టే విధంగా ముందుకు సాగడం తథ్యమన్న ధీమాను దివాకరన్, దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. ఇక, దినకరన్‌కు మద్దతుగా మరో ఎమ్మెల్యే కదలడంతో సంఖ్య 35కు చేరింది. మద్దతుదారులతో శనివారం కూడా సుదీర్ఘ చర్చలో దినకరన్ మునిగినా, సాయంత్రం బ్రేక్ ఇవ్వడం గమనార్హం. ప్రభుత్వాన్ని కూల్చే విధంగా తమ ప్రయత్నాలు ఉండబోదని, దినకరన్‌కు పార్టీ వ్యవహారాల అప్పగింత లక్ష్యంగా ఒత్తిడి పెంచనున్నామని ఆయన మద్దతు ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ వ్యాఖ్యానించారు. -
ఇదిగో సాక్ష్యం
► ముడుపుల వీడియో ప్రదర్శించిన స్థాలిన్ ► చర్చకు అనుమతించని అధికారపక్షం ► అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన విపక్షం రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ముడుపుల వ్యవహారంపై ఇదిగో సాక్ష్యమంటూ ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ సీడీని ప్రదర్శించడంతో శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపు స్తంభించిపోయాయి. చర్చకు అనుమతించాలనే డిమాండ్‌పై విపక్షాలు పట్టువీడకపోవడం, ససేమిరా అంటూ అధికారపక్షం భీష్మించుకోవడం, వాకౌట్లతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: విశ్వాస పరీక్ష నెగ్గడం ద్వారా ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నంలో భాగంగా శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాలు ఎమ్మెల్యేలకు భారీ ఎత్తున ముడుపులు ముట్టజెప్పారని ఎమ్మెల్యే శరవణన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రయివేటు ఇంగ్లి్లషు చానల్లో ప్రసారమైన ఇంటర్వూ్య తనదే, అయితే గొంతు మాత్రం వేరేవారిదని శరవణన్ కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా విపక్షం మాత్రం నమ్మడం లేదు. ఈనెల 14వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా, ప్రతిరోజూ ఇదే అంశంపై సభ అట్టుడికి పోతోంది. ముడుపుల వ్యవహారంపై చర్చకు స్పీకర్ ధనపాల్ గట్టిగా నిరాకరిస్తుండగా, డీఎంకే సభ్యులు అదేపనిగా పట్టుబడుతూనే ఉన్నారు. ఆధారం లేని ఆరోపణలపై అసెంబీలో చర్చకు తావులేదనే వాదనతో గురువారం నాటి సమావేశంలో స్పీకర్ అడ్డుకున్నారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే స్టాలిన్ లేచి నిలబడి ముడుపులపై ప్రసంగించడం ప్రారంభించి సభలో ఆధారాలను సమర్పించేందుకు సిద్ధమన్నారు. ఆ తరువాత డీఎంకే ఉపసభాపక్ష నేత దురైమురుగన్ కూడా మాట్లాడారు. అయితే వీరిద్దరి ప్రసంగాలు అభ్యంతరకంగా ఉన్నందున రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడంతో డీఎంకే సభ్యులంతా వాకౌట్ చేశారు. రాష్ట్రంలో పేదలకు 10లక్షల ఇళ్ల నిర్మాణాలను త్వరలో చేపట్టనున్నట్లు మంత్రి ఉడుమలై రా«ధాకృష్ణన్ సభలో ప్రకటించారు. మదురైలో బ్రహ్మాండమైన గ్రంధాలయం, పుస్తక ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తున్నామని, చెన్నైలోని అన్నా గ్రంధాలయ అభివృద్ధికి రూ.5 కోట్లు కేటాంచామని మంత్రి సెంగొట్టయ్యన్ తెలిపారు. అసెంబ్లీ నుంచి బైటకు వచ్చిన అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ ముడుపులపై ఆధారాలు లేవని చర్చకు నిరాకరించారు, నేడు ఆధారాలతో కూడిన సీడీని సిద్ధం చేసుకుని అసెంబ్లీకి వెళ్లినట్లు చెప్పారు. అసెంబ్లీకి ఆధారాలు సమర్పించేందుకు సిద్ధమని చెప్పినా చర్చకు అనుమతించక పోవడం విడ్డూరమని అన్నారు. సచివాలయంలో సర్పాలు: రాజకీయ రణగొణ ధ్వనులతో అసెంబ్లీ ఒకవైపు దద్దరిల్లుతుండగా సచివాలయ ప్రాంగణంలో రెండు సర్పాలు ప్రవేశించి అందరినీ భయపెట్టాయి. గురువారం ఉదయం 8.45 గంటల సమయంలో సచివాలయ ప్రవేశ ద్వారం సమీపంలో పిచ్చిమొక్కలను పారిశుద్ధ్య సిబ్బంది పీకి వేస్తున్నారు. అదే సమయంలో ఐదడుగుల చారల పాము మెల్లగా సచివాలయంలోకి ప్రవేశించడాన్ని కనుగొన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది వెంటనే సమీపంలోని సీఐకి తెలుపగా ఆయన ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మొక్కల్లో నక్కి ఉన్న పామును లాఘవంగా పట్టుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మీడియా ప్రతినిధుల చాంబర్ సమీపంలో మరో పాము దర్శనమిచ్చి దడపుట్టించింది. అగ్నిమాపక సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టిన అనంతరం పాము చిక్కడంతో టెన్షన్ వీడింది. -
ములాఖత్
► చిన్నమ్మతో టీటీవీ మంతనాలు ► వెన్నంటి పది మంది ఎమ్మెల్యేలు ► ముగ్గురు ఎంపీలు ► మంత్రుల అత్యవసర భేటీ ► సీఎంతో సంప్రదింపులు ► టీటీవీని ఎప్పుడో బహిష్కరించామని ప్రకటన అన్నాడీఎంకే అమ్మ శిబిరంలో సోమవారం రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. పది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలతో కలసి బెంగళూరుకు దినకరన్ పయనం కావడం ఉత్కంఠను రేపింది. అదే సమయంలో మంత్రులు సచివాలయంలో ఏకం కావడం చర్చకు దారి తీసింది. చివరకు విలీనం నినాదాన్ని చిన్నమ్మ శశికళ అందుకోవడం, 60 రోజుల గడువు నిర్ణయించడంతో.. ఇది సాధ్యమేనా అన్న ప్రశ్న బయల్దేరింది. సాక్షి, చెన్నై: జయలలిత మరణం అనంతరం అన్నాడీఎంకే ముక్కలైన విషయం తెలిసిందే. తదుపరి పరిణామాలతో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఆస్తుల కేసులో పరప్పన అగ్రహార జైలుకు పరిమితం అయ్యారు. రెండాకుల గుర్తు కోసం లంచం కేసులో ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ చిన్నమ్మ బాటలో కారాగారం అనుభవించక తప్పలేదు. ఈ సమయంలో పార్టీకి, ప్రభుత్వానికి అన్నీ తానై సీఎం పళని స్వామి ముందుకు సాగారు. మాజీ సీఎం పన్నీరు నేతృత్వంలోని పురట్చి తలైవి శిబిరాన్ని అమ్మ శిబిరంలోకి విలీనం చేయడం లక్ష్యంగా ప్రయత్నాలు చేసి, చివరకు కేంద్రం మన్ననలతో తన మార్కు పాలన మీద దృష్టి పెట్టారు. తాజాగా జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన దినకరన్ మళ్లీ పార్టీలో తన బలాన్ని చాటుకునేందుకు సిద్ధం కావడం పళని నేతృత్వంలోని అమ్మ శిబిరం మంత్రులు జీర్ణించుకోలేకున్నారు. అన్ని సజావుగా సాగుతున్న వేళ దినకరన్ అవసరమా అన్న నిర్ణయానికి వచ్చారు. తనకు వ్యతిరేకంగా మంత్రులు గళం విప్పడంతో దినకరన్ స్వరం పెంచే పనిలో పడ్డారు. చిన్నమ్మ శశికళతో ములాఖత్ అయ్యేందుకు సిద్ధం అయ్యారు. చిన్నమ్మతో ములాఖత్: చిన్నమ్మతో ములాఖత్‌కు దినకరన్ సిద్ధం కావడంతో ఆయన వెన్నంటి ఏకంగా పది మంది ఎమ్మెల్యేలు బెంగళూరుకు కదలడం ఉత్కంఠకు దారి తీసింది. ఇందులో వెట్రివేల్(పెరంబూరు), ఇన్భదురై(రాధాపురం), తంగతమిళ్ సెల్వన్(ఆండిపట్టి), ఎస్టీకే జగ్గయ్యన్, కదిర్ గామం, సుబ్రమణ్యన్, జయంతి షణ్ముగనాథన్, పార్తీబన్, సెల్వ మోహన్ దాసు, పళనియప్పన్ ఉన్నారు. మరో ముగ్గురు ఎంపీలు సైతం వెన్నంటి సాగారు. అక్కడక్కడ దినకరన్‌ను ఆహ్వానించే రీతిలో మద్దతుదారులు హోరెత్తడంతో అమ్మ శిబిరంలో ఉత్కంఠను మరింతగా రేపింది. అక్కడక్కడా మీడియాతో మాట్లాడిన దినకరన్ తనను తొలగించే అధికారం ఎవ్వరికీ లేదని, మంత్రులు కొందరు తనను చూసి భయపడుతున్నారని వ్యాఖ్యానించడం చర్చకు దారి తీసింది. ఓ మంత్రి(జయకుమార్) అయితే ఆయనే ప్రధాన కార్యదర్శి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా విమర్శిస్తూ ముందుకు సాగారు. మంత్రుల మంతనాలు: తమను గురి పెట్టి దినకరన్ మాటల తూటాలను పేల్చడంతో 20 మంది మంత్రులు ఏకం అయ్యారు. ఆర్థిక మంత్రి జయకుమార్ ఛాంబర్లో గంటకు పైగా మంతనాల్లో మునిగారు. సచివాలయం మంత్రి ఛాంబర్ పార్టీ కార్యాలయంగా మారిందా అన్నట్టుగా చర్చ సాగింది. తదుపరి సీఎం వద్దకు మంత్రులు ఉరకలు తీశారు. సిఎంతో భేటీ అనంతరం జయకుమార్ నేతృత్వంలో మంత్రులందరూ మీడియా ముందుకు వచ్చారు. జయకుమార్ ఒక్కరే మాట్లాడగా, మిగిలినవారు మౌనంగా తల ఊపుతూ కనిపించడం గమనార్హం. ఏప్రిల్ 17వ తేదీ టీటీవీ దినకరన్‌ను, ఆయనకు సంబంధించిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నామని, ఆ నిర్ణయానికి కట్టుబడే ఉన్నామని స్పష్టం చేశారు ఆ రోజు తాను వైదొలగుతున్నట్టు ప్రకటించిన దినకరన్, ఇప్పుడు మళ్లీ పార్టీ పరంగా జోక్యం చేసుకోవడానికి సిద్ధం కావడాన్ని తాము వ్యతిరేకిస్తున్నాన్నారు. పళని స్వామి నేతృత్వంలో ప్రభుత్వం, పార్టీ వ్యవహారాలు చక్కగా సాగుతున్నాయని, అమ్మ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగడం లక్ష్యంగా ఆ రోజు తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడే ఉన్నామని ప్రకటించారు. టీటీవీ దినకరన్‌తో పార్టీ పరంగా ఎలాంటి సంబంధాలు వద్దంటూ ఆయన వెన్నంటి ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులకు హితవు పలకడం గమనార్హం. చిన్నమ్మ గడువు : మంత్రులు ఓ వైపు తనకు వ్యతిరేకంగా స్వరాన్ని పెంచిన నేపథ్యంలో బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో చిన్నమ్మ శశికళతో దినకరన్ ములాఖత్ అయ్యారు. అక్కడ చిన్నమ్మ ఇచ్చిన సందేశం ఏమిటో గానీ, ములాఖత్ అనంతరం తన మద్దతు ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. ఈ భేటీ అనంతరం అన్నాడీఎంకే అమ్మ, పురట్చి తలైవి శిబిరాల విలీనం లక్ష్యంగా చిన్నమ్మ 60 రోజుల పాటు గడువు నిర్ణయించారని దినకరన్ ప్రకటించారు. అప్పటికీ వీలీనం అన్నది సాగని పక్షంలో చిన్నమ్మ కీలక నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించడంతో విలీనం సాధ్యమేనా అన్న ప్రశ్న బయల్దేరింది. ఇది వరకు సాగిన విలీనం ప్రయత్నాలు వివాదాలు, చర్చలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆ ప్రయత్నాల్ని పక్కన పెట్టి, అన్నాడీఎంకేకు నేతృత్వం అన్నది ఎవరు వహించాలో అన్న నినాదంతో కేడర్ మద్దతు లక్ష్యంగా పన్నీరు సెల్వం రాష్ట్ర పర్యటనలో ఉండడం ఆలోచించ దగ్గ విషయం. గడువులోపు విలీనం సాగని పక్షంలో చిన్నమ్మ నిర్ణయం ఎలా ఉంటుందో, దినకరన్ తదుపరి కర్తవ్యం ఏమిటో అన్నది వేచి చూడాల్సిందే. దినకరన్ మద్దతు నాయకులు నాంజిల్ సంపత్ అయితే మంత్రుల తీరుపై తీవ్రంగా విరుచుకు పడడం గమనార్హం. -
రెండాకుల కోసం..
► ఈసీకి ప్రమాణపత్రం సమర్పించిన పన్నీరు ► నేడు చిన్నమ్మ తరఫున దాఖలు ► జిల్లా కార్యదర్శులతో పళని సమాలోచన ►ఎంజీయార్ శత జయంతి ఏర్పాట్లు ► పన్నీరును ఒంటరి చేద్దాం... నేతల నినాదం రెండాకుల చిహ్నం వ్యవహారంపై మాజీ సీఎం పన్నీరు సెల్వం ఎన్నికల కమిషన్‌కు అదనపు ప్రమాణ పత్రం సమర్పించారు. సుమారు 20 లక్షల పేజీలతో కూడిన 1.5 లక్షల అంశాలతో ఈ ప్రమాణ పత్రంలో తమ వైపు వాదనను ఈసీ ముందు ఉంచారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ తరఫున మంగళవారం ప్రమాణ పత్రం దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో నెలకొన్న పరిణామాలను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నాడీఎంకే తమదంటే తమదంటూ మాజీ సీఎం పన్నీరు సెల్వం, తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ శిబిరాలు రచ్చకెక్కాయి. దీంతో రెండాకుల చిహ్నం సీజ్ చేయబడింది. చిన్నమ్మ జైలుకు వెళ్లడంతో వ్యవహారాల్ని తాత్కాలిక ఉపప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పర్యవేక్షించారు. రెండాకుల కోసం ఈసీకి లంచం ఇవ్వడానికి ప్రయత్నించి ఆయన కూడా కటకటాల్లోకి వెళ్లారు. ప్రస్తుతం ఆ శిబిరం తరఫున సీఎంగా ఉన్న పళనిస్వామి పార్టీ బాధ్యతలను సైతం తనభుజాన వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన గడువు మేరకు అదనపు ప్రమాణ పత్రాల్ని రెండు శిబిరాలు దాఖలు చేయాల్సిన పరిస్థితి. చిన్నమ్మ శిబిరం కన్నా ముందుగానే పన్నీరు శిబిరం సోమవారం తన తరఫున ప్రమాణ పత్రాన్ని సమర్పించింది. లారీల్లో తమవద్ద ఉన్న ఆధారాలను ఢిల్లీకి తీసుకెళ్లి మరీ ఎన్నికల కమిషన్‌కు పన్నీరు శిబిరం సమర్పించింది. సుమారు 20 లక్షల పేజీలతో కూడిన 1.5 లక్షల అంశాలతో ఈ ప్రమాణ పత్రం దాఖలు చేయడం గమనార్హం. కార్యదర్శులతో పళని సమాలోచన: చిన్నమ్మ తరఫున ఈసీకి ప్రమాణ పత్రం సమర్పించాల్సిన అవశ్యం ఏర్పడడంతో జిల్లాల కార్యదర్శులతో సీఎం పళని స్వామి సోమవారం సాయంత్రం సమావేశం అయ్యారు. రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయంలో ఈ సమావేశం గంటన్నర పాటుగా జరిగింది. సీనియర్ మంత్రులు, జిల్లాల కార్యదర్శులు అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శులు జైలులో ఉండడంతో వారి తరఫున సీఎం పళని స్వామి ప్రమాణ పత్రం సమర్పించేందుకు సిద్ధం అయ్యారు. మంగళవారం ఈ ప్రమాణ పత్రం ఈసీ వద్ద దాఖలు చేయనున్నారు. ఇందుకోసం పార్టీ కార్యాలయంలో సమావేశం సాగినా, పన్నీరును ఒంటరి చేయడం లక్ష్యంగా కొత్త నినాదాన్ని అందుకున్నట్టు సమాచారం. దివంగత నేత ఎంజీయార్ శత జయంతి ఉత్సవాల వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటే రీతిలో ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా పళని స్వామి దృష్టికి ప్రభుత్వ న్యాయవాదుల నియామకం విషయంలో అన్నాడీఎంకే న్యాయవాద విభాగంలో బయల్దేరిన రచ్చ విషయాన్ని పలువురు కార్యదర్శులు తీసుకెళ్లి ఉన్నారు. ఈ విషయంగా చర్చించి నిర్ణయం తీసుకుందామని ఆయన దాట వేసినట్టు సమాచారం. పన్నీరును ఒంటరి చేద్దాం: ప్రధాని నరేంద్ర మోదీ అభయం తమకే ఉన్న దృష్ట్యా, మాజీ సీఎం పళనితో విలీనం ప్రయత్నాల్ని పక్కన పెట్టి, ఆయన్ను ఒంటరి చేద్దామన్న నినాదాన్ని పలువురు జిల్లాల కార్యదర్శులు ఈ సమావేశంలో అందుకున్నట్టు సమాచారం. తొలుత పళని స్వామి పన్నీరుకు మద్దతుగానే స్పందించినట్టు తెలిసింది. పన్నీరు వెంట జనం, కేడర్ ఉందని, ఆయన్ను లాక్కోవడం ద్వారా పార్టీకి లాభం అన్న వ్యాఖ్యలు చేసినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అయితే మెజారిటీ శాతం కేడర్ ఆయన్ను ఒంటరి చేసిన పక్షంలో, అటు వైపుగా తొంగి చూసే వాళ్లు ఉండరన్న వ్యాఖ్యలు అందుకున్నట్టు తెలిసింది. దీంతో ముందు ఆ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపిలు, మాజీలను ఇటు వైపుగా లాగేందుకు ప్రయత్నించాలని, ఆ తర్వాత ఒంటరి గురించి ఆలోచిద్దామంటూ పళని స్పందించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే విలీనం వ్యవహారం ఇప్పట్లో చర్చ అనవసరం అని, తమంతత తాముగా వాళ్లే అన్నాడీఎంకేలోకి వచ్చే విధంగా అడుగులు వేద్దామంటూ సమావేశాన్ని ముగించి ఉన్నారు. ఈ సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి జయకుమార్ అన్ని విషయాలు చర్చించామన్నారు. ప్రమాణ పత్రం విషయంపై సంతకాలు తీసుకున్నామన్నారు. ఎమ్మెల్యేలదే తుది నిర్ణయం: తంబిదురై విలీనం కొలిక్కి వచ్చినా, సీఎం ఎవరన్న విషయాన్ని ఎమ్మెల్యేలు నిర్ధారిస్తారని పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై అన్నారు. ధర్మపురంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకేలోకి పన్నీరు శిబిరం వీలీనమైన పక్షంలో సీఎంగా ఎవరు ఉంటారని ప్రశ్నించగా, అది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. ఇటీవల ఓ సంస్థ జరిపిన సర్వేలో అన్నాడీఎంకేలో సీఎం అయ్యే అర్హత పన్నీరు సెల్వంకు మాత్రమే ఉందని 37 శాతం మంది అంగీకారం తెలిపి ఉన్నారని ప్రశ్నించగా, ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు తదుపరి నిర్ణయాలు ఉంటాయన్నారు. పన్నీరు సీఎం పగ్గాలు చేపట్టాలని ఆ శిబిరానికి చెందిన ఎమ్మెల్యే సెమ్మలై వ్యాఖ్యానిస్తున్నారే అని ప్రశ్నించగా, సీఎంగా ఎవరు ఉండాలి, పార్టీని ఎవరు నడిపించాలి అన్న విషయాలు ఎమ్మెల్యేలు, జిల్లాల కార్యదర్శులు, సర్వసభ్య సమావేశంలో తేల్చాల్సిన విషయంగా దాట వేశారు. సెమ్మెలై వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ, ముందుగా విలీనం సాగదని అని ముందుకు సాగారు. దినకరన్‌కు బెయిల్‌పై రేపు నిర్ణయం రెండాకుల చిహ్నం కోసం లంచం కేసులో అరెస్టైన టీటీవీ దినకరన్‌కు బెయిల్ లభించేనా అన్న ఎదురు చూపుల్లో చిన్నమ్మ శిబిరం వర్గాలు ఉన్నాయి. టీటీవీ మద్దతు దారులు పలువురు తీహార్ జైల్లో ఆయనతో ములాఖత్ అయినట్టు సమాచారం. టీటీవీ సన్నబడ్డా, మనోధైర్యంతో ఉన్నట్టు చెబుతున్నారు. ఆయనకు బెయిల్ లభించాలన్న ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. ఆయన కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఆదేశించినా, బెయిల్ పిటిషన్‌పై బుధవారం నిర్ణయం ప్రకటించనుండడంతో ఎదురు చూపులు పెరిగాయి. -
మిస్టరీ తేల్చాల్సిందే!
♦ తేనంపేటలో న్యాయవాది పుగలేంది ఫిర్యాదు ♦ జయ మృతిపై 186 మందిపై అనుమానాలు ♦ జాబితాలో పన్నీరు, శశికళ పేర్లు ♦ కేంద్ర, రాష్ట్ర హోంశాఖలకు కూడా సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణం వెనుక దాగి ఉన్న మిస్టరీని ఛేదిం చాల్సిందేనని పట్టుబడుతూ ఎంజీఆర్ నగర్‌కు చెందిన న్యాయవాది పుగలేంది తేనాంపేట పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. చిన్నమ్మ శశికళ, మాజీ సీఎం పన్నీరుసెల్వంతోపాటు 186 మందిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ ఓ జాబితాను ఫిర్యాదుకు జత పరిచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హోం శాఖలకు, డీజీపీలకు సైతం ఫిర్యాదు చేశారు. తమిళుల అమ్మ జయలలిత మరణం వెనుక మిస్టరీ దాగి ఉందన్న ప్రచారం రాష్ట్రంలో సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. అమ్మ నమ్మిన బంటు పన్నీ రుసెల్వం సైతం అనుమానం వ్యక్తం చేయడంతో ఆ ప్రచారానికి బలం చేకూ రింది. విచారణ కమిషన్ ఏర్పాటు చేయాల్సిందేనని పన్నీరు శిబిరం పట్టుబడుతూ వస్తోంది. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా విచారణ జరిపించి తీరుతామన్న వ్యాఖ్యలను డీఎంకే వర్గాలు చేస్తూ వస్తున్నాయి. వ్యవహారం కోర్టుల వరకు వెళ్లిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో న్యాయవాది పుగలేంది శనివారం తేనాంపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మళ్లీ అమ్మ మరణం మిస్టరీ నినాదం తెర మీదకు వచ్చింది. ఈ ఫిర్యాదులో 186 మంది పేర్లను చేర్చడం గమనార్హం. దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హోం శాఖలకు, రాష్ట్ర డీజీపీకి సైతం ఆయన పంపించారు. మిస్టరీ తేల్చాల్సిందే: న్యాయవాది పుగలేంది తేనాంపేట ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. అందులో... అమ్మ ఆస్పత్రి పాలు, ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అన్నాడీఎంకే వర్గాలు స్పందిస్తూ వచ్చిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఆరోగ్యంగా తమ సీఎం ఉన్నారని ప్రజలందరూ భావిస్తూ వచ్చారని పేర్కొన్నారు. అయితే, డిసెంబర్ ఐదో తేదీ అర్ధరాత్రి జయలలిత ఇక లేదని ప్రకటించడం తమిళ ప్రజల్ని తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు గురి చేసిందని గుర్తు చేశారు. అదే రోజు అర్ధరాత్రి నుంచి సీఎంగా పన్నీరుసెల్వం కొనసాగినట్టు పేర్కొన్నారు. అయితే, ఫిబ్రవరి ఏడో తేదీ వరకు ఎనిమిదిన్నర గంటల సమయంలో జయలలిత సమాధి వద్ద పన్నీరు సెల్వం చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో అనుమానాలు రేపినట్టు గుర్తు చేశారు. అమ్మ మరణంలో మిస్టరీ ఉందని, ఆయన సంధించిన వ్యాఖ్యల్లో ఆమె నెచ్చలి శశికళ కుటుంబం చుట్టూ అనుమానాలు బయలు దేరినట్టు వివరించారు. ఇందుకు సమాధానం ఇచ్చే రీతిలో ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా పన్నీరు మీద నిందల్ని వేశారని గుర్తు చేశారు. జరిగిన, జరుగుతున్న ఘటనలు, సాగుతున్న పరిణామాలను బట్టి చూస్తే, జయలలిత హత్యకు గురయ్యారా? అన్న అనుమానాలు బయలు దేరాయని, రాజకీయ స్వలాభం కోసం ఉమ్మడిగా కుట్ర జరిగినట్టు తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. సీఎంను పథకం ప్రకారం మట్టుబెట్టి , సహజమరణంగా చిత్రీకరించినట్టుగా అనుమానాలకు బలం చేకూరుతున్నట్టుగా తాజా పరిణామాలు ఉన్నాయన్నారు. మాజీ సీఎం పన్నీరుసెల్వం, శశికళ, అన్నాడీఎంకేకు చెందిన 127 మంది ఎమ్మెల్యేలు, అన్వర్ రాజా, సెంగొట్టవన్, గోపాలకృష్ణన్, జనార్దన్, వనరోజ, ఎస్ఆర్ విజయభాస్కర్ తదితర 37 మంది పార్లమెంట్ సభ్యులు, ముత్తుకరుప్పన్, సెల్వరాజ్, విజిలా సత్యనాంద్, నవనీతకృష్ణన్, వైద్యలింగం, ఎస్ఆర్ బాలసుబ్రమణియన్ తదితర 11 మంది రాజ్య సభ సభ్యులు, అన్నాడీఎంకే నేతలు పొన్నయ్యన్, మధుసూదనన్, బన్రూటి రామచంద్రన్, వలర్మతి, గోకుల ఇందిర, సీఆర్ సర్వతిలతో పాటు అపోలో ఆస్పత్రి డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి, ఆయన కుమార్తె సంగీత రెడ్డిల మీద అనుమానాలు ఉన్నాయని, జయలలిత మరణం గురించి వీళ్లందరికీ తప్పకుండా తెలిసి ఉంటుందని, అందుకే మిస్టరీ ఛేదింపునకు విచారణ జరిపించాల్సిందేనని పట్టుబట్టే పనిలో పడ్డారు. పలు సమస్యలపై మీద తరచూ కోర్టుల్లో పిటిషన్లు వేయడంలో పుగలేంది ముందున్న విషయం తెలిసిందే. తాజా ఫిర్యాదు మీద పోలీసులు స్పందించని పక్షంలో, 186 మంది పేర్లతో కూడిన పిటిషన్‌ను మరికొద్ది రోజుల్లో కోర్టులో వేసినా వేయవచ్చు. -
గుర్తు పట్టాలని!
► రెండాకుల చిహ్నం కోసం మూడు పార్టీల పట్టు ► దీప పేరవై పేరు మార్పు ► ఈసీకి పన్నీర్ వర్గం ప్రమాణపత్రాల సమర్పణ అన్నాడీఎంకేకు ఆయువు పట్టు రెండాకుల చిహ్నం. ఈ గుర్తుకోసం మూడు పార్టీలు పోరుబాట పట్టాయి. శశికళ వర్గం ఇప్పటికే ఎన్నికల కమిషన్ వద్ద తన వాదన వినిపించింది. ఇప్పుడు పార్టీ పేరు మార్పుతో దీప, ఈసీకి ప్రమాణపత్రాల సమర్పణతో పన్నీర్‌సెల్వం రెండాకుల గుర్తు దక్కించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత గత ఏడాది కన్నుమూసిన కొద్దిరోజుల్లోనే రెండాకుల పార్టీ రెండుగా చీలిపోయింది. అన్నాడీఎంకేకు అసలైన వారసులం తామంటే తామని శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాల ప్రకటించుకోగా ఎవ్వరూ కాదు పొమ్మంటూ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నంపై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ పరిణామంతో విస్తుపోయిన ఇరువర్గాలు రెండు పార్టీలు పెట్టుకున్నాయి. శశికళ వర్గం తమ పార్టీకి ‘అన్నాడీంకే అమ్మ’ (టోపీ గుర్తు), పన్నీర్ వర్గం ‘అన్నాడీఎంకే పురట్చితలైవీ అమ్మ’ (రెండు దీపాల విద్యుత్ స్తంభం గుర్తు) అని నామకరణం చేసుకుని ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో తలపడ్డాయి. అయితే అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం లేకుండా నెగ్గుకు రావడం కష్టమని కొద్దిరోజుల్లోనే ఇరు వర్గాలకూ తెలిసిపోయింది. అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి టీటీవీ దినకరన్ ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో రెండాకుల చిహ్నం లేని లోటును డబ్బుతో అధిగమించేందుకు ప్రయత్నించి అభాసుపాలు కావడంతోపాటు ఎన్నికల రద్దు కారకుడయ్యాడు. అంతేగాక రెండాకుల చిహ్నంను దొడ్డిదారిన దక్కించుకునేందుకు ఏకంగా ఎన్నికల కమిషన్‌కే రూ.50 కోట్ల ఎరవేసి జైలు పాలయ్యాడు. రెండాకుల కోసం మూడు పార్టీల పోరు ఇదిలా ఉండగా, ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్న అన్నాడీఎంకేను, రెండాకుల చిహ్నాన్ని ఎలాగైనా దక్కించుకునే ప్రయత్నాలను మానివేసి పార్టీ క్యాడర్ బలం ద్వారా పొందాలని శశికళ వర్గం నిర్ణయించుకుంది. ప్రస్తుతం పార్టీ, మెజార్టీ ఎమ్మెల్యేల బలం ప్రభుత్వం తమ చేతుల్లో ఉందనే ధీమాతో ఎన్నికల కమిషన్‌కు ఇప్పటికే అనేక పత్రాలను సమర్పించిన శశికళ వర్గం నింపాదిగా వ్యవహరిస్తోంది. పన్నీర్ వర్గం ప్రమాణ పత్రాల సమర్పణ: ఇక పన్నీర్‌సెల్వం వర్గం సైతం ఎన్నికల కమిషన్నే నమ్ముకుంది. అమ్మ పార్టీకి అసలైన వారసులం అంటూ గతంలో 20 వేల పేజీలతో కూడిన ప్రమాణ పత్రాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది. ఇందుకు అదనంగా శుక్రవారం 12,600 పేజీలతో కూడిన ప్రమాణ పత్రాలను అందజేసింది. పన్నీర్‌సెల్వం నాయకత్వాన్ని తాము సమర్థిస్తున్నామంటూ పార్టీ నేతలు, సభ్యుల సంతకాలతో కూడిన ప్రమాణ పత్రాలు అందులో ఉన్నాయి. ఇరువర్గాల పత్రాలను ఎన్నికల కమిషన్ పరిశీలిస్తోంది. పేరు మార్చుకున్న దీప పేరవై: రెండాకుల చిహ్నం కోసం శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాలు పోటీ పడుతుండగా జయలలిత అన్నకుమార్తె దీప సైతం రంగంలోకి దిగారు. అమ్మకు రక్తసంబంధీకులమేకాదు, రాజకీయ వారసురాలిని కూడా నేనే అంటూ ఎంజీఆర్ ‘అమ్మ దీప పేరవై’ పేరుతో జనం ముందుకు వచ్చారు. రెండాకుల చిహ్నం దక్కించుకోవడమే తన లక్ష్యమని ప్రకటించారు. ఆర్కేనగర్ ఎన్నికల్లో సైతం పేరవై పేరుతో పోటీచేసిన దీప... రెండాకుల చిహ్నం రేసులో ఉరికేందుకు తాజాగా తన పార్టీ పేరును మార్చారు. పేరవై ఉన్నతస్థాయి కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి రుమాన పాండియన్ అధ్యక్షతన నిర్వాహకులతో శుక్రవారం సమావేశమై పలు తీర్మానాలు చేశారు. ఎంజీఆర్ అమ్మ దీప పేరవైని రద్దు చేసి ‘అన్నాడీఎంకే దీప’ వర్గంగా మార్చడం తీర్మానాల్లో ప్రధానమైనది. -
కొడిగడుతున్న దీపం
► బలహీనమవుతున్న పేరవై ► భర్త మాధవన్ వేరుగా కొత్త పార్టీ ► రూ.20 కోట్ల మోసం కేసు సాక్షి ప్రతినిధి, చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత రాజకీయ వారసురాలిగా తెరపైకి వచ్చిన ఆమె మేనకోడలు దీప నానాటికి తెరమరుగవుతున్నారు. భర్తతో మనస్పర్థలు, దీప పేరవై నేతలు కార్యకర్తలతో విబేధాలతో సతమతం అవుతున్న దీప జీవితంపై శుక్రవారం మరో రెండు పిడుగులు పడ్డాయి. భర్త మాధవన్ కొత్త పార్టీ స్థాపన, పేరవై సభ్యత్వాల పేరుతో రూ.20 కోట్లు మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు దీపను మరింత బాధల్లోకి నెట్టేశాయి. జయలలిత మర ణం వరకు పెద్దగా ఎవ్వరికీ తెలియని దీప ఆ తరువాత రాజకీయ అరంగేట్రం చేసి ప్రజలందరికీ పరిచయమయ్యారు. శశికళ చేతుల్లోని అన్నాడీఎంకే వెళ్లడాన్ని సహించలేని వారిపై నమ్మకంతో ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’ని స్థాపించారు. పేరవైపై భర్త మాధవన్ పెత్తనం లేకుండా చేసి ఆమె కారుడ్రైవర్‌ను ప్రధాన కార్యదర్శిగా, ఆయన భార్యను అధ్యక్షురాలిగా చేయడంతో ముసలం పుట్టింది. దీపపై అలిగిన మాధవన్ వేరే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. పన్నీర్‌సెల్వం రాజీనామా, శశికళపై తిరుగుబాటుతో అన్నాడీఎంకే రాజకీయాలు అల్లకల్లోలంగా మారిపోగా సీఎంగా ఎడపాడి పళనిస్వామి విశ్వాస పరీక్ష సమయంలో పన్నీర్‌సెల్వం పక్షాన నిలిచారు. మెజారిటీ ఎమ్మెల్యేలపై పన్నీర్‌సెల్వం పట్టుజారిపోవడంతో దీప మనస్సు మార్చుకుని సొంతంగా రాజకీయాలు ప్రారంభించారు. ఆర్కేనగర్లో పోటీకి దిగడంతో భర్త మాధవన్ మనసు మార్చుకుని మళ్లీ చేరుమయ్యారు. ఎన్నికల నామినేషన్ పత్రాల్లో భర్త పేరు కాలమ్‌ను ఖాళీగా పెట్టి మరో వివాదానికి కా>రణమయ్యారు. ఆనాటి నుంచి ఇరువురి మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. ఇటీవల అంబేడ్కర్ జయంతి సందర్భంగా దీప ఇంటి ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మాధవన్‌ను లోనికి అనుమతించక పోవడం అగ్నిలో అజ్యం పోసింది. దీప, మాధవన్‌ల అనుచరులు తీవ్రంగా ఘర్షణపడి రాళ్లు, నీళ్ల బాటిళ్లతో కొట్టుకున్నారు. ఘర్షణ సమయంలో ఇంటి నుంచి బైటకు వచ్చిన దీప భర్త మాధవన్‌ను ఇంట్లోకి రావద్దని హెచ్చరించి తరిమివేసింది. ‘ఎమ్జేడీఎంకే’ ఆవిర్భావం: మాధవన్ దీపను వదిలివేరుగా ఉంటున్న మాధవన్ శుక్రవారం అకస్మాత్తుగా రాజకీయ పార్టీ స్థాపించి పేరవైని మరింతగా బలహీనపరిచే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ‘ఎంజీఆర్ జయలలిత ద్రవిడ మున్నేట్ర కళగం’ (ఎమ్జేడీఎంకే) పేరున తాను స్థాపించిన కొత్తపార్టీకి దీపకు ఎటువంటి సంబంధం లేదు, తను చేరదలుచుకుంటే చేరవచ్చని ప్రకటించారు. శుక్రవారం ఉదయం నేరుగా జయలలిత సమాధి వెళ్లి నివాళులర్పించిన అనంతరం పార్టీ పేరును ప్రకటించి పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే తీవ్రమైన నాయకత్వలేమిని ఎదుర్కొంటోందని, ఇరుపక్షాల నేతలు పన్నీర్‌సెల్వం మాయలో పడిపోయారని మాధవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన నిజాయితీగా నిలిచే సిసలైన నేతను తానేనని చెప్పుకున్నారు. రెండాకుల చిహ్నం తన పార్టీకి సాధిస్తానని చెప్పారు. భర్త మాధవన్ పార్టీ పెట్టడం దీపకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. దీపపై రూ.20 కోట్ల మోసం కేసు: ఇప్పటికే పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయి ఉన్న దీప రూ.20 కోట్ల మోసం కేసులో చిక్కుకున్నారు. ఎంజీఆర్ అమ్మ దీప పేరవై కింద సభ్యత్వ దరఖాస్తుల రుసుం కింద రూ.20 కోట్ల మోసానికి పాల్పడ్డారంటూ చెన్నై నగరం నెశపాక్కంకు చెందిన జానకిరామన్ అనే వ్యక్తి చెన్నై మాంబళం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రద్దు చేసిన దీప పేరవై పేరుతో రెండు లక్షల దరఖాస్తులను రూ.10లకు అమ్మి, సభ్యత్వ రుసుమును స్వాహా చేశారని అతను ఆరోపించాడు. తాను సైతం రూ.50వేలు చెల్లించి 5వేల దరఖాస్తులను పొందానని చెప్పాడు. రిజిస్ట్రేషన్ దరఖాస్తులో కోశాధికారిగా, సభ్యత్వ దరఖాస్తులో ప్రధాన కార్యదర్శిగా పేర్కొనడం మోసపూరితమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. తనలాగా మరింత మంది కార్యకర్తలు మోసపోకుండా దీపపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇలా రోజుకో సమస్యతో ‘దీప’ం కొడిగట్టుతోందా అనే భావన కలుగుతోంది. -
అన్నీ సుడిగుండాలే!
♦ నిన్నటి వరకు పొగడ్తలు ♦ నేడు తిట్ల పురాణం ♦ టీటీవీకి అన్నీ కష్టాలే ♦ ఇక కోర్టుల చుట్టూ ప్రదక్షణలే అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా ఏ క్షణాన పగ్గాలు చేపట్టాడో ఏమోగానీ, అడుగడుగునా సుడిగుండాల్ని దాటాల్సిన పరిస్థితి దినకరన్‌కు తప్పలేదు. నిన్నమొన్నటి వరకు పొగడ్తల పన్నీరులో ముంచిన వాళ్లు, నేడు తిట్ల పురాణం అందుకోవడం టీటీవీకి పెద్ద షాక్కే. రెండు నెలల వ్యవధిలో అన్ని సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో కోర్టుల చుట్టూ తిరగక తప్పదేమో..! సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే వర్గాలు అమ్మ జయలలిత బతికే ఉన్నప్పుడు నెచ్చెలి శశికళ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్‌ను అన్నాడీఎంకే నుంచి బయటకు పంపించిన విషయం తెలిసిందే. అప్పట్లోనే విదేశీ మారక ద్రవ్యంతో పాటు మరికొన్ని కేసులు దినకరన్ మెడకు వేలాడుతున్నా, విచారణల వేగం మాత్రం వాయిదాల పర్వంతో సాఫీగా సాగుతూ వచ్చాయి. అమ్మ ఉన్నంత కాలం పోయెస్ గార్డెన్ వైపుగానీ, పార్టీ కార్యాలయం వైపుగానీ కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితి. ఆ అమ్మ మరణంతో పోయెస్‌గార్డెన్‌లో తిష్ట వేయడమే కాదు, చిన్నమ్మ శశికళ ఆశీస్సులతో అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకున్నారు. చిన్నమ్మ ప్రతినిధిగా పార్టీని పూర్తిగా తన గుప్పెట్లో ఉంచుకునేందుకు తగ్గ అస్త్రాలతో దినకరన్ ముందుకు సాగారని చెప్పవచ్చు. పార్టీ పదవికి చేతికి చిక్కిన వారం రోజుల అనంతరం ఫిబ్రవరి 23వ తేదీ అధికారికంగా బాధ్యతలు నిర్వహించారు. దీంతో టీటీవీ జై...అంటూ పొగడ్తల పన్నీరు చల్లేందుకు ఆ కార్యాలయం వైపుగా పోటేత్తిన సేనలు కోకొల్లలు. కాళ్ల మీద ఆశ్వీరచనాలు తీసుకున్న వాళ్లూ ఉన్నారు. ఇక, అమ్మ తరహాలో కార్యాలయం మీద నుంచి విక్టరీ చిహ్నం చూపించడం ఏమిటో, తానే ఇక అన్నాడీఎంకేకు భవిష్యత్తు అన్నట్టుగా ఠీవీని ప్రదర్శించారని చెప్పవచ్చు. అన్నీ సుడిగుండాలే : ఏ ముహూర్తాన ఆ పదవిలో దినకరన్ కూర్చున్నారో ఏమోగానీ వరుస గండాలు, సుడిగుండాల్ని దాటక తప్పలేదు. జయలలిత మేనల్లుడు దీపక్ ఆయనకు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తున్నా, మాజీ సీఎం పన్నీరు రూపంలో చిక్కులు ఎదురైనా అన్నింటినీ అడ్డుకునేందుకు వీరోచితంగా శ్రమించక తప్పలేదు. ఓ వైపు తన పట్టు పార్టీలో బిగిసే రీతిలో నేతలతో మంతనాలు, అసంతృప్తి వాదులకు బుజ్జగింపులు ఇలా నిత్యం రాయపేట కార్యాలయంలో ఉంటూ తన సత్తాను చాటుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు. ఆర్కేనగర్లో గెలుపుతో సీఎం పగ్గాలు చేపట్టడం ఖాయం అన్నంతగా ఎదిగిన దినకరన్‌ను ఒక్కసారిగా పాత, కొత్త సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఇరకాటంలో పడ్డారని చెప్పవచ్చు. ఇక కోర్టు చుట్టూ ప్రదక్షిణలేనా: ఆర్కేనగర్ రూపంలో కష్టాలు మరింతగా చుట్టుముట్టడంతో సాగిన పరిణామాలు ప్రస్తుతం టీటీవీకి కష్టాలను కొని తెచ్చిపెట్టారు. ఓ వైపు విదేశీ మారక ద్రవ్యం కేసు విచారణ వేగవంతం కావడం, కోర్టుమెట్లు ఎక్కాల్సిన పరిస్థితుల నేపథ్యంలో రెండాకుల చిహ్నం కోసం సాగిన లంచం వ్యవహారం మెడకు బిగుసుకోవడంతో ఇక కేసుల ఊబిలో కూరుకు పోయినట్టు పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో నిన్న మొన్నటి వరకు పొగడ్తల పన్నీరు చల్లిన వాళ్లు, ప్రస్తుతం తిట్ల పురాణంతో తప్పుకో...అంటూనే, తప్పించేశాం...ఇక కార్యాలయం వైపుగా అడుగులు కూడా పెట్టొదంటూ హెచ్చరికలు చేసే పనిలో పడడం గమనార్హం. ఇప్పటికే పాస్‌పోర్టు సీజ్ చేయబడి ఉన్నా, తాజా పరిణామాల నేపథ్యంలో విదేశాలకు పారిపోకుండా వాంటెడ్ లిస్టులో ఆయన పేరు ఎక్కడం, ఎగ్మూర్ కోర్టు మెట్లు ఎక్కడం అన్నీ ఒకే రోజు జరిగి పోవడంతో గమనార్హం. దీన్ని బట్టి చూస్తే మున్ముందు దినకరన్ పరిస్థితి ముందు గొయ్యి...వెనక నొయ్యి అన్నట్టుగా ఉంటుందేమోనని ఎద్దేవా చేసే వాళ్లూ పెరుగుతున్నారు. మొన్నటి వరకు కేడర్ మధ్యలో ఠీవీగా నడిచిన దినకరన్ ఇక, న్యాయవాదులు, పోలీసులు నడుమ కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పదేమో..!. ఇందుకు అద్దం పట్టే రీతిలో బుధవారం ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎగ్మూర్ కోర్టు విచారణకు తన న్యాయవాదులతో కలిసి అడుగు పెట్టారు. ఇక, తన బలాన్ని చాటుకునే విధంగా పార్టీ కార్యాలయంలో సమావేశానికి సిద్ధ పడ్డా, అడుగు పెట్ట వద్దంటూ వచ్చిన హెచ్చరికతో గౌరవంగానే తప్పుకుంటున్నా..అన్నట్టు మీడియా ముందుకు వ్యాఖ్యలు వళ్లించడం బట్టి చూస్తే, కొన్ని సామెతులు గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉంటుందేమో..! -
నిబంధనల మేరకే..
► అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక ► సర్వసభ్య సమావేశంలో ఎంపిక ► ఫిర్యాదు చేసిన వారే ప్రతిపాదించారు ► సీఈసీకి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ లేఖ సాక్షి ప్రతినిధి, చెన్నై: నిబంధనల మేరకే తన నియామకం జరిగిందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ)కి తెలిపారు. పార్టీ సంప్రదాయం ప్రకారం సర్వసభ్య సమావేశం ద్వారా ప్రధాన కార్యదర్శిగా తనను ఎన్నుకున్నారని సీఈసీకి సమర్పించిన వివరణలో ఆమె పేర్కొన్నారు.అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత ఆమె స్థానంలో ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికయ్యారు. ఆ తరువాత నెలకొన్న విభేదాల వల్ల మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ తదితరులపై ఆమె బహిష్కరణ వేటు వేశారు. నిరంతరాయంగా ఐదేళ్లపాటు సభ్యత్వంలేని శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన 12 మంది పార్లమెంటు సభ్యులు సీఈసీకి ఫిర్యాదు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదని ప్రకటించాలి్సందిగా వారు కోరారు. ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదుపై బదులివ్వాల్సిందిగా శశికళను సీఈసీ కోరింది. శశికళ తరఫున పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ఇటీవలే సీఈసీకి వివరణ ఇచ్చారు. అయితే శశికళ ఇచ్చిన నోటీసుపై దినకరన్ బదులివ్వడం ఏమిటని సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసును అందుకున్న శశికళనే ఈనెల 10వ తేదీలోగా బదులివ్వాలని ఇటీవల ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు 70 పేజీలతో కూడిన ఉత్తరం ద్వారా శుక్రవారం బెంగళూరు జైలు నుంచే సీఈసీకి శశికళ బదులిచ్చారు. గతంలో దినకరన్ ఇచ్చిన వివరాలనే శశికళ తరఫు న్యాయవాది సీఈసీకి సమర్పించారు. ప్రధాన కార్యదర్శిని పార్టీ సర్వసభ్య సమావేశం ద్వారానే ఎన్నుకుంటారని, తన నియామకం కూడా అదే రీతిన జరిగింది. తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తులే పార్టీ సర్వ సభ్యసమావేశంలో తన పేరును ప్రతిపాదించగా సభ్యులంతా కలిసి ఎకగ్రీవంగా తనను ఎన్నుకున్నారు. పార్టీ నియమ నిబంధనలకు లోబడే ఎన్నిక జరిగిందని శశికళ వివరణ ఇచ్చారు. -
మోగిన ఉప నగారా
► వచ్చే నెల 12న ఆర్కేనగర్ ఉప ఎన్నిక ► మార్చి 16 నుంచి నామినేషన్లు ► ఏప్రిల్ 15న ఓట్ల లెక్కింపు ► పోటీకి దీప సిద్ధం సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై ఆర్కేనగర్లో ఉప ఎన్నిక నగారా మోగింది. వచ్చేనెల 12వ తేదీన ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ గురువారం ప్రకటించింది. ఈనెల 16న నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. గత ఏడాది మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆర్కేనగర్ నుంచి పోటీచేసి గెలుపొందారు. అనారోగ్య కారణాలతో గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత డిసెంబర్ 5వ తేదీన కన్నుమూశారు. ఆమె మరణంతో ఆమె ప్రాతిని«థ్యం వహించిన ఆర్కేనగర్లో ఉపఎన్నిక ఏర్పడింది. అమ్మ మరణం తరువాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ, ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వం బాధ్యతలు స్వీకరించారు. అయితే అనతికాలంలో వారిద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోగా తదనంతర పరిణా మాల వల్ల రెండాకుల పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. పన్నీర్‌సెల్వంతో ఆయన మద్దతుదారులపై శశికళ బహిష్కరణ వేటువేశారు. ఒక వర్గానికి పన్నీర్‌సెల్వం, మరో వర్గానికి శశికళ నాయకత్వం వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా శశికళ జైలు కెళ్లే ముందు ఆమె అక్క కుమారుడు టీటీవీ దినకరన్ ను ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించారు. బెంగళూరు జైలు నుంచి ఆమె పార్టీ చక్రం తిప్పుతున్నారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకేలోని ఒక వర్గం జయ మేనకోడలు దీపను అనుసరిస్తోంది. దీంతో రెండుగా ఉండిన పార్టీ మూడు వర్గాలుగా మారిపోయింది. శశికళపై ఎన్నికల కమిషన్ కు పన్నీర్‌సెల్వం వర్గం ఫిర్యాదు చేయగా ఈనెల 10వ తేదీలోగా బదులివ్వాల్సిందిగా ఆమెకు నోటీసులు అందాయి. శశికళ ఇచ్చిన వివరణకు ఎన్నికల కమిషన్ సంతృప్తిచెందని పక్షంలో పార్టీని తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు పన్నీర్‌సెల్వం పావులు కదుపుతున్నారు. ఇటువంటి కీలకమైన తరుణంలో ఆర్కేనగర్ ఉప ఎన్నిక ముంచుకొచి్చంది. ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కార్యాలయం గురువారం మధ్యాహ్నం ఆర్కేనగర్ ఉపఎన్నిక నగారాను మోగించింది. ఆర్కేనగర్లో ఉప ఎన్నిక ప్రకటన వల్ల ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వచ్చింది. దీంతో అధికార అన్నాడీఎంకే నేతలు, ప్రభుత్వ అధికారులు హడావుడిగా నియోజక వర్గానికి చేరుకుని ప్రజల సమస్యలను తెలుసుకోవడం ప్రారంభించారు. అలాగే దీప, పన్నీర్‌సెల్వం అనుచరులు వేర్వేరుగా సమావేశమై ఎన్నికలపై సమాలోచనలు జరిపారు. ఆర్కేనగర్ నుంచి దీప పోటీ: అన్నాడీఎంకే ప్రతిష్ట, అమ్మ ప్రభావంపై ఆధారపడి మూడు వర్గాలు అభ్యర్థులను పోటీకి పెట్టడం దాదాపు ఖాయమని భావించవచ్చు. శశికళ జైలు కెళ్లకుంటే పోటీచేసి ఉండేవారు. దీంతో ఆమెకు బదులుగా దినకరన్ పోటీచేసేందుకు ఉత్సాహపడుతున్నారు. పన్నీర్‌సెల్వం ఎవరిని పోటీకి పెడతారో ఇంకా తేటతెల్లం కాలేదు. ఇక మూడో వర్గం నుంచి దీప పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్కేనగర్ నుంచి పోటీచేయనున్నట్లు దీప గురువారం సాయంత్రం ప్రకటించారు. ఇక డీఎంకే, కాంగ్రెస్ కలిసి ఒక అభ్యర్థిని, బీజేపీ, డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే, వీసీకే పార్టీలు కూడా రంగంలో నిలిచే అవకాశం ఉంది ఎన్నికల షెడ్యూలు: మార్చి 16వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. నామినేషన్ల స్వీకరణ ఈనెల 23 వ తేదీతో ముగుస్తుంది. 24వ తేదీన నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు 27వ తేదీ ఆఖరు రోజు. ఏప్రిల్ 12వ తేదీన పోలింగ్, 15వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడితో ఉప ఎన్నికకు తెరపడనుంది. -
పన్నీర్ గృహప్రవేశం
► పోయెస్‌గార్డెన్ లోకి మారిన మాజీ సీఎం ► కొత్త ఇంటి నుంచే రాజకీయాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పోయెస్గార్డెస్ లోని తన కొత్త నివాసంలో గురువారం గృహప్రవేశం చేశారు. సంప్రదాయబద్ధంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటిలోకి వెళ్లి పాలుపొంగించి కాపురం పెట్టారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇంటి వెనుకనున్న వీనస్ కాలనీలోనే పన్నీర్ గృహప్రవేశం చేసిన ఇల్లు ఉండడం విశేషం. అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంలో జయలలిత తరువాత అంతటి ప్రాధాన్యతను కలిగి ఉన్న పన్నీర్‌సెల్వం అమ్మ మరణంతో అవస్థలపాలయ్యారు. జయ జైలుకెళ్లిన రెండుసార్లు తాత్కాలిక ముఖ్యమంత్రి వ్యవహరించిన పన్నీర్‌సెల్వం ఆమె మరణించిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ కనుసన్నల్లో ఉంటూనే స్వంత నిర్ణయాలతో పాలన సాగించారు. ముఖ్యంగా తీవ్రస్తాయిలో సాగుతున్న జల్లికట్టు ఉద్యమాన్ని చల్లార్చేందుకు ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావడం, సదరు ఆర్డినెన్స పై కేంద్రం సహాయంతో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించడంలోనూ విజయం సా«ధించారు. సీఎంగా తనదైన ముద్రలో దూసుకుపోవడం ద్వారా ప్రతిపక్షాల ఆదరాభిమానాలను సైతం చూరగొన్నారు. జయ మరణించగానే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితోపాటూ సీఎం కుర్చీపై సైతం కన్నేసిన శశికళ పన్నీర్ దూకుడుకు కళ్లెం వేయాలని నిర్ణయించుకున్నారు. గత నెల 5వ తేదీన పోయెస్‌గార్డెన్ లో సీఎం పదవికి పన్నీర్‌సెల్వం రాజీనామా చేశారు. ఆదే రోజున అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా (సీఎంగా) శశికళను ఎన్నుకున్నారు. అకస్మాతుగా తనను ఇంటికి పిలిపించుకుని తన చేత బలవంతంగా రాజీనామా చేయించారని శశికళపై పన్నీర్‌సెల్వం ఆరోపణలు చేయడం ద్వారా తిరుగుబాటు జెండా ఎగరవేశారు. దీంతో అన్నాడీఎంకే పన్నీర్‌సెల్వం, శశికళ వర్గాలుగా చీలిపోయింది. పన్నీర్‌సెల్వం అతని మద్దతుదారులను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించినట్లు శశికళ ప్రకటించారు. అయితే సీఎం బాధ్యతలు చేపట్టేలోగా ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టు తీర్పుతో జైలుపాలయ్యారు. శశికళ స్థానంలో ఎడపాడి పళనిస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పన్నీర్ క్వార్టర్‌పై కన్ను: పన్నీర్, శశికళ వర్గాల మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనే తీరులో విధ్వేషాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ క్వార్టర్లో ఉన్న పన్నీర్‌ను బైటకు పంపివేయడం ద్వారా పగ తీర్చుకోవాలని శశికళ వర్గం నిర్ణయించుకుంది. 2011లో జయ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆమె కేబినెట్లో ఆర్థికమంత్రిగా వ్యవహరిస్తున్న పన్నీర్‌సెల్వం చెన్నై అడయారు గ్రీన్ వేస్ రోడ్డులోని ప్రభుత్వ క్వార్టరులో నివాసం ఉంటున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత సైతం అక్కడే కొనసాగారు. ప్రభుత్వ క్వార్టర్స్‌ను వెంటనే ఖాళీ చేయాలంటూ సీఎం ఎడపాడి ప్రజాపనుల శాఖ ద్వారా పన్నీర్‌సెల్వంకు నోటీసులు పంపారు. అంతకు రెండు రోజుల ముందు శశికళ వర్గీయలు పన్నీర్‌సెల్వం ఇంటి వద్దకు చేరుకుని అక్కడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. మంత్రులు, ముఖ్యమంత్రులు తమ పదవిని కోల్పోయినట్లయితే మరో ఆరునెలలపాటు అదే క్వార్టర్స్‌లో కొనసాగవచ్చనే నిబంధనలను ఖాతరుచేయకుండా పన్నీర్‌సెల్వంకు నోటీసులు జారీచేశారు. ఎడపాడి ప్రభుత్వం వల్ల మరిన్ని అవమానాలకు గురయ్యేలోగా ప్రభుత్వ క్వారును ఖాళీ చేయాలని, అంతేగాక పన్నీర్‌సెల్వం పోయెస్‌గార్డెన్ లో మకాం వేయాలని నిర్ణయించుకున్నారు. జయ ఇంటికి వెనుకవైపున ఉన్న వీనస్ కాలనీలో ఒక ఇల్లును ఎంచుకున్నారు. ఈ ఇంట్లో గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి పాలు పొంగించి గృహప్రవేశం చేశారు. ఇకపై తన రాజకీయ కార్యకలాపాలు కొత్త ఇంటి నుంచి కొనసాగించనున్నారు. -
మంతనాల్లో దినకరన్
► జిల్లాల వారీగా సమాలోచన ► కేడర్ చేజారకుండా జాగ్రత్తలు పార్టీ మీద పట్టు బిగించే పనిలో ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ నిమగ్నమయ్యారు. జిల్లాల వారీగా నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో మంతనాల్లో మునిగారు. శనివారం వేలూరు, విల్లుపురం జిల్లాల్లో పార్టీపరిస్థితిపై సమాలోచించారు. కేడర్ చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ జైల్లో ఉండడంతో పార్టీ మీద పట్టు సాధించే పనిలో ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వేగం పెంచారు. చిన్నమ్మ ఆదేశాలను ఆచరణలో పెట్టే రీతిలో ముఖ్య నేతలు చేజారకుండా, నిత్యం ఏదో ఒక సమావేశంతో ముందుకు సాగే పనిలోపడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై సమాలోచనకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం విల్లుపురం, వేలూరు జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఆ జిల్లాల్లోని మాజీ మంత్రులను సైతం పిలిపించి పార్టీ పరిస్థితిపై సమావేశం కావడం గమనార్హం. వచ్చిన నేతలు, మంత్రులు టీటీవీ దినకరన్ ముందు వినయాన్ని ప్రదర్శించడం ఆలోచించాలి్సందే. ఇందులో మంత్రులు కూడా ఉండడం గమనార్హం. ప్రధానంగా పార్టీ కేడర్ చేజారకుండా, ఆయా జిల్లాల్లో మాజీ సీఎం పన్నీరు శిబిరం వైపుగా ఉన్న స్థానిక నాయకులు వివరాలను ఈసందర్భంగా టీటీవీ సేకరించినట్టు సమాచారం. జిల్లాల వారీగా సమీక్ష కేవలం తమకు ఉన్న అనుమానాల్ని నివృత్తి చేసుకునేందుకే టీటీవీ సాగిస్తున్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పన్నీరు శిబిరంతో సంప్రదింపుల్లో ఉన్నట్టుగా సంకేతాలు వెలువడడంతోనే, ఆయా జిల్లాల్లోని నేతల్ని ముందస్తుగా పిలిపించి మాట్లాడే పనిలో దినకరన్ ఉన్నారని చెబుతున్నారు. తన దృష్టికి వచ్చిన జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రుల మీద నిఘా పెంచేందుకు స్థానికంగా ఉన్న నాయకులకు టీటీవి ఆదేశాలు సైతం ఇచ్చినట్టు సమాచారం. అలాగే, ఎన్నికల కమిషన్ కు చిన్నమ్మ శశికళ వివరణ ఇవ్వాల్సి ఉండడంతో, ఈ విషయంగా పరప్పన అగ్రహార చెరకు వెళ్లి ఆమెతో భేటికి టీటీవీ కసరత్తుల్లో ఉన్నట్టు అన్నాడిఎంకే కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈసందర్భంగా ఆయా జిల్లాల్లోని పార్టీ వివరాలను చిన్నమ్మ దృష్టికి తీసుకెళ్లి, ఆమె సలహాల్ని పాటించేందుకు టీటీవీ కసరత్తుల్లో ఉన్నట్టు చెబుతున్నారు. -
చిన్నమ్మకు ‘ఈసీ’ షాక్
-
చిన్నమ్మకు ‘ఈసీ’ షాక్
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి నియామకం వ్యవహారంలో చిన్నమ్మ శశికళకు కేంద్ర ఎన్నికల యంత్రాంగం షాక్ ఇచ్చింది. ఆమె నియామకం గురించి వివరణ ఇచ్చే అధికారం ఆ పార్టీ ఉప ప్రధానకార్యదర్శి టీటీవీ దినకరన్‌కు లేదని స్పష్టం చేసింది. పదో తేదీలోపు శశికళ సంతకంతో వివరణ తమకు సమర్పించాలని శుక్రవారం రాత్రి ఆదేశించింది. దివంగత సీఎం జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడ్డ విషయం తెలిసిందే. జయలలిత నెచ్చెలి శశికళ నేతృత్వంలో ఓ శిబిరం, మాజీ సీఎం పన్నీరుసెల్వం నేతృత్వంలో మరో శిబిరంగా, జయలలిత మేన కోడలు దీప నేతృత్వంలో మరో శిబిరంగా పార్టీ కేడర్ చీలారు. అయితే, ప్రభుత్వం చిన్నమ్మ శిబిరం చేతిలో ఉన్నా, పార్టీ మాత్రం తమదేనని, శశికళ నియామకం చెల్లదంటూ పన్నీరు శిబిరం వాదిస్తూ వస్తోంది. ఇందుకు తగ్గ ఫిర్యాదు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు చేరింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం చెల్లదు అని, ఎలాంటి అధికారాలు లేకుండా ఆమె నియామకాలు, తొలగింపులు సాగించారని ఆ ఫిర్యాదులో పన్నీరు శిబిరం పేర్కొంది. దీనిపై శశికళను కేంద్ర ఎన్నికల కమిషన్ వివరణ కోరగా, ఆమె తరఫున అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ గత నెల 28న ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చారు. అన్నాడీఎంకే నియమ నిబంధనల మేరకు శశికళ నియామకం జరిగినట్టు వివరించారు. అయితే, ఆ వివరణను కేంద్ర ఎన్నికల కమిషన్ పరిగణించలేదు. శశికళ తరఫున వివరణ ఇచ్చే అధికారం టీటీవి దినకరన్‌కు లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. శుక్రవారం రాత్రి ఢిల్లీలో ఇందుకు తగ్గ ప్రకటన వెలువడ్డట్టు తమిళనాట మీడియాల్లో వార్తలు, కథనాలు హల్చల్ చేశాయి. ఆ మేరకు శశికళ చేత నియమించబడ్డ టీటీవీ దినకరన్‌కు వివరణ ఇచ్చే అధికారం లేదని ప్రకటించారు. ఆ వివరణను పరిగణించమని, ఈనెల పదోతేదీలోపు శశికళ సంతకంతో కూడిన వివరణ సమర్పించాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. పరప్పన అగ్రహార చెరలో ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళ పదో తేదీలోపు ఏ రూపంలో వివరణ ఇస్తారో అన్న చర్చ ఆ శిబిరంలో బయలు దేరింది. టీటీవీ దినకరన్ అన్నాడీఎంకేలో ఏ పదవిలోనూ లేదని, వివరణ ఇచ్చే అధికారం ఆ పార్టీలో అధికారిక పదవుల్లో ఉన్న వారికే ఉందంటూ ఎన్నికల కమిషన్ పేర్కొని ఉండడంతో పన్నీరు శిబిరంలో ఆనందం వ్యక్తం అవుతోంది. శశికళ నియామకం సైతం రద్దు అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
సభ్యులపై గురి!
► సర్వ సభ్య సమావేశానికి పన్నీరుసెల్వం కసరత్తు ► ఈసీ నిర్ణయం మేరకు అడుగులు ► రెండాకుల చిహ్నం కైవసం లక్ష్యం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న సర్వసభ్య సభ్యుల్ని తన వైపునకు తిప్పుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం వ్యూహ రచనలో పడ్డారు. ఎన్నికల యంత్రాంగం వెలువరించే నిర్ణయం మేరకు తన కార్యాచరణ వేగవంతం చేయడానికి వ్యూహరచన చేశారు. సర్వసభ్య సమావేశానికి పిలుపునిచ్చి, అన్నాడీఎంకేను, రెండాకుల చిహ్నం కైవసం లక్ష్యంగా పావులు కదిపేందుకు నిర్ణయించారు. సాక్షి, చెన్న: దివంగత ఎంజీఆర్ చేతుల మీదుగా ఆవిర్భవించి, అమ్మ జయలలిత శ్రమకు తగ్గ ఫలితంగా దేశంలోనే మూడో అతి పెద్ద పార్టీగా అన్నాడీఎంకే అవతరంచింది. అయితే, ఆ అమ్మ మరణంతో చోటు చేసుకున్న పరిణామాలకు అన్నాడీఎంకే మూడు ముక్కలు కావాల్సిన పరిస్థితి. కోటిన్నర మంది సభ్యులు తలా ఓ దిక్కు అన్నట్టు చెల్లాచెదరు అయ్యే ప్రమాదం ఏర్పడింది. జయలలిత మేన కోడలు దీపా బాటలో కొందరు, పన్నీరు బాటలో మరికొందరు, మిగిలిన వారు చిన్నమ్మ శశికళ నేతృత్వంలోని శిబిరం గొడుగు నీడలో చేరారు. మెజారిటీ శాతం మంది ఎమ్మెల్యేలు చిన్నమ్మ శిబిరం వైపు నిలబడడంతో అధికారాన్ని దూరం చేసుకున్న పన్నీరుసెల్వం, కేడర్ సాయంతో అన్నాడీఎంకేను గుప్పెట్లోకి తీసుకునే వ్యూహం రచించారు. పార్టీలో సర్వసభ్య సమావేశం నిర్ణయం కీలకం కావడంతో, ఆ సభ్యుల్ని తన వైపునకు తిప్పుకోవడం లక్ష్యంగా కసరతు్తల్లో పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో క్రియా శీలకంగా ఉన్న సర్వసభ్య సభ్యుల మద్దతు కూడగట్టుకునే వ్యూహంతో ముఖ్య నాయకుల్ని రంగంలోకి దించారు. ఎన్నికల యంత్రాంగం శశికళ నియమకానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న తదుపరి తక్షణం సర్వ సభ్య సమావేశానికి పిలుపునిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈసీ నిర్ణయంతో : అన్నాడీఎంకే నియమ నిబంధనలకు విరుద్ధంగా శశికళను ప్రధాన కార్యదర్శిగా నియమించినట్టు ఇప్పటికే పన్నీరు శిబిరం కేంద్రం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై ఈసీ విచారణ చేపట్టింది. వివరణ కోరుతూ ఈనెల 28 వరకు శశికళకు గడువు ఇచ్చారు. ఆమె ఇచ్చే వివరణను ఈసీ ఏకీభవించని పక్షంలో, ఆమె ప్రధాన కార్యదర్శి నియామకం రద్దు అవుతుంది. దీంతో సర్వసభ్య సభ్యులు మద్దతుతో సమావేశానికి పిలుపునిచ్చే వ్యూహంతో పన్నీరు అడుగులు సాగనున్నాయి. ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు తానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టడం, రెండాకుల చిహ్నం కైవసం తదుపరి, ప్రభుత్వం మీద దృష్టి పెట్టేందుకు తగ్గ కార్యచరణతో పన్నీరు ముందుకు సాగేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు బలం చేకూరే విధంగా శనివారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటరూ్వ్యలో పన్నీరు వ్యాఖ్యలు ఉండడం గమనార్హం. న్యాయం కోరుతూ: పార్టీ పరంగా తనకు జరిగిన అన్యాయానికి న్యాయం కోరుతూ కేడర్‌లోకి వెళ్తానని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల తేదీ ప్రకటనతో రాష్ట్ర పర్యటన సాగుతుందన్నారు. దీపా కొత్త పేరవై ఏర్పాటు చేయడం ఆహ్వానించ తగ్గ విషయమేనని, ఆమెకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నరు. తన గురించి పరోక్షంగా సినీ నటుడు కమల్ వ్యాఖ్యలు చేయడం ఆనందంగా ఉందంటూ, ఆయన అంటే ఎంతో గౌరవం ఉందన్నారు. ఆయన అన్నట్టుగా ఎన్నికలు వస్తే ఆహ్వానిస్తానని స్పందించారు. అన్నాడీఎంకే తమదేనని ధీమా వ్యక్తం చేశారు. -
మిస్టరీ ఛేదిస్తా!
► జయ మృతి మిస్టరీపై పన్నీరుసెల్వం శపథం ► అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంటా ► విచారణ కమిషన్ వల్లే శశికళతో విభేదాలు ►ఆర్కేనగర్లో జయ జయంతి వేడుకలు సాక్షి ప్రతినిధి,చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంలోని మిస్టరీని ఛేదించి తీరుతా, పార్టీని, ప్రభుత్వాన్ని కైవసం చేసుకుంటానని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం శపథం చేశారు. ఎమ్మెల్యేగా జయలలిత ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్కేనగర్లో శుక్రవారం ఆమె 69వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేదికపై ఏర్పాటు చేసిన జయ చిత్రపటానికి నివాళులర్పిం చారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ సభకు అధ్యక్షత వహించగా, పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ ఎంజీ రామచంద్రన్ మరణం తరువాత పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కోగా ఎ న్నో కష్టనష్టాలకోర్చి జయలలిత వాటిని అధిగమించారని తెలిపారు. అయితే నేడు అదే పార్టీ, ప్రభుత్వం కొందరి కబంధహస్తాల్లో చికు్కకు పోయిందని తెలిపారు. జయలలిత ఆశయాలకు విరుద్ధంగా వీరు వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబటా్టరు. ఎవరి చేతులో్లకి పార్టీ, ప్రభుత్వం వెళ్లకూడదని అమ్మ జాగ్రతపడ్డారో నేడు అదే వ్యకు్తలు పార్టీ పెద్దలుగా మారిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ, ప్రభుత్వాలను ఆ కుటుంబ సభ్యుల నుంచి కాపాడుకునే పోరాటంలో తమకు విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. జయలలిత మరణంపై ప్రజల మనస్సుల్లో అనేక సందేహాలు ఉన్నాయని, ఈ సందేహాల నివృత్తి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవిచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నట్లు తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరు తూ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన అన్నాడీఎంకే కార్యకర్తను కలిసేందుకు ఇటీవల తాను కీల్పాక్ ప్రభుత్వఆసుపత్రికి వెళ్లానని తెలిపారు. జయ మరణానికి అసలైన కారణాలను బైటపెటా్టల్సిందిగా అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక వృదు్ధరాలు తనను వేడుకున్నదని చెప్పారు. జయ మరణంపై విచారణ కమిషన్ వేసే ప్రయత్నంలోనే తనకు, శశికళ మధ్య విభేదాలు పొడచూపగా ప్రభుత్వం చేజారిపోయిందని అన్నారు. అందుకే జయ మరణం వెనుక దాగి ఉన్న మిస్టరీని ఛేదించే వరకు తమ ధర్మయుద్ధం ఆగదని శపథం చేశారు. ధర్మయుద్ధం ఓడినట్లుగా చరిత్రలోనే లేదని ఆయన అన్నారు. తన జన్మదినాన ఎవ్వరూ తనను కలవొద్దు, పేదల ఇళ్లకు వెళ్లండని అమ్మ అభీష్టం మేరకు రూ.40 లక్షల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్లు ఆయన తెలిపారు. పన్నీర్ సెల్వం తన మొత్తం ప్రసంగంలో ఎక్కడా శశికళ పేరును ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డారు. అయితే ప్రజలు, కార్యకర్తలు శశికళ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అలాగే ఆర్కేనగర్ ప్రజలు, కార్యకర్తలు పన్నీర్‌సెల్వంను ఘనంగా సత్కరించి ‘ప్రజల ముఖ్యమంత్రి’, జల్లికట్టు కోసం కేంద్రంతో పోరాడిన వీరుడు’ అంటూ నినాదాలు చేశారు. దీప దూరమే: అన్నాడీఎంకేలో ఇటీవల చోటుచేసుకున్న సంక్షోభ దినాల్లో పన్నీర్‌సెల్వం పక్కన నిలిచిన జయలలిత మేనకోడలు దీప ఆర్కేనగర్ సభలో కానరాలేదు. ఆర్కేనగర్లో జరిగే జయ జయంతి వేడుకల్లో ఒకే వేదికపై నుంచి ప్రసంగించనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే ఆర్కేనగర్లోని సభకు దీప గైర్హాజరుకావడం ద్వారా రాజకీయాల్లో పన్నీర్‌సెల్వంతో కలిసి నడిచే అవకాశం లేదని భావించవచ్చు. -
ప్రజాక్షేత్రంలోకి పన్నీరు
► రథం సిద్ధం ► రూట్ మ్యాప్ రూపకల్పన ► నేతలతో మాజీ సీఎం సమాలోచన ► అమ్మ జయంతికి శ్రీకారం ► ఆర్కేనగర్ నుంచి పయనం అన్నాడీఎంకేను రక్షించుకోవడమే లక్ష్యంగా ప్రజా క్షేత్రంలోకి వెళ్లేందుకు మాజీ సీఎం పన్నీరు సెల్వం సిద్ధం అయా్యరు. ప్రచార రథం కూడా రెడీ కావడంతో ఇక , రూట్ మ్యాప్ రూపకల్పనలో పన్నీరు శిబిరం బిజీ అయింది. ముఖ్య నేతలతో పన్నీరు సెల్వం రాష్ట్ర పర్యటనపై సమాలోచించారు. అమ్మ జయలలిత జయంతికి ఆర్కే నగర్ నుంచి బయల్దేరడానికి శ్రీకారం చుట్టేందుకు తగ్గట్టుగా కార్యాచరణ సిద్ధం చేసినట్టు సమాచారం. సాక్షి,చెన్నై: అన్నాడీఎంకేలో చిన్నమ్మ శశికళ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సీఎం పన్నీరు సెల్వం తిరుగుబాటు బావు టా ఎగుర వేసిన విషయం తెలి సిందే. అధికార పగ్గాలు లక్ష్యంగా ఆయన చేసిన ప్రయత్నాలకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దిగి రాలేదు. మెజారిటీ శాతం మంది తన వెంట ఉంటారని భావించి, చివరకు పన్నెం డు మందితో సరు్దకోవాల్సిన పరిస్థితి. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలు చిన్నమ్మ శశికళ విధేయుడు పళనిస్వామిని ఆదరించడం పన్నీరుకు పెద్ద షాకే. అసెంబ్లీలో పరాభావం ఎదురైనా, ప్రజా క్షేత్రంలో గెలుపు లక్ష్యంగా ముందుకు సాగేందుకు పన్నీరు సెల్వం సిద్ధం అయా్యరు. ఇప్పటికే ప్రజా మద్దతు, ద్వితీయ, తృతీయ శ్రేణి వర్గాల మద్దతు తనకు ఎకు్కవగా ఉండడంతో, రా ష్ట్ర పర్యటనతో చిన్నమ్మ రూపంలో అన్నాడీఎంకేకు ఎదురు కానున్న ముప్పును ప్రజలో్లకి, కేడర్‌లోకి తీసుకెళ్లేందుకు పన్నీరు సెల్వం ఉరకలు తీస్తున్నారు.ఇందు కోసం ప్రత్యేక ప్రచార రథం సిద్ధం కావడం విశేషం. రథం సిద్ధం: హంగు ఆర్భాటాలు లేకుండా, ప్రజ ల్లో మమేకం అయ్యే విధంగా పన్నీరు తన పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జీపు తరహా వాహనాన్ని ప్రచార రథంగా ఎంపిక చేశారు. ఇందులో కేవలం అమ్మ జయలలిత ఫొటో పెద్దదిగా కనిపించే విధంగా, ఎంజీఆర్ ఫొటో, రెండాకుల చిహ్నం మాత్రమే కనిపించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎక్కడా తన ఫొటో కూడా ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం పార్టీని రక్షించుకోవడం, కేడర్‌తో పాటుగా ప్రజా మద్దతును కూడగట్టుకోవడం లక్ష్యంగా ఈ పర్యటనకు పన్నీరు నిర్ణయించి ఉన్నారు. నేతలతో సమాలోచన: గ్రీన్ వేస్ రోడు్డలోని నివాసంలో తన మద్దతు నేతలు మధుసూదనన్, మైత్రేయన్, కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్ తదితరులతో రాష్ట్ర పర్యటన ఏర్పాట్లపై పన్నీరు సెల్వం సోమవారం సమాలోచించారు. రూట్ మ్యాప్ రూపకల్పన మీద దృష్టి పెటా్టరు. ప్రధానంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పర్యటన సాగించేందుకు నిర్ణయించి ఉన్నారు. దివంగత సీఎం అమ్మ జయలలిత వరుసగా రెండు సార్లు విజయ కేతనం ఎగుర వేసిన ఆర్కే నగర్ నుంచి తన పర్యటనకు శ్రీకారం చుట్టే విధంగా కార్యచరణను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ నెల 24వ తేదీన జయలలిత జయంతి కావడంతో ఆ రోజున సేవా కార్యక్రమాలతో, పర్యటనకు శ్రీకారం చుటా్టలన్న నిర్ణయానికి వచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, అధికారికంగా పర్యటన వివరాలు మంగళ లేదా బుధవారం ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు పన్నీరు శిబిరం వర్గాలు పేర్కొంటున్నాయి. పన్నీరు సెల్వంకు మద్దతుగా పలు చోట్ల నుంచి లేఖలను గ్రీన్‌వేస్ రోడు్డకు వెల్లువెతు్తతున్నాయి. ఇందులో అనేక మంది ఇక ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలని, అమ్మ ఆశయ సాధన లక్ష్యంగా ప్రజా మద్దతుతో పయనాన్ని వేగవంతం చేయాలని, ఎవ్వరికీ తల వంచ వద్దు అని, ధైర్యంగా సమాధానాలు ఇవ్వాలని, గంభీరంగా మా ట్లాడాలంటూ పలువురు పన్నీరుకు సూచిస్తుండ డం ఆహ్వానించ దగ్గ విషయం. పన్నీరుకు మద్దతుగా నిలిచిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే పాండియరాజన్ ఆవడిలోని తన నియోజకవర్గంలో పర్యటించగా, ప్రజలు బ్రహ్మరథం పట్టి ఆహ్వానించడం విశేషం. పార్టీని రక్షించుకుంటాం: పన్నీరు శిబిరంలో గత వారం చేరిన జయలలిత మేన కోడలు దీపా తన మద్దతుదారుల్ని ఉద్దేశించి టీ నగర్‌లోని ఇంటి వద్ద మాట్లాడారు. అన్నాడీఎంకేను రక్షించుకుంటామని, జయలలిత పేరుకు అపఖ్యాతి తెచ్చే విధం గా ఎమ్మెల్యేలు వ్యవహరించారని మండి పడ్డారు. అందరికీ గుణపాఠం చెప్పే రోజు త్వరలో రానున్నదని, మేనత్త జయంతి రోజున అన్ని వివరాలను ప్రకటిస్తానన్నారు. -
చిన్నమ్మ ఆనందం
► చప్పట్లతో హర్షం ► చెక్ పెట్టేందుకు ఆమ్ ఆద్మీ కసరత్తు ► కోర్టులో పిటిషన్ కు నిర్ణయం అధికారం తమ గుప్పెట్లోకి రావడంతో చిన్నమ్మ శశికళ ఆనందానికి అవధులు లేవు. పరప్పన అగ్రహార చెరలో చప్పట్లు మార్మోగించి మరీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన విధేయుడి చేతికి అధికారం చిక్కడంతో, జైలు నుంచే వ్యూహాలకు పదును పెట్టేందుకు సిద్ధం అవుతున్నట్టుంది. ఇక, చిన్నమ్మ చెన్నై చెరకు మార్చకుండా అడ్డుకునేందుకు తిరుప్పూర్ జిల్లా ఆమ్ ఆద్మీ విభాగం నిర్ణయించింది. సాక్షి, చెన్నై: పరప్పన అగ్రహార చెరలో ఉన్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ శనివారం మధ్యాహ్నం భోజ నాన్ని సైతం మరిచారు. ఇందుకు కారణం టీవీ ముందుకు అతుక్కు పోవడమే. అసెంబ్లీ వ్యవహారాలను టీవీలో వీక్షించిన శశికళ మధ్యాహ్న భోజన సమయాన్ని సైతం పట్టించుకోలేదని సమాచారం. తన విధేయుడు పళనిస్వామి చేతికి అధికార పగ్గాలు చిక్కడం, తన శపథాన్ని నెరవేర్చానని ఉప ప్రధానకార్యదర్శి దినకరన్ వ్యాఖ్యానించిన సమయంలో ఆమె ఆనందానికి అవధులు లేవని తెలి సింది. టీవీ ముందు నుంచి లేచి నిలబడి చప్పట్లు కొట్టి మరీ ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక, జైలు నుంచి తమిళ ప్రభుత్వ చక్రం తిప్పేందుకు తగ్గ వ్యూహాన్ని రచించేందుకు సిద్ధం అవుతుండడం గమనార్హం. అలాగే, పరప్పన అగ్రహార చెర నుంచి తమిళనాడుకు తనను మార్చే విధంగా త్వరితగతిన చర్యల్ని వేగవంతం చేయాలని న్యాయవాదులకు ఆమె సూచించి నట్టు తెలిసింది. ఈ విషయంగా న్యాయవాదులతో టీటీ వీ దినకరన్ సంప్రదింపులు జరుపుతూ సోమవారం పిటిషన్ దాఖలు చేయించేందుకు తగ్గ కసరత్తుల్లో ఉన్నట్టు సమాచారం. అయితే, చెర మార్పును అడ్డుకునేందుకు తిరుప్పూర్ జిల్లా ఆమ్ ఆద్మీ విభాగం నిర్ణయించడంతో వ్యతిరేకత బయలు దేరినట్టు అయింది. చెర మార్పునకు వ్యతిరేకత: తిరుప్పూర్ జిల్లా ఆమ్ ఆద్మీ విభాగం కార్యవర్గం ఆదివారం జరిగింది. ఇందులో అవి నీతికి వ్యతిరేకంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా శశికళకు వ్యతిరేకంగా ఇందులో నిర్ణయాలు తీసుకున్నారు. శశికళను చెన్నై జైలుకు మార్చేందుకు తగ్గ ప్రయత్నాల్ని అడ్డుకునేందుకు తీర్మానించారు. కర్ణాటక కోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేయడానికి తిరుప్పూర్ జిల్లా విభాగం కన్వీనర్ సుందర పాండియన్ నిర్ణయించారు. ఆమెను ఇక్కడకు మార్చిన పక్షంలో, రాష్ట్రంలో మరింత అవినీతి, దోపిడీ పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ, సీఎంతో పాటు మంత్రులు జైలు ముందు ప్రతి రోజూ బారులు తీరే అవకాశం ఉంద న్న విషయాన్ని ఎత్తి చూపుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ఆయన వివరించారు. -
అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్
⇒ కేంద్రం, ప్రతిపక్షాల అండ ఉన్నప్పటికీ బలపరీక్షలో ఓటమి ⇒ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంలో విఫలం ⇒ శశికళకే జై కొట్టిన అన్నాడీఎంకే శాసనసభ్యులు ⇒ మరో నాలుగేళ్లు అధికారం వదులుకునేందుకు విముఖత సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అధికార హోదా, వెన్నంటి ఉన్న అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, బాసటగా నిలిచిన ప్రతిపక్షాలు, సామాన్య ప్రజల అండ, సినీ ప్రముఖుల మద్దతు, సోషల్ మీడియాలో వెల్లువెత్తిన సంఘీభావం, అన్నింటికీ మించి కేంద్రం ప్రభుత్వం నుంచి పూర్తి భరోసా... ఇవేవీ పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిగా గద్దెనెక్కించేందుకు ఉపయోగపడలేదు. ఆయనకు అన్నివిధాలా అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ బలపరీక్షలో మాత్రం ప్రతికూల ఫలితాలు రావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. 122 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సీఎం ఎడప్పాడి పళనిస్వామిని బలపరచడం, కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పన్నీర్ పక్షాన నిలవడం వెనుక కారణాలు ఏమిటనే దానిపై రాజకీయ వర్గాలు పలు రకాలుగా విశ్లేషిస్తున్నాయి. చిన్నమ్మ నిర్బంధంలో ఎమ్మెల్యేలు మొదట పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసిన వెంటనే శశికళ అప్రమత్తమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జాగ్రత్తపడ్డారు. వారందరినీ రిసార్టుకు తరలించారు. ఎమ్మెల్యేలకు నిత్యం హితబోధ చేశారు. తనకు మద్దతిస్తేనే వారి భవిష్యత్తు బాగుంటుందనే భరోసా కల్పించారు. ఒక్కో ఎమ్మెల్యేకు ఐదుగురు చొప్పున బౌన్సర్లను రక్షణగా పెట్టారు. చివరకు టాయిలెట్‌కు వెళ్లినా బౌన్సర్లు ఉండాల్సిందే. తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఎమ్మెల్యేలు తెలుసుకోకుండా వారి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గోల్డన్ బే రిసార్టులోని టీవీల్లో కేవలం ‘జయ టీవీ’ మాత్రమే ప్రసారమయ్యేలా చేశారు. ఒకరకంగా బాహ్య ప్రపంచంతో వారికి సంబంధాలు లేకుండా తెలివిగా వ్యవహరించారు. అధికారం ఎందుకు వదులుకోవాలి? అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో చాలామంది చిన్నమ్మ ఆశీస్సులతో టిక్కెట్లు పొంది గెలిచినవారే. అంతేకాకుండా తటస్థ, వ్యతిరేక ఎమ్మెల్యేలను కూడా బెదిరించి, మభ్యపెట్టి ఆమె తన దారికి తెచ్చుకున్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో ఎక్కువమంది తొలిసారిగా ఎన్నికైనవారే. ‘‘ఎన్నికల్లో ఎంతో ఖర్చుపెట్టి ఎమ్మెల్యేగా గెలిచి, ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని నిండా ఏడాది కూడా ముగియలేదు. ఇప్పుడు ప్రభుత్వం పడిపోతే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి. గెలుస్తామో లేదో తెలియదు. శశికళ వైపు నిలిస్తే మరో నాలుగేళ్లపాటు మనకు తిరుగు ఉండదు’’ అని మెజారిటీ ఎమ్మెల్యేలు భావించినట్లు తెలుస్తోంది. అందుకే పన్నీర్‌సెల్వం వర్గంలో చేరేందుకు వారు ఆసక్తి చూపలేదు. ఎమ్మెల్యేలపై పట్టు లేకపోవడమే పన్నీర్ ఓటమికి కారణమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. శశికళ లాగా పన్నీర్ ఎమ్మెల్యేలకు వల వేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. దాదాపు రెండు వారాల సమయం లభించినప్పటికీ ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. చివరి క్షణంలో శశికళ వర్గంలోని ఎమ్మెల్యేల తనకే మద్దతు ఇస్తారని పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేసినప్పటికీ అది వాస్తవరూపం దాల్చలేదు. పన్నీర్‌ను ముంచిన మెతక వైఖరి ప్రజల అండదండలు, అమ్మ జయలలిత పట్ల విధేయత ఉన్నా రాజకీయాల్లో పన్నీర్ సెల్వం అనుసరించిన మెతకవైఖరే ఆయనను ముంచేసింది. అమ్మ పట్ల ఉన్న అభిమానంతో ప్రత్యర్థి వర్గంలోని ఎమ్మెల్యేలు తన వైపునకు వస్తారని నింపాదిగా ఇంట్లో కూర్చొని వేచి చూడడం మినహా పన్నీర్ ప్రత్యేక ప్రయత్నాలేం చేయలేదు. రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వేయడం ఆయనకు అలవాటు లేదని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. ఇదే ఇప్పుడు ఆయన కొంప ముంచింది. మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి చెన్నైకు చిన్నమ్మ? విజేత పళని నాడూ.. నేడూ.. అదే డ్రామా! చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్ స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు -
'అందుకే ఎమ్మెల్యేలు శశికళతో ఉన్నారు'
విజయవాడ: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ అక్రమంగా వేల ఆస్తులు కూడబెట్టారు కాబట్టే ఎమ్మెల్యేలు ఆమె వైపు చూస్తున్నారని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలు మాత్రం పన్నీరుసెల్వం ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. శశికళకు సీఎంగా అయ్యేందుకు ఏమి అర్హత ఉందని ప్రశ్నించారు. దేశంలో డబ్బు రాజకీయం పోవాలంటే రాష్ట్రాల్లో ప్రత్యక్ష ఎన్నికలు పెట్టాలన్నారు. దీనివలన మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఎన్నికల వ్యవస్థను లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే ద్వారా కాకుండా ప్రజలే సీఎంను ఎన్నుకోనే విధానం ద్వారా రాష్ట్రాల్లో అవినీతి తగ్గుతుందని చెప్పారు. ఎమ్మెల్యేలనే కాకుండా సమాజంలో ఉండే నిజాయితీ పరులను మంత్రులుగా చేయాలని కోరారు. ప్రజాప్రతినిధులు సమస్యలు మీద కాకుండా సంపాదన మీద దృష్టి సాధిస్తున్నారని విమర్శించారు. ఏపీలో ప్రతి విషయాన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారని.. దీర్ఘకాలిక ప్రయోజనాలపై ప్రభుత్యం దృష్టి సాధించటం లేదని ఆరోపించారు. ప్రతి విషయాన్ని మ్యాజిక్ చేయాలనీ సీఎం చూస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ చివరికి ప్రగల్బాల, ఆర్భాటాల రాష్ట్రంగా మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు. -
శశికళ పట్ల అంత సానుభూతి ఎందుకు?
న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు చిన్నమ్మ శశికళకు దేశంలోని అత్యుత్తమ న్యాయస్థానమైన సుప్రీం కోర్టు దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించినప్పటికీ ఆమె వర్గీయుల్లో లేదా ఆమె అభిమానుల్లో ఎందుకు మార్పు రావడం లేదు. ఆమెను ఎందుకు దోషిగా చూడడం లేదు? ఇప్పటికీ ఆమెను చిన్నమ్మగా ఎలా గౌరవించగలుగుతున్నారు? పోయెస్ గార్డెన్ నుంచి బెంగళూరు పోలీసు స్టేషన్‌కు బయల్దేరిన శశికళను ఓ స్వాతంత్ర్య యోధురాలిని సాగనంపటానికి వచ్చినట్లుగా తండోప తండాలుగా ఎలా తరలివచ్చారు, ఎందుకు తరలివచ్చారు? ప్రజలకు రాజకీయ నాయకుల అవినీతి కేసులు పట్టకుండా పోతున్నాయా? ఏ రాజకీయ నాయకుడు అవినీతి పరుడుకాకుండా ఉన్నాడా అన్న నిర్లిప్త ధోరణి ప్రజల్లో పెరిగిపోతుందా? అవినీతి కేసులో శశికళకు జైలు శిక్ష పడితే తమిళనాడులో ఏర్పడిన సంక్షోభం దానంతట అదే సమసిపోతుందని రాష్ట్ర గవర్నర్ సహా పలు వర్గాలు భావించాయి. శశికళ శిబిరంలో ఉన్నవారు ఖాళీ చేసి అంతా తన శిబిరంలో చేరిపోతారని, ఇక తానే ముఖ్యమంత్రిని అవుతాననుకున్న పన్నీర్ సెల్వం నమ్మకం కూడా వమ్మయింది. రాజకీయ నేతల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. అవినీతి మచ్చలేని పన్నీర్ సెల్వం పంచన చేరితే పంచుకునేది ఏమీ ఉండదు, దండుకునేది ఏమీ ఉండదని శశికళ వెనక చేరిన వారు భావించి ఉండవచ్చు. అందుకనే చిన్నమ్మ చెప్పినట్లు పళనిస్వామికి మద్దతిస్తే ప్రయోజనాలు పొందవచ్చని ఆశించి ఉండవచ్చు! ఇలాంటి ధోరణి పాలకపక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీల నేతల్లో ఉంది. అంతేకాదు, ఎక్కడాలేని విధంగా ఒక్క భారత దేశంలోనే అవినీతి కేసుల విషయంలో పాలక, ప్రతిపక్షాలు పరస్పరం రక్షించుకునే వ్యూహాలు కూడా ఉన్నాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి గగ్గోలు పెడుతూనే ఉన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై అనేక కుంభకోణాల ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయన ప్రభుత్వాన్ని బోను ఎక్కించేందుకు ఇంతవరకు మోదీ ఒక్క చర్య కూడా తీసుకోలేదు. అవినీతి స్కాముల్లో సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాను జైలుకు పంపిస్తామని శపథం చేసిన బీజేపీ నాయకులు కూడా ఆ దిశగా ఏ చర్యలు తీసుకోలేదు. రెయిన్ కోటు వేసుకుని స్నానం చేసే వ్యక్తంటూ మన్మోహన్‌ను ఎద్దేవ చేసే మోదీ ఆయనపై కేసు పెట్టేందుకు మాత్రం ముందుకు రారు. గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్ల కేసుల్లో మోదీని ప్రత్యక్షంగా ఇరికించే అవకాశం ఉన్నప్పటికీ అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ‘మౌత్ కే సౌదాగర్, కూన్ కే దలాల్’ అంటూ సోనియా, రాహుల్ గాంధీలు విమర్శించారు తప్ప, అవకాశం ఉన్నప్పుడు మోదీ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 1993లో జరిగిన ముంబై అల్లర్లలో శివసేన పాత్ర ఉందని వెల్లడించిన శ్రీకష్ణ కమిటీ నివేదికను అమలు చేస్తామని హామీ ఇచ్చిన నాటి కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ విషయంలో మన పొరుగు దేశాలు ఎంతో ముందున్నాయి. బంగ్లాదేశ్‌లో ఖలేదా జియా అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థి షేక్ హసీనా అరెస్టయ్యారు. ఆ తర్వాత షేక్ హసీనా అధికారంలోకి వచ్చినప్పుడు మనీ లాండరింగ్ కేసులో ఖలేదా జియా పెద్ద కుమారుడికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఇక పాకిస్తాన్లో ఇలాంటివి సర్వసాధారణం. 1996లో బేనజీర్ భుట్టో ప్రభుత్వాన్ని సైన్యం రద్దు చేసినప్పుడు ఆమె ప్రవాస జీవితం అనుభవించాల్సి వచ్చింది. ఆమె సోదరుడు ముర్తజా భుట్టో హత్య కేసులో ఆమె భర్త ఆసిఫ్ అలీ జర్దారి జైలుకెళ్లాల్సి వచ్చింది. ముషార్రఫ్ సైనిక కుట్ర అనంతరం నవాజ్ షరీప్‌కు ఉరితీయాల్సి ఉండింది. సౌదీ అరేబియా రాజు ఫాద్ జోక్యంతో ఆయనకు ఆ ఉరి తప్పింది. మన దేశంలో మాత్రం రాజకీయ ప్రత్యర్థులు మాటలతోనే ఒకరినొకరు శిక్షించుకుంటారు. అవినీతి కేసుల విషయానికొస్తే అంతా ఒకటే కులం. పరస్పరం రక్షించుకోవడమే వారి అభిమతం. ఇప్పుడు అవినీతి కేసులను ప్రజలు కూడా పట్టించుకోవడం లేదన్నది తమిళనాడులోనే చూస్తున్నాం. –– ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
గవర్నర్ ముందు నాలుగు దారులు
-
పన్నీర్‌కు మద్దతు ప్రకటించిన దీప
-
తమిళనాడు సీఎం పన్నీరా..పళనినా!
-
కోర్టు తీర్పుతో శశికళ వ్యూహాత్మక నిర్ణయం
-
కంటోన్మెంట్లో శశికళ ట్యాక్స్ డిఫాల్టర్!
రెండేళ్లుగా ఆస్తి పన్ను చెల్లించని వైనం హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ట్యాక్స్ డిఫాల్టర్! మారేడ్‌పల్లి రాధిక కాలనీలో శశికళ నటరాజన్ పేరిట ఉన్న ప్లాట్ నెంబర్ 16లోని ఇంటికి సంబంధించి రెండేళ్లకు రూ. 35,424 ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. మార్చి నెలాఖరు నాటికి నూరు శాతం బకాయిల వసూలు లక్ష్యంగా కంటోన్మెంట్ పరిధిలోని ఆస్తి పన్ను బకాయిదారులకు నోటీసులు పంపిన కంటోన్మెంట్ బోర్డు అధికారులు, శశికళ పేరిట ఉన్న ఇంటికీ నోటీసు పంపారు. 1990 ప్రాంతంలో జయలలిత నగర శివారులోని జీడిమెట్ల గ్రామపరిధిలో జేజే గార్డెన్ పేరిట వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన సమయంలోనే, మారేడ్‌పల్లిలో శశికళ పేరిట ఇళ్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో తరచూ హైదరాబాద్‌కు వచ్చే సమయాల్లో జయలలిత ఇక్కడ నివాసం ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏ–2గా సుప్రీం కోర్టు శశికళను దోషిగా తేల్చిన సందర్భంలో ఆమె పేరిట నగరంలో ఉన్న ఆస్తుల వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. కొంతకాలం క్రితం ప్రైవేటు వ్యక్తులు ఆ ఇంట్లో అద్దెకు ఉండేవారని, నాలుగేళ్లుగా సదరు నివాసం ఖాళీగానే ఉంటోందని స్థానికులు అంటున్నారు. మొత్తానికి కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఆమె ఆస్తి అక్రమమా లేక సక్రమమా అనే చర్చ మొదలైంది. -
ఎవరికీ మద్దతివ్వం: డీఎంకే
సాక్షి, చెన్నై: తమిళనాడులో ప్రస్తుత రాజకీయ సంక్షోభ పరిస్థితుల్లో తాము ఎవరికీ మద్దతివ్వబోమని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ స్పష్టం చేశారు.రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్ మీద ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరో మారు న్యాయాన్ని నిలబెట్టిందని వ్యాఖ్యానించారు. దివంగత సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ అవినీతి, దోపిడీకి తగ్గ తీర్పును కోర్టు ఇచ్చిందన్నారు. ఈ తీర్పుతో భవిష్యత్తులో అవినీతికి పాల్పడేందుకు ఏ రాజకీయ నాయకుడూ సాహసించడని స్టాలిన్ పేర్కొన్నారు. అయితే, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చట్టానికి అనుగుణంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. -
పళనికే పట్టం
⇒ అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నిక ⇒ కోర్టు తీర్పుతో శశికళ వ్యూహాత్మక నిర్ణయం సాక్షి, చెన్నై: తమిళుల అమ్మ దివంగత సీఎం జయలలితకు నమ్మిన బంటుల్లో ఒకరిగా, చిన్నమ్మ శశికళకు విధేయుడిగా ఉన్న ఎడపాడి ఎమ్మెల్యే కే. పళనిస్వామికి అన్నాడీఎంకేలో పట్టం కట్టారు. శశికళకు జైలుశిక్ష తీర్పు నేపథ్యంలో మంగళవారం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కువత్తూరు గోల్డెన్ బే రిసార్ట్ వేదికగా పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అన్నాడీఎంకేలో ప్రిసీడియం చైర్మన్, శాసనసభా పక్ష నేత పదవులు గౌండర్ సామాజిక వర్గానికి దేవర్ సామాజిక వర్గానికి చెందిన శశికళ అప్పగించి ఉండడం గమనార్హం. పన్నీర్ సెల్వం తిరుగుబాటు నేపథ్యంలో సీఎం పగ్గాలు లక్ష్యంగా చిన్నమ్మ శశికళ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. మళ్లీ జైలు కెళ్లాల్సిన పరిస్థితి రావడంతో కువత్తూరు క్యాంప్ వేదికగా శశికళ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. దేవర్ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు అత్యధికంగా పార్టీలో ఉన్నా, గౌండర్ సామాజిక వర్గాన్నే కాదు, ఇతర సామాజిక వర్గాల్ని ఆకర్షించే నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగ్గ విషయం. ఇప్పటికే ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా గౌండర్ సామాజిక వర్గానికి చెందిన సెంగోట్టయన్ వ్యవహరిస్తున్న నేపథ్యంలో శాసన సభా పక్ష నేత పదవి అదే సామాజిక వర్గానికి కట్టబెట్టడం విశేషం. నమ్మినబంటుకే పట్టం సేలం జిల్లా ఎడపాడి నియోజకవర్గం నెడుంగులం సమీపంలోని శిలవన్ పాళయంకు చెందిన కరుప్ప గౌండర్ తనయుడిగా రాజకీయాల్లోకి మూడు దశాబ్దాల క్రితం అడుగుపెట్టిన కే.పళనిస్వామి దివంగత సీఎం జయలలితకు నమ్మినబంటుల్లో ఒకరిగా ఉన్నారు. జయలలిత కష్టకాలంలో వెన్నంటి ఉన్న నాయకుల్లో పళనిస్వామి కూడా ఒకరు. నాలుగుసార్లు ఒకే నియోజకవర్గం నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కడంతో ఆయన పేరు ఎడపాడి కే పళనిస్వామిగా మారింది. పన్నీర్ తదుపరి స్థానాన్ని పళనిస్వామికి అప్పగించాలన్న లక్ష్యంతో కొన్నేళ్లపాటు చిన్నమ్మ శశికళ తీవ్రంగానే ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే, విశ్వాసపాత్రుడు పన్నీర్‌కే అమ్మ జయలలిత అండగా నిలిచారు. అమ్మ మరణం నేపథ్యంలో పళనిస్వామి చేతికి సీఎం పగ్గాలు అప్పగించడం లక్ష్యంగా చిన్నమ్మ వ్యూహరచన చేసినా, కేంద్రం ఒత్తిడితో పన్నీర్‌కు అప్పగించక తప్పలేదు. పన్నీర్ ధిక్కారస్వరంతో సీఎం పగ్గాలు తానే చేపట్టాలని ప్రయత్నించి చివరకు జైలుశిక్షతో వెనక్కు తగ్గారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి తన విధేయుడు పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా తెరమీదకు తెచ్చి సఫలీకృతులయ్యారు. దేవర్ల అడుగులెటు? అన్నాడీఎంకేలోని ఎమ్మెల్యేల్లో మెజారిటీ శాతం దేవర్ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. తదుపరి గౌండర్, నాడర్ ఇతర సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. గౌండర్ సామాజిక వర్గానికి రెండు కీలక పదవులు అప్పగించిన దృష్ట్యా, దేవర్, నాడార్ సామాజిక వర్గానికి చెందినవారు ఎలా స్పందించబోతున్నారో అన్న ప్రశ్న బయలు దేరింది. దేవర్ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేలో 50 శాతం మేరకు ఉండడం గమనార్హం. శాసనసభాపక్ష నేతగా... తనకు జైలు శిక్ష పడ్డ సమాచారంతో శశికళ కాసేపు ఉద్వేగానికి లోనైనా తదుపరి అన్నాడీఎంకేను రక్షించుకోవడం, ప్రభుత్వాన్ని చేపట్టాలన్న కాంక్షతో శాసనసభాపక్ష నేత ఎంపిక మీద దృష్టి పెట్టారు. కువత్తూరులోని క్యాంప్ వేదికగా ఎమ్మెల్యేలతో చర్చించారు. ముగ్గురి పేర్లను తెర మీదకు తెచ్చినట్టు సంకేతాలు ఉన్నాయి. ఇందులో పార్టీ ప్రిసీడియం చైర్మన్ సెంగోట్టయన్, రహదారుల శాఖ మంత్రి కె.పళనిస్వామి, ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ పేర్లు ఉన్నట్టు సమాచారం. అదే సమయంలో అమ్మ జయలలిత అన్న కుమారుడు దీపక్ పేరు ప్రస్తావనకు వచ్చినా, రాజకీయ అనుభవం లేని దృష్ట్యా, సాహసం చేయకూడదన్న సూచనను పలువురు ఎమ్మెల్యేలు చేసినట్టు తెలిసింది. చివరకు శాసనసభాపక్ష నేత ఎంపిక బాధ్యతను శశికళకే అప్పగించారు. ఇక్కడ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి తన విధేయుడు పళనిస్వామి పేరును అటవీ శాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ ద్వారా తెర మీదకు తెచ్చారు. క్షణాల్లో మంత్రి నిర్ణయాన్ని ప్రిసీడియం చైర్మన్ సెంగోట్టయన్ ఆమోదించారు. దీంతో అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా ఎడపాడి కే పళనిస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తక్షణం ఫ్యాక్స్ ద్వారా ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుకు లేఖను పంపించారు. తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న కాసేపటికి మీడియా ముందుకు వచ్చిన పళనిస్వామి 125 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ ఉందని, తనను ఆహ్వానించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. -
కథ మారింది!
⇒ పన్నీర్ అభిమానుల ఆనందోత్సాహాలు ⇒ సుప్రీం తీర్పుతో నిస్పృహల్లో కువత్తూరు శిబిరం ⇒ తీర్పు వెలువడిన వెంటనే శశికళ కన్నీళ్లు సాక్షి ప్రతినిధి, చెన్నై: రోజుకో మలుపు తిరుగుతున్న అన్నాడీఎంకే రాజకీయాలు ఒక్క రోజులో, ఒక్క తీర్పుతో తలకిందులయ్యాయి. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, శాసనసభాపక్ష నేత శశికళకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పు అన్నాడీఎంకేలోని వైరివర్గాల పరిస్థితిని తారుమారు చేసేసింది. సోమవారం వరకు ఎంతో ధీమాతో ఉండిన శశికళ కంట కన్నీరు కారగా... ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకున్నా ప్రజాబలంతో నెట్టుకొస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంపై పన్నీటి జల్లు కురిసింది. ఆస్తుల కేసులో మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువడుతుందనే సమాచారం శశికళ, పన్నీర్‌సెల్వం మద్దతుదారుల్లో భరించలేని ఉత్కంఠను రేకెత్తించింది. పోయెస్‌గార్డెన్, అన్నాడీఎంకే కేంద్ర కార్యాలయం వైపు శశికళ అనుచరగణం, చెన్నై అడయారు గ్రీన్‌వేస్ రోడ్డులోని పన్నీర్‌సెల్వం నివాసం వైపు ఆయన మద్దతుదారులు ఉదయం తొమ్మిది గంటల నుంచే వందలాదిగా తరలిరావడం ప్రారంభించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అటు కువత్తూరులో, ఇటు పన్నీర్‌సెల్వం ఇంటి వద్ద బందోబస్తును పెంచారు. సుప్రీం తీర్పు వెలువడగానే పన్నీర్‌సెల్వం అభిమానులు ఆనందోత్సాహాలతో కేకలు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా టపాసులు కాల్చి ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. సుప్రీంతీర్పు తమకు అనుకూలమని భావించిన పన్నీర్ ఇదే అదనుగా శశికళ మద్దతుదారు ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు కువత్తూరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. శాంతి భద్రతల సమస్య ఏర్పడగలదని కొందరు అనుచరులు, అధికారులు సూచించడంతో ఆయన తన ప్రయాణాన్ని విరమించు కున్నారు. అయితే ఈ కేసులో దివంగత జయలలితనే తొలిముద్దాయి అన్న విషయాన్ని విస్మరించి పన్నీర్ వర్గం సంబరాలు చేసుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. జయలలిత మరణించారు కాబట్టే ఆమెకు వ్యతిరేకంగా వచ్చిన అప్పీళ్లను రద్దు చేశామని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేస్తున్నారు. దుఃఖంతో కుంగిపోయిన కువత్తూరు... సుప్రీం తీర్పుతో శశికళ, ఆమె మద్దతుదారులు నిరాశానిస్పృహల్లో కూరుకుపోయారు. సోమవారం రాత్రి అక్కడే బస చేసిన శశికళ తీర్పు ప్రతికూలమైనా, అనుకూలమైనా తన వెంటే ఉండాలని ఎమ్మెల్యేలను కోరారు. మద్దతుదారులైన ఎమ్మెల్యేతో కలిసి టీవీ చూస్తున్న శశికళ తీర్పు వెలువడగానే నిశ్చేష్టురాలై కన్నీళ్లు పెట్టుకున్నారు. దుఃఖంతో కుంగిపోయిన శశికళను మహిళా ఎమ్మెల్యేలు ఓదార్చే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటిలో తేరుకున్న శశికళ మరలా ఎమ్మెల్యేలతో సమావేశమై, న్యాయనిపుణులతో చర్చించారు. తీర్పు శశికళకు ప్రతికూలంగా రావడంతో అదనంగా వేలాదిమంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నానికి ఆమెను అరెస్ట్ చేస్తారనే సమాచారంతో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు బైటకు వచ్చి పోలీసులను అడ్డుకుని వాగ్వివాదానికి దిగారు. రిసార్టు వద్ద ప్రయివేటు బందోబస్తు విధుల్లో ఉన్నవారిని, శశికళ అనుచరులను పోలీసులు ఐదు ప్రభుత్వ బస్సుల్లో ఎక్కించి చెన్నైకి పంపివేశారు. తీర్పును పునఃసమీక్షించాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఢిల్లీలో ఉన్న లోక్‌సభ ఉప సభాపతి తంబిదురై ప్రకటించారు. నిత్యం రద్దీగా ఉండే పోయెస్‌గార్డెన్‌లో జనం పలుచబడగా, ఉన్న కొద్దిపాటి అనుచరులు తీర్పు వెలువడిన కొద్దిసేపటికే నిష్క్రమించడంతో వెలవెలపోయింది. అలాగే అన్నాడీఎంకే కార్యాలయం ప్రధాన ద్వారాన్ని పాక్షికంగా మూసివేసి పార్టీ శ్రేణులంతా లోపలే దిగాలుగా ఉండిపోయారు. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఇంటి వద్ద కూడా అదనంగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ముందు జాగ్రత్తగా 1,100 మందిని అరెస్ట్ చేశారు. -
పన్నీర్ ఇంట ‘దీప’o
పన్నీర్‌కు మద్దతు ప్రకటించిన దీప సాక్షి, చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి అమ్మ జయలలిత మేనకోడలు దీప తోడయ్యారు. మెరీనాతీరం వేదికగా జయలలిత సమాధి సమక్షంలో మంగళవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆమె పన్నీర్ శిబిరంలో చేరారు. అన్నాడీఎంకేలోకి ఇదే తన రాజకీయ అరంగ్రేటమని ప్రకటించారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా దీప గళమెత్తిన విషయం తెలిసిందే. ఈనెల 24న మేనత్త జయంతి రోజున రాజకీయంగా కీలక నిర్ణయం ప్రకటిస్తానని ఆమె ఇప్పటికే ప్రకటించారు. ఆ మేరకు దీప పేరవై వర్గాలతో, తన ఇంటికి తరలివస్తున్న అమ్మ అభిమానులతో సంప్రదింపులు జరిపారు. ఈ పరిస్థితుల్లో పన్నీర్‌సెల్వం తిరుగుబాటు చేయడంతో శశికళ వ్యతిరేకులు అటువైపు తరలడం మొదలెట్టారు. అదే సమయంలో తమ శిబిరంలోకి రావాలని పన్నీర్ ఇప్పటికే పలుమార్లు దీపకు ఆహ్వానం పలికారు. ఆ మేరకు ఆమె మంగళవారం రాత్రి పన్నీర్ శిబిరంలో చేరారు. -
పన్నీర్‌కు శాశ్వత ఉద్వాసన
తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నిర్ణయం సాక్షి, చెన్నై: ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌సెల్వంకు మద్దతుగా నిలిచిన పార్టీ నేతలపై అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తిరుగుబాటుదారులుగా ముద్రవేశారు. పన్నీర్‌సెల్వం, మంత్రి పాండియరాజన్తో పాటు 20 మందిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి మంగళవారం శాశ్వతంగా తొలగించారు. కోర్టు తీర్పు వెలువడ్డ కాసేపటికి ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు మినహా, పార్టీ పదవుల్లో ఉన్న ఇతర నాయకుల్ని ప్రాథమిక సభ్యత్వం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ శశికళ ప్రకటించారు. ఇందులో ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌సెల్వం, విద్యాశాఖ మంత్రి పాండియరాజన్ కూడా ఉన్నారు. అలాగే, పార్టీ అధికార ప్రతినిధి పొన్నయ్యన్, మాజీ మంత్రులు నత్తం విశ్వనాథన్, కేపీ.మునుస్వామి, పి. మోహన్లతో పాటు మొత్తం 20 మందిని అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించినట్టు ప్రకటించారు. -
పన్నీరా... పళనినా!
⇒ న్యాయ నిపుణులతో సంప్రదింపులు ⇒ గవర్నర్‌తో పళనిస్వామి భేటీ సాక్షి, చెన్నై: బలనిరూపణకు లేదా ప్రభుత్వ ఏర్పాటుకు తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ఎవర్ని ఆహ్వానిస్తారోనన్న ఉత్కంఠ తమిళనాట బయలుదేరింది. ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంను ఆహ్వానిస్తారా? అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన కె.పళనిస్వామిని ఆహ్వానిస్తారా? అన్న విషయమై విస్తృతచర్చ జరుగుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంగళవారం తనకు వ్యతిరేక తీర్పు వెలువడడంతో శశికళ... అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎంపిక చేశారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ సాయంత్రం ఐదు గంటలకు 13 మంది మంత్రులతో కలసి పళనిస్వామి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. 5:30 గంటలనుంచి 15 నిమిషాలపాటు గవర్నర్‌తో భేటీ జరిగింది. తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పెట్టిన సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు పళనిస్వామి అందజేశారు. లేఖను స్వీకరించిన గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. పళనిస్వామి, మంత్రులు భేటీ అనంతరం మీడియా ముందుకు సైతం రాకుండా నేరుగా కువత్తూరు క్యాంప్‌కు వెళ్లారు. పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించినట్లు శశికళ ప్రకటించడాన్ని కూడా పరిగణించి, న్యాయనిపుణులతో చర్చించినానంతరం గవర్నర్ తన నిర్ణయాన్ని ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. -
అమ్మ ఆత్మ ఇచ్చిన తీర్పు
సెంటిమెంట్ పండిస్తున్న పన్నీర్‌సెల్వం సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా వెలువడిన సుప్రీంకోర్టు తీర్పుకు అమ్మ సెంటిమెంట్‌ను జోడించి తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం. తనది అమ్మ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఇది అమ్మ ఆత్మ ఇచ్చిన తీర్పు అని ఆయన ప్రచారం ప్రారంభించారు. సుప్రీంకోర్టు శశికళకు వ్యతిరేకంగా తీర్పువెలువడగానే మీడియా ముందుకు వచ్చిన పన్నీర్‌సెల్వం మరోసారి అమ్మ సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చారు. ‘అమ్మ మరణించలేదు, ఆమె ఆత్మ మనచుట్టూ తిరుగుతూనే ఉంది. ఆమె ఆశించిన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు జయ అత్మనే ఈ తీర్పు చెప్పిందన్నారు. అమ్మ పాలన సాగేందుకు దోహదపడడం మన కర్తవ్యం, తరలిరండని శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. కాగా, మంగళవారం మేట్టూ పాళయం ఎమ్మెల్యే చిన్నరాజ్, ఎమ్మెల్యే సెమ్మలైలు çపన్నీర్ శిబిరంలో చేరడంతో సెల్వంకు మద్దతిచ్చే వారి సంఖ్య పదికి చేరింది. శశికళని తొలగించాలని ఈసీకి వినతి పన్నీర్ మద్దతుదారులైన 12 మంది ఎంపీల లేఖ అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించాల్సిందిగా కోరుతూ పన్నీర్‌సెల్వంకు మద్దతు పలుకుతున్న 12 మంది అన్నాడీఎంకే ఎంపీలు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లపాటు నిరంతరాయంగా సభ్యులుగా ఉన్నవారే ప్రధాన కార్యదర్శి పదవికి అర్హులని పార్టీ విధివిధానాల్లో ఉందని చెప్పారు. అంతేగాక నిబంధన 20 (2) ప్రకారం పార్టీ ప్రధాన కార్యదర్శిని తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, అండమాన్–నికోబార్ దీవుల్లోని పార్టీ సభ్యులు మాత్రమే ఎన్నుకోవాలని తెలిపారు. పార్టీ చట్టంలో మార్పులు, చేర్పులు, కొత్తవాటిని రూపొందించడం అన్నాడీఎంకే సర్వసభ్యులకు మాత్రమే హక్కు ఉందని నిబంధన 43లో పేర్కొని ఉందని వారు పేర్కొన్నారు. అయితే ఇవేమీ పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా శశికళ ఎన్నిక చెల్లదని వారు వాదించారు. ఈ కారణంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళను అనర్హురాలిగా ప్రకటించాలని కోరుతూ పన్నీర్‌సెల్వం మద్దతుదారులైన 12 మంది ఎంపీలు మంగళవారం ఎన్నికల కమిషన్‌కు ఉత్తరం రాశారు. -
గవర్నర్ ముందు నాలుగు దారులు
ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో.. ముఖ్యమంత్రి పీఠంపై శశికళ ఆశలు ఆవిరయ్యాయి. ఆమె తక్షణమే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో అన్నా డీఎంకే శాసనసభా పక్ష నేతగా ఇ.పళనిస్వామిని నియమించింది. మరోవైపు.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని ధీమాగా ఉన్నారు. దీంతో గవర్నర్ విద్యాసాగర్‌రావు మరోసారి రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. నిపుణుల అంచనా ప్రకారం ప్రస్తుతం ఆయన ముందు నాలుగు మార్గాలు కనిపిస్తున్నాయి. అవేమిటంటే... –(సాక్షి నాలెడ్జ్సెంటర్) 1 ముఖ్యమంత్రి పదవి కోసం మళ్లీ ఇద్దరు నాయకులు పోటీపడుతున్నపుడు.. వారిలో ఎవరో ఒకరిని ప్రభుత్వ ఏర్పాటుకు ఎంపిక చేసే అధికారం గవర్నర్‌కు ఉంది. అంటే.. పన్నీర్ సెల్వం, పళనిస్వామిల్లో ఎవరో ఒకరిని తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి.. ఆ తర్వాత సభలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా నిర్దేశించవచ్చు. 2 రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకుని, ఆ పేరును తనకు తెలియజేయాల్సిందిగా శాసన సభను గవర్నర్ కోరవచ్చు. 3 ఒకవేళ ఇరు వర్గాల వారూ.. సీఎం పదవి చేపట్టడానికి తమకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పినట్లయితే, గవర్నర్ అందుకు సంబంధించిన నిర్ణయాన్ని శాసనసభకు వదిలిపెట్టవచ్చు. 4 మరో కీలకమైన మార్గం.. రాష్ట్ర సీఎం ఎంపిక కోసం రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించడం. ఏ వర్గానికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందనే దానిపై గందరగోళం తలెత్తినపుడు, దానిని పరిష్కరించలేనపుడు ఈ దారిని ఎంచుకోవచ్చు. రాజ్యాంగంలోని 175 (2) అధికరణ ప్రకారం.. శాసనసభ రహస్య బ్యాలెట్ ద్వారా తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిందిగా గవర్నర్ కోరవచ్చు. అదే బలపరీక్ష అవుతుంది. 1998లో ఉత్తరప్రదేశ్‌లో జగదాంబికాపాల్ ఉదంతంలో ఈ రహస్య బ్యాలెట్ పద్ధతిని చివరిసారిగా ఉపయోగించారు. జగదాంబి కాపాల్, కళ్యాణ్ సింగ్‌లలో ఒకరిని సీఎంగా ఎన్నుకోవడం కోసం శాసనసభలో బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. అప్పుడు కళ్యాణ్ సింగ్ 29 ఓట్ల ఆధిక్యంతో గెలిచి సీఎం పదవి చేపట్టారు. -
రేపు శశికళ లొంగిపోయే అవకాశం!
చెన్నై : గోల్డెన్ బే రిసార్ట్ నుంచి పోయేస్ గార్డెన్‌కు వీకే శశికళ వెళ్లిపోయారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించిన విషయం తెలిసిందే. జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ అమితవరాయ్‌లతో కూడిన ధర్మాసనం ఆరో నెంబరు కోర్టులో ఈ తీర్పు ఇచ్చింది. ఆమెతో పాటు ఈ కేసులో ఉన్న మరో ముగ్గురిని కూడా దోషులుగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. శశికళకు రూ. 10 కోట్ల జరిమానా విధించింది. దాంతో తమిళ రాజకీయ డ్రామాకు పూర్తిగా తెరపడినట్లయింది. ఈ కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల శిక్ష విధించింది. వెంటనే ఆమె లొంగిపోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఇక అసలు శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అన్నది లేకుండా పోయింది. రేపు(బుధవారం) బెంగళూరులో శశికళ లొంగిపోయే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరో వైపు తమిళనాడులోని మెరీనా బీచ్‌లో జయలలిత సమాధి వద్దకు మంగళవారం రాత్రి పన్నీర్ సెల్వం బృందం చేరుకుంది. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం గ్రూప్‌లో జయ మేనకోడలు దీప చేరారు. పన్నీర్ సెల్వం, దీప, పొన్నయన్లు జయ సమాధి వద్ద నివాళులర్పించారు. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
ప్రజలకు కావాల్సింది 'అమ్మ' వారసులు
చెన్నై : ముఖ్యమంత్రి కావాలనుకున్న శశికళ ప్రయత్నానికి కోర్టు తీర్పు అడ్డు తగలడంతో తన వారసునిగా ఎడపాడి కె పళనిస్వామిని ప్రకటించడంపై తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఏఐఏడీఎంకే పార్టీకి, ప్రజలకు కావాలిసింది తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసులు కానీ, శశికళ వారసులు కాదని ఎద్దేవా చేశారు. ప్రజలు కోరుకుంటున్న అమ్మ వారసుడు పన్నీర్ సెల్వానికి శాసన సభ్యులు మద్దతు తెలపాలని కోరారు. ప్రజలు కోరుకుంటున్న అమ్మ వారసుడు పన్నీర్ సెల్వంకి మద్దతు తెలపకపోతే శాసన సభ్యులు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని, జల్లికట్టు తరహాలో మరో ఉద్యమం మొదలు అయ్యే అవకాశం ఉందని కేతిరెడ్డి హెచ్చరించారు. -
నాటి హైకోర్టు తీర్పులో అసంబద్ధతలివీ..
జయ కేసులో కర్ణాటక ప్రభుత్వం సవాల్ చేసిన 10 అంశాలు జయలలితపై ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జయ సహా నలుగురుని దోషులుగా నిర్ధారిస్తూ బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును.. కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. జయలలిత సహా నలుగురినీ నిర్దోషులుగా విడుదల చేసింది. ప్రత్యేక కోర్టు తీర్పులో పేర్కొన్న పలు అంశాలను.. హైకోర్టు అసంబద్ధంగా మార్చిందని, ఆస్తుల లెక్కల్లో తేడాలు ఉన్నాయని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అందులో 10 కీలకమైన అంశాలను లేవనెత్తింది. దీని ఆధారంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ఆర్.కుమారస్వామి ఇచ్చిన తీర్పును తాజాగా కొట్టివేసింది. విచారణ కోర్టు అయిన ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. నలుగురు నిందితులూ దోషులేనని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో.. కర్ణాటక ప్రభుత్వం తన అప్పీలులో లేవనెత్తిన 10 కీలక అంశాలు ఇవీ... మొత్తం భవనాల విలువ: 1,66,839.68 చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనాలకు సంబంధించి పీడబ్ల్యూడీ విలువకట్టి, 20 శాతం తగ్గించిన తర్వాత, మొత్తం ఖరీదును రూ. 22,53,92,344 గా విచారణ కోర్టు నిర్ణయించింది. ఈ భవనాల నిర్మాణ వ్యయాన్ని హైకోర్టు మళ్లీ విలువకట్టింది. మొత్తం విలువ రూ. 5,10,54,060 గా నిర్ణయించింది. ‘ఖరీదైన బహుళ అంతస్తుల భవనాల’ నిర్మాణ వ్యయాన్ని, పీడబ్ల్యూడీ ‘షెడ్డు’ నిర్మాణంతో పోల్చింది. హైకోర్టు నిర్ధారించిన మొత్తం ఖరీదు రూ. 5.10 కోట్లు.. నిందితులు స్వయంగా అంగీకరించిన ఖరీదు రూ. 8,60,59,261 కన్నా తక్కువ. ‘దత్త పుత్రుడు’ వి.ఎన్.సుధాకరన్ వివాహ వ్యయం: ఈ వ్యయం రూ. 6,45,04,222 గా ప్రాసిక్యూషన్ లెక్కకట్టింది. విచారణ కోర్టు ఈ వ్యయం మొత్తం రూ. 3,00,00,000 గా నిర్ణయించింది. హైకోర్టు ఒక్క జయలలిత ఆదాయ పన్ను పత్రం ప్రాతిపదికగా ఆ మొత్తాన్ని కేవలం రూ. 28.68 లక్షలకు తగ్గించింది. ఆదాయంలో భాగంగా రుణాలు: నిందితులు తీసుకున్న రుణాల విలువ రూ. 5,99,85,274 అని డీవీఏసీ గుర్తించింది. అయితే జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న పది రుణాల మొత్తం రూ. 24,17,31,274 వివరాలను డీవీఏసీ విస్మరించిందని హైకోర్టు పేర్కొంది. ఈ అంశాన్ని నిందితులు, తమ అప్పీళ్లలో కానీ, హైకోర్టుకు రాతపూర్వకంగా సమర్పించిన వినతులలో కానీ ఎక్కడా చెప్పలేదు. హైకోర్టు న్యాయమూర్తి ఆ పది రుణాల మొత్తాన్ని లెక్కగట్టడంలో పొరపాటు చేశారు. అవన్నీ కలిపితే కేవలం రూ. 10.67 కోట్లు మాత్రమే అవుతాయి, రూ. 24.17 కోట్లు కాదు. అక్రమాస్తుల వాటా 76.7 శాతం: కర్ణాటక ప్రభుత్వం లెక్క ప్రకారం మొత్తం ఆస్తులు రూ. 37,59,02,466 కాగా.. అందులో మొత్తం ఆదాయం రూ. 21,26,65,654 తీసివేయగా వచ్చిన రూ. 16,32,36,812 అక్రమాస్తులు. దీనిని 100తో హెచ్చించగా వచ్చిన మొత్తాన్ని.. ఆదాయం రూ. 21,26,65,654 తో భాగిస్తే.. అది 76.7 శాతం అవుతుంది. ద్రాక్ష తోట నుంచి ఆదాయం: హైదరాబాద్‌లోని ద్రాక్ష తోట నుంచి మొత్తం వ్యవసాయ ఆదాయం రూ. 5,78,340 గా ప్రాసిక్యూషన్ లెక్కగట్టింది. ఆ ఆస్తి నుంచి వచ్చిన ఆదాయం రూ. 52,50,000 అని జయలలిత లెక్కగట్టారు. విచారణ కోర్టు ఆ ఆదాయాన్ని రూ. 10,00,000 గా లెక్కించింది. ఆ ఆదాయాన్ని హైకోర్టు రూ. 46,71,600 అని లెక్కించింది. ఆదాయం లెక్కలో కానుకలు: జయలలిత తన 44వ జన్మదినం రోజున అందుకున్న రూ. 1.5 కోట్ల విలువైన కానుకలను హైకోర్టు చట్టబద్ధమైన ఆదాయంగా పరిగణించింది. కర్ణాటక ప్రభుత్వం వేసిన పిటిషన్లో.. ఈ అంశంపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు వద్ద పెండింగ్‌లో ఉందని, నిందితులు ఈ వాస్తవాన్ని హైకోర్టు దృష్టికి తీసుకురాలేదని పేర్కొంది. అలాగే, అవినీతి నిరోధక చట్టం ప్రకారం.. చట్టబద్ధమైన ఆదాయ వనరుగా స్వీకరించిన ఏ కానుక గురించి అయినా అధికారులకు తెలియజేయాల్సి ఉంటుందని ప్రస్తావించింది. శశి ఎంటర్ ప్రైజెస్ ఆదాయం: జయలలిత, శశికళ నటరాజన్‌ల భాగస్వామ్య సంస్థ అయిన శశి ఎంటర్ ప్రైజెస్‌కు రూ. 12,60,800 అద్దె ఆదాయం ఉందని, కానీ ప్రాసిక్యూషన్ కేవలం రూ. 6,15,900 మాత్రమే పరిగణనలోకి తీసుకుందని నిందితులు సమర్పించిన వినతిని విచారణ కోర్టు తిరస్కరించింది. కానీ.. హైకోర్టు ఊహాత్మక ప్రాతిపదికగా రూ. 25,00,000 మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుందని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. జయా పబ్లికేషన్స్ ఆదాయం: జయా పబ్లికేషన్స్ ద్వారా మొత్తం వాణిజ్య ఆదాయం రూ. 1.15 కోట్లు అని నిందితులు చెప్పగా, హైకోర్టు తీర్పు దానిని అసంబద్ధంగా రూ. 4 కోట్లకు పెంచింది. మొత్తం టర్నోవర్‌ను మొత్తం ఆదాయంగా తప్పుగా లెక్కించింది. సూపర్ డూపర్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ ఆదాయం: మూడో నిందితుడు, సంస్థ ప్రొప్రైటర్ వి.ఎన్.సుధాకరన్ తమ సంస్థ రూ. 1.10 కోట్ల చట్టబద్ధమైన ఆదాయం సముపార్జించిందని పేర్కొన్నారు. విచారణ కోర్టు ఈ వాదనను తిరస్కరించింది. విచారణ కోర్టు నిర్ధారణను హైకోర్టు తీర్పు పక్కనపెట్టేసింది. ఆ ఆదాయం రూ. 1,00,00,000 కోటి అని ఏకపక్షంగా అంచనా వేసింది. ఆస్తుల విక్రయాల సొమ్ము: స్థిరాస్తులకు సంబంధించి 146 విక్రయాలను విచారణ కోర్టు నమోదు చేసింది. రియల్ ఎస్టేట్ విక్రయాల ద్వారా వచ్చిన ఆ మొత్తం దాదాపు రూ. 20 కోట్లుగా అంచనా వేసింది. హైకోర్టు తీర్పులో.. ఆ 146 విక్రయాల నుంచి అకారణంగా 49 విక్రయాలను విస్మరించింది. విక్రయాల ద్వారా వచ్చిన మొత్తాన్ని రూ. 6,24,09,120 కి తగ్గించింది. - (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
కోలాహలం
► పన్నీరు ఇంట అభిమాన కెరటం ► తండోపతండాలుగా రాక ► ఆనందోత్సాహాల రెట్టింపు ► కువత్తూరుకు చిన్నమ్మ పరుగు ► పోయెస్‌గార్డెన్ వద్ద హడావుడి ఆపద్ధర్మ సీఎం పన్నీరుసెల్వం ఇంటి పరిసరాల్లో ఆదివారం కోలాహల వాతావరణం నెలకొంది. అభిమాన కెరటం ఉప్పొంగింది. తండోపతండాలుగా రాష్ట్రం నలుమూలల నుంచి అన్నాడీఎంకే కార్యకర్తలు తరలివచ్చి మద్దతు పలికారు. ఐదుగురు ఎంపీలు, పదిమంది మాజీ ఎమ్మెల్యేలు పన్నీరు శిబిరంలో చేరారు. పన్నీరు శిబిరంలో ఆనందోత్సాహాలు రెట్టింపు అయితే, చిన్నమ్మ శిబిరంలో ఉత్కంఠ తప్పడం లేదు. మెజారిటీ ఎమ్మెల్యేలు క్యాంప్‌లోనే ఉండడం వారికి ఊరట. పోయెస్ గార్డెన్ వద్ద హడావుడి సాగినా, చిన్నమ్మ క్యాంప్‌నకు పరుగులు తీయడంతో తదుపరి అడుగులు ఎలా ఉంటాయోనన్న ఎదురు చూపులు పెరిగాయి. సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ, ఆపద్ధర్మ సీఎం పన్నీరుసెల్వం మధ్య సమరం రోజు రోజుకు ఉత్కంఠ రేపుతోంది. ఎమ్మెల్యేలు చిన్నమ్మ ఏర్పాటు చేసిన శిబిరంలోనే ఉన్నా, ఆ పార్టీ ఎంపీలు ఒక్కొక్కరుగా పన్నీరు శిబిరంలో చేరుతున్నారు. రెండు మూడు రోజులుగా గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు ఇంట సందడి వాతావరణం నెలకొన్నా, ఆదివారం వాతావరణం కోలాహలంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి వ్యాన్లు, బస్సుల్లో అన్నాడీఎంకే కింది స్థాయి కార్యకర్తలు సైతం పోటెత్తుతున్నారు. డప్పులు వాయిస్తూ, అన్నాడీఎంకే పతకాలను చేతబట్టి, పన్నీరుకు మద్దతుగా నినదిస్తూ తండోపతండాలుగా తరలి వచ్చి మద్దతు పలుకుతుండడం విశేషం. పన్నీరుకు మద్దతు పలికేందుకు అభిమాన కెరటం తరలి వస్తుండడంతో ఆ పరిసరాలు కిక్కిరిశాయి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు తీవ్రంగా కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి. ఇక, ఆ పరిసరాల్లోని దుకాణాల్లో వ్యాపారం మరింతగా పుంజు కుంది. అలాగే, అన్నాడీఎంకే పతాకాలు, అమ్మ, పన్నీరు ఫొటోలు, శాలువాలతో కూడిన రోడ్డు సైడ్ దుకాణాలు పుట్టుకు రావడం గమనార్హం. ఆనందోత్సాహాలు రెట్టింపు : అభిమాన కెరటం పన్నీరుకు మద్దతు ప్రకటించినానంతరం, అక్కడ ఏర్పాటు చేసిన హోర్డింగ్, బ్యానర్లలో తమ సంతకాలు పెట్టారు. పోయెస్‌గార్డెన్ లోని అమ్మ జయలలిత ఇంటిని స్మారక మందిరంగా ప్రకటించాల్సిందేనని నినదిస్తూ, తమ సంతకాలు చేశారు. తూత్తుకుడి ఎంపీ జయసింగ్ త్యాగరాజ్ నటర్జీ, వేలూరు ఎంపీ సెంగుట్టువన్, పెరంబలూరు ఎంపీ మారుతీ రాజా, విల్లుపురం ఎంపీ రాజేంద్రన్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణన్ లతో పాటు పది మంది మాజీ ఎమ్మెల్యేలు పన్నీరుకు మద్దతు ప్రకటించారు. దీంతో పన్నీరు శిబిరంలో ఎంపీల సంఖ్య మొత్తం పదికి చేరింది. అలాగే, సినీనటులు, అరుణ్ పాండియన్, రామరాజన్, విఘ్నేష్, త్యాగు, మనోబాల సైతం పన్నీరుకు జై కొట్టారు. రామరాజన్ మీడియాతో మాట్లాడుతూ పన్నీరు సెల్వం నిజమైన హీరో అని కొనియాడారు. ఆయన తీసుకున్న నిర్ణయం ఎంతో ఆనందాన్ని కల్గించిందన్నారు. ఇక, పన్నీరుకు మద్దతుగా మిస్డ్ కాల్ కొట్టు నినాదానికి విశేష స్పందన రావడం గమనార్హం. పన్నీరు శిబిరంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణన్ చేరిన సమాచారంతో ఆయన చేతిలో ఉన్న విల్లుపురం ఉత్తర జిల్లా పార్టీ కార్యదర్శి పదవిని తొలగిస్తు చిన్నమ్మ శశికళ నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదుల హోరు : ఆదివారం కూడా ఆయా నియోజకవర్గాల్లో తమ ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ ఓటర్లు పోలీసుస్టేçÙన్లలో ఫిర్యాదు చేశారు. మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజ్ కార్యాలయం వద్ద పలువురు ఆందోళనకు సైతం దిగారు. పన్నీరుకు మద్దతుగా నిర్ణయం తీసుకోవాలని చిన్నమ్మ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా పలు చోట్ల అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళనకు దిగడం గమనార్హం. అలాగే, మంత్రులు ఓఎస్ మణియన్, వలర్మతి, దురైకన్ను కన్పించడం లేదని వారి నియోజకవర్గ ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూవత్తూరుకు చిన్నమ్మ : పోయెస్‌గార్డెన్ వద్ద పార్టీ వర్గాలతో చిన్నమ్మ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సమావేశం అయ్యారు. పార్టీ ముఖ్యులతోనూ, పార్టీలో వ్యాఖ్యాతలుగా ఉన్న సినీ నటులు పలువురితోనూ చిన్నమ్మ భేటీ అయ్యారు. ఈసందర్భంగా తమకు బెదిరింపులు వస్తున్నట్టుగా చిన్నమ్మ దృష్టికి సీఆర్ సరస్వతి, గుండు కల్యాణం తదితర నటులు తీసుకెళ్లారు. ఇక, నాలుగున్నర గంటల సమయంలో చిన్నమ్మ కువత్తూరుకు వెళ్తూ మీడియాతో మాట్లాడడం ఆ శిబిరంలో కాస్త జోష్‌ను నింపింది. ఆందోళన వద్దు అని, అధికారం మనదేనని ఆమె చేసిన వ్యాఖ్యలతో శ్రేణులు ఆనందంలో మునిగారు. ఇక, ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల మరింత ఆనందమే. ఎమ్మెల్యేలు అందరూ తన వెంటేనని, పార్టీ పరిరక్షణ, ప్రభుత్వానికి భంగపాటు రానివ్వకుండా స్వతంత్రంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ ఉన్నారని ఆమె వ్యాఖ్యానించడం ఆ శిబిరంలో కాస్త టెన్షన్ తగ్గినట్టు అయింది. -
శశికళ నుంచి కేసీఆర్‌కు ప్రాణహాని
టీపీసీసీ అధికార ప్రతినిధి రమ్య ఆరోపణ సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు ఆయన మరదలు కుదురుపాక శశికళ నుంచి ప్రాణహాని ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్య (కేసీఆర్ అన్న కుమార్తె) ఆరోపించారు. శనివారం ఇక్కడ విలేకరులతో ఆమె మాట్లాడుతూ కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీతోనే ఆయనకు ప్రాణహాని ఉందన్నారు. తమిళనాడులో మాదిరి తెలంగాణలో కుదురుపాక గ్రామానికి చెందిన కొందరు మాఫియాగా ఏర్పడి కేసీఆర్‌ను పొట్టనబెట్టుకునే ప్రమాదముందన్నారు. -
మాటల తూటాలు
► పరస్పర బెదిరింపులు ► ఫిర్యాదుల హోరు ► పలు చోట్ల భద్రత కట్టుదిట్టం ► మద్రాసు వర్సిటీ వద్ద భద్రత వెనక్కి అన్నాడీఎంకే రాజకీయ ధారావాహికలో మలుపులు ఉత్కంఠగా సాగుతున్నాయి. చిన్నమ్మ శశికళ, ఆపద్ధ్దర్మ సీఎం పన్నీరు శిబిరాల మధ్య మాటల తూటాలు శుక్రవారం పేలాయి. బెదిరింపులు, హెచ్చరికల పర్వాలతో పరస్పరం ఫిర్యాదులు హోరెత్తాయి. రెండు శిబిరాల మధ్య సమరం వేడెక్కుతుండడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక, మద్రాసు వర్సిటీ వద్ద భద్రత వెనక్కి తీసుకున్నారు. సాక్షి, చెన్నై : సీఎం కుర్చీ కోసం అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ సమరంలో ఆపద్ధర్మ సీఎం పన్నీరు సెల్వం, తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ శిబిరాల మధ్య మూడో రోజుగా శుక్రవారం ఎవరి ఎత్తులు వారివే అన్నట్టుగా రాజకీయ వ్యూహాలు సాగాయి. మాటల తూటాలు పేలాయి. తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారికి ఉద్వాసనలు పలికే విధంగా చిన్నమ్మ దూకుడును పెంచారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ ను తొలగించి, ఆ స్థానాన్ని పార్టీ నిర్వాహక కార్యదర్శి సెంగోట్టయ్యన్ కు అప్పగించారు. సెంగోట్టయ్యన్ చేతికి పగ్గాలు అప్పగిస్తూ చిన్నమ్మ తీసుకున్న నిర్ణయాన్ని అన్నాడీఎంకే శ్రేణులు ఆనందంగా ఆహ్వానించాయి. అలాగే, నిన్నటి వరకు పన్నీరు సెల్వంను టార్గెట్ చేసి దుమ్మెత్తి పోసిన చిన్నమ్మ శిబిరం, తాజాగా మధుసూదనన్ ను గురి పెట్టి విమర్శలు గుప్పించే పనిలో పడ్డాయి. చిన్నమ్మకు మద్దతుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రులు గోకుల ఇందిర, వలర్మతి, అన్నాడీఎంకే అధికార ప్రతినిధులు వైగై సెల్వన్ , సీఆర్ సరస్వతి వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ప్రధాన కార్యదర్శి, సీఎం పగ్గాలుచేపట్టాలని చిన్నమ్మ చేతులు పట్టుకుని మరీ వేడుకున్న నోరు, ఇప్పుడు మాట మార్చి క్షమించ రాని తప్ప చేసిందని ధ్వజమెత్తారు. ఆ ఇద్దరికీ ఇక, కష్ట కాలమేనని, వారి వెంట వెళ్లే వాళ్లు, వెళ్లాలన్న ప్రయత్నంలో ఉన్న వాళ్లు పునరాలోచించుకుంటే మందని హెచ్చరించారు. చిన్నమ్మ ఎన్నడూ పదవిని ఆశించ లేదని, పార్టీకి జరుగుతున్న నష్టాన్ని గుర్తించి రంగంలోకి దిగారన్నారు. తప్పులు చేసింది కాకుండా, వాటిని కప్పి పుచ్చుకునేందుకు పన్నీరు, మదుసూదన్ ధల్ని చిన్నమ మీద వేస్తున్నారని మండి పడ్డారు. సెంగోట్టయ్యన్ కు బాధ్యతల అప్పగింతతో పార్టీకి మరింత బలం చేకూరినట్టేనని ఆనందం వ్యక్తం చేశారు. చిన్నమ్మకు మద్దతు పలుకుతూ పోయేస్ గార్డెన్ కు వచ్చేనాయకులు అందరూ మీడియా ముందుకు వచ్చి మరీ స్వరాన్ని పెంచి పన్నీరు శిబిరం మీద మాటల తూటాల్ని పేల్చి వెళ్లారు. ఎదురు దాడి : తమను టార్గెట్ చేసి తూటాల్ని పేల్చిన చిన్న మ్మ శిబిరానికి గట్టిగా సమాధానం ఇచ్చే విధంగా మదుసూదనన్ స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీని సర్వనాశనం చేయడానికి చిన్నమ్మ ప్రయత్నాల్లో పడటం, ఆమె కుటుంబ పెత్తనం పెరగడం వల్లే తాను బయటకు వచ్చానన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పన్నీరు నేతృత్వంలో పార్టీని రక్షించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తనను తొలగించే అధికారం ఎవ్వరికీ లేదని స్పష్టం చేశారు. పన్నీరు శిబిరంలోకి చేరుతున్న మాజీలు మీడియా ముందుకు వస్తూ, చిన్నమ్మ శిబిరం మీద దుమ్మెత్తి పోస్తూ ఎదురు దాడికి దిగే పనిలో పడ్డారు. ఇక, నాగపట్నం జిల్లాకు చెందిన రాధాకృష్ణన్, పౌన్ , భారతీలు ప్రస్తుతానికి చిన్నమ్మ క్యాంప్‌లో ఉన్నా, పన్నీరు శిబిరంలోకి దూరం ఖాయం అని వారి మద్దతు దారులు ప్రకటించడం గమనార్హం. కాగా, కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు పొన్ను స్వామి పన్నీరు శిబిరంలోకి చేరారు. భద్రత కట్టుదిట్టం : ఇరు శిబిరాల మధ్య మాటల తూటా లు పెరగడం, విమర్శలు ఆరోపణలు హోరెత్తుతుండటం వెరసి శాంతి భద్రతలకు విఘాతం కల్గకుండా ముందు జాగ్రత్తల్లో పోలీసు యంత్రాంగం నిమగ్నం అయింది. గ్రీన్ వేస్ రోడ్డు, పోయేస్ గార్డెన్, అన్నాడిఎంకే కార్యాలయం ఆవరణలో గతంలో ఉన్న భద్రతను రెట్టింపు చేశారు. ఇక, రెండు శిబిరాలు, పరస్పరం బెదిరింపులు, హెచ్చరికల ఆరోపణలతో ఫిర్యాదులు హోరెత్తించే పనిలో పడ్డాయి. టీ నగర్ మాజీ ఎమ్మెల్యే కలై రాజన్ తమను బెదిరిస్తున్నట్టుగా పోలీసులకు పన్నీరు శిబిరం ఫిర్యాదు చేసింది. అలాగే, తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారని కొందరు, తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటు మరి కొందరు తమ తమ ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదులు చేయడం పెరుగుతున్నాయి. అలా గే, పోస్టర్లతో ఆహ్వానాలు, విజ్ఞప్తులు,చివరకు బెదిరింపుల పర్వం బయలు దేరి ఉన్నాయి. పన్నీరు శిబిరంలో చేరిన ఎమ్మెల్యే షన్ముగనాథన్ ఏకంగా చెన్నై కమిషనరేట్‌లో తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని, తప్పించకు వచ్చిన ట్టు వివరిస్తూ , సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అదే సమయంలో పన్నీరు శిబిరం తమను బెదిరిస్తున్నట్టుగా చిన్నమ్మ శిబిరం ఫిర్యాదులకు సిద్ధం అవుతోన్నాయి. తనను హతమారుస్తామన్న బెదిరింపులు వస్తున్నట్టు చిన్నమ్మ శిబిరంలో సీఆర్ సరస్వతి ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో రెండు శిబిరాల మధ్య వివాదం మరింతగా రాజుకునే పరిస్థితులు బయలు దేరడంతో చెన్నైలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసి ఉన్నారు. కాగా, చిన్నమ్మ ప్రమాణ స్వీకారం తేది ఇప్పట్లో తేలే అవకాశాలు లే ని దృష్ట్యా, ఇందు కోసం ఎంపిక చేసిన వేదిక మద్రాసు వర్సి టీ ఆవరణలో కల్పించిన భద్రతను వెనక్కి తీసుకున్నారు. స్వతంత్రంగా ఉన్నాం : కిడ్నాప్ వ్యవహారంకోర్టుకు చేరడంతోచిన్నమ్మ మద్దతు ఎమ్మెల్యేలు పలువురు మీడియా ముందుకు వచ్చారు. క్యాంప్లోతాము ఆనందంగా ఉన్నామని, తమకు బెదిరింపులు వస్తుండటంతోనే ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టు తెలిపారు. ఎవరూ తమను నిర్భందించ లేదని, తాము స్వతంత్రంగా ఇక్కడ ఉన్నట్టు చెప్పారు. తమ కుటుంబీకులతో అవసరం వచ్చినప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నామని పలువురు మాత్రం ముందుకు వచ్చినా, వారి చుట్టూ భద్రతా కవచం వలే మన్నార్గుడి సేనలు ఉండటం గమనార్హం. సుధాకరన్ పూజలు : జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్ మ్మ శశికళ సిఎం కావాలని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. దిండుగల్ జిల్లా పళనిలోని ప్రసిద్ది చెందిన సుబ్రమణ్యస్వామి ఆలయం కొండ కింద ఉన్న ఓ మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అడ్డంకులు తొలగి చిన్నమ్మ సీఎం కావాలని వేడకున్నారు. . -
సెల్వం... పన్నీర్ సెల్వం!
సామాజిక మాధ్యమాల్లో పన్నీర్ కబాలి వైరల్ పన్నీర్ ఇంటి నుంచే పార్టీ ఐటీ విభాగం ప్రచారం సోషల్ మీడియా ద్వారా ప్రజా మద్దతు చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పార్టీ శ్రేణుల మద్దతు కూడగట్టడానికి గట్టిగా ప్రయత్నిస్తున్న ఆపద్ధర్మ ముఖ్య మంత్రి పన్నీర్ సెల్వం మరో వైపు ప్రజల మద్దతు కూడా సంపాదించేందుకు అన్నాడీఎంకే ఐటీ విభాగాన్ని రంగంలో కి దించారు. వారు 3 రోజులుగా పన్నీర్ ఇంటినుంచే సోషల్ మీడియాలో ప్రజల నుంచి ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తున్నారు. పార్టీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) విభాగాన్ని పన్నీర్ తన శిబిరంలోకి చేర్చు కున్నారు. ఈ విభాగం బాధ్యులకు తన ఇంటి ఆవరణలోనే కొంత స్థలం ఇచ్చి వాట్సాప్, ట్వీటర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా శశికళకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేల ఫోన్ నంబర్లన్నీ సామాజిక మాధ్య మాల్లో పోస్టు చేసి మీ ఎమ్మెల్యేను పన్నీర్‌కు మద్దతు ఇవ్వమని సందేశాలు పంపాలని అభ్యర్థించారు. ప్రజలు కూడా తమ ఎమ్మెల్యేలకు, వారి కుటుంబ సభ్యులకు సెల్వంకు మద్దతు ఇవ్వాలని పోస్టింగ్‌లు, మెసేజ్‌లు పంపు తున్నారు. ఈ రకంగా ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెంచి శశికళ శిబిరం నుంచి బయటకు తెచ్చేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో భాగంగా కబాలి సినిమాలో రజనీకాంత్ పాపులర్ డైలాగ్ ‘ముఖం మీద గాటుపెట్టుకుని, మీసం తిప్పి, లుంగీకట్టుకుని పాత విలన్ ‘ఏయ్ కబాలి’ అనగానే ఒంగొని ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నార్రా’ అనే డైలాగ్‌ను ‘పాత రోజుల్లోలా నుదుటున బొట్టు పెట్టుకుని పంచె కట్టుకుని ‘ఏయ్ పన్నీర్’ అని పిలవగానే చిత్తం చిన్నమ్మా అని వినయంగా నిల్చుంటాననుకున్నావా? సెల్వం.. పన్నీర్ సెల్వం’ అంటూ రజనీకాంత్ ఫొటోలో పన్నీర్ తల పెట్టి గ్రాఫిక్ చేసిన ఫొటో, వీడియో ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లో వైరల్‌గా మారింది. కబాలి సినిమాలో రజనీ డైలాగ్ జనాన్ని ఎంత ఆకట్టుకుందో ఇప్పుడు పన్నీర్ò డైలాగ్ కూడా టైమ్లీగా అంతే స్థాయిలో పేలింది. -
శశికళపై కోర్టుల్లో పిటిషన్ల పరంపర
సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న శశికళపై పిటిషన్ల పరంపర కొనసాగుతోంది. శశికళ మద్దతుదారులు నిర్బంధించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు విముక్తి కలిగించేలా ఆదేశాలి వ్వాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో, ఆస్తుల కేసులో తీర్పు వెలువడే వరకు ప్రమా ణ స్వీకారంపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్లు దాఖల య్యాయి. ఎమ్మెల్యేలను శశికళ నిర్బంధించిన నేపథ్యంలో.. కున్నమ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామచంద్రన్ కనపడడం లేదని, ఆయన జాడ కనిపెట్టి, న్యాయస్థానంలో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఇలవరసన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా, మద్రాసు హైకోర్టు న్యాయవాది కె.బాలు, సామాజిక కార్యకర్త ‘ట్రాఫిక్’ రామస్వామి గురువారం వేర్వేరుగా హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు హాజరై అన్నాడీఎంకేకు చెందిన 130 ఎమ్మెల్యేలను విడిపించి, కోర్టులో హాజరు పర్చేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ... ఎమ్మె ల్యేలు కిడ్నాప్‌నకు గురికాలేదని, ఇంటివద్దనే సురక్షితంగా ఉన్నారని వాదించారు. డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు స్పందిస్తూ... ఎమ్మె ల్యేల కిడ్నాప్ అంశంపై పిటిషన్ దాఖలు చేస్తేనే విచారణ చేపట్టగలమని అన్నారు. విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. సుప్రీంకోర్టులో మరో పిటిషన్ శశికళ సీఎంగా బాధ్యతలు చేపట్టకుండా నిషేధం విధించాలని కోరుతూ తమిళనాడుకు చెందిన చట్ట పంచాయిత్తు ఇయక్కం తరఫున సెంథిల్‌కుమార్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశాడు. ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడేవరకూ సీఎంగా శశికళ బాధ్యతలు స్వీకరించకుండా నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశాడు. -
రిమోట్ కాదు.. తుపాకీ
చిన్నమ్మపై పన్నీరు సెల్వం తిరుగుబాటు ‘అమ్మ’ సెంటిమెంటే అస్త్రం చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అన్నా డీఎంకేకు విధేయుడిగా, ‘అమ్మ’ చేతిలో రిమోట్‌గానే తమిళనాడు ప్రజలకు తెలిసిన పన్నీర్ సెల్వం పెద్ద గన్ను పేల్చారు. తాను జయలలితకు మాత్రమే రిమోట్ననీ, శశికళ లాంటి వాళ్లకు తుపాకీ లాంటి వాడినని చెప్పకనే చెప్పారు. సౌమ్యుడు, వివాదరహితుడు, మృదు స్వభావి, భయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తింపు పొందిన సెల్వం ఈ తరహా తిరుగుబాటు చేయడం రాజకీయ వర్గాలనే కాకుండా ప్రజలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ‘అమ్మ’ సెంటిమెంట్‌తో ఆయన పేల్చిన తుపాకీ చిన్నమ్మను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అప్పుడే తెరచాటు తిరుగుబాటు: జయలలిత మృతి చెందిన వెంటనే శశికళ దూకుడు పెంచారు. అయితే, ప్రధాని నరేంద్రమోదీ అండతో పన్నీర్‌సెల్వం అప్పట్లోనే పరోక్షంగా తిరుగుబాటు చేశారు. ఆయన మద్దతుతో రాత్రికి రాత్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. శశికళ ఒత్తిడి మేరకు సీఎం పదవికి రాజీనామా చేశాక రెండు రోజులు మౌనంగా ఉన్న పన్నీర్ సెల్వం ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత స్టాలిన్ అండతో గళం విప్పారు. జయలలిత సమాధి సాక్షిగా చిన్నమ్మపైనే నేరుగా తుపాకీ ఎక్కుపెట్టారు. జయలలిత మృతిపై విచారణ కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేయాలన్నారు. ‘అమ్మ’ మృతిపై ప్రజల్లో ఇప్పటికే ఉన్న అనుమానాలకు మరింత బలం చేకూర్చారు. ‘అమ్మ’ ఆత్మ ఆదేశం మేరకు పార్టీని, ప్రభుత్వాన్ని రక్షించడానికే తాను తిరుగుబాటు చేశానని చెప్పుకుని పార్టీ శ్రేణులు, ప్రజల్లో సానుభూతి సంపాదించే పాచిక విసిరారు. అలాగే జయ కుటుంబ సభ్యుల మద్దతు కూడగట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే జయ అన్న కుమార్తె దీపను తనతో చేతులు కలపాల్సిందిగా ఆహ్వానించారు. రాష్ట్ర పర్యటనకు ఏర్పాట్లు: శశికళపై పార్టీలోనే కాకుండా ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉందనే విషయాన్ని కేంద్ర ం దృష్టికి తీసుకెళ్లడానికి పన్నీర్ సెల్వం రాష్ట్ర పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శాసనసభలో బల నిరూపణకు తనకు సమయం లభిస్తుందని ఆయన నమ్ముతున్నారు. ఈలోగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించారు. యువత మద్దతుకు వ్యూహం: తమిళనాడు యువత మద్దతు కూడగట్టేందుకు పన్నీర్ సెల్వం ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం నుంచి మెరీనా బీచ్ వేదికగా యువతతో ఉద్యమం చేయించేందుకు వ్యూహ రచన చేశారు. -
రాజ్‌భవన్ వైపు అందరిచూపు
సాక్షి ప్రతినిధి, చెన్నై: గత రెండు రోజులుగా అన్నాడీఎంకే చుట్టూ తిరిగిన రాజకీయ నేతల దృష్టి ఇక రాజ భవన్‌పై మళ్లనున్నాయి. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ ఎన్నికైన తరువాత ఇన్చార్జ్ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావు గురువారం చెన్నైకి చేరుకోవడమే ఇందుకు కారణం.అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఆ పార్టీ అల్లకల్లోంగా మారింది. ప్రధాన కార్యదర్శి శశికళ, ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంల మధ్య నివురుగప్పిన నిప్పులా దాగి ఉన్న పొరపొచ్చాలు అమ్మ సమాధి సాక్షిగా ఆదివారం బహిరంగమైనాయి. అమ్మ ఆసుపత్రిలో చేరిన నాటి నుండి ఆదివారం వరకు తాను ఎదుర్కొన్న అవమానాలను పన్నీర్‌సెల్వం పూసగుచ్చినట్లు మీడియాకు వివరించారు. తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు శశికళ తన చేత బలవంతంగా రాజీనామా చేయించినట్లు పన్నీర్‌సెల్వం చేసిన ఆరోపణలు అన్నాడీఎంకేను కుదిపేశాయి. డీఎంకే చేతిలో పన్నీర్‌సెల్వం పావుగా మారి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని శశికళ ప్రత్యారోపణలు చేయసాగారు. ఈనెల 5వ తేదీన శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళ 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ముహూర్తం పెట్టుకున్నారు. మద్రాసు యూనివర్సిటీలో ఏర్పాట్లు కూడా ప్రారంభమైనాయి. అయితే ఆ మరుసటి రోజే అంటే 6వ తేదీన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సంచలన ప్రకటన చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై వారం రోజుల్లో తీర్పు చెప్పనున్నట్లు చెప్పడమే న్యాయమూర్తుల ప్రకటనలో సారాంశం. ఆస్తుల కేసులో ఏ–1 నిందితురాలైన జయలలిత మరణించగా ఏ–2 నిందితురాలిగా ఉన్న శశికళతోపాటూ ఏ–3, ఏ–4 నిందితులుగా ఆమె బంధువులైన ఇళవరసి, సుధాకరన్ల్లో ఆందోళన వ్యక్తమయింది. దీనికి తోడు కేవలం 60 రోజుల్లోనే ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం చేత రాజీనామా చేయించడం, శాసనసభా పక్ష నేతగా శశికⶠను ఎన్నుకోవడం, అసంతృప్తి ఇలా అన్నాడీఎంకేలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో ఊటీ నుండి చెన్నైకి రావాల్సిన గవర్నర్ కేంద్రం నుండి పిలుపు రావడంతో డిల్లీకి వెళ్లిపోయారు. తమిళనాడు రాజకీయాలపై న్యాయనిపుణులతో చర్చించి గవర్నర్ చెన్నైకి వస్తారని అన్నాడీఎంకే వర్గాలు ఆశించాయి. అయితే డిల్లీ నుండి గవర్నర్ ముంబయికి చేరుకున్నారు. దీంతో గవర్నర్ ఇప్పట్లో చెన్నైకి వచ్చేనా, శాసనసభపక్ష నేతగా ఎన్నికైన శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు అనుమతించేనా, సీఎంగా శశికళ బాధ్యతలు చేపట్టేనా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ దశలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నైకి చేరుకుంటున్నట్లు బుధవారం అధికారికంగా సమాచారం వచ్చింది. ఆపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన శశికళ, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ తదితరులు గవర్నర్‌ను కలిసేందుకు సిద్దమవుతున్నారు. గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
పన్నీర్ సెల్వంపై మండిపడ్డ శశికళ
-
తమిళనాడులో ఏం జరగొచ్చు?
-
తమిళ నాట ఆసక్తిగా మారిన రాజకీయాలు
-
తమిళనాడులో ఏం జరగొచ్చు?
చెన్నై: జయలలిత మరణం తర్వాత తమిళనాడు అసెంబ్లీలో 233 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. పన్నీర్ సెల్వంకు 50 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది తన వర్గంలో చేరితే ఆయన బలం పెరుగుతుంది. అంతేకాకుండా ప్రతిపక్ష నేత స్టాలిన్ సైతం పన్నీర్‌కు అండగా నిలుస్తున్నారు. డీఎంకేకు 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పన్నీర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకుంటే.. సీఎం పదవిలో కొనసాగేం దుకు అవకాశం ఉంది. పన్నీర్‌సెల్వంను ముఖ్యమంత్రిగా కొనసాగించేందుకు రాజ్యాంగపరంగా గవర్నర్‌కు ఎలాంటి అడ్డంకులు ఉండబోవు. సీఎం రాజీనామా చేసినా, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తినా ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. ప్రభుత్వం యథావిధిగానే పనిచేస్తుంది. ఎందుకంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవరకూ పన్నీర్ సెల్వం కేబినెట్ కొనసాగాలంటూ గవర్నర్ కోరారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిందని గవర్నర్ భావిస్తే రాష్ట్రపతి పాలన విధించేందుకు అవకాశం ఉంటుంది. తమిళనాడు పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుచక్రం వేస్తోంది. గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు అందుబాటులో లేకపోవడంతో ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడిన సంగతి తెలిసిందే. శశికళపై తిరుగుబాటు చేస్తున్న పన్నీర్‌సెల్వంకు బీజేపీ ఆశీస్సులు ఉన్నట్లు సమాచారం. సెల్వంతో బలవంతంగా రాజీనామా చేయించడం చట్టవిరుద్ధమని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా ట్వీటర్లో పేర్కొన్నారు. -
పెరిగిన వేగం
► రెండు మూడు రోజుల్లో పనుల ముగింపు ► తెట్టు తొలగింపు పరిశీలనలో పన్నీరు ► ఢిల్లీ నుంచి అధికారులు సముద్రంలో క్రూడాయిల్ తెట్టు తొలగింపు పనుల వేగం మరింతగా పెరిగింది. అదనంగా ఐదు వేల మందిని రంగంలోకి దించారు. సాక్షి, చెన్నై : రెండు మూడు రోజుల్లో తెట్టును పూర్తిగా తొలగించడం లక్ష్యంగా చర్యలకు సీఎం పన్నీరు సెల్వం ఆదేశించారు. ఎర్నావూర్ – తిరువొత్తియూరు పరిసరాల్లో ఆదివారం పన్నీరు సెల్వం పర్యటించారు. రెండు నౌకల ఢీతో చెన్నై సముద్ర తీరంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దెబ్బతిన్న నౌక నుంచి క్రూడాయిల్ లీకేజీ సముద్రపు రంగునే మార్చేసింది. నలుపు రంగులో సముద్ర తీరం దర్శనం ఇస్తుండడంతో ఆగమేఘాలపై అధికారులు చర్యల్ని వేగవంతం చేశారు. క్రూడాయిల్ తెట్టును తొలగించేందుకు ఆదివారం కూడా తీవ్రంగానే శ్రమించారు. 25 బృందాలు రంగంలో ఉండగా, అదనంగా మరో ఐదు వేల మందితో తెట్టు తొలగింపు వేగవంతం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో తెట్టును పూర్తిగా తొలగించడం లక్ష్యంగా ప్రత్యేక కార్యచరణతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చర్యల్ని అధికార వర్గాలు మరింత వేగాన్ని పెంచాయి. కేంద్ర నౌకాయాన శాఖ డైరెక్టర్ మాలిని వి. శంకర్ చెన్నైకు చేరుకుని, హార్బర్ వర్గాలతో సమాలోచించారు. ప్రమాద కారణాలు, తదుపరి ఏర్పడ్డ తెట్టు తీవ్రత, నష్టం తదితర అంశాలపై పరిశీలన సాగించి ఉన్నారు. సీఎం పన్నీరు సెల్వం ఉదయాన్నే ఎర్నావూర్ నుంచి తిరువొత్తియూరు వరకు మత్స్య శాఖ మంత్రి జయకుమార్తో కలిసి పర్యటించారు. అధికారులతో మాట్లాడారు. అక్కడ సాగుతున్న పనుల్ని పరిశీలించి మరింత వేగవంతానికి తగ్గ చర్యలకు ఆదేశించారు. తదుపరి సచివాలయం చేరుకున్న పన్నీరుసెల్వం తెట్టు తొలగింపులో రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై సమీక్షించారు. రెండు మూడు రోజుల్లో తెట్టును పూర్తిగా తొలగించడం లక్ష్యంగా ఆదేశాలు ఇచ్చారు. ఇదే సీఎంగా పన్నీరుకు చివరి సమీక్ష కావడం గమనార్హం. తదుపరి అన్నాడీఎంకే కార్యాలయానికి చేరుకుని ఇక, సీఎం పగ్గాలు చిన్నమ్మ శశికళకు అప్పగించే విధంగా పన్నీరు తీర్మానం తీసుకురావడంతో ఇక, సీఎం బాధ్యతల నుంచి తప్పుకున్నారని చెప్పవచ్చు. -
చిక్కుల్లో చిన్నమ్మ
► మళ్లీ మెడకు చిక్కుకున్న విదేశీ మారక ద్రవ్యం కేసు ► కింది కోర్టు తీర్పును రద్దు చేసిన మదురై హైకోర్టు ► శశికళ, దినకరన్ లపై ఈడీ కేసులకు సమర్థన సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. విదేశీ మారక ద్రవ్యం మోసం కేసు నుంచి శశికళ, ఆమె సమీప బంధువు దినకరన్ లకు విముక్తి కల్పిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును మదురై హైకోర్టు రద్దు చేసింది. ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పెట్టిన అన్ని కేసులను చట్టపరంగా ఎదుర్కొనక తప్పదని న్యాయమూర్తి జి.చొక్కలింగం బుధవారం తీర్పు చెప్పారు. తీర్పు వివరాలు ఇలా.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వాటాదారుగా ఉన్న భరణి బీచ్ రిసార్ట్స్ సంస్థకు ఎన్ ఆర్ఐ సుశీలా రామస్వామి అనే వ్యక్తి నుంచి పరోక్షంగా రూ.3 కోట్లు అప్పు అందింది. ఈ మొత్తంలో రూ.2.2 కోట్లు కొడనాడు ఎస్టేట్స్‌లో వాటాగా పెట్టుబడి పెట్టారు. రిజర్వుబ్యాంకు అనుమతి లేకుండా విదేశీ మారక ద్రవ్యం చేతులు మార్చినట్లుగా శశికళ, దినకరన్, జేజే టీవీ తదితరులపై 1996లో ఎన్ ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ)కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్లపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసు నుంచి తమను తప్పించాల్సిందిగా కోరుతూ చెన్నై ఆర్థిక నేరాల న్యాయస్థానంలో శశికళ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు 2015లో తీర్పు చెప్పింది. మూడు కేసుల నుంచి శశికళకు విముక్తి కల్పించేందుకు నిరాకరించి, ఒక కేసు నుంచి తప్పించేందుకు అంగీకరించింది. అలాగే రెండు కేసుల నుంచి దినకరన్ కు విముక్తి కల్పించింది. విముక్తి కల్పించేందుకు నిరాకరించిన మూడు కేసులపై శశికళ మద్రాసు హైకోర్టులో అప్పీలు చేసింది. శశికళ, దినకరన్ లపై కేసులు ఎత్తివేయడం సరికాదంటూ ఈడీ కూడా హైకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేసింది. శశికళ, దినకరన్ లకు వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ లో ఈ విధంగా పేర్కొన్నారు. శశికళ స్నేహితురాలు చిత్ర అనే వ్యక్తికి ఎన్ ఆర్ఐ సుశీలా రామస్వామి రూ.3 కోట్లను అప్పుగా ఇచ్చారు. అప్పుగా తీసుకున్న ఆ మొత్తాన్ని శశికళ ఖాతాకు చిత్ర బదిలీ చేశారు. ఇందుకోసం 25 చెక్కులను చిత్ర ఇచ్చారు. తలా రూ.22 లక్షల విలువైన రెండు చెక్కులు శశికళ బంధువులు సుధాకరన్, ఇళవరసి పేర్లతో జారీ కాగా, మిగిలిన చెక్కులపై పేర్లు లేకుండానే ఇచ్చారు. భరణి బీచ్ రిసార్ట్స్ సంస్థ పేరుతో పాయస్గార్డెన్ ఇంటి ఫోన్ ద్వారా మలేషియాలోని సుశీలా రామస్వామి ఇంటికి అనేక సార్లు మాట్లాడి ఉన్నారు. ఈ లావాదేవీల్లో నడిచిన గోల్మాల్ను కిందికోర్టు న్యాయమూర్తి గుర్తించలేదు. కాబట్టి ఒక కేసు నుంచి శశికళకు, రెండు కేసుల నుంచి దినకరన్ కు విముక్తి కల్పిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఈడీ తన అప్పీలు పిటిషన్ లో హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ శశికళ, ఈడీ తరపున దాఖలైన అప్పీలు పిటిషన్లపై వాదోపవాదాలు ముగిసిన నేపథ్యంలో గతంలో న్యాయమూర్తి తేదీని ప్రకటించకుండా తీర్పును వాయిదా వేశారు. కాగా, న్యాయమూర్తి జీ.చొక్కలింగం బుధవారం సాయంత్రం మదురై హైకోర్టులో తీర్పు చెప్పారు. రిజర్వు బ్యాంకు అనుమతి లేకుండా విదేశీ మారకద్రవ్యం చేతులు మారిందని, శశికళ భాగస్వామిగా ఉన్న సంస్థకు ఈ సొమ్ము చేరినట్లుగా న్యాయస్థానం విశ్వసిస్తోందని న్యాయమూర్తి అన్నారు. సంస్థకు తాను భాగస్వామిగా మాత్రమే ఉన్నానని, కార్యకలాపాలతో సంబంధం లేదనే వాదన అంగీకరించేది లేదని, భాగస్వామిగా అన్ని కార్యకలాపాల్లో జోక్యం చేసుకున్నట్లుగా చూపుతూ అవసరమైన డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పారు. సంస్థాపరమైన లావాదేవీల్లో శశికళ సంతకాలు కూడా చేసి ఉన్నారని తెలిపారు. కాబట్టి చట్టపరమైన చర్యలను ఎదుర్కొనక తప్పదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తి సమర్థిస్తూ, మూడు కేసుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ శశికళ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ ను కొట్టివేశారు. అలాగే, శశికళ, దినకరన్ లకు విముక్తి ప్రసాదిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థిక నేరాల కింద వారిపై చర్యలు సమంజసం కాబట్టి విముక్తి ప్రసాదిస్తూ కింది కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. శశికళ, దినకరన్ లు ఈడీ పెట్టిన కేసుల విచారణను ఎదుర్కొనక తప్పదని న్యాయమూర్తి చొక్కలింగం స్పష్టం చేశారు. -
చిన్నమ్మ జపం
► అసెంబ్లీలో మిన్నంటిన నినాదం ► అన్నాడీఎంకేతో డీఎంకే వాగ్యుద్ధం ► సభ నిబంధనలకు విలువనివ్వాలని స్టాలిన్ హితవు ► కరుణ జపం చేసుకోవచ్చని పన్నీరు సూచన చిన్నమ్మ శశికళ జపం అసెంబ్లీని తాకింది. చిన్నమ్మ నామస్మరణతో మంత్రి సెల్వరాజ్ చేసిన వ్యాఖ్యలు డీఎంకే వర్గాల్లో ఆగ్రహాన్ని రేపాయి. డీఎంకే, అన్నాడీఎంకే వర్గాల మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. సభ నిబంధనలకు తిలోదకాలు ఇవ్వొద్దని, విలువల్ని పాటించాలని ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ హితవు పలికారు. అయితే కరుణానిధి జపం చేసుకోండంటూ సీఎం పన్నీరుసెల్వం డీఎంకే సభ్యులకు సూచించడం గమనార్హం. సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణం తదుపరి పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టిన చిన్నమ్మ శశికళ మెప్పు కోసం అన్నాడీఎంకే వర్గాలు తీవ్ర కుస్తీలు పడుతున్న విషయం తెలిసిందే. చిన్నమ్మ నామ స్మరణ మార్మోగిస్తున్నారు. ఈ జపం కాస్తా సోమవారం అసెంబ్లీని తాకింది. ప్రశ్నోత్తరాల సమయంలో తెన్ కాశి అన్నాడీఎంకే సభ్యుడు సెల్వమోహన్ దాస్ సంధించిన ప్రశ్నకు మంత్రి సెల్వరాజ్ సమాధానం ఇచ్చారు. ముందుగా అమ్మ జయలలితను పొగడ్తలతో ముంచెత్తుతూ, చిన్నమ్మ నామస్మరణ అందుకున్నారు. పదే పదే చిన్నమ్మ శశికళను ప్రశంసిస్తూ మంత్రి వ్యాఖ్యలు సంధించడాన్ని డీఎంకే శాసనసభాపక్ష ఉపనేత దురై మురుగన్ తీవ్రంగా ఖండించారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ జోక్యం చేసుకుని సభా విలువల్ని పాటించాలని హితవు పలికారు. అయినా మంత్రి ఏ మాత్రం తగ్గకుండా చిన్నమ్మ జపం సాగిస్తూ రావడంతో సభలో కాసేపు గందరగోళం చోటు చేసుకుంది. పార్టీల నాయకుల్ని స్మరించుకుంటూ ఉంటే, ఇక, కాంగ్రెస్ సభ్యులు రాహుల్ గాంధీ జపం అందుకుంటారేమోనని డీఎంకే వర్గాలు చమత్కరించాయి. ఇంతలో సీఎం పన్నీరుసెల్వం జోక్యం చేసుకుని, చిన్నమ్మ జపంలో తప్పు లేదని, మంత్రి వ్యాఖ్యలను సమర్థించారు. కావాలంటే, కరుణానిధి జపం, నామస్మరణకు అసెంబ్లీని మీరు వేదికగా చేసుకోండంటూ డీఎంకే వర్గాలకు హితవు పలికారు. ఆ తప్పులు చేయాల్సిన అవసరం తమకు లేదని, కరుణానిధి సభలో సభ్యుడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ డీఎంకే వర్గాలు నినదించాయి. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్యుద్ధం ముదిరింది. చివరకు స్పీకర్ ధనపాల్ జోక్యం చేసుకుని, సీఎం పన్నీరుసెల్వం స్పష్టం చేశారుగా, ఈ విషయాన్ని ఇంతటితో ముగిద్దామంటూ ముగింపు పలికారు. వీరులకు నివాళి: ముందుగా సభలో కశ్మీర్ లోయల్లో మంచు చరియలు విరిగి పడడంతో మరణించిన ఆర్మీ వీరులకు నివాళులర్పించారు. రాష్ట్రానికి చెందిన ఇలవరసన్, సుందర పాండియన్ కుటుంబాలకు సభ సానుభూతి తెలియజేసింది. వారి మృతికి సంతాప సూచకంగా సభలో సభ్యులందరూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. తస్మాత్ జాగ్రత్త ... ఇక జరిమానా మోత: ఇళ్లు, మాల్స్, అపార్ట్మెంట్లలోని మురికి నీటిని ఇక రోడ్డు మీద ఇష్టారాజ్యంగా వదలి పెడితే తస్మాత్ జాగ్రత్త జరిమానా మోత మోగుతుందంటూ ప్రభుత్వం హెచ్చరించింది. ఇందుకు తగ్గ ముసాయిదా అసెంబ్లీలో దాఖలైంది. పురపాలక శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి ఈ ముసాయిదాను ప్రశ్నోత్తరాల అనంతరం సభలో దాఖలు చేశారు. ఇళ్లు, దుకాణాల నుంచి మురికి నీరు రోడ్డు మీదకు వస్తే రూ.ఐదు వేలు, రూ.పది వేలు జరిమానా విధించనున్నట్టు వివరించారు. ప్రత్యేక భవనాలు, దుకాణాలకు రూ.20 నుంచి రూ.50 వేల వరకు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తులు, మాల్స్ నుంచి రోడ్డు మీదకు మురికి నీరు చేరిన పక్షంలో రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు జరిమానా విధించనున్నట్టు ఆ ముసాయిదా ద్వారా హెచ్చరించారు. స్వైన్ ఫ్లూ నివారణకు చర్యలు: రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ తాండవం అసెంబ్లీకి చేరింది. డీఎంకే శాసన సభాపక్ష ఉపనేత దురై మురుగన్ అసెంబ్లీలో స్వైన్ ఫ్లూ ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే ఆయన వ్యాఖ్యల్లోని అంశాలను సభా పద్దుల నుంచి తొలగిస్తూ స్పీకర్ ధనపాల్ నిర్ణయించారు. ప్రజల్ని భయాందోళనకు గురి చేసే అంశాలు వద్దంటూ, ఆరోగ్య మంత్రి విజయభాస్కర్‌కు మాట్లాడే అవకాశం కల్పించారు. వేలూరు జిల్లాలో కేరళ నుంచి వచ్చిన పలువురికి హెచ్ 1, ఎన్ 1 ఉన్నట్టు గుర్తించినట్టు, వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు మంత్రి తన ప్రసంగంలో వివరించారు. చిన్నమ్మకు ఆహ్వానాలు: అసెంబ్లీలో చిన్నమ్మ జపం మిన్నంటితే, ఆ చిన్నమ్మ దర్శనం కోసం పోయేస్ గార్డెన్ వద్ద సోమవారం పెద్ద క్యూ సాగింది. ఇందులో అన్నాడీఎంకే నీలకోట్టై ఎమ్మెల్యే తన వివాహం రోజును పురస్కరించుకుని చిన్నమ్మ ఆశీస్సుల్ని కుటుంబంతో కలిసి అందుకున్నారు. అలంగానల్లూరు, పాలమేడు, అవనీయాపురంల నుంచి గ్రామ పెద్దలు తరలి వచ్చారు. తమ గ్రామాల్లో జరిగే జల్లికట్టుకు హాజరు కావాలని ఆహ్వానం పలికారు. -
అసంతృప్తి సెగ
► అన్నాడీఎంకేలో మాజీల వేరుబాట ► దుష్టశక్తులను తరిమికొట్టాలని శశికళ పిలుపు ► శశికళ కోసం సీఎం పడిగాపులు సాక్షి ప్రతినిధి, చెన్నై : అన్నాడీఎంకే పార్టీ అసంతృప్తితో రగిలిపోతోంది. శశికళ సారథ్యాన్ని సహించలేని సీనియర్ నేతలు నిరసన వ్యక్తం చేసేందుకు వేరుబాట లేక పోరుబాటగా లోలోన సన్నాహాలు చేస్తున్నారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిపై చర్చోపచర్చలు సాగాయి. పశ్చిమ మండలాల్లో ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉన్నందున తమ ప్రాంతానికి చెందిన వ్యక్తినే ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవాలని నేతలు పట్టుబట్టారు. ఇంతలో పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్, సెంగొట్టయ్యన్, పొన్నయ్యన్, చెన్నై కార్పొరేషన్ మాజీ మేయర్ సైదై దొరైస్వామి పోయెస్‌గార్డెన్ కు వెళ్లి శశికళను కలిశారు. ఈ సందర్భంలో మిగిలిన వారంతా చిన్నమ్మ అనగా సైదై దొరస్వామి మాత్రం శశికళ ముఖ్యమంత్రి కావాలని పేరుపెట్టి తన అభిష్టాన్ని వ్యక్తం చేశారు. శశికళ అని పేరుతో చెప్పడం ఆమెకు, ఆమె కుటుంబీకులకు రుచించలేదని తెలుస్తోంది. దీంతో ఇకపై సైదై దొరస్వామి గార్డెన్ వైపు రావడానికి వీల్లేదని పొన్నయ్యన్ ద్వారా హెచ్చరించారు. ఆనాటి నుంచి పోయెస్‌గార్డెన్ కు సైదై రావడం మానివేశారు. గత నెల 29వ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. చెన్నై మండల ముఖ్యనేతలతో ఈనెల 5వ తేదీన శశికళ సమావేశమైనపుడు సైదైకి పిలుపులేదు. సైదై రావడానికి వీల్లేదని సీనియర్‌నేతలతో శశికళ చెప్పారు. శశికళ తన పట్ల పక్షపాతధోరణిని అవలంభిస్తున్నట్లు తెలుసుకున్న సైదై తానుగానే దూరంగా ఉండిపోయారు. పార్టీలో తనకు నష్టం జరిగినపుడు ప్రతీకారంగా ఏదైనా చేయడం సైదైకి అలవాటు. అన్నాడీఎంకే రెండుగా చీలినపుడు జానకిరామచంద్రన్ వైపు ఉన్నారు. నటుడు భాగ్యరాజ్ పార్టీ పెట్టినపుడు సహకరించారు. అలాగే శివాజీ గణేషన్ పార్టీని స్థాపించినపుడు సైదై అండగా నిలిచిన చరిత్ర ఉంది. జయలలితను ధిక్కరిస్తూ 1996లో రజనీకాంత్ మాట్లాడినపుడు పార్టీ పెడతాడని ఆశించి కోడంబాక్కంలో పార్టీ కార్యాలయం సిద్ధం చేసుకున్నాడు. అయితే రజనీ పార్టీ పెట్టలేదు. మేయర్‌గా తన చివరి రోజుల్లో జయలలిత సైదైని దూరం పెట్టింది. ఇందుకు శశికళే కారణమని సైదై భావిస్తున్నారు. జయలలిత మృతి తరువాత సైతం శశికళ తనను దూరం పెట్టడాన్ని సహించలేని సైదై మరోసారి తన ప్రతిఘటనను చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. జయలలిత అన్న కుమార్తె దీపతో రహస్య మంతనాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. అన్నాడీఎంకేలోని అసంతృప్తివాదులను ఏకతాటిపైకి తెచ్చి దీపవైపు నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో సైదై పార్టీ బహిష్కరణ వేటుకు గురికావడం లేదా వేరే పార్టీ పెట్టడం జరగవచ్చని గుసగుస లాడుతున్నారు. ఇదిలా ఉండగా, అసెంబ్లీ మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్ సైతం జయ మరణం తరువాత శశికళను కలవకపోవడమేగాక పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో ఇతన్ని కూడా పార్టీ దూరంగా పెట్టింది. 1991–96లో జయలలితకు వ్యతిరేకంగా సుబ్రహ్మణ్యస్వామి నేతృత్వంలో సైదై, పీహెచ్ పాండియన్, తిరునావుక్కరసర్ కూటమిగా ఏర్పడిన సంగతిని పార్టీనేతలు గుర్తు చేసుకుంటున్నారు. దుష్టశక్తులను తరిమికొట్టండి: శశికళ ఇదిలా ఉండగా, పార్టీలో తనపై ఉన్న వ్యతిరేకతను చల్లార్చేందుకు ఈనెల 4వ తేదీ నుంచి మండలాల వారీగా నేతలతో శశికళ సమావేశం అవుతున్నారు. అన్నాడీఎంకేను ప్రతిష్టను దెబ్బతీసేందుకు సిద్ధమవుతున్న దుష్టశక్తులను తరిమికొట్టాలని శుక్రవారం నాటి సమావేశంలో శశికళ కార్యకర్తలకు పిలుపు నివ్వడం ప్రత్యేకంగా పేర్కొనదగింది. సీఎం పడిగాపులు: అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో మూడురోజులుగా జరుగుతున్న పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు సీఎం పన్నీర్‌సెల్వం, కొందరు మంత్రులు హాజరవుతున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు శశికళ వస్తారనే సమాచారంతో సీఎం కూడా అదే సమయానికి వచ్చారు. అయితే 10.45 గంటలకు శశికళ రాగా సమావేశం ప్రారంభమైంది. శశికళ కోసం సీఎం సైతం 45 నిమిషాలు వేచి ఉండడం గమనార్హం. -
కొత్త సారథులు
► జయ స్థానంలో శశికళ ► కరుణ బాధ్యతల్లో స్టాలిన్ ► అన్నాడీఎంకే, డీఎంకేలో ఒకేసారి మార్పులు సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అవునంటే కాదని, కాదంటే అవునని వ్యవహరించే డీఎంకే, అన్నాడీఎంకేలో విచిత్రంగా ఒకే రకమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. జయలలిత మరణంతో శశికళ, కరుణానిధి అస్వస్థతతో స్టాలిన్ ఆయా పార్టీల సారథులుగా మారిపోయారు. కాంగ్రెస్ అగ్రనేత కామరాజనాడార్ నాటి జాతీయ భావాలకు నీళ్లొదిలి ద్రవిడ సిద్ధాంతాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన డీఎంకే, అన్నాడీఎంకేలు కొత్త నాయకత్వంతో మళ్లీ పూర్తిగా ప్రాంతీ య ధోరణిలోకి మళ్లినట్టు భావించాల్సి వస్తోంది. డీఎంకేలో అన్నాదురై నాయకత్వం తరువాత కరుణానిధి సారథ్యాన్ని ప్రజలు ఏకగ్రీవంగా అంగీకరించారు. అలాగే అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీ రామచంద్రన్ మరణంతో అదే రీతిలో జయలలిత పార్టీ పగ్గాలు చేపట్టగా తమిళనాడు యావత్తు జయకు జేజేలు పలికారు. వయస్సు, అనుభవం రీత్యా కరుణానిధితో పోల్చుకుంటే జయలలిత చిన్నదైనా దీటుగా నిలదొక్కున్నారు. డీఎంకేను మట్టికరిపించి అనేక ఎన్నికల్లో జయభేరీ మోగించారు. జయలలిత ఆకస్మిక మరణం, కరుణ వృద్ధాప్యంతో మరలా ఆ రెండు పార్టీలకు కొత్త అ«ధినాయకత్వం అవసరమైంది. ఎంతోకాలంగా అందరూ ఊహిస్తున్నట్లుగానే డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా స్టాలిన్ నియమితులయ్యారు. స్టాలినే తనకు సరైన రాజకీయ వారసుడని కరుణానిధి ఎంతో కాలంగా చెబుతూ వచ్చారు. అందరూ ఊహించినట్లుగా బుధవారం నాటి సమావేశంలో అధికారికంగా ప్రకటించేశారు. కరుణానిధి ఈ పని ఏనోడో చేసి ఉండాల్సిందని నేతలంతా ముక్తకంఠం హర్షం వెలిబుచ్చారు. చిన్ననాటి నుంచి తండ్రి వద్దే రాజకీయ శిష్యరికం చేసిన స్టాలిన్ పార్టీని నల్లేరుపై బండిలా నడిపించేయగలరు. అసంతృప్తుల వలయంలో శశికళ: ఇక ఎటొచ్చి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపైనే అందరి అనుమానాలు. జయలలిత వెనుక ఉంటూ చాటుమాటు రాజకీయాలు మినహా ప్రత్యక్ష రాజకీయాల అనుభవం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. జయకు శశికళ రాజకీయ వారసురాలు ఎలాగనే విషయంలోనే స్పష్టత లేదంటూ కొందరు మెటికలు విరుస్తున్నారు. పార్టీలోని 80 శాతం వ్యతిరేకిస్తున్నా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టడంతో పార్టీలోని కిందిస్థాయిలో అసంతృప్తి ఎక్కువైంది. శశికళ బొమ్మ కనపడితే చాలు చించేస్తున్నారు. జయలలిత అన్న కుమార్తె దీప అన్నాడీఎంకేకు అసలైన వారసురాలని అధికశాతం మంది పేర్కొనడం ద్వారా శశికళ ఎన్నిక అందరికీ ఆమోదయోగ్యం కాదని తేలిపోయింది. జయకు నీడలా నిలిచిన శశికళకు మించిన నాయకత్వం లేదని కొందరు వాదిస్తున్నారు. అంతటితో సరిపెట్టుకోక సీఎం బాధ్యతలు సైతం చిన్నమ్మకు అప్పగించాలని తహతహలాడుతున్నారు. అన్నాడీఎంకే ఓట్ల కోసం ఇప్పట్లో ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రధాన కార్యదర్శిగా శశికళ సత్తా ఏమిటో, డీఎంకే కొత్త సారధి స్టాలిన్ కు దీటుగా ఎలా వ్యవహరిస్తారో తెలిసేందుకు కొంతకాలం వేచి చూడాల్సిందే. -
సంక్రాంతికి కొత్త సీఎం?
► శశికళ కోసం 12న ముహూర్తం ► నేటి నుంచి జిల్లాల వారీగా తీర్మానాలు ► 17వ తేదీన ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాలు తమిళనాడు ప్రజలు అత్యంత పవిత్ర దినంగా భావించే పొంగల్ పండుగ నాటికి శశికళను ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ పరితపిస్తోంది. ఈనెల 12వ తేదీన సీఎంగా శశికళ బాధ్యతలు చేపట్టేలా పార్టీ అడుగులు వేస్తోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మరణించిన నాటి నుంచే శశికళ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అమ్మ మరణంతో ఖాళీ అయిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి పదవులను శశికళకే కట్టబెట్టాలని పార్టీలోని అగ్రనాయకత్వం ఆశించింది. ఈ దశలో పేరుకు సీఎం పన్నీర్సెల్వంమైనా ప్రతిదీ శశికళ కనుసన్నల్లోనే సాగుతోంది. పన్నీర్‌సెల్వం సైతం దాదాపుగా ప్రతిరోజూ శశికళ వద్ద çహాజరీవేయించుకుంటున్నారు. శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇక సీఎం సీటే తరువాయిగా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆమెపై ఒత్తిడి పెంచుతున్నారు. ముఖ్యంగా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై మరీ ఎక్కువగా కాలికి బలపం కట్టుకుని ఊరువాడా తిరుగుతున్నారు. ఇతనికి మంత్రులు ఆర్పీ ఉదయకుమార్, కడంబూరు రాజా, సేవూరు రామచంద్రన్ తదితరులు తోౖడయ్యారు. కొత్త ఏడాదిరోజున అమ్మ సమాధి వద్దకు వెళ్లి నివాళుర్పించిన మంత్రులు శశికళను కలుసుకుని సీఎం బాధ్యతలు స్వీకరించాలని కోరారు. మంత్రులు ఓఎస్ మణియన్, తంగమణి వీరికి వంత పాడారు. ఈ ప్రయత్నాలకు కొనసాగింపుగా సోమవారం సాయంత్రం సీఎం పన్నీర్‌సెల్వం, మంత్రులు, పార్టీ అగ్ర నేతలంతా సోమవారం సాయంత్రం పోయెస్‌గార్డెన్ లో శశికళతో సమావేశమై మరోసారి ఒత్తిడి తెచ్చారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్ శతజయంతి ఉత్సవాల ఈనెల ఈ ఉత్సవాల నాటికి శశికళను సీఎం చేసి ఆమె నేతృత్వంలో శతజయంతి ఉత్సవాలు సాగాలని ఆశిస్తూ నుంచి∙ జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి శశికళనే సీఎం అనే తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీ సమావేశాలు ముగిసిన తరువాత రాష్ట్రస్థాయిలో భారీ సమావేశాన్ని నిర్వహించి చిన్నమ్మ శశికళను సీఎంగా ఎన్నుకోవాలని తీర్మానం చేయనున్నారు. -
‘అమ్మ’ బాటలోనే పయనిస్తా
-
‘అమ్మ’ బాటలోనే పయనిస్తా
- ఆమె ఆశయాలను నెరవేరుస్తాను - అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శశికళ సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చూపిన బాటలో పయనిస్తూ ఆమె ఆశయాలను నెరవేరుస్తానని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ అన్నారు. తన జీవితాన్ని అన్నాడీఎంకేకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన కార్యదర్శిగా జయలలిత వినియోగించిన కారులోనే, ఆమెలానే ఆకుపచ్చ చీర ధరించి పోయెస్ గార్డెన్ నుంచి శశికళ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమెకు సీఎం పన్నీర్‌సెల్వం, పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ ఆహ్వానం పలికారు. ముందుగా ప్రాంగణంలోని ఎంజీ రామచంద్రన్(ఎమ్జీఆర్) విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించిన అనంతరం ప్రధాన కార్యదర్శిగా శశకళ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె కొంత భావోద్వేగంతో జయలలితను గుర్తు చేసుకున్నారు. ఆమె ఎప్పటికీ తన హృదయంలో నిలిచి ఉంటుందన్నారు. జయలలితతో కలసి సుమారు వెయ్యికి పైగా సభల్లో పాల్గొన్నానని, ఆమెతో పాటు అన్ని చోట్లకు వెళ్లానని గుర్తు చేసుకున్నారు. అలాంటిది ఈరోజు ఆమె స్థానంలో తానే వేదిక పైకి వచ్చి ప్రసంగించాల్సిన వస్తోందని కలలో కూడా ఊహించలేదన్నారు. జయలలిత 74 రోజుల పాటు పోరాడారని, కానీ దేవుడు తనకు ఇష్టమైన బిడ్డను తన వద్దకు పిలుచుకువెళ్లాడని పేర్కొన్నారు. జయ వదిలి వెళ్లిన బాధ్యతలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. నియామకంపై నిరసనలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్ని నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తిరు వళ్లూరు జిల్లాకు చెందిన స్వాతి అనంద్(42) అనే కార్యకర్త మెరీనా బీచ్‌లోని ‘అమ్మ’ సమాధి వద్దకు చేరుకుని శశికళకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హఠాత్తుగా విషం తాగాడు. అక్కడ ఉన్న వారు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా, శశికళ నియామకంపై మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత నాంజిల్ సంపత్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన డీఎంకేలో చేరేందుకు కూడా సిద్ధమైనట్లు సమాచారం. -
తమిళనాట డిసెంబర్ 29 టెన్షన్
-
చిన్నమ్మకు చిక్కులు!
-
చిన్నమ్మకు చిక్కులు!
అన్నాడీఎంకేలో అసంతృప్తి ప్రధాని వద్దకు జయ అన్న కుమార్తె దీప సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి కావాలని భావిస్తున్న చిన్నమ్మ శశికళకు చట్టపరమైన చిక్కులు తప్పేలా లేవు. శశికళను చట్టపరంగా ఎదుర్కొ నేందుకు వ్యతిరేక వర్గం రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈనెల 29న జరగనున్న పార్టీ సర్వసభ్య సమావేశానికి శశికళ మద్దతుదారులకు మాత్రమే ఆహ్వానాలు పంపు తున్నారు. పిలవకున్నా హాజరై ఎంపికను అడ్డుకుంటాం, విఫలమైతే చట్టపరంగా సాధిస్తామని వ్యతిరేక వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. పార్టీలో ప్రాథమిక సభ్యత్వమే లేని శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎలా ఎన్నుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ‘పార్టీ నియమావళి ప్రకారం ఒక సభ్యునిపై క్రమశిక్షణ చర్య తీసుకుంటే ఐదేళ్లపాటు అతను ఎన్నికల్లో పోటీచేసేందుకు వీల్లేదు. 2011 డిసెంబర్లో శశికళను ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు. 2012 మార్చిలో తిరిగి జయ వద్దకు చేరారు. అయితే శశికళకు ప్రాథమిక సభ్యత్వ కార్డును జారీ చేయలేదు. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా పార్టీ నిబంధనలను సవరించి శశికళను ఎన్నుకుంటే అది చట్టవ్యతిరేకం అవుతుంది. ఎన్నికల కమిషన్ సంప్రదాయాన్ని విస్మరించి, శశికళ మాత్రమే నామినేషన్ వేసేలా పార్టీ పెద్దలు వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్‌లో పిటిషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని వ్యతిరేక వర్గం పేర్కొంటోంది. ప్రధానిని కలవనున్న దీప జయలలిత అన్న కుమార్తె దీప త్వరలో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలుస్తారని తెలుస్తోంది. శశికళ వ్యతిరేకవర్గం పన్నీర్‌సెల్వం లేదా దీపను ప్రధాన కార్యదర్శి చేయాలని పట్టుపడుతున్నారు. దీప పేరవై అనే సంస్థను స్థాపించి జోరుగా సభ్యత్వాన్ని చేరుస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలని దీపపై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. అన్నాడీఎంకే రాజకీయాలను బీజేపీ తెరవెనుక ఉండి శాసిస్తున్నట్లు ఉవ్వెత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీప ప్రధానిని కలుసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
అన్నాడీఎంకేలో ముసలం
పార్టీలో అంతర్గత కుమ్ములాట శశికళకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతున్న కార్యకర్తలు జయ అన్న కుమార్తె దీపకు మద్దతుగా వెలసిన పోస్టర్లు తిరువళ్లూరు: అధికార అన్నాడీఎంకే పార్టీలో రాజకీయ ముసలం మొదలైంది. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా శశికళకు మద్దతు తెలుపుతూ జిల్లా నాయకత్వం ఏకీగ్రీవంగా చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ కింది స్థాయి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీతో సంబంధం లేని శశికళ పేరును జనరల్ సెక్రటరీగా ఎలా సిఫారసు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు దీపకు మద్దతుగా జిల్లావ్యాప్తంగా పోస్టర్లు అంటించడంతో కలకలం మొదలైంది. దీంతో ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాటలు వీధిన పడ్డాయి. ఈ కుమ్ములాటల వల్ల అన్నాడీఎంకే ఓటు చెదిరిపోయే ప్రమాదం ఉందని, తద్వారా కష్టపడి రెండోసారి అధికారంలోకి వచ్చినా వాటి ఫలాలు పూర్తి కాకముందే అధికారం చేజారిపోయేలా ఉందని అన్నాడీఎంకే నేతలు వాపోతున్నారు. చెన్నైకు సమీపంలోని జిల్లాగా పేరొందిన తిరువళ్లూరులో మొత్తం పది అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా అన్నాడీఎంకే తమ సత్తాను చాటడంతో పాటు అత్యధిక స్థానాలను గెలుచుకుంటూ వస్తోంది. 2011 ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాలు, 2016లో ఏడు స్థానాల్లో అన్నాడీఎంకే విజయం సాధించి తమ పట్టును నిలుపుకుంది. జిల్లాలో అన్నాడీఎంకేకు బలమైన క్యాడర్, చెక్కు చెదరని ఓటు బ్యాంకు ఉండడంతో అన్నాడీఎంకే గెలుపు నల్లేరుపై నడకలా సాగుతోంది. డీఎంకే హయాంలోనూ జిల్లాలోని అన్నాడీఎంకే క్యాడర్ డీఎంకేకు చుక్కలు చూపించిన సందర్భాలున్నాయి. ఇందుకే తిరువళ్లూరు జిల్లా అన్నాడీఎంకే కంచుకోటగా మారింది. జయ మరణంతో మొదలైన ముసలం: జయలలిత ముఖ్యమంత్రిగా పార్టీ కార్యదర్శిగా పనిచేసే సమయంలో ఆమె వాక్కు వేదవాక్కు. పార్టీ నిర్ణయాన్ని ప్రశ్నించే వారిపై వేటు పడేది. పార్టీ నిర్ణయాలు ఏకపక్షంగా సాగడంతో పాటు అన్ని కార్యకలాపాలు జయలలిత కనుసన్నల్లో సాగిపోయేవి. పార్టీలో క్రమశిక్షణతో పాటు అమె నిర్ణయాలకు తిరుగుండదు. అయితే జయలలిత మృతి చెందిన తరువాత అన్నాడీఎంకేలో వేగంగా పరిస్థితులు మారుతున్నాయి. ఎవరికి వారు రాజకీయాలను నడుపుతున్నారు. జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు శశికళకు మద్దతుగా తీర్మానం చేసి ఏకీగ్రీవంగా ఆమోదించారు. అయితే కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు మాత్రం వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేని శశికళను పార్టీ కార్యదర్శిగా ఎంపిక చేయడానికి ఎలా మద్దతు ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్‌సెల్వంను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్న అన్నాడీఎంకే నేతలు శశికళను మాత్రం అంగీకరించేది లేదని తేల్చిచెబుతున్నారు. ఇందులో భాగంగానే జయలలిత వారసురాలిగా దీపను నియమించాలని కోరుతూ పోస్టర్లు వెలుస్తున్నాయి. శశికళను పార్టీలోని ఉన్నత పదవికి ఎంపిక చేస్తే తామంతా పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరిస్తూ నోటీసులు అంటించారు. మొత్తానికి జయలలిత ఉన్నప్పుడు నోరు మెదపడానికి కూడా ముందుకు రాని నేతలు ప్రస్తుతం పోస్టర్లు, బ్యానర్లతో వీధికెక్కారు. అధికార అన్నాడీఎంకే పార్టీలో మొదలైన ముసలంతో పార్టీ ప్రతిష్ట ఇప్పటికే దెబ్బతిందని, ఇది భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళన పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తిరువళ్లూరులోని పలు ప్రాంతాల్లో దీప పేరిట ఏర్పాటు చేసిన బ్యానర్లతో కలకలం మొదలైంది. -
ఆ ఊహ నిజం అవుతుందా!
ఊహకు బలం అధికం. దానికి సరిగా పదును పెడితే అంతరాల్లోకి దిగుతుంది. అలా ఊహాజనిత కథలతో తెరకెక్కిన కథలెన్నో చిత్రాలుగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. ఒక మహానటిగా, మహోన్నత రాజకీయనాయకురాలిగా తమిళ ప్రజల గుండె అనే ఆలయంలో ఒక దేవతగా, అమ్మగా కొలువైన దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం సముద్రపు అలల ఆటుపోటుల వంటిదని చెప్పవచ్చు. అయితే జయలలిత సాధన మాత్రం అనితర సాధ్యం. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం, దృఢమైన ఆత్మవిశ్వాసం, అలుపెరగని పోరాటం అమ్మ నైజాల్లో ప్రధానమైనవి. మరణించినా జీవించి ఉండే అతి కొద్ది మందిలో జయలలిత ఒకరు. అలాంటి అమ్మ రూపంలో మేటి నటి రమ్యకృష్ణ దర్శనం ఇవ్వడం విశేషం. ఇదేమిటీ జయలలిత రూపంలో రమ్యకృష్ణ దర్శనం ఇవ్వడం ఏమిటీ? అని ఆశ్చర్యపోతున్నారా? ప్రస్తుతానికి అది ఒక చిత్ర కారుడి ఊహా చిత్రమే. మదర్ ది స్టోరీ ఆఫ్ ఏ క్వీన్ టాగ్‌తో రూపొందించిన అమ్మగా రమ్యకృష్ణ ఊహాజనిత చిత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నిజానికి అమ్మ జయలలిత జీవిత చరిత్రను వెండి తెరకెక్కించాలన్న ఆసక్తి, ఆలోచన పరిశ్రమ వర్గాల్లో చాలా మందికి ఉంది. అలాగే అమ్మగా నటించాలన్న ఆకాంక్ష అగ్రనాయికలైన పలువురిలో ఉంది. అయితే అమ్మ పాత్ర పోషించడం సాధ్యమా?అన్న భయం కొందరిలో లేకపోలేదు. ఇక జయలలిత రూపంలో నటి రమ్యకృష్ణ ఊహా చిత్రం సోషల్ మీడియాల్లో హల్చల్ చేస్తున్న విషయం గురించి ఆ గ్రేట్ నటి ముందుంచగా చాలా ఎమోషనల్‌గా స్పందించారు. ఆ ఊహా చిత్రం తన దృష్టికీ వచ్చిందన్నారు. తన స్నేహితులు ఆ ఫొటోను వాట్సాప్ ద్వారా తనకు పంపించారన్నారు. అది పూర్తిగా అభిమానుల ఆకాంక్షా చిత్రంగా పేర్కొన్నారు. అయితే ఒక విషయాన్ని మాత్రం ప్రస్తావించదలచుకున్నానన్నారు. తనను చాలా సార్లు, చాలామంది పత్రికా విలేకరులు మీ డ్రీమ్ రోల్ ఏమిటని అడిగినా అందుకు సమాధానం ఇవ్వలేదన్నారు. అయితే ఇప్పుడు ఆ ఊహా చిత్రం చూసిన తరువాత జయలలితగా నటించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఇదే తన డ్రీమ్ రోల్ అని పేర్కొన్నారు. అలాంటి అవకాశం రావాలని కోరుకుంటున్నానని, అయితే ఆ పాత్రలో జీవించడం చాలా చాలెంజ్‌తో కూ డుకుందని అన్నారు. అందువల్ల అలాంటి పాత్రను అంత సులభంగా అంగీకరించలేనన్నారు. స్క్రిప్ట్ పక్కాగా ఉండి, సమర్థులైన దర్శక నిర్మాతలు చిత్ర నిర్మాణానికి పూనుకుని తనను సంప్రదిస్తే తాను అమ్మగా నటించడానికి సిద్ధం అని రమ్యకృష్ణ పేర్కొన్నట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం. తనతో పాటు కోట్లాది మంది మహిళామణులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన బోల్డ్ అండ్ హైలీ ఇంటెలిజెంట్ లేడీ అమ్మ అని రమ్యకృష్ణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అభిమాని ఊహాచిత్రం వెండితెరపై నిజం అవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే. అయితే ఇప్పటికే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ శశికళ పేరుతో చిత్రాన్ని రూపొందించడానికి సన్నద్ధం అవుతున్నారు. అందులో అమ్మ పాత్ర ప్రధానంగా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి నిజ వ్యక్తుల రూపాలను వెండితెరపై అచ్చు గుద్దినట్లు చూపించగల వర్మ శశికళ చిత్రంలో ఎవరిని ఆ విధంగా మార్చనున్నారో వెయిట్ అండ్ సీ. -
పగ్గాలు శశికళకేనా?
► జోరుగా సమీకరణలు ► అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం ► శశికళే వారసురాలని పొన్నయ్యన్ పునరుద్ఘాటన ► శశికళ కోసం దక్షిణ చెన్నైలో తీర్మానం సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే పగ్గాలను శశికళకు అప్పగించేందుకు పార్టీలో జోరుగా సమీకరణల పర్వం సాగుతోంది. అగ్రనేతలంతా ఏకతాటిపై నిలబడి ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సీఎం పన్నీర్‌సెల్వం సహా నేతలంతా నడుం బిగించారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు ఒకేసారి ఖాళీ అయ్యాయి. పెద్దగా తర్జనభర్జన అవసరం లేకుండానే ముఖ్యమంత్రి పదవి పన్నీర్‌సెల్వాన్ని వరిం చింది. జయ రెండు సార్లు జైలు కెళ్లినపుడు పన్నీర్సెల్వంకే సీఎం బాధ్యతలు అప్పగించడంతో ఆమె అభీష్టానికి అనుగుణంగా పన్నీరుకే పట్టం కట్టారు. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరనే విషయంలోనే పెద్ద చిక్కువచ్చిపడింది. అందరి దృష్టి జయలలిత నెచ్చెలి శశికళపైనే పడింది. శశికళ సైతం మౌనమే అంగీకారంగా వ్యవహరిస్తున్నారు. పరోక్షంగా తన మద్దతుదారులను కూడగడుతున్నారు. జయ జైలుకెళ్లిన రెండు సందర్భాల్లోనూ సీఎం పదవికి పన్నీర్‌సెల్వం పేరును సూచించింది శశికళే కావడంతో నేటి రాజకీయ పరిస్థితుల్లోనూ ఆమెకు నమ్మిన బంటుగా మారారు. పన్నీర్‌సెల్వం సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతిరోజూ పోయెస్‌గార్డెన్ కు వెళ్లి చిన్నమ్మ దర్శనం చేసుకుంటున్నారు. శశికళకు అనుకూలంగా సమీకరణలను కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి 135 మంది ఎమ్మెల్యేలను రప్పించిన సీఎం పన్నీర్‌సెల్వం వారితో సమావేశమయ్యారు. సుమారు గంటకు పైగా వారితో చర్చలు జరిపిన విషయాలను గోప్యంగా ఉంచారు. అక్కడి నుంచి ఎమ్మెల్యేలందరినీ మూడు ఏసీ బస్సుల్లో పోయెస్గార్న్ లో ఉన్న శశికళ వద్దకు తీసుకెళ్లారు. ఇదే సమయంలో శశికళ సైతం సుమారు రెండువేల మంది సీనియర్ నేతలను పిలిపించుకున్నారు. జయలలిత మరణించి 11వ రోజైన కర్మలను నిర్వహించారు. ఆ తరువాత అందరూ కలిసి మెరీనాబీచ్‌లోని జయ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. సరిగ్గా ఇదే సమయంలో పార్టీ దక్షిణ చెన్నై విభాగం నేతలు సమావేశమై శశికళను ప్రధాన కార్యదర్శిగా నియమించాలని కోరుతూ తీర్మానం చేశారు. 1991లో జయలలిత శ్రీరామ్ చిట్‌ఫండ్స్‌లో రూ.7లక్షలు పెట్టుబడి పెట్టారని, ఈ బాండులో నామినీగా శశికళను పెట్టారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి పొన్నయ్యన్ చెప్పారు. ఆయా పత్రాలను మీడియాకు చూపుతూ జయకు వారసురాలు శశికళ అని చెప్పేందుకు ఇంతకంటే ఆధారాలు ఏమి కావాలని వ్యతిరేకిస్తున్న వారికి పరోక్షంగా సవాల్ విసిరారు. ఎవరు ఎంతగా శశికళకు మద్దతు పలుకుతున్నా పార్టీలోని ఒక బలమైన సామాజికవర్గం గట్టిగా వ్యతిరేకిస్తోంది. శశికళ నియామకాన్ని సహించబోమని అంటూ చాప కింద నీరులా పావులు కదుపుతోంది. ఈనెల 21వ తేదీన పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు గతంలో ప్రకటించినా సమీకరణల నేపథ్యంలో వాయిదా వేసినట్లు తెలుస్తోంది. -
వర్మ దర్శకత్వంలో 'శశికళ'
దేశవ్యాప్తంగా ఏ భారీ సంఘటన జరిగినా సినీ రంగం నుంచి ముందుగా స్పందించే వ్యక్తి రాంగోపాల్ వర్మ. అయితే వర్మ స్పందనపై విమర్శలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. ప్రతీ విషయాన్ని తన సినిమా కథ కోసం లేక పబ్లిసిటీ కోసమో వాడుకోవటం వర్మకు అలవాటు. తాజాగా తమిళనాట అమ్మ మరణం తరువాత రాజకీయ రంగంలో ప్రముఖంగా వినిపిస్తున్న శశికళ పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నాడు వర్మ. శశికళ పేరుతో సినిమాను ఎనౌన్స్ చేశాడు. ఇప్పటికే రక్తచరిత్ర సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వర్మ ప్రస్తుతం వంగవీటి, నయీం లాంటి యాథార్థ కథలతో సినిమాలు రూపొందిస్తున్నాడు. అయితే శశికళ పేరుతో తెరకెక్కించే సినిమా మాత్రం పూర్తి కాల్పనిక కథతో తెరకెక్కిస్తున్నాడట. అది కూడా రాజకీయాలు లేని కథాశంతో.. వర్మ నిజంగానే రాజకీయాలకు అతీతంగా సినిమాను తెరకెక్కించాలని భావిస్తే ఈ సమయంలో ఆ పేరుతో సినిమాను ఎందుకు ఎనౌన్స్ చేశాడో.. వర్మకే తెలియాలి. Just registered my new film title "Shashikala" it's the story of a very dearest closest friend of a politician and completely fictional — Ram Gopal Varma (@RGVzoomin) 15 December 2016 "Shashikala" is going to be a very very sincere from the heart Tamilan love story and absolutely nothing to with fictional non politics — Ram Gopal Varma (@RGVzoomin) 15 December 2016 Fictional non politics of Shashikala have a fundamental contradiction with highly truthful but assumed non truths of Jayalalitha — Ram Gopal Varma (@RGVzoomin) 15 December 2016 I immensely respect Jayalalitha but I honestly respect Shasikalaji a little bit much much much more — Ram Gopal Varma (@RGVzoomin) 15 December 2016 Jayalalitha ji respected Shasikala ji much more than she respected anybody else proves why I should call my film "Shasikala" — Ram Gopal Varma (@RGVzoomin) 15 December 2016 Jayalalitha seen through the eyes of Shasikala is much more poetic and honest thought than seeing Jayalalitha only through Jayalalitha — Ram Gopal Varma (@RGVzoomin) 15 December 2016 -
అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు!
సాక్షి ప్రతినిధి, చెన్నై/సాక్షి, న్యూఢిల్లీ: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి స్థానాన్ని దక్కించుకునేందుకు ఆధిపత్యపోరు మొదలైంది. ఒకవైపు శశికళ మద్దతు కూడగడుతుండగా మరోవైపు దివంగత జయలలిత మేనకోడలు దీపకు తమిళనాడు దక్షిణాది జిల్లాల నేతలు బాసటగా నిలుస్తున్నారు. శశికళకు పార్టీలోని దేవర్ సామాజిక వర్గం మద్దతు పలుకుతుండగా, నాడార్లు అవకాశం కోసం చూస్తున్నారు. తంబిదురై నేతృత్వంలో 49 మంది పార్టీ ఎంపీలు మంగళవారం శశికళను కలిసి సంఘీభావం తెలిపారు. 21న పార్టీ సర్వసభ్య సమావేశం జరగనుంది. జయ మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించండి..: దివంగత సీఎం జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని ‘తమిళనాడు తెలుగు యువశక్తి’ సంస్థ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అపోలో ఆసుపత్రిని ప్రతివాదులుగా చేర్చింది. ఆమె ఆసుపత్రిలో ఉన్న కాలంలో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ జరపాలని కోరింది. -
శశికళ జయకు దగ్గరైన వేళ
-
'అమ్మ' పడిలేచిన కెరటం
-
జయలలిత 'శక్తి స్వరూపిణి'
-
పడిలేచిన కెరటం
తమిళులందరూ ‘అమ్మ’గా ప్రేమించే జయలలిత ఆ స్థానానికి చేరుకోవడానికి.. వారి గుండెల్లో చోటు సంపాదించుకోవడానికి చేసిన ప్రస్థానం అసాధారణమైనది! పురుషాధిక్య రాజకీయాలు.. కరడుగట్టిన ద్రవిడ రాజకీయాల్లో వైష్ణవ బ్రాహ్మణ వర్గానికి చెందిన స్త్రీ.. అవినీతి ఆరోపణలు.. కేసులు.. అరెస్టులు.. జైళ్లు.. అనర్హత వేట్లు! అరుునా.. మొక్కవోని ధైర్యం.. సడలని సంకల్పం.. ముళ్లబాటను పూలబాటగా మలచుకుని.. జనం గుండెల్లో చెదరని స్థానం సంపాదించుకున్న పురచ్చి తలైవి!! రాజకీయ అరంగేట్రం: దక్షిణాది సినీ రంగంలో ముఖ్యంగా తమిళనాట అగ్రనాయికగా వెలుగొందుతున్న జయలలితను 1982లో రాజకీయాల్లోకి తీసుకువచ్చింది అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు ఎం.జి.రామచంద్రన్. తొలుత పార్టీ సభ్యురాలిగా చేరిన జయలలిత ఏడాదిలోనే 1983లో పార్టీ ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు. రాజ్యసభ సభ్యత్వం: ఆ మరుసటి ఏడాదే 1984లో ఎంజీఆర్ కిడ్నీ వ్యాధి చికిత్స కోసం అమెరికా పయనమయ్యే ముందుగా.. పార్టీ నుంచి జయలిలత రాజ్యసభకు ఎన్నికయ్యేలా చేశారు. ఇది పార్టీలో ఎంతో మంది సీనియర్లకు మింగుడుపడలేదు. మరోవైపు ఎంజీఆర్ అమెరికాలో చికిత్స పొందుతుండగా.. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున జయ ప్రచారం నిర్వహించి గెలిపించారు. ఎంజీఆర్‌కు, జయలలితకు మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించినా.. జయ చాకచక్యంగా వాటిని ఎదుర్కొన్నారు. పార్టీ కోసం పోరాటం: 1987లో ఎంజీఆర్ మరణంతో ఆయన వారసత్వం విషయమై అన్నాడీఎంకేలో వివాదం రాజుకుంది. ఎంజీఆర్ భార్య జానకీ రామంచంద్రన్, జయలలితల మధ్య పార్టీ చీలిపోరుుంది. జయలలితవైపు ఉన్న ఎమ్మెల్యేల్లో ఏడుగురిపై స్పీకర్ అనర్హత వేటు వేయగా.. జానకీ రామచంద్రన్ గ్రూపు విశ్వాస పరీక్షలో నెగ్గింది. అరుుతే.. కొద్ది కాలానికే కేంద్రంలోని రాజీవ్ గాంధీ సర్కారు తమిళనాడులో జానకీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. ప్రతిపక్ష నాయకురాలిగా: ఈ క్రమంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జానకీ గ్రూపుపై జయలలిత పైచేరుు సాధించారు. అరుుతే.. అన్నా డీఎంకేలో ఈ అంతర్గత విభేదాల కారణంగా ఆ ఎన్నికల్లో డీఎంకే గెలిచింది. ఆ పార్టీ అధినేత కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. జయలలిత తమిళనాడు శాసనసభలో తొలి మహిళా ప్రతిపక్షనేత అయ్యారు. చీలిపోరుున అన్నాడీఎంకే రెండు విభాగాలనూ పునరైక్యం చేసి పార్టీ పగ్గాలు చేపట్టారు. ఎన్నికల సంఘం స్తంభింపజేసిన పార్టీ రెండు ఆకుల గుర్తును తిరిగి పునరుద్ధరించారు. తొలిసారి ముఖ్యమంత్రి: జయలలిత ఆ శపథాన్ని నెరవేర్చుకున్నారు. ఆ అవమానకర ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత.. 1991 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఘన విజయం సాధించింది. నాటి ఎన్నికలకు ముందు రాజీవ్‌గాంధీ ఎల్టీటీఈ చేతిలో హత్యకు గురవగా.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న అన్నా డీఎంకే విజయానికి ఆ సానుభూతి పవనాలూ దోహదపడ్డారుు. మొత్తం 234 సీట్లకుగానూ 225 సీట్లు అన్నాడీఎంకే-కాంగ్రెస్ కూటమి గెలుచుకుంది. 1991 జూన్ 24న జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్ల పూర్తి కాలం పదవిలో కొనసాగారు. వరుస విజయం.. ఆపై అనారోగ్యం కోర్టు కేసుల నుంచి విముక్తి పొందిన జయలలిత 2016 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగించారు. ఎంజీఆర్ అనంతరం వరుసగా రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది రికార్డు సృష్టించారు. అంతేకాదు.. తమిళ ప్రజల గుండెల్లో ‘అమ్మ’గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. కానీ.. ఐదు నెలలు గడవక ముందే అనారోగ్యానికి గురయ్యారు. మూడు నెలలుగా ఆస్పత్రికే పరిమితమైన జయలలిత డిసెంబర్ ఐదోతేదీ సోమవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. శాసనసభలో దుశ్సాసనపర్వం 1989 మార్చి 25న తమిళనాడు శాసనసభలో జయలలిత తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారు. సభలో అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే సభ్యుల మధ్య ఘర్షణ తలెత్తింది. ప్రతిపక్ష నాయకురాలు జయలలితపై అధికారపక్ష సభ్యులు దాడికి దిగారు. డీఎంకే సభ్యుడు దురై మురుగన్ జయలలిత చీర లాగారన్న ఆరోపణలు వచ్చారుు. జయలలిత చిరిగిన చీరతో, రేగిన జుట్టుతో, ఎర్రబడిన ముఖంతో సభ నుంచి బయటకు వచ్చారు. మీడియాకు జరిగిన ఘటనను వివరించారు. మళ్లీ తాను ఆ శాసనసభలో అడుగుపెడితే ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానని శపథం చేశారు. ఆరోపణలు అధిగమిస్తూ.. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జయలలితపై, ఆమె మంత్రివర్గంపై తీవ్ర స్థారుులో అవినీతి ఆరోపణలు వచ్చాయి. 1995లో జయ తన దత్తపుత్రుడు సుధాకరన్ వివాహ వేడుకను గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కేంత ఆడంబరంగా నిర్వహించడం వంటివి తీవ్ర దుమారం రేపారుు. ఈ క్రమంలో 1996లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఘోరంగా ఓడిపోరుుంది. ఆ పార్టీకి కేవలం 4 సీట్లు మాత్రమే దక్కారుు. స్వయంగా జయలలిత సైతం డీఎంకే చేతిలో ఓడిపోరుుంది. కేసులు.. తొలిసారి ఆరెస్టు తమిళనాడులో 1996లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత జయలలితపై పలు అవినీతి ఆరోపణలతో కేసులు నమోదు చేసింది. కలర్ టీవీల కుంభకోణంలో ఆమెకు రూ.10 కోట్లకు పైగా ముడుపులు అందాయని, టాన్సీ భూములను సొంతం చేసుకోవడనికి జయలలిత సీఎంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేవి ముఖ్యమైన ఆరోపణలు. జయలలితకు ఆదాయానికి మించి రూ.66.65 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ అప్పటి జనతా పార్టీ నేత సుబ్రమణ్యంస్వామి కేసు వేశారు. అదే ఏడాది డిసెంబర్ 7వ తేదీన జయను అరెస్ట్ చేయగా.. 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. కలర్ టీవీ కేసును 2000 సంవత్సరంలో కోర్టు కొట్టివేసింది. సీఎంగా ప్రమాణం.. అనర్హత 2001 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అరుుతే.. కేసుల కారణంగా జయలలిత ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోయారు. కానీ ఎన్నికల్లో గెలిచిన పార్టీ.. జయలలితను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. ఆమె 2001 మే 14న రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు. కానీ.. టాన్సీ భూములు, ప్లెజెంట్ స్టే హోటల్ కేసుల్లో కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు పెండింగ్‌లో ఉండగా ఆమె సీఎం పదవి చేపట్టడం చెల్లదని సుప్రీంకోర్టు సెప్టెంబర్‌లో తీర్పునిచ్చింది. దీంతో ఆమె తనకు విశ్వాసపాత్రుడైన ఒ.పన్నీరుసెల్వానికి సీఎంగా బాధ్యతలు అప్పగించారు. మళ్లీ ముఖ్యమంత్రిగా.. జయలలిత తనపై నమోదైన కేసుల్లో న్యాయపోరాటం చేశారు. టాన్సీ భూములు, ప్లెజెంట్ స్టే హోటల్ కేసులను 2001లో కింది కోర్టులు కొట్టివేయగా.. 2003లో సుప్రీంకోర్టు ఆ తీర్పులను సమర్థించింది. దీంతో అదే ఏడాది మార్చిలో జయలలిత మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఉప ఎన్నికలో పోటీ చేసి అసెంబ్లీకి కూడా ఎన్నికయ్యారు. మరో ఓటమి.. మరో గెలుపు జయలలిత, ఆమె సారథ్యంలోని అన్నా డీఎంకే 2006 అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది. కేవలం 61 సీట్లు మాత్రమే గెలుపొందింది. అత్యధికంగా 96 సీట్లు గెలుపొందిన డీఎంకే.. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. అరుుతే.. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత మళ్లీ విజయం సాధించారు. అదే ఏడాది మే నెలలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.ఆమె సారథ్యంలోని అన్నా డీఎంకే 11 పార్టీల తో పొత్తు పెట్టుకుని ఈ గెలుపును సొంతం చేసుకుం ది. జయ రాజకీయ ప్రస్థానం వేగం పుంజుకుంది. మళ్లీ అరెస్టు, జైలు, విముక్తి అయితే.. జయలలితను ఆస్తుల కేసు వెంటాడుతూనే ఉంది. 2014 సెప్టెంబర్‌లో జయలలితను దోషిగా పేర్కొంటూ బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. దీంతో జయ మరోసారి సీఎం పదవికి అనర్హురాలయ్యారు. మళ్లీ జైలుకు వెళ్లారు. ఆమె ఒ.పన్నీరుసెల్వంను సీఎంగా నియమించారు. కొద్ది రోజులకే సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ప్రత్యేక కోర్టు తీర్పును సస్పెండ్ చేసింది. 2015లో కర్ణాటక హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం.. జయలలితకు శిక్ష విధిస్తూ కింది కోర్టు తీర్పును రద్దు చేసింది. దీంతో జయ మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఆరోజు... అవమానం... ఆ రోజు... డిసెంబరు 24... 1987 ఎంజీఆర్ మరణ వార్త... వినగానే జయ స్థాణువైపోరుుంది. కొంచెం సేపటికి తేరుకుని రామవరం గార్డెన్స్ (ఎంజీఆర్ ఇల్లు) వెళ్లేందుకు డ్రైవర్‌ను పిలిచింది. కానీ ఇంట్లోకి అడుగుపెట్టవద్దన్న హెచ్చరికలు జారీ అయ్యారుు. కారులోంచి బయటకొచ్చిన జయ తలుపులను చేతులతో దబదబ మోదింది. చాలాసేపటి తరువాత తలుపులు తెరుచుకున్నా ఎంజీఆర్ మృతదేహం ఎక్కడ ఉంచారన్న విషయం మాత్రం ఎవరూ జయకు తెలియనివ్వలేదు. చాలాసార్లు మెట్లు ఎక్కి దిగి ఇల్లంతా వెతికింది జయ. ఆమె ముఖం మీదే గదుల తలుపులు వేసేశారు. ఎంజీఆర్ కడచూపు కూడా దక్కనివ్వలేదు. చిట్ట చివరకు.. ఎవరో... మృతదేహాన్ని పెరటి తలుపు నుంచి రాజాజీ హాల్‌కు తరలించారన్న సమాచారం ఇచ్చారు. అంతే... జయ ఆయాసంతో రొప్పుతూ రాజాజీ హాల్‌కు తీసుకెళ్లాల్సిందిగా డ్రైవర్‌ను ఆదేశించింది. హాల్‌కు వెళ్లగానే పరుగు పరుగున ఎంజీఆర్ మృతదేహం తల వైపు కూర్చుండి పోరుుంది. కనురెప్పలు సైతం వాల్చకుండా... దాదాపు 21 గంటలు అక్కడే అలాగే ఉండిపోయింది. ఎంజీఆర్‌కు నివాళులు అర్పించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆమె సంకల్పానికి నివ్వెరపోయారు. శారీరకంగా ఇంత దృఢంగా ఉన్న జయపై ఆ దశలో జరిగిన మానసిక హింస అంతా ఇంతా కాదు. ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ మద్దతుదారులు జయ చుట్టుపక్కలే నిలబడి కాళ్లు తొక్కుతూ హింసించారు. వెనుకనుంచి గోళ్లతో గిచ్చారు. అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేసేందుకు శతధా ప్రయత్నించారు. అరుునా జయ చెక్కు చెదరలేదు. ఆత్మగౌరవానికి తీవ్రమైన భంగపాటు జరిగినా... ఎవరు ఎంత అవహేళన చేసినా ఉన్న చోటి నుంచి అస్సలు కదల్లేదు. పరిసరాల్లో ఏం జరుగుతోందో కూడా పట్టించుకోని స్థితికి చేరిపోయారు ఆమె. అరుుతే అంతటి విషమ పరిస్థితిలోనూ ఆమె మెదడును ఒక ప్రశ్న మాత్రం తొలిచేస్తూనే ఉండి ఉంటుంది. ‘‘ఇప్పుడేం చేయాలి?’’ అని. దాదాపు 38 ఏళ్ల వయసు... మంచి భవిష్యత్తు ఉంటుందని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎదురుగా జీవం లేకుండా పడి ఉన్నాడు. అప్పటివరకూ తమ నాయకుడికి రాజకీయ వారసురాలు తనేనన్న పార్టీ కార్యకర్తలూ పట్టించుకోని పరిస్థితి. అరుుతే... ఓటమిని తేలికగా తీసుకునే వ్యక్తి... .జయ కానే కాదు! అంతిమ యాత్రలోనూ అదే అవమానం... ఎంజీఆర్ అంతిమ యాత్ర మొదలయ్యే క్షణాలు... మృతదేహాన్ని ఉంచిన వాహనంలోకి ఎక్కేందుకు జయ ప్రయత్నించారు. డ్యూటీలో ఉన్న పోలీసులు ఓ చేయి అందించారు కూడా. అయితే ఆమె పైకి ఎక్కిందో లేదు... దిగిపోవాల్సిందిగా అరుపులు. చూస్తే ఎదురుగా ఎమ్మెల్యే కేపీ రామలింగం తనవైపు దూసుకొస్తూ కనిపించాడు. ఏమైందో తెలిసేలోపుగానే జయపై దాడి మొదలైంది. జానకీ రామచంద్రన్ దగ్గరి బంధువు దీపన్ జయ నుదుటిపై కొట్టాడు. వాహనం నుంచి కిందకు తోసేశాడు. తగిలిన గాయాలు ఆమెను బాధించాయో లేదోగానీ... ఆ అవమానం మాత్రం ఆమెను నిశ్చేష్టురాలిని చేసేసింది. అంత్యక్రియల్లో పాల్గొనకుండానే వెనక్కు వచ్చేయాల్సి వచ్చింది. మలుపు తిప్పిన ఆ రోజు... జయకు జరిగిన అవమానాలు ఏఐఏడీఎంకే కార్యకర్తలందరిలోనూ దావానలంలా వ్యాపించాయి. ఒక్కరొక్కరుగా కార్యకర్తలు, నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఆమె ఇంటికి చేరుకోవడం మొదలైంది. జరిగిన అవమానాన్ని ఖండించారు. ఎంజీఆర్ వారసురాలిగా తాము మీ వెంటే ఉంటామని జయకు భరోసా ఇచ్చారు. ఆ తరువాత రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 97 మంది ఎమ్మెల్యేలతో జానకీ రామచంద్రన్ ఇచ్చిన లేఖను ఆమోదిస్తూ గవర్నర్ ఎస్.ఎల్.ఖురానా ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. 1988 జనవరి ఏడున జానకి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా సూచించారు. ఆ రోజు అసెంబ్లీ అంత గందరగోళంతో నిండిపోయింది. కొంతమంది గూండాలు జయ మద్దతుదారులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై దాడులు చేశారు. తమిళనాడు చరిత్రలో మొదటిసారి పోలీసులు అసెంబ్లీలోకి ప్రవేశించి లాఠీఛార్జి చేశారు. ఈ సందర్భంలోనే సభాపతి జానకి రామచంద్రన్ విశ్వాస పరీక్ష నెగ్గినట్లు ప్రకటించారు. ఆ వెంటనే... జయ అసెంబ్లీ బయటకు వచ్చి ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆక్రోశం వ్యక్తం చేశారు. జానకి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరారు. అసెంబ్లీ సంఘటనలన్నింటితో గవర్నర్‌కు నివేదిక సమర్పించారు. ఆ తరువాత అసెంబ్లీని రద్దు చేసి తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా గవర్నర్ కేంద్రానికి సిఫారసు చేశారు. తమిళనాడులో జయ శకానికి నాందీ పడింది! (‘అమ్మ... జయలలితాస్ జర్నీ ఫ్రమ్ మూవీస్టార్ టు పొలిటికల్ క్వీన్’ గ్రంథం నుంచి. రచయిత: వాసంతి) -
శక్తి స్వరూపిణి
సాక్షి ప్రతినిధి, చెన్నై: పురచ్చితలైవి(విప్లవ నాయకి)లోని తెగువ.. అమ్మలోని అనురాగం.. ఎన్ని కష్టాలెదురైనా వెనక్కి తగ్గని నైజం ఆమె సొంతం. రెండేళ్లకే తండ్రి చనిపోయినా.. తల్లి సినిమాల్లోకి వెళ్లడంతో చిన్నతనంలో మాతృప్రేమకు దూరమైనా.. ఆమె కుంగిపోలేదు. చదువుల్లో టాపర్ అయినా.. కుటుంబపోషణ కోసం నాటకాల బాటపట్టినా.. ఎక్కడా నిరుత్సాహపడలేదు. నిండుసభలో దుశ్శాసన పర్వాన్ని ఎదుర్కొన్నా.. ఆ తర్వాత రెండేళ్లకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ధీరోదాత్త. ఇలా ఒక్కసారి కాదు ఏకంగా ఆరుసార్లు ముఖ్యమంత్రిగా ప్రజామన్ననలు పొందిన రికార్డు జయలలితకే సాధ్యం. తరతరాలుగా వేళ్లూనుకుపోయి ఉన్న పురుషాధిక్య సమాజంలో.. అందులోనూ రాజకీయాల్లో నెగ్గుకు రావడమంటే మాటలు కాదు. ఇది దాదాపు అసాధ్యమే. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అందరి చేత ‘జయ’హో అనిపించుకున్నారు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబంలో పుట్టినా జాతీయస్థాయి రాజకీయ పుంగవుల చేత జేజేలు కొట్టించుకున్నారు. ఒకనాడు ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్లను ఉక్కు మహిళ అనే వారు. ఈ కోవలోనే జయలలితనూ దక్షిణాది ఉక్కు మహిళ అని పిలుచుకోవచ్చు. ఆటుపోట్లతో అమ్మ ఎదురీత ఎంజీఆర్ మరణంతో జయకు కష్టాలు ప్రారంభమయ్యాయి. విపక్షం డీఎంకేతో పాటు స్వపక్షం అన్నాడీఎంకే నుంచి కూడా ఆమె అవమానాలను ఎదుర్కొన్నారు. ఎంజీఆర్ మృతి చెందగానే పార్టీ రెండుగా చీలింది. ఒక వర్గానికి నాయకత్వం వహించిన ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ఆర్టికల్ 356 ప్రయోగించి జానకీ రామచంద్రన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. అక్కడితో ఆమె శకం ముగిసింది. 1989లో ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా తన వర్గానికి నాయకత్వం వహించి ఎన్నికల బరిలోకి దిగిన జయ.. తేనీ జిల్లా బోడినాయకనూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆమె పార్టీ కేవలం 27 సీట్లు మాత్రమే గెలవడంతో ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. తద్వారా తమిళనాడు తొలి మహిళా ప్రతిపక్ష నేతగా జయ చరిత్ర కెక్కారు. అదే ఏడాది జయ జీవితంలో మర్చిపోలేని చేదు సంఘటన చోటుచేసుకుంది. నిండు సభలో స్పీకర్ సాక్షిగా అధికారపక్షం డీఎంకే చేతిలో దాడికి, తీవ్ర పరాభవానికి గురయ్యారు. చినిగిన చీరతో అసెంబ్లీ నుంచి వెళ్లిపోతూ.. ‘ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో అడుగుపెట్టను’ అని జయ శపథం చేశారు. కాగా, చట్టసభలో ఎదురైన పరాభవం ఆమెకు ప్రజల నుంచి అంతులేని సానుభూతి తెచ్చిపెట్టింది. అదే సమయంలో అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఏకమవ్వడంతో జయలలిత పార్టీ సామ్రాజ్ఞిగా ఎదిగారు. 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆమె స్నేహహస్తం అందించారు. ఆ ఎన్నికల సమయంలోనే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని ఎల్టీటీఈ తీవ్రవాదులు హతమార్చారు. కాగా, ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే, కాంగ్రెస్ కూటమి 234 అసెంబ్లీ స్థానాలకు గానూ 225 చోట్ల, 39 పార్లమెంటు స్థానాల్లో గెలుపొంది జయకేతనం ఎగరవేసింది. దీంతో 1991లో జయలలిత తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. శపధాన్ని రెండేళ్లు కూడా తిరగక ముందే నెరవేర్చి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో జయ అడుగుపెట్టారు. అనంతరం 1996 ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోరుుంది. మళ్లీ 2001లో రెండోసారి జయ ముఖ్యమంత్రి అయ్యారు. ఆతర్వాత 2002లో మూడోసారి, 2011లో నాలుగోసారి, 2015లో ఐదోసారి, 2016లో ఆరోసారి ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు చేపట్టారు. రికార్డుల్లో గురువును మించిన శిష్యురాలు రాజకీయాల్లో ఓనమాలు దిద్దించిన ఎంజీఆర్ సాధించిన రికార్డులను బద్దలుకొట్టడం ద్వారా గురువును మించిన శిష్యురాలు అనిపించుకున్నారు జయ. ఎంజీఆర్ మూడుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తే.. ఆయన శిష్యురాలు జయలలిత ఆరుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే గత పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి 39 స్థానాల్లో 37 స్థానాలను గెలుచుకున్న రికార్డు కూడా జయకు మాత్రమే సొంతం. మిత్రపక్ష పార్టీలను కూడా రెండు ఆకుల గుర్తుపైనే పోటీ చేరుుంచి గెలిపించడం జయ నాయకత్వ పటిమకు నిదర్శనం. అధికార పార్టీని ఐదేళ్ల తర్వాత ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం తమిళనాడు ప్రజల సంప్రదాయం. దీనిని కూడా ఆనాడు ఎంజీఆర్ తుడిచిపెట్టగా, ఇటీవలి ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడం ద్వారా జయలలిత ఆ రికార్డును కూడా చెరిపివేశారు. ఎంజీఆర్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, జయలలిత 8 సార్లు పోటీ చేసి 7సార్లు గెలిచారు. ముహూర్తమంటే మక్కువ జ్యోతిష, సంఖ్యాశాస్త్రాలపై నమ్మకం కలిగిన జయలలిత తాను నివసిస్తున్న పోయెస్‌గార్డెన్‌లోని భవనానికి తన తల్లి పేరు కలిసొచ్చేలా ‘వేద నిలయం’ అని పేరు పెట్టుకున్నారు. అలాగే తన పేరును jayalalithaa (చివరన ‘ఎ’ అక్షరం అదనంగా)గా మార్చుకున్నారు. ఇక మంచి ముహూర్తం లేనిదే జయ కాలు బయటపెట్టరు. దైవభక్తి మెండుగా ఉన్న జయలలిత చెన్నై నగరంలోని కొట్టూరుపురం వినాయకుని ఆలయానికి తరచూ వెళుతుంటారు. అలాగే తన నెలసరి వేతనంతో ఆలయాల్లో నిత్యాన్నదానాలతో పాటు చిన్న గున్న ఏనుగును కూడా బహూకరించేవారు. కోమలవల్లి... జయలలిత కర్నాటకలోని(నాటి మైసూరు రాష్ట్రం) మాండ్య జిల్లా మేల్కోటేలో తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జయరామన్, వేదవల్లి(సంధ్య) దంపతులకు 1948 ఫిబ్రవరి 24న జయలలిత జన్మించారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం బిడ్డలకు రెండు పేర్లు పెట్టాల్సి ఉంది. ఒకటి పూర్వీకుల పేరు, మరొకటి వ్యక్తిగత పేరు. దీంతో అమ్మమ్మ కోమలవల్లి పేరుతో పాటు జయలలిత అని నామకరణం చేశారు. జయలలిత అనే పేరు వెనుక ఒక చిన్న చరిత్ర ఉంది. జయ చిన్నతనంలో ఆమె కుటుంబం మైసూరులో రెండు ఇళ్లలో అద్దెకు ఉంది. అందులో ఒకటి జయ విలాస్, మరొకటి లలిత విలాస్. ఈ రెండు పేర్లను కలిపి జయలలిత అని పెట్టారని చెబుతుంటారు. తండ్రి న్యాయవాద వత్తిని నిర్వహించినా ధనంపై ఆశతో పనిచేయకపోవడంతో స్థితిమంతులు కాలేకపోయారు. జయకు రెండేళ్ల ప్రాయంలోనే తండ్రి చనిపోయాడు. దీంతో తల్లి వేదవల్లి చంటిబిడ్డ జయను చంకన వేసుకుని బెంగళూరులోని తన పుట్టింటికి వచ్చేసింది. వేదవల్లి సోదరి అంబుజవల్లి ఎరుుర్హోస్టెస్గా పనిచేస్తూ డ్రామాలు, సినిమాల్లో నటించేందుకు మద్రాస్‌కు మకాం మార్చింది. దీంతో చిన్నారి జయను వదిలి తల్లి వేదవల్లి కూడా కుటుంబపోషణ నిమిత్తం 1952లో మద్రాస్‌కు వచ్చేశారు. ఆ తర్వాత వేదవల్లి సినిమా నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మారి తన వెండితెర పేరును సంధ్యగా మార్చుకున్నారు. తల్లిని విడిచి ఉండలేని జయలలిత కూడా 1958లో మద్రాసుకు చేరారు. జయ విద్యాభ్యాసం బెంగళూరులోని బిషప్ కాటల్ గర్ల్స్ హైస్కూల్‌తో పాటు మద్రాస్‌లోని చర్చిపార్క్ స్కూల్, స్టెల్లా మేరీస్ కాలేజీలో కొనసాగింది. చదువులో జయ ఎప్పుడూ టాపర్‌గా ఉండేవారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లిషు భాషల్లో అనర్గళంగా మాట్లాడగల దిట్టగా ఎదిగారు. అరుుతే, న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకోవాలనుకున్న జయ.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా సినీపరిశ్రమలో అడుగుపెట్టాల్సి వచ్చింది. అనంతర కాలంలో తమిళ ప్రజలు దేవుడిగా కొలిచే వెండితెర వేల్పు ఎంజీ రామచంద్రన్‌తో ఆమెకు పరిచయ భాగ్యం కలిగింది. ఇష్టాఇష్టాలు జయలలిత పూర్తి శాకాహారి. తన జీవితాన్ని ప్రభావితం చేసిన వారిలో మొదటి వ్యక్తిగా తల్లి సంధ్య పేరును ప్రస్తావించే జయలలిత.. అనంతరం రాజకీయ గురువు ఎంజీఆర్, మదర్ సెలినా(తన స్కూల్ టీచర్)ను కూడా తప్పకుండా గుర్తు చేసుకుంటారు. న్యాయశాస్త్రాన్ని అమితంగా ఇష్టపడే జయలలిత మంచి పుస్తకాలను సేకరించి పోయెస్ గార్డెన్‌లోని తన ఇంట్లో పెద్ద గ్రంథాలయమే ఏర్పాటు చేసుకున్నారు. ఇక జయలలితకు ఇష్టమైన పుస్తకం ‘వైల్డ్ స్వాన్స్’. ఇదిలాఉండగా, జయ ఇంట్లోనే తమిళ, ఇంగ్లిష్ పాత చిత్రాలను కూడా చూసేవారు. రాష్ట్రంలోని ఐదు విశ్వవిద్యాలయాలు ఆమెను డాక్టరేట్‌తో సత్కరించడం విశేషం. ఇక, జయకు ప్రాణ స్నేహితురాలు(నెచ్చెలి) శశికళ అరుుతే బద్ద విరోధి డీఎంకే అధినేత ఎం.కరుణానిధి. ఎంజీఆర్ అడుగుజాడల్లో.. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్)ను రాజకీయ గురువుగా భావించిన జయలలిత ఆయన అడుగుజాడల్లో నడవడం ప్రారంభించారు. 1982లో ఆమెకు ఎంజీఆర్ పార్టీ సభ్యత్వం కల్పించారు. బహిరంగ సభల్లో జయను ‘పెన్నిన్ పెరుమై’(మహిళలకే గర్వకారణం) అంటూ ఎంజీఆర్ పరిచయం చేసేవారు. 1983లో పార్టీ ప్రచార కార్యదర్శిగా ఆమెను నియమించారు. ఈ బాధ్యతలను జయ సమర్థవంతంగా నిర్వర్తించి ఆయన మెప్పు పొందారు. దీంతో 1984లో ఆమెను రాజ్యసభకు ఎంపిక చేశారు. అదే ఏడాది ఎంజీఆర్‌కు గుండెపోటు రావడం, అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు ముంచుకు రావడంతో పార్టీ ప్రచార కార్యదర్శిగా జయ విస్తృతంగా పర్యటించి పార్టీకి మంచి ఫలితాలు రాబట్టారు. కాగా, మూడేళ్ల తర్వాత 1987లో ఎంజీఆర్ మృతి చెందారు. పురట్చితలైవర్ (విప్లవనాయకుడు) అంటూ ఎంజీఆర్‌ను ప్రేమగా పిలుచుకునే ప్రజలు.. ఆయన రాజకీయ భావజాలాన్ని అందిపుచ్చుకున్న జయలలితను పురట్చితలైవి (విప్లవనాయకి)గా పిలవనారంభించారు. అమ్మ.. చిన్నమ్మ సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ జీవితాన్ని ఎంతగా చెప్పుకున్నా.. ఆమె నెచ్చెలి శశికళను ప్రస్తావించకుంటే అది అసంపూర్తే. అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ‘ఈమె శశికళ మాత్రమే కాదు, జయలలిత నీడ’ అనేంతటి ప్రాధాన్యతను కల్పించుకుని టాక్ ఆఫ్ ది కంట్రీగా మారారు. శశికళ జయకు దగ్గరైన వేళ 1983లో జయలలిత అన్నాడీఎంకే ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు వీడియో కవరేజీ ఫొటో స్టూడియోను నడుపుతున్న శశికళను కలెక్టర్ చంద్రలేఖ జయకు పరిచయం చేశారు. వారిద్దరి పరిచయం స్నేహంగా మారింది. ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, ఆయన మరణం తర్వాత జయలలితకు పార్టీలో వ్యతిరేకుల నుంచి ఒత్తిడి ప్రారంభమైంది. ఈ కష్టకాలంలో శశికళ జయకు అండగా నిలిచారు. ఆ తరువాత జయలలిత నివాసమైన పోయెస్‌గార్డెన్‌లోనే శశికళ నివసించడం ప్రారంభించారు. 1991లో తొలిసారిగా జయ ముఖ్యమంత్రి అయ్యారు. పోయెస్‌గార్డెన్‌లో శశికళ బంధువుల పెత్తనం పెరిగింది. శశికళ అన్న కుమారుడు సుధాకరన్ను జయ దత్తు తీసుకున్నారు. 1996లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయ అరెస్టుకాగా, ఆమెతో పాటూ శశికళ కూడా అరెస్టయ్యారు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినా టాన్సీ కుంభకోణం వివాదాల్లో చిక్కుకుని ఉన్నందున జయ సీఎం కాలేక పోయారు. అపుడు పన్నీర్‌సెల్వంను తాత్కాలిక ముఖ్యమంత్రిగా పీఠంపై కూర్చోబెట్టింది శశికళనే. 2011లో జయ మళ్లీ అధికారంలోకి రాగా శశికళ కుటుంబ సభ్యుల అట్టహాసం మళ్లీ వేగం పుంజుకుంది. దీంతో జయలలిత ఆగ్రహం చెంది శశికళను పోయెస్‌గార్డెన్ నుంచి బైటకు పంపివేశారు. అరుుతే రెండోసారి కూడా శశికళ, జయలలితల మధ్య విభేదాలు ఎంతోకాలం నిలబడలేదు. శశికళ మళ్లీ పోయెస్‌గార్డెన్‌కు చేరుకున్నారు. ‘నన్ను చూసుకోవడం శశికళ వల్లనే సాధ్యం, ఆమె లేకుండా నేను ఒంటరిగా ఉండలేను’ అనే ఆప్యాయతను జయ ప్రదర్శించారు. -
ఆ రూపం ఎవరిది?
ఆ భవంతిలో ఇద్దరు పిల్లలు. అమ్మ లేదు. కానీ వాళ్లను ఓ రూపం లాలిస్తోంది. కంటికి రెప్పలా కాపాడుతోంది. ఆ రూపాన్నే అమ్మ అనుకుంటున్నారు. మరి ఆమె ఎవరు.... వాళ్లకి ఆ పిల్లలకి ఏంటి సంబంధం...? అనే అంశాలతో తెరకెక్కిన ఓ తమిళ చిత్రం తెలుగులో రానుంది. జయరాజ్, నితిన్ రాజ్, మిషా ఘోషల్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘శశికళ’గా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగులో ఈ నెల 15న విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘సెంటిమెంటల్ హారర్ చిత్రంగా రూపొందిన మా ‘శశికళ’లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా సోదరుడు జయరాజ్ ఓ ముఖ్య పాత్ర పోషించారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకటేశ్, సంగీతం: నిత్యన్ కార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శివ వై-ప్రసాద్ బి. -
ఎన్నికల బరిలో శశికళ !
అన్నాడీఎంకేలో చర్చలు చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తంజావూరు జిల్లా నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అన్నిపార్టీల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ తరుణంలో అన్నాడీఎంకే సైతం అభ్యర్థుల ఖరారులో పడిపోయింది. అన్నాడీఎంకే నుంచి పోటీకి సుమారు 17,698 మంది దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి జయలలిత తమ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని కోరుతూ 7,936 మంది దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థులను ఖరారుకు కసరత్తు జరుగుతోంది. ఈ దశలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జయకు అత్యంత ప్రీతిపాత్రురాలైన శశికళ తొలిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని అన్నాడీఎంకేలోని సీనియర్ మంత్రులే గుసగుసలాడుతున్నారు. కష్టనష్టాల్లో జయలలితకు తోడై నిలుస్తున్న శశికళ ప్రభుత్వంలో కూడా అండగా నిలవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితతోపాటూ శశికళకు జైలు శిక్ష పడింది. బెయిల్ దక్కింది. పార్టీపై పెత్తనం చేస్తున్నదనే ఆరోపణలతో శశికళను ఇంటి నుంచి పంపివేసిన జయలలిత ఆ తరువాత మళ్లీ చేరదీశారు. కొంతకాలంగా పాత తరహా ఆప్తులుగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేటు కార్యక్రమాలకు జయతోపాటూ శశికళ కూడా హాజరవుతున్నారు. తెరవెనుక అంతరంగీకురాలిగా ఉన్న శశికళ తెరపైకి రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. శశికళ పోటీ చేయడంపై జయ వైఖరి ఏమిటో వెల్లడి కావడం లేదు. తంజావూరు జిల్లా నుంచి పోటీ చేయాలని దాదాపు ఖరారు కాగా, ఏ నియోజకవర్గం తమకు అనుకూలమని శశికళ తన బంధువులతో సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. శశికళ అకస్మాత్తుగా రాజకీయ ప్రవేశం చేయనుండడంపై పార్టీలో రసవత్తర చర్చ సాగుతోంది. ప్రస్తుతం పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆర్థికమంత్రి ఓ పన్నీర్ సెల్వం రెండో నాయకుడిగా కొనసాగుతున్నారు. జయ జైలుకు వెళ్లినపుడల్లా సీఎం పీఠాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీ నేతలు జయను కలుసుకోవడం వీలుకాకుంటే పన్నీర్ సెల్వం వద్దనే అన్నీ మొరపెట్టుకుంటారు. జయలలిత తరువాతి స్థానం పన్నీర్‌సెల్వానికి దక్కడం సహించలేని శశివర్గం ఒత్తిడితోనే పోటీకి దిగుతున్నట్లు ఒక ప్రచారం ఉంది. పన్నీర్ సెల్వం పెత్తనానికి స్వస్తి పలకాలంటే శశికళను ఎమ్మెల్యేగా, ఆ తరువాత మంత్రిగా చేసి నెంబరు టూ స్థానంలో నిలబెట్టాలని వ్యూహం పన్నుతున్నారు. ఈ ఎన్నికలను చేజార్చుకుంటే మరో ఐదేళ్లపాటూ నిరీక్షించాల్సి ఉంటుందని, ఈ జాప్యం క్షేమం కాదని భావిస్తున్నారు. ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీచేయాలన్న శశికళ నిర్ణయం పార్టీలో కలకలం రేపుతోంది. -
తండ్రిని కడతేర్చిన నర్సు
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధాన్ని ఖండించినందుకు ఆగ్రహం చెందిన నర్సు ప్రియుడితో కలసి తండ్రిని కడతేర్చింది. ఈ సంఘటన సేలం సమీపంలో చోటుచేసుకుంది. సేలం సమీపం వీరాణం, సుక్కంపట్టికి చెందిన తొప్ప గౌండర్ (67). అక్కడున్న పాఠశాలలో సెక్యూరిటీగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. ఇతని భార్య ధనం. వీరికి శశికళ (37) అనే కుమార్తె, సదాశివం అనే కుమారుడు ఉన్నాడు. శశికళ సేలం ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్నది. ఈమె భర్త భగత్‌సింగ్ పల్లడం ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉన్నాడు. వీరికి జనని (8) అనే కుమార్తె ఉంది. శశికళ తండ్రి వద్దనే ఉంటున్నది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నలుగురి వ్యక్తులు తొప్ప గౌండర్ ఇంటికి వచ్చి అతనిపై కత్తితో దాడి చేసి హత్య చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న వీరాణం ఇన్స్పెక్టర్ శరవణన్, పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలన చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో శశికళకు, సేలం ఆసుపత్రిలో పని చేస్తున్న రాజా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడిందని ఈ సంగతి తెలుసుకున్న తోపు గౌండర్ కుమార్తెను మందలించాడు. దీంతో ఆగ్రహం చెందిన శశికళ తన ప్రియుడితో కలసి తండ్రిని కడతేర్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో నర్సు శశికళ సహా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. -
ప్రియుడి సహా పట్టుబడ్డ నూతన వధువు
హొసూరు : గత నెల 28న 20 పౌన్ల నగలు, రూ. 5 వేలు నగదుతో అదృశ్యమైన నూతన వధువును సూళగిరి పోలీసులు ప్రియునితో సహా పట్టుకున్నారు. వివరాల మేరకు సూళగిరి సమీపంలోని మాదరసనపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్(23)కు బేరికె సమీపంలోని గురునైపల్లి గ్రామానికి చెందిన శశికళ(19)తో ఫిబ్రవరి 23న పెళ్లి జరిగింది. ఈ తరుణంలో మార్చి 28వ తేదీ శశికళ 20 పౌన్ల నగలు, రూ. 5వేలు అదృశ్యమైయ్యింది. ఈ ఘట నపై భర్త చంద్రశేఖర్ సూళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ తరుణంలో శశికళ గురునైపల్లి గ్రామానికి చెందిన క్రిష్ణమూర్తి (25) ఇంట్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు గురునైపల్లి గ్రామానికి చేరుకొని క్రిష్ణమూర్తి ఇంట్లో ఉన్న శశికళను అదుపులోకి తీసుకొన్నారు. విచారణలో శశికళ 10వ తరగతి చదువుతున్న సమయంలో క్రిష్ణమూర్తితో పరిచయం ఏర్పడి ప్రేమించుకొన్నారు. ఈ విషయంపై శశికళ తన తల్లితండ్రులకు తెలిపింది. వారు ఈ పెళ్లికి నిరాకరించి మాదరసనపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌తో పెళ్లి జరిపించారని, తర్వాత ఫోన్‌ద్వారా క్రిష్ణమూర్తితో మాట్లాడిన శశికళ తనను భర్త ఇంటి నుంచి తీసుకెళ్లమని మొరపెట్టుకోవడంతో మాదరసనపల్లిలోని వినాయక దేవాల యానికి రమ్మని క్రిష్ణమూర్తి.. శశికళను తీసుకెళ్లినట్లు పోలీ సుల విచారణలో తేలింది. పోలీసులు ఇరువురిని అరెస్టు చేసి హొసూరు కోర్టులో హాజరుపరచనున్నారు. -
తమాషా పదాలు... తీరైన సంభాషణలు
తమాషా పేర్లు, కోర్ట్ సీన్స్‌తో మొదలైన ఇది మల్లాది సీరియల్ అనే నమ్మకం మొదట్లో కుదరలేదు. మెక్‌డోనాల్డ్స్‌లో కోక్ ఎన్నిసార్ల్లైనా నింపుకోవడం లాంటివి మనలో చాలామంది గమనించి ఉండరు. సినిమాటిక్‌గా ఒక్కో హీరో ఒక్కో కథతో ఎంట్రీ, వీరందర్నీ పాత స్నేహితులుగా అతికించినట్లు కనిపించింది. కాలేజ్ ఫంక్షన్‌లోని జోక్స్ ఫేస్‌బుక్‌తో పరిచయం లేని పాఠకులకి ఉపయోగం. గోలచందర్ కథ, దుర్యోధన్‌ని త్రీమంకీస్ బెదిరించడం, వాటర్ క్యూబ్స్‌ని వాటర్ విత్ కార్నర్స్గా చెప్పడం లాంటి తమాషా పదాలు సీజనాత్మకం. పట్టయ్య అంత్యాక్షరి ద్వారా చెప్పిన పాత సినిమా పాటలు నాకు హాయిగా అనిపించాయి. పోలీసులకి, దొంగలకి మధ్య వానర్ మధ్యవర్తిత్వం హాస్యంగా సాగింది. వాళ్ళు అన్ని కోట్లు సులువుగా కొట్టేసినా ‘ఈజీ మనీ నాట్ క్రేజీ’ అని చెప్పడం కరెక్ట్. ఎందుకంటే ముందుగానే ‘డబ్బు తాబేలులా వస్తుంది. కుందేలులా పోతుంది’ అని చెప్పారు కదా! బియాండ్ లిమిట్స్‌కి వెళ్ళకుండా, పరుగులు పెట్టకుండా కథని నడపడం మల్లాది ప్రత్యేకత. ఒకే ఒక్క ఫోన్‌కాల్‌తో సీరియల్‌ని ముగింపుకి తెచ్చేశారు. దీన్లోని పాత్రలన్నీ ఒక ఎత్తు. వేమన పాత్ర ఒక ఎత్తు. ఇలాంటి సీరియల్లో అలాంటి పాత్ర ద్వారా వేదాంత సారాన్ని చేర్చడం అభినందనీయం. ‘నీకో సమస్య ఉందని దేవుడికి చెప్పకు. సమస్యకి నీకో దేవుడున్నాడని చెప్పు’ లాంటి ఎక్స్లెంట్ డైలాగ్స్ చాలా రాశారు. - వి శశికళ, నాయుడుపేట (నెల్లూరు జిల్లా) త్రీమంకీస్ సీరియల్‌పై పాఠకుల అభిప్రాయాలు మా ప్రకటనకు స్పందనగా త్రీ మంకీస్ సీరియల్ మీద చాలామంది పాఠకులు తమ విలువైన అభిప్రాయాలను పంపించారు. వాటిలో ఉత్తమమైనవిగా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ఎంపిక చేసిన మూడిటిని రోజుకొకటి చొప్పున ప్రచురిస్తున్నాం. నిన్న మొదటి అభిప్రాయం ప్రచురించాం. ఇవాళ్టిది రెండోది. ఇలా ఎంపిక చేసిన ముగ్గురికి ముందుగా ప్రకటించినట్లు ఒక్కొక్కరికి రూ. 500/- నగదు బహుమతి రచయిత పంపుతారు. వీటిని పుస్తక రూపంలో వచ్చే నవలలో కూడా ప్రచురిస్తారు. -
జయ, శశికళకు నోటీసులు
ఆదాయపు పన్ను దాఖలు కేసు విచారణ వేగం పుంజుకుంది. కోర్టుకు హాజరు కావాల్సిందేనని సీఎం జయలలిత, ఆమె నెచ్చె లి శశికళలకు ఎగ్మూర్ ఆర్థిక నేరాల కోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ నెల 9న తప్పని సరిగా కోర్టుకు రావాల్సిందేనని నోటీసు జారీ చేసింది. సాక్షి, చెన్నై : రాష్ర్ట ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, ఆమె నెచ్చిలి శశికళతో పాటుగా బంధువులపై పలు కేసులు ఉన్న విషయం తెలిసిందే. ఏళ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలతో ఈ కేసుల విచారణలు సాగుతూ వస్తున్నాయి. ఇందులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, ఆదాయ పన్ను ఎగవేత కేసు ప్రధానమైనవి. ఒకటి బెంగళూరులోను, మరొకటి చెన్నై ఎగ్మూర్ కోర్టులోను 18 సంవత్సరాలుగా సాగుతున్నాయి. ఇది ఐటీ కేసు : జయలలిత, శశికళ భాగస్వామ్యం తో నడుపుతున్న శశి ఎంటర్ ప్రెజైస్కు సంబంధించి 1991-92,1992-93 సంవత్సరానికి గాను ఆదాయ పన్ను రిటర్న్స్‌దాఖలు చేయలేదు. అలాగే, 1993-94కు గాను జయలలిత, శశికళ వ్యక్తిగతంగా తమ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేదు. దీన్ని డీఎంకే సర్కారు గుర్తించింది. ఆ ఇద్దరిపై కొరడా ఝుళిపించే పనిలో పడింది. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేదంటూ ఆ ఇద్దరిపై అభియోగం మోపుతూ కేసు నమోదు చేశారు.ఏళ్ల తరబడి విచారణ : ఆదాయపు పన్ను ఎగవేత వ్యవహారం చెన్నై ఎగ్మూర్ ప్రధాన మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో ఆర్థిక నేరాల విచారణ కోర్టులో సాగుతోంది. ఏళ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలతో విచారణ సాగుతోంది. కొన్నేళ్లు విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈ కేసు నుంచి తమకు విముక్తి కలిగించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన జయలలిత, శశికళలకు చుక్కెదురైంది. సుప్రీం కోర్టుకు వెళ్తే ఎదురు దెబ్బ తగిలింది. నాలుగు నెలల్లో విచారణను ముగించాలంటూ ఎగ్మూర్ కోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో విచారణ వేగం పెరిగింది. నెలన్నర రోజుల క్రితం కోర్టుకు రావాలం టూ జయలలిత, శశికళను న్యాయమూర్తి దక్షిణామూర్తి ఆదేశించారు. అయితే, ఎన్నికల కాలం కావడంతో విచారణ నుంచి తప్పించుకున్నారు. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపించి విచారణను వాయిదా వేయించుకున్నా, కోర్టు కనుసన్నల్లో నుంచి తప్పించుకునే అవకాశాలు మాత్రం వారికి దక్కేలా లేదు. ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయి. కోడ్ లేదు. ఇక కోర్టుకు రావాల్సిందేనంటూ కోర్టు ఆదేశించింది. మంగళవారం ఈ కేసు విచారణకు రాగా, మళ్లీ వాయిదాకు ఇద్దరి తరపు న్యాయవాదులు యత్నించారు. జూలైకు విచారణను వాయిదా వేయాలంటూ వారు చేసుకున్న విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసి పుచ్చారు. ఆదాయపు పన్ను శాఖ తరపున హాజరైన న్యాయవాది రామస్వామి తనవాదన విన్పించారు. సమయం కావాలంటూ పదే పదే విచారణ వాయిదా వేసుకుంటూ వెళుతున్నారని, సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు సమీపిస్తున్నదని గుర్తు చేశారు. వాయిదా వేయాల్సిందేనని పట్టుబట్టిన జయలలిత, శశికళ తరపు న్యాయవాదులకు చివరకు చుక్కెదురయ్యింది. న్యాయమూర్తి దక్షిణామూర్తి స్పందిస్తూ, ఇప్పటికే సమయం ఇచ్చామని పేర్కొంటూ, ఆ ఇద్దరూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు ఇచ్చారు. ఈనెల 9 తేదీన జయలలిత, శశికళ తప్పని సరిగా విచారణ నిమిత్తం కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. -
మైనర్‌కు పెళ్లి
సదాశివనగర్, న్యూస్‌లైన్: సదాశివనగర్ మండల కేంద్రంలో శుక్రవారం బాల్య వివాహం జరిగింది. మండల కేంద్రానికి చెందిన మర్కంటి రణిత(16)ను దోమకొండ మండలం మల్కాపూర్‌కు చెందిన రాజుకు ఇచ్చి శుక్రవారం పెళ్లి చేశారు. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి అధికారులు వస్తున్నారని తెలుసుకున్న ఇరు కు టుంబాల వారు అధికారులు వచ్చేలోపు వివాహం జరిపించారు. దీంతో అధికారు లు బాల్య వివాహాన్ని అడ్డుకోలేక పోయారు. అయితే 18 ఏళ్లు నిండిన తర్వాతనే రణితను అత్తారింటికి పంపించాలని ఆమె తల్లిదండ్రుల చేత అధికారులు రాతపూర్వకంగా రాయించుకున్నారు. అంతేకాకుండా రణిత తల్లిదండ్రులు బీరయ్య, తల్లి మల్లవ్వ, రాజు తల్లిదండ్రులు నర్సింహులు, మల్లవ్వకు కౌన్సెలింగ్ నిర్వహిం చా రు. వివాహ వయస్సు రాకముందు పెళ్లిలు చేస్తే తలెత్తే అనారోగ్య సమస్యలు, బా ల్య వివాహాలు చేస్తే చట్ట ప్రకారం తీసుకునే చర్యల గురించి వివరించారు. కార్యక్రంలో ఐసీడీఎస్ సీడీపీవో శశికళ, తహశీల్దార్ శరత్‌కుమార్, ఎస్సై నవీన్‌కుమార్, ఆర్ఐ కిష్టయ్య, వీఆర్వో శంకర్రాజు, అంగన్వాడీ కార్యకర్త గంగమణి పాల్గొన్నారు.